ఫుట్బాల్ ప్రపంచ కప్కు బ్రెజిల్ రెడీ
సావో పాలో: ఫుట్బాల్ ప్రపంచ కప్ ఆతిథ్యానికి బ్రెజిల్ సన్నద్ధమైంది. ఈ మెగా ఈవెంట్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఫిఫా అధ్యక్షుడు సెప్ బ్లాటర్ చెప్పారు. ప్రపంచ కప్ ఈ నెల 12న ఆరంభకానుంది.
ధర్నాలు, నిరసనల కారణంగా నిర్మాణాలు ఆలస్యం కావడం, బడ్జెట్ పెరిగిపోవడం వల్ల టోర్నీపై ప్రతికూల ప్రభావం చూపుతోందని వార్తలు వస్తున్నాయి. అయితే బ్లాటర్ వీటిని కొట్టి పారేశారు. ప్రపంచ కప్ను బ్రెజిల్ విజయవంతంగా నిర్వహిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నిరసనల గురించి తాను ఆందోళన చెందడం లేదని చెప్పారు. ప్రపంచ కప్ ఆరంభమయ్యాక అంతా సానుకూల వాతావరణ ఏర్పడుతుందని బ్లాటర్ అభిప్రాయపడ్డారు. ఈ ఈవెంట్కు 12 వేదికలను సిద్ధం చేసినట్టు ఫిఫా జనరల్ సెక్రటరీ జెరోమ్ వాల్కె తెలిపారు. 12న జరిగే ఆరంభ మ్యాచ్లో ఆతిథ్య బ్రెజిల్, క్రొయేషియా తలపడనున్నాయి. ఈ మ్యాచ్కు 70 వేల సీటింగ్ సామర్థ్యం ఉన్న ఇటాక్వెరయో స్టేడియం వేదిక కానుంది.