Diego Maradona
-
వేలంలో మారడోనా గోల్డెన్ బాల్ ట్రోఫీ
అర్జెంటీనా దివంగత దిగ్గజ ఫుట్‌బాలర్ డీగో మారడోనా 1986లో గెల్చుకున్న ‘గోల్డెన్ బాల్’ ట్రోఫీ వేలానికి రానుంది. జూన్ 6వ తేదీన పారిస్‌లోని అగుటెస్ ఆక్షన్ హౌజ్‌లో మారడోనా గోల్డెన్ బాల్ ట్రోఫీ వేలం జరుగుతుందని, దీనికి కనీస ధరను ఇంకా నిర్ణయించలేదని వేలం నిర్వాహకులు తెలిపారు. మెక్సికో ఆతిథ్యమిచ్చిన 1986 ప్రపంచకప్ లో మారడోనా సారథ్యంలో అర్జెంటీనా విశ్వవిజేతగా నిలిచింది. ఈ టోరీ్నలో మారడోనా ఐదు గోల్స్ చేయడంతోపాటు ఉత్తమ ప్లేయర్‌కు అందించే ‘గోల్డెన్ బాల్’ ట్రోఫీని సాధించాడు. -
భారత్‌లో మారడోనా బ్రాండ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫ్యాషన్ బ్రాండ్ మారడోనా భారత్‌కు ఎంట్రీ ఇస్తోంది. అర్జెంటీనాకు చెందిన ప్రముఖ ఫుట్‌బాల్ క్రీడాకారుడు, దివంగత డీగో మారడోనా పేరుతో ఈ బ్రాండ్‌ను అర్జెంటీనా కంపెనీ సట్వికా ఎస్ఏ ప్రమోట్ చేస్తోంది. మారడోనా బ్రాండ్ కింద స్పోర్ట్స్ గూడ్స్‌తోపాటు ఐవేర్, ఎలక్ట్రానిక్స్, ఫుట్‌వేర్, బెవరేజెస్, పర్ఫ్యూమ్స్, డియోడరెంట్స్ ఇక్కడి మార్కెట్లో మూడు, నాలుగు నెలల్లో రంగ ప్రవేశం చేయనున్నాయి. భారత ప్రత్యేక భాగస్వామిగా బ్రాడ్ఫోర్డ్ లైసెన్స్ ఇండియాను సట్వికా నియమించింది. మారడోనా బ్రాండ్ ఉత్పత్తుల విక్రయానికి ప్రముఖ ఫ్యాషన్ కంపెనీలు, ఈ–కామర్స్ రిటైలర్స్‌తో చర్చిస్తున్నట్టు బ్రాడ్ఫోర్డ్ తెలిపింది. ఫ్యాషన్, లైఫ్‌స్టైల్, కంజ్యూమర్ గూడ్స్, స్పోర్ట్స్ వంటి విభాగాల్లో 60కిపైగా బ్రాండ్స్‌ను బ్రాడ్ఫోర్డ్ భారత్‌లో నిర్వహిస్తోంది. ప్రపంచంలో ప్రముఖ ఫుట్‌బాల్ క్రీడాకారుల్లో ఒకరైన మారడోనా.. 1986 వరల్డ్ కప్ అర్జెంటీనా వశం కావడంలో కీలకపాత్ర పోషించారు. ఆదివారం జరిగిన ఫైనల్స్‌లో ఫ్రాన్స్‌ను ఓడించి 36 ఏళ్ల తర్వాత ప్రపంచ చాంపియన్‌గా అర్జెంటీనా నిలిచిన సంగతి తెలిసిందే. -
పీలేకు గౌరవం.. మారడోనాకు అవమానం!
పీలే, డీగో మారడోనా.. ఇద్దరు దిగ్గజాలే. ఫుట్‌బాల్‌లో తమకంటూ ప్రత్యేక చరిత్రను లిఖించుకున్నారు. ఒకరు బ్రెజిల్‌ను మూడుసార్లు చాంపియన్‌గా నిలిపితే.. మరొకరు అర్జెంటీనాను ఒకసారి విశ్వవిజేతగా నిలపడంలో కీలకపాత్ర పోషించాడు. ఈ ఇద్దరిలో మారడోనా రెండేళ్ల క్రితమే ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టి వెళ్లాడు. ప్రస్తుతం పీలే పెద్ద పేగు క్యాన్సర్‌తో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. ఇటీవలే ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించిందని వార్తలు రావడంతో అభిమానుల్లో ఆందోళన మొదలైంది. కానీ తనకేం కాలేదని.. బాగానే ఉన్నట్లు పీలే స్వయంగా ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొనడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో సోమవారం బ్రెజిల్, దక్షిణ కొరియాల మధ్య ప్రీ క్వార్టర్స్ జరిగింది. ఈ మ్యాచ్‌లో బ్రెజిల్ 4-1 తేడాతో కొరియాను చిత్తు చేసి క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. కాగా ఈ మ్యాచ్‌ను పీలే ఆసుపత్రి నుంచి వీక్షించినట్లు ఆయన కూతురు పేర్కొంది. మ్యాచ్ విజయం కూడా పీలేకు అంకితమిచ్చిన బ్రెజిల్ జట్టు ఆయన తొందరగా కోలుకోవాలని కోరుకుంది. ఇక మ్యాచ్ జరిగిన స్టేడియం 974లో బ్రెజిల్ ఫ్యాన్స్.. పీలే తొందరగా కోలుకోవాలంటూ పెద్ద ఎత్తున బ్యానర్లు, కటౌట్లు ప్రదర్శించారు. బ్రెజిల్ గోల్ కొట్టిన ప్రతీసారి పీలే.. పీలే అంటూ గట్టిగా అరిచారు. అలా పీలేపై తమకున్న గౌరవాన్ని గొప్పగా చాటుకున్నారు. పీలేకు ఎక్కడైతే గౌరవం లభించిందో అక్కడే మారడోనాకు అవమానం జరుగుతుందంటూ మారడోనా కూతురు జియానిన్ని మారడోనా పేర్కొనడం ఆసక్తి కలిగించింది. అయితే అర్జెంటీనా జట్టును తప్పుబట్టలేదు కానీ.. కనీసం మారడోనా గౌరవార్థం ఆయనకు ఒక మ్యాచ్ విజయాన్ని అంకితమిస్తే బాగుండేదని అభిప్రాయపడింది. ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొంది. అయితే మారడోనాను అర్జెంటీనా జట్టు ఎప్పుడు అవమానపరచలేదంటూ ఒక వార్తాసంస్థ తన కథనంలో పేర్కొంది. ఫిఫా వరల్డ్‌కప్‌లో అర్జెంటీనా ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ మ్యాచ్ ప్రారంభమైన పది నిమిషాల తర్వాత మారడోనా సేవలకు గుర్తుగా పాటలు, బ్యానర్లు ప్రదర్శించడం చేస్తున్నారని పేర్కొంది. ఇక పీలే, మారడోనా జెర్సీ నెంబర్లు 10 అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికే అర్జెంటీనా, బ్రెజిల్‌లు క్వార్టర్స్‌లో అడుగుపెట్టాయి. డిసెంబర్ 7న జరిగే క్వార్టర్ ఫైనల్లో అర్జెంటీనా.. నెదర్లాండ్స్‌ను ఎదుర్కోనుండగా.. డిసెంబర్ 9న బ్రెజిల్.. క్రొయేషియాతో అమితుమీ తేల్చుకోనుంది. 💛💚 pic.twitter.com/9CXaglvuHR — FIFA World Cup (@FIFAWorldCup) December 5, 2022 Brazil turned 🆙 the 🔥 in #BRAKOR 💪 Catch the best moments from the 4-1 win over South Korea 📹 Watch @CBF_Futebol in action next 🆚 @HNS_CFF on Dec 9, 8:30 pm 👉🏻 #JioCinema & #Sports18 📺📲#Qatar2022 #FIFAWorldCup #FIFAWConJioCinema #FIFAWConSports18 pic.twitter.com/45n9yL6YIl — JioCinema (@JioCinema) December 6, 2022 View this post on Instagram A post shared by Gianinna Maradona 🧿 (@giamaradona) చదవండి: FIFA WC: జపాన్ను అవమానించిన క్రొయేషియా సుందరి FIFA WC 2022: రొనాల్డో కోసం ఏదైనా.. టాప్‌లెస్‌గా దర్శనం var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5101504615.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
60 ఏళ్ల రికార్డు బద్దలుకొట్టిన ఫ్రాన్స్ ఫుట్‌బాలర్
ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్ నాకౌట్ మ్యాచ్‌లు రికార్డులతో హోరెత్తుతున్నాయి. ఆదివారం రాత్రి జరిగిన ప్రీక్వార్టర్ ఫైనల్లో ఫ్రాన్స్ స్టార్ ప్లేయర్ కిలియన్ ఎంబాపె డబుల్ గోల్స్ తో చెలరేగాడు. ఈ టోర్నీలో అతను ఇప్పటికే ఐదు గోల్స్ కొట్టాడు. గత టోర్నీలో నాలుగు సాధించాడు. దీంతో ఫిఫా వరల్డ్‌కప్స్‌లో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాళ్ల జాబితాలో అర్జెంటీనా దిగ్గజం డీగో మారడోనా,పోర్చుగల్ కెప్టెన్ క్రిస్టియానో రొనాల్డో (చెరో 8 గోల్స్)ను అధిగమించాడు. ప్రస్తుతం అర్జెంటీనా స్టార్ లియోనల్ మెస్సీతో కలిసి సంయుక్తంగా తొమ్మిది గోల్స్‌తో ఉన్నాడు. ఈ రికార్డుతో పాటు బ్రెజిల్ దిగ్గజం పీలే పేరిట 60 ఏళ్లుగా చెక్కు చెదరకుండా ఉన్న మరో రికార్డును సైతం ఎంబాపె బద్దలు కొట్టడం విశేషం. అదేంటంటే.. 24 ఏళ్లలోపే ప్రపంచకప్ టోర్నీల్లో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. తన కెరీర్లో బ్రెజిల్‌కు మూడు ఫిఫా వరల్డ్‌కప్ టైటిల్స్ అందించిన పీలే 24 ఏళ్లలోపు ఏడు గోల్స్ సాధించాడు. ఈ రికార్డు 60 ఏళ్లుగా చెక్కు చెదరకుండా ఉంది. ఇప్పుడు ఎంబాపె 23 ఏళ్లకే తొమ్మిది గోల్స్‌తో కొత్త చరిత్ర సృష్టించాడు. అతనితో పాటు ఒలివర్ గిరౌడ్ కూడా ఓ గోల్ సాధించడంతో ప్రిక్వార్టర్ ఫైనల్లో ఫ్రాన్స్ 3–1తో పోలెండ్ జట్టును ఓడించింది. ఒలివర్ గిరౌడ్ 44వ నిమిషంలో గోల్ సాధించగా.. ఎంబాపె 74, 90 1వ నిమిషాల్లో రెండు గోల్స్ రాబట్టాడు. పోలెండ్ తరఫున రాబర్ట్ లావెండోస్కీ అదనపు సమయం తొమ్మిదో నిమిషంలో ఏకైక గోల్ అందించాడు. 𝐓𝐡𝐞 𝐆𝐨𝐥𝐝𝐞𝐧 𝐁𝐨𝐲 👑@KMbappe stole the ⚡ vs #Poland with a brace putting him level with #Messi on 9 #FIFAWorldCup goals 🙌 🎦 the heroics of #LesBleus' 🌟 & follow #FIFAWorldCup, LIVE on #JioCinema & #Sports18 📺📲#Qatar2022 #FIFAWConJioCinema #FIFAWConSports18 pic.twitter.com/a3FgOTvLHf — JioCinema (@JioCinema) December 4, 2022 ▪️ 23 years old 🌟 ▪️ 9 goals in 11 #FIFAWorldCup games 🎯 ▪️ More goals than #CR7𓃵 & #Maradona 😮 ▪️ Level with #Messi𓃵 @KMbappe is killing it at the #WorldsGreatestShow 📲📺#Qatar2022 #FIFAWConJioCinema #FIFAWConSports18 pic.twitter.com/zFWLsTOdX5 — JioCinema (@JioCinema) December 5, 2022 Kylian Mbappé. 9 World Cup goals in 2 editions. More than legends as Diego Maradona, Cristiano Ronaldo, Suárez, Neymar, Thierry Henry, Rivaldo, Kempes… and more. Same goals as Lionel Messi — but 3 World Cups less than the Argentinian star. …and still counting. He’s 23. pic.twitter.com/YnEJDMHzj3 — Fabrizio Romano (@FabrizioRomano) December 4, 2022 చదవండి: మ్యాచ్ ఓడిపోయి బాధలో ఉంటే బికినీలో అందాల ప్రదర్శన? var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5101504615.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
చరిత్ర సృష్టించిన మెస్సీ.. మారడోనా రికార్డు బద్దలు
అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాలర్ లియోనల్ మెస్సీ చరిత్ర సృష్టించాడు. ఫిఫా వరల్డ్‌కప్స్‌లో అర్జెంటీనా తరపున అత్యధిక గోల్స్ కొట్టిన జాబితాలో మెస్సీ రెండో స్థానానికి చేరుకున్నాడు. ఈ నేపథ్యంలో దిగ్గజం మారడోనా రికార్డును మెస్సీ బద్దలు కొట్టాడు. ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో రౌండ్ ఆఫ్ 16 పోరులో ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో మెస్సీ ఈ ఫీట్ అందుకున్నాడు. ఆట 35వ నిమిషంలో బాటమ్ లెఫ్ట్ కార్నర్ నుంచి గోల్ కొట్టిన మెస్సీ ఈ వరల్డ్‌కప్‌లో మూడో గోల్ సాధించాడు. ఓవరాల్‌గా ఫిఫా వరల్డ్‌కప్స్‌లో 23వ మ్యాచ్ ఆడుతున్న మెస్సీకి ఇది 9వ గోల్ కావడం విశేషం. ఈ క్రమంలో ఫిఫా వరల్డ్‌కప్స్‌లో మారడోనా చేసిన 8 గోల్స్(21 మ్యాచ్‌లు)ను మెస్సీ అధిగమించాడు. అర్జెంటీనా తరపున ఫిఫా వరల్డ్‌కప్స్‌లో అత్యధిక గోల్స్ కొట్టిన ఆటగాడిగా ఆ దేశ దిగ్గజం గాబ్రియెల్ బటిస్టుటా 12 మ్యాచ్‌ల్లో 10 గోల్స్ చేశాడు. ఇక మెస్సీ మరో అరుదైన ఘనత కూడా సాధించాడు. మెస్సీకి ఇది 1000వ మ్యాచ్ కావడం విశేషం. ఓవరాల్‌గా 789 గోల్స్ కొట్టాడు. ఇక ఫిఫా వరల్డ్‌కప్‌లో అర్జెంటీనా క్వార్టర్ ఫైనల్స్‌లో డిసెంబర్ 10న నెదర్లాండ్స్‌తో తలపడనుంది. Cannot quantify #Messi magic with numbers but it's worth a shot 😬 📹 The 🔢 behind that 🤌🏻 ⚽ Watch the @Argentina star LIVE at the #WorldsGreatestShow 👉🏻 #JioCinema & #Sports18 📺📲#Qatar2022 #FIFAWorldCup #FIFAWConJioCinema #FIFAWConSports18 pic.twitter.com/yT6jywFK6f — JioCinema (@JioCinema) December 4, 2022 Scoring beautiful goals & surpassing legends, one at a time ❤️#Messi now has more #FIFAWorldCup goals (9) than legendary Diego Maradona (8) 👏 Watch him dazzle at the #WorldsGreatestShow, LIVE on #JioCinema & #Sports18 📺📲#Qatar2022 #FIFAWConJioCinema #FIFAWConSports18 pic.twitter.com/BO6rcDUhvs — JioCinema (@JioCinema) December 4, 2022 -
మారడోనా, మెస్సీలను మించినోడు.. జెర్సీ నెంబర్-10 ఆ ఆటగాడిదే
ఫుట్‌బాల్‌లో జెర్సీ నెంబర్ 10కి యమా క్రేజ్ ఉంది. దిగ్గజం డీగో మారడోనా ఇదే నెంబర్ జెర్సీతో ఆడి అర్జెంటీనాను విశ్వ విజేతగా నిలిపాడు. అలా మారడోనా జెర్సీ నెంబర్ 10కి ఒక లీగసీని సెట్ చేసి పెట్టాడు. ఇప్పుడు ఆ లెగసీని తన శిష్యుడైన లియోనల్ మెస్సీ కంటిన్యూ చేస్తున్నాడు. అయితే జెర్సీ నెంబర్ 10కి అంత క్రేజ్ రావడానికి మారడోనా, మెస్సీలు కాదు.. వీళ్లకంటే ముందే ఆ జెర్సీని ధరించిన మరో అర్జెంటీనా ఆటగాడు ఉన్నాడు. అతనే మారియో కెంపెస్. 1978లో అర్జెంటీనా ఫిఫా వరల్డ్‌కప్ విజేతగా నిలవడంలో కెంపెస్ పాత్ర కీలకం. ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో అర్జెంటీనా రౌండ్ ఆఫ్ 16కు చేరుకుంది. మెస్సీకి ఇదే చివరి వరల్డ్‌కప్ అని అంతా భావిస్తున్న తరుణంలో అర్జెంటీనాను విజేతగా నిలిపితే చూడాలనుకుంటున్నారు. అయితే మారడోనా, మెస్సీ కంటే ముందే అదే అర్జెంటీనా నుంచి ఒక ఆటగాడు జెర్సీ నెంబర్ 10ని ధరించాడు. ఆ జెర్సీని ధరించడమే కాదు.. అర్జెంటీనాను తొలిసారి ఫిఫా వరల్డ్ చాంపియన్స్‌గా(1978) నిలిపాడు. అతనే మారియో కెంపెస్. 1978 ఫిఫా వరల్డ్‌కప్‌లో అర్జెంటీనా విజేతగా నిలిచిందంటే మారియో కెంపెస్ ప్రధాన కారణం. ఆ టోర్నీలో మొత్తం ఆరు గోల్స్ చేసిన మారియో టాప్ స్కోరర్‌గా నిలిచి గోల్డెన్ బూట్, గోల్డెన్ బాల్ అవార్డులను దక్కించుకున్నాడు. ఫుట్‌బాల్ చరిత్రలో ఈ ఘనత సాధించిన మూడో ఆటగాడిగా మారియో కెంపెస్ నిలిచాడు. ఇక మారియో కెంపెస్ చేసిన ఆరు గోల్స్‌లో అన్ని జంట గోల్స్ కావడం విశేషం. వీటిలో కీలకమైన సెకండ్ రౌండ్, ఫైనల్స్ మ్యాచ్‌లు ఉన్నాయి. అప్పటి వరల్డ్‌కప్‌లో నాకౌట్ దశ లేదు. తొలి రౌండ్, రెండో రౌండ్.. ఆ తర్వాత ఫైనల్ నిర్వహించారు. ఇక రెండో రౌండ్లో గెలిచి టాప్‌లో నిలిచిన రెండు జట్లు నేరుగా ఫైనల్లో అడుగుపెడతాయి. తొలి రౌండ్లో మారియో కెంపెస్ అంతగా ప్రభావం చూపలేదు. అయితే రెండో రౌండ్ నుంచి మాత్రం అతని మాయాజాలం మొదలైంది. రెండో రౌండ్లో పోలాండ్, పెరూతో మ్యాచ్‌ల్లో నాలుగు గోల్స్ చేసిన మారియో జట్టు ఫైనల్ చేరడంలో కీలకపాత్ర పోషించాడు. ఇక నెదర్లాండ్స్‌తో జరిగిన ఫైనల్లోనూ మారియో కెంపెస్ మరోసారి మెరిశాడు. ఆట 38వ నిమిషంలో డచ్ గోల్ కీపర్‌ను బోల్తా కొట్టిస్తూ 12 మీటర్ల దూరం నుంచి అద్బుత గోల్ సాధించాడు. ఆ తర్వాత ఆట అదనపు సమయంలో 105 నిమిషంలో మరో గోల్ చూసి జట్టు స్కోరును రెండుకు పెంచాడు. మరోవైపు నెదర్లాండ్స్ ఒక గోల్‌కే పరిమితం కావడంతో అర్జెంటీనా 2-1 తేడాతో మ్యాచ్‌ను గెలిచి తొలిసారి విశ్వవిజేతగా అవతరించింది. అలా మారియో కెంపెస్ పేరు మార్మోగిపోయింది. అప్పటినుంచే జెర్సీ నెంబర్ 10కి క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత ఇదే జెర్సీని మారడోనా ధరించడం.. 1986లో అర్జెంటీనాను విజేతగా నిలపడం జరిగిపోయాయి. ఇక ఇప్పుడు వీరిద్దరి ట్రెండ్‌ను కొనసాగిసున్న మెస్సీ తన ప్రపంచకప్ కలను తీర్చుకుంటాడో లేదో చూడాలి. ఇక అర్జెంటీనా రౌండ్ ఆఫ్-16లో డిసెంబర్ 4న ఆస్ట్రేలియాతో తలపడనుంది. -
FIFA WC: తండ్రి మారడోనాతో.. కొడుకు మెస్సీతో
అద్భుతాలు అరుదుగా జరుగుతాయంటారు. తాజాగా ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లోనూ ఇలాంటిదే చోటుచేసుకుంది. విషయంలోకి వెళితే.. బుధవారం అర్థరాత్రి దాటిన తర్వాత అర్జెంటీనా, పోలాండ్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో అర్జెంటీనా 2-0 తేడాతో పోలాండ్‌ను ఓడించి ప్రీక్వార్టర్స్‌కు చేరుకుంది. మ్యాచ్‌లో ఓటమి పాలైన రాబర్ట్ లెండోవాస్కీ నేతృత్వంలోని పోలాండ్ కూడా రౌండ్ ఆఫ్ 16కు అర్హత సాధించింది. ఈ విషయం పక్కనబెడితే.. అర్జెంటీనా మ్యాచ్‌లో చేసిన రెండు గోల్స్‌లో ఒకటి జట్టు మిడ్‌ఫీల్డర్ అలెక్సిస్ మెక్ అలిస్టర్ చేశాడు. ఆట 46వ నిమిషంలో అర్జెంటీనాకు గోల్ అందించాడు. ఈ సందర్భంగా జట్టు కెప్టెన్ లియోనల్ మెస్సీ తనకు వచ్చిన మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అలిస్టర్‌కు ఇచ్చేశాడు. దీని వెనుక ఒక కారణం ఉంది. అలెక్సిస్ మాక్ అలిస్టర్ తండ్రి కార్లోస్ మాక్ అలిస్టర్ కూడా ఫుట్‌బాలర్‌గా జట్టుకు సేవలందించాడు. కార్లోస్ దిగ్గజం మారడోనాతో కలిసి అర్జెంటీనాతో పాటు బోకా జూనియర్స్‌కు ప్రాతినిధ్యం వహించడం విశేషం. మారడోనాతో కలిసి తండ్రి కార్లోస్ అలిస్టర్ ఆడితే.. ఇప్పటితరం గొప్ప ఆటగాళ్లలో ఒకడైన లియోనల్ మెస్సీతో కలిసి కొడుకు అలెక్సిస్ మాక్ అలిస్టర్ వేదికను పంచుకున్నాడు. అందుకే మెస్సీ అలెక్సిస్ తండ్రిపై ఉన్న గౌరవంతో అతనికి వచ్చిన అవార్డును అలెక్సిస్‌కు అందించాడు. ఇదే విషయమై అలెక్సిస్ మాక్ అలిస్టర్ స్పందింస్తూ.. ఇది ఎప్పటికి మరిచిపోలేనిది. నా తండ్రి దిగ్గజం మారడోనాతో కలిసి ఆడడం ఒక ఎత్తయితే.. ఇప్పుడు నా ఆరాధ్య దైవం మెస్సీతో కలిసి ఆడడం మరిచిపోలేని అనుభూతి. అతను నాకు ట్రైనింగ్ ఇస్తున్న తీరుకు ఫిదా అయ్యా. అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ప్రీక్వార్టర్స్‌కు చేరుకున్న అర్జెంటీనా డిసెంబర్ 4న ఆస్ట్రేలియాతో ఆడనుంది. అటు పోలాండ్ డిపెండింగ్ చాంపియన్ ఫ్రాన్స్‌తో అమితుమీ తేల్చుకోనుంది. చదవండి: Lionel Messi: 'పైనున్న మారడోనా సంతోషపడి ఉంటాడు' -
Lionel Messi: 'పైనున్న మారడోనా సంతోషపడి ఉంటాడు'
ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో అర్జెంటీనా రౌండ్ ఆఫ్-16కు అర్హత సాధించిన సంగతి తెలిసిందే. బుధవారం అర్థరాత్రి దాటిన తర్వాత పోలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో మెస్సీ బృందం 2-0 తేడాతో ఓడించింది. ప్రీక్వార్టర్స్ చేరాలంటే కచ్చితంగా నెగ్గాల్సిన మ్యాచ్‌లో అర్జెంటీనా సమిష్టి ప్రదర్శనతో ఆకట్టుకుంది. అయితే మ్యాచ్‌లో కచ్చితంగా గోల్ చేస్తాడనుకున్న మెస్సీ విఫలమైనప్పటికి అర్జెంటీనా మిడ్ ఫీల్డర్ అలెక్సిస్ అలిస్టర్(ఆట 46వ నిమిషంలో), ఫార్వార్డ్ ప్లేయర్ జులియన్ అల్వరేజ్(ఆట 67వ నిమిషంలో) గోల్ అందించి జట్టుకు విజయాన్ని అందించారు. ఇక మ్యాచ్ విజయం అనంతరం మెస్సీ మాట్లాడుతూ.. ''ఈరోజు మా ప్రదర్శన చూసి పైనున్న మారడోనా సంతోషపడి ఉంటాడు. ఎందుకంటే మారడోనా నాపై ఎక్కువ ప్రేమను చూపించేవాడు. నాకు అన్నీ అనుకూలంగా జరుగుతున్నాయంటే ఆయనే ఎక్కువ సంతోషపడేవాడు. ఇక తొలి మ్యాచ్‌లో సౌదీ అరేబియా చేతిలో ఓడిపోయి పూర్తిగా ఒత్తిడిలో ఉన్న మేము వరుస రెండు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించడం మా ఆటపై నమ్మకాన్ని పెంచింది. ఓటమి బాధ నుంచి ఎలా బయటపడాలో ముందు నాకు తెలియదు.. ఇప్పుడు నేర్చుకున్నా. ఇక రికార్డులు కూడా నా వెంట రావడం సంతోషంగా ఉంది.'' అంటూ చెప్పుకొచ్చాడు. ఇక స్టార్ ఫుట్‌బాలర్‌గా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న లియోనల్ మెస్సీకి ఇది 999వ మ్యాచ్. అంతేకాదు.. ఫిఫా వరల్డ్‌కప్ టోర్నీలో 22వది. ఈ క్రమంలో అర్జెంటీనా దిగ్గజం డిగో మారడోనా ఉన్న పేరిట రికార్డును మెస్సీ బద్దలు కొట్టాడు. ఫిఫా వరల్డ్‌కప్స్‌లో అర్జెంటీనా తరపున అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా నిలిచాడు. పెనాల్టీ కిక్‌లను కొట్టడంలో మెస్సీకి మంచి రికార్డు ఉంది. ఇప్పటివరకు 39సార్లు మాత్రమే పెనాల్టీని గోల్‌గా మలచడంలో విఫలమయ్యాడు. పోలాండ్‌తో మ్యాచ్‌లో తొలి అర్ధభాగంలో లభించిన పెనాల్టీని మెస్సీ గోల్ పోస్ట్‌లోకి తరలించడంతో విఫలమయ్యాడు. దీంతో అభిమానులు కాస్త నిరాశకు గురయ్యారు. ఇదే సమయంలో పెనాల్టీని గోల్‌గా మలచడంలో ఫెయిల్ అయిన మెస్సీ తనపై తానే అసహనం వ్యక్తం చేశాడు. ✌️😎✌️ - mood across #ARG after qualifying for #Qatar2022 Round of 16 Watch both the strikes from @Argentina's 2-0 win in #POLARG & follow #FIFAWorldCup, LIVE on #JioCinema & #Sports18 📺📲#WorldsGreatestShow #FIFAWConJioCinema #FIFAWConSports18 pic.twitter.com/X5c5ILcAAT — JioCinema (@JioCinema) November 30, 2022 చదవండి: FIFA WC: రికార్డు బద్దలు కొట్టినా.. మెస్సీ అభిమానులకు తప్పని నిరాశ! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5101504615.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
మారడోనా సరసన మెస్సీ.. కళ్లు చెదిరే గోల్ చూడాల్సిందే
ఫిఫా వరల్డ్‌కప్‌లో అర్జెంటీనాకు టైటిల్ అందించడమే లక్ష్యంగా పెట్టుకున్న లియోనల్ మెస్సీ ఆ దిశగా అడుగులేస్తున్నాడు. తొలి మ్యాచ్‌లో తాను గోల్ చేసినప్పటికి సౌదీ అరేబియా చేతిలో చిత్తవ్వడం మెస్సీ బాధించింది. ఈ ఓటమిని జీర్ణించుకోలేక కన్నీటి పర్యంతం అయ్యాడు. అయితే తొలి మ్యాచ్ ఓటమికి కుంగిపోకుండా మరుసటి మ్యాచ్‌లో మెస్సీ అంతా తానై నడిపించాడు. శనివారం అర్థరాత్రి దాటిన తర్వాత మెక్సికోతో జరిగిన మ్యాచ్‌లో అర్జెంటీనా 2-0 తేడాతో విజయం సాధించింది. తొలి అర్థభాగంలో గోల్ రాకపోయేసరికి మ్యాచ్ డ్రా అవుతుందా అని అభిమానులు భయపడ్డారు. కానీ మెస్సీ ఆ అవకాశం ఇవ్వలేదు. ఆట 62వ నిమిషంలో మెస్సీ కళ్లు చెదిరే గోల్‌తో మెరిశాడు. తన సహచర ఆటగాడు అందించిన పాస్‌ను చక్కగా వినియోగించుకున్న మెస్సీ ఎలాంటి పొరపాటు చేయడకుండా లో స్ట్రైక్‌తో బంతిని గోల్‌పోస్ట్‌లోకి పంపించాడు. అలా అర్జెంటీనాకు తొలి గోల్ లభించింది. ఆ తర్వాత 82వ నిమిషంలో ఫెర్నాండేజ్ మరో గోల్ కొట్టడంతో అర్జెంటీనా 2-0తో విజయం సాధించింది. ఏది ఏమైనా మెస్సీ కొట్టిన గోల్ జట్టుకు దైర్యాన్ని ఇవ్వడంతో పాటు విజయం దిశగా నడిపించింది. ఈ క్రమంలోనే మెస్సీ అర్జెంటీనా దిగ్గజం డీగో మారడోనా రికార్డును సమం చేశాడు. ఫిఫా వరల్డ్‌కప్స్‌లో మెస్సీ 8 గోల్స్ చేశాడు. 1982, 1986, 1990,1994లో మారడోనా ఈ గోల్స్ చేశాడు. తాజాగా మెస్సీ మారడోనా గోల్స్ రికార్డును సమం చేశాడు. ఇక ఫిఫా వరల్డ్‌కప్స్‌లో అర్జెంటీనా తరపున అత్యధిక గోల్స్ రికార్డు దిగ్గజం గాబ్రియెల్ బటిస్టుటా పేరిట ఉంది. గాబ్రియెల్ మొత్తంగా 10 గోల్స్ కొట్టాడు. గాబ్రియెల్ రికార్డును బద్దలు కొట్టేందుకు మెస్సీ కేవలం మూడు గోల్స్ దూరంలో మాత్రమే ఉన్నాడు. ఇక అర్జెంటీనా తరపున ఫిఫా వరల్డ్‌కప్‌లో 21వ మ్యాచ్ ఆడుతున్న మెస్సీ ఎక్కువ మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఇక 2014లో రన్నరప్‌గా నిలిచిన అర్జెంటీనా జట్టులో మెస్సీ సభ్యుడిగా ఉన్నాడు. తాజాగా కెప్టెన్‌గా జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. తనకు ఇదే చివరి వరల్డ్‌కప్ అని ఊహిస్తున్న దశలో మెస్సీ ఎలాగైనా ఫిఫా వరల్డ్‌కప్‌ను సాధించి తన కలను సాకారం చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇక అర్జెంటీనా 1978, 1986 ఫిఫా వరల్డకప్స్లో విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. Cometh the ⌛ Cometh the 🐐 💯 ▶ Relive Messi's heroics against #ElTri that kept @Argentina in the #FIFAWorldCup 🙌 Keep watching the #WorldsGreatestShow, only on #JioCinema & @Sports18 📲📺#Qatar2022 #FIFAWConJioCinema #FIFAWConSports18 pic.twitter.com/KQHjSrSDTY — JioCinema (@JioCinema) November 27, 2022 చదవండి: మెస్సీ గురి అదిరింది.. అర్జెంటీనా ప్రీక్వార్టర్స్ ఆశలు సజీవం var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5101504615.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
FIFA: సాకర్ సమరం.. దిగ్గజాలపై కన్ను వేయాల్సిందే
మొత్తం 20 ప్రపంచకప్‌లు... విజేతలుగా నిలిచిన 8 జట్లు ... ఎందరో సూపర్ స్టార్లు తమ ఆటతో అభిమానులను ఉర్రూతలూగించారు. కార్లోస్ ఆల్బర్టో, రోజర్ మిల్లా, బాబీ చార్ల్టన్, థియరీ హెన్రీ, ప్లాటిని, జిదాన్, ఒలివర్ కాన్, క్లిన్స్మన్, లోథర్ మథియాస్, రుడ్ గలిట్, జొహన్ క్రఫ్... ఇలా ఎందరో మైదానంలో బంతితో విన్యాసాలు చేయించారు. కానీ కొందరు మాత్రం వీరందరికంటే కచ్చితంగా పై స్థానంలో ఉంటారు. తమదైన ప్రత్యేకతతో ఆటను శాసించిన వీరు, అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. అలాంటి టాప్–5 వరల్డ్ కప్ స్టార్స్‌ను చూస్తే... - కరణం నారాయణ పీలే (బ్రెజిల్) ఫుట్‌బాల్ పేరు చెప్పగానే అందరికంటే ముందుగా గుర్తొచ్చే ఆటగాళ్లలో పీలే పేరు ఉంటుంది. మూడుసార్లు ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్న ఏకైక ప్లేయర్ పీలేనే కావడం విశేషం. 1958, 1962, 1970లలో బ్రెజిల్ ప్రపంచకప్ గెలవడంలో పీలే ముఖ్యపాత్ర పోషించాడు. స్టార్ ఆటగాళ్లు ఉన్న జట్టులో 17 ఏళ్ల వయసులో తొలి ప్రపంచకప్‌లో చెలరేగిన పీలే మరో 12 ఏళ్ల తర్వాత ఎవరికీ అందనంత ఎత్తుకి తనే ఒక దిగ్గజంగా ఎదిగాడు. కెరీర్ మొత్తంలో నాలుగు ప్రపంచకప్‌లు ఆడిన పీలే మొత్తం 12 గోల్స్ సాధించాడు. డీగో మారడోనా (అర్జెంటీనా) పీలేతో సంయుక్తంగా ‘ఫిఫా ప్లేయర్ ఆఫ్ ద సెంచరీ’గా నిలిచిన ఆటగాడు డీగో మారడోనా. దేశాలతో సంబంధం లేకుండా ఫుట్‌బాల్ అభిమానులందరి హృదయాలు గెల్చుకున్నాడు. 1986 ప్రపంచకప్‌ను అర్జెంటీనాకు సాధించి పెట్టడంతో అతను సూపర్‌స్టార్‌గా ఎదిగిపోయాడు. 1990లో కెప్టెన్‌గా జట్టును ఫైనల్‌కి చేర్చిన అతను 1994 వరల్డ్ కప్ సమయంలో డ్రగ్స్ వాడినట్లుగా తేలింది. నాలుగు ప్రపంచకప్‌లు ఆడి ఎనిమిది గోల్స్ చేసిన మారడోనా ఉజ్వల కెరీర్ ముగిసిన తర్వాత అనేక వివాదాలు చుట్టుముట్టినా... ప్లేయర్‌గా అవి అతని గొప్పతనాన్ని తగ్గించలేవు. ఫ్రాంజ్ బెకన్‌బాయర్ (పశ్చిమ జర్మనీ) జర్మనీ అందించిన ఆల్‌టైమ్ గ్రేట్‌లలో ఒకడు. మూడు ప్రపంచకప్‌లు ఆడిన అతను తన శైలి, నాయకత్వ పటిమతో ‘ది ఎంపరర్’గా పేరు తెచ్చుకున్నాడు. కెప్టెన్‌గా, మేనేజర్‌గా రెండు సార్లు ప్రపంచకప్‌ను అందుకున్న ఇద్దరు ఆటగాళ్లలో బెకన్‌బాయర్ ఒకడు. 1974లో సొంతగడ్డపై కెప్టెన్ హోదాలో బెకన్‌బాయర్ తొలి మ్యాచ్ నుంచే జట్టును విజయ పథంలో నడిపించాడు. ఫైనల్లో జర్మనీ 2–1తో నెదర్లాండ్స్‌ను ఓడించడంలో కీలక పాత్ర పోషించి చరిత్రలో నిలిచిపోయాడు. అనంతరం 1990లో బెకన్‌బాయర్ కోచ్‌గా ఉన్న పశ్చిమ జర్మనీ ప్రపంచకప్‌ను సొంతం చేసుకుంది. గెర్డ్ ముల్లర్ (పశ్చిమ జర్మనీ) ‘ద నేషన్స్ బాంబర్’ అనే నిక్‌నేమ్ ఉన్న గెర్డ్ ముల్లర్ ప్రపంచ ఫుట్‌బాల్ చరిత్రలో అత్యధిక గోల్స్ కొట్టిన ఆటగాళ్లలో ఒకడు. రెండు ప్రపంచకప్‌లలో (1970, 1974 ) 13 మ్యాచ్‌లలోనే మొత్తం 14 గోల్స్ కొట్టిన ముల్లర్ ఓవరాల్‌గా ఈ జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. 1974లో సొంతగడ్డపై ప్రపంచకప్ ఫైనల్లో ముల్లర్ చేసిన గోల్‌తో జర్మనీ రెండోసారి విజేతగా నిలిచింది. కెరీర్ ఆసాంతం ముల్లర్ ‘ఫెయిర్ ప్లేయర్’గా గుర్తింపు పొందడం విశేషం. రొనాల్డో (బ్రెజిల్) ఫుట్‌బాల్‌ను ప్రాణంగా ప్రేమించే బ్రెజిల్లో పీలే తర్వాత ఆ స్థాయిలో పేరు తెచ్చుకున్న ప్లేయర్ రొనాల్డో లూయీ డి లిమా. మూడుసార్లు ‘ఫిఫా వరల్డ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’, రెండు సార్లు ‘గోల్డెన్ బాల్’ గెలుచుకోవడం మాత్రమే రొనాల్డో గొప్పతనం కాదు. పీలే రిటైర్మెంట్ తర్వాత 24 ఏళ్ల పాటు వరల్డ్ కప్ విజయానికి నోచుకోకుండా నిరాశగా కనిపించిన బ్రెజిల్ అభిమానులకు కొత్త ఊపిరి పోసింది అతనే అనడంలో అతిశయోక్తి లేదు. మొత్తంగా నాలుగు ప్రపంచకప్‌లు ఆడిన రొనాల్డో 15 గోల్స్ కొట్టి రెండోస్థానంతో కెరీర్‌ను ముగించాడు. చదవండి: FIFA: 1950లో బంగారం లాంటి అవకాశం వదిలేసిన భారత్ -
ఫిఫా చరిత్రలో మాయని మచ్చలా ఐదు వివాదాలు
