నన్ను మారడోనా ఇరికించాడు:మాజీ ప్రేయసి | Diego Maradona set me up,' says arrested ex-girlfriend | Sakshi
Sakshi News home page

నన్ను మారడోనా ఇరికించాడు: మాజీ ప్రేయసి

Published Fri, Jul 18 2014 5:24 PM | Last Updated on Tue, Oct 2 2018 8:39 PM

నన్ను మారడోనా ఇరికించాడు:మాజీ ప్రేయసి - Sakshi

నన్ను మారడోనా ఇరికించాడు:మాజీ ప్రేయసి

బ్యూనోస్ ఎయిర్స్: అర్జెంటీనా ఫుట్ బాల్ మాజీ దిగ్గజం డిగో మారడోనా,  మాజీ ప్రేయసి రోకియో ఒలివాల మధ్య వివాదం ఆసక్తికరంగా మారుతోంది. తన బంగారు ఆభరణాలను మాజీ ప్రేయసి రోకియో దోచుకెళ్లిందని మారడోనా ఆరోపిస్తుంటే.. తాను ఎటువంటి వస్తువులను దొంగిలించలేదని రోకియో గగ్గోలు పెడుతుంది.  'నేను మారడోనా బంగారు ఆభరణాలను దోచుకెళ్లలేదు. నన్ను కావాలని మారడోనా ఇరికించాడు. నేను అతని వద్ద నుంచి ఎటువంటి వస్తువులు తీసుకెళ్లలేదు' అంటూ రోకియో ఒలివా పేర్కొంది. ఈ రోజు బెయిల్ వచ్చిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ..  తనను కావాలనే మారడోనా ఇరికిస్తున్నాడని కన్నీటి పర్యంతమైంది. ఆ ఘటనతో తనకు ఎటువంటి సంబంధం లేదని ఏకరుపు పెట్టింది. ఆమెను శుక్రవారం విచారించిన బ్యూనోస్ ఎయిర్స్ కోర్టు ఆమెకు నిబంధనలతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది. 

 

తన బంగారు ఆభరణాలను రోకియో దోచుకెళ్లిందని మారడోనా ఆరోపించడం తెలిసిందే. దీంతో ఆమెకు దుబాయ్ పోలీసులు అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. తన విలువైన వస్తువులను రోకియో అపహరించిందని మారడోనా ఆ ఫిర్యాదులో పేర్కొన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement