చేతులు కట్టేసి..నగ్నంగా ఊరేగించిన వీడియో | Man 'caught trying to rape a minor', paraded naked on Argentina street | Sakshi
Sakshi News home page

చేతులు కట్టేసి..నగ్నంగా ఊరేగించిన వీడియో

Published Sat, Mar 5 2016 12:50 PM | Last Updated on Tue, Oct 16 2018 8:34 PM

చేతులు కట్టేసి..నగ్నంగా ఊరేగించిన వీడియో - Sakshi

చేతులు కట్టేసి..నగ్నంగా ఊరేగించిన వీడియో

బ్యూనస్ ఎయిర్స్: అభంశుభంతెలియని  పాపపై అత్యాచారానికి  ప్రయత్నించిన  ఓ దుర్మార్గుడికి స్థానికులు బుద్ధి చెప్పిన వైనం నెట్ లో హల్ చల్ చేస్తోంది. ఎనిమిదిళ్లేపాపపై అఘాయిత్యానికి యత్నించిన  ప్రబుద్ధుడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న స్థానికులు అతడిని ఉతికి ఆరేసారు. వీధుల్లో నగ్నంగా ఊరేగించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్ లో చక్కర్లు కొడుతుంది.  అర్జెంటీనా బ్యూన్ స్ ఎయిర్స్ లోని  శాంతా బ్రిగేడ్  పట్టణంలో ఈ ఘటన చోటు  చేసుకుంది.

వివరాల్లోకి వెళితే    బాలికపై లైంగిక దాడి చేస్తూ స్థానికులకు పట్టుబడ్డాడు. అతని  ప్రవర్తన తీరును పసిగట్టిన కొంతమంది తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు.  చెతులువెనక్కి కట్టేసి.. వీధుల్లో నగ్నంగా ఊరేగించారు. ఇంకోసారి ఇలాంటి దుశ్చర్యకు పాల్పడితే చంపేస్తామంటూ   మండిపడ్డారు. వీరికి కొంతమంది మహిళలు కూడా తోడయ్యారు. చంపేయండి.. చితక్కొట్టండి.. కారుకు కట్టి  ఈడ్చుకుపోండంటూ తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. అనంతరం  పోలీసులకు అప్పగించారు.

 



Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement