
పార్లమెంటులో హైదరాబాద్ బిర్యానీ
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంటులో హైదరాబాద్ బిర్యానీని పరిచయం చేశారు. ఫుడ్ కమిటీ ఛైర్మన్‌గా టీఆర్‌ఎస్ లోక్‌సభాపక్ష నేత ఎ.పి.జితేందర్‌రెడ్డి నియమితులైన తరువాత.. ఇక్కడి వంట వారిని నలుగురిని హైదరాబాద్ తీసుకెళ్లి శిక్షణ ఇప్పించారు. మంగళవారం నుంచి ఈ వంటకాన్ని పార్లమెంటులో అందిస్తున్నారు.