floor leader
-
శాసనసభ బీజేపీ పక్షనేతగా ఏలేటి మహేశ్వర్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ శాసనసభలో బీజేపీ నేతగా ఏలేటి మహేశ్వర్‌రెడ్డి నియమితులయ్యారు.మహేశ్వర్‌రెడ్డిని బీజేపీఎల్పీ నేతగా నియమిస్తూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. శాసనసభ పక్ష ఉపనేతలుగా పాయల్ శంకర్, వెంకటరమణారెడ్డి నియామకం అయ్యారు. శాసనమండలి పక్షనేతగా ఎమ్మెల్సీ ఏవీఎన్రెడ్డిని నియామకం అయ్యారు. కాగా మహేశ్వర్ రెడ్డి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నిర్మల్ నియోజకవర్గం నుంచి గెలుపొందిన విదితమే. 2009లో ప్రజారాజ్యం తరపున పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఆయన. 2023 అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందే మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరారు. ఇక 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 8 స్థానాల్లో విజయం సాధించించగా ఇందులో గోషామహల్ నుంచి రాజాసింగ్ హ్యాట్రిక్ విజయం సాధించారు. ఆదిలాబాద్ నుంచి పాయల్ శంకర్, సిర్పూర్ కాగజ్‌నగర్ నుంచి పాల్వాయి హరీష్‌బాబు, నిర్మల్ నుంచి ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ముథోల్ నుంచి రామారావు పటేల్, నిజామాబాద్ అర్బన్ నుంచి ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, ఆర్మూర్ నుంచి రాకేశ్ రెడ్డి, కామారెడ్డి నుంచి కాటిపల్లి వెంకటరమణా రెడ్డి గెలిచారు. ఇందులో రాజాసింగ్, మహేశ్వర్ రెడ్డి మినహా మిగతా వారందరూ తొలిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికైనవారే. -
లోక్‌సభలో కాంగ్రెస్ నేత అధిర్
న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్‌కు చెందిన సీనియర్ లోక్‌సభ సభ్యుడు అధిర్ రంజన్ చౌధురి లోక్‌సభలో కాంగ్రెస్ నేతగా నియమితులయ్యారు. అదేవిధంగా, పార్టీ చీఫ్ విప్‌గా కేరళకు చెందిన కె.సురేశ్‌ను కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. ఈ నియామకపు ఉత్తర్వులను లోక్‌సభ సెక్రటేరియట్‌కు పార్టీ వర్గాలు అందజేశాయి. ఇప్పటి వరకు ఐదుసార్లు ఎంపీ అయిన అధిర్ రంజన్ ఇటీవలి ఎన్నికల్లో పశ్చిమబెంగాల్లోని ముర్షిదాబాద్ జిల్లా బెహరంపూర్ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. లోక్‌సభలో పార్టీ నేతగా తనను నియమించడంపై అధిర్ రంజన్ కాంగ్రెస్ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను నెరవేర్చేందుకు శాయశక్తులా కృషి చేస్తానని విలేకరులతో అధిర్ అన్నారు. సామాన్య ప్రజల తరఫున పార్లమెంట్లో గళం వినిపిస్తానన్నారు. కేరళలోని మావెలిక్కర నుంచి ఎన్నికైన సురేశ్ కూడా పార్టీ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపారు. అంతకుముందు వారిద్దరూ యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ నివాసంలో సీనియర్ నేతలతో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. సాయంత్రం యూపీఏ నేతలతో కలిసి వారంతా పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. 1999 నుంచి అధిర్ రంజన్ చౌధురి వరుసగా లోక్‌సభకు ఎన్నికవుతూ వస్తున్నారు. అంతకుముందు 1996–1999 సంవత్సరాల్లో ఆయన శాసనసభ్యుడిగా ఉన్నారు. యూపీఏ హయాంలో కేంద్రమంత్రిగా చేశారు. గత లోక్‌సభలో కాంగ్రెస్ నేతగా ఉన్న మల్లికార్జున్ ఖర్గే ఇటీవలి ఎన్నికల్లో ఎన్నికల్లో ఓటమి పాలు కావడంతో కాంగ్రెస్ తాజా నియామకం చేపట్టింది. ప్రతిపక్ష నేత అర్హత సాధించేందుకు అవసరమైన 10 శాతం సీట్లు కాంగ్రెస్‌కు లోక్‌సభలో లేకపోవడంతో ఆ హోదా దక్కలేదు. ఇలాంటి పరిణామం ఎదురుకావడం ఆ పార్టీకి వరుసగా ఇది రెండోసారి. -
కాంగ్రెస్ పక్ష నేత నియామకం సందిగ్ధం
న్యూఢిల్లీ: 17వ లోక్‌సభ తొలి సమావేశం సోమవారం నుంచి ప్రారంభమవుతున్నా సభలో కాంగ్రెస్ పక్ష నేతగా ఎవరు ఉండాలనేదానిపై ఇప్పటివరకూ నిర్ణయం తీసుకోలేదు. అలాగే సభలో ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకు వివిధ ప్రతిపక్ష పార్టీలను సమన్వయం చేసుకునే విషయంలోనూ ముందడుగు పడలేదు. ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాత ప్రతిపక్ష పార్టీల సమావేశమే జరగలేదు. దీనిపై కాంగ్రెస్ నేత ఒకరు మాట్లాడుతూ చాలా ప్రతిపక్ష పార్టీలు సభలో తమ పార్టీ పక్ష నాయకుడిని ఎంపిక చేయలేదనీ, ఆ పని పూర్తయిన అనంతరం ప్రతిపక్ష పార్టీల భేటీ ఉండొచ్చని అన్నారు. ఆదివారం జరిగిన అఖిలపక్ష సమావేశానికి రాజ్యసభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్‌తోపాటు కాంగ్రెస్ నుంచి పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఆధిర్ రంజన్ చౌధురీ, కేరళ కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు సురేశ్ హాజరయ్యారు. దీంతో వీరిద్దరిలో ఎవరో ఒకరిని లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేతగా నియమించే అవకాశం ఉందంటున్నారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనీశ్ తివారీ, ఎదురుగాలిలోనూ తిరువనంతపురం నుంచి వరుసగా మూడుసార్లు కాంగ్రెస్ తరఫున గెలిచిన శశి థరూర్‌ల పేర్లు కూడా ఈ రేసులో ఉన్నాయి. -
లోక్‌సభలో బీజేపీ నేతగా మోదీ
న్యూఢిల్లీ: లోక్‌సభలో బీజేపీ నేతగా ప్రధాని మోదీ, ఉపనేతగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్ నియమితులయ్యారు. బుధవారం ఇక్కడ సమావేశమైన బీజేపీ పార్లమెంటరీ పార్టీ ఎగ్జిక్యూటివ్ కమిటీని ఎన్నుకుంది. రాజ్యసభలో అధికార పార్టీ నేతగా బీజేపీకి చెందిన దళిత నేత, కేంద్ర మంత్రి థావర్‌చంద్ గెహ్లోత్, ఉపనేతగా పీయూష్ గోయెల్ నియమితులయ్యారు. చీఫ్ విప్‌గా సంజయ్ జైస్వాల్‌తోపాటు ప్రథమంగా ముగ్గురు మహిళా ఎంపీలను, వివిధ రాష్ట్రాలకు చెందిన మరో 15 మంది లోక్‌సభ సభ్యులను విప్‌లుగా నియమించింది. రాజ్యసభ నుంచి కూడా ఆరుగురిని విప్‌లుగా ప్రకటించింది. సమావేశానికి ప్రత్యేక ఆహ్వానితులుగా లోక్‌సభ సభ్యులు గడ్కరీ, రవి శంకర్, అర్జున్ ముండా, నరేంద్ర తోమర్, జువల్ ఓరమ్, స్మృతీ ఇరానీ హాజరయ్యారు. అలాగే, రాజ్యసభ నుంచి ప్రత్యేక ఆహ్వానితులుగా జేపీ నడ్డా, ఓ ప్రకాశ్ మాథుర్, నిర్మలా సీతారామన్, ధర్మేంద్ర ప్రధాన్, ప్రకాశ్ జవడేకర్ పాల్గొన్నారు. ఎంపీలు కానందున మొదటిసారిగా ఈ కమిటీలో సభ్యులు కాని అగ్ర నేతలు, ఎల్కే అడ్వాణీ, మురళీ మనోహర్ జోషి సమావేశానికి రాలేదు. బీజేపీ పార్లమెంటరీ కార్యాలయం ఇన్చార్జిగా బీజేపీ ప్రధాన కార్యదర్శి కైలాశ్ విజయవర్గీయ, కార్యదర్శిగా తెలుగు వ్యక్తి బాలసుబ్రహ్మణ్యం నియమితులయ్యారు. 16న పార్టీ బీజేపీ మొదటి ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం కానుంది. మోదీ అధ్యక్షతన అఖిల పక్ష సమావేశం జరగనుంది పార్లమెంటరీ కార్యాలయ కార్యదర్శిగా తెలుగు వ్యక్తి సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ పార్లమెంటరీ కార్యాలయ కార్యదర్శిగా తెలుగు వ్యక్తి అయిన కామర్సు బాలసుబ్రహ్మణ్యంను మరోసారి కొనసాగిస్తూ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. 2014లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం బాలసుబ్రహ్మణ్యంను బీజేపీ పార్లమెంటరీ కార్యాలయ కార్యదర్శిగా నియమించారు. ఇప్పుడు మళ్లీ కేంద్రంలో అధికారం చేపట్టిన నేపథ్యంలో ఆయన్ను కార్యదర్శిగా కొనసాగించింది. 2007 నుంచి 2010 వరకు బీజేపీ జాతీయ మీడియా సహ కార్యదర్శిగా బాలసుబ్రహ్మణ్యం బాధ్యతలు నిర్వహించారు. నితిన్ గడ్కరీ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో లీగల్ సెల్ జాతీయ సహ కార్యదర్శిగా కూడా పని చేశారు. -
రాజీనామాకు నేను సిద్ధం: జానారెడ్డి
హైదరాబాద్: ప్రతిపక్ష నేత పదవికి రాజీనామా చేసేందుకు తాను సిద్ధమని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి అన్నారు. గాంధీభవన్‌లో తెలంగాణ కాంగ్రెస్ సమన్వయ కమిటీ సమావేశంలో వాడివేడి చర్చ జరిగింది. దాదాపు 5 గంటల పాటు కొనసాగిన ఈ సమావేశంలో రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడంపై చర్చించారు. రూ.5 భోజనం బాగుందంటూ జానారెడ్డి చేసిన వ్యాఖ్యలను సర్వే మరోమారు లేవనెత్తారు. దీనిపై స్పందించిన జానా పదేపదే అదే విషయాన్ని లేవనెత్తడం సరికాదని అన్నారు. పార్టీని బలపరచడంలో జానా దూకుడుగా లేరని సర్వే ఆరోపించారు. ఆ సమయంలోనే.. ప్రతిపక్ష నేత పదవికి రాజీనామా చేయడానికి తాను సిద్ధమని జానారెడ్డి చెప్పడంతో రాజీనామా అవసరం లేదని, పదవీలోనే కొనసాగాలని ఎమ్మెల్యేలు కోరారు. కాగా, సమావేశంలో షబ్బీర్ అలీ, సర్వేల మధ్య కూడా స్వల్ప వాగ్వాదం చోటు చేసుకున్నట్లు సమాచారం. దీనిపై దళితుడైన తనను షబ్బీర్ అలీ టార్గెట్ చేస్తున్నారని సర్వే అన్నారు. పబ్లిక్ మీటింగ్ లోనే పార్టీ నాయకత్వ తీరుపై సర్వే వ్యాఖ్యలు చేయడం సరికాదని షబ్బీర్ వ్యాఖ్యానించారు. సమావేశంలో షబ్బీర్ అలీ, సర్వే సత్యనారయణతో పాటు పలువురు పార్టీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. -
'ఆయనను విమర్శించే నైతికత పయ్యావులకు లేదు'
అనంతపురం: వైఎస్ జగన్‌ను విమర్శించే నైతికత టీడీపీ ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్‌కు లేదని అనంతపురం జడ్పీ వైఎస్సార్సీపీ ఫ్లోర్ లీడర్ వెన్నపూస రవీంద్రారెడ్డి ఆరోపించారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికైన పయ్యావుల జడ్పీ సమావేశాలకు ఎందుకు హాజరుకాలేదో చెప్పాలని ప్రశ్నించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని రాజధాని ప్రాంతంలో భూ కుంభకోణాలకు పాల్పడుతున్నారని రవీంద్రారెడ్డి విమర్శించారు. -
మీరు ఊ అంటే.. ఆదాయం
- ఫ్లోర్‌లీడర్లతో మేయర్ భేటీ - ఐవీ ప్యాలెస్, బృందావన్ అపార్ట్మెంట్స్పై చర్చ - ఆదాయం వస్తుందని సూచన - తర్వాత చెబుతామన్న పుణ్యశీల విజయవాడ సెంట్రల్ : ‘నగరపాలక సంస్థ చాలా క్లిష్టపరిస్థితుల్లో ఉంది.. మీరు సహకరిస్తే ఆదాయం రాబట్టొచ్చ’ని మేయర్ కోనేరు శ్రీధర్ ఫ్లోర్‌లీడర్లతో అన్నారు. తన చాంబర్లో అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లతో సోమవారం ఆయన అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. ఐవీ ప్యాలెస్ బకాయిలు రూ.8,50,34,241 ఉన్నాయన్నారు. లీజుదారుడైన అరుణ్‌కుమార్‌కు జనవరిలో నోటీసులు ఇచ్చామన్నారు.కోర్టు కండిషన్ ఇంజక్షన్ ఆర్డర్ ఇవ్వడంతో ఐవీ ప్యాలెస్ బకాయిలు వసూలు చేయడం సాధ్యం కావడం లేదన్నారు. ఈక్రమంలో అరుణ్‌కుమార్‌తో చర్చలు సాగించగా రూ.6 కోట్లు అయితే చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారన్నారు. ప్రస్తుతం రూ.1.55 లక్షలు చెల్లిస్తున్న అద్దెను రూ.5.85 లక్షల చొప్పున వసూలు చేసే అవకాశం ఉందన్నారు. ఈ ప్రతిపాదనకు అన్ని పార్టీల సభ్యులు సహకరించినట్లైతే రూ.6 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందన్నారు. అపార్ట్మెంట్స్ బేరం పెడదాం.. కార్పొరేషన్‌కు చెందిన బృందావన్ అపార్ట్మెంట్స్లోని ఆరు ప్లాట్లు విక్రయిస్తే రూ.7.50 కోట్లు ఆదాయం వచ్చే అవకాశం ఉందన్నారు. మొత్తం 15 ఫ్లాట్స్‌కు గాను మూడు అద్దెకు ఇవ్వగా మిగిలినవి కార్పొరేషన్ ఆధీనంలో ఉన్నాయన్నారు. ఇందులో ఆరు అపార్ట్‌మెంట్స్‌ను కొనుగోలు చేసేందుకు ఇటీవలే కొందరు వ్యక్తులు ముందుకు వచ్చారన్నారు. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా వీటిని విక్రయిస్తే కొంత ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చన్నారు. వైఎస్ఆర్ సీపీ ఫ్లోర్ లీడర్ బి.ఎన్. పుణ్యశీల మాట్లాడుతూ విమర్శలకు తావులేకుండా ఏకాభిప్రాయంతోనే ఏదైనా చేయాలన్నారు. ఇందుకు గాను తమపార్టీ సభ్యులతో చర్చించి రెండు మూడు రోజుల్లో తమ అభిప్రాయాన్ని చెబుతామన్నారు. టీడీపీ, బీజేపీ, సీపీఎం ఫ్లోర్ లీడర్లు జి.హరిబాబు, ఉత్తమ్‌చంద్ బండారీ, జి.ఆదిలక్ష్మి, డిప్యూటీ మేయర్ గోగుల వెంకట రమణారావు తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ ఫ్లోర్‌లీడర్‌పై దాడి
అవినీతిని ప్రశ్నించినందుకు అధికారపక్ష కౌన్సిలర్ల వీరంగం రసాభాసగా ముగిసిన కౌన్సిల్ సమావేశం పోలీసులకు ఇరువర్గాల ఫిర్యాదు నర్సీపట్నం: అధిక మొత్తంలో చైర్లు కొనుగోలు చేయడానికి తీర్మానించడం వెనుక అవినీతి స్పష్టంగా కనిపిస్తోందని వైఎస్సార్సీపీ ఫ్లోర్‌లీడర్ తమరాన నాయుడు అధికారులను నిలదీశారు. ఈ విషయమై అధికారపక్ష కౌన్సిలర్లు వాదనకు దిగడంతో పాటు నాయుడిపై చేయి చేసుకున్నారు. దీంతో సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది. సభను హుందాగా నడిపించాల్సిన మున్సిపల్ వైస్‌చైర్మన్ చింతకాయల సన్యాసిపాత్రుడు మీ ఇష్టం వచ్చిన విచారణ జరిపించుకోండంటూ సభను ముగించి వెళ్లిపోయారు. గురువారం జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాభాసగా ముగిసింది. మున్సిపల్ కార్యాలయానికి 30 నీల్కమల్ కుర్చీలను ఒక్కొక్కటి రూ. 625కి కొనుగోలు చేయడానికి అజెండాలో పొందుపరిచారు. బయట షాపులో అదే చైర్ రూ.425 ఇస్తుంటే రూ.625కు కొనుగోలు చేయడానికి తీర్మానం చేయటంలో అవినీతి కనిపిస్తోందని వైఎస్సార్సీపీ ప్లోర్‌లీడర్ తమరాన నాయుడు మున్సిపల్ అభ్యంతరం వ్యక్తంచేశారు. దీనికి అధికారపక్ష కౌన్సిలర్లు రావాడ నాయుడు, పైల గోవిందరావు చెరుకూరి సత్యనారాయణ అడ్డుతగిలారు. దీంతో అధికార పక్ష, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అధికారులను ప్రశ్నిస్తే మీరెందుకు జోక్యం చేసుకుంటున్నారని నాయుడు అధికారపక్ష సభ్యులను నిలదీశారు. ఈ సమయంలో సమావేశానికి అధ్యక్షత వహించిన వైస్‌చైర్మన్ సన్యాసిపాత్రుడు కల్పించుకుని మీ ఇష్టం వచ్చిన విచారణ జరిపించుకోండంటూ సభను ముగిస్తున్నట్లు ప్రకటించి వెళ్లిపోయారు. అడిగిన దానికి సమాధానం చెప్పకుండా వెళ్లిపోవటం మంచి పద్ధతి కాదని ప్రతిపక్షసభ్యులు సన్యాసిపాత్రుడిని నిలదీసినా, ఆయన పట్టించుకోకుండా వెళ్లిపోయారు. వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు కౌన్సిల్ హాల్ నుండి బయటకువస్తూ అధికారం మీ చేతుల్లో ఉందని ఇష్టానుసారంగా వ్యవహరిస్తే చూస్తు ఊరుకోలేమని అనడంతో అధికారపక్ష కౌన్సిలర్లు గొడవకు దిగారు. ఈ సమయంలో కొందరు అధికారపక్ష కౌన్సిలర్లు ప్లోర్‌లీడర్ నాయుడుపై చేయిచేసుకున్నారు. అయినప్పటికీ నాయుడు, సహచర కౌన్సిలర్లు హుందాగా వ్యవహరించారు. అధికారపక్ష కౌన్సిలర్లు అరుపులు కేకలతో మున్సిపల్ కార్యాలయం దద్దరిల్లింది. కార్యాలయం ఆవరణలో ఉన్న వైఎస్సార్సీపీ నాయకులపై టీడీపీ కౌన్సిలర్లు గొడవకు దిగారు. ఈ సంఘటనపై ప్రతిపక్ష సభ్యులు పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయడంతో అందుకు ప్రతిగా అధికార సభ్యులు కూడా ఫిర్యాదుచేశారు. -
జడ్పీలో ఫ్లోర్ లీడర్‌గా రవీందర్‌రెడ్డి
హైదరాబాద్ : అనంతపురం జెడ్పీటీసీ ఫ్లోర్ లీడర్ గా వైఎస్సార్సీపీ సభ్యుడు వెన్నపూస రవీందర్ రెడ్డి ఎన్నికయ్యారు. అనంతపురం జిల్లా వైఎస్సార్సీపీ జడ్పీటీసీ సభ్యుల అంగీకారంతో పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి రాప్తాడు జడ్పీటీసీ సభ్యుడైన వెన్నపూస రవీందర్‌రెడ్డిని జిల్లా పరిషత్‌లో పార్టీ ఫ్లోర్ లీడర్‌గా నియమించారు. ఈ మేరకు సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఒక ప్రకటన వెలువడింది. -
ఇదేం..కక్కుర్తి..?
జీహెచ్ఎంసీ సామగ్రి ఇంటికి పదవిలో ఉన్నంత కాలం ఆయనకు ఎదురే లేదు మాజీ ఫ్లోర్‌లీడర్ నిర్వాకంపై విచారణకు ఆదేశించిన సోమేశ్‌కుమార్ ఆయన తాజా మాజీ కార్పొరేటర్.. జీహెచ్ఎంసీలో ప్రధాన ప్రతిపక్షానికి ఫ్లోర్‌లీడర్‌గా వ్యవహరించారు.. పదవిలో ఉన్నంత కాలం ఆయనకు ఎదురే లేదు. సర్వసభ్య సమావేశాల్లో అందరిదీ ఒక ఎత్తయితే ఆయనది ఒక ఎత్తు. ఆయన నోటికి జడిసి ఎవరూ ఎదురు చెప్పేవారు కాదు. తన మాట వినని అధికారులను లక్ష్యంగా చేసుకొనేవారు. సర్వసభ్య సమావేశంలో నిలదీసేవారు. అందుకు ఇతర పార్టీల మద్దతు కూడగట్టేవారు కూడా. ఇది నాణేనికి ఒక వైపు. మరోవైపు తనకు అనుకూలంగా ఉండే కాంట్రాక్టర్లకు పనులు ద క్కేలా చేసేవారు.. పలు విభాగాల్లో పనులు చేయించుకోవడంలో నేర్పరి. ముఖ్యంగా టౌన్‌ప్లానింగ్ విభాగంలో పనులు చేయించడంలోనూ అందెవేసిన చేయి. ఇలా వివిధ మార్గాల్లో పదవిని బాగా వినియోగించుకున్నారు. పదవి నుంచి దిగిపోయే ముందూ కక్కుర్తిపడ్డారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాన ప్రతిపక్ష పార్లీ ఫ్లోర్‌లీడర్ హోదాలో జీహెచ్ఎంసీ సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డికి ఒక చాంబర్‌ను ఏర్పాటు చేయడంతోపాటు అవసరమైన ఫర్నిచర్, టీవీ, ఫ్రిజ్ తదితర సదుపాయాలు ఏర్పాటు చేసింది. సాధారణంగా పదవి దిగిపోయేముందు వాటిని సంబంధిత మెయింటనెన్స్ విభాగానికి అప్పగించాలి. అయితే అలా జరగలేదు. ఈ నెల 3న కార్పొరేటర్ల పదవీకాలం ముగిసిపోయింది. ఆరోజు తెల్లవారు జామున 5 నుంచి 6 గంటల మధ్య సమయంలో కొంతమంది గుంపుగా ఆయన చాంబర్లోకి వెళ్లి టేబుల్, కుర్చీలు, టీవీ, ఫ్రిజ్ తదితర వస్తువులను తీసుకెళ్లేందుకు ప్రయత్నించినట్టు విశ్వసనీయ సమాచారం. అడ్డుకోబోయిన సెక్యూరిటీని గద్దించారు. ‘మా అన్న సింగిరెడ్డి పంపాడు.. మాకే అడ్డుచెబుతావా’ అంటూ గద్దించారు. సెక్యూరిటీ సిబ్బంది సామగ్రి వివరాలు నోట్ చేసుకున్నారు. వచ్చినవారు దర్జాగా వాటిని వాహనంలో తీసుకెళ్లిపోయారు. ఈ విషయాన్ని సెక్యూరిటీ సిబ్బంది మెయింటనెన్స్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయినా పట్టించుకోలేదు. మౌనం వహించారు. శుక్రవారం టీడీపీ ఫ్లోర్‌లీడర్ సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ‘జీహెచ్ఎంసీ ఫర్నిచర్’ను ఎత్తుకుపోయారంటూ టీవీ చానెళ్లలో ప్రసారమయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న కమిషనర్, స్పెషలాఫీసర్ సోమేశ్‌కుమార్ విచారణ జరపాల్సిందిగా జీహెచ్ఎంసీ విజిలెన్స్, పరిపాలన విభాగం, ఇంజినీరింగ్ విభాగం అధికారులను ఆదేశించారు. సామగ్రికి సంబంధించిన రికార్డులు ఎవరు నిర్వహించాలి.. ఈ ఘటనలో ఎవరి బాధ్యత ఎంత.. తదితర వివరాలతో సహ పూర్తి సమాచారం అందించాల్సిందిగా ఆదేశించారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఫ్లోర్ లీడర్‌తో ఎందుకొచ్చిన గొడవనుకొని తీసుకువెళ్లిన సామగ్రిని తిప్పి పంపించాల్సిందిగా కొందరు అధికారులు ఆయనను కోరినట్లు తెలిసింది. ‘ఎవరు ఎత్తుకెళ్లారో తెలియదు. నాకు సంబంధం లేదు. కావాలంటే అందుకయ్యే ఖర్చు ఎంతో చెల్లిస్తా’ అని ఆయన అధికారులతో అన్నట్టు తెలిసింది. అందుకు అధికారులు నిరాకరించారు. సామగ్రిని తిరిగి ఇవ్వాల్సిందేనంటూ సిబ్బందిని ఆయన ఇంటికి పంపించారు. సింగిరెడ్డి ఇంటి ముందు మీడియా ప్రతినిధులు ఉండడంతో సిబ్బంది వెనుదిరిగినట్టు సమాచారం. ‘గతంలో ఎవ్వరూ సామాన్లు తీసుకెళ్లలేదా..? నాగురించే ఎందుకు ప్రచారం చేశారు’ అంటూ శ్రీనివాసరెడ్డి కొందరు ఉద్యోగులతో ఫోన్లో వాగ్వాదానికి దిగినట్లు తెలిసింది. ఈ వ్యవహారంపై సెక్యూరిటీ, మెయింటనెన్స్ విభాగాల వారు ఒకరిపై ఒకరు వాదనలకు దిగారు. అధికారులు కార్యాలయంలోని సీసీ కెమెరాల ఫుటేజీ పరిశీలించనున్నట్టు తెలిసింది. అధికారుల ప్రాథమిక అంచనా మేరకు రిఫ్రిజిరేటర్, టీవీ, టేబుల్, కప్బోర్డు, 12 ప్లాస్టిక్ కుర్చీలు, మరో ఖరీదైన కుర్చీ తరలించినట్లు గుర్తించారు. ఈ ఘటన నేపథ్యంలో ఇతర ఫ్లోర్‌లీడర్లు, మేయర్, డిప్యూటీ మేయర్ తదితరుల చాంబర్లలోని ఫర్నిచర్ సరిగ్గా ఉందా అనే అంశంపై కూడా అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. నాకు తెలియదు.. సామగ్రి తరలింపుపై సింగిరెడ్డిని వివరణ కోరగా, వాటిని ఎవరు ఎత్తుకెళ్లారో తనకు తెలియదన్నారు. వాటిని తీసుకెళ్లాల్సిన అవసరం తనకు లేదన్నారు. -
మన వరకు ఓకే!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : కొత్త రాష్ట్రం... తొలి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు... ఓ మంత్రి... ఇద్దరు ప్రతిపక్షాలకు సంబంధించిన ఫ్లోర్‌లీడర్లు... ఒకరైతే ఏకంగా ప్రతిపక్ష నేత... మరో డిప్యూటీ లీడర్... కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేల్లో నూతనోత్సాహం... అందరి దృష్టి శాసనసభా బడ్జెట్ సమావేశాల వైపే... సభలో ఏం జరుగుతుంది... గతంలాగానే అరుపులు, కేకలు.. వాకౌట్లు.. సస్పెన్షన్లేనా? ప్రజలకు ఏమైనా తెలంగాణ చట్టసభ ఉపయోగపడుతుందా? అందులో మన జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వారి తీరు ఎలా ఉంటుంది? జిల్లాకు ఏమైనా ఈ సమావేశాలు ఉపయోపడతాయా? బడ్జెట్లో జిల్లాకు తగిన ప్రాధాన్యం లభిస్తుందా? పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులకు ఈసారైనా మోక్షం కలుగుతుందా? జిల్లాలో వైద్య, విద్య, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ఎలాంటి ప్రాధాన్యం ఇస్తుంది? అనేది జిల్లావాసుల్లో చర్చనీయాంశమైంది. బడ్జెట్ సమావేశాల తొలిరోజు నుంచి నిరజిల్లా ప్రజానీకం బడ్జెట్‌ను, అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తీరును ఆసక్తికరంగా గమనించారు. అయితే, తెలంగాణ తొలి బడ్జెట్ సమావేశాలు జిల్లా వాసులు ఆశించిన రీతిలోనే జరిగాయా? జిల్లాకు ఒనగూరిన ప్రయోజనం ఏమిటి? మన నేతలు అసెంబ్లీలో ఏం చేశారనే దానిపై ‘సాక్షి’ కథనం.... చురుకైన పాత్రే తొలి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో జిల్లా నేతలు చురుకైన పాత్ర పోషించారనే చెప్పాలి. ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో నాగార్జున సాగర్ ఎమ్మెల్యే కె. జానారెడ్డి, మంత్రి హోదాలో సూర్యాపేట నుంచి ప్రాతినిధ్యం వహిస్తోన్న జి.జగ దీష్‌రెడ్డి, సీపీఐ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా రవీంద్రకుమార్ (దేవరకొండ)లకు సభలో ఎక్కువసార్లు మాట్లాడే అవకాశం వచ్చింది. ఇక బడ్జెట్లోని పలు పద్దులపై జరిగిన చర్చలో ఎమ్మెల్యేలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పద్మా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డిలు మాట్లాడారు. పారిశ్రామిక విధానంపై చర్చ సందర్భంగా సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని స్పీకర్‌ను కోరడం, స్పీకర్ ఇవ్వకపోవడం, ఆ తర్వాత ఆయన అలక, ఆగ్రహాన్ని కలగలిపి ప్రదర్శించడం, సీఎం జోక్యంతో కథ సుఖాంతం కావడం ఆసక్తి కలిగించే పరిణామంగా చెప్పుకోవాలి. జిల్లాకు చెందిన మిగిలిన ఎమ్మెల్యేలు కూడా అనేక అంశాలపై తమ గళం విప్పారు. జిల్లాకు చెందిన సమస్యలను సభ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. అయితే, సీఎల్పీ నేత హోదాలో జిల్లా సీనియర్ నేత జానారెడ్డి వ్యవహరించిన తీరుపై కాంగ్రెస్ సభ్యుల్లోనే మిశ్రమస్పందన వ్యక్తమయినా, ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదించడంలో అధికార పక్షానికి మద్దతు ప్రకటించడంతో కాంగ్రెస్ పార్టీ కూడా సభలో హుందాగా వ్యవహరించందనే అభిప్రాయాన్ని జిల్లా వాసులు వ్యక్తం చేస్తున్నారు. ఎస్‌ఎల్‌బీసీనే హైలై ట్ ఇక శ్రీశైల సొరంగమార్గం (ఎస్ఎల్బీసీ) ప్రాజెక్టు వ్యవహారం ఈసారి సభలోనే హైలెట్ అయింది. జిల్లాకు చెందిన ఎమ్మెల్యేల చొరవతో ప్రత్యేక అంశం కింద చర్చకు వచ్చిన ఈ అంశంలో ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించడంతో ఈ ప్రాజెక్టు పూర్తయ్యేందుకు గాను కీలకమైన కదలిక వచ్చింది. ఈ టన్నెల్ నిర్మాణంతో పాటు డిండి రిజర్వాయర్, బ్రాహ్మణవెల్లెంల ఎత్తిపోతల లాంటి పథకాలకు కూడా ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చింది. దీనిపై శాసనసభ కమిటీ హాల్లో వరుసగా రెండు రోజులపాటు ప్రత్యేక సమావేశాలు కూడా నిర్వహించారు. కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులు, ప్రభుత్వ పెద్దలు, జిల్లా ప్రజాప్రతినిధులందరూ కలిసి చర్చలు జరిపారు. మొత్తంమీద ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఎస్ఎల్బీసీ సొరంగమార్గం ఓ కొలిక్కి రావడంతో జిల్లాలోని ఆరు నియోజకవర్గాల రైతాంగానికి ఉపయోగకరమైన ఈ ప్రాజెక్టు తొందర్లోనే పూర్తవుతుందనే ఆశతో జిల్లా వాసులున్నారు. ‘కొండ’ంత అభివృద్ధి ఇక, తెలంగాణలోనే పేరెన్నికగన్న పుణ్యక్షేత్రమైన జిల్లాలోని యాదగిరిగుట్ట అభివృద్ధికి ఈ బడ్జెట్లో రూ.100 కోట్లు పెట్టడం ఈ సమావేశాల్లో విశేషంగా చెప్పుకోవాలి. తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో గుట్టను అభివృద్ధి చేస్తానని గతంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు ఈసారి కొండ పరిసరాల సమగ్ర అభివృద్ధికి నిధులు కేటాయించారు. కొండ చుట్టూ ఆకాశహర్మ్యాలు, కల్యాణమండపాలు, అభయారణ్యం అభివృద్ధి, వేద పాఠశాలలాంటి నిర్మాణాల కోసం ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళుతున్నట్టు ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా చెప్పింది. దీంతో యాదగిరి కొండ తెలంగాణలోనే అత్యంత అభివృద్ధి దిశలో ముందుకెళుతుందని ప్రజల ఆకాంక్ష. ఇక, మిగిలిన విషయాలకు వస్తే హైదరాబాద్-నల్లగొండ పరిశ్రమల కారిడార్, లక్ష ఉద్యోగాల భర్తీ, ఉద్యోగ వయోపరిమితి సడలింపు లాంటి అంశాలు జిల్లా నిరుద్యోగ లోకంలో ఉపాధి ఆశలు కల్పించగా, శంషాబాద్ విమానాశ్రయ దేశీయ టర్మినల్‌కు ఎన్టీఆర్ పేరు పెట్టడంపై జరిగిన గొడవ, ఫ్రభుత్వ భూముల కబ్జాలపై సభాసంఘాన్ని నియమించడం, పీసీసీ అధ్యక్షుడు పొన్నాల భూ ఆక్రమణల వ్యవహారం వెలుగులోనికి తేవడం, రహదారుల నిర్మాణానికి జిల్లాకు రూ.200 కోట్లు కేటాయించడం లాంటి అంశాలు జిల్లా ప్రజల్లో చర్చనీయాంశమయ్యాయి. ఇక, రైతుల ఆత్మహత్యలపై తగినంత చర్చలు జరగకపోవడం, విద్యుత్ సమస్య నివారణకు ప్రభుత్వం నుంచి సమగ్ర రీతిలో హామీ రాకపోవడం, అమరవీరుల కుటుంబాల గురించి సభలో చర్చ జరిగిన తీరు లాంటివి కొంత నిరాశపరిచాయనే చెప్పాలి. -
విజయవంతమైన నరకాసుర వధ
హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతురుణ మాఫీపై వంచనకు పాల్పడుతున్న నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నరకాసుర వధ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్‌లో గ్రామగ్రామాన విజయవంతమైందని ఆ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ జ్యోతుల నెహ్రూ వెల్లడించారు. గురువారం హైదరాబాద్‌లో జ్యోతుల నెహ్రూ విలేకర్లసమావేశంలో మాట్లాడుతూ... నరకాసుర వధ కార్యక్రమానికి పెద్ద ఎత్తున రైతాంగం, మహిళాలోకం కదిలి వచ్చిందని తెలిపారు. ఆర్థిక మంత్రి యనమల తన స్థాయిని దిగజారి మాట్లాడుతున్నారని నెహ్రూ ఆరోపించారు. దొడ్డి దారిన మంత్రి అయిన మీరా తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌ను విమర్శించేది అని యనమలను ప్రశ్నించారు. ప్రజలు మిమ్మల్ని రెండుసార్లు ఓడించారని యనమలను ఉద్దేశించి అన్నారు. ప్రజలు అలా ఎందుకు ఓడించారో ఇప్పటికైనా తెలుసుకోవాలని యనమలకు నెహ్రూ సూచించారు. తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌ను విమర్శించడమే ఆంధ్రప్రదేశ్ మంత్రులు పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. తమ నాయకుడిపై సదరు మంత్రులు హద్దులు మీరి మాట్లాడడం తగదని అన్నారు. టీడీపీ నేతలు సొంత డబ్బా, అలాగే వారి నాటకాలు చూస్తుంటే నవ్వోస్తోందని నెహ్రూ ఈ సందర్భంగా ఎద్దేవా చేశారు. ఎన్నికల నేపథ్యంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తే తామే సన్మానం చేస్తామని టీడీపీ నేతలకు వైఎస్ఆర్ సీపీ ఫ్లోర్ లీడర్ నెహ్రూ సవాల్ విసిరారు. రైతులు, డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చి.. అధికారంలోకి వచ్చాక చంద్రబాబు ప్రభుత్వం వంచనకు పాల్పడుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఈ నేపథ్యంలో నేటి (గురువారం) నుంచి మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామ గ్రామాన నరకాసుర వధ కార్యక్రమం నిర్వహించాలని వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ బుధవారం పిలుపు నిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామగ్రామాన నరకాసుర వధ కార్యక్రమాన్ని వైఎస్ఆర్ సీపీ నిర్వహించింది. -
కాంట్రాక్టు ఉద్యోగులు మీకు పట్టరా?