
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ శాసనసభలో బీజేపీ నేతగా ఏలేటి మహేశ్వర్‌రెడ్డి నియమితులయ్యారు.మహేశ్వర్‌రెడ్డిని బీజేపీఎల్‌పీ నేతగా నియమిస్తూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. శాసనసభ పక్ష ఉపనేతలుగా పాయల్ శంకర్, వెంకటరమణారెడ్డి నియామకం అయ్యారు. శాసనమండలి పక్షనేతగా ఎమ్మెల్సీ ఏవీఎన్‌రెడ్డిని నియామకం అయ్యారు.
కాగా మహేశ్వర్ రెడ్డి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నిర్మల్ నియోజకవర్గం నుంచి గెలుపొందిన విదితమే. 2009లో ప్రజారాజ్యం తరపున పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఆయన. 2023 అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందే మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరారు.
ఇక 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 8 స్థానాల్లో విజయం సాధించించగా ఇందులో గోషామహల్ నుంచి రాజాసింగ్ హ్యాట్రిక్ విజయం సాధించారు. ఆదిలాబాద్ నుంచి పాయల్ శంకర్, సిర్పూర్ కాగజ్‌నగర్ నుంచి పాల్వాయి హరీష్‌బాబు, నిర్మల్ నుంచి ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ముథోల్ నుంచి రామారావు పటేల్, నిజామాబాద్ అర్బన్ నుంచి ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా, ఆర్మూర్ నుంచి రాకేశ్ రెడ్డి, కామారెడ్డి నుంచి కాటిపల్లి వెంకటరమణా రెడ్డి గెలిచారు. ఇందులో రాజాసింగ్, మహేశ్వర్ రెడ్డి మినహా మిగతా వారందరూ తొలిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికైనవారే.
Comments
Please login to add a commentAdd a comment