cigar
-
వేలానికి మారడోనా సిగరెట్లు, కార్లు, లగ్జరీ విల్లా
Diego Maradona's Cigars,Cars, Villa Auction.. అర్జెంటీనా మాజీ ఫుట్‌బాల్ దిగ్గజం డీగో మారడోనా భౌతికంగా దూరమై ఏడాది దాటింది. గతేడాది నవంబర్ 25న 60 ఏళ్ల వయసులో గుండెపోటుతో మరణించాడు. వ్యక్తిగత జీవితంలో ఎన్ని వివాదాలు ఉన్నప్పటికీ.. తనదైన ఆటతో అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు. 1986 ఫిపా ప్రపంచకప్ అర్జెంటీనా సొంతం చేసుకోవడంలో మారడోనాది కీలకపాత్ర. మారడోనా భౌతికంగా దూరమై ఏడాది దాటిన సందర్భంగా అతని వస్తువులను వేలం వేయాలని నిర్ణయించారు. డిసెంబర్ 19(ఆదివారం) ఉదయం 11 గంటలకు ఈ వేలం జరగనుంది. కాగా వేలానికి మారడోనా వాడిన పలురకాల ఐకానిక్ సిగరెట్లు, బీఎండబ్ల్యూ కార్లతో పాటు తల్లిదండ్రులకు కొనిచ్చిన లగ్జరీ విల్లా రానున్నాయి. మారడోనా జెర్సీ నెంబర్ 10తో బరిలోకి దిగి 1986 ప్రపంచకప్‌కు అందించడంతో.. అతని జెర్సీ నెంబర్‌కు గుర్తుగా..'' 10 ఆక్షన్'' పేరుతో వేలం నిర్వహించనున్నారు. ఇక ఈ వేలానికి సంబంధించి ఇప్పటికే మారడోనా కుటుంబసభ్యులను వేలం చేపట్టబోయే సంబంధిత అధికారులు సంప్రదించారు. మారడోనా ఐదుగురు పిల్లలు అతని వస్తువుల వేలానికి ఒప్పుకున్నారని.. వేలం ద్వారా వచ్చే డబ్బును ఒక ఫౌండేషన్‌కు అందించాలని నిర్ణయించారని మారడోనా కుటుంబ వ్యక్తిగత లాయర్ ఒక ప్రకటనలో తెలిపారు. భౌతికంగా మారడోనా దూరమైనప్పటికి అతని వస్తువులను సొంతం చేసుకునే అవకాశం ఉండడంతో అభిమానులు ఉత్సుకతతో ఉన్నారు. కాగా ఆన్లైన్ వేదికగా జరగనున్న ఈ వేలాన్ని కనీసి 15 నుంచి 20వేల మంది వీక్షించే అవకాశం ఉందని రూటర్స్ అభిప్రాయపడింది. -
ప్రాణం తీసిన చుట్ట
భీమడోలు : చుట్ట కాల్చే అలవాటు ఓ వృద్ధురాలి ప్రాణం తీసింది. పోలీసుల కథనం ప్రకారం.. భీమడోలు పంచాయతీ శివారు పెదలింగంపాడు గ్రామానికి చెందిన గోరింకల శిరోమణి(60) పిల్లలు వేరే గ్రామాల్లో ఉంటున్నారు. శిరోమణి గ్రామంలోని తన ఇంట్లో ఒంటరిగా జీవిస్తోంది. చుట్ట కాల్చే అలవాటు ఉన్న ఆమె బుధవారం మధ్యాహ్నం దానిని వెలిగిస్తుండగా, అగ్గిపుల్ల చీరపై పడింది. దీంతో నిప్పంటుకుని తీవ్రంగా గాయపడింది. ఆమెను ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, మెరుగైన వైద్యం కోసం వైద్యుల సూచన మేరకు విజయవాడ తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం రాత్రి శిరోమణి మరణించింది. దీనిపై భీమడోలు ఎస్సై బి.వెంకటేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
క్యాస్ట్రో సిగార్ కథ
క్యాస్ట్రో పేరు చెబితే.. ఆరడుగుల నిండైన విగ్రహం. బవిరి గడ్డం.. నోట్లో పొగలుగక్కుతున్న సిగార్ గుర్తుకొస్తాయి. క్యూబా సిగార్లకు అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిపెట్టింది కూడా ఈయనే. ఆ విషయాన్ని క్యాస్ట్రో స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకున్నారు. ‘‘అప్పట్లో కొహిబా (క్యాస్ట్రోకు ఇష్టమైన క్యూబన్ సిగార్)కు ఒక బ్రాండ్‌గా ఉండేది కాదు. నా బాడీగార్డ్ ఒకరు కాల్చే సిగార్ మంచి సువాసనతో ఉండేది. ఏ బ్రాండ్ తాగుతున్నావని అడిగా. ప్రత్యేకమైన బ్రాండ్ ఏదీ కాదని.. మిత్రుడు ఒకరు చుట్టి ఇస్తాడని బాడీగార్డ్ చెప్పాడు. ఆతడు ఎవరో వెంటనే పట్టుకోవాలని చెప్పా. నేనూ ఆ సిగార్‌ను కాల్చి చూశా. చాలా బాగుంది. ఆ మనిషిని వెతికిపట్టుకుని సిగార్ల తయారీ ఫ్యాక్టరీ పెట్టించాను. ఎలాంటి పొగాకు వాడాలో? ఎక్కడ్నుంచి పొగాకు సేకరించాలో అతడే చెప్పాడు. అలా కొంతమంది సిగార్ తయారీదార్లతో మొదలైంది కొహిబా’’ అంటారు క్యాస్ట్రో. 90 మీటర్ల సిగార్... క్యాస్ట్రో 90వ జన్మదినం సందర్భంగా క్యూబన్లు ఆయనకు ఒక అపురూపమైన బహుమతి ఇచ్చారు. క్యాస్ట్రో 1980లలోనే చుట్ట కాల్చడం మానేశానని ప్రకటించినప్పటికీ.. క్యూబాకు ఓ పేరు తెచ్చిపెట్టిన సిగార్లకు ఆద్యుడిగా ఆయన్ను గుర్తు పెట్టుకునేందుకు ఏకంగా 90 మీటర్ల పొడవైన చుట్ట తయారు చేశారు. హవానా ఓడరేవు పక్కనే ఉన్న కోటలో ప్రత్యేకమైన టేబుల్‌పై పదిరోజులపాటు రోజుకు పన్నెండు గంటలపాటు కష్టపడితేగానీ ఈ భారీసైజు చుట్ట తయారు కాలేదు. -
సిగార్‌లో బాంబు పెట్టి..
ఐక్యరాజ్యసమితి సమావేశాల కోసం అమెరికాకు వచ్చిన క్యాస్ట్రో పేలుడు పదార్థాలు నింపిన సిగార్‌ను తాగేలా చేయాలనేది సీఐఏ ప్లాన్. న్యూయార్క్ పోలీస్ చీఫ్‌ను ఈ మేరకు పురమారుుంచింది. అరుుతే ఇది కూడా కార్యరూపం దాల్చలేదు. అంతకుముందు మరో కుట్ర చేసింది. బోటులిన్ అనే విషపూరిత రసాయం సిగార్లోకి ఇంజెక్ట్ చేసి.. అవి క్యూబా అధ్యక్షుడికి అందేలా చూడటానికి క్యాస్ట్రో సహాయక బృందంలోనే ఒకరిని కోవర్టుగా మార్చింది. సిగార్లలోకి విషపూరిత రసాయనాన్ని ఇంజెక్ట్ అరుుతే చేయగలిగారు. అరుుతే ప్లాన్ అమల్లోకి రాకముందే కోవర్టుగా మారిన వ్యక్తిని క్యాస్ట్రో బృందం నుంచి తొలగించారు. మిల్క్‌షేక్‌లో విషం కలిపి.. ఫిడేల్ క్యాస్ట్రోపై సీఐఏ జరిపిన హత్యాయత్నాల్లో అత్యంత దగ్గరగా వచ్చి విఫలమైంది ఇదే. క్యాస్ట్రోకు మిల్క్షేక్లంటే ఇష్టం. వాటిలో విషపు గుళికలు వేసి తుదముట్టించాలన్నది కుట్ర. 1963లో హవానాలో ఆయన బస చేసిన లిబ్రే హోటల్లోకి ఈ విషపు గుళికలను చేర్చారు. ఫ్రిజ్‌లో పెట్టి ఉంచారు. మిల్క్‌షేక్‌లో కలపడానికి సిద్ధమైన వెరుుటర్ ఫ్రిజ్ నుంచి వాటిని తీయడానికి ప్రయత్నించగా... గడ్డ కట్టి ఫ్రిజ్ లోపలి భాగానికి అతుక్కుపోరుు కనిపించారుు. గట్టిగా తీయడానికి ప్రయత్నించగా పగిలిపోయారుు. అలా ఆ ప్రయత్నం విఫలమైంది. వెంట్రుకలు ఊడేలా... ఐక్యరాజ్యసమితి సమావేశం కోసం న్యూయార్క్‌కు వచ్చిన క్యాస్ట్రో బూట్లలో థాలియం సాల్ట్‌ను వేయాలనేది ప్లాన్. దాని ప్రభావానికి లోనైతే... ఒక్కసారిగా మనిషి శరీరంపైనున్న వెంట్రుకలన్నీ రాలిపోతారుు. గడ్డంతో గంభీరంగా కనిపించే క్యాస్ట్రో అసలు కేశాలు లేకుండా... నిస్సహాయుడిలా కనిపించేలా చేసి క్యూబాలో అతని ప్రతిష్టను దెబ్బతీయాలని, తిరుగుబాటు ప్రోత్సహించాలని అమెరికా కుట్ర పన్నింది. కానీ ఎప్పట్లాగే ఇదీ విఫలమైంది. బాల్‌పారుుంట్ పెన్‌తో గుచ్చి... 1963లో క్యాస్ట్రో పారిస్‌కు వెళ్లారు. అక్కడ అండర్‌కవర్ ఏజెంట్‌గా ఉన్న సీఐఏ వ్యక్తి క్యాస్ట్రో సమీపానికి వెళ్లి బాల్‌పారుుంట్ పెన్ను పోలిన సూది(నీడిల్)తో ఆయను గుచ్చాలనేది ప్లాన్. అసలు ఏదో గుచ్చుకుందనే విషయమే తెలియకుండా ఈ విషప్రయోగం జరిగిపోతుంది. ఈ కుట్ర బయటపడడంతో సీఐఏ ఏజెంట్ రొనాల్డో క్యూబెలా జైలు పాలయ్యాడు. బాస్కెట్ బాల్ ఆడుతూ...