రాజీనామాకు నేను సిద్ధం: జానారెడ్డి | TPCC cheif, Floor leader Janareddy says ready to resign, MLAs opposed in meeting at Gandhi Bhavan | Sakshi
Sakshi News home page

రాజీనామాకు నేను సిద్ధం: జానారెడ్డి

Published Wed, Jun 15 2016 7:21 PM | Last Updated on Tue, Oct 30 2018 5:17 PM

రాజీనామాకు నేను సిద్ధం: జానారెడ్డి - Sakshi

రాజీనామాకు నేను సిద్ధం: జానారెడ్డి

హైదరాబాద్: ప్రతిపక్ష నేత పదవికి రాజీనామా చేసేందుకు తాను సిద్ధమని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి అన్నారు. గాంధీభవన్‌లో తెలంగాణ కాంగ్రెస్ సమన్వయ కమిటీ సమావేశంలో వాడివేడి చర్చ జరిగింది. దాదాపు 5 గంటల పాటు కొనసాగిన ఈ సమావేశంలో రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడంపై చర్చించారు. రూ.5 భోజనం బాగుందంటూ జానారెడ్డి చేసిన వ్యాఖ్యలను సర్వే మరోమారు లేవనెత్తారు. దీనిపై స్పందించిన జానా పదేపదే అదే విషయాన్ని లేవనెత్తడం సరికాదని అన్నారు. పార్టీని బలపరచడంలో జానా దూకుడుగా లేరని సర్వే ఆరోపించారు. ఆ సమయంలోనే.. ప్రతిపక్ష నేత పదవికి రాజీనామా చేయడానికి తాను సిద్ధమని జానారెడ్డి చెప్పడంతో రాజీనామా అవసరం లేదని, పదవీలోనే కొనసాగాలని ఎమ్మెల్యేలు కోరారు.

కాగా, సమావేశంలో షబ్బీర్ అలీ, సర్వేల మధ్య కూడా స్వల్ప వాగ్వాదం చోటు చేసుకున్నట్లు సమాచారం. దీనిపై దళితుడైన తనను షబ్బీర్ అలీ టార్గెట్ చేస్తున్నారని సర్వే అన్నారు. పబ్లిక్ మీటింగ్ లోనే పార్టీ నాయకత్వ తీరుపై సర్వే వ్యాఖ్యలు చేయడం సరికాదని షబ్బీర్ వ్యాఖ్యానించారు. సమావేశంలో షబ్బీర్ అలీ, సర్వే సత్యనారయణతో పాటు పలువురు పార్టీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement