ready
-
బాలయ్య, మోక్షజ్ఞతో మల్టీ స్టారర్ కు హనుమాన్ డైరెక్టర్ రెడీ..
-
నవంబరు నాటికి రామ్‌లల్లా దర్బారు సిద్ధం!
ఈ ఏడాది నవంబర్ నాటికి అయోధ్య రామాలయ మొదటి అంతస్తు (రామ్‌లల్లా దర్బారు) సిద్ధం కానున్నదని రామమందిర నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా తెలిపారు. సర్క్యూట్ హౌస్‌లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ నిర్ణీత గడువులోగానే రామమందిర నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు. నిర్మాణ పనులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని, టెంపుల్ పార్కు, ఇతర సౌకర్యాల కోసం జరుగుతున్న పనులను పరిశీలించామని మిశ్రా తెలిపారు. ఆలయంలోని మొదటి, రెండో అంతస్తుల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయడంపై దృష్టి సారించామని, రామ్‌లల్లా దర్బారు నవంబర్ నాటికి పూర్తికానున్నదని పేర్కొన్నారు. ఇదిలావుండగా అయోధ్య తీర్థ వికాస్ పరిషత్ ప్రధాన కార్యాలయాన్ని రామనగరిలో నెలకొల్పనున్నారు. అలాగే మున్సిపల్ కార్పొరేషన్, అయోధ్య డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయాల కోసం కొత్త భవనాలను నిర్మించాలనే ప్రతిపాదన కూడా ఉంది. ఆలయ నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని ఆలయ నిర్మాణ బాధ్యతలు చేపట్టిన ఏజెన్సీ టాటా కన్సల్టెన్సీ ఇంజనీర్ ఆనంద్ మెహతా తెలిపారు. మార్చి నెలాఖరులోగా కాశీ-అయోధ్య మధ్య హెలికాప్టర్ సర్వీసు ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ రెండు ప్రాంతాల మధ్య దూరాన్ని కేవలం 55 నిమిషాల్లోనే పూర్తిచేయవచ్చు. ఒక్కో ప్రయాణికునికి ఛార్జీ రూ.14,159 చొప్పున వసూలు చేయనున్నారు. ఒక ట్రిప్పులో ఐదుగురు ప్రయాణించే అవకాశం ఉండనుంది. ఈ హెలికాప్టర్ సేవలను ఉత్తరాఖండ్‌కు చెందిన రాజాస్ ఏరోస్పోర్ట్ అండ్ అడ్వెంచర్ ప్రైవేట్ లిమిటెడ్ అందించనుంది. -
తొలి వేద గడియారం సిద్ధం.. అందుబాటులోకి ఎప్పుడంటే..
ప్రపంచంలోనే మొట్టమొదటి వేద గడియారం మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో రూపొందింది. దీనిని మార్చి ఒకటిన ప్రధాని నరేంద్ర మోదీ, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ సంయుక్తంగా కాళిదాస్ అకాడమీలో ప్రారంభించనున్నారు. వేద గడియారానికి సంబంధించిన ఇన్స్టలేషన్, టెస్టింగ్ వర్క్ పూర్తయింది. భారత ప్రామాణిక సమయాన్ని ఈ వేద గడియారంలో చూడవచ్చు. ఈ గడియారంలో ఒక గంట అంటే 48 నిమిషాలు. ఈ గడియారం వేద సమయంతో పాటు వివిధ ముహూర్తాలను కూడా చూపిస్తుంది. ఉజ్జయినిలో క్రేన్ సాయంతో దాదాపు 80 అడుగుల ఎత్తులో వాచ్ టవర్ పై దీనిని అమర్చారు. దీనిని ప్రధాని నరేంద్ర మోదీ మార్చి ఒకటిన ప్రారంభించనున్నారు. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి డిజిటల్ వాచ్ కానుంది. ఇది భారతీయ ప్రామాణిక సమయం (ఐఎస్టీ), గ్రీన్విచ్ మీన్ టైమ్ (జీఎంటీ) మాత్రమే కాకుండా పంచాంగంతో పాటు ముహూర్తాల గురించిన సమాచారాన్ని అందిస్తుంది. సూర్యోదయం, సూర్యాస్తమయాలే కాకుండా సూర్య , చంద్ర గ్రహణాల గురించి కూడా తెలియజేస్తుంది. కాగా వేద క్లాక్ రీడింగ్ కోసం మొబైల్ యాప్ రూపొందించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనిని స్మార్ట్‌ఫోన్, కంప్యూటర్, టెలివిజన్ తదితర పరికరాలలో వినియోగించే అవకాశం త్వరలో అందుబాటులోకి రానుంది. ఈ వేద గడియారాన్ని వ్యవస్థాపించేందుకు ఉజ్జయినిలోని జివాజీ అబ్జర్వేటరీ సమీపంలో 85 అడుగుల ఎత్తైన టవర్‌ను నిర్మించారు. -
అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠ.. ఇండోర్‌లో కోటి దీపాలు!
యూపీలోని అయోధ్యలో జనవరి 22న నూతన రామాలయంలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ జరగనుంది. సరిగ్గా అదే సమయానికి మధ్యప్రదేశ్ ఆర్థిక రాజధాని ఇండోర్‌లో స్థానికులు 1.11 కోట్ల దీపాలను వెలిగించనున్నారు. రామమందిరంలో ప్రాణప్రతిష్ఠ జరగనున్న సందర్భంగా స్థానికంగా నిర్వహించబోయే కార్యక్రమాల గురించి రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కైలాష్ విజయవర్గీయ విలేకరులకు తెలియజేశారు. అయోధ్య రామాలయంలో శ్రీరాముని ప్రతిష్ఠాపన సందర్భంగా జనవరి 22న ఇండోర్‌లో 1.11 కోట్ల దీపాలు వెలిగించనున్నామన్నారు. ప్రజాప్రతినిధులతోపాటు సమాజంలోని వివిధ వర్గాల ప్రజలు ఈ కార్యక్రమంలో భాగస్వాములవుతారన్నారు. అయోధ్యలో ఉత్సవాల సందర్భంగా ఇండోర్ నగరంలోని 31 వేల మంది పాఠశాలల విద్యార్థులకు చిత్రలేఖన పోటీలు నిర్వహించి, గిన్నిస్‌బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో ఈ ఘనత నమోదు చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. రామునితో పాటు అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామాలయం ఇతివృత్తం ఆధారంగా ఈ పెయింటింగ్ పోటీ ఉంటుందని తెలిపారు. ఇదిలావుండగా అయోధ్యలోని నూతన రామాలయ ప్రాంగణాన్ని అలంకరించేందుకు భోపాల్ నుంచి ప్రత్యేక రకాల పూలను తరలిస్తున్నారు. -
ఎన్నికలకు పోలీసులు సిద్ధం
వరంగల్: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నారని సీపీ అంబర్ కిషోర్ ఝా అన్నారు. సోమవారం రాత్రి కమిషనరేట్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎన్నికల నిర్వహణపై ఆయన మాట్లాడారు. ఇప్పటికే కమిషనరేట్ పరిధిలో రూ.1.23 కోట్ల విలువైన విదేశీ, దేశీయ మద్యం, బెల్లం, గంజాయిని సీజ్ చేసినట్లు తెలిపారు. ఎన్నికల నిబంధనల ప్రకారం.. నిషేధితాలను, అనుమానం ఉన్న అన్నింటినీ సీజ్ చేస్తామని పేర్కొన్నారు. ప్రజలు రూ.50 వేలకు మించి వెంట ఉంచుకోరాదని, నగదును దగ్గర ఉంచుకుంటే దానికి సంబంధించి తగిన ఆధారాలు కలిగి ఉండాలని లేదంటే డబ్బులను ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు సీజ్ చేస్తారని తెలిపారు. 10 డైనమిక్ చెక్‌పోస్ట్‌లు.. ఎన్నికల సందర్భంగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌పై ప్రత్యేక దృష్టి సారించి కమిషనరేట్ పరిధిలో 10 డైనమిక్ చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేసినట్లు సీపీ తెలిపారు. ఈ చెక్‌పోస్ట్‌లు ప్రతిరోజూ ఒక చోటి నుంచి మరో చోటికి మారుతాయని, దీని వల్ల మద్యం డబ్బులతో పాటు ఇతర వస్తువులు సరఫరా చేసే వ్యక్తులను సులభంగా పట్టుకోవచ్చని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఓటర్లను మభ్యపెట్టేలా వివిధ పార్టీల నేతలు నిబంధనలకు విరుద్ధంగా పంపిణీ చేస్తే ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు సీజ్ చేస్తాయన్నారు. ఎన్నికల నిర్వహణ బందోబస్తు కోసం వరంగల్ పోలీస్ కమిషనరేట్‌కు ప్రత్యేకంగా 6 పారామిలటరీ కంపెనీలు వస్తున్నాయని పేర్కొన్నారు. వాహనాలకు జీపీఎస్, కెమెరాలు డబ్బు, మద్యం, ఇతరత్రా నజరానాలతో ఓటర్లను ప్రభావితం చేయకుండా నియంత్రించడానికి ఏడు ప్రభుత్వ శాఖల అధికారులతో కలిసి ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈబృందాల్లో పోలీస్ అధికారి నోడల్ ఆఫీసర్‌గా ఉంటారని పేర్కొన్నారు. పోలీసు వాహనాలకు జీపీఎస్ అనుసంధానం చేయడంతో పాటు ఫ్లయింగ్ స్క్వాడ్ వాహనాలకు కెమెరాలు కూడా అనుసంధానం చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు ఫిర్యాదులు, సమాచారాన్ని 1950 నంబర్ ద్వారా తెలియజేయాలని కోరారు. తుపాకీ లైసెన్స్ కలిగిన వ్యక్తులు వాటిని పోలీస్‌స్టేషన్‌లో డిపాజిట్ చేసేలా చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. మావోయిస్టులపై నిఘా.. ప్రస్తుతం వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మావోయిస్టుల ప్రాబల్యం లేనప్పటికీ నిఘా మాత్రం కొనసాగుతోందని సీపీ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి పథకాలు అందాయని, గతంతో పోలిస్తే ప్రస్తుతం మావోయిస్టుల ఉనికి లేదని పేర్కొన్నారు. మారిన పరిస్థితులకు అనుగుణంగా పోలీస్ నిఘా కొనసాగుతుందని పేర్కొన్నారు. -
సీక్వెల్‌కు రెడీ అయిన హిట్ సినిమాలివే!
ఒక కథ హిట్టయితే... ఆ కథని కంటిన్యూ చేస్తే బాగుంటుందని ఆ కథలోని హీరో, ఆ కథని తెరకెక్కించిన దర్శకుడు, తీసిన నిర్మాత, చూసే ప్రేక్షకులు అనుకోవడం సహజం. కానీ ఆ కథను కొనసాగించడానికి స్కోప్ ఉంటేనే ఇంకో కథ రెడీ అవుతుంది. అలా కొనసాగింపుకి ఆస్కారం ఉన్న కొన్ని కథలు రెడీ అయ్యాయి. ఇలా తమిళంలో పదికి పైగా రానున్న చిత్రాల రెండో భాగం విశేషాలు తెలుసుకుందాం. సేనాపతి తిరిగొస్తున్నాడు కమల్‌హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘ఇండియన్’ (‘భారతీయుడు’ – 1996) బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. ఎప్పట్నుంచో ఈ సినిమాకు సీక్వెల్ తీయాలని ప్లాన్ చేస్తున్న శంకర్ 2017లో ‘ఇండియన్ 2’ని ప్రకటించారు. షూటింగ్ సెట్లో జరిగిన ప్రమాదం, నిర్మాణపరంగా నెలకొన్న సమస్యలను అధిగమించుకుని, ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. లైకా ప్రోడక్షన్తో కలిసి ఉదయనిధి స్టాలిన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 1920 నేపథ్యంలో సాగే ‘ఇండియన్ 2’ వచ్చే ఏడాది విడుదల కానుంది. ‘ఆయిరత్తిల్ ఒరువన్ 2’ పోస్టర్ మూడు సీక్వెల్స్‌లో ధనుష్ పుష్కరకాలం క్రితం విడుదలైన ‘ఆయిరత్తిల్ ఒరువన్ (‘యుగానికి ఒక్కడు’ – 2010) సంచలన విజయం సాధించింది. కార్తీ, రీమా సేన్, ఆండ్రియా, పార్తిబన్ లీడ్ రోల్స్ చేయగా, సెల్వ రాఘవన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. కాగా ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘ఆయిరత్తిల్ ఒరువన్ 2’ను ప్రకటించి, హీరోగా తన తమ్ముడు ధనుష్ నటిస్తారని, 2024లో ఈ సినిమాను విడుదల చేసే ప్లాన్‌లో ఉన్నామని తెలిపారు సెల్వ రాఘవన్. ఇంకా ఈ సినిమా చిత్రీకరణ ఆరంభం కాలేదు. అలాగే హీరో ధనుష్–దర్శకుడు వెట్రిమారన్ కాంబినేషన్లో వచ్చిన ‘అసురన్’, ‘వడ చెన్నై’ చిత్రాలకు వీరి కాంబినేషన్లోనే సీక్వెల్స్‌కి ప్లాన్ జరుగుతోందని సమాచారం. రెండు సీక్వెల్స్‌లో కార్తీ ‘ఖైదీ’ (2019)గా కార్తీ సూపర్ హిట్టయ్యారు. లోకేశ్ కనగరాజ్ ఈ సినిమాకు దర్శకుడు. ఈ చిత్రానికి సీక్వెల్ తీయాలనుకుంటున్నారు. మరోవైపు పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో కార్తీ హీరోగా నటించిన ‘సర్దార్’ కూడా హిట్ ఫిల్మ్. ‘సర్దార్ 2’ కూడా దాదాపు ఖరారైంది. కార్తీ ప్రస్తుత కమిట్మెంట్స్ పూర్తి కాగానే ‘సర్దార్ 2’ మొదలవుతుంది. ఈలోపు రజనీకాంత్ హీరోగా తెరకెక్కించనున్న చిత్రాన్ని పూర్తి చేసి, ‘ఖైదీ 2’ సీక్వెల్ కథ రెడీ చేస్తారట లోకేశ్. అలాగే భవిష్యత్‌లో ‘జైలర్ 2’, కమల్‌హాసన్‌తో ‘విక్రమ్ 2’, ‘బీస్ట్ 2’ చిత్రాలను తెరకెక్కించే ఆలోచన కూడా లోకేశ్ కనగరాజ్‌కి ఉందట. ‘తుప్పరివాలన్’లో విశాల్ మళ్లీ డిటెక్టివ్.. విశాల్ కెరీర్లో ఉన్న ఓ డిఫరెంట్ హిట్ ఫిల్మ్ ‘తుప్పరివాలన్’ (‘డిటెక్టివ్’ – 2017). మిస్కిన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో హిట్ సాధించింది. ఆ తర్వాత విశాల్, మిస్కిన్‌ల కాంబినేషన్లోనే ‘డిటెక్టివ్’కు సీక్వెల్‌గా ‘డిటెక్టివ్ 2’ను ప్రకటించారు. నిజానికి ‘డిటెక్టివ్ 2’ ఈపాటికే విడుదల కావాల్సింది. కానీ ఈ సీక్వెల్ స్క్రిప్ట్, బడ్జెట్ విషయాల్లో విశాల్‌కు, మిస్కిన్కు భేదాభిప్రాయాలు తలెత్తడంతో ‘డిటెక్టివ్ 2’ షూటింగ్ నిలిచిపోయింది. ‘డిటెక్టివ్ 2’కు తానే దర్శకత్వం వహించి, నటిస్తానని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు విశాల్. ఈ సినిమా షూటింగ్ ప్రధానంగా విదేశాల్లో జరగనుంది. ‘తని ఒరువన్’లో నయనతార, ‘జయం’ రవి ఎనిమిదేళ్ల తర్వాత... ‘జయం’ రవి కెరీర్లో ‘తని ఒరువన్’ (ఈ సినిమా తెలుగు రీమేక్ ‘«ధృవ’లో రామ్‌చరణ్ హీరోగా నటించారు) బ్లాక్‌బస్టర్. ‘జయం’ రవి అన్నయ్య, దర్శకుడు మోహన్ రాజా ఈ సినిమాను తెరకెక్కించారు. 2015లో విడుదలైన ఈ సినిమాలో నయనతార హీరోయిన్గా నటించారు. ఈ సినిమాకు సీక్వెల్‌ను తెరకెక్కించాలని ఎప్పట్నుంచో ప్రయత్నిస్తున్నారు మోహన్ రాజా. ఫైనల్‌గా ‘తని ఒరువన్’ విడుదలై, ఎనిమిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ఏడాది ఆగస్టు 28న సీక్వెల్‌ను ప్రకటించారు. తొలి భాగంలో నటించిన ‘జయం’రవి, నయనతారలే మలి భాగంలోనూ నటిస్తారు. వచ్చే ఏడాది ఈ సినిమా షూటింగ్ ఆరంభం కానుంది. ‘మాయవన్’లో సందీప్ కిషన్ మరో మాయవన్ ఐదేళ్ల క్రితం సందీప్ కిషన్ హీరోగా సీవీ కుమార్ దర్శకత్వంలో ‘మాయవన్’ అనే సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ రూపొందిన విషయం గుర్తుండే ఉంటుంది. ఈ సినిమాకు మంచి ఆదరణ లభించింది. ఇప్పుడు ‘మాయవన్’కు సీక్వెల్‌గా ‘మాయవన్ 2’ తీస్తున్నారు మేకర్స్. సందీప్ కిషన్, సీవీ కుమార్ కాంబినేషన్లోనే ఈ చిత్రం రూపొందుతోంది. ‘సార్పట్ట’లో ఆర్య పరంపర కొనసాగుతోంది టెడ్డీ, సార్పట్ట పరంపర.. ఆర్య కెరీర్లో ఈ రెండూ సూపర్‌హిట్ సినిమాలే. అయితే ఈ రెండు చిత్రాలూ డైరెక్ట్‌గా ఓటీటీలోనే విడుదల అయ్యాయి. అయితే ఈ రెండు సినిమాల సీక్వెల్స్‌ను మాత్రం వెండితెరపైనే చూపించనున్నారు. ‘సార్పట్ట పరంపర’కు దర్శకత్వం వహించిన పా. రంజిత్‌తోనే ఇటీవల ‘సార్పట్ట పరంపర 2’ను ప్రకటించారు ఆర్య. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ఆరంభం కానుంది. ఇక దర్శకుడు శక్తి సౌందర్ రాజన్తోనే ‘టెడ్డీ’ సినిమా సీక్వెల్‌ను ఆర్య ప్లాన్ చేస్తున్నారని కోలీవుడ్ సమాచారం. ‘7/జి...’లో రవికృష్ణ బృందావన కాలనీ ప్రేమ దాదాపు 20 ఏళ్ల క్రితం వచ్చిన ‘7/జి బృందావన కాలనీ’ (2004) యూత్‌ని బాగా ఆకట్టుకున్న విషాద ప్రేమకథ. సెల్వ రాఘవన్ దర్శకత్వంలో రవికృష్ణ, సోనియా అగర్వాల్ జంటగా నటించిన ఈ చిత్రం సూపర్ హిట్. కాగా, ‘7/జి బృందావన కాలనీ’కి సీక్వెల్ ప్లాన్ చేశారు సెల్వ రాఘవన్. తొలి భాగంలో హీరోగా నటించిన రవికృష్ణ మలి భాగంలోనూ నటిస్తారు. కథానాయిక పాత్ర కోసం ఇవానా, దర్శకుడు శంకర్ కుమార్తె అదితీ శంకర్ పేర్లను పరిశీలిస్తున్నారట. తొలి భాగాన్ని నిర్మించిన ఏఎమ్ రత్నం సీక్వెల్‌ని కూడా నిర్మించనున్నారు. జిగర్తాండ 2 కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద 2014లో విడుదలైన సినిమాల్లో హిట్‌గా నిలిచినవాటిలో ‘జిగర్తాండ’ ఒకటి. సిద్ధార్థ్, బాబీ సింహా, లక్ష్మీ మీనన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘జిగర్తాండ డబుల్ ఎక్స్’ తెరకెక్కింది. రాఘవా లారెన్స్, ఎస్జే సూర్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా దీపావళి సందర్భంగా విడుదల కానుంది. జెంటిల్‌మేన్ మారారు దర్శకుడు శంకర్ తెరకెక్కించిన తొలి చిత్రం ‘జెంటిల్‌మేన్’ (1993). యాక్షన్ కింగ్ అర్జున్ హీరోగా నటించారు. ఈ చిత్ర నిర్మాత కేటీ కుంజుమోన్ ఇటీవల ‘జెంటిల్ మేన్ 2’ని ్రపారంభించారు. అయితే ఈ సీక్వెల్‌కి దర్శకుడు, హీరో మారారు. ఏ. గోకుల్ కృష్ణ దర్శకత్వంలో చేతన్ శ్రీను హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి ఎమ్ఎమ్ కీరవాణి సంగీత దర్శకుడు.అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో అరుళ్ నిధి హీరోగా రూపొందిన ‘డిమాంటీ కాలనీ’కి సీక్వెల్ వీరి కాంబినేషన్లోనే రానుంది. ఇంకా సీక్వెల్ లిస్ట్‌లో మరికొన్ని చిత్రాలు ఉన్నాయి. -
వందేభారత్ స్లీపర్ కోచ్‌లు వస్తున్నాయోచ్..!
ఢిల్లీ: స్వదేశీ సెమీ హైస్పీడ్ వందేభారత్ రైళ్లను ప్రవేశపెట్టి దేశరవాణాలో అరుదైన మైలురాయిని చేరిన విషయం తెలిసిందే. తాజాగా మరో ముందడుగు వేస్తోంది భారత రైల్వేశాఖ. వందేభారత్ రైళ్లలో స్లీపర్ కోచ్‌లను ప్రవేశపెట్టనుంది. 2024 నుంచి ఆ రైళ్లు పట్టాలెక్కనున్నాయి. ఈ విషయాన్ని రైల్వే మంత్రి అశ్విణీ వైష్ణవ్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. స్లీపర్ కోచ్‌ల ఫొటోలు షేర్ చేశారు. Concept train - Vande Bharat (sleeper version) Coming soon… early 2024 pic.twitter.com/OPuGzB4pAk — Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) October 3, 2023 వందేభారత్ స్లీపర్ కోచ్‌లు ప్రస్తుతం ఉన్న సౌకర్యాల కంటే ఎన్నో అధునాతన ఫీచర్లను కలిగి ఉన్నాయి. నిద్రించడానికి సౌకర్యవంతమైన పడకలు, ఆకర్షణీయమైన ఇంటీరియర్ డిజైన్, విశాలమైన టాయిలెట్స్, ప్రపంచ స్థాయి అడ్వాన్స్డ్ సేఫ్టీ ఫీచర్లు ఈ కోచ్‌లలో ఉన్నాయి. ఈ స్లీపర్ కోచ్ వందేభారత్ మరింత శక్తివంతమైన, పర్యావరణ అనుకూలంగా ఉండనుంది. 'మేక్ అన్ ఇండియా' ప్రోగ్రామ్‌లో భాగంగా చెన్నై ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో ఈ వందేభారత్ రైళ్లను తయారు చేస్తున్నారు. మొదటి రైలును 2019 ఫిబ్రవరి 15న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఢిల్లీ-వారణాసి రైలు ప్రారంభం అయింది. దేశంలో ఎంత దూరంలో ఉన్న ప్రాంతాన్నైనా వందేభారత్ రైళ్ల రాకతో గంటల వ్యవధిలోనే సౌకర్యవంతంగా ప్రయాణికులు చేరుతున్నారు. ఇదీ చదవండి: చైనా నుంచి నిధులు.. న్యూస్‌క్లిక్ ఫౌండర్‌కు రిమాండ్ -
దిగేదే ల్యా.. పుష్ప–3
చంద్రయాన్–3 విజయవంతమైన ఆనందంలో ఉండగానే ‘పుష్ప’ చిత్రం జాతీయస్థాయిలో అవార్డ్లు సొంతం చేసుకుంది. ఒకవైపు ‘పుష్ప–2’ షూటింగ్లో ఉండగానే మరోవైపు నెటిజనులు చంద్రయాన్, పుష్ప ఆనందాన్ని మిక్స్ చేస్తూ ఎవరికి వారు ‘పుష్ప–3’ స్టోరీలైన్ రెడీ చేశారు. అందులో ఒకటి... ఆంగ్లపత్రికలో వచ్చిన ‘వై ది గ్లోబల్ రేస్ ఫర్ ది లునార్ సౌత్ పోల్’ అనే వ్యాసాన్ని అనువాదం చేయించి తెలుగులో వింటాడు పుష్ప. చంద్రుడి దక్షిణ ధృవంపై ఉన్న విలువైన ఖనిజాల గురించి విన్న తరువాత గంధపు చెట్లపై పుష్పకు ఆసక్తిపోయింది. ‘కొడితే సౌత్ పోల్ కొట్టాలి. విలువైన ఖనిజాలు కొట్టేయాలి’ అని గట్టిగా డిసైడై పోయాడు. చిత్తూరు జిల్లాకు చెందిన పుష్పరాజ్ చంద్రుడి దక్షిణ ధృవం పైకి చేరుతాడా? అక్కడి ఖనిజాలను సొంతం చేసుకుంటాడా? ఒకవేళ చేసుకుంటే విలన్ భన్వర్ సింగ్ షెకావత్ ఎలా అడ్డుపడుతాడు... అనేది నెటిజనుల ఊహల్లో పుట్టిన పుష్ప–3 స్థూల కథ. -
'చర్చకు సిద్ధమే..' మణిపూర్ అంశంపై ప్రతిపక్షాలకు అమిత్ షా కౌంటర్..
ఢిల్లీ: మణిపూర్‌లో అమానవీయ ఘటనపై పార్లమెంట్ దద్దరిల్లింది. మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనపై తక్షణమే చర్చ జరపాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. పార్లమెంట్ సమావేశాలు గురువారం ప్రారంభమైనప్పటి నుంచి నేటి వరకు సరైన చర్చ జరిగింది లేదు. ప్రతిపక్షాల ఆందోళనలతో సభ వాయిదా పడుతూ వస్తోంది. దీంతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందించారు. మణిపూర్ అంశంపై చర్చకు సిద్ధమమని చెప్పారు. ఈ సున్నితమైన అంశం గురించి దేశ ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. మణిపూర్ అంశంపై చర్చకు సహకరించాలని హోం మంత్రి అమిత్ షా ప్రతిపక్షాలను కోరారు. మణిపూర్ అంశంపై నిజం తెలియాల్సిన అవసరం ఉందని అన్నారు. సభ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు మణిపూర్ అంశంపై మూడు సార్లు సమావేశం వాయిదా పడింది. ఈ రోజు మధ్యాహ్నం 2.30కు సమావేశం ప్రారంభం కాగానే హోం మంత్రి చర్చకు సిద్ధమని తెలిపారు. అయినప్పటికీ అమిత్ షా ప్రసంగానికి అడ్డుపడిన ప్రతిపక్షాలు గందరగోళం చేశారు. దీంతో స్పీకర్ హోం బిర్లా మరోసారి సభను వాయిదా వేయాల్సి వచ్చింది. కొన్నిరోజులుగా అల్లర్లతో రగులుతున్న మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగింపు చేసిన ఘటన యావత్ దేశాన్ని కలవరపెట్టింది. అల్లర్లలో ఇప్పటికే 100 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. రెండు తెగల మధ్య జరుగుతున్న అల్లర్లపై పార్లమెంట్లో చర్చకు ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. అయితే.. రూల్ నెంబర్ 267 ప్రకారం చర్చ జరపాలని ప్రతిపక్షాలు కోరగా.. కేంద్రం మాత్రం 176 కింద చర్చిద్దామని స్పష్టం చేసింది. దీని ప్రకారం 267 కింద ప్రత్యేకంగా సుధీర్ఘమైన చర్చలు జరగాల్సి ఉంటుంది. 176 కింద అయితే.. తక్కువ కాల వ్యవధిలో చర్చను ముగిస్తారు. ఇదీ చదవండి: మణిపూర్ అల్లర్లు: కూతురి ఆచూకీ కోసం ఎదురుచూపులు.. ఆసుపత్రికి ఫోన్ చేస్తే.. -
ప్రపంచం లోనే అతి చిన్న మిర్రర్ లెస్ కెమెరా..!
-
IPL 2024కి రెడీ 41 ఏళ్ళ వయసు ఆయన తగ్గేదేలే ..!
-
నేవి డే వేడుకులకు విశాఖ సర్వం సిద్ధం
-
కరోనా వ్యాక్సిన్ ‘రెడీ టూ యూజ్’ : రష్యా మంత్రి
మాస్కో: కరోనా వైరస్ వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నాల్లో వేగంగా కదులుతున్న రష్యా మరో కీలక విషయాన్ని ప్రకటించింది. తమ దేశానికి చెందిన కోవిడ్-19 తొలి వ్యాక్సిన్ వాడకానికి వచ్చే నెలలోనే సిద్ధంగా ఉంటుందని ఉప రక్షణ మంత్రి రుస్లాన్ సాలికోవ్ ప్రకటించారు. మాస్కోకు చెందిన వార్తాపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సాలికోవ్ ఈ విషయం చెప్పారని బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. తమ వ్యాక్సిన్‌కు సంబంధించిన మొదటి, రెండు దశల క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేశామని సాలికోవ్ తెలిపారు. ముఖ్యంగా రెండవ దశ పరీక్షలు విచారణ సోమవారం ముగిసాయనీ, వీరందరూ కరోనావైరస్ నుండి రోగనిరోధక శక్తిని పెంపొందించుకుంటున్నారని, త్వరితంగా కోలుకుంటున్నారని వెల్లడించారు. మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌ను వేలాదిమందిపై త్వరలోనే నిర్వహించనున్నట్టు తెలిపారు. అయితే ఎపుడు మొదలుపెట్టేదీ, టీకా ఉత్పత్తి ఎప్పుడు ప్రారంభమయ్యేదీ ఆయన స్పష్టంగా ప్రస్తావించలేదు. మరోవైపు సాలికోవ్ చేసిన వాదనను రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ అధికారికంగా ధృవీకరించలేదు. వ్యాక్సిన్ పరీక్షలు కొనసాగుతున్నాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించినట్టు మరో నివేదిక ద్వారా తెలుస్తోంది. కాగా మాస్కోలోని ప్రభుత్వ సంస్థ గమలేయ ఇన్స్‌స్టిట్యూట్ అండ్ రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (ఆర్డీఐఎఫ్) సహకారంతో కరోనావైరస్ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్నట్టు రష్యన్ ఆర్మీ ఇటీవల ప్రకటించింది. రష్యా, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో వేలాది మంది వాలంటీర్లతో దశ-3 మానవ క్లినికల్ ట్రయల్స్ ఆగస్టు 3న ప్రారంభం కానున్నాయనీ, టీకా పంపిణీ సెప్టెంబరు నాటికి ప్రారంభమవుతుందని (ఆర్డీఐఎఫ్) అధినేత కిరిల్ దిమిత్రోవ్ గత వారం ప్రకటించిన సంగతి తెలిసిందే. దిమిత్రోవ్ ప్రకారం, దేశీయంగా 30 మిలియన్ మోతాదులను, అంతర్జాతీయంగా170 మిలియన్లను తయారు చేయనుంది. వ్యాక్సిన్ తయారీకి ఐదు దేశాలు అంగీకారం తెలిపాయి. -
పట్టా పండగ.. ఇళ్ల పట్టాలు రెడీ
పేదల దశాబ్దాల కల నెరవేరనుంది. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి రోజున అక్క చెల్లెమ్మలకు నివాసయోగ్యమైన ప్లాట్లు ఇచ్చేందుకు ఇళ్ల పట్టాలు సిద్ధమయ్యాయి. సువిశాలమైన రోడ్లు, విద్యుత్ సౌకర్యం, డ్రెయినేజీ వ్యవస్థతో ప్రైవేట్ లేఅవుట్లను తలపించే ప్లాట్లను సిద్ధం చేశారు. జిల్లాలో ఒకే రోజు 1.32 లక్షల మంది లబ్ధిదారులకు ఏకకాలంలో పట్టాలు అందించడానికి అధికార యంత్రాంగం సర్వశక్తులు ఒడ్డుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల పట్టాల పంపిణీని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న క్రమంలో రెవెన్యూ యంత్రాంగమంతా ప్లాట్లను సిద్ధం చేసే పనిలో బిజీబిజీగా ఉన్నారు. దాదాపు 15 ఏళ్ల తర్వాత రూ.లక్షల విలువైన స్థలాలను, ఇంత ఉదారంగా ప్రతి లబ్ధిదారు కుటుంబంలోని మహిళ పేరుతో రిజిస్ట్రేషన్ చేసి అందజేయనుండడంతో పల్లె నుంచి పట్టణాల వరకు పండగ వాతావరణం కనిపిస్తోంది. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లాలో ఈ నెల 8న ఇళ్ల పట్టాల పంపిణీ పండగ జరగనుంది. ఒకే రోజు పల్లె నుంచి పట్టణాల వరకు 1.32 లక్షల మందికి నివాస స్థలాల పట్టాలు అందజేయనున్నారు. ఇప్పటికే ప్లాట్లు, పట్టాలు సిద్ధం చేశారు. పది నియోజకవర్గాల్లో ఉన్న లబి్ధదారులు వారు నివసిస్తున్న ప్రాంతాల సమీపంలోనే ఇళ్ల పట్టాలు ఇవ్వాలని నిర్ణయించింది. ►ప్రభుత్వ భూమి లేని పక్షాన మార్కెట్ ధర చెల్లించి ప్రైవేట్ భూమిని కొనుగోలు చేసి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వ ఆదేశాలతో జిల్లాలో అనేక చోట్ల విలువైన ప్రైవేట్ భూములను కూడా కొనుగోలు చేసి వెంచర్లుగా మార్చారు. ►ఆ స్థలంలో వెనువెంటనే ఇల్లు కట్టుకునేందుకు వీలుగా రోడ్లు, కాలువలు, విద్యుత్ సౌకర్యాలను ఏర్పాటు చేశారు. ►లే అవుట్లలో 80 శాతం పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. ►జిల్లా వ్యాప్తంగా 3493.8 ఎకరాల భూమి అవసరం ఉండగా ఆ మేరకు భూమిని పూర్తిగా సిద్ధం చేశారు. ►సేకరించిన భూముల్లో 2,450 ఎకరాలు ప్రభుత్వ భూమి కాగా, 950 ఎకరాల ప్రైవేట్ భూములను కొనుగోలు చేశారు. ►3,493 ఎకరాల భూముల్లో 1,407 లేఅవుట్లు వేయడంతో జిల్లాలో ప్రతి గ్రామంలోనూ ఓ లేఅవుట్ ఏర్పాటు అయింది. ►దరఖాస్తులను బట్టి సగటున 3 ఎకరాల విస్తీర్ణం నుంచి 100 ఎకరాల విస్తీర్ణం వరకు వెంచర్లు నిర్మించారు. ►లే అవుట్ ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన గ్రావెల్‌తో చదును చేసి సంబంధిత తహసీల్దార్లు సిబ్బందితో కలిసి మార్కింగ్ నిర్వహించి ప్లాట్లుగా విభజించారు. ►రహదారుల నిర్మాణంతో సహా అన్ని పనులు పూర్తి చేశారు. ►జిల్లాలో ఇప్పటి వరకు ఉదయగిరి, వెంకటగిరి, సూళ్లూరుపేట, ఆత్మకూరు నియోజకవర్గాల్లో భూ సేకరణ పూర్తవడంతో పాటు వెంచర్ల నిర్మాణం కూడా పూర్తి స్థాయిలో జరిగింది. ►మిగిలిన నియోజకవర్గాల్లో భూ సేకరణ పూర్తయి రహదారి నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ►ఈ నెల 7వ తేదీకల్లా నూరు శాతం పూర్తిగా చేసేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. ►ఈ క్రమంలో జాతీయ రహదారి సమీపంలోనూ, రాష్ట్ర రహదారికి సమీపంలోని ఇతర విలువైన భూముల్లో వెంచర్లు నిర్మించారు. అక్కచెరువుపాడులో భారీ లేఅవుట్ ప్రధానంగా జిల్లాలో భారీ లే అవుట్ నెల్లూరు నగర శివారులో రూపు దిద్దుకుంటుంది. మంత్రి అనిల్ కుమార్‌యాదవ్, కలెక్టర్ ఎంవీ శేషగిరిబాబు ప్రత్యేక శ్రద్ధతో నెల్లూరురూరల్ మండలంలోని అక్కచెరువుపాడులో వంద ఎకరాల విస్తీర్ణంలో భారీ లేఅవుట్‌ను సిద్ధం చేశారు. 4,500 ప్లాట్లను సిద్ధం చేశారు. ఇప్పటికే ప్లాట్ల మార్కింగ్ పూర్తి చేసి రహదారి నిర్మాణ పనులను పూర్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా 1.32 లక్షల మంది లబి్ధదారుల్లో అత్యధిక శాతం మంది నెల్లూరు సిటీ, రూరల్ నియోజకవర్గాల నుంచే ఉన్నారు. నెల్లూరు నగరంలో 14,703 మంది, నెల్లూరు రూరల్‌లో 16,319 (నగర పాలక సంస్థ పరిధి వరకు) మంది లబ్ధిదారులు ఉన్నారు. కావలి, ఆత్మకూరు, నాయుడుపేటల్లో భారీ లేఅవుట్లను ఏర్పాటు చేశారు. జిల్లాలో అత్యధిక శాతం లేఅవుట్లు సగటున 20 ఎకరాల పైబడిన విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు. లబ్ధిదారుల జాబితా పెరుగుతుంది జిల్లాలో అర్హులైన లబ్ధిదారుల జాబితా ఇంకా పెరిగే అవకాశం ఉందని జాయింట్ కలెక్టర్ వినోద్ కుమార్ ‘సాక్షి’ ప్రతినిధికి తెలిపారు. గడిచిన 15 రోజుల వ్యవధిలో 25,536 కొత్త దరఖాస్తులు అందాయని, వాటితో కలిపి కేవలం ఇళ్ల పట్టాల వరకే 1.32 లక్షల వరకు ఉందని మరికొంత మంది లబి్ధదారులు పెరిగే అవకాశం ఉందని, ఇందుకు అనుగుణంగా ముందస్తుగా స్థలాలు అవసరమైన చోట గుర్తించి రిజర్వులో పెడతామని చెప్పారు. 8వ తేదీన నూరు శాతం పట్టాల పంపిణీ పూర్తి చేస్తామని తెలిపారు. – వినోద్‌కుమార్, జాయింట్ కలెక్టర్ -
కరోనాపై పోరుకు రైల్వే రెడీ!
సాక్షి, హైదరాబాద్: వచ్చే మరికొద్ది రోజుల్లో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. గత కొన్ని రోజులుగా నిత్యం సగటున 3 వేలకు పైగా కొత్త పాజిటివ్ కేసులు వస్తుండటం, దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో లాక్డౌన్ ఆంక్షలను క్రమంగా సడలిస్తుండటంతో కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరుగుతుందన్న భావన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆసుపత్రులు సరిపోని పరి స్థితి ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉండటంతో ముందు జాగ్రత్త చర్యగా ఐసోలేషన్ వార్డులుగా మార్చిన రైల్వే కోచ్‌లను వాడకానికి వీలుగా సిద్ధం చేస్తోంది. ఈ మేరకు కేంద్ర వైద్య శాఖ డీజీ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలను అప్రమత్తం చేశారు. ఆయా రాష్ట్రాల్లో పెరుగుతున్న కేసులకు తగ్గట్టుగా వినియోగించాల్సిన రైళ్లతో కూడిన తొలి విడత జాబితాను సిద్ధం చేసింది. దేశవ్యాప్తంగా 215 రైల్వే స్టేషన్లలో.. దేశవ్యాప్తంగా తొలి విడతగా 215 రైల్వే స్టేషన్లలో ఐసోలేషన్ వార్డులుగా మార్చిన రైళ్లను సిద్ధంగా ఉంచుతున్నారు. ఈ మేరకు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ రైల్వే శాఖను అప్రమత్తం చేసి, కరోనా రైళ్లను ఉంచాల్సిన స్టేషన్ల వివరాలను అందజేసింది. ఇం దులో భాగంగా తెలంగాణలో సికింద్రాబాద్, కాచి గూడ, ఆదిలాబాద్ స్టేషన్లలో ఒక్కో కరోనా రైలు చొప్పున ఉంచాల్సిందిగా ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్ పరిధిలో కేసుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో 9 స్టేషన్లలో రైళ్లను సిద్ధం చేయాలని సూచించింది. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, పలాస, విజయనగరం, రేణిగుంట, మంత్రాలయం రోడ్డు, కొండాపురం, దిగువమెట్ట స్టేషన్లలో ఈ రైళ్లను అందుబాటులో ఉంచుతోంది. వైద్యులు.. ఆక్సిజన్.. ఇతర పరికరాలు.. పాజిటివ్ కేసు రాగానే సమీపంలో ఉన్న ఆసుపత్రికి వేగంగా తరలించాలి. ఆసుపత్రి అందుబాటులో లేకుంటే ఈ రైల్వే కోచ్‌లను వాడుకోవాలని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ రాష్ట్రాలకు సూచించింది. ఒక రైలులో 22 కోచ్‌లుంటాయి. ప్రతి కోచ్‌లో 9 కూపేలుంటాయి. ఒక కూపేను సిబ్బంది కోసం వదిలేసి మిగతా 8 కూపేలను కరోనా బాధితుల చికిత్సకు కేటాయించారు. ప్రతి కూపేలో రెండు చొప్పున బెడ్లుంటాయి. కోచ్‌లో రెండు టాయిలెట్లు, ఒక స్నానాల గది ఉంటుంది. ప్రతి కోచ్‌లో ఆక్సిజన్ సిలిండర్, విద్యుత్తు వసతి, ఇతర వైద్య పరికరాలు ఉంచాలని రైల్వేను కేంద్ర వైద్య శాఖ కోరింది. ఇప్పటికే ఆ మేరకు ఏర్పాట్లు జరిగాయి. ఈ ప్రత్యేక రైలు ఉన్న స్టేషన్లో ఆక్సిజన్ వసతి ఉన్న అంబులెన్స్‌ను సిద్ధంగా ఉంచాలని రాష్ట్రాలను కోరింది. అందుబాటులో రైల్వే వైద్యులు, సిబ్బంది ఉంటే ఏర్పాటు చేయాలని, లేని చోట రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేయాలని కోరింది. తెలంగాణలో సికింద్రాబాద్‌లో ఏర్పాటు చేసిన రైలులో రైల్వే వైద్యులున్నారు. కాచి గూడ, ఆదిలాబా ద్‌లలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఏపీలో విశాఖ, విజయవాడల్లో మాత్రం రైల్వే వైద్యులుండగా, మిగతా ఏడు చోట్ల రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇక నిరంతరం ఆ రైళ్లలో నీళ్లు అందుబాటులో ఉంచాలి. విద్యుత్ సరఫరాకు ఇబ్బంది లేకుండా చూడాలి, ఐఆర్సీటీసీ ఆధ్వర్యంలో భోజన వసతి కల్పించాలి అని పేర్కొంది. కేసుల సంఖ్య మరింతగా పెరిగితే మరిన్ని స్టేషన్లలో ఇలాంటి రైళ్లను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే దక్షిణ మధ్య రైల్వే 486 కోచ్‌లను సిద్ధం చేసి ఉంచింది. -
గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న వాటిల్లోనే కొంటాం
సాక్షి, హైదరాబాద్: గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న ప్రాజెక్ట్‌లకే నగరవాసులు జై కొడుతున్నారు. 44 శాతం కస్టమర్లు రెడీ టు హోమ్స్‌లో కొనేందుకు లేదా 24 శాతం మంది కనీసం 6 నెలల్లోపు పూర్తయ్యే గృహాల కొనుగోళ్లకే మక్కువ చూపుతున్నారని అనరాక్ కన్జ్యూమర్ సెంటిమెంట్ సర్వే తెలిపింది. నిర్మాణం పూర్తయిన గృహాలకు జీఎస్టీ లేకపోవటమే ఇందుకు ప్రధాన కారణమని సర్వే తెలిపింది. ప్రస్తుతం దేశంలో 2013, అంతకంటే ముందు ప్రారంభమైన గృహాలు సుమారు 5.76 లక్షల వరకుంటాయని అనరాక్ డేటా తెలిపింది. గత రెండేళ్లుగా నగరంలో వాణిజ్య, ఆఫీసు విభాగాల్లో పెద్ద ఎత్తున దేశ, విదేశీ పెట్టుబడులు వచ్చాయి. -
జమ్మూకశ్మీర్ లో ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం
-
సర్వం సిద్ధం
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పదో తరగతి వార్షిక పరీక్షలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. వచ్చే నెల 2వ తేదీ వరకు నిర్ణీత తేదీల్లో ఉదయం 9.30 నుండి మధ్యాహ్నం 12.15గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. ఈ మేరకు కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా బెంచీలు, తాగునీరు, విద్యుత్ తదితర సౌకర్యాల కల్పించిన అధికారులు ఇప్పటికే ఏర్పాట్లను పూర్తి చేశారు పోలీసుస్టేషన్లలో ప్రశ్నపత్రాలు ఎస్సెస్సీ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాలు ఇప్పటికే జిల్లా కేంద్రం నుంచి అన్ని పోలీసుస్టేషన్లకు చేరాయి. ఏ రోజుకారోజు ప్రశ్నపత్రాలను ఉదయం కేంద్రాలకు తీసుకువెళ్లారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పరీక్ష కేంద్రాల్లో మాస్ కాపీయింగ్‌ను కట్టడి చేసేందుకు రెవెన్యూ శాఖ ఉద్యోగులను సిట్టింగ్ స్వా్కడ్గా నియమిస్తున్నారు. గతంలో వీరిని సమస్యాత్మక కేంద్రాల్లో మాత్రమే నియమించేవారు. కానీ ఈసారి అన్ని కేంద్రాల్లో నియమించాలనే ఆదేశాలు జారీ అయ్యాయి. పకడ్బందీ ఏర్పాట్లు గత విద్యాసంవత్సరంలో జిల్లా కేంద్రంలోని టీడీగుట్ట పాఠశాలతో పాటు జిల్లాలోని పలు కేంద్రాల్లో ఇన్విజిలేటర్లే కాపీయింగ్ ప్రోత్సహించారన్న ఆరోపణలు వచ్చాయి. ఈసారి అలా జరగకుండా మాస్‌కాపీయింగ్‌ను పకడ్బందీగా నిర్మూలించేందుకు విద్యా శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటికే 1,200 మంది ఇన్విజిలేటర్లను ఎంపిక చేయగా, 94 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 94 మంది డిపార్ట్ మెంటల్ అధికారులు నియమించారు. అలాగే, 94 మంది సిట్టింగ్ స్క్వాడ్ సభ్యులను నియమించిన అధికారులు ఐదు ఫ్లయింగ్ స్క్వాడ్లు ఏర్పాటుచేశా రు. ఐదుగురు విద్యాశాఖ అధికారులు, ఐదుగురు రెవెన్యూ శాఖ అధికారులతో పాటు ఐదుగురు మం ది పోలీస్‌శాఖ అధికారులతో ఏర్పాటుచేసిన స్క్వాడ్లు ముగ్గురు చొప్పున విడిపోయి తనిఖీ చేపడుతారు. కాపీయింగ్ జరిగితే ఇన్విజిలేటర్లదే బాధ్యత ఏదైనా పరీక్ష కేంద్రంలోని గదిలో మాస్ కాపీయింగ్ జరిగితే ఆ గది ఇన్విజిలేటర్లనే బాధ్యులను చేసేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పరీక్ష కేంద్రంలో పరీక్ష ప్రారంభం కాగానే కాపీయింగ్ జరిగితే తమదే బాధ్యత అంటూ ఇన్విజిలేటర్ లేఖను అధికారులకు సమర్పించాల్సి ఉంటుంది. అయితే, ఈ నిబంధనను ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల బాధ్యులు తప్పుపడుతున్నారు. విద్యార్థులు తెలిసీ తెలియక చేసే తప్పుకు తమను బాధ్యతలను సరైన పద్ధతి కాదని, ఈ నిబంధనను తొలగించాలని డిమాండ్ చేస్తున్నాయి. ప్రశాంతంగా పరీక్షలు రాసేలా ఏర్పాట్లు విద్యార్థులకు ఎలాంటి మానసికమైన ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాసేలా ఏర్పాట్లు చేశాం. నిమిషం నిబంధన, సీసీ కెమెరాలు ఇతర ఏ విధ మైన ఇబ్బందులు ఎదురుకాకుండా చూ స్తున్నాం. గతంలో ఎదురైన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈసారి కేంద్రంలో అవకతవకలు జరిగితే ఇన్విజిలేటర్లనే బాధ్యులుగా చేసే లా ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ఒక్కో గదికి కేటాయించే 25 మంది విద్యార్థులు ఒత్తిడి లోనుకాకుండా, మాస్ కాపీయింగ్‌కు పాల్పడకుండా చూడాల్సిన బాధ్యత ఇన్విజిలేటర్లపై ఉంది. – సోమిరెడ్డి, జిల్లా విద్యాశాఖాధికారి ఎవరి గుర్తింపు లేకుండా హాల్‌టికెట్లు.... కొన్ని ప్రైవేట్ విద్యాసంస్థలు ఫీజు చెల్లించలేదనే కారణంగా హాల్‌టికెట్లు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడం తెలిసిం దే. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసు కున్న ప్రభుత్వం నేరుగా ఆన్లైన్ పద్ధతి లో హాల్‌టికెట్లు అందించే పద్ధతికి శ్రీకా రం చుట్టింది. హెచ్ఎం, ఇతర అధికారుల సంతకం లేకుండానే విద్యాశాఖ వెబ్సైట్ ద్వారా తీసుకున్న హాల్‌టికెట్‌తో పరీక్షకు హాజరయ్యే వెసలుబాటు కల్పించారు. అంతేకాకుండా నిరుపేద విద్యార్థులు ఇబ్బంది పడకుండా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణానికి అనుమతించనున్నారు. హాల్‌టికెట్ చూపించి బస్సులో ప్రయాణించొచ్చు. కాగా, జి ల్లాలో కేవలం ఎనిమిది పరీక్ష కేంద్రాల్లో మాత్రమే సీసీ కెమెరాలు ఉన్నాయి. కెమెరాలు తప్పనిసరికాకున్నా.. కెమెరా లు ఉన్న కేంద్రాల్లో విద్యార్థులు ఒత్తిడికి లోననవుతారని చెబుతున్నారు. మొత్తం పరీక్ష కేంద్రాలు 94 పరీక్ష రాయనున్న విద్యార్థులు 21,189 రెగ్యులర్ కేంద్రాలు 90 విద్యార్థులు 20,087 ప్రైవేట్ కేంద్రాలు 04 విద్యార్థులు 1,102 -
ఏపీసెట్‌కు ఏర్పాట్లు పూర్తి
ఎస్కేయూ: అసిస్టెంట్ ప్రొఫెసర్, డిగ్రీ లెక్చరర్ల రిక్రూట్మెంట్ పరీక్షల్లో రాయడానికి గల అర్హత పరీక్ష అయిన ఏపీ సెట్ (ఆంధ్రప్రదేశ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ )– 2017ను ఆదివారం నిర్వహించడానికి అన్ని ఏర్నాట్లు పూర్తి చేసినట్లు రీజనల్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ ఎ. మల్లికార్జునరెడ్డి పేర్కొన్నారు. అనంతపురం నగరంలో 13 సెంటర్లలో నిర్వహించే పరీక్షకు 7,934 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారన్నారు. అన్ని సెంటర్లకు అబ్జర్వర్లు, ముగ్గురు ప్రత్యేక అబ్జర్వర్లను నియమించామన్నారు. ఉదయం 9:30 గంటల నుంచి 12:30 గంటల వరకు, మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పరీక్ష జరుగుతుందన్నారు. మొత్తం 31 సబ్జెక్టులకు పరీక్ష నిర్వహిస్తామన్నారు. అరగంట ముందే పరీక్ష కేంద్రాలకు అభ్యర్థులు చేరుకోవాలన్నారు. ప్రత్యేకమైన పరిస్థితుల్లో పరీక్ష ప్రారంభమైన 20 నిమిషాల్లోపు వరకు అభ్యర్థులను అనుమతిస్తామన్నారు. -
ఈ వారం వ్యవసాయ సూచనలు
తొలకరి ప్రారంభమైంది. సార్వా వరి నారుమళ్ల తయారీకి రైతులు సన్నద్ధమవుతున్నారు. సార్వా పంటలో అధిక దిగుబడులు సాధించాలంటే విత్తన ఎంపిక, నారుమడి తయారీ, ఎరువులు, సస్యరక్షణ చర్యలు మొదలగు విషయాలలో రైతులు ఈ దిగువ మెళకువలు పాటించాలి. విత్తన రకాల ఎంపిక దీర్ఘ, మధ్యస్థ కాలిక రకాలైన స్వర్ణ (ఎంటీయూ-7092), సాంబమసూరి (బీపీటీ-5204), విజేత (ఎంటీయూ-1001), ఇంద్ర (ఎంటీయూ-1061), అమర (ఎంటీయూ-1064), ప్రభాత్ (ఎంటీయూ-3626), పార్థీవ (ఎన్‌ఎల్‌ఆర్-33892), సోనామసూరి (బీపీటీ-3291), శ్రీకాకుళం సన్నాలు (ఆర్బీఎల్-2537), వసుంధర (ఆర్జీఎల్-2538), నెల్లూరు సోనా (ఎన్‌ఎల్‌ఆర్-3041), స్వర్ణముఖి (ఎన్‌ఎల్‌ఆర్-145), పుష్యమి (ఎంటీయూ-1075) సార్వాకు అనువైన రకాలు. విత్తన శుద్ధి విత్తనం ద్వారా పంటకు తెగుళ్లు సోకకుండా కాపాడుకునేందుకు విధిగా విత్తన శుద్ధి చేయాలి. ఒక కిలో పొడి విత్తనానికి 3 గ్రాములు లేదా లీటరు నీటికి 1 గ్రాము కార్బెండిజమ్ కలిపిన ద్రావణంలో విత్తనాన్ని 24 గంటలు నానబెట్టాలి. తరువాత 24 గంటలు మండె కట్టి మొలకెత్తిన విత్తనాన్ని నారుమడిలో చల్లాలి. మరిన్ని వివరాలకు మీ జిల్లాలోని ఏరువాక కేంద్రం కో-ఆర్డినేటర్ లేదా కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ కో-ఆర్డినేటర్‌ను సంప్రదించగలరు. రైతులు మరిన్ని సలహాల కోసం టోల్‌ఫ్రీ నంబర్ 1800-425-430కు ఫోన్ చేయవచ్చు. డాక్టర్. కె.రాజారెడ్డి, విస్తరణ సంచాలకులు, ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, గుంటూరు -522 509 -
4.01 లక్షల క్వింటాళ్ల విత్తన వేరుశనగ కేటాయింపు
క్వింటాల్ రూ.7,700! అనంతపురం అగ్రికల్చర్ : త్వరలో ప్రారంభం కానున్న ఖరీఫ్ సీజన్లో పంట సాగు చేసే రైతులకు రాయితీపై పంపిణీ చేయడానికి వీలుగా జిల్లాకు 4,01,881 క్వింటాళ్ల విత్తన వేరుశనగ కేటాయించారు. మొదట 3.50 లక్షల క్వింటాళ్లు కేటాయించారు. ఇటీవల రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు ఒక్కో రైతుకు మూడు బస్తాలకు బదులు నాలుగు బస్తాలు ఇస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో అదనంగా 51,881 క్వింటాళ్లు కేటాయించారు. దీంతో సేకరణ ఏజెన్సీలు, మండలాల వారీగా కేటాయింపుల్లోనూ మార్పులు చేశారు. ఏపీ సీడ్స్‌కు 1.72 లక్షల క్వింటాళ్లు, మార్క్‌ఫెడ్‌కు 60 వేలు, ఆయిల్‌ఫెడ్‌కు 69 వేలు, వాసన్ ఎన్జీవోకు 80 వేలు, నేషనల్ సీడ్ కార్పొరేషన్ (ఎన్ఎస్సీ)కు 20 వేల క్వింటాళ్ల విత్తనకాయలను సేకరించి, నిల్వ చేసే బాధ్యత అప్పగించారు. ఇందులో ఇప్పటికే 3.50 లక్షల క్వింటాళ్ల వరకు సేకరించి గోదాముల్లో నిల్వ చేసినట్లు జిల్లా వ్యవసాయ సంయుక్త సంచాకుల (జేడీఏ) కార్యాలయ వర్గాలు తెలిపాయి. కొత్తగా వచ్చిన ఎన్ఎస్సీ సంస్థకు శెట్టూరు, కుందుర్పి, పుట్టపర్తి మండలాలకు వేరుశనగ సరఫరా బాధ్యతలు అప్పగించారు. వాసన్ సంస్థకు తనకల్లు మండలం ఇచ్చారు. మిగతా 59 మండలాలకు ఏపీ సీడ్స్, మార్క్‌ఫెడ్, ఆయిల్‌ఫెడ్ సరఫరా చేస్తాయి. అలాగే విత్తన పంపిణీ ఏజెన్సీలను 45 మండలాల్లో గుర్తించగా, మిగిలిన వాటిలోనూ రెండు,మూడు రోజుల్లో పూర్తి చేయనున్నారు. క్వింటాల్ రూ.7,700 ! విత్తన వేరుశనగ ధరలు, రాయితీలను ప్రభుత్వం ఖరారు చేసినట్లు వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. క్వింటాల్ వేరుశనగ పూర్తి ధర రూ.7,700గా నిర్ణయించినట్లు సమాచారం. ఇందులో 33.3 శాతం రాయితీ రైతులకు వర్తింపజేసే అవకాశం ఉంది. అంటే రైతు వాటాగా క్వింటాల్‌కు రూ.5,135 చెల్లించాల్సి ఉంటుంది. ఈ వివరాలను ప్రభుత్వం రెండు రోజుల్లో అధికారికంగా ప్రకటించవచ్చని జేడీఏ కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఆ తర్వాత బయోమెట్రిక్ పద్ధతిలో విత్తన పంపిణీ చేపట్టడానికి వీలుగా తేదీలను ఖరారు చేయనున్నారు. -
సీనియర్ టెకీలపై వేటుకు భారీ కసరత్తు
బెంగళూరు: ఐటీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సంక్షోభం ఫలితాలు క్రమంగా వెలుగులోకి వస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఐటి రంగంలో ఆటోమేషన్, డిజిటల్ టెక్నాలజీల కారణంగా పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు గల్లంతయ్యే ప్రమాదం మరింత వేగంగా దూసుకొస్తోంది. ఇండియాలో ఈ పరిస్థితి మరికాస్త తీవ్రంగా ఉంది. ఈ ప్రమాదం అటు ఉన్నతస్థానాల్లో, ఇటు దిగువస్థాయిలో ఉన్న వారందరినీ వెన్నాడుతోంది. దీనికితోడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త హెచ్1 బి వీసా సంస్కరణల నేపథ్యంలో టాప్ ఐటీ సేవల సంస్థలు భారత్ లో తమ ఉద్యోగులపై వేటు వేస్తున్నాయి. మరికొందరిని స్వచ్చంద పదవీ విరమణ ద్వారా ఇంటికి పంపిస్తోంది. ఊహించిన దానికంటేఎక్కువగా సుమారు 150 బిలియన్ డాలర్ల వృద్ధి మందగమనం తోపాటు, ట్రంప్ హైర్ అమెరికన్, బై అమెరికన్ నినాదం ఐటీ సంస్థలను ఈ వైపుగా కదిలిస్తున్నాయని ఎనలిస్టులు విశ్లేషిస్తున్నారు. కాగ్నిజెంట్ ఇటీవల ఆరువేల మంది ఉన్నత స్థాయి ఉద్యోగులను ఇంటికి పంపించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. అగ్రశ్రేణి ఉద్యోగుల్లో 6వేలమంది ఉద్యోగాలను + లేదా దాని మొత్తం శ్రామిక శక్తిలో 2.3శాతం తగ్గించాలని భావిస్తోంది. ఇదే బాటలో మరో అతిపెద్ద సేవల సంస్థ ఇన్ఫోసిస్ కూడా కదులుతోంది. దాదాపు వెయ్యిమంది సీనియర్ ఉద్యోగులను రాజీనామా చేయమని కోరనుందని మార్కెట్ వర్గాల అంచనా. వీరిలో గ్రూపు ప్రాజెక్ట్ డైరెక్టర్లు, ప్రాజెక్ట్ డైరెక్టర్లు , సీనియర్ ఆర్కిటెక్ట్ మరియు ఉన్నత స్థాయి ఉద్యోగులు ఉన్నారు. ఈ స్థాయిల్లో డైరెక్టర్లు, మేనేజర్ల పనితీరు రిపోర్టును ఇన్ఫీ సమీక్షిస్తోంది. మూడు వారాల క్రితం విప్రో సీఈఓ అబిద్ ఆలీ నీమచ్వాల ఇంటర్నెల్ సమావేశాల్లో మాట్లాడుతూ ఆదాయాల వృద్ధి జరగకపోతే, సుమారు 10 శాతం మంది ఉద్యోగులపై వేటు వేసే హెచ్చరికలు జారీ చేశారు. దీంతో ఈ సంస్థలోని ఇంజనీరింగ్ టీం పెద్ద ప్రమాదంలో పడినట్టే. గత ఆర్థిక సంవత్సరంలో విప్రో 1.81 లక్షల ఉద్యోగులను కలిగి ఉంది. ఫ్రెంచ్ ఐటీ సేవల సంస్థ కాప్ జెమిని కూడా సుమారు 9,000 మందిని, లేదా దాదాపు 5శాతం మంది ఉద్యోగులను తొలగించనుంది. వీటిలో ఎక్కువ భాగం 2015లో కాప్ జెమిని కొనుగోలు చేసిన ఐ గేట్ ఉద్యోగులు. అలాగే ముంబైలోని 35మంది వైస్ ప్రెసిడెంట్లు, ఇతర సీనియర్ వైస్ ప్రెసిడెంట్లు, డైరెక్టర్లు మరియు సీనియర్ డైరెక్టర్లను దాదాపు 200 మంది రాజీనామా చేయాలని కాప్ జెమిని ఫిబ్రవరిలో కోరింది. మార్చి 31 నాటికి దీని మొత్తం ఉద్యోగులు 195,800 మంది. ప్రతి సంవత్సరం చేసే సమీక్షలో భాగంగా ఈ తొలగింపులనీ, 2017లో తమ ఉద్యోగుల్లోచాలామందికి అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో శిక్షణనిస్తున్నామని చెబుతున్నప్పటికీ ఉద్యోగులను నిర్దాక్షిణ్యంగా తొలగిస్తున్నతీరుపై ఉద్యోగులు అగ్రహం వ్యక్తం చేశారు. అంతకంతకూ తీవ్రమవుతున్న ధోరణిపై వివిధ కార్మిక సంఘాలతో సంప్రదింపులు జరిపి తదుపరి కార్యాచరణకు సిద్ధపడుతున్నారు. ఐటి సేవలలో మందగమనం కారణంగా వివిధ ఐటి సంస్థలు ఆదాయాలను నష్టపోతున్నది వాస్తవం. ముఖ్యంగా కాగ్నిజెంట్ 20శాతం గ్రోత్‌లో ఈ సంవత్సరం 8-10శాతం మాత్రమే పెరుగుతుందని అంచనా. 2015-16లో 13.3 శాతంగా ఉన్న ఇన్ఫోసిస్ గత ఆర్థిక సంవత్సరంలో 8.3 శాతానికి తగ్గింది. ఈ ఏడాది 6.5 శాతం నుంచి 8.5 శాతానికి పెరగాలని ఆశిస్తోంది. టీసీఎస్ గత సంవత్సరం కేవలం 8.3శాతం మాత్రమే సాధించడం గమనార్హం. -
మళ్లీ భూ దోపిడీకి సిద్దమవుతున్న ఏపీ సర్కార్
-
వన్ టైం సెటిల్మెంట్ చర్చలకు సిద్ధం..!
న్యూఢిల్లీ: బ్యాంకులకు వేల కోట్ల రుణాలను ఎగవేసిన విదేశాలకు పారిపోయిన మద్యం వ్యాపారి విజయ్ మాల్యా ఎట్టకేలకు దిగి వస్తున్నట్టే కనిపిస్తోంది. మాల్యాను విదేశాలనుంచి వెనక్కి రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు, తాజాగా సుప్రీంకోర్టు కూడా సీరియస్‌గా స్పందించడంతో బ్యాంకులతో వన్ టైం సెటిల్ మెంట్‌కు తాను సిద్ధంగా ఉన్నానని శుక్రవారం ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ఈ మేరకు బ్యాంకులతో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నానని ట్వీట్ చేశారు. పబ్లిక్ రంగ బ్యాంకులు వన్ టైం సెటిల్మెంట్ విధానాన్ని పాటిస్తూ ఉంటాయని, ఇలా వందల మంది రుణగ్రహీతలు తమ లోన్లను సెటిల్ చేసుకున్నారన్నారు. మరి తనకు ఎందుకు నిరాకరిస్తున్న మాల్యా ప్రశ్నించారు. గౌరవనీయ సుప్రీంకోర్టులో గణనీయమైన తమ ఆఫర్‌ను పరిగణలోకి తీసుకోకుండా బ్యాంకులు తిరస్కరించాయని ఆరోపించారు. స్వచ్ఛందంగా ఈ వివాద పరిష్కారంపై మాట్లాడటానికి, న్యాయబద్ధంగా సెటిల్ చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నానని మాల్యా ట్వీట్ లో చెప్పారు. ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని, ఈ వివాదానికి ముగింపు పలకాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాదు ఎలాంటి విచారణ లేకుండా ప్రభుత్వం తనపై ఆరోపణలుగుప్పించినప్పటికీ, ప్రతీ ఒక్క కోర్టు ఆర్డర్ ను ఎలాంటి మినహాయింపు లేకుండా అంగీకరించానంటూ పాత పల్లవే మళ్ల అందుకున్నారు. సుప్రీం కోర్టులో అటార్నీ జనరల్ తనపై చేసిన ఆరోపణల్నీ తనకు వ్యతిరేకంగా ప్రభుత్వం వైఖరికి నిదర్శన మన్నారు. కాగా ఉద్దేశపూర్వక రుణ ఎగవేత, పారిశ్రామికవేత్త విజయ్ మాల్యాపై కోర్టు ధిక్కరణ కేసు నమోదుచేయాలని అలాగే డియోజీయో సంస్థ నుంచి పొందిన 40 మిలియన్ డాలర్లను డిపాజిట్ చేసేలా ఆయనపై చర్యలు తీసుకోవాలని దాఖలైన రెండు వేర్వేరు పిటిషన్లపై తీర్పును అత్యున్నత న్యాయస్థానం– సుప్రీంకోర్టు రిజర్వ్ చేసంది. వడ్డీసహా దాదాపు రూ.9,000 కోట్ల రుణాల బకాయిల కేసులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని 17 బ్యాంకుల కన్సార్షియం ఈ పిటిషన్లను దాఖలు చేసింది. గురువారం జరిగిన ఈ కేసు విచారణ సందర్భంగా మాల్యా తరఫు న్యాయవాది సీఎస్ వైద్యనాథన్‌పై సుప్రీంకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. అలాగే ఆస్తుల గురించి సరైన వివరాలనే అందించారా అంటూ జస్టిస్ ఆదర్స్ కుమార్ గోయెల్, యూకే లలిత్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం మాల్యాను ప్రశ్నించింది. అటు బ్యాంకులపైనా కీలక ప్రశ్నల్ని సంధించిన సుప్రీం తీర్పును రిజర్వ్ చేసిన సంగతి తెలిసిందే. -
కోళ్లు - కోట్లు