Fidel Castro
-
ప్రపంచ విప్లవ జ్వాల
ప్రజల కోసం సర్వస్వం త్యజించిన విప్లవ నేత చే గువేరా! ఆయన అసలు పేరు ఎర్నెస్టో గెవారా! ఆయన పెట్టుబడిదారీ వ్యవస్థతో పాటు సామ్యవాదంలోని సంప్రదాయ వాదాన్ని కూడా వ్యతిరేకించాడు. అర్జెంటీనాలోని రొసారియా అనే పట్టణంలో 1928 జూన్ 14న ఒక మధ్య తరగతి కుటుంబంలో జన్మించాడు. 1953లో బ్యూనస్ ఎయిర్స్ విశ్వవిద్యాలయం నుండి వైద్య విద్యలో పట్టా పొందాడు. ఆ తదుపరి మోటారు సైకిల్‌పై దక్షిణ అమెరికా ఖండమంతటా పర్యటిస్తున్న సమయంలో ప్రజల జీవన స్థితిగతుల గురించి తెలుసుకున్నాడు. విప్లవమొక్కటే సామాజిక అసమానతలను తొలగించగలదని భావించాడు. 1954లో గౌటెమాలలో ప్రజాబాహుళ్యపు అభ్యున్నతికి కృషి చేస్తున్న సామ్యవాద అనుకూల ప్రభుత్వంతో కలిసి పనిచేశాడు. కానీ అదే సంవత్సరం అమెరికా సాయంతో జరిగిన కుట్ర మూలంగా ఆ ప్రభుత్వం కూలి పోయింది. అక్కడి నుంచి మెక్సికో వెళ్ళిపోయాడు. ఈ ఘటనతో అతని విప్లవ దృక్పథం మరింత బలపడింది. మెక్సికోలో ఫిడెల్ క్యాస్ట్రో నాయకత్వంలో అక్కడికి ప్రవాసం వచ్చిన క్యూబా విప్లవకారులతో చేతులు కలిపాడు. 1950వ దశకం చివరలో అప్పటి క్యూబా నియంత బాటిస్టాకు వ్యతిరేకంగా కాస్ట్రో ఆధ్వర్యంలో జరిగిన గెరిల్లా పోరాటం (1956–1959)లో చే గువేరా ముఖ్య పాత్ర పోషించాడు. డాక్టర్‌గా, మిలిటరీ కమాండర్‌గా అంకిత భావంతో సేవలందించాడు. పోరాటం విజయవంతమైన తరువాత, కాస్ట్రో 1959 జనవరిలో క్యూబా ప్రభు త్వాధికారాన్ని చేపట్టాడు. ఆ ప్రభుత్వంలో చే పరిశ్రమల మంత్రిగా, క్యూబా జాతీయ బ్యాంకు అధ్యక్షునిగా పనిచేశాడు. క్యూబా ప్రతినిధిగా అనేక దేశాలు పర్యటించాడు. ఈ పర్యటనలలో భాగంగానే 1959 జూలై నెలలో భారతదేశంలో కూడా పర్యటించాడు. తన రచనలలో వర్ధమాన దేశాలలో రైతాంగ విప్లవోద్యమాలు నిర్మింపబడాలని కోరుకున్నాడు! పేద దేశాలలో విప్లవాన్ని వ్యాప్తిచేయ తలపెట్టి ఆయన 1965లో క్యూబాలో తన అత్యున్నత స్థానాన్ని, పలుకుబడిని వదలి పెట్టి కాస్ట్రో వారిస్తున్నా వినకుండా దేశం నుండి అదృశ్యమయ్యాడు. కొద్దిమంది అనుచరులతో రహస్యంగా ఆఫ్రికా దేశమైన కాంగోలో కొంతకాలం గడిపాడు. ఆ సమయంలో ఆ దేశం తూర్పు ప్రాంతంలో గెరిల్లా తిరుగుబాటుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. 1966 చివరిలో మళ్ళీ దక్షిణ అమెరికాకు వచ్చాడు! బొలీవియా దేశంలో మిలిటరీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడు తున్న విప్లవకారులకు నాయకత్వం వహించాడు! ఈ సమయంలోనే బొలీవియన్ సైన్యానికి చిక్కాడు! 1967 అక్టోబర్ 9న వల్లెగ్రాండె అనే ప్రాంతంలో ఆ సైన్యం ఆయన్ని చంపివేసింది. అలా ఓ ప్రపంచ విప్లవ జ్వాల ఆరిపోయింది!– ఎమ్డీ మునీర్, సీనియర్ జర్నలిస్ట్(నేడు చే గువేరా వర్ధంతి) -
ముగిసిన ‘కాస్ట్రోల’ శకం
ఆరు దశాబ్దాలుగా అమెరికాకు కునుకు లేకుండా చేస్తున్న కాస్ట్రోల శకం క్యూబాలో ముగిసింది. అక్కడి పాలనా వ్యవస్థను నియంత్రించే కమ్యూనిస్టు పార్టీ చీఫ్ పదవి నుంచి మాజీ అధ్యక్షుడు రౌల్ కాస్ట్రో నిష్క్రమించారు. 1959లో అమెరికా ప్రాపకంతో క్యూబాను శాసిస్తున్న నియంత బాటిస్టాను ఫైడల్ కాస్ట్రో నాయకత్వంలోని విప్లవకారులు తిరుగుబాటులో సాగినంపిన నాటినుంచి దాంతో అమెరికాకు పొసగటం లేదు. 2014 డిసెంబర్లో అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా హయాంలో తొలిసారి ఇరు దేశాల సంబంధాలూ కొత్త మలుపు తిరిగాయి. ఆ దేశాన్ని సందర్శించిన అమెరికా తొలి అధినేతగా ఒబామా చరిత్రలో నిలిచారు. నిజానికి ప్రపంచాన్నే శాసిస్తున్న అమెరికాతో క్యూబాకు పోలికే లేదు. అగ్రరాజ్యం పొరుగునున్న అతి చిన్న దేశం క్యూబా. మామూలుగా అయితే క్యూబాను అమెరికా బేఖాతరు చేయొచ్చు. దాన్ని పట్టించు కోకుండా ఊరుకోవచ్చు. అలాగే ప్రపంచ వ్యాప్తంగా వున్న పౌరులు సైతం ఆ దేశంపై పెద్దగా దృష్టి పెట్టేవారు కాదు. అయితే అమెరికా ఆ చిన్న దేశంపట్ల అనుసరించిన ధోరణి, అది సవాలు విసిరిన ప్రతిసారీ క్యూబా పోట్ల గిత్త మాదిరి చెలరేగిన వైనం చూశాక అందరిలో ఆసక్తి పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు భిన్న రకాలైన ప్రజాస్వామిక వ్యవస్థలను నెలకొల్పుకున్నాయి. అన్ని దేశాలకూ ఆదర్శనీయమనదగ్గ లోపరహితమైన ప్రజాస్వామిక నమూనా ప్రపంచంలో ఎక్కడా లేదు. ‘అతి పురాతన ప్రజాస్వామ్య దేశం’గా కీర్తిప్రతిష్టలు ఆర్జించిన అమెరికా కూడా ఇందుకు మిన హాయింపు కాదు. ప్రస్తుతం చైనాలో, ఉత్తర కొరియాలో, చాన్నాళ్లక్రితం సోవియెట్ యూనియన్‌లో వున్నలాంటి ఏక పార్టీ పాలనే క్యూబాలో కూడా కొనసాగుతోంది. అక్కడ యావజ్జీవ పాలకపక్షం కమ్యూనిస్టు పార్టీయే. ఆ దేశంలో పరిపాలన గురించి, అక్కడ అమలయ్యే నియంతృత్వ విధానాల గురించి పాశ్చాత్య దేశాల్లో కథలు కథలుగా చెప్పుకునేవారు. ఆ దేశం నుంచి తప్పించుకొచ్చినవారి కథనాలు భయంగొలిపేవి. అయితే వీటికి సమాంతరంగా గణనీయమైన విజయాలు సాధించలేక పోయివుంటే క్యూబా గురించి చెప్పుకోవటానికి ఏమీ వుండేది కాదు. ముఖ్యంగా ప్రజారోగ్య రంగంలో ఆ దేశం ప్రశంసించదగ్గ విజయాలు సాధించింది. ఆ దేశ పౌరుల సగటు ఆయుఃప్రమాణం 79.13 ఏళ్లు. అమెరికా పౌరుల ఆయుఃప్రమాణం 78.64 ఏళ్లతో పోలిస్తే ఇది అధికమే. అక్కడ ప్రతి 155 మందికి ఒక డాక్టర్ వుంటారు. ప్రపంచంలో ఎక్కడ ఆరోగ్య సంక్షోభం తలెత్తినా ఆ దేశ వైద్యులు రెక్కలు కట్టుకుని వాలేందుకు సిద్ధపడతారు. సంక్షోభాలెన్ని చుట్టుముట్టినా విద్యకు బడ్జెట్లో 10 శాతాన్ని కేటాయించే దేశం క్యూబా. ప్రాథమిక స్థాయినుంచి విశ్వవిద్యాలయ విద్యవరకూ అంతా ఉచితం. అక్కడ పదిహేనేళ్లకు పైబడ్డవారిలో అక్షరాస్యత 99.8 శాతం. చెప్పాలంటే ఈ విషయంలో కూడా అమెరికా కాస్త వెనకబడేవుంది. ఆ దేశంలో అక్షరాస్యత 99 శాతం. ప్రాథమిక పాఠశాలల్లో తరగతికి 25 మంది, సెకండరీ స్థాయిలో తరగతికి 15 మంది పిల్లలు చొప్పున మాత్రమే వుంటారు. అక్కడ మెజారిటీ ప్రజలకు నచ్చకపోతే అంతక్రితం ఎన్నుకున్న ప్రతినిధిని రీకాల్ చేసే స్వేచ్ఛ వుంది. ఇవన్నీ నాణేనికి ఒకవైపు మాత్రమే. మరోపక్క అక్కడ దారిద్య్రం విలయతాండవం చేస్తుంటుంది. సగటు పౌరుడి నెల సంపాదన 30 డాలర్లు మించదు. అయితే వేరే దేశాలతో పోలిస్తే జీవన వ్యయం తక్కువే. బహుశా అమెరికా ఆర్థిక ఆంక్షలు విధించకపోతే, ఆ దేశం ఎవరూ వెళ్లరాదని నిషే«ధిం చకపోతే పరిస్థితి ఇంత దయనీయంగా వుండేది కాదు. పర్యాటకులు ఎగబడి సందర్శించే ప్రాంతాలు అక్కడ బోలెడున్నాయి. అలా మంచి ఆదాయం వచ్చేది. అయితే సోవియెట్ యూనియన్ ఉన్నన్నాళ్లూ క్యూబాను అన్నివిధాలా ఆదుకుంది. వెనిజులాలో హ్యూగో చావెజ్ వచ్చాక ఆ దేశం కూడా సాయపడుతూ వచ్చింది. సోవియెట్ కుప్పకూలాక పలు దేశాల్లోని సోషలిస్టు ప్రభుత్వాల్లాగే అది కూడా కుప్పకూలుతుందని అమెరికా అంచనా వేసింది. కానీ ఆ అంచనాను క్యూబా తలకిందులు చేసింది. ఎప్పటిలాగే ధైర్యంగా, నిటారుగా నిలబడింది. ఫైడల్ కాస్ట్రోను అంతం చేయడానికి అమెరికా చేయని ప్రయత్నమంటూ లేదు. సీఐఏలో పనిచేసి బయటికొచ్చినవారే కాస్ట్రోను అంతం చేయడానికి తమ ఏజెంట్ల ద్వారా, మాఫియా ముఠాల ద్వారా 638 సార్లు ప్రయత్నాలు జరిగాయని రాశారు. అలా ప్రయత్నించిన అమెరికాయే క్యూబాను 2011లో ఉగ్రవాద దేశంగా ప్రకటించటం ఒక వైచిత్రి. రౌల్ కాస్ట్రోను 2006లో ఫైడల్ కాస్ట్రో తన తాత్కాలిక వారసుడిగా ప్రకటించి, 2008లో శాశ్వతంగా అధ్యక్ష స్థానాన్ని అప్పగించారు. 2018 వరకూ ఆయన ఆ పదవిలో వున్నారు. ఆ తర్వాత ప్రస్తుత అధ్యక్షుడు మిగూల్ దియాజ్ కెనెల్కు అధికార పగ్గాలు అప్పగించి కమ్యూనిస్టు పార్టీ బాధ్యతలకు పరిమితమయ్యారు. ఇప్పుడు 89 ఏళ్ల వయసులో ఆయన పార్టీ సారథ్యాన్ని కూడా వదులుకున్నారు. అలా క్యూబాలో కాస్ట్రోల శకం ముగిసింది. అమెరికా ఆశిస్తున్నట్టు అది సోషలి జానికి కూడా వీడ్కోలు చెబుతుందా? దియాజ్ వచ్చాక దేశంలో సంస్కరణల బీజాలు నాటారు. స్వేచ్ఛా మార్కెట్‌కు చోటిచ్చారు. క్యూబా పౌరులు సొంత వ్యాపారాలు పెట్టుకునేందుకు అనుమ తులిస్తారని కూడా అంటున్నారు. అంతమాత్రాన రౌల్‌తో ‘సమర్థ పాలకుడ’నిపించుకున్న దియాజ్ క్యూబా తలుపులు బార్లా తెరుస్తారని అనుకోలేం. ఏదేమైనా ఇకపై క్యూబాను ప్రపంచం మరింత నిశితంగా వీక్షిస్తుంది. -
60 ఏళ్ల క్యాస్ట్రోల శకానికి తెర
సాక్షి, న్యూఢిల్లీ : కమ్యూనిస్టు పాలనలో ఉన్న లాటిన్ అమెరికా దేశం క్యూబాలో క్యాస్ట్రోల ఆరు దశాబ్దాల పాలనకు గురువారం తెరపడింది. ఫిడెల్ క్యాస్ట్రో అనంతరం 12 సంవత్సరాల క్రితం దేశాధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన ఆయన సోదరుడు రౌల్ క్యాస్ట్రో తన పదవికి స్వస్తి చెప్పారు. దేశ కమ్యూనిస్టు పార్టీ అధ్యక్షుడిగా ఆయనే కొనసాగుతారు కనుక ప్రభుత్వంపై కూడా ఆయన పట్టు కొనసాగుతుంది. రెండు పర్యాయాలు నిరాటంకంగా దేశాధ్యక్ష బాధ్యతలు నిర్వహించిన రౌల్ క్యాస్ట్రో (86) ఆర్థిక సంస్కరణలు చేపట్టి ప్రైవేటు రంగానికి ప్రవేశం కల్పించారు. ఆగర్భ శత్రువైన అమెరికాతో సంబంధాలు నెలకొల