darshana tickets
-
టీటీడీ భక్తులకు గుడ్ న్యూస్
-
ఆలయం ఏదైనా మీ ఇంట్లోనే టికెట్
సాక్షి, అమరావతి:ఏడాదిన్నర క్రితం దేవదాయ శాఖ పరిధిలోని 8 ప్రధాన ఆలయాల్లో ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన ఆన్లైన్ సేవలు సూపర్ సక్సెస్ అయ్యాయి. 8 ఆలయాల్లో ఏడాదిన్నర కాలంలో 10 లక్షల మందికి పైగా భక్తులు ఆన్లైన్ సేవల్ని వినియోగించుకున్నారు. భక్తుల రద్దీ బాగా ఎక్కువగా ఉండే రోజుల్లో సైతం భక్తులు 30 నుంచి 90 రోజుల ముందుగానే దర్శన టిక్కెట్లు, పూజలు, ఇతర సేవ టికెట్లతో పాటు ఆలయాల్లో అద్దె గదుల కోసం ఆన్లైన్లో నమోదు చేసుకున్నారు. తద్వారా దైవ దర్శనాలకు వెళ్లిన రోజు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా ఇష్టదైవాలను కొలిచారు. రాష్ట్ర ప్రభుత్వం 2021 మార్చి 3న మొదటిసారి శ్రీశైలం ఆలయంలో ఆన్లైన్ సేవలను ప్రాథమికంగా ప్రారంభించారు. ఆ తర్వాత 2022 జూలై 21వ తేదీ నుంచి ప్రధాన ఆలయాలైన సింహాచలం, అన్నవరం, ద్వారకా తిరుమల, విజయవాడ దుర్గగుడి, పెనుగంచిప్రోలు, కాణిపాకం, శ్రీకాళహస్తి ఆలయాల్లో అన్ని రకాల సేవలను పూర్తిస్థాయి ఆన్లైన్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. దశలవారీగా పెద్ద ఆలయాలన్నింటిలోనూ ఈ రకమైన ఆన్లైన్ సేవలను విస్తరించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. కాగా, ఈ సేవలు ప్రారంభించిన 2022 జూలై 21 నుంచి ఈ ఏడాది డిసెంబర్ 23 తేదీ వరకు 10,20,943 మంది భక్తులు వినియోగించుకున్నట్టు దేవదాయ శాఖ అధికారులు వెల్లడించారు. కొన్ని ఆలయాలు కొన్ని రకాల సేవలను గరిష్టంగా 30 రోజుల ముందుగా మాత్రమే ఆన్లైన్ అందుబాటులో ఉంచుతుండగా.. ఆలయాలు, అక్కడి సేవల ఆధారంగా గరిష్టంగా 90 రోజుల ముందుగా కూడా ఈ సేవలు పొందే వీలు కల్పించినట్టు దేవదాయ శాఖ అధికారులు తెలిపారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు ఆలయాలకు వెళ్లే భక్తులు భక్తి పారవశ్యంతో దైవ దర్శనం పూర్తి చేసుకునేలా ప్రభుత్వపరంగా అన్ని చర్యలు చేపడుతున్నాం. ఆలయాల పైరవీలు, అక్రమాలకు తావు లేకుండా సేవ, దర్శన టికెట్లు ముందుగా కూడా భక్తులు ఆన్లైన్ ద్వారా పొందేలా ఏర్పాటు చేశాం. ఆలయాల్లో మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి ప్రభుత్వ ఖజానా నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి దుర్గ గుడికి నిధులు కేటాయించారు. కామన్ గుడ్ ఫండ్ (సీజీఎఫ్) నిధులను పూర్తిస్థాయిలో వినియోగించి పురాతన ఆలయాల పునఃనిర్మాణంతో పాటు కొత్త ఆలయాల నిర్మాణానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. – కొట్టు సత్యనారాయణ, ఉప ముఖ్యమంత్రి (దేవదాయ శాఖ) అత్యంత సులభ విధానంలో బుకింగ్ ఆలయాల్లో పూజలు, సేవలు, దర్శన టికెట్లు భక్తులు సులభంగా ముందస్తుగానే బుక్ చేసుకోవడానికి వీలుగా దేవదాయ శాఖ ఆధ్వర్యంలో ఆన్లైన్ వెబ్‌సైట్‌ను ప్రభుత్వం పూర్తిగా ఆధునికీకరించింది. ఏ ఆలయానికి ఆ ఆలయం కాకుండా అన్ని ఆలయాలకు సంబం«ధించి ఈ రకమైన సేవలను ఒకేచోట నుంచి భక్తులు పొందేలా వెబ్‌సైట్‌ను రూపొందించారు. భక్తులు తమ ఫోన్ నంబర్ ఉపయోగించి ఈ సేవలు పొందేలా చర్యలు తీసుకున్నారు. -
ఆన్లైన్లో సెప్టెంబర్ నెల ఎస్ఈడీ టికెట్ల కోటా
తిరుమల: శ్రీవారి దర్శనానికి సంబంధించి సెప్టెంబర్ నెలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం(ఎస్ఈడీ) టికెట్లను టీటీడీ గురువారం ఉదయం 9 గంటలకు ఆన్లైన్లో విడుదల చేసింది. సెప్టెంబర్ నెలలో 20, 26, 27, 28, 29, 30 తేదీలు మినహా మిలిగిన రోజుల్లో భక్తులు ఎస్ఈడీ టికెట్లను బుక్ చేసుకునే సదుపాయం కల్పించింది. గురువారం సాయంత్రానికి సెప్టెంబర్ మాసంలో శనివారాలు మినహా మిగిలిన రోజుల్లో ఎస్ఈడీ దర్శన టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ఇదిలా ఉండగా, సెప్టెంబర్ నెలకు సంబంధించి తిరుమలలో వసతి కోటాను శుక్రవారం ఉదయం 9 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. అదేవిధంగా శుక్రవారం ఉదయం 11 గంటలకు జూలై 12, 15, 17 తేదీల్లో వర్చువల్ ఆర్జిత సేవా టికెట్లు పొందిన భక్తులకు ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను కూడా ఆన్లైన్లో విడుదల చేయనుంది. కాగా, ఈ నెల 12న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనంను టీటీడీ అత్యంత వైభవంగా నిర్వహించనుంది. శ్రీవారి దర్శనానికి 15 గంటలు తిరుమలలో గురువారమూ భక్తుల రద్దీ కొనసాగింది. బుధవారం అర్ధరాత్రి వరకు 76,418 మంది స్వామి వారిని దర్శించుకోగా.. 38,629 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీలో కానుకల రూపంలో భక్తులు రూ.4.73 కోట్లు వేశారు. దర్శనానికి 15 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ పూర్తిగా నిండిపోయాయి. క్యూలైను లేపాక్షి సర్కిల్ వద్దకు చేరుకుంది. కాగా, శనివారం ఉదయం 10 నుంచి 11 గంటల వరకు తిరుమల అన్నమయ్య భవనంలో డయల్ యువర్ ఈవో కార్యక్రమాన్ని టీటీడీ నిర్వహిస్తోంది. భక్తులు తమ సందేహాలను, సూచనలను 0877–2263261 నంబర్‌కు ఫోన్ చేసి టీటీడీ కార్యనిర్వహణాధికారి ఏవీ ధర్మారెడ్డికి తెలుపవచ్చు. -
మార్చిలో 14 లక్షల దర్శన టికెట్లు
తిరుమల/తిరుపతి ఎడ్యుకేషన్: కోవిడ్ పరిస్థితుల నుంచి ఉపశమనం లభిస్తున్న నేపథ్యంలో తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దాదాపు రెండేళ్లుగా ఆంక్షల నడుమ దర్శనాల సంఖ్య భారీగా తగ్గిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఎక్కువమంది ప్రజలకు టీకాలు వేయడం, వైరస్ తగ్గుముఖం పట్టడంతో టీటీడీ మరింతమంది భక్తులకు దర్శనం కల్పించేందుకు సన్నాహాలు చేస్తోంది. మార్చి నెలలో దాదాపు 14 లక్షల మంది భక్తులకు సర్వదర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం (ఎస్ఈడీ) కల్పించేందుకు టికెట్లు జారీచేయనుంది. మార్చిలో రోజుకు 25 వేల వంతున రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను నేడు (బుధవారం) ఆన్లైన్లో విడుదల చేయనుంది. అలాగే మార్చిలో రోజుకు 20 వేల చొప్పున సర్వదర్శనం టోకెన్లను తిరుపతిలోని కౌంటర్ల ద్వారా ఆఫ్‌లైన్ పద్ధతిలో కేటాయించనుంది. రేపటి నుంచి ఈనెల 28 వరకు అదనపు కోటా ఈనెల 24 (గురువారం) నుంచి 28వ తేదీ వరకు అదనంగా రోజుకు 13 వేల చొప్పున రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను టీటీడీ బుధవారం ఆన్లైన్లో ఉంచనుంది. ఈనెల 26 నుంచి 28వ తేదీ వరకు అదనంగా రోజుకు ఐదువేల చొప్పున సర్వదర్శనం టోకెన్లను తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం కాంప్లెక్స్, గోవిందరాజస్వామి సత్రాల్లోని కౌంటర్ల వద్ద ఇవ్వనుంది. మార్చి 10న విదేశీ నాణేల ఈ–వేలం తిరుమల శ్రీవారికి భక్తులు కానుకగా సమర్పించిన యూఎస్ఏ, మలేసియా దేశాలకు చెందిన నాణేలను మార్చి 10వ తేదీన ఈ–వేలం వేయనున్నట్లు టీటీడీ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఇందులో భాగంగా మలేసియా నాణేలను ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు, యూఎస్ఏ నాణేలను మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ–వేలం వేయనున్నట్లు పేర్కొంది. మరిన్ని వివరాలకు మార్కెటింగ్ విభాగం జనరల్ మేనేజర్ (వేలం) కార్యాలయాన్ని 0877–2264429 నంబరులో సంప్రదించాలని, రాష్ట్ర ప్రభుత్వ పోర్టల్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.కేఓఎన్యూజీఓఎల్యూ.ఏపీ.జీఓవీ.ఇన్ / డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.టీఐఆర్యూఎంఏఎల్ఏ.ఓఆర్జీ వెబ్సైట్లలో చూడాలని కోరింది. -
శ్రీవారి దర్శన టికెట్ల పేరుతో మోసాలు
తిరుమల: తిరుమల శ్రీవారి దర్శనం టికెట్లంటూ నకిలీ టికెట్లను ఎక్కువ రేట్లకు అమ్ముతున్న రెండు ముఠాలకు చెందిన ఏడుగురిని పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. నిందితుల్లో ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ కూడా ఉన్నారు. ఒక కేసులో వైకుంఠం–1లో విధులు నిర్వర్తిస్తున్న ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ ఎం.కృష్ణారావు, తిరుమల లడ్డూ కౌంటర్లో పనిచేస్తున్న అరుణ్‌రాజు, తిరుపతిలో ట్రావెల్ ఏజెన్సీలో పనిచేస్తున్న బాలాజీ, తిరుమల ప్రత్యేక ప్రవేశదర్శనం కౌంటర్లో పనిచేస్తున్న ఆపరేటర్ నరేంద్రలను, మరో కేసులో తిరుపతికి చెందిన దళారి చెంగారెడ్డి, గతంలో త్రిలోక్ ఏజెన్సీ కౌంటర్ బాయ్‌గా పనిచేసిన దేవేంద్రప్రసాద్, వెంకట్‌లను అరెస్టు చేసినట్లు తిరుమల వన్ టౌన్, టూటౌన్ సీఐలు జగన్మోహన్రెడ్డి, చంద్రశేఖర్ చెప్పారు. వారు తెలిపిన మేరకు.. ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ ముఠా సభ్యులు ఆదివారం మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన జితేంద్రకుమార్ సోనీ, అతడి స్నేహితులకు రూ.300 టికెట్లు నకిలీవి మూడింటిని రూ.21 వేలకు అమ్మి దర్శనానికి పంపించారు. కౌంటర్లో ఆపరేటర్ నరేంద్ర టికెట్లను స్కాన్ చేయకుండా పంపడాన్ని గమనించిన టీటీడీ విజిలెన్స్ ఉద్యోగులు అతడిని పట్టుకుని విచారించి తిరుమల వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నూతన సంవత్సరం సందర్భంగా కర్నూలు జిల్లా పెద్దాపురానికి చెందిన మధుసూదన్‌రావు కుటుంబంతో సహా శ్రీవారి దర్శనానికి వచ్చాడు. దళారి చెంగారెడ్డి ముఠా సభ్యులు రూ.300 టికెట్లు నకిలీవి ఒక్కొక్కటి రూ.3,300కు వారికి అమ్మి శ్రీవారి దర్శనానికి పంపారు. దర్శనం కౌంటర్ వద్ద నకిలీ టికెట్లను గుర్తించిన టీటీడీ విజిలెన్స్ అధికారులు భక్తుల నుంచి సమాచారం సేకరించి తిరుమల టూ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ రెండు కేసుల్లో నిందితులను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా టీటీడీ సీవీఎస్వో గోపీనాథ్ జెట్టి.. భక్తులు టీటీడీ అధికారిక వెబ్‌సైట్స్ నుంచి మాత్రమే టికెట్లను బుక్ చేసుకోవాలని సూచించారు. నకిలీ టికెట్లు విక్రయించే దళారుల గురించి తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. -
తిరుమల సర్వదర్శనం టికెట్లు ఖాళీ
-
హాట్ కేకుల్లా సర్వదర్శనం టికెట్లు.. 35 నిమిషాల్లో 2.79 లక్షల టికెట్లు
సాక్షి, తిరుమల: టీటీడీ ఉచిత సర్వదర్శనం టోకెన్లను ఆన్లైన్లో శనివారం విడుదల చేసిన సంగతి తెలిసింఏద. కేవలం 35 నిమిషాల్లో 35 రోజుల టికెట్లు బుక్ అయ్యాయి. రికార్డు స్థాయిలో 35 నిమిషాల్లో 2.79 లక్షల టికెట్లను బుక్ చేసుకున్నారు. ఈనెల 26 నుంచి (ఆదివారం) అక్టోబర్ నెల 31 వరకు సర్వదర్శనం టోకెన్లను అందుబాటులో ఉంచింది. రోజుకు 8 వేల టికెట్ల చొప్పున విడుదల చేసింది. వర్చువల్ క్యూ పద్దతి ద్వారా ముందుగా లాగిన్ అయిన వారికి అవకాశం కల్పించారు. వర్చువల్ క్యూ పద్దతి పాటించడంతో సర్వర్లు క్రాష్ అయ్యే ప్రమాదం తప్పి.. ఎలాంటి ఇబ్బందులు లేకుండా భక్తులు టికెట్లు బుక్ చేసుకున్నారు. (చదవండి: TTD: శ్రీవారి దర్శనానికి టీకా సర్టిఫికెట్ తప్పనిసరి) కాగా, ఆన్లైన్ టికెట్ల విడుదలతో ఆఫ్‌లైన్‌లో టోకెన్ల జారీని నిలివేయనున్నారు. టికెట్లు పొందిన భక్తులు రెండు డోసుల వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ లేదా 72 గంటల ముందు కరోనా పరీక్ష చేయించుకుని, నెగిటివ్ సర్టిఫికెట్తో తిరుమలకు రావాలని అధికారులు స్పష్టం చేశారు. చదవండి: సేవాతత్పరతను రాజకీయం చేయడం బాధాకరం: వైవీ సుబ్బారెడ్డి -
సేవాతత్పరతను రాజకీయం చేయడం బాధాకరం: వైవీ సుబ్బారెడ్డి
తిరుమల: టీటీడీ జారీ చేసిన అక్టోబర్ నెల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను జియో సంస్థ సబ్ డొమైన్లో విడుదల చేయడంపై సామాజిక మాధ్యమాల్లో సాగిన దుష్ప్రచారం పట్ల టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి శుక్రవారం ఆవేదన వ్యక్తం చేశారు. జియో సంస్థ సేవా భావంతో ముందుకొచ్చిందని, ఈ అంశాన్ని కూడా రాజకీయం చేయడం బాధాకరమన్నారు. జియో క్లౌడ్ పరిజ్ఞానం ద్వారా గంటన్నర వ్యవధిలోనే 2.39 లక్షల టికెట్లను భక్తులు బుక్ చేసుకునేందుకు వీలు కల్పించామని చెప్పారు. ఈ మేరకు శుక్రవారం ఆయన మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. దర్శన టికెట్ల బుకింగ్‌లో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలను అధిగమించేందుకు జియో సంస్థ దాదాపు రూ.3 కోట్లు విలువైన సాంకేతిక సహకారం, మౌలిక సదుపాయాలను ఉచితంగా అందించేందుకు ముందుకొచ్చిందని తెలిపారు. అయితే కొన్ని చానళ్లు, సామాజిక మాధ్యమాల్లో కొందరు పనిగట్టుకుని టీటీడీపై నిరాధారమైన ఆరోపణలు చేస్తూ భక్తులను గందరగోళానికి గురి చేస్తున్నారని చెప్పారు. వచ్చే నెలలో పూర్తిగా టీటీడీ డొమైన్‌లోనే దర్శన టికెట్లు విడుదల చేస్తామని స్పష్టం చేశారు. దుష్ప్రచారంపై చట్టపరమైన చర్యలు టీటీడీ విడుదల చేసిన అక్టోబర్ నెల కోటా ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల బుకింగ్‌కు సంబంధించి దుష్ప్రచారం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి చెప్పారు. టికెట్ల కోసం భక్తుల నుంచి విశేష స్పందన లభించిందని చెప్పారు. శుక్రవారం ఆయన తిరుమల అన్నమయ్య భవనంలో విలేకరులతో మాట్లాడారు. -
TTD: శ్రీవారి దర్శనానికి టీకా సర్టిఫికెట్ తప్పనిసరి
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సంబంధించిన టికెట్లను టీటీడీ శుక్రవారం ఆన్లైన్లో ఉంచనుంది. అక్టోబర్ నెలకి సంబంధించి రోజుకి 8 వేల టికెట్లు విడుదల చేయనుంది. ఉదయం 9 గంటల నుంచి టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి. (చదవండి: శ్రీవారి దర్శనం టికెట్ల పేరుతో భక్తులకు టోకరా) అలానే సర్వదర్శనం టికెట్లను రేపటి నుంచి ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది.. ఇక శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని టీటీడీ సూచించింది. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు కోవిడ్ వ్యాక్సిన్ సర్టిఫికేట్ లేదా కరోనా నెగిటివ్ సర్టిఫికేట్ తప్పనిసరిగా తీసుకురావాలని పేర్కొంది. చదవండి: TTD: శ్రీవారి బ్రహ్మోత్సవాలపై టీటీడీ క్లారిటీ -
శ్రీవారి దర్శనం టికెట్ల పేరుతో భక్తులకు టోకరా
తిరుమల: తిరుమల శ్రీవారి దర్శనం టికెట్లు ఇప్పిస్తామని భక్తులను మోసగించిన నిందితుడిని తిరుమల టూటౌన్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. టూటౌన్ పోలీస్‌స్టేషన్ సీఐ చంద్రశేఖర్, ఎస్ఐ రమేష్‌ల కథనం మేరకు.. భువనగిరికి చెందిన వెంకటేష్ శ్రీవారి దర్శనం చేసుకోవాలని తిరుపతికి చెందిన నాగరాజు అనే దళారిని ఆశ్రయించాడు. తమ కుటుంబంలోని 11 మంది సభ్యులకు రూ.300 దర్శనం టికెట్లు ఇప్పించాలని కోరగా అందుకు నాగరాజు రూ.16,500 అవుతుందని తెలిపి ఒప్పందం కుదుర్చుకున్నాడు. వెంకటేష్ మొదటి విడతగా ఫోన్‌పే ద్వారా రూ.8 వేలను నాగరాజుకు పంపాడు. అనంతరం తిరుపతికి చేరుకున్న వెంకటేష్‌కు టీటీడీ చైర్మన్ కార్యాలయం పేరుతో గతంలో వచ్చిన మెసేజ్‌ను ఎడిట్ చేసి నకిలీ మెసేజ్‌ను పంపాడు నాగరాజు. సదరు మెసేజ్‌తో తిరుమలకు చేరుకున్న వెంకటేష్ చైర్మన్ కార్యాలయాల్లో సంప్రదించగా ఆ మేసేజ్ నకిలీదిగా తేలింది. దీంతో భక్తులు తాము మోసపోయామని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయగా నాగరాజును అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు నిందితుల కోసం గాలింపు చేపట్టారు. భక్తులు దళారులను నమ్మి మోసపోవద్దని, ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకుని రావాలని పోలీసులు సూచించారు. -
కోవిడ్ వల్లే పరిమితంగా దర్శన టికెట్లు
తిరుమల: ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనాను డీనోటిఫై చేసే వరకు అందరూ జాగ్రత్తగా ఉండాలని, ఆ మహమ్మారి వల్లే తిరుమల శ్రీవారి దర్శనానికి పరిమిత సంఖ్యలో టికెట్లు జారీచేస్తున్నామని టీటీడీ ఈఓ డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి చెప్పారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం సమావేశ మందిరంలో శనివారం నిర్వహించిన డయల్ యువర్ ఈఓ కార్యక్రమంలోను, ఆ తర్వాత మీడియా సమావేశంలోను ఈఓ మాట్లాడారు. కరోనా మూడో దశ హెచ్చరికల నేపథ్యంలో.. తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేస్తున్న యాత్రికులు కోవిడ్ నిబంధనలు విధిగా పాటించాలన్నారు. భక్తుల విజ్ఞప్తి మేరకు ఆగస్టు నెల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను ఐదు వేల నుంచి 8 వేలకు పెంచినట్లు ఈఓ వెల్లడించారు. గదులు పొందే యాత్రికులు బసకు సంబంధించిన ఫిర్యాదులను 9989078111 నెంబర్లో ఇవ్వాలని జవహర్‌రెడ్డి తెలిపారు. అంజనాద్రే హనుమంతుని జన్మస్థలమని.. దీనిపై త్వరలోనే సమగ్ర గ్రంథం ముద్రిస్తామన్నారు. అలాగే, తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయ విమాన గోపురానికి వంద కిలోల బంగారంతో తాపడం పనులను వచ్చే సెప్టెంబరు 14న ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. 13న గరుడ వాహనంపై శ్రీ మలయప్పస్వామి ఆగస్టు 13వ తేదీ గరుడ పంచమి, ఆగస్టు 22వ తేదీ శ్రావణ పౌర్ణమి పర్వదినాల సందర్భంగా శ్రీమలయప్పస్వామివారు గరుడ వాహనంపై దర్శనమిస్తారని ఈఓ తెలిపారు. అలాగే, ఆగస్టు 18 నుంచి 20 వరకు శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు జరుగనున్నాయని, ఇందుకోసం ఆగస్టు 17న ఆంకురార్పణ నిర్వహిస్తామన్నారు. -
మీ సేవ ద్వారా పుష్కర దర్శనం టికెట్లు
భద్రాచలం చిత్రకూటమండపంలో సువర్ణ పుష్ప పూజలు భద్రాచలం: గోదావరి పుష్కరాల సమయంలో భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ వేళల్లో మార్పు చేస్తున్నట్లు ఈవో కూరాకుల జ్యోతి తెలిపారు. శుక్రవారం తన చాంబర్లో వైదిక కమిటీ, అర్చకులు, దేవస్థానం సిబ్బంది సమావేశమై దీనిపై చర్చించారు. గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా ప్రత్యేకంగా క్యూలైన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పుష్కర భక్తులకు ఆర్జిత సేవలు కల్పించాలనే లక్ష్యంతో సువర్ణ పుష్ప పూజలను గర్భగుడిలో కాకుండా ఆలయ ప్రాంగణంలోని చిత్రకూటమండపంలో నిర్వహిస్తే ఎలా ఉంటుందనే దానిపై పరిశీలన చేస్తున్నట్లుగా తెలిపారు. వైకుంఠ ద్వార దర్శనంనకు రూ. 200, శీఘ్ర దర్శనానికి రూ.50 టికెట్టుగా నిర్ణయించే విషయమై చర్చించారు. గోదావరి పుష్కరకాలంలో మీ సేవ కేంద్రాల ద్వారా టికెట్లను విక్రయించే అవకాశాలను పరిశీలిస్తున్నట్లుగా చెప్పారు. పుష్కరాల సమయంలో పురోహితులకు దేవస్థానం ద్వారా గుర్తింపు కార్డులను ఇవ్వనున్నట్లుగా ఈవో చెప్పారు. ఆలయ వేళల్లో మార్పు.. సాధారణ రోజుల్లో ఆలయాన్ని తెల్లవారుజామున 4 గంటలకు తెరిచి మధ్యాహ్నం 1 గంటకు మూసివేస్తారు. తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు తెరిచి రాత్రి 9గంటలకు ఆలయం తలుపులు వేస్తారు. గోదావరి పుష్కరాలు జరిగే జులై 14 నుంచి 25 వరకూ తెల్లవారు ఝా మున 4గంటల నుంచి 12 గంటల వరకూ ఆల యం తలుపులు తెరిచి ఉంచుతారు. తిరిగి మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 6 గంటల వరకూ, తిరిగి సాయంత్రం 6.30 నుంచి అర్ధరాత్రి 12.30 గంటల వరకూ ఆల యాన్ని భక్తుల దర్శనార్థం తెరిచి ఉంచుతారు.