ట్రంప్‌ నాకేం ఫోన్‌ చేయలేదు: ఇజ్రాయెల్‌ ప్రధాని | israel pm denies report he spoke to Trump about Gaza talks | Sakshi
Sakshi News home page

ట్రంప్‌ నాకేం ఫోన్‌ చేయలేదు: ఇజ్రాయెల్‌ ప్రధాని

Published Thu, Aug 15 2024 4:39 PM | Last Updated on Thu, Aug 15 2024 5:43 PM

israel pm  denies report he spoke to Trump about Gaza talks

టెల్‌అవీవ్‌: అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ బుధవారం ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజిమన్‌ నెతన్యాహుకు ఫోన్‌ చేసి మాట్లాడినట్లు ఓ కథనం వెలువడింది. హమాస్‌తో కాల్పుల విరమణ ఒప్పందానికి వచ్చేలా ఇజ్రాయెల్‌ను ప్రోత్సహించేందుకు ట్రంప్‌ ఈ ఫోన్‌కాల్‌ చేసినట్లు ఆ కథనం పేర్కొంది. అయితే.. 

తాజాగా ఈ కథనాన్ని ఇజ్రాయెల్‌ ప్రధాని  బెంజమిన్ నెతన్యాహు ఖండించారు. ‘‘ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు నిన్న (బుధవారం).. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఫోన్‌లో మాట్లాడలేదు’’ ఇజ్రాయెల్‌ ప్రధాని  కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.

ట్రంప్‌.. ఫోన్‌ చేసిన  హమాస్‌తో కాల్పుల విరమణ కోసం నెతన్యాహును పోత్సహించినట్లు యాక్సిస్‌ నివేదిక పేర్కొంది. మరోవైపు.. ఈ విషయంపై ట్రంప్‌ ప్రచార  బృందం కూడా స్పందించకపోవటం గమనార్హం. 

ఇదిలా ఉండగా.. ఈజిప్ట్, అమెరికా, ఖతార్‌ దేశాల మధ్యవర్తిత్వంతో ఇవాళ గాజా కాల్పుల విరమణపై ఇజ్రాయెల్‌, హమాస్ మధ్య చర్చలు జరనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ చర్చలను ఎక్కడ జరుపుతారనే విషయంపై స్పష్టత లేదు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement