argentine
-
అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం మారడోనా స్పెషల్ ఫోటోలు
-
ఫ్రెంచ్ కోటలో కొత్త చరిత్ర
తొలి రౌండ్ నుంచి మొదలైన సంచలనాల మోత ఫ్రెంచ్ ఓపెన్‌లో ఇంకా కొనసాగుతోంది. వందేళ్లకంటే ఎక్కువ చరిత్ర ఉన్న ఈ టోర్నమెంట్లో ఎవ్వరూ ఊహించని విధంగా మహిళల సింగిల్స్ విభాగంలో తొలిసారి ఓ క్వాలిఫయర్ సెమీఫైనల్‌కు దూసుకొచ్చింది. కెరీర్లో కేవలం రెండో గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆడుతోన్న అర్జెంటీనాకు చెందిన 131వ ర్యాంకర్ నదియా పొడొరోస్కా ఈ ఘనత సాధించింది. ఏమాత్రం అంచనాలు లేకుండా పారిస్ వచ్చిన 23 ఏళ్ల నదియా తన జోరు కొనసాగిస్తూ క్వార్టర్ ఫైనల్లో మూడో సీడ్ స్వితోలినాను బోల్తా కొట్టించి సెమీఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. పారిస్: డిఫెండింగ్ చాంపియన్ వైదొలగడం... టైటిల్ ఫేవరెట్స్ ఆరంభ రౌండ్లలోనే వెనుదిరగడం ... వెరసి ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్‌లో ఊహించని ఫలితాలు నమోదవుతున్నాయి. తొలిసారి ఈ మెగా ఈవెంట్లో మహిళల సింగిల్స్‌లో ఓ క్వాలిఫయర్ సెమీఫైనల్ దశకు అర్హత పొందింది. మంగళవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో 131వ ర్యాంకర్ నదియా పొడొరోస్కా (అర్జెంటీనా) 79 నిమిషాల్లో 6–2, 6–4తో మూడో సీడ్, ప్రపంచ ఐదో ర్యాంకర్ ఎలీనా స్వితోలినా (ఉక్రెయిన్)పై గెలిచింది. ఈ క్రమంలో 23 ఏళ్ల పొడొరోస్కా 2004 తర్వాత ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీఫైనల్ చేరిన తొలి అర్జెంటీనా క్రీడాకారిణిగా నిలిచింది. చివరిసారి అర్జెంటీనా తరఫున 2004లో పౌలా సురెజ్ ఈ ఘనత సాధించింది. పౌలా సురెజ్ కూడా ఫ్రెంచ్ ఓపెన్లోనే సెమీఫైనల్ చేరింది. ఇగా స్వియాటెక్ (పోలాండ్), క్వాలిఫయర్ మారి్టనా ట్రెవిసాన్ (ఇటలీ) మధ్య క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ విజేతతో సెమీఫైనల్లో పొడొరోస్కా ఆడుతుంది. ఆన్స్ జెబర్ (ట్యూనిషియా)తో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో డానియెలా కొలిన్స్ (అమెరికా) 6–4, 4–6, 6–4తో నెగ్గి క్వార్టర్ ఫైనల్ చేరింది. తడబాటు... డిఫెండింగ్ చాంపియన్ యాష్లే బార్టీ ఈ టోర్నీకి దూరంగా ఉండటం... మాజీ చాంపియన్స్ సెరెనా, హలెప్, ముగురుజా... రెండో సీడ్ ప్లిస్కోవా ప్రిక్వార్టర్ ఫైనల్లోపే ని్రష్కమించడంతో మూడో సీడ్ స్వితోలినాకు కెరీర్లో తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ టైటిల్ కలను సాకారం చేసుకునేందుకు మంచి అవకాశం లభించింది. కానీ పొడొరోస్కా రూపంలో స్వితోలినాకు దెబ్బ పడింది. తన క్వార్టర్ ఫైనల్ ప్రత్యర్థి పొడొరోస్కా గురించి అంతగా వినలేదని... ఆమె ఆట గురించి కూడా తెలియదని వ్యాఖ్యానించిన స్వితోలినాకు కోర్టులో విభిన్న పరిస్థితి ఎదురైంది. పొడొరోస్కా ఆటపై అవగాహన కలిగేలోపే స్వితోలినా తొలి సెట్‌ను కోల్పోయింది. 35 నిమిషాలపాటు జరిగిన తొలి సెట్లో నాలుగుసార్లు స్వితోలినా సర్వీస్‌ను బ్రేక్ చేసిన పొడొరోస్కా తన సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయింది. ఇక రెండో సెట్లో ఆరంభంలో ఇద్దరూ 1–1తో సమంగా నిలిచాక మూడుసార్లు చొప్పున తమ సర్వీస్‌లను నిలబెట్టుకోలేకపోయారు. దాంతో స్కోరు 4–4తో సమం అయ్యింది. ఆ తర్వాత పొడొరోస్కా తన సర్వీస్‌ను కాపాడుకొని పదో గేమ్‌లో స్వితోలినా సర్వీస్‌ను బ్రేక్ చేసి సెట్‌తోపాటు మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. మ్యాచ్ మొత్తంలో పొడొరోస్కా తన సరీ్వస్‌ను ఐదుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను ఎనిమిది సార్లు బ్రేక్ చేసింది. స్వితోలినా 8 విన్నర్స్ కొట్టగా... పొడొరోస్కా ఏకంగా 30 విన్నర్స్ కొట్టింది. నెట్ వద్ద పొడొరోస్కా 17 సార్లు... స్వితోలినా ఏడుసార్లు పాయింట్లు సాధించారు. స్వితోలినా క్వాలిఫయర్ అంటే... గ్రాండ్‌స్లామ్ టోర్నీ మెయిన్ ‘డ్రా’లో 128 మంది ఉంటారు. ఇందులో 104 మందికి ర్యాంకింగ్ ద్వారా నేరుగా చోటు కల్పిస్తారు. మిగిలిన 24 మందిలో 8 మందికి నిర్వాహకులు వైల్డ్ కార్డులు ద్వారా ప్రవేశం కల్పిస్తారు. మిగిలిన 16 బెర్త్‌లను క్వాలిఫయింగ్ నాకౌట్ టోర్నీ ద్వారా భర్తీ చేస్తారు. మూడు రౌండ్లపాటు జరిగే క్వాలిఫయింగ్ టోర్నిలో 128 మంది పాల్గొంటారు. క్వాలిఫయింగ్ టోర్నిలో మూడు మ్యాచ్‌లు నెగ్గి ముందంజ వేసినవారు (16 మంది) మెయిన్ ‘డ్రా’కు అర్హత పొందుతారు. ►ఈ టోర్నీకంటే ముందు పొడొరోస్కా తన కెరీర్లో ఏనాడూ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో మ్యాచ్ గెలవలేదు. టాప్–50 ర్యాంకింగ్స్లోపు క్రీడాకారిణిని ఓడించలేదు. 2016లో ఆమె యూఎస్ ఓపెన్‌లో ఆడినా తొలి రౌండ్లోనే నిష్క్రమించింది. డబ్ల్యూటీఏ టూర్ టోర్నీలలో కూడా ఆమె ఏనాడూ వరుస రెండు మ్యాచ్‌ల్లో నెగ్గలేదు. థీమ్‌కు షాక్... పురుషుల సింగిల్స్ విభాగంలో మూడో సీడ్ డొమినిక్ థీమ్ (ఆ్రస్టియా) క్వార్టర్ ఫైనల్లో నిష్క్రమించాడు. 5 గంటల 8 నిమిషాలపాటు సాగిన క్వార్టర్ ఫైనల్లో 12వ సీడ్ డీగో ష్వార్ట్‌జ్‌మన్ (అర్జెంటీనా) 7–6 (7/1), 5–7, 6–7 (6/8), 7–6 (7/5), 6–2తో గతేడాది రన్నరప్ థీమ్‌పై సంచలన విజయం సాధించాడు. తన కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోరీ్నలో సెమీస్ చేరాడు. ►గ్రాండ్‌స్లామ్ టోర్నీల మహిళల సింగిల్స్‌లో పొడొరోస్కా కంటే ముందు క్వాలిఫయర్ హోదాలో 1978 ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో క్రిస్టిన్ డొరీ (ఆ్రస్టేలియా)... 1999 వింబుల్డన్ టోర్నీలో అలెగ్జాండ్రా స్టీవెన్సన్ (అమెరికా) మాత్రమే సెమీస్ చేరారు. -
మరో ప్రాణం తీసిన బాక్సింగ్ రింగ్
బ్యూనోస్ ఎయిర్స్: రింగ్‌లో ప్రత్యర్ధి పిడిగుద్దులు మరో బాక్సర్ ప్రాణం తీశాయి. బాక్సింగ్ రింగ్‌లో తీవ్రంగా గాయపడి రష్యా చెందిన బాక్సర్ మాక్సిమ్ డడ్‌షెవ్ మంగళవారం తుది శ్వాస విడవగా, మరొక బౌట్లో గాయాలు పాలైన అర్జెంటీనాకు చెందిన హుగో సాంతిల్లాన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం ప్రాణాలు విడిచాడు. గత శనివారం ఉరేగ్వే బాక్సర్ ఎడ్వర్డో అబ్రెతో జరిగిన బౌట్‌ను డ్రా చేసుకున్న తర్వాత సాంతిల్లాన్ రింగ్‌లోనే కుప్పకూలిపోయాడు. 10వ రౌండ్ తర్వాత మ్యాచ్ డ్రాగా ముగియడంతో ఇరువురి బాక్సర్ల చేతులను పైకి ఎత్తే క్రమంలో సాంతిల్లాన్ నిలబడలేకపోయాడు. దాంతో హుటాహుటీనా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. కాగా, మెదడులో రక్తం గడ్డ కట్టడంతో సర్జరీ చేశారు. అయితే అది విఫలం కావడంతో గుండు పోటుకు గురైన సాంతిల్లాన్ ప్రాణాలు విడిచాడు. 2015లో ప్రొఫెషనల్ బాక్సర్‌గా మారిన సాంతిల్లాన్.. ఇప్పటివరకూ 19 విజయాలు సాధించి అరుదైన రికార్డును కల్గి ఉన్నాడు. ఈ విజయాల్లో 8 నాకౌట్ విజయాలు కాగా, రెండు డ్రాగా ముగిశాయి. 2016 సెప్టెంబర్‌లో దక్షిణ అమెరికా సూపర్ ఫెదర్వెయిట్ టైటిల్‌ను కైవసం చేసుకోవడంతో సాంతిల్లాన్ వెలుగులోకి వచ్చాడు. సాంతిల్లాన్ మృతిపై వరల్డ్ బాక్సింగ్ అసోసియేషన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. లాటినో సిల్వర్ లైట్ వెయిట్ టైటిల్లో భాగంగా అబ్రెతో జరిగిన పోరులో 23 ఏళ్ల సాంతిల్లాన్ గాయాలు పాలై మృతి చెందడం చాలా బాధాకరమని పేర్కొంది. (ఇక్కడ చదవండి: ప్రాణం తీసిన పంచ్) -
ఐదు నిమిషాలు హ్యాపీగా ఫోన్లో ట్రంప్
బ్యూనస్ఎయిర్స్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అర్జెంటీనా అధ్యక్షుడు మౌరిసియో మ్యాక్రితో ఐదు నిమిషాలు మాట్లాడారు. అది కూడా చాలా సంతోషంగా.. తమ దేశాన్ని సందర్శించేందుకు రావాలంటూ. అదీ కాకుండా ట్రంప్ తమ దేశంలో ఎంతో ముఖ్యంగా భావించే ఉద్యోగాల విషయంలో చర్చించుకుందామని.. ఈక్రమంలో వెనిజులా గురించి కూడా ఆయన మ్యాక్రితో చర్చించారు. ఈ విషయాన్ని అధ్యక్ష భవనం స్పష్టం చేసింది. ‘ట్రంప్ అర్జెంటీనా అధ్యక్షుడు మ్యాక్రితో తో ఐదు నిమిషాలపాటు మాట్లాడారు. ప్రాంతీయ విషయాలు చర్చించుకునేందుకు ఆయన వాషింగ్టన్కు రావాలని ఆహ్వానించారు. అమెరికాలో అర్జెంటీనా నుంచి కొత్త ఉద్యోగాలు సృష్టిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. చాలా సంతోషం వ్యక్తం చేశారు. 2016 నవంబర్‌లో ఎన్నికలు ముగిసినప్పటి నుంచి ఇప్పటి వరకు రెండుసార్లు మా అధ్యక్షుడు మ్యాక్రితో మాట్లాడారు. వీరిద్దరి మధ్యగతం నుంచే మంచి సంబంధాలు ఉన్నాయి’ అని శ్వేత సౌదం తెలిపింది. జీ 20 సదస్సు జరిగే సమయాన్ని ఉపయోగించుకొని ఆ సమయంలోనే వాషింగ్టన్‌ను సందర్శించేలా ఇరు దేశాలు ప్లాన్ చేసుకుంటున్నట్లు కూడా పేర్కొంది. -
వెనుజులాతో జర జాగ్రత్త: మెస్సీ
హవానా: కోపా అమెరికా కప్‌లో భాగంగా వెనుజులాతో జరుగనున్న క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌కు అర్జెంటీనా ఆటగాళ్లు పూర్తిస్థాయిలో సిద్ధం కావాలని ఆ జట్టు కెప్టెన్ లియోనల్ మెస్సీ సూచించాడు. పటిష్టమైన వెనుజులాతో జాగ్రత్తగా ఆడితేనే విజయం సాధ్యమవుతుందన్న విషయాన్ని ప్రతీ ఆటగాడు గుర్తించాలన్నాడు. గ్రూప్-డిలో టాపర్ గా నిలిచామన్న అతి విశ్వాసాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ దరిచేరనీయొద్దని ఆటగాళ్లను మెస్సీ హెచ్చరించాడు. 'వెనుజులా గట్టి ప్రత్యర్థి. ఆ విషయం అర్జెంటీనా ఆటగాళ్లు గుర్తించుకుంటే చాలు. వారు కూడా బలమైన జట్లను ఓడించే క్వార్టర్స్ కు చేరారు. ఆ జట్టును నియంత్రించాలంటే పూర్తిస్థాయి ప్రదర్శన ఒక్కటే మార్గం. అందుకోసం సాధ్యమైనంతవరకూ బాగా సన్నద్ధం కావాలి' అని మెస్సీ తెలిపాడు. మరోవైపు అర్జెంటీనా కోచ్ గెరార్డో మార్టినో కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ప్రస్తుతం వెనుజులా జట్టు అసాధారణ ఆటగాళ్లతో పటిష్టంగా ఉందన్నాడు. మెక్సికోను ఓడించి క్వార్టర్స్ కు చేరిన వెనుజులాను ఎట్టి పరిస్థితుల్లోనూ తక్కువ అంచనా వేయొద్దని సూచించాడు. ఆదివారం అర్జెంటీనా-వెనుజులా జట్లు క్వార్టర్ ఫైనల్లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. -
చేతులు కట్టేసి..నగ్నంగా ఊరేగించిన వీడియో
బ్యూనస్ ఎయిర్స్: అభంశుభంతెలియని పాపపై అత్యాచారానికి ప్రయత్నించిన ఓ దుర్మార్గుడికి స్థానికులు బుద్ధి చెప్పిన వైనం నెట్ లో హల్ చల్ చేస్తోంది. ఎనిమిదిళ్లేపాపపై అఘాయిత్యానికి యత్నించిన ప్రబుద్ధుడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న స్థానికులు అతడిని ఉతికి ఆరేసారు. వీధుల్లో నగ్నంగా ఊరేగించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్ లో చక్కర్లు కొడుతుంది. అర్జెంటీనా బ్యూన్ స్ ఎయిర్స్ లోని శాంతా బ్రిగేడ్ పట్టణంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే బాలికపై లైంగిక దాడి చేస్తూ స్థానికులకు పట్టుబడ్డాడు. అతని ప్రవర్తన తీరును పసిగట్టిన కొంతమంది తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. చెతులువెనక్కి కట్టేసి.. వీధుల్లో నగ్నంగా ఊరేగించారు. ఇంకోసారి ఇలాంటి దుశ్చర్యకు పాల్పడితే చంపేస్తామంటూ మండిపడ్డారు. వీరికి కొంతమంది మహిళలు కూడా తోడయ్యారు. చంపేయండి.. చితక్కొట్టండి.. కారుకు కట్టి ఈడ్చుకుపోండంటూ తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. -
ప్రేమవల్లే 119వ పుట్టిన రోజుకు సిద్ధమవుతున్నా..
అర్జెంటీనా: వంద సంవత్సరాలుమించి బతకడమే కష్టమని మొన్నటి వరకు అనుకోగా 110 ఏళ్లు కూడా బతికి ప్రపంచంలోనే అత్యధిక వయసు కలిగిన వ్యక్తులుగా రికార్డులు నెలకొల్పుతున్నవారు ఈ మధ్య ఎక్కువగానే కనిపిస్తున్నారు. ఇక తాజాగా, అర్జెంటీనాలోని ఓ బామ్మ మాత్రం ఏకంగా 118 ఏళ్లను పూర్తి చేసుకొని తన 119వ పుట్టిన రోజు కేకును కట్ చేసేందుకు సిద్ధంగా ఉంది. అర్జెంటీనాలో ఇప్పటికీ ప్రభుత్వం నుంచి పెన్షన్ పొందుతున్న ఆ శతాధిక యోధురాలి పేరు సెలినా డెల్ కార్మెన్ ఒలియా. ఆమె బ్యూనస్ ఎయిర్స్ లో తన కుమారుడు అల్బర్టో, దత్తత తీసుకున్న కుమార్తె గ్లాడీతో ఉంటుంది. ఆమెకు పన్నెండు మంది సంతానం. ఆమె పేరిట ప్రపంచంలోనే అత్యధిక వయోధికురిలాగా కూడా రికార్డు ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఫిబ్రవరి 15, 1897న ఆమె జన్మించిందని, ఆమెకు జనన నమోదు పత్రం కూడా ఉందని వివరించారు. ఈ సందర్భంగా ఆమె ఇంత సుదీర్ఘ కాలం జీవించడానికి గల కారణాలను పంచుకుంది. 'బాగా కష్టపడి పనిచేయడం, ఎక్కువగా నడవడంతోపాటు చుట్టూ ప్రేమతో నిండిన మనుషులు ఉండటం, పొగ, మద్యం అలవాటు లేకపోవడంవంటి కారణాలు నా జీవితాన్ని సుదీర్ఘంగా ఆరోగ్యంతో ఉంచాయి' అని సెలినా తెలిపింది. అయితే, తన సంతానం గురించి తెలిపిన ఆ బామ్మ తనకు ఎంతమంది మనవళ్లు మనవరాళ్లు ఉన్నారనే విషయం మాత్రం చెప్పలేకపోయింది. ఆమె ఇంట్లోని పిల్లల్లో కొందరు పాఠశాలకు వెళుతుండగా, మరికొందరు తమ సొంత కోళ్ల ఫారంలలో పనికి వెళుతుంటారు. -
39 ఏళ్ల తర్వాత వాళ్లిద్దరూ కలిశారు
సినిమా కథను తలపించేలాగా ఎప్పుడో 39 ఏళ్ల క్రితం విడిపోయిన మనవరాలిని.. బామ్మ మళ్లీ కలుసుకుంది. సుదీర్ఘ నిరీక్షణ ఫలించిందని, తన మనవరాలు మళ్లీ తన దగ్గరకు వచ్చిందంటూ క్రిస్మస్ పండగరోజు అర్జెంటీనాకు చెందిన 92 ఏళ్ల మార్లా ఇసాబెల్ చిచా డి మరియాని చెప్పారు. 1976లో మిలటరీ అధికారులు.. మార్లా మనవరాలు క్లారా అనాహి మరియానిని తీసుకెళ్లారు. క్లారా మూణ్నెళ్ల పసిబిడ్డగా ఉన్నప్పుడు సైన్యం ఆ చిన్నారి తల్లిని చంపి ఎత్తుకెళ్లారు. క్లారా కోసం గాలిస్తూ ఆమె తండ్రి డానియల్ 1977లో అదృశ్యమయ్యాడు. అప్పటి నుంచి మార్లా తన మనవరాలి కోసం అన్వేషిస్తోంది. 'గ్రాండ్ మదర్స్ ఆఫ్ ద ప్లాజా డి మయో' అనే మానవహక్కుల సంస్థ విడిపోయిన కుటుంబ సభ్యులను కలిపేందుకు కృషి చేస్తోంది. ఈ సంస్థలో పనిచేసిన మార్లా 1980లో విడిపోయి మనవరాలి పేరుతో క్లారా అనాహి ఫౌండేషన్‌ను స్థాపించింది. ఎనిమిదేళ్ల క్రితం మార్లా తన మనవరాలికి బహిరంగం లేఖ రాసింది. 'సైన్యం దాడిలో మరణించావని నన్ను నమ్మించేందుకు ప్రయత్నించారు. నువ్వు బతికేఉన్నావని నాకు తెలుసు. నిన్ను చూసి, ఆప్యాయంగా కౌగిలించుకోవాలన్నదే నా కోరిక' అని లేఖలో పేర్కొంది. అంతేగాక క్లారా తల్లిదండ్రులు వివరాలు, వారి అభిరుచులను లేఖలో రాసింది. సుదీర్ఘ అన్వేషణ అనంతరం మార్లా తన మనవరాలు క్లారాను గుర్తించింది. వీరిద్దరికీ జన్యుపరీక్షలు నిర్వహించగా 99.9 శాతం సరిపోలాయి. -
నాలోని డ్రగ్స్ బలహీనతే ప్రత్యర్థికి వరంలా మారేది!
బ్యూనోస్ ఎయిర్స్: తనలోని పూర్తి స్థాయి ఆటగాడు బయట ప్రపంచానికి తెలియకపోవడానికి కారణాన్నిఅర్జెంటీనా మాజీ దిగ్గజం డిగో మారడోనా తాజాగా వెల్లడించాడు. ఇందుకు తనతో పాటు పాతుకుపోయి ఉన్న డ్రగ్స్ అలవాటే ప్రధాన కారణంగా పేర్కొన్నాడు. ఒక అర్జెంటీనా టెలివిజన్ కు ఇచ్చిన ఇంటర్యూలో మారడోనా పలు విషయాలను స్పష్టం చేశాడు. 'నేను డ్రగ్స్ కు బానిస అవ్వడం నా ఆటపై తీవ్ర ప్రభావం చూపింది. ఆ అలవాటే నాలోని నైపుణ్యాన్ని బయటకు రాకుండా చేసింది. నేను ఇప్పటికీ సాధారణ జీవితంలోకి రాకపోవడానికి కారణం యువకుడిగా ఉన్నప్పటి నాలోని ఛాయలు ఇంకా వదిలి వెళ్లకపోవడమే' అని మారడోనా ఆవేదన వ్యక్తం చేశాడు. చాలా సందర్భంల్లో తాను డ్రగ్స్ తీసుకోవటం ప్రత్యర్థులకు వరంలా మారేదని గతాన్ని గుర్తు చేసుకున్నాడు. 1986 వరల్డ్ కప్ సాధించిన అర్జెంటీనా టీంలో సభ్యుడైన మారోడానా.. అనంతరం ఆ జట్టుకు కోచ్ గా కూడా వ్యవహరించాడు. అయితే తాను కోచ్ గా 2010లో వీడ్కోలు చెప్పడాన్నిఇప్పటికీ తాను జీర్ణించుకోలేక పోతున్నానని స్పష్టం చేశాడు. ఒకవేళ అవకాశం వస్తే తిరిగి ఆ బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. -
నన్ను మారడోనా ఇరికించాడు:మాజీ ప్రేయసి
బ్యూనోస్ ఎయిర్స్: అర్జెంటీనా ఫుట్ బాల్ మాజీ దిగ్గజం డిగో మారడోనా, మాజీ ప్రేయసి రోకియో ఒలివాల మధ్య వివాదం ఆసక్తికరంగా మారుతోంది. తన బంగారు ఆభరణాలను మాజీ ప్రేయసి రోకియో దోచుకెళ్లిందని మారడోనా ఆరోపిస్తుంటే.. తాను ఎటువంటి వస్తువులను దొంగిలించలేదని రోకియో గగ్గోలు పెడుతుంది. 'నేను మారడోనా బంగారు ఆభరణాలను దోచుకెళ్లలేదు. నన్ను కావాలని మారడోనా ఇరికించాడు. నేను అతని వద్ద నుంచి ఎటువంటి వస్తువులు తీసుకెళ్లలేదు' అంటూ రోకియో ఒలివా పేర్కొంది. ఈ రోజు బెయిల్ వచ్చిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తనను కావాలనే మారడోనా ఇరికిస్తున్నాడని కన్నీటి పర్యంతమైంది. ఆ ఘటనతో తనకు ఎటువంటి సంబంధం లేదని ఏకరుపు పెట్టింది. ఆమెను శుక్రవారం విచారించిన బ్యూనోస్ ఎయిర్స్ కోర్టు ఆమెకు నిబంధనలతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది. తన బంగారు ఆభరణాలను రోకియో దోచుకెళ్లిందని మారడోనా ఆరోపించడం తెలిసిందే. దీంతో ఆమెకు దుబాయ్ పోలీసులు అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. తన విలువైన వస్తువులను రోకియో అపహరించిందని మారడోనా ఆ ఫిర్యాదులో పేర్కొన్నాడు. -
మాజీ ప్రేయసి దోచుకెళ్లింది: మారడోనా ఫిర్యాదు
దుబాయ్: అర్జెంటీనా ఫుట్ బాల్ మాజీ ఆటగాడు డియాగో మారడోనా మాజీ ప్రేయసికి దుబాయ్ పోలీసులు అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. ఓ దొంగతనం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రోకియో గెరాల్డైనాను విచారించేందుకు దుబాయ్ అధికారులు అరెస్ట్ వారెంట్ జారీ చేసినట్టు పోలీసులు తెలిపారు. తనకు సంబంధించిన విలువైన వస్తువులను రోకియో గెరాల్డైనా దొంగిలించిందని మారడోనా దుబాయ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దుబాయ్ స్పోర్ట్స్ కౌన్సిల్ కు మారడోనా గ్లోబల్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. విలువైన వాచీలను, ఆభరణాలతోపాటు వేలాది దిర్హామ్ లను మార్చి 10 దొంగిలించిందని మారడోనా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫుట్ బాల్ క్రీడాకారిణి అయిన గెరాల్డెనా తన పై వచ్చిన ఆరోపణల్ని ఖండించినట్టు స్థానిక మీడియా కథనాల్ని ప్రచురంచింది. రోకియో గెరాల్డైనాను విచారించేందుకు ఇంటర్ పోల్ సహాయం తీసుకుంటున్నామని పోలీసులు తెలిపారు. గత ఫిబ్రవరిలో గెరాల్డెనాతో మారడొనాకు నిశ్చితార్ధం జరిగింది.