బ్యూనోస్ ఎయిర్స్: ఇప్పటి వరకూ రెండుసార్లు ఫుట్ బాల్ ప్రపంచకప్ టైటిళ్లను గెలిచిన అర్జెంటీనా మరోసారి టైటిల్ గెలుస్తుందని మాజీ కోచ్ డిగో మారడోనా అభిప్రాయపడ్డాడు. ఈ నెల 12 నుంచి బ్రెజిల్ లో ఆరంభమయ్యే ప్రపంచ కప్ ఫుట్ బాల్ టోర్నీలోఅర్జెంటీనా టైటిల్ గెలిచేందుకు ఎక్కువ అవకాశాలున్నాయన్నాడు. 'నేను ఆ సమయంలో వెనుజులా ఛానల్ కు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాను. అందుచేత అర్జెంటీనా ఆడే ఫుట్ బాల్ మ్యాచ్ లను వీక్షించలేను' అని మరోడానా తెలిపాడు. కాగా, ఈ సారి ఖచ్చితంగా అర్జెంటీనా టైటిల్ గెలుస్తుందని తనకు పూర్తిగా నమ్మకం ఉందన్నాడు.
ఇప్పటి వరకూ 19 వరల్డ్ కప్ లు జరగగా.. బ్రెజిల్ మాత్రం అత్యధికంగా ఐదుసార్లు విజేతగా నిలిచి ముందుస్థానంలో ఉంది. తరువాత ఇటలీ నాలుగు సార్లు గెలిచి రెండో స్థానంలో ఉండగా, పశ్చిమ జర్మనీ మూడ టైటిళ్లు గెలిచి మూడో స్థానంలో ఉంది.