ఫిఫా వరల్డ్‌కప్ 2022 ప్రారంభానికి మరొక రోజు మాత్రమే మిగిలింది. నవంబర్ 20 నుంచి మొదలుకానున్న సాకర్ సమరం డిసెంబర్ 18 వరకు జరగనుంది. దాదాపు నెల రోజుల పాటు జరగనున్న సమరంలో ఫైనల్ మ్యాచ్‌కు లుసెయిల్ స్టేడియం వేదిక కానుంది. ఇక ఫిఫా వరల్డ్‌కప్‌లో విజయాలు ఎన్ని ఉంటాయో వివాదాలు కూడా అన్నే ఉంటాయి. అన్ని గుర్తుండకపోయినా కొన్ని మాత్రం చరిత్రలో మిగిలిపోతాయి. అలా ఫిఫా వరల్డ్‌కప్ చరిత్రలో మాయని మచ్చలా మిగిలిపోయిన ఐదు వివాదాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ►మారడోనా హ్యాండ్ ఆఫ్ గాడ్(Hand Of GOD Goal) 1986 ఫిఫా వరల్డ్‌కప్ అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది అర్జెంటీనా విశ్వవిజేతగా నిలవడం. దీనితో పాటు డీగో మారడోనా అనే పేరు కూడా కచ్చితంగా వినిపిస్తుంది. అర్జెంటీనా విజేతగా నిలవడంతో మారడోనా పాత్ర ఎంత కీలకమో అతని హ్యాండ్ ఆఫ్ గాడ్ గోల్ కూడా అంతే ప్రసిద్ధి చెందింది. 1986 సాకర్ వరల్డ్ కప్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో మారడోనా రెండు గోల్స్ చేశాడు. అందులో ఒక గోల్‌ను చేతితో కొట్టడం అధికారులెవరు గుర్తించలేదు. తర్వాత మారడోనా కొట్టిన ఆ గోల్.. ''హ్యాండ్ ఆఫ్ గాడ్''(Hand OF GOD) గోల్‌గా ప్రసిద్ధి చెందింది. ఈ గోల్ అప్పట్లో వివాదాస్పదమైంది.క్వార్టర్స్‌లో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో అర్జెంటీనా 2–1తో గెలిచి సెమీఫైనల్ చేరింది. అయితే మారడోనా తన ఆటతో అర్జెంటీనాను విశ్వవిజేతగా నిలబెట్టడంతో అందరూ ఆ వివాదాన్ని మరిచిపోయారు. ఆ తర్వాత మారడోనా తన ఆటబయోగ్రఫీలో ''హ్యాండ్ ఆఫ్ గాడ్'' గురించి రాసుకొచ్చాడు. మాట్లాడిన ప్రతీసారి "హ్యాండ్ ఆఫ్ గాడ్" గోల్ అంటున్నారు.. కానీ ఆ చేయి మారడోనాది అన్న సంగతి మరిచిపోయినట్లున్నారని పేర్కొన్నాడు. ► జినదిన్ జిదానే(2006 ఫిఫా వరల్డ్‌కప్) ఫుట్‌బాల్ బతికున్నంత వరకు 2006లో ఫ్రాన్స్ ఆటగాడు జినదిన్ జిదానే చేసిన పని గుర్తిండిపోతుందనంలో అతిశయోక్తి లేదు. టోర్నీ ఆసాంతం అద్భుత ఆటతీరు కనబరిచి ఒంటిచేత్తో ఫ్రాన్స్‌ను ఫైనల్‌కు చేర్చాడు. అయితే అతను ఫైనల్లో చేసిన ఒక చిన్న తప్పిదం ఫ్రాన్స్ ఓటమికి బాటలు వేయడంతో పాటు కెరీర్‌ను కూడా ముగించింది. ఇరుజట్లు 1-1తో సమంగా ఉన్నాయి. అప్పటికే ఫ్రాన్స్ ఇటలీ గోల్ పోస్టులపై దాడి చేస్తూనే ఉంది. అయితే ఇక్కడే జిదానే పెద్ద పొరపాటు చేశాడు. ఇటలీ మిడ్‌ఫీల్డర్ మార్కో మాటెరాజీతో గొడవపడ్డాడు. ఆవేశంలో జిదానే తన తలతో మార్కో చాతిలో గట్టిగా గుద్దాడు నొప్పితో విలవిల్లాడిపోయిన మార్కో అక్కడే కుప్పకూలాడు. అయితే మొదట ఏం జరిగిందో ఎవరికి అర్థం కాలేదు. జిదానే కూడా సైలెంట్‌గా ఉన్నాడు. కానీ రిప్లేలో జిదానే బండారం బయటపడింది. దీంతో రిఫరీ రెడ్ కార్డ్ చూపించడంతో మైదానం వదిలాడు. అలా వెళ్లిన జిదానే మళ్లీ తిరిగి గ్రౌండ్లో అడుగుపెట్టలేదు. అతనికి అదే చివరి మ్యాచ్ అవుతుందని బహుశా అతను కూడా ఊహించి ఉండడు. జిదానే వైఖరి తప్పుబట్టినప్పటికి అతని ఆటతీరును మాత్రం అందరూ మెచ్చుకోవడం విశేషం. ► పోర్చుగల్ వర్సెస్ నెదర్లాండ్స్ మ్యాచ్, 2006 ఫిఫా వరల్డ్‌కప్ ఈ మ్యాచ్‌ను న్యూరేమ్బెర్గ్ యుద్ధం అని పిలుస్తారు. పోర్చుగల్,నెదర్లాండ్స్ మధ్య ప్రి క్వార్టర్స్ మ్యాచ్ జరిగింది. మ్యాచ్ కన్నా గొడవలే ఎక్కువసార్లు జరిగాయి. అందుకే మ్యాచ్‌లో రష్యా రిఫరీ వాలెంటిన్ ఇవనోవ్ ఆటగాళ్లు చేసిన తప్పిదాలకు నాలుగు రెడ్ కార్డ్స్.. 16 సార్లు ఎల్లో కార్డులను జారీ చేశాడు. ఒక ఫిఫా ప్రపంచకప్‌లో మ్యాచ్‌లో అన్నిసార్లు రెడ్, ఎల్లో కార్డులు జారీ చేయడం అదే తొలిసారి. అసలు మ్యాచ్‌లో ఎవరు నెగ్గారనే దానికంటే ఎన్ని కార్డులు జారీ అన్న విషయమే గుర్తుంది. ఇక మ్యాచ్‌లో పోర్చుగల్ 1-0 తేడాతో డచ్‌పై గెలిచి క్వార్టర్స్‌కు చేరుకుంది. ► 2002 ఫిఫా వరల్డ్‌కప్‌లో సడెన్ డెత్ వివాదం 2002 ఫిఫా వరల్డ్‌కప్‌కు తొలిసారి ఆసియా దేశాలైన జపాన్, సౌత్ కొరియాలు ఆతిథ్యం ఇచ్చాయి. ఈ ప్రపంచకప్‌లో సౌత్ కొరియా సెమీఫైనల్ వరకు రాగా.. జపాన్ మాత్రం ప్రి క్వార్టర్స్‌లో వెనుదిరిగింది. అయితే స్పెయిన్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో పెనాల్టీ షూటౌట్ ద్వారా సౌత్ కొరియా సెమీస్‌కు అర్హత సాధించింది. ఇక ప్రి క్వార్టర్స్‌లో ఇటలీతో జరిగిన మ్యాచ్‌లో సౌత్ కొరియా సడెన్ డెత్ రూల్‌తో క్వార్టర్స్ చేరడం వివాదాస్పదంగా మారింది. నిర్ణీత సమయంలో మ్యాచ్ ముగిసిన తర్వాత టైబ్రేక్‌కు దారితీస్తే అప్పుడు సడెన్ డెత్ కింద పరిగణించి.. ఇద్దరిలో ఎవరు ఎక్కువసార్లు గోల్‌పోస్ట్‌పై దాడి చేస్తే వారిని విజేత కింద లెక్కిస్తారు. దీని ప్రకారం సౌత్ కొరియా ముందంజలో ఉండడంతో వారినే విజయం వరించింది. దీనిపై స్పెయిన్ అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికి రూల్స్ ప్రకారమే చేసినట్లు మ్యాచ్ రిఫరీ పేర్కొనడంతో నిరాశగా వెనుదిరిగింది. ఈ వివాదం అప్పట్లో పెద్ద దుమారమే రేపింది. ► 2010 ఫిఫా వరల్డ్‌కప్: ఘనాపై లూయిస్ సురెజ్ చివరి నిమిషంలో హ్యాండ్‌బాల్ ఈ టోర్నమెంట్ ఆఫ్రికా దేశమైన దక్షిణాఫ్రికాలో జరిగింది. ఈ టోర్నీలో ఘనాది డ్రీమ్ రన్ అని చెప్పొచ్చు. ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన ఘనా క్వార్టర్స్ వరకు చేరి అందరిని ఆశ్చర్యపరిచింది. ఇక క్వార్టర్స్‌లో ఉరుగ్వేతో తలపడింది. మ్యాచ్‌లో ఘనా ఫ్రీ కిక్ పొందింది. ఆ సమయంలో గోల్‌పోస్ట్ వద్ద ఉన్న లూయిస్ సురేజ్ ఘనా ఆటగాడు డొమినిక్ ఆదియ్య హెడర్ గోల్‌ను చేతితో అడ్డుకున్నాడు. దీంతో సురేజ్‌కు రెడ్‌కార్డ్ జారీ చేయడంతో మైదానం వీడాడు. ఆ తర్వాత నిర్ణీత సమయం ముగిసేలోగా ఇరుజట్లు 1-1తొ నిలవడంతో మ్యాచ్ డ్రాగా ముగిసి పెనాల్టీ షూటౌట్‌కు దారి తీసింది. ఇక పెనాల్టీ షూటౌట్లో ఉరుగ్వే గోల్ చేసిన ప్రతీసారి సురేజ్ ఎంజాయ్ చేయడం అప్పట్లో వైరల్‌గా మారింది. ఇక షూటౌట్లో ఉరుగ్వే 4-2తో ఘనాను ఓడించి సెమీ-ఫైనల్లో అడుగుపెట్టింది. చదవండి: సాగర తీరంలో దూసుకెళ్తున్న రేసింగ్ కార్లు.. క్రికెట్లో ప్రొటీస్.. ఫుట్‌బాల్‌లో డచ్; ఎక్కడికెళ్లినా దరిద్రమే -
మారడోనా 'ఫుట్‌బాల్'కు కళ్లు చెదిరే మొత్తం.. ఎందుకంత క్రేజ్
అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం డీగో మారడోనా అనగానే ముందుగా గుర్తుకువచ్చేది ''హ్యాండ్ ఆఫ్ గాడ్'' గోల్. ఆనాడు మారడోనా Hand OF God Goal కొట్టిన బంతికి తాజాగా వేలంలో కళ్లు చెదిరే మొత్తానికి అమ్ముడుపోయింది. బుధవారం లండన్‌లో నిర్వహించిన వేలంలో ఆ బంతి అక్షరాల .19.5 కోట్ల ధరకు అమ్ముడైంది. అయితే ఇంతకాలం ఆ బంతి అప్పటి మ్యాచ్‌కు రిఫరీగా వ్యవహరించిన అలీ బిన్ నాసర్(ట్యునీషియా) దగ్గరే ఉంది. తాజాగా వేలానికి పెట్టడంతో ఇలా భారీ ధరకు అమ్ముడుపోయింది. 1986 సాకర్ వరల్డ్ కప్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో మారడోనా రెండు గోల్స్ చేశాడు. అందులో ఒక గోల్‌ను చేతితో కొట్టడం అధికారులెవరు గుర్తించలేదు. తర్వాత మారడోనా కొట్టిన ఆ గోల్.. ''హ్యాండ్ ఆఫ్ గాడ్''(Hand OF GOD) గోల్‌గా ప్రసిద్ధి చెందింది. ఈ గోల్ అప్పట్లో వివాదాస్పదమైనప్పటికి.. మారడోనా తన ఆటతో అర్జెంటీనాను విశ్వవిజేతగా నిలబెట్టడంతో అందరూ ఆ వివాదాన్ని మరిచిపోయారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో 1986 ఫిఫా వరల్డ్‌కప్‌లో మారడోనా ధరించిన జెర్సీకి కూడా కళ్లు చేదిరే మొత్తం వచ్చి చేరింది. క్వార్టర్స్‌లో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో అర్జెంటీనా 2–1తో గెలిచి సెమీఫైనల్ చేరింది. ఇంగ్లండ్‌తో మ్యాచ్ ముగిశాక మారడోనా తన జెర్సీని ఇంగ్లండ్ ప్లేయర్ స్టీవ్ హాడ్జ్‌కు అందజేశాడు. దానిని దాచుకున్న హాడ్జ్ ఏప్రిల్ నెలలో ‘సోతీబై’ అనే ఆన్లైన్ వేలం సైట్లో అమ్మకానికి పెట్టగా ఒక అజ్ఞాతవ్యక్తి సదరు జెర్సీని 71 లక్షల పౌండ్లకు అమ్ముడుపోవడం విశేషం. చదవండి: మ్యాచ్‌ను గెలిపించలేకపోయిన జైశ్వాల్ వీరొచిత సెంచరీ FIFA: అందాల విందు కష్టమే.. అసభ్యకర దుస్తులు ధరిస్తే జైలుకే -
FIFA: ప్రపంచానికి తెలియని కొల్హాపూర్ ఫుట్‌బాల్ చరిత్ర
భారత్‌లో ఫుట్‌బాల్ క్రీడకు అంతగా ప్రాధాన్యం లేదు. ఫుట్‌బాల్ కంటే క్రికెట్‌కే ఎక్కువ క్రేజ్ ఉన్న దేశంలో గోవా, బెంగాల్, కేరళ సహా ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రం ఫుట్‌బాల్‌కే విపరీతమైన ఆదరణ ఉంటుంది. భారత ఫుట్‌బాల్ జట్టులో ఆడే ఆటగాళ్లలో కూడా ఈ రాష్ట్రాలకు చెందినవారే ఎక్కువ. కానీ మనకు తెలియకుండానే మన దేశంలో ఫుట్‌బాల్‌కు విపరీతమైన ఆదరణ ఉన్న ప్రాంతం మరొకటి ఉంది. అదే మహారాష్ట్రలోని కొల్హాపూర్ సిటీ. నవంబర్ 20 నుంచి ఖతార్ వేదికగా ఫిఫా వరల్డ్‌కప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో భారత్‌లో ఫుట్‌బాల్‌కు ఎంత ఆదరణ ఉంది అని ఒక సంస్థ నిర్వహించిన సర్వేలో తెలియని కొన్ని ఆసక్తికర విశేషాలు బయటపడ్డాయి. గత 30 ఏళ్లుగా కొల్హాపూర్ సిటీలో ఫుట్‌బాల్‌కు ఉన్న క్రేజ్.. అక్కడి ప్రజలు ఆ ఆటపై పెట్టుకున్న ప్రేమ ఎంతనేది బయటకొచ్చింది. కొల్హాపూర్ సిటీలో నివసించే ప్రజలు క్రికెట్ కంటే ఫుట్‌బాల్‌నే ఎక్కువగా ప్రేమిస్తారు. అందుకు సాక్ష్యం ఆ సిటీలో ఉన్న గోడలపై స్టార్ ఫుట్‌బాలర్స్ పెయింటింగ్స్. ప్రతీ వీధిలోనూ ఒక్కో ఫుట్‌బాలర్ మనకు కనిపిస్తాడు. మెస్సీ నుంచి రొనాల్డో వరకు.. మారడోనా నుంచి పీలే దాకా.. ఇలా మనకు కావాల్సిన ఆటగాళ్ల చిత్రాలన్ని పెయింటింగ్స్ రూపంలో ఉంటాయి. అయితే అర్జెంటీనా, బ్రెజిల్‌కు చెందిన ఫుట్‌బాల్ ఆటగాళ్లను ఇక్కడ కాస్త ఎక్కువగా ఆదరిస్తారు. ఇటీవలే కోపా అమెరికా కప్‌లో బ్రెజిల్‌ను అర్జెంటీనా చిత్తు చేసి విజేతగా నిలిచినప్పుడు కొల్హాపూర్‌లో పెద్ద జాతర జరిగింది. ఖాన్బోడా తలీమ్ అనే గ్రూప్ ఈ వేడుకల్లో పెద్దన్న పాత్ర పోషిస్తుంది. బ్లూ, వైట్ ఫ్లాగ్స్గా విడిపోయి ఫుట్‌బాల్ మ్యాచ్‌లు నిర్వహించారు. సాహూ అనే ఫుట్‌బాల్ మైదానం ఉంటుంది. 30వేల సామర్థ్యంతో సీటింగ్ కెపాసిటీ ఉండడం విశేషం. ఇక గణేష్ నవరాత్రుల సందర్భంగా కొల్హాపూర్ ఫుట్‌బాల్ ఫెస్టివ్ సీజన్ మొదలై.. దాదాపు రెండు నెలలు అంటే దీపావళి వరకు ఈ టోర్నీ సాగుతుంది. టోర్నీలో విజేతగా నిలిచిన జట్టును గౌరవంగా చూస్తారు. ఆ సిటీలో తిరిగే ప్రతీ వ్యక్తి తమ వాహనాలపై పీటీఎమ్ స్టిక్కర్ అంటించుకొని తిరుగుతారు. ఇలా ఫుట్‌బాల్‌పై తమకున్న పిచ్చి ప్రేమను చూపిస్తుంటారు. ఇదంతా పక్కనబెడితే.. విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా దగ్గర్లోని శివాజీ స్టేడియంలో నిర్వహించిన క్రికెట్ మ్యాచ్‌కు పట్టుమని వంద మంది కూడా రాలేదు. కానీ అదే రోజు పక్కనే ఉన్న ఫుట్‌బాల్ స్టేడియంలో ప్రాక్టీస్ క్లబ్, శివాజీ మండల్ మధ్య నిర్వహించిన ఫుట్‌బాల్ మ్యాచ్‌కు వేల సంఖ్యలో ప్రేక్షకులు హాజరవ్వడం విశేషం. అందుకే ఇకపై భారత్‌లో ఫుట్‌బాల్ అనగానే కేరళ, బెంగాల్, గోవా లాంటి రాష్ట్రాలే కాదు కొల్హాపూర్ సిటీ కూడా గుర్తుకురావాల్సిందే. చదవండి: '2009 తర్వాత మైదానాలన్నీ వెడ్డింగ్ హాల్స్గా మారాయి' పూర్వ వైభవంపై జర్మనీ దృష్టి -
మారడోనా 'హ్యాండ్ ఆఫ్ గాడ్'కు మరో అరుదైన గౌరవం
అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం డీగో మారడోనా హ్యాండ్ ఆఫ్ గాడ్ జెర్సీకి మరో అరుదైన గౌరవం లభించింది. ఖతార్‌లో జరగనున్న ప్రతిష్టాత్మక ఫిఫా వరల్డ్‌కప్‌లో మారడోనా జెర్సీని ప్రత్యేక డిస్ప్లేలో ఉంచనున్నారు. అక్టోబర్ 2(ఆదివారం) నుంచి ఏప్రిల్ 1 వరకు ఖతార్‌లోని స్పోర్ట్స్ మ్యూజియంలో ఉంటుందని ఒక అధికారి పేర్కొన్నారు. ఇక నాలుగు నెలల క్రితమే మారడోనా హ్యాండ్ ఆఫ్ గాడ్ జెర్సీని వేలం వేయగా కళ్లు చెదిరే మొత్తానికి అమ్ముడుపోయిన సంగతి తెలిసిందే. కాగా జెర్సీని కొన్న ఆ వ్యక్తి పేరును ఇప్పటివరకు బయటపెట్టలేదు. మారడోనాకు వీరాభిమాని అయిన ఆ అజ్ఞాతవ్యక్తి జెర్సీని 71లక్షల పౌండ్లకు(భారత కరెన్సీలో దాదాపు రూ.67 కోట్ల 72 లక్షలకు) కొనుగోలు చేయడం విశేషం. 1986 సాకర్ వరల్డ్ కప్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో మారడోనా ఈ జెర్సీనే ధరించాడు. ఈ మ్యాచ్‌లో మారడోనా రెండు గోల్స్ చేయగా.. అందులో ఒకటి హ్యాండ్ ఆఫ్ గోల్ కూడా ఉంది. ఈ గోల్ అప్పట్లో వివాదాస్పదమైనప్పటికి.. మారడోనా తన ఆటతో అర్జెంటీనాను విశ్వవిజేతగా నిలబెట్టడంతో అందరూ ఆ వివాదాన్ని మరిచిపోయారు. కాగా ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో అర్జెంటీనా 2–1తో గెలిచి సెమీఫైనల్ చేరింది. ఇంగ్లండ్‌తో మ్యాచ్ ముగిశాక మారడోనా తన జెర్సీని ఇంగ్లండ్ ప్లేయర్ స్టీవ్ హాడ్జ్‌కు అందజేశాడు.దానిని ఇంతకాలం దాచుకున్న హాడ్జ్ ఏప్రిల్ నెలలో ‘సోతీబై’ అనే ఆన్లైన్ వేలం సైట్లో అమ్మకానికి పెట్టాడు. -
మారడోనా మృతి వెనుక నిర్లక్ష్యం.. పాతికేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం
డీగో మారడోనా.. వ్యక్తిగత జీవితంలో ఎన్ని వివాదాలున్నా ఫుట్‌బాల్‌లో అతను ఎప్పటికి దిగ్గజమే. 2020 నవంబర్ 25న 60 ఏళ్ల వయసులో ఆసుపత్రి బెడ్‌పై మరణించి కోట్లాది ఫుట్‌బాల్ అభిమానులను శోక సంద్రంలో ముంచెత్తాడు. మెదుడులో రక్తం గడ్డకట్టడం.. కొకైన్ లాంటి డ్రగ్స్ పరిమితికి మించి తీసుకోవడం.. మద్యాపానాకి బానిస కావడంతో మారడోనా మృతి చెందినట్లు రిపోర్ట్స్ వచ్చాయి. అయితే కొన్ని రోజుల తర్వాత మారడోనాకు చికిత్స అందించిన ఎనిమిది మంది వైద్యుల బృందం వహించిన నిర్లక్ష్యం కారణంగా ఫుట్‌బాల్ దిగ్గజం మరణించినట్లు తెలిసింది. దీంతో ఆ ఎనిమిది మందిపై అర్జెంటీనా కోర్టులో కేసు నమోదు అయింది. కాగా మారడోనా మరణంలో నేరపూరిత నిర్లక్ష్యానికి పాల్పడినందుకు ఎనిమిది మంది వైద్య సిబ్బంది త్వరలో విచారణకు హాజరు కానున్నారు. వీరిలో న్యూరోసర్జన్, అతని కుటుంబ వైద్యుడు లియోపోల్డో లుక్, మానసిక వైద్య నిపుణుడు అగస్టినా కోసాచోవ్, సైకాలజిస్ట్ కార్లోస్ డియాజ్, మెడికల్ కోఆర్డినేటర్ నాన్సీ ఫోర్లిని, నర్సులతో సహా మరో నలుగురు వైద్యులు ఉన్నారు. వీరి నిర్లక్ష్యం కారణంగానే మారడోనా అపస్మారక స్థితిలో చనిపోయాడని.. నిర్లక్ష్యపూరిత హత్యకు పాల్పడిన వారిపై విచారణ జరిపించాలని న్యాయవాదులు కోరారు.నేరం రుజువైతే నిందితులకు ఎనిమిది నుంచి 25 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఇక 1986 ఫిఫా వరల్డ్‌కప్ సందర్భంగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో మారడోనా 60 గజాల దూరం నుంచి బంతిని గోల్‌పోస్ట్‌లోకి తరలించడం చరిత్రలో నిలిచిపోయింది. 2002లో ఫిఫా డాట్‌కామ్ నిర్వహించిన సర్వేలో మారోడోనా కొట్టిన గోల్‌కు ఎక్కువ ఓట్లు వచ్చాయి. దీంతో మారడోనా గోల్‌ను ఫిఫా.. ''గోల్ ఆఫ్ ది సెంచరీ''గా పేర్కొంది. అంతేగాక కెప్టెన్‌గా 1986 ఫిఫా వరల్డ్‌కప్‌లో అర్జెంటీనాను విశ్వవిజేతగా నిలిపి మారడోనా తన పేరును చరిత్రలో లిఖించుకున్నాడు. చదవండి: Diego Maradona: టీనేజ్‌లో మారడోనా నాపై అత్యాచారం చేశాడు Shane Warne: దిగ్గజ ఫుట్‌బాలర్స్‌తో వార్న్‌కు దగ్గరి పోలికలు.. మరణం కూడా! -
మారడోనా హ్యాండ్ ఆఫ్ గాడ్’ జెర్సీకి కళ్లు చెదిరే మొత్తం
లండన్: అర్జెంటీనా దిగ్గజం డీగో మారడోనా... ఇంగ్లండ్‌తో జరిగిన 1986 ప్రపంచకప్ ఫుట్‌బాల్ క్వార్టర్ ఫైన ల్లో ధరించిన జెర్సీ ని కళ్లు చెదిరే మొత్తానికి కొనుగోలు చేశారు. ఈ మ్యాచ్‌లో మారడోనా చేసిన తొలి గోల్ ‘హ్యాండ్ ఆఫ్ గాడ్’ గోల్‌గా వివాదాస్పదమైంది. ఈ మ్యాచ్‌లో అర్జెంటీనా 2–1తో గెలిచి సెమీఫైనల్ చేరింది. ఇంగ్లండ్‌తో మ్యాచ్ ముగిశాక మారడోనా తన జెర్సీని ఇంగ్లండ్ ప్లేయర్ స్టీవ్ హాడ్జ్‌కు అందజేశాడు. దానిని ఇంతకాలం దాచుకున్న హాడ్జ్ ఇటీవల ‘సోతీబై’ అనే ఆన్లైన్ వేలం సైట్లో విక్రయానికి పెట్టాడు. బుధవారం ముగిసిన ఈ ఆన్లైన్ వేలంలో ఓ అజ్ఞాత అభిమాని ఈ జెర్సీని 71 లక్షల పౌండ్లకు (రూ. 67 కోట్ల 72 లక్షలు) కొనుగోలు చేశాడని సోతీబై సైట్ తెలిపింది చదవండి: IPL 2022: సీఎస్కేపై ఆర్సీబీ ఘన విజయం.. -
అదిరిపోయే వేలం.. ప్రారంభ ధరే రూ.38 కోట్లా?
వేలం పాటలో ప్రాచీన వస్తువులకు, అరుదైన వాటికి ఎక్కువ ధర పలుకుతుండడం చూస్తుంటాం. ఒక్కోసారి సెలబ్రిటీలు, మేధావులకు సంబంధించిన గుర్తులు సైతం భారీ ధరకు పోతుంటాయి. అలాంటిది ఒక వస్తువు.. ప్రారంభ ధరనే భారీగా ఉండడం ఇక్కడ విశేషం. అర్జెంటీనా సాకర్ దిగ్గజం డియెగో మారడోనా, జెర్సీని వేలం వేయబోతున్నారు. అది మాములు జెర్సీ కాదులేండి. 1986 సాకర్ వరల్డ్ కప్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ జెర్సీనే ధరించాడు. రెండుసార్లు గోల్స్ చేయడమే కాదు.. అందులో ఒకటైన హ్యాండ్ ఆఫ్ గాడ్ గోల్ కూడా నమోదు అయ్యింది ఈ మ్యాచ్‌లోనే. బుధవారం నుంచి నెంబర్ 10 ఉన్న ఈ బ్లూ జెర్సీని వేలం వేయడం మొదలుపెట్టారు. ఆరంభ ధర ఎంతో తెలుసా? 5 మిలియన్ డాలర్ల పైనే. అంటే.. మన కరెన్సీలో సుమారు 38 కోట్ల రూపాయలపైనే!. మే 4వ తేదీ వరకు ఈ వేలంపాట కొనసాగనుంది. న్యూయార్క్‌కు చెందిన సోత్‌బైస్ ఫైన్ ఆర్ట్స్ కంపెనీ.. ఈ వేలం నిర్వహించనుంది. క్రీడా ప్రపంచంలో ఇప్పటిదాకా 5.6 మిలియన్ డాలర్లకు అమ్ముడుపోయింది అమెరికన్ బేస్‌బాల్ ప్లేయర్ బాబే రూత్ జెర్సీ. న్యూయార్క్ యాంకీస్ తరపున ఆయన ఆడినప్పుడు ధరించిన జెర్సీ.. 2019లో వేలంపాటలో ఈ రికార్డును క్రియేట్ చేసింది. ఇప్పుడు మారడోనా జెర్సీ ఆ రికార్డును బద్ధలు కొట్టే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. చదవండి: చిటికెడు మట్టి రూ.4 కోట్లు -
దిగ్గజ ఫుట్‌బాలర్స్‌తో వార్న్‌కు దగ్గరి పోలికలు.. మరణం కూడా!
ఆస్ట్రేలియన్ దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ క్రికెట్లో రారాజు అనడంలో సందేహం లేదు. బంతిని నైపుణ్యంతో తిప్పడంలో అతనికి ఎవరు సాటిరారు. గింగిరాలు తిరిగే బంతి పిచ్‌పై పడి ఎటు వెళుతుందో తెలుసుకునే లోపే ప్రత్యర్థిని పెవిలియన్ చేర్చడం వార్న్ శైలి. క్రికెట్లో రారాజుగా వెలుగొందిన వార్న్‌కు.. ఆఫ్ ఫీల్డ్‌లో మాత్రం మాయని మచ్చలు చాలానే ఉన్నాయి. -సాక్షి, వెబ్‌డెస్క్ ముఖ్యంగా డ్రగ్స్, ఆల్కాహాల్, మహిళలతో ప్రేమాయణాలు, అమ్మాయిలకు అసభ్యకర సందేశాలు ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి. మైదానం వెలుపల ఇన్ని చేసినప్పటికి వార్న్‌కు అభిమానగణం ఇసుమంతైనా తగ్గలేదు. తాజాగా వార్న్ గుండెపోటుతో హఠాన్మరణం చెందడం క్రీడాలోకాన్ని దిగ్బ్రాంతికి గురిచేసింది. తమ అభిమాన క్రికెటర్‌కు వీడ్కోలు పలుకుతూ తమ సంతాపాన్ని ప్రకటిస్తున్నారు. క్రికెట్ ప్రపంచంలో వార్న్‌కు ఎవరు పోటీ లేరు అనుకుంటున్న మనకు.. క్రికెట్ వెలుపల మాత్రం ఇద్దరు ఫుట్‌బాల్ స్టార్ ఆటగాళ్లతో షేన్ వార్న్‌కు చాలా పోలికలు ఉన్నాయి. ఆ ఇద్దరిలో ఒకరు అర్జెంటీనా దిగ్గజం డీగో మారడోనా అయితే.. రెండో వ్యక్తి నార్తన్ ఐరిష్ స్టార్ ఫుట్‌బాలర్ జార్జ్ బెస్ట్.. మీకు తెలుసో లేదో.. ఈ ముగ్గురి జీవితాలు పరిశీలిస్తే ఒకే రీతిలో ఉంటాయి. వార్న్, మారడోనా, జార్జ్ బెస్ట్ ఆటలో ఎంత పేరు సంపాదించారో.. వ్యక్తిగత జీవితంలో అంత చెడ్డ పేరు తెచ్చుకున్నారు. ఈ ముగ్గురిలో ఉన్న పోలికలు ఒకసారి తెలుసుకుంటే ఆశ్చర్యపోవడం ఖాయం. అవేంటో ఒకసారి చూడండి. ►వార్న్ క్రికెట్లో రారాజుగా వెలుగొందితే.. మారోడనా, జార్జ్ బెస్ట్‌లు తమ కాలాల్లో ఫుట్‌బాల్‌లో స్టార్ ప్లేయర్లుగా సత్తా చాటారు. ఫుట్‌బాల్ ఆటలో మారడోనా, బెస్ట్‌లు తమ పాదాలతో గోల్ కొట్టడంలో నైపుణ్యం ప్రదర్శిస్తే.. వార్న్ లెగ్ స్పిన్నర్‌గా క్రికెట్లో తన మణికట్టు మాయజాలాన్ని ప్రదర్శించి వికెట్లు తీసేవాడు. ►వార్న్ లాగే మారడోనా, జార్జ్ బెస్ట్ మద్యానికి, డ్రగ్స్‌కు అలవాటు పడినవారే.. అమ్మాయిలతో రాసలీలలు.. అసభ్యకరమైన సందేశాలు పంపించడం చేశారు. ఈ విషయంలో మాత్రం జార్జ్ బెస్ట్‌కు మినహాయింపు జార్జ్ బెస్ట్ నార్తన్ ఐర్లాండ్ స్టార్ ఫుట్‌బాలర్ ► 1974లో జార్జ్ బెస్ట్ మాంచెస్టర్ సిటీకి ప్రాతినిధ్యం వహిస్తున్న సమయంలో ఒక మ్యాచ్ సందర్భంగా ఫుల్లుగా తాగి వచ్చాడు. విషయం తెలుసుకున్న జట్టు మేనేజర్ బెస్ట్‌ను డ్రెస్సింగ్ రూమ్ నుంచి బయటకు గెంటేశాడు. ఆ తర్వాత కొన్ని రోజుల పాటు బెస్ట్ మ్యాచ్‌లు ఆడకుండా మాంచెస్టర్ సిటీ అతడిపై నిషేధం విధించింది. ► మారడోనా కూడా 1994 వరల్డ్‌కప్‌కు ముందు ఈఫిడ్రైన్ అనే నిషేధిత డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది. టెస్టులు చేయగా పాజిటివ్ రావడంతో ఫిఫా అతనిపై నిషేధం విధించింది. దీంతో మారడోనా వరల్డ్‌కప్‌కు దూరమయ్యాడు. మారడోనా విగ్రహం ►వార్న్ కూడా 2003 వరల్డ్‌కప్ ప్రారంభానికి ముందు డోపింగ్ టెస్టులో పట్టుబడడంతో క్రికెట్ ఆస్ట్రేలియా వార్న్‌పై నిషేధం విధించింది. ►ఇక నిషేధం తర్వాత మారడోనా లాగే వార్న్ కూడా స్టెరాయిడ్స్‌కు దూరంగా ఉన్నట్లు కొన్ని వార్తలు వచ్చాయి ►మారడోనాకు ఫుట్‌బాల్‌లో ''గోల్ ఆఫ్ ది సెంచరీ'' ఉన్నట్లే.. క్రికెట్లో వార్న్‌కు ''బాల్ ఆఫ్ ది సెంచరీ'' ఉండడం విశేషం. ►1986 ఫిఫా వరల్డ్‌కప్ సందర్భంగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో మారడోనా 60 గజాల దూరం నుంచి బంతిని గోల్‌పోస్ట్‌లోకి తరలించడం చరిత్రలో నిలిచిపోయింది. 2002లో ఫిఫా డాట్‌కామ్ నిర్వహించిన సర్వేలో మారోడోనా కొట్టిన గోల్‌కు ఎక్కువ ఓట్లు వచ్చాయి. దీంతో మారడోనా గోల్‌ను ఫిఫా.. ''గోల్ ఆఫ్ ది సెంచరీ''గా పేర్కొంది. మారడోనా గోల్ ఆఫ్ ది సెంచరీ; వార్న్ బాల్ ఆఫ్ ది సెంచరీ ►ఇక వార్న్ బాల్ ఆఫ్ ది సెంచరీ విషయానికి వస్తే.. 1993లో ఇంగ్లండ్ గడ్డపై జరిగిన యాషెస్ సిరీస్‌లో మాంచెస్టర్ వేదికగా తొలి టెస్టు జరిగింది. ఆట రెండోరోజు వార్న్ మైక్ గాటింగ్‌కు అద్బుత బంతి వేశాడు. లెగ్‌స్టంప్ అవతల నుంచి వెళ్లిన బంతి అనూహ్యంగా టర్న్ అయి ఆఫ్ స్టంప్ వికెట్‌ను ఎగురగొట్టడం క్రీడా పండితుల్ని సైతం ఆశ్చర్యపరిచింది. అసలు బంతి ఎలా తిరిగిందన్నది ఇప్పటికి మిస్టరీగానే ఉండిపోయింది. బ్యాట్స్‌మన్ మైక్ గాటింగ్తో పాటు అంపైర్ కూడా ఆశ్చర్యపోయారు. అందుకే వార్న్ బంతి ''బాల్ ఆఫ్ ది సెంచరీ''గా చరిత్రలో నిలిచిపోయింది. ►1986 ఫిఫా ప్రపంచకప్ అర్జెంటీనా గెలవడంలో మారడోనా పాత్ర కీలకం.. అటు క్రికెట్లో 1999 వన్డే వరల్డ్‌కప్ ఆస్ట్రేలియా గెలవడంలో వార్న్ కీలకపాత్ర పోషించాడు. 1986 ఫిఫా వరల్డ్‌కప్‌తో మారడోనా; 1999 వన్డే వరల్డ్‌కప్‌తో షేన్ వార్న్ ►ఇక ఈ ముగ్గురి మరణాలు కూడా దాదాపు ఒకే రీతిలో జరగడం విశేషం. ముగ్గురు తాము చనిపోయేటప్పుడు అచేతనా స్థితిలోనే మరణించారు. చదవండి: Shane Warne: శవ పరీక్షకు వార్న్ భౌతికకాయం.. బోరుమన్న కుమారుడు Pak vs Aus: ఒకవైపు వార్న్ మరణం.. ఇప్పుడు ఇది అవసరమా వార్నర్ ? Shane Warne: భారత్‌కు ఆప్తుడు.. స్వదేశంలో మాత్రం ఘోర అవమానం! -
వేలానికి మారడోనా సిగరెట్లు, కార్లు, లగ్జరీ విల్లా
Diego Maradona's Cigars,Cars, Villa Auction.. అర్జెంటీనా మాజీ ఫుట్‌బాల్ దిగ్గజం డీగో మారడోనా భౌతికంగా దూరమై ఏడాది దాటింది. గతేడాది నవంబర్ 25న 60 ఏళ్ల వయసులో గుండెపోటుతో మరణించాడు. వ్యక్తిగత జీవితంలో ఎన్ని వివాదాలు ఉన్నప్పటికీ.. తనదైన ఆటతో అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు. 1986 ఫిపా ప్రపంచకప్ అర్జెంటీనా సొంతం చేసుకోవడంలో మారడోనాది కీలకపాత్ర. మారడోనా భౌతికంగా దూరమై ఏడాది దాటిన సందర్భంగా అతని వస్తువులను వేలం వేయాలని నిర్ణయించారు. డిసెంబర్ 19(ఆదివారం) ఉదయం 11 గంటలకు ఈ వేలం జరగనుంది. కాగా వేలానికి మారడోనా వాడిన పలురకాల ఐకానిక్ సిగరెట్లు, బీఎండబ్ల్యూ కార్లతో పాటు తల్లిదండ్రులకు కొనిచ్చిన లగ్జరీ విల్లా రానున్నాయి. మారడోనా జెర్సీ నెంబర్ 10తో బరిలోకి దిగి 1986 ప్రపంచకప్‌కు అందించడంతో.. అతని జెర్సీ నెంబర్‌కు గుర్తుగా..'' 10 ఆక్షన్'' పేరుతో వేలం నిర్వహించనున్నారు. ఇక ఈ వేలానికి సంబంధించి ఇప్పటికే మారడోనా కుటుంబసభ్యులను వేలం చేపట్టబోయే సంబంధిత అధికారులు సంప్రదించారు. మారడోనా ఐదుగురు పిల్లలు అతని వస్తువుల వేలానికి ఒప్పుకున్నారని.. వేలం ద్వారా వచ్చే డబ్బును ఒక ఫౌండేషన్‌కు అందించాలని నిర్ణయించారని మారడోనా కుటుంబ వ్యక్తిగత లాయర్ ఒక ప్రకటనలో తెలిపారు. భౌతికంగా మారడోనా దూరమైనప్పటికి అతని వస్తువులను సొంతం చేసుకునే అవకాశం ఉండడంతో అభిమానులు ఉత్సుకతతో ఉన్నారు. కాగా ఆన్లైన్ వేదికగా జరగనున్న ఈ వేలాన్ని కనీసి 15 నుంచి 20వేల మంది వీక్షించే అవకాశం ఉందని రూటర్స్ అభిప్రాయపడింది. -
కొట్టేసిన మారడోనా వాచీ ధరెంతో.. స్పెషాలిటీ ఏంటో తెలుసా?
Maradona Stolen Watches Specialities And Cost: అర్జెంటీనా ఫుట్ బాల్ దిగ్గజం డిగో మారడోనా.. సాకర్ ప్రపంచంలో ఓ లెజెండ్. మరణం అనంతరం ఆయన లెగసీ కొనసాగుతోంది. అయితే ఆయనకు చెందిన కాస్ట్లీ వాచీ ఒకటి దుబాయ్‌లో చోరీకి గురికాగా.. ఎట్టకేలకు దానిని అస్సాం(అసోం)లో రికవరీ చేసుకున్నారు పోలీసులు. 2010 ఫిఫా వరల్డ్ కప్ టైంలో స్విట్జర్లాండ్‌కు చెందిన కాస్ట్లీ వాచ్ మేకింగ్ కంపెనీ హుబ్లోట్.. బిగ్‌బ్యాంగ్ మోడల్ పేరుతో మారడోనా గౌరవార్థం లిమిటెడ్ ఎడిషన్ రిలీజ్ చేసింది. మొత్తం 250 వాచీలు తయారు చేయించగా.. క్షణాల్లో హాట్‌కేకుల్లా ఒక్కక్కటి భారీ ధరకు అమ్ముడుపోయాయి. వీటిలో రెండు వాచీలను మారడోనాకు గిఫ్ట్‌గా ఇచ్చింది హుబ్లోట్. 2010 ఫిఫా వరల్డ్ కప్ సందర్భంగా మారడోనా ఈ రెండు వాచీలను(రెండుచేతులకు చెరోటి) ధరించి స్పెషల్ ఎట్రాక్షన్‌గా కనిపించారు. అందులో ఆయన విక్టరీ సింబల్ చూపించే ఫొటో(వెనకనుంచి), సంతకం, జెర్సీ నెంబర్ కూడా ఉంటాయి. వీటి ధర ఒక్కొక్కటి రూ. 20 లక్షలుగా(మన కరెన్సీలో) ప్రకటించింది కంపెనీ. అయితే.. In an act of international cooperation @assampolice has coordinated with @dubaipoliceHQ through Indian federal LEA to recover a heritage @Hublot watch belonging to legendary footballer Late Diego Maradona and arrested one Wazid Hussein. Follow up lawful action is being taken. pic.twitter.com/9NWLw6XAKz — Himanta Biswa Sarma (@himantabiswa) December 11, 2021 మారడోనా మరణానంతరం ఆయనకు చెందిన వస్తువులు కొన్నింటిని దుబాయ్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీ వేలంపాటలో చేజిక్కించుకుంది. ఆ కంపెనీకి సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్న వాజీద్ హుస్సేన్ అనే వ్యక్తి.. ఆ వాచీని దొంగిలించాడు. ఆపై తన తండ్రికి బాగోలేదని ఆగష్టులో భారత్(అస్సోం) వచ్చేశాడు. ఈ చోరీని సీరియస్‌గా తీసుకున్న దుబాయ్ పోలీసులు.. ఎట్టకేలకు అస్సోం పోలీసుల సహకారంతో నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని అస్సోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ, డీజీపీలు స్వయంగా ట్విటర్ ద్వారా వెల్లడించారు. A costly Hublot watch... Maradona... Dubai... Assam Police Looks like random words, don't they? But today all these words came together nicely, stating a story of successful International Cooperation between #DubaiPolice and @assampolice . pic.twitter.com/oMRYgpX3HH — DGP Assam (@DGPAssamPolice) December 11, 2021 -
ఆట ఏదైనా ఆ జెర్సీ అంటే ఎందుకంత క్రేజ్!
Top 11 Players Who Wear Number 10 Jersey In Cricket: క్రీడల్లో నెంబర్ 10 జెర్సీకి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఒక్క క్రికెట్లోనే కాదు.. ఫుట్‌బాల్‌లోనూ నెంబర్ 10 జెర్సీకి వేరే లెవెల్ క్రేజ్ ఉంది. ఫుట్‌బాల్ దిగ్గజాలుగా పేరు పొందిన పీలే, మారడోనా, జినదిన్ జిదానే, రొనాల్డీనో, డెల్పోరో, వెయిన్ రూనీ, మెస్సీ లాంటి స్టార్స్ ధరించే జెర్సీ నెంబర్ 10 కావడం విశేషం. ఆ జెర్సీ ధరిస్తే స్టార్ హోదా వస్తుందని చాలా మంది నమ్మకం. ఇక క్రికెట్లో నెంబర్ 10 జెర్సీ అనగానే ముందుగా గుర్తుకువచ్చేది టీమిండియా లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్. తన కెరీర్లో ఎక్కువకాలం ఈ జెర్సీతోనే ఆడిన సచిన్ ఎన్నోమైలురాళ్లను అందుకున్నాడు. ఈ విధంగా క్రికెట్ చరిత్రలో 10వ నెంబర్ జెర్సీ ధరించిన కొందరి ఆటగాళ్ల గురించి తెలుసుకుందాం. - సాక్షి, వెబ్‌డెస్క్ సచిన్ టెండూల్కర్(టీమిండియా) టీమిండియా దిగ్గజం సచిన్ టెండూల్కర్ క్రికెట్లో అరంగేట్రం చేసిన మొదట్లో 99 జెర్సీతో బరిలోకి దిగాడు. ఆ తర్వాత 33 జెర్సీ నెంబర్‌తో ఆడాడు. ఇక చివరగా 10వ నెంబర్ జెర్సీతో రిటైర్మెంట్ వరకు ఆడిన సచిన్ ఎన్నో రికార్డులు, ఘనతలు సాధించాడు. క్రికెట్ చరిత్రలో వంద సెంచరీలు సాధించి చరిత్రలో నిలిచిపోయాడు. టెస్టు, వన్డే క్రికెట్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. చదవండి: Abu Dhabi T10 League: సెంచరీకి నాలుగు పరుగుల దూరంలో.. అయినా ఊచకోతే క్రెయిగ్ మెక్‌మిలన్(న్యూజిలాండ్) 1997-2007 కాలంలో న్యూజిలాండ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన క్రెయిగ్ మెక్‌మిలన్ మంచి బ్యాటర్‌గా గుర్తింపు పొందాడు. తన 10 ఏళ్ల కెరీర్లో ఎక్కువశాతం 10వ నెంబర్ జెర్సీలోనే కనిపించాడు. న్యూజిలాండ్ తరపున 55 టెస్టుల్లో 3116 పరుగులు.. 197 వన్డేల్లో 4707 పరుగులు సాధించాడు. ఇక 8 టి20ల్లో ఆడిన మెక్‌మిలన్ 187 పరుగులు సాధించాడు. స్టువర్ట్ లా(ఆస్ట్రేలియా) 1994-95 మధ్య కాలంలో ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ వా గాయంతో వెనుదిరిగిన సమయంలో అతని స్థానంలో టెస్టు జట్టులోకి వచ్చాడు స్టువర్ట్ లా. ఇదే అతను ఆడిన ఒకే ఒక్క టెస్టు మ్యాచ్. ఇక క్రికెట్ ఆడినంత కాలం తన కెరీర్లో 10వ నెంబర్ జెర్సీని ధరించాడు. ఆసీస్ తరపున 54 వన్డేల్లో 1237 పరుగులు.. ఒక్క టెస్టు మ్యాచ్‌లో 54 పరుగులు సాధించాడు. చదవండి: Joshua da Silva Vs Dhananjaya de Silva: వార్నీ.. ప్రతీకారం ఇలా కూడా తీర్చుకుంటారా! అలెన్ డొనాల్డ్(దక్షిణాఫ్రికా) దక్షిణాఫ్రికా తరపున దిగ్గజ బౌలర్‌గా పేరు పొందిన అలెన్ డొనాల్డ్ జెర్సీ నెంబర్ 10. దక్షిణాఫ్రికా తరపున టెస్టుల్లో 300 వికెట్లు సాధించిన తొలి బౌలర్‌గా డొనాల్డ్ చరిత్ర సృష్టించాడు. ఒక ఓవరాల్‌గా 72 టెస్టులాడిన అలెన్ డొనాల్డ్ 330 వికెట్లతో సౌతాఫ్రికా తరపున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నాడు. అంతేగాక 164 వన్డేల్లో 272 వికెట్లు తీసిన డొనాల్డ్ రిటైర్మెంట్ తర్వాత అంతర్జాతీయంగా కొన్ని దేశాలకు.. చాలా ప్రైవేట్ లీగ్‌ల్లో కోచ్‌గా వ్యవహరించాడు. షాహిద్ అఫ్రిది(పాకిస్తాన్) ఆసియా నుంచి చూస్తే క్రికెట్లో సచిన్ తర్వాత జెర్సీ నెంబర్ 10తో ఫేమస్ అయిన ఆటగాడు షాహిద్ అఫ్రిది మాత్రమే. పాకిస్తాన్ దిగ్గజ ఆల్‌రౌండర్‌గా పేరుపొందిన అఫ్రిది వ్యక్తిగత జీవితంలో వివాదాలకు కొదువ లేకపోయిన.. ఆటలో మాత్రం పలు రికార్డులను బద్దలుకొట్టాడు. వన్డే చరిత్రలో 37 బంతుల్లోనే సెంచరీ సాధించిన అఫ్రిది రికార్డు 17 ఏళ్ల పాటు చెక్కుచెదరలేదు. వన్డే చరిత్రలో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా అఫ్రిది తొలి స్థానంలో ఉన్నాడు. ఇక పాకిస్తాన్ తరపున అఫ్రిది 398 వన్డేల్లో 8064 పరుగులు.. 395 వికెట్లు, 99 టి20ల్లో 1416 పరుగులు.. 98 వికెట్లు తీశాడు. చదవండి: Steve Smith: 'ఇయాన్ చాపెల్ వ్యాఖ్యలను బాత్రూం అద్దానికి అంటించా' డారెన్ లీమన్(ఆస్ట్రేలియా) 1996లో ఆస్ట్రేలియా తరపున అరంగేట్రం చేసిన డారెన్ లీమన్ జట్టులో రెగ్యులర్ సభ్యుడిగా మారడానికి ఐదేళ్లు పట్టింది. లీమన్ 2004-05 కాలంలో 10వ నెంబర్ జెర్సీ ధరించి ఆడాడు. ఆస్ట్రలియా తరపున 117 వన్డేల్లో 3078 పరుగులు సాధించాడు. ఇక ఆటకు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ఆస్ట్రేలియాకు ప్రధాన కోచ్‌గా సేవలందించిన లీమన్ 2017 బాల్‌టాంపరింగ్ ఉదంతం తర్వాత పదవి నుంచి వైదొలిగాడు. జెరెయింట్ జోన్స్(ఇంగ్లండ్) ఇంగ్లండ్ వికెట్ కీపర్‌గా 2004-06 మధ్య కాలంలో సేవలందించిన జెరెయింట్ జోన్స్ తన కెరీర్ మొత్తం జెర్సీ నెంబర్ 10నే ధరించాడు. ఈ కాలంలో అతను ఇంగ్లండ్ తరపున 51 వన్డేల్లో 862 పరుగులు.. 34 టెస్టుల్లో 1172 పరుగులు చేశాడు. పీటర్ సిడిల్(ఆస్ట్రేలియా) 2019లో ఆస్ట్రేలియా క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన పీటర్ సిడిల్ .. 2008 అరంగేట్రం నుంచి రిటైర్ అయ్యేవరకు జెర్సీ నెంబర్ 10తోనే ఆడాడు. ఆస్ట్రేలియా తరపున 67 టెస్టుల్లో 217 వికెట్లు.. 20 వన్డేల్లో 17 వికెట్లు తీశాడు. శార్దూల్ ఠాకూర్(టీమిండియా) టీమిండియా నుంచి సచిన్ తర్వాత శార్దూల్ మాత్రమే జెర్సీ నెంబర్ 10 ధరించాడు. అయితే సచిన్ కానుకగా ఉన్న ఆ జెర్సీని ధరించడంపై క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేయడం సంచలనంగా మారడంతో బీసీసీఐ అనధికారికంగా ఆ జెర్సీ నెంబర్‌ను తొలగించింది. ప్రస్తుతం టీమిండియాకు ఆడుతున్న శార్దూల్ 4 టెస్టులు, 15 వన్డేలు, 24 టి 20లు ఆడాడు. డేవిడ్ మిల్లర్(దక్షిణాఫ్రికా) ప్రస్తుతం దక్షిణాఫ్రికాకు ఆడుతున్న మిల్లర్ కీలక బ్యాటర్‌గా మారాడు. అలెన్ డొనాల్డ్ తర్వాత జెర్సీ నెంబర్ 10 ధరించిన ఆటగాడిగా మిల్లర్ నిలిచాడు. విధ్వంసకర ఆటకు మారుపేరుగా ఉన్న మిల్లర్ దక్షిణాఫ్రికా తరపున 137 వన్డేలు.. 95 టి20లు ఆడాడు. చదవండి: Tim Paine scandal: క్రికెట్‌కు తప్పని రాసలీలల చెదలు.. సెక్స్ స్కాండల్‌లో నలిగిన ఆటగాళ్లు షాహిన్ అఫ్రిది(పాకిస్తాన్) దిగ్గజ ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిది ధరించిన 10వ నెంబర్ జెర్సీని ధరించడం సంతోషంగా ఉందంటూ షాహిన్ అఫ్రిది ట్వీట్ చేయడం వైరల్‌గా మారింది. అయితే క్రికెట్లో అడుగుపెట్టిన మొదట్లో 40వ నెంబర్ జెర్సీతో బరిలోకి దిగిన షాహిన్ ఆ తర్వాత 10వ నెంబర్ జెర్సీతో బరిలోకి దిగి అద్భుతాలు సృష్టిస్తున్నాడు. ప్రస్తుతం అన్ని ఫార్మాట్లలో కీలకబౌలర్‌గా మారిన షాహిన్ టి20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్ సెమీస్ చేరడంలో కీలకపాత్ర పోషించాడు. -
టీనేజ్‌లో మారడోనా నాపై అత్యాచారం చేశాడు
Diego Maradona Rapes Me In Teenage Allegation By Cuban Woman.. డిగో మారడోనా.. దివంగత అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాలర్. 1986 ఫుట్‌బాల్ వరల్డ్‌కప్ గెలవడంలో మారడోనా పాత్ర మరువలేనిది. ఆటలో ఘనమైన రికార్డులు కలిగి ఉన్న మారడోనా వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో వివాదాల్లో చిక్కుకున్నారు. నిషేధిత డ్రగ్స్ వాడాడని నిరూపితం కావడంతో మారడోనాను కొన్నాళ్ల పాటు ఫుట్‌బాల్ నుంచి బహిష్కరించారు. గతేడాది నవంబర్ 25న మారడోనా శస్త్ర చికిత్స అనంతరం కన్నుమూశాడు. కాగా మారడోనా జీవితంపై తాజాగా 'డిగో మారగోనా' పేరుతో ఒక వెబ్‌సిరీస్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా రెండు దశాబ్దాల క్రితం డిగో మారడోనా తనను అత్యాచారం చేశాడంటూ క్యూబన్ మహిళ మావిస్ అల్వారెజ్ ఆరోపించారు. తాను యుక్తవయసులో ఉన్నప్పుడు తనపై అత్యాచారం చేశాడని 37 ఏళ్ల అల్వారెజ్ అనే మహిళ పేర్కొంది. ఈ వ్యవహారంపై బాధిత మహిళ వారిపై ఫిర్యాదు చేయలేదు. కానీ అర్జెంటీనాకు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ విచారణ చేపట్టింది. కాగా అల్వారెజ్ అర్జెంటీనా న్యాయ మంత్రిత్వ శాఖ కోర్టుకు గత వారం వాంగ్మూలం ఇచ్చింది. Photo Credit: Guardian ఆ వాంగ్మూలంలో .. ‘నేను టీనేజ్‌లో ఉండగా 2001లో మారడోనాను కలిశాను. అప్పుడు ఆయన డ్రగ్స్ వినియోగానికి సంబంధించి చికిత్స కోసం క్యూబాకు వచ్చాడు. ఆ సమయంలో నాపై ఓ సందర్భంలో అత్యాచారం చేశాడు. అప్పుడు మారడోనాతో నాలుగైదేళ్ల పాటు సన్నిహితంగా ఉన్నా. ఆ సమయంలో నన్ను చిత్ర హింసలకు గురిచేయడమే కాకుండా మాదక ద్రవ్యాలు తీసుకోవాలని బలవంతం చేశాడు. పలు సందర్భాల్లో భౌతిక దాడులు చేశాడు. దీంతో అమితంగా ఇష్టపడిన అతడిని ఆ తర్వాత అసహ్యించుకున్నా’ అని ఆమె చెప్పుకొచ్చింది. -
ఈ విజయం మారడోనాకు అంకితం..
బ్యూనెస్ ఎయిరెస్: 28 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత కోపా అమెరికా ఛాంపియన్‌గా అవతరించిన అర్జెంటీనా ఆనంద డోలికల్లో తేలియాడుతుంది. ఆ జట్టు టైటిల్ గెలిచాక తొలిసారి ఇన్స్టాగ్రామ్ వేదికగా స్పందించిన అర్జెంటీనా కెప్టెన్ లియోనల్ మెస్సీ.. ప్రతిష్టాత్మక టైటిల్‌ను దివంగత దిగ్గజ ఆటగాడు డీగో మారడోనా సహా కరోనా బాధిత కుటుంబాలకు అంకితమిచ్చాడు. అర్జెంటీనా జట్టు కోపా అమెరికా టైటిల్ గెలవాలని మారడోనా ఆకాంక్షించాడని, అతని కలను నా సారధ్యంలోని అర్జెంటీనా జట్టు సాకారారం చేయడం నా అదృష్టమని మెస్సీ పేర్కొన్నాడు. మారడోనా భౌతికంగా తమ మధ్య లేకపోయినా, అతని ఆత్మ జట్టును ప్రోత్సహిస్తూ ఉండిందని తెలిపాడు. మరోవైపు అభిమానులు విజయోత్సవాలను జరుపుకునే క్రమంలో జాగ్రత్తగా వ్యవహరించాలని, ఈ విజయంతో లభించిన సంతోషంతో బలం తెచ్చుకొని వైరస్‌పై కలిసికట్టుగా పోరాడుదామని ఆయన పిలుపునిచ్చాడు. తన జీవితంలో అన్నీ ఇచ్చిన దేవుడికి ధన్యవాదాలు, ముఖ్యంగా తనను అర్జెంటైన్‌గా పుట్టించినందుకు దేవుడికి కృతజ్ఞతలు అంటూ మెస్సీ భావోద్వేగపూరిత పోస్టు పెట్టాడు. ఇదిలా ఉంటే, ఆదివారం జరిగిన కోపా అమెరికా ఫైనల్ మ్యాచ్‌లో అర్జెంటీనా 1-0తో బ్రెజిల్‌ను చిత్తు చేసింది. దీంతో ఆ దేశ ఆటగాళ్లు, అభిమానులు సంతోషంలో మునిగిపోయారు. ఇది మెస్సీ కెరీర్లో అతిపెద్ద అంతర్జాతీయ టోర్నీ విజయం కావడంతో అతని ఆనందానికి హద్దులు లేవు. ఈ నేపథ్యంలో ఇన్స్టాగ్రామ్ వేదికగా స్పందించిన మెస్సీ.. జట్టు విజయాన్ని కోవిడ్ బాధిత కుటుంబాలకు, అలాగే గతేడాది మరణించిన దిగ్గజ ఫుట్‌బాల్ ఆటగాడు డీగో మారడోనాకు అంకితమిస్తున్నట్లు చెప్పాడు. ఈ సందర్భంగా ఆయన తనకు మద్దతు తెలిపిన కుటుంబసభ్యులకు, స్నేహితులకు, 45 మిలియన్ల అర్జెంటీనా ప్రజలకు కృతజ్ఞతలు తెలిపాడు. -
చెత్త టీం-చెత్త ఆఫర్లు.. ఏం తమాషాగా ఉందా?
ప్రపంచంలోనే ఖరీదైన ఫుట్‌బాల్ ఆటగాడిగా లియోనెల్ మెస్సీ(34)కి ఘనత ఉంది. అయితే తాజాగా బార్సిలోనాతో అతని కాంట్రాక్ట్ ముగిసింది. దీంతో మెస్సీ పయనమెటు? గందరగోళంలో మెస్సీ? అనే శీర్షికలతో చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో చిన్న టీంల నుంచి చెత్త టీంల దాకా ప్రతీ ఒక్క క్లబ్‌లు మెస్సీకి బంపరాఫర్లు ప్రకటిస్తున్నాయి ఇప్పుడు. లియోనెల్ మెస్సీ.. ఇప్పుడు ఫ్రీ ఏజెంట్. బార్సిలోనాతో నాలుగేళ్ల ఒప్పందం జూన్ 30 అర్థరాత్రితో ముగిసింది. దాదాపు 500 మిలియన్ల డాలర్ల ఒప్పందంగా.. ప్రపంచంలోనే కాస్ట్లీ ప్లేయర్ కాంట్రాక్ట్‌ల్లో ఒకటిగా నిలిచింది. ఎన్బీఎ, నేషనల్ ఫుట్‌బాల్ లీగ్, బేస్‌బాల్ లీగ్‌లోనూ ఏ ఆటగాడితో ఇంతటి కాస్ట్లీ కాంట్రాక్ట్‌లు జరగలేదు. ఇదిలా ఉంటే బ్రెజిల్ ఐబిస్ స్పోర్ట్ క్లబ్ నుంచి వచ్చిన మెస్సీకి ఆఫర్ గురించి పెద్ద ఎత్తున్న చర్చ నడుస్తోంది. É OFICIAL! 🚨 Hoje é o último dia do contrato de Messi com o Barcelona. A partir de amanhã ele já terá um novo clube. Assina, MESSI ✒️📄🤝@betsson_brasil #MessiNoÍbis pic.twitter.com/tJKMOrqnLD — Íbis Sport Club (@ibismania) June 30, 2021 ప్రపంచంలోనే చెత్త ఫుట్‌బాల్ టీంగా ఐబిస్ స్పోర్ట్ క్లబ్ పేరుంది. అంతేకాదు. డెబ్భై నుంచి ఎనభై దశకాల మధ్య దాదాపు నాలుగేళ్లపాటు ఒక్క గేమ్ కూడా గెల్వని రికార్డ్ ఈ క్లబ్ సొంతం. ఇక అలాంటి క్లబ్ మెస్సీకి కొన్ని షరతుల మీద ఒప్పంద పత్రాన్ని ప్రకటించింది. పదిహేనేళ్ల కాంటాక్ట్, అదీ మెరిట్ బేస్ మీద జీతం, గోల్స్ చేయకుంటే కాంట్రాక్ట్ రద్దు చేసి క్లబ్ నుంచి తొలగించడం, కాంటాక్ట్ రద్దైతే తర్వాత ఛాంపియన్ అనే ట్యాగ్‌ను తీసేయడం, పదో నెంబర్ జెర్సీ వేసుకోవద్దని.. అది తమ లెజెండ్ మారో షాంపూకి మాత్రమే సొంతమని , ఇక క్లబ్లో చేరే ముందు మారడోనా కంటే పీలే గొప్పోడని అద్దం ముందు మూడుసార్లు ప్రతిజ్క్ష చేయాలనే కండిషన్.. ఇలా చిత్రమైన ఒప్పందాలతో మెస్సీకి ఆహ్వానం ఆఫర్ ప్రకటించింది ఆ క్లబ్. దీంతో మండిపడుతున్నారు అతని ఫ్యాన్స్. ఇక మెస్సీ పీఆర్ టీం కూడా ఈ వ్యవహరంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే ఇలాంటి వ్యవహారాలను పట్టించుకునేంత తీరిక మెస్సీకి లేదని ప్రకటించింది. ఇక ఈ ఫ్రీ ఏజెంట్ కోసం.. చిన్నచితకా క్లబ్‌లు సైతం పోటీ పడుతున్నాయి. మెస్సీ స్వస్థలం రోసారియో నుంచి నెవెల్స్ ఓల్డ్ బాయ్స్ క్లబ్ ఆసక్తి చూపిస్తోంది. సొంత జట్టుకు వచ్చేయమంటూ ట్విటర్ ద్వారా అతనికి ఆహ్వానం కూడా పలికింది. ఎస్టాడియో మార్సెలో బైస్లా స్టేడియం వద్ద మెస్సీ.. పేరుతో పెద్ద కట్ అవుట్లు(మ్యూరాల్స్) ఏర్పాటు చేయించింది కూడా. ఇక తన కెరీర్ చివర్లో తాను సొంత గూటికే వెళ్తానని చాలాసార్లు మెస్సీ ప్రస్తావించిన విషయం తెలిసిందే. దీంతో ఆశలు పెట్టుకుంది ఓల్డ్ బాయ్స్. ఇక నెదర్లాండ్స్‌కు చెందిన వోలెన్డామ్ క్లబ్, రియల్ సాల్ట్ లేక్(అమెరికా) కూడా మెస్సీకి ఆహ్వానం పలకడం విశేషం. మరి మెస్సీ మనసులో.. సాధారణంగా బార్సిలోనా ఈ సాకర్ మాంత్రికుడి కాంట్రాక్ట్ రెన్యువల్కోసమే ప్రయత్నిస్తుంది. కానీ, 1 బిలియన్ డాలర్ల అప్పుల్లో క్లబ్ కూరుకుపోవడం, పైగా కరోనా దెబ్బకి ఆర్థికంగా కుదేలుకావడంతో కాంట్రాక్ట్ రెన్యువల్ అయ్యేనా? అనే అనుమానాలు ఉన్నాయి. అయితే క్లబ్ ప్రెసిడెంట్ జోవాన్ లపోర్టా స్పందించాడు. అతను మాతో ఉండాలనే మేం అనుకుంటున్నాం. అతనూ కోరుకుంటున్నాడు. అంతా సవ్యంగానే ఉందని వ్యాఖ్యానించాడాయన. మరి మెస్సీ మనసులో ఏముందో తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే. ⚽EL MURAL DEL 🔟 EN LA CIUDAD😍 👏Así va quedando el mural en homenaje a Lionel #Messi que se pinta en Buenos Aires y Azara, una de las esquinas del barrio natal de La Pulga en Rosario. La obra de arte será presentada este jueves 1 de julio. 📸Increíbles imágenes de @rosdrone pic.twitter.com/iY1VSy866X — Rosario3.com (@Rosariotres) June 30, 2021 చదవండి: యూరో 2020.. కరోనా అంటించుకున్న ఆ దేశ అభిమానులు -
‘మారడోనాను డాక్టర్లే చంపారు.. ఆయనను అస్సలు పట్టించుకోలేదు’
బ్వేనోస్ ఎయిరెస్: ఫుట్ బాల్ మాంత్రికుడు, అర్జెంటీనా దివంగత ఆటగాడు డీగో మారడోనాను డాక్టర్లే చంపారని ఆయనకు వైద్యం చేసిన నర్సు సంచలన ఆరోపణలు చేసింది. కేవలం వారి నిర్లక్ష్యం కారణంగానే మారడోనా మృతి చెందాడని, చివరి రోజుల్లో డాక్టర్లు అతన్ని అస్సలు పట్టించుకోలేదని మారడోనా అనుమానాస్పద మృతి కేసులో విచారణ ఎదుర్కొంటున్న దహియానా గిసెలా మాడ్రిడ్ అనే నర్సు పేర్కొంది. ఈ విషయాన్ని ఆమె తన లాయర్ ద్వారా వెల్లడించింది. కేసు విచారణ సందర్భంగా ప్రాసిక్యూటర్ అడిగిన ప్రశ్నలకు నర్సు తరపు న్యాయవాది స్పందిస్తూ.. మారడోనా బ్రెయిన్ సర్జరీ నుంచి కోలుకున్నాక కూడా ఏ డాక్టరూ ఆయన ఆరోగ్య స్థితిని పరీక్షించలేదని తన క్లయింటు చెప్పినట్లు పేర్కొన్నాడు. హాస్పిటల్లో మారడోనా కింద పడిపోయినప్పుడు తన క్లయింట్ ఆయనకు వెంటనే సీఏటీ స్కాన్ చేయాలని చెప్పినప్పటికీ అక్కడే ఉన్న డాక్టర్ స్పందించలేదని, ఈ విషయం మీడియాకు తెలిస్తే రచ్చ చేస్తారని సదరు డాక్టర్ తన క్లయింట్‌తో చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు. ఏ డాక్టర్ కూడా మారడోనా మరణాన్ని ఆపలేకపోయారని, అయన చివరి రోజుల్లో తన క్లయింటే అతని బాగోగులు చూసుకున్నట్లు ఆయన వెల్లడించారు. కాగా, మారడోనా అనుమానాస్పద స్థితిలో మృతి చెందారని, అతని సంతానం ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో మారడోనా వ్యక్తిగత వైద్యునితో సహా ఏడుగురిని ప్రాసిక్యూట్ చేస్తున్నారు. వారిలో మాడ్రిడ్ అనే నర్సు కూడా ఒకరు. మారడోనా గతేడాది నవంబరులో 60 ఏళ్ళ వయస్సులో గుండెపోటుతో ఆర్జెంటీనాలోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో మృతి చెందారు. చదవండి: గ్రౌండ్లో కుప్పకూలిన మరో స్టార్ ప్లేయర్..