భారత్‌లో మారడోనా బ్రాండ్‌ | Maradona brand gears up for Indian foray now | Sakshi
Sakshi News home page

భారత్‌లో మారడోనా బ్రాండ్‌

Dec 20 2022 5:57 AM | Updated on Dec 20 2022 6:03 AM

Maradona brand gears up for Indian foray now - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఫ్యాషన్‌ బ్రాండ్‌ మారడోనా భారత్‌కు ఎంట్రీ ఇస్తోంది. అర్జెంటీనాకు చెందిన ప్రముఖ ఫుట్‌బాల్‌ క్రీడాకారుడు, దివంగత డీగో మారడోనా పేరుతో ఈ బ్రాండ్‌ను అర్జెంటీనా కంపెనీ సట్వికా ఎస్‌ఏ ప్రమోట్‌ చేస్తోంది. మారడోనా బ్రాండ్‌ కింద స్పోర్ట్స్‌ గూడ్స్‌తోపాటు ఐవేర్, ఎలక్ట్రానిక్స్, ఫుట్‌వేర్, బెవరేజెస్, పర్ఫ్యూమ్స్, డియోడరెంట్స్‌ ఇక్కడి మార్కెట్లో మూడు, నాలుగు నెలల్లో రంగ ప్రవేశం చేయనున్నాయి. భారత ప్రత్యేక భాగస్వామిగా బ్రాడ్‌ఫోర్డ్‌ లైసెన్స్‌ ఇండియాను సట్వికా నియమించింది.

మారడోనా బ్రాండ్‌ ఉత్పత్తుల విక్రయానికి ప్రముఖ ఫ్యాషన్‌ కంపెనీలు, ఈ–కామర్స్‌ రిటైలర్స్‌తో చర్చిస్తున్నట్టు బ్రాడ్‌ఫోర్డ్‌ తెలిపింది. ఫ్యాషన్, లైఫ్‌స్టైల్, కంజ్యూమర్‌ గూడ్స్, స్పోర్ట్స్‌ వంటి విభాగాల్లో 60కిపైగా బ్రాండ్స్‌ను బ్రాడ్‌ఫోర్డ్‌ భారత్‌లో నిర్వహిస్తోంది. ప్రపంచంలో ప్రముఖ ఫుట్‌బాల్‌ క్రీడాకారుల్లో ఒకరైన మారడోనా.. 1986 వరల్డ్‌ కప్‌ అర్జెంటీనా వశం కావడంలో కీలకపాత్ర పోషించారు. ఆదివారం జరిగిన ఫైనల్స్‌లో ఫ్రాన్స్‌ను ఓడించి 36 ఏళ్ల తర్వాత ప్రపంచ చాంపియన్‌గా అర్జెంటీనా నిలిచిన సంగతి తెలిసిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement