సాక్షి, హైదరాబాద్: కేంద్రం సాకుతో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల అమలు పక్కదారి పట్టిస్తుందన్నారు బీజేపీ శాసన సభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. కేంద్రం తెలంగాణకు అన్యాయం చేయలేదని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తే తెలంగాణ పరిశ్రమలు ఏపీకి తరలి వెళ్ళేవని అన్నారు. కేంద్రం చేసిన పనికి తెలంగాణ కేంద్రానికి పాలాభిషేకం చేయాలని చెప్పారు.
విభజన చట్టం హామీల్లో బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ లేదన్నారు మహేశ్వర్ రెడ్డి. అవకాశం ఉంటేనే బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ పరిశీలన చేస్తానని విభజన చట్టంలో ఉందన్నారు. ఫీజిబిలిటీ లేదని అధికారులు బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో చెప్తున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే 28 వేల కోట్ల ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
‘మొదటినుంచి తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ మెయిన్ విలన్. ఆనాడు తెలంగాణను ఆంధ్రావాలతో విలీనం చేసింది నెహ్రూ. మళ్లీ కాంగ్రెస్ పార్టీని ఆంధ్ర వాళ్ళతో తెలంగాణను విడదీసింది. విభజన చట్టంలో సరైన అంశాలను చేర్చలేదు అందుకే తెలంగాణకు అన్యాయం జరుగుతుంది. ఉద్యమంలో వేలమంది అమరులు అయ్యారు. ఉద్యమాన్ని తట్టుకోలేక తప్పని పరిస్థితుల్లో కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. కేంద్రం అన్యాయం చేసింది అని కాంగ్రెస్ భావిస్తే 8 మంది ఎంపీలు రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయాలి.
బీఆర్ఎస్ కాళేశ్వరం లక్ష కోట్లతో కట్టి కమిషన్లు తీసుకుంది. ఇప్పుడు కాంగ్రెస్ మూసి నది లక్ష కోట్లతో అభివృద్ధి చేస్తానంటుంది. ఎవరికోసం ఎవరికీ కమిషన్లు ఇవ్వడానికి తీసుకోవడానికి లక్ష కోట్లతో మూసీ నది అభివృద్ధి అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ కుట్రలో బీజేపీని భాగస్వామ్యం రమ్మంటున్నారు’ అని మండిపడ్డారు.
కాంగ్రెస్ పార్టీ ఎంపీల రాజీనామా సవాళ్లకు కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ముందు బీజేపీకి చెందిన 8 మందినెంపీలు రాజీనామా చేసి తమ దగ్గరికి రావాలని సవాల్ విసిరారు. బీజేపీ ఎంపీలు రాజీనామా చేసి తెలంగాణ కోసం పోరాడాలని తెలిపారు.బీజేపీ వారు తెలంగాణ కోసం ఫైట్ చేయాల్సింది పోయి కాంగ్రెస్ ఎంపీలను రాజీనామా చేయమనడం విడ్డూరంగా ఉందన్నారు
Comments
Please login to add a commentAdd a comment