ప్రాణం తీసిన చుట్ట
Published Fri, Dec 23 2016 2:03 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
భీమడోలు : చుట్ట కాల్చే అలవాటు ఓ వృద్ధురాలి ప్రాణం తీసింది. పోలీసుల కథనం ప్రకారం.. భీమడోలు పంచాయతీ శివారు పెదలింగంపాడు గ్రామానికి చెందిన గోరింకల శిరోమణి(60) పిల్లలు వేరే గ్రామాల్లో ఉంటున్నారు. శిరోమణి గ్రామంలోని తన ఇంట్లో ఒంటరిగా జీవిస్తోంది. చుట్ట కాల్చే అలవాటు ఉన్న ఆమె బుధవారం మధ్యాహ్నం దానిని వెలిగిస్తుండగా, అగ్గిపుల్ల చీరపై పడింది. దీంతో నిప్పంటుకుని తీవ్రంగా గాయపడింది. ఆమెను ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, మెరుగైన వైద్యం కోసం వైద్యుల సూచన మేరకు విజయవాడ తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం రాత్రి శిరోమణి మరణించింది. దీనిపై భీమడోలు ఎస్సై బి.వెంకటేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement