ఐదు నిమిషాలు హ్యాపీగా ఫోన్లో ట్రంప్‌ | Macri, Trump discuss region on phone | Sakshi
Sakshi News home page

ఐదు నిమిషాలు హ్యాపీగా ఫోన్లో ట్రంప్‌

Published Thu, Feb 16 2017 9:17 AM | Last Updated on Sat, Aug 25 2018 7:50 PM

ఐదు నిమిషాలు హ్యాపీగా ఫోన్లో ట్రంప్‌ - Sakshi

ఐదు నిమిషాలు హ్యాపీగా ఫోన్లో ట్రంప్‌

బ్యూనస్‌ఎయిర్స్‌: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ అర్జెంటీనా అధ్యక్షుడు మౌరిసియో మ్యాక్రితో ఐదు నిమిషాలు మాట్లాడారు. అది కూడా చాలా సంతోషంగా.. తమ దేశాన్ని సందర్శించేందుకు రావాలంటూ. అదీ కాకుండా ట్రంప్‌ తమ దేశంలో ఎంతో ముఖ్యంగా భావించే ఉద్యోగాల విషయంలో చర్చించుకుందామని.. ఈక్రమంలో వెనిజులా గురించి కూడా ఆయన మ్యాక్రితో చర్చించారు. ఈ విషయాన్ని అధ్యక్ష భవనం స్పష్టం చేసింది. ‘ట్రంప్‌ అర్జెంటీనా అధ్యక్షుడు మ్యాక్రితో తో ఐదు నిమిషాలపాటు మాట్లాడారు. ప్రాంతీయ విషయాలు చర్చించుకునేందుకు ఆయన వాషింగ్టన్‌కు రావాలని ఆహ్వానించారు.

అమెరికాలో అర్జెంటీనా నుంచి కొత్త ఉద్యోగాలు సృష్టిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. చాలా సంతోషం వ్యక్తం చేశారు. 2016 నవంబర్‌లో ఎన్నికలు ముగిసినప్పటి నుంచి ఇప్పటి వరకు రెండుసార్లు మా అధ్యక్షుడు మ్యాక్రితో మాట్లాడారు. వీరిద్దరి మధ్యగతం నుంచే మంచి సంబంధాలు ఉన్నాయి’ అని శ్వేత సౌదం తెలిపింది. జీ 20 సదస్సు జరిగే సమయాన్ని ఉపయోగించుకొని ఆ సమయంలోనే వాషింగ్టన్‌ను సందర్శించేలా ఇరు దేశాలు ప్లాన్‌ చేసుకుంటున్నట్లు కూడా పేర్కొంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement