సాక్షి, తిరుమల: టీటీడీ ఉచిత సర్వదర్శనం టోకెన్లను ఆన్‌లైన్‌లో శనివారం విడుదల చేసిన సంగతి తెలిసింఏద. కేవలం 35 నిమిషాల్లో 35 రోజుల టికెట్లు బుక్ అయ్యాయి. రికార్డు స్థాయిలో 35 నిమిషాల్లో 2.79 లక్షల టికెట్లను బుక్ చేసుకున్నారు. ఈనెల 26 నుంచి (ఆదివారం) అక్టోబర్ నెల 31 వరకు సర్వదర్శనం టోకెన్లను అందుబాటులో ఉంచింది. రోజుకు 8 వేల టికెట్ల చొప్పున విడుదల చేసింది.
వర్చువల్ క్యూ పద్దతి ద్వారా ముందుగా లాగిన్ అయిన వారికి అవకాశం కల్పించారు. వర్చువల్ క్యూ పద్దతి పాటించడంతో సర్వర్లు క్రాష్ అయ్యే ప్రమాదం తప్పి.. ఎలాంటి ఇబ్బందులు లేకుండా భక్తులు టికెట్లు బుక్ చేసుకున్నారు.
(చదవండి: TTD: శ్రీవారి దర్శనానికి టీకా సర్టిఫికెట్ తప్పనిసరి)
కాగా, ఆన్‌లైన్ టికెట్ల విడుదలతో ఆఫ్‌లైన్‌లో టోకెన్ల జారీని నిలివేయనున్నారు. టికెట్లు పొందిన భక్తులు రెండు డోసుల వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ లేదా 72 గంటల ముందు కరోనా పరీక్ష చేయించుకుని, నెగిటివ్ సర్టిఫికెట్‌తో తిరుమలకు రావాలని అధికారులు స్పష్టం చేశారు.
చదవండి: సేవాతత్పరతను రాజకీయం చేయడం బాధాకరం: వైవీ సుబ్బారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment