Diego Maradona's Cigars,Cars, Villa Auction.. అర్జెంటీనా మాజీ ఫుట్‌బాల్ దిగ్గజం డీగో మారడోనా భౌతికంగా దూరమై ఏడాది దాటింది. గతేడాది నవంబర్ 25న 60 ఏళ్ల వయసులో గుండెపోటుతో మరణించాడు. వ్యక్తిగత జీవితంలో ఎన్ని వివాదాలు ఉన్నప్పటికీ.. తనదైన ఆటతో అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు. 1986 ఫిపా ప్రపంచకప్ అర్జెంటీనా సొంతం చేసుకోవడంలో మారడోనాది కీలకపాత్ర. మారడోనా భౌతికంగా దూరమై ఏడాది దాటిన సందర్భంగా అతని వస్తువులను వేలం వేయాలని నిర్ణయించారు. డిసెంబర్ 19(ఆదివారం) ఉదయం 11 గంటలకు ఈ వేలం జరగనుంది.
కాగా వేలానికి మారడోనా వాడిన పలురకాల ఐకానిక్ సిగరెట్లు, బీఎండబ్ల్యూ కార్లతో పాటు తల్లిదండ్రులకు కొనిచ్చిన లగ్జరీ విల్లా రానున్నాయి. మారడోనా జెర్సీ నెంబర్ 10తో బరిలోకి దిగి 1986 ప్రపంచకప్‌కు అందించడంతో.. అతని జెర్సీ నెంబర్‌కు గుర్తుగా..'' 10 ఆక‌్షన్'' పేరుతో వేలం నిర్వహించనున్నారు. ఇక ఈ వేలానికి సంబంధించి ఇప్పటికే మారడోనా కుటుంబసభ్యులను వేలం చేపట్టబోయే సంబంధిత అధికారులు సంప్రదించారు.
మారడోనా ఐదుగురు పిల్లలు అతని వస్తువుల వేలానికి ఒప్పుకున్నారని.. వేలం ద్వారా వచ్చే డబ్బును ఒక ఫౌండేషన్‌కు అందించాలని నిర్ణయించారని మారడోనా కుటుంబ వ్యక్తిగత లాయర్ ఒక ప్రకటనలో తెలిపారు. భౌతికంగా మారడోనా దూరమైనప్పటికి అతని వస్తువులను సొంతం చేసుకునే అవకాశం ఉండడంతో అభిమానులు ఉత్సుకతతో ఉన్నారు. కాగా ఆన్‌లైన్ వేదికగా జరగనున్న ఈ వేలాన్ని కనీసి 15 నుంచి 20వేల మంది వీక్షించే అవకాశం ఉందని రూటర్స్ అభిప్రాయపడింది.
Comments
Please login to add a commentAdd a comment