తెలుగువారి పరువు తీయొద్దు: సుజనా
సాక్షి, న్యూఢిల్లీ : విభజన నేపథ్యంలో చిన్నచిన్న సమస్యలు తప్పవని, వాటిని ఇరువురు సీఎంలు పరిష్కరించుకోవాలి తప్ప పార్లమెంట్‌లోకి తెచ్చి తెలుగువారి పరువు తీయొద్దని టీడీపీ పార్లమెంటరీ నేత వై.సుజనాచౌదరి టి. ప్రభుత్వానికి సూచించారు. మంగళవారం ఢిల్లీలోని తన నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. నాడు టీఆర్‌ఎస్, కాంగ్రెస్ దగ్గరుండి బిల్లును పాస్ చేయించాయని, ప్రస్తుతం ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని అంశాల్ని అమలు చేసే సమయంలో అడ్డుకోవడం సరికాదన్నారు. టి సర్కారు 19న చేపట్టిన సమగ్ర సర్వే రాజ్యాంగానికి విరుద్ధమని, ఫెడరల్ స్ఫూర్తికి ఇది విరుద్ధమన్నారు. కార్యక్రమంలో టీడీపీ ఎంపీలతోపాటు బీజేపీ ఎంపీ హరిబాబు పాల్గొన్నారు.