సిగార్లో బాంబు పెట్టి..
ఐక్యరాజ్యసమితి సమావేశాల కోసం అమెరికాకు వచ్చిన క్యాస్ట్రో పేలుడు పదార్థాలు నింపిన సిగార్‌ను తాగేలా చేయాలనేది సీఐఏ ప్లాన్. న్యూయార్క్ పోలీస్ చీఫ్‌ను ఈ మేరకు పురమారుుంచింది. అరుుతే ఇది కూడా కార్యరూపం దాల్చలేదు. అంతకుముందు మరో కుట్ర చేసింది. బోటులిన్ అనే విషపూరిత రసాయం సిగార్‌లోకి ఇంజెక్ట్ చేసి.. అవి క్యూబా అధ్యక్షుడికి అందేలా చూడటానికి క్యాస్ట్రో సహాయక బృందంలోనే ఒకరిని కోవర్టుగా మార్చింది. సిగార్‌లలోకి విషపూరిత రసాయనాన్ని ఇంజెక్ట్ అరుుతే చేయగలిగారు. అరుుతే ప్లాన్ అమల్లోకి రాకముందే కోవర్టుగా మారిన వ్యక్తిని క్యాస్ట్రో బృందం నుంచి తొలగించారు.
మిల్క్‌షేక్‌లో విషం కలిపి..
ఫిడేల్ క్యాస్ట్రోపై సీఐఏ జరిపిన హత్యాయత్నాల్లో అత్యంత దగ్గరగా వచ్చి విఫలమైంది ఇదే. క్యాస్ట్రోకు మిల్క్‌షేక్‌లంటే ఇష్టం. వాటిలో విషపు గుళికలు వేసి తుదముట్టించాలన్నది కుట్ర. 1963లో హవానాలో ఆయన బస చేసిన లిబ్రే హోటల్‌లోకి ఈ విషపు గుళికలను చేర్చారు. ఫ్రిజ్‌లో పెట్టి ఉంచారు. మిల్క్‌షేక్‌లో కలపడానికి సిద్ధమైన వెరుుటర్ ఫ్రిజ్ నుంచి వాటిని తీయడానికి ప్రయత్నించగా... గడ్డ కట్టి ఫ్రిజ్ లోపలి భాగానికి అతుక్కుపోరుు కనిపించారుు. గట్టిగా తీయడానికి ప్రయత్నించగా పగిలిపోయారుు. అలా ఆ ప్రయత్నం విఫలమైంది.
వెంట్రుకలు ఊడేలా...
ఐక్యరాజ్యసమితి సమావేశం కోసం న్యూయార్క్‌కు వచ్చిన క్యాస్ట్రో బూట్లలో థాలియం సాల్ట్‌ను వేయాలనేది ప్లాన్. దాని ప్రభావానికి లోనైతే... ఒక్కసారిగా మనిషి శరీరంపైనున్న వెంట్రుకలన్నీ రాలిపోతారుు. గడ్డంతో గంభీరంగా కనిపించే క్యాస్ట్రో అసలు కేశాలు లేకుండా... నిస్సహాయుడిలా కనిపించేలా చేసి క్యూబాలో అతని ప్రతిష్టను దెబ్బతీయాలని, తిరుగుబాటు ప్రోత్సహించాలని అమెరికా కుట్ర పన్నింది. కానీ ఎప్పట్లాగే ఇదీ విఫలమైంది.
బాల్‌పారుుంట్ పెన్‌తో గుచ్చి...
1963లో క్యాస్ట్రో పారిస్‌కు వెళ్లారు. అక్కడ అండర్‌కవర్ ఏజెంట్‌గా ఉన్న సీఐఏ వ్యక్తి క్యాస్ట్రో సమీపానికి వెళ్లి బాల్‌పారుుంట్ పెన్‌ను పోలిన సూది(నీడిల్)తో ఆయను గుచ్చాలనేది ప్లాన్. అసలు ఏదో గుచ్చుకుందనే విషయమే తెలియకుండా ఈ విషప్రయోగం జరిగిపోతుంది. ఈ కుట్ర బయటపడడంతో సీఐఏ ఏజెంట్ రొనాల్డో క్యూబెలా జైలు పాలయ్యాడు.
బాస్కెట్ బాల్ ఆడుతూ...