మాజీ ప్రేయసి దోచుకెళ్లింది: మారడోనా ఫిర్యాదు
మాజీ ప్రేయసి దోచుకెళ్లింది: మారడోనా ఫిర్యాదు
Published Tue, Jul 15 2014 1:48 PM | Last Updated on Tue, Oct 2 2018 8:39 PM
దుబాయ్: అర్జెంటీనా ఫుట్ బాల్ మాజీ ఆటగాడు డియాగో మారడోనా మాజీ ప్రేయసికి దుబాయ్ పోలీసులు అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. ఓ దొంగతనం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రోకియో గెరాల్డైనాను విచారించేందుకు దుబాయ్ అధికారులు అరెస్ట్ వారెంట్ జారీ చేసినట్టు పోలీసులు తెలిపారు. తనకు సంబంధించిన విలువైన వస్తువులను రోకియో గెరాల్డైనా దొంగిలించిందని మారడోనా దుబాయ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దుబాయ్ స్పోర్ట్స్ కౌన్సిల్ కు మారడోనా గ్లోబల్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. విలువైన వాచీలను, ఆభరణాలతోపాటు వేలాది దిర్హామ్ లను మార్చి 10 దొంగిలించిందని మారడోనా పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఫుట్ బాల్ క్రీడాకారిణి అయిన గెరాల్డెనా తన పై వచ్చిన ఆరోపణల్ని ఖండించినట్టు స్థానిక మీడియా కథనాల్ని ప్రచురంచింది. రోకియో గెరాల్డైనాను విచారించేందుకు ఇంటర్ పోల్ సహాయం తీసుకుంటున్నామని పోలీసులు తెలిపారు. గత ఫిబ్రవరిలో గెరాల్డెనాతో మారడొనాకు నిశ్చితార్ధం జరిగింది.
Advertisement
Advertisement