maradona
-
మెస్సీ కాదు!.. నేనే అత్యుత్తమ ఆటగాడిని: రొనాల్డో
దాదాపు దశాబ్ద కాలానికి పైగా ఫుట్‌బాల్ ప్రపంచంలో మకుటం లేని మహారాజులుగా వెలుగొందుతున్నారు పోర్చుగల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో(Cristiano Ronaldo)- అర్జెంటీనా లెజెండ్ లియోనల్ మెస్సీ(Lionel Messi). అద్భుతమైన ఆట తీరుతో ఆకట్టుకునే ఈ ఇద్దరికీ ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. అయితే, ఈ వీళ్లిద్దరిలో ఎవరు గొప్ప అన్న చర్చ ఎప్పుడూ ఆసక్తికరమే.ఈ విషయంపై రొనాల్డో స్వయంగా స్పందించాడు. చాలా మంది మెస్సీకే గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్(GOAT) బిరుదు ఇచ్చేందుకు మొగ్గుచూపవచ్చని అభిప్రాయపడ్డాడు. అయితే, తాను మాత్రం పరిపూర్ణ ఫుట్‌బాలర్‌ని అని పేర్కొన్న రొనాల్డో.. ఫుట్‌బాల్ చరిత్రలో తన కంటే గొప్ప ఆటగాడు లేడని అనడం విశేషం.నేనే ‘కంప్లీట్ ప్లేయర్’స్పానిష్ మీడియా అవుట్లెట్ లాసెక్టా టీవీకి తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో క్రిస్టియానో రొనాల్డో మాట్లాడుతూ.. ‘‘నాలాగా ప్రపంచంలో పరిపూర్ణమైన ఫుట్‌బాలర్ మరెవరూ లేరని అనుకుంటా. ఇప్పటి వరకు ఉన్న ఫుట్‌బాల్ ఆటగాళ్లందరిలో నేనే ‘కంప్లీట్ ప్లేయర్’. నేను అన్ని రకాలుగా ఫుట్‌బాల్ ఆడగలను. చాలా మంది మెస్సీ, మారడోనా లేదంటే.. పీలే పేరు చెప్తారేమో!చరిత్రలోనే అత్యుత్తమ ఆటగాడినివాళ్ల అభిప్రాయాన్ని నేను గౌరవిస్తాను. ఏదేమైనా మోస్ట్ కంప్లీట్ ప్లేయర్ మాత్రం నేనే! ఫుట్‌బాల్ చరిత్రలోనే నేను అత్యుత్తమ ఆటగాడిని. నా కంటే మెరుగ్గా ఆడే ఫుట్‌బాలర్‌ను ఇంత వరకూ చూడలేదు. ఇవి నా మనస్ఫూర్తిగా చెబుతున్న మాటలు’’ అని పేర్కొన్నాడు.అదే విధంగా మెస్సీతో తన అనుబంధం గురించి చెబుతూ.. ‘‘మెస్సీతో నాకు ఎప్పుడూ ఎలాంటి సమస్యా లేదు. గత పదిహేనేళ్లుగా మేము అవార్డులు పంచుకుంటున్నాం. మా మాధ్య ఎలాంటి గొడవలు లేవు. అంతా సవ్యంగానే ఉంది.తనకోసం నేను ఆంగ్లాన్ని తర్జుమా చేసిన సందర్భాలు ఉన్నాయి. అప్పట్లో భలే సరదాగా ఉండేవాళ్లం. ఇక ఆటగాళ్లుగా మేము ప్రత్యర్థులమే కదా. తను తన క్లబ్‌కి, నేను నా క్లబ్‌కి మద్దతుగా ఉంటాం. జాతీయ జట్ల విషయంలోనూ అంతే. అయితే, ఆటతీరు ఎలా ఉందన్న అంశంపై పరస్పరం చర్చించుకుంటూ.. ఫీడ్‌బ్యాక్ తీసుకుంటాం. మా మధ్య ఎల్లప్పుడూ ఆరోగ్యకరమైన పోటీయే ఉంటుంది’’ అని రొనాల్డో తెలిపాడు.కాగా 2002లో పోర్చుగీస్ క్లబ్ స్పోర్టింగ్ జీపీ తరఫున ప్రొఫెషనల్ ఫుట్‌బాలర్‌గా ఎంట్రీ ఇచ్చిన రొనాల్డో.. క్లబ్, అంతర్జాతీయ స్థాయిలో కలిపి ఓవరాల్‌గా 923 గోల్స్‌తో టాప్ గోల్‌స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. తన సుదీర్ఘ కెరీర్లో ఎన్నో రికార్డులు సాధించిన రొనాల్డోకు ఫిఫా వరల్డ్‌కప్ మాత్రం అందని ద్రాక్షగా మిగిలిపోయింది. 648 మిలియన్ల మంది ఫాలోవర్లుఅయితే, ఈ విషయంలో మెస్సీదే పైచేయి. కెప్టెన్‌గా అర్జెంటీనాకు ప్రపంచకప్ అందించిన ఘనత అతడికి దక్కింది. ఇక సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ఫాలోవర్ల విషయంలోనూ రొనాల్డో- మెస్సీ మధ్య పోటీ ఉంది. అయితే, ఇందులో పోర్చుగీస్ ఆటగాడిదే ఆధిపత్యం. ప్రపంచంలోనే అత్యధిక ఫాలోవర్లు రొనాల్డోకు ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో అతడికి ఏకంగా 648 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉండగా.. మెస్సీకి 504 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.చదవండి: CT 2025: సమయం మించిపోలేదు.. అతడిని జట్టులోకి తీసుకోండి: అశ్విన్ -
మెస్సీ లేరా.. సోషల్ మీడియాలో కాంతారా మీమ్ వైరల్..
నరాలు తెగిపోతాయా అన్నంత టెన్షన్.. ఫ్రాన్స్ ఒక వైపు.. అర్జెంటీనాకు మద్దతుగా మిగతా ప్రపంచమంతా ఓవైపు అన్నట్లుగా జరిగిన గేమ్.. దానికి కారణం.. మెస్సీ... అతడి కోసమైనా అర్జెంటీనా గెలవాలి అన్నట్లుగా ఫుట్‌బాల్ అభిమానులు ప్రార్థనలు చేశారు.. ఊపిరి బిగపట్టి మ్యాచ్‌ను చూశారు. జగజ్జేతగా నిలిచిన తర్వాత అటు అర్జెంటీనాలో లక్షలాదిగా జనం రోడ్డు మీదకు వచ్చి సంబరాలు చేసుకుంటే.. ఇటు సోషల్ మీడియాలో అభిమానులు రకరకాల ఫన్నీ మీమ్స్‌లో సందడి చేశారు. అందులో ఎక్కువ మందిని ఆకర్షించిన మీమ్.. ఇదిగో ఈ కాంతారా మీమ్.. ఇరుపక్షాల స్కోర్ సమమై.. మెస్సీ నీరసపడినప్పుడు అతడిలోని మహాశక్తిని నాటి మేటి దిగ్గజం మారడోనా మేల్కొలుపుతున్నట్లుగా రూపొందించిన ఈ మీమ్ ట్విట్టర్లో అందరినీ ఆకర్షిస్తోంది. చదవండి: అర్జెంటీనా జెర్సీలో వరుడు.. ఫ్రాన్స్ జెర్సీలో వధువు.. Messi and Maradona ( Kantara Inspired) Hats off to whoever done this edit#FIFAWorldCup pic.twitter.com/ZXLiunReue — Mr.S (@SarangSuresh95) December 18, 2022 -
భారత్‌లో మారడోనా బ్రాండ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫ్యాషన్ బ్రాండ్ మారడోనా భారత్‌కు ఎంట్రీ ఇస్తోంది. అర్జెంటీనాకు చెందిన ప్రముఖ ఫుట్‌బాల్ క్రీడాకారుడు, దివంగత డీగో మారడోనా పేరుతో ఈ బ్రాండ్‌ను అర్జెంటీనా కంపెనీ సట్వికా ఎస్ఏ ప్రమోట్ చేస్తోంది. మారడోనా బ్రాండ్ కింద స్పోర్ట్స్ గూడ్స్‌తోపాటు ఐవేర్, ఎలక్ట్రానిక్స్, ఫుట్‌వేర్, బెవరేజెస్, పర్ఫ్యూమ్స్, డియోడరెంట్స్ ఇక్కడి మార్కెట్లో మూడు, నాలుగు నెలల్లో రంగ ప్రవేశం చేయనున్నాయి. భారత ప్రత్యేక భాగస్వామిగా బ్రాడ్ఫోర్డ్ లైసెన్స్ ఇండియాను సట్వికా నియమించింది. మారడోనా బ్రాండ్ ఉత్పత్తుల విక్రయానికి ప్రముఖ ఫ్యాషన్ కంపెనీలు, ఈ–కామర్స్ రిటైలర్స్‌తో చర్చిస్తున్నట్టు బ్రాడ్ఫోర్డ్ తెలిపింది. ఫ్యాషన్, లైఫ్‌స్టైల్, కంజ్యూమర్ గూడ్స్, స్పోర్ట్స్ వంటి విభాగాల్లో 60కిపైగా బ్రాండ్స్‌ను బ్రాడ్ఫోర్డ్ భారత్‌లో నిర్వహిస్తోంది. ప్రపంచంలో ప్రముఖ ఫుట్‌బాల్ క్రీడాకారుల్లో ఒకరైన మారడోనా.. 1986 వరల్డ్ కప్ అర్జెంటీనా వశం కావడంలో కీలకపాత్ర పోషించారు. ఆదివారం జరిగిన ఫైనల్స్‌లో ఫ్రాన్స్‌ను ఓడించి 36 ఏళ్ల తర్వాత ప్రపంచ చాంపియన్‌గా అర్జెంటీనా నిలిచిన సంగతి తెలిసిందే. -
28 ఏళ్ల నిరీక్షణకు తెర, కన్నీళ్లతో ఆటగాళ్లు..
అద్భుతమైన జట్టుగా పేరు.. అయితేనేం!. ప్రతిష్టాత్మకంగా భావించే ట్రోఫీని ఎత్తడానికి 28 ఏళ్లు ఎదురుచూసింది అర్జెంటీనా టీం. చివరకు మారడోనా లాంటి దిగ్గజానికి సైతం కలగా మిగిలిపోయిన టోర్నీ అది. అలాంటిది ఉత్కంఠభరింతగా జరిగిన మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ బ్రెజిల్‌ను ఓడించింది అర్జెంటీనా. తద్వారా కోపా అమెరికా 2021 టోర్నీ కైవసం చేసుకుని టైటిల్ ఛాంపియన్‌గా నిలిచింది. దక్షిణ అమెరికా ఖండంలోని దేశాల మధ్య జరిగే కోపా అమెరికా టోర్నీ 2021 సీజన్లో మొత్తం పది దేశాలు పాల్గొన్నాయి. వీటిలో బ్రెజిల్..అర్జెంటీనాలు ఫైనల్‌కు చేరుకున్నాయి. భారత కాలమానం ప్రకారం.. ఆదివారం వేకువ జామున రియో డీ జనెయిరోలోని మారాకానా స్టేడియంలో ఈ రెండు జట్లు తలపడ్డాయి. ఆట ఇరవై రెండో నిమిషంలో అర్జెంటీనా ఆటగాడు Ángel Di María చేసిన గోల్ మ్యాచ్‌కు కీలకంగా మారింది. ఇక బ్రెజిల్‌కు గోల్ చేసే అవకాశం ఇవ్వకుండా కట్టడి చేయగలిగారు అర్జెంటీనా ఆటగాళ్లు. దీంతో లియోనెల్ మెస్సీ కెప్టెన్సీలోని అర్జెంటీనా టీం 15వ కోపా అమెరికా ట్రోఫీని ఎత్తి సంబురాలు చేసుకుంది. #CopaAmérica 🏆 ¡ACÁ ESTÁ LA COPA! Lionel Messi 🔟🇦🇷 levantó la CONMEBOL #CopaAmérica y desató la locura de @Argentina 🇦🇷 Argentina 🆚 Brasil 🇧🇷#VibraElContinente #VibraOContinente pic.twitter.com/PCEX6vtVee — Copa América (@CopaAmerica) July 11, 2021 మెస్సీ-నెయ్మర్.. ఇద్దరూ కన్నీళ్లే ఓవైపు ఓటమి భారంతో బ్రెజిల్ స్టార్ ప్లేయర్ నెయ్మర్ దా సిల్వ శాంటోస్ శోకంతో ఏడుస్తుంటే.. మరోవైపు తన నేతృత్వంలో అర్జెంటీనా తొలి కప్పు సాధించడంతో Lionel Messi భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇద్దరూ ఒకరినొకరు కౌగిలించుకుని ఓదార్చుకున్నారు. #CopaAmérica 🏆 ¡LO LINDO DEL FÚTBOL! Emotivo abrazo entre Messi 🇦🇷 y Neymar 🇧🇷 ¡ÍDOLOS! 🇦🇷 Argentina 🆚 Brasil 🇧🇷#VibraElContinente #VibraOContinente pic.twitter.com/ecknhlv2VI — Copa América (@CopaAmerica) July 11, 2021 తన ప్రొఫెషనల్ క్లబ్ కెరీర్లో 34 టైటిల్స్ నెగ్గిన మెస్సీ.. అర్జెంటీనా తరఫున మాత్రం ఇప్పటి వరకు ఒక్క మేజర్ టైటిల్ గెలవలేకపోయాడు. తాజా విక్టరీతో అతనికి ఆ లోటు తీరినట్లయ్యింది. ఆట ముగిశాక.. బ్రెజిల్-అర్జెంటీనా ఆటగాళ్లు మైదానంలో కూర్చుని సరదాగా గడపడం ఆకట్టుకుంది. Messi is tossed in the air by his Argentina teammates. It means everything ❤️pic.twitter.com/cIMJahlCAQ — ESPN India (@ESPNIndia) July 11, 2021 ఇక ఇంతకుముందు అర్జెంటీనా 1993లో కోపా అమెరికా కప్ చాంపియన్‌గా నిలిచింది. 2004, 2007, 2015, 2016ల్లో రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకుంది. విశేషం ఏంటంటే.. పీలే బ్రెజిల్ కెప్టెన్‌గా ఉన్న టైంలోనూ బ్రెజిల్ కోపాను గెల్చుకోలేకపోయింది. -
మారడోనా మృతి.. ట్రెండింగ్‌లో రిప్ మడోన్నా
బ్యూనస్ ఎయిర్స్ (అర్జెంటీనా) : ప్రపంచ పుల్‌బాల్ దిగ్గజ ఆటగాడు డీగో మారడోనా మృతి అభిమానులను తీవ్రంగా కలిచివేస్తోంది. సాకర్ స్టార్ ప్లేయర్ ఇక లేరనే వార్త పుట్‌బాల్ ప్రియులను శోకసంద్రంలో ముంచింది. కేవలం ఆటలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది అభిమానులు సొంతం చేసుకున్న మారడోనా ఇకలేడనే వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. పుట్‌బాల్ మాంత్రికుడి మరణవార్త ప్రపంచ క్రీడా లోకాన్ని కన్నీటిసంద్రంలో ముంచింది. తమ ఆరాధ్య ఆటగాడి కోసం యావత్ అర్జెంటీనా విలపించింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా డీగో అభిమానులు సోషల్ మీడియా వేదికగా నివాళి అర్పించారు. రిప్ మారడోనా అంటూ సాకర్ దిగ్గజానికి కడసారి వీడ్కోలు పలికారు. అయితే కొంత అభిమానులు చేసిన తప్పిదం హాలీవుడ్ పాప్ సింగర్ మడోన్నాకు తలనొప్పి తెచ్చిపెట్టింది. ఎంకి పెళ్లి.. సుబ్బి సావుకొచ్చినట్టు మారడోనాకు బదులుగా రిప్ మడోన్నా అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. (గుడ్‌బై మారడోనా) చనిపోయింది మారడోనానా లేక మడోన్నా అన్న విషయంపై క్లారిటీ లేకుండా ఏకంగా రిప్ మడొన్నా అంటూ ట్వీట్ చేయడం ఆరంభించారు. ఇది చూసిన కొంతమంది షాక్అవ్వగా.. మరికొంత మంది అభిమానులు మాత్రం నిజంగానే ఆమె మరణించిందని సోషల్ మీడియా వేదికగా తమ ఆవేదనను వ్యక్తం చేశారు. తమ అభిమాన సింగర్ మృతిని జీర్ణించుకోలేపోతున్నామని విలపించారు. ఆమె పాటలు, వీడియోలో షేర్ చేస్తూ నివాళి అర్పిస్తున్నట్లు ట్వీట్ చేశారు. ‘రిప్ మడోన్నా’ అనే ట్వీట్కాస్తా సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి వచ్చింది. RIP Madonna, you'll be forever in our hearts. Legend. pic.twitter.com/EnMrIUZhRs — icah (@poemtoahoe) November 25, 2020 Rip Madonna gone too soon 😭😭 pic.twitter.com/KMxziKA82y — Trap House (@SugarDaada) November 25, 2020 -
తక్కువ అంచనా వేస్తే అంతే!
ప్రపంచకప్‌లో ఎంతటి మేటి జట్టుకైనా తొలి మ్యాచ్ పరీక్షగా నిలుస్తుంది. మైదానం, వాతావరణం, ప్రేక్షకుల మద్దతు తదితర అంశాలు కూడా కొత్తవిగా ఉంటాయి. 1990 ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లో అర్జెంటీనాపై కామెరూన్ సాధించిన విజయం ఇప్పటికీ మదిలో మెదులుతూ ఉంటుంది. ఆ తర్వాతి ప్రపంచకప్‌లలో మాత్రం గొప్ప జట్లు తొలి మ్యాచ్‌ను ఏమాత్రం తేలికగా తీసుకోలేదు. ప్రస్తుత వరల్డ్ కప్ విషయానికొస్తే దక్షిణ అమెరికా జట్లకు రష్యాలో తొలి మ్యాచ్‌లే కఠిన పరీక్ష పెట్టనున్నాయి. అర్జెంటీనా తొలి మ్యాచ్‌లో యూరోప్ జట్లయిన ఐస్‌లాండ్‌తో ఆడనుంది. లియోనెల్ మెస్సీ జట్టులో ఉన్నప్పటికీ యూరోప్ జట్లను ఓడించడం సులువేమీ కాదు. మరోవైపు స్విట్జర్లాండ్‌తో బ్రెజిల్... డెన్మార్క్‌తో పెరూ తొలి పరీక్షను ఎదుర్కోబోతున్నాయి. జపాన్ రూపంలో కొలంబియాకే కాస్త సులువైన ప్రత్యర్థి లభించింది. క్వాలిఫయర్స్‌లో అర్జెంటీనా ఆటతీరు నన్ను ఆకట్టుకోలేదు. మెస్సీ మ్యాజిక్‌తో ఆ జట్టు ముందంజ వేసిందనే చెప్పాలి. డిఫెన్స్, మిడ్‌ఫీల్డ్‌లో అర్జెంటీనా బలహీనంగా ఉంది. 2014లో ఈ అంశాల్లో అర్జెంటీనా బలంగా కనిపించింది. నాకౌట్ దశలో యూరోప్ జట్లతో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో అర్జెంటీనా కేవలం ఒక గోల్ మాత్రమే సమర్పించుకుంది. ప్రపంచకప్‌నకు ముందు అర్జెంటీనా తమ సన్నాహాల్లో ఎక్కువ ఫ్రెండ్లీ మ్యాచ్‌లు ఆడలేదు. ఐస్లాండ్తోపాటు క్రొయేషియా, నైజీరియా కూడా మంచి జట్లే కావడంతో గ్రూప్ ‘డి’లో అర్జెంటీనా జాగ్రత్తగా ఉండాల్సిందే. తొలి ప్రపంచకప్ ఆడుతోందని ఐస్లాండ్ను తక్కువ అంచనా వేస్తే అది మూర్ఖత్వమే అవుతుంది. రెండేళ్ల క్రితం ఆ జట్టు యూరో చాంపియన్‌షిప్‌లో క్వార్టర్ ఫైనల్‌కు చేరిన విషయం మర్చిపోకూడదు. తన గొప్పతనం నిరూపించుకునేందుకు మెస్సీ ప్రపంచకప్ సాధించాల్సిన అవసరం లేదు. అయితే అతను మాత్రం ఈసారి ఎలాగైనా కప్ పట్టాల్సిందేనని పట్టుదలగా ఉన్నాడు. సెకన్లలో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేయగల సత్తా మెస్సీలో ఉందని తెలుసు. ప్రపంచకప్ అందుకుంటే ఆ అనుభూతి ఎలా ఉంటుందనేది మాటల్లో వర్ణించలేను. మెస్సీ స్వయంగా ఈ అనుభవం తెలుసుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. 2014 ప్రపంచకప్‌లో మెస్సీకి సహచరుల నుంచి అంతగా మద్దతు లభించలేదు. మెస్సీ ఉన్నంతసేపు అర్జెంటీనా ఏదైనా చేయగలదు. అయితే అతనికి సహచరుల నుంచి ఏమేరకు సహకారం అందుతుందనేది కూడా కీలకం. -
ఆట... కొట్లాట...
ప్రపంచకప్‌లాంటి ప్రతిష్టాత్మక ఈవెంట్లో అద్భుతమైన ఆటతో పాటు అప్పుడప్పుడు అనూహ్య ఘటనలు సాధారణం. ఆటగాళ్ల దూకుడుతో మైదానంలో ఘర్షణలు సహజం. కొన్నిసార్లు రిఫరీ నిర్ణయాలు కూడా అగ్గి రాజేస్తాయి. ఇన్నేళ్లలో ఫుట్‌బాల్ వరల్డ్‌కప్‌నకు సంబంధించి జరిగిన కొన్ని వివాదాస్పద ఘటనలను చూస్తే...–సాక్షి క్రీడా విభాగం హ్యాండ్ ఆఫ్ గాడ్ (1986) చరిత్రలో ఇది ఎవరూ మరచిపోలేని ఘటన. 1986 వరల్డ్ కప్ క్వార్టర్ ఫైనల్లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అర్జెంటీనా సూపర్ స్టార్ మారడోనా చేసిన ఒక గోల్ అలా వివాదంగా నిలిచిపోయింది. ఇంగ్లండ్ గోల్ కీపర్ పీటర్ షిల్టన్‌ను తప్పించి గాల్లో ఎగురుతూ మారడోనా బంతిని గోల్ పోస్ట్‌లోకి పంపించాడు. అయితే మారడోనా తన చేతిని తగిలించాడంటూ ఇంగ్లండ్ ఆటగాళ్లు రిఫరీకి ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. తాను హెడర్ ద్వారా నే గోల్ చేశానని, చేయి తగిలించలేదని ఆ తర్వాత చెప్పుకున్న మారడోనా... నిజంగా అక్కడ చేయి గనక తగిలి ఉంటే అది దేవుడిదే అయి ఉంటుందని వ్యాఖ్యానించాడు. ఈ గెలుపు అర్జెంటీనాను ఆ తర్వాత విజేతగా నిలపడంలో కీలకమైంది. దక్షిణ కొరియా మ్యాచ్ ఫిక్సింగ్ (2002) సొంతగడ్డపై జరిగిన వరల్డ్‌కప్‌లో దక్షిణ కొరియా రిఫరీలను వాడుకుని ఫిక్సింగ్‌కు పాల్పడిందనే వార్తలు వచ్చాయి. ఇటలీతో ప్రిక్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో, ఆ తర్వాత స్పెయిన్‌తో జరిగిన సెమీస్‌లో సాధారణ రిఫరీ నిర్ణయాలు కూడా ప్రత్యర్థులకు ప్రతికూలంగా రాగా, చిన్న చిన్న కారణాలకే ఎల్లో కార్డులు చూపించి రిఫరీలు కొరియా పని సులువు చేశారని వినిపించింది. కప్పే ఎత్తుకెళ్లారు 1966లో ఇంగ్లండ్‌లో వరల్డ్ కప్ టోర్నీ జరగడానికి నాలుగు నెలల ముందు అభిమానులు చూసేందుకు కప్‌ను అందుబాటులో ఉంచారు. అది చోరీకి గురవడంతో తీవ్ర వివాదం చెలరేగింది. దొంగిలించినవారు 15 వేల పౌండ్లు డిమాండ్ చేశారు. అయితే చివరకు ఓ కుక్క దానిని వెతికి పెట్టడం విశేషం. ప్రాణం తీసిన సెల్ఫ్ గోల్... 1994 ప్రపంచకప్‌తో సంబంధం ఉండి, మైదానం బయట జరిగిన మరో ఘటన ఫుట్‌బాల్ సమాజాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. అమెరికాతో మ్యాచ్‌లో కొలంబియా ఆటగాడు ఆండ్రియస్ ఎస్కోబార్ చేసిన సెల్ఫ్ గోల్ చివరకు అతడి ప్రాణాన్నే తీసింది. ఈ మ్యాచ్‌లో అమెరికా మిడ్ ఫీల్డర్ జాన్ హార్క్స్ పాస్‌ను అడ్డుకునే క్రమంలో ఎస్కోబార్ బంతి తమ గోల్‌పోస్ట్‌లోకే పంపించాడు. దీంతో అమెరికా 2–1తో గెలవగా కొలంబియా నిష్క్రమించింది. మ్యాచ్ జరిగిన తొమ్మిది రోజుల తర్వాత ఒక బార్ ముందు ఒంటరిగా ఉన్న ఎస్కోబార్‌పై దుండగులు ఆరు రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ క్రమంలో వారు ‘గోల్... గోల్’ అని అరవడాన్ని బట్టి చూస్తే అది మ్యాచ్ ఫలితం నేపథ్యంలో చేసిన హత్యేనని తేలింది. పోలీసులొచ్చారు... 1962లో ఇటలీ, చిలీ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆటగాళ్లు ఒకరినొకరు కొట్టుకున్నారు. ఫుట్‌బాల్ కంటే కూడా ఆటగాళ్ల మధ్య పంచ్‌లు, కిక్‌లు ఎక్కువైపోయి మూడుసార్లు పోలీసులు రంగప్రవేశం చేయాల్సి వచ్చింది. అత్యంత వివాదాస్పదంగా సాగిన ఈ మ్యాచ్‌ను చిలీ 2–0తో గెలుచుకుంది. తలతో కుమ్మేశాడు జర్మనీ ఆతిథ్యమిచ్చిన 2006 వరల్డ్ కప్‌లో నాటి ఫ్రాన్స్ స్టార్ జినెదిన్ జిదాన్ హెడ్ బట్ ఉదంతం పెద్ద సంచలనం సృష్టించింది. ఇటలీతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఈ ఘటన జరిగింది. మ్యాచ్‌లో ఇరు జట్లు 1–1తో సమంగా ఉన్న సమయంలో ఇటలీ ఆటగాడు మటెరాజితో మాటామాటా పెరగడంతో జిదాన్ తలతో అతడిని బలంగా ఢీ కొట్టాడు. దాంతో రిఫరీ రెడ్ కార్డ్ చూపించి జిదాన్‌ను బయటకు పంపించాడు. అదే జిదాన్‌కు ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్. తాను చనిపోవడానికైనా సిద్ధమే కానీ మటెరాజికి క్షమాపణ మాత్రం చెప్పనని తర్వాత అతడు స్పష్టం చేశాడు. గోల్æకాదు... గగ్గోల్... 2010లో ఇంగ్లండ్, జర్మనీ మధ్య మ్యాచ్‌లో వివాదాస్పద గోల్ నమోదైంది. ఫ్రాంక్ లంపార్డ్ (ఇంగ్లండ్) కొట్టిన కిక్ గోల్‌పోస్ట్ పైన తగిలిన బంతి లోపల పడి బౌన్స్ అయి బయటకు వచ్చింది. దానిని అందుకున్న కీపర్ మాన్యూల్ న్యూయెర్ తిరిగి ఆటను కొనసాగించగా రిఫరీ గోల్ ఇవ్వలేదు. రీప్లేలో బంతి స్పష్టంగా లోపలి వైçపు పడినట్లుగా కనిపించింది. ఇలాంటి వివాదాలు పునరావృతం కాకూడదనే ఉద్దేశంతో 2014 ప్రపంచకప్‌లో కొత్తగా గోల్‌లైన్ టెక్నాలజీని ప్రవేశపెట్టారు. కీపర్ క్రూరత్వం... 1982 ప్రపంచకప్‌లో జర్మనీ గోల్ కీపర్ హెరాల్డ్ షూమాకర్ అత్యంత దారుణంగా ప్రవర్తించాడు. సెమీస్ మ్యాచ్‌లో ఫ్రాన్స్ ఆటగాడు ప్యాట్రిక్ బటిస్టన్... జర్మనీ పెనాల్టీ ఏరియాలోకి దూసుకొచ్చాడు. షూమాకర్ బంతిని ఆపడం కాకుండా తన శరీరంతో బటిస్టన్ను బలంగా ఢీకొట్టాడు. ఈ దెబ్బకు బటిస్టన్ తీవ్రంగా గాయపడ్డాడు. రెండు పళ్లు ఊడిపోయాయి. దాదాపు అచేతన స్థితిలో స్ట్రెచర్‌పై బయటకు తీసుకెళ్లాల్సి వచ్చింది. మ్యాచ్ ముగిశాక షూమాకర్పై కనీస చర్య కూడా తీసుకోలేదు. -
అణువంత దేశాలు... ఆటలో చిరుతలు!
మారడోనా... జినెదిన్ జిదాన్.. రొనాల్డో... మిరొస్లావ్ క్లోజ్! ...తమ తమ దేశాలకు ఫుట్‌బాల్ ప్రపంచకప్ అందించిన స్టార్లు. మనందరికీ వెంటనే గుర్తుకొచ్చే పేర్లు కూడా. జార్జి బెస్ట్... ర్యాన్ జిగ్స్... ఇయాన్ రష్... జారి లిట్మనెన్! ...మరి వీరెవరో తెలుసా? కనీసం ఈ పేర్లు ఎప్పుడైనా విన్నారా? ఆ అవకాశమే లేదు! కానీ, వీరూ ఫుట్‌బాలర్లే! పై వరుసలో చెప్పుకున్నంత గొప్పవారు కాకున్నా తేలిగ్గా తీసిపారేసే వారైతే కాదు. అయితే, వీరి గురించి ఎక్కడా, ఎప్పుడూ చెప్పుకోరేం? కనీసం లీగ్‌ల్లో అయినా ప్రస్తావన రాదేం? ఎందుకంటే... వీరి దేశాలు ప్రపంచకప్‌కు ఎన్నడూ అర్హత సాధించలేదు కాబట్టి. అయినా, మహా సంగ్రామానికి అర్హత పొదండం అంత ఆషామాషీ కాదు కదా? అందుకనే ఈ స్టార్లు సూపర్ స్టార్లు కాలేకపోయారు. మరోవైపు కొన్ని చిన్న దేశాలు మాత్రం ఈ విశ్వ క్రీడా సంబరంలో తమదైన ముద్ర వేస్తున్నాయి. ఆట గొప్పదా? దేశం గొప్పదా? అంటే... ఆటతో దేశం గొప్పతనాన్ని చాటడం గొప్ప అంటున్నాయి. ఇంతకీ ఆ దేశాలేమంటే...! సాక్షి క్రీడా విభాగం: ‘అదంతా అలా సాగిపోయింది. అయినా ఎలాంటి బాధ, విచారం లేదు. ఆటలోని పోటీతో పాటు ఆటగాళ్లందరిపైనా నాకు గౌరవం ఉంది. ప్రపంచకప్‌నకు అర్హత సాధించడం అంత సులువు కాదు’ ఈ మాటలన్నది లైబీరియన్ మాజీ ఫుట్‌బాలర్, ప్రస్తుత ఆ దేశ అధ్యక్షుడు జార్జ్ వీ. ఫిఫా ఫుట్‌బాలర్ ఆఫ్ ద ఇయర్, బ్యాలెన్ డి ఓర్ వంటి ప్రతిష్ఠాత్మక పురస్కారాలు గెల్చుకున్న ఆటగాడీయన. కానీ లైబీరియా ప్రపంచ కప్‌లో ఎన్నడూ ఆడకపోవడంతో పేరు బయటకు రాలేదు. కెరీర్ ముగిశాక రాజకీయాల్లోకి వెళ్లిపోయారు. ఆటగాడిగా ఈయన గురించి వెదికితే ఏకంగా అధ్యక్షుడిగా కనిపించారు. ప్రస్తుతం ఫుట్‌బాల్ ద్వారా తమ చిన్న దేశానికి సాధ్యమైనంత పేరు తెచ్చానన్న సంతృప్తిలో ఉన్నారీయన. మేటి ఆటగాళ్లయిన బెస్ట్ (ఉత్తర ఐర్లాండ్), జిగ్స్, రష్ (వేల్స్), లిట్మనెన్ (ఫిన్లాండ్) సైతం జార్జ్ వీ కోవలోకే వస్తారు. వీరి దేశాలు చిన్నవి అయినందునే ఈ పరిస్థితి ఎదురైందనే అభిప్రాయం ఉంది. కానీ, కొంత అదృష్టం లేకపోవడం కూడా ఓ కారణమనే చెప్పాలి. ఆసియా ఆటకు అంతా కలిసొస్తేనే... కొన్ని చిన్న దేశాలు అర్హత సాధించలేకపోయినంత మాత్రాన పెద్ద దేశాలే ఫుట్‌బాల్‌ను శాసిస్తున్నాయని చెప్పడానికీ వీల్లేదు. ఆ మాటకొస్తే ఆసియాలో కోట్ల కొద్దీ జనాభా ఉన్న చైనా (2002), భారత్ (1950), ఇండోనేసియా (1938) ఒక్కొక్కసారి మాత్రమే అర్హత సాధించాయి. వివిధ కారణాలతో భారత్ ఈ అవకాశాన్నీ వదులుకుంది. చైనా 16 ఏళ్లుగా క్వాలిఫై కావడం లేదు. ఇక ఆసియా–యూరప్‌ల మధ్య ఉండే టర్కీది చిత్రమైన కథ. ఆ జట్టు 1948 తర్వాత 2002 కప్‌నకు అర్హత సాధించి, ఏకంగా మూడో స్థానంలో నిలిచి ఆశ్చర్యపర్చింది. ఈసారి మాత్రం బెర్త్ సంపాదించలేకపోయింది. ఆఫ్రికా... ఎదుగుతున్నా ఎదురుచూపే! దక్షిణ అమెరికా, యూరప్ తర్వాత ఫుట్‌బాల్‌కు ప్రాణం పోస్తున్నది ఆఫ్రికా ఖండమే. 1998, 2002లో అర్హత సాధించిన దక్షిణాఫ్రికా 2010లో ఆతిథ్యం కూడా ఇచ్చింది. తర్వాత మాత్రం ఊసులో లేదు. సెనెగల్ కొన్నిసార్లు సంచలనాలు సృష్టించింది. ఈసారి దాంతోపాటు ఈజిప్ట్, మొరాకో, నైజీరియా, ట్యునీషియా పోటీ పడుతున్నాయి. ఇదే ఖండంలోని మాలి, సూడాన్‌లలోనూ సాకర్‌కు క్రేజ్ ఉంది. అయినా అరంగేట్రం కలగానే ఉంటోంది. కాంగోకు 1974 ప్రపంచకప్పే మొదటిది, చివరిది. ఉరుగ్వే దూకుడు... పరాగ్వే పరుగులు... బ్రెజిల్, అర్జెంటీనా వంటి దిగ్గజ దేశాల ఖండం దక్షిణ అమెరికా. వీటి సమీపంలో కేవలం 34 లక్షల జనాభా ఉన్న దేశం ఉరుగ్వే, 70 లక్షల జనాభా ఉన్న దేశం పరాగ్వే. ఉరుగ్వే రెండుసార్లు ప్రపంచ చాంపియన్. 20 ప్రపంచకప్లకుగాను 11 సార్లు క్వాలిఫై అయింది. ‘దేశం చిన్నదా? పెద్దదా? ఎంత జనాభా ఉన్నారు? అన్నది ప్రతిభకు అడ్డంకి కాదు. మా దేశంలో ఆట పట్ల విపరీతమైన క్రేజ్ ఉంది’ అంటున్నాడు డిఫెండర్ విక్టోరినో. ‘గొప్ప చరిత్ర, అభిమానుల మద్దతున్న దేశం తరఫున ఆడుతుంటే తీవ్ర ఒత్తిడి ఉంటుంది. అది ఫుట్‌బాల్ పట్ల ఉన్న నిజమైన ఆసక్తి’ అని అతడి సహచరుడు గిగో పెరెజ్ చెబుతున్నాడు. ఇక పరాగ్వే 2011 కోపా అమెరికా టైటిల్ విజేత. ఏడుసార్లు కప్‌నకు అర్హత సాధించింది. ఈసారి విఫలమైనా ఆ దేశ స్థాయికిది గొప్పే. యూరప్ జట్టయిన డెన్మార్క్ 1986లో అరంగేట్రం చేసి... అప్పటి నుంచి మంచి ప్రతిభనే కనబరుస్తోంది. ‘50 లక్షల జనాభా ఉన్న మా దేశం చాలా చిన్నది. ప్రపంచకప్ గెలవాలంటే ఏడు పెద్ద జట్లను ఓడించాలి. కోటి జనాభా ఉన్న దేశాలకంటే మేం ప్రతిభావంతులైన ఆటగాళ్లను అందిం చాం’ అనేది డెన్మార్క్ ఫార్వర్డ్ నిక్లస్ బెన్ట్నర్ అభిప్రాయం. కేవలం 3 లక్షల 50 వేల జనాభా ఉన్న ఐస్లాండ్... 40 లక్షల జనాభా ఉన్న పనామా తొలిసారి ప్రపంచకప్‌నకు అర్హత సాధించి సంచలనాలు సృష్టించేందుకు సిద్ధంగా ఉన్నామంటున్నాయి. ప్రపంచ కప్‌నకు అర్హత పొందిన అతి తక్కువ జనాభా ఉన్న దేశంగా ఐస్లాండ్ కొత్త రికార్డు కూడా నెలకొల్పింది. ‘ఫుట్‌బాల్ చిన్న దేశాలను పెద్దదిగా చేస్తుంది’... ఇది కామెరూన్ లెజెండ్ రోజర్ మిల్లా మాట. అవును పై ఉదాహరణలతో నిజమేననిపిస్తోంది కదా! -
చేయిచ్చి వెనుదిరిగిన మారడోనా
కోల్‌కతా: అర్జెంటీనా సాకర్ దిగ్గజం డీగో మారడోనా, భారత క్రికెట్ లెజెండ్ సౌరవ్ గంగూలీల మధ్య జరిగిన ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో మారడోనా ఆడలేదు. దీంతో ఆయన వీరాభిమాని అయిన గంగూలీ తీవ్ర నిరాశకు గురయ్యారు. ‘డీగో వర్సెస్ దాదా’ ఎగ్జిబిషన్ మ్యాచ్ కొన్నాళ్ల నుంచి కోల్‌కతా వాసుల్ని ఊరిస్తూ వచ్చింది. అర్జెంటీనా స్టార్ భారత్ రాక వాయిదా పడటంతో మ్యాచ్ జరగలేదు. ఎట్టకేలకు మూడు రోజుల భారత పర్యటన నిమిత్తం డీగో ఇక్కడికి వచ్చారు. అయితే మంగళవారం మ్యాచ్‌కు ముందు స్కూల్ విద్యార్థులకు నిర్వహించిన వర్క్‌షాప్‌లో పాల్గొనడంతో మారడోనా తీవ్రంగా అలసిపోయారు. మ్యాచ్ ఆరంభానికి ముందు ఆటగాళ్ల కరచాలనం ముగిసిన వెంటనే ఆయన వెనుదిరిగారు. -
సాకర్ మాంత్రికుడు - మారడోనా
-
మళ్లీ ఫుట్‌బాల్ ఆడనున్న మారడోనా!
వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఫుట్‌బాల్ చరిత్రలోనే అతి గొప్ప ఆటగాడు డిగో మారడోనా 53 ఏళ్ల వయసులో మళ్లీ సీరియస్‌గా ఆడబోతున్నారు. అర్జెంటీనాలోని ఐదో టైర్ క్లబ్ టోర్నీలో డిపోర్టివో రియెస్ట్రా అనే క్లబ్ తరఫున ఈ దిగ్గజం బరిలోకి దిగనున్నారు. మార్చి 23న క్లబ్ తమ తొలి మ్యాచ్ ఆడనుంది. 1998 తర్వాత మళ్లీ మారడోనా సీరియస్‌గా ఫుట్‌బాల్ ఆడలేదు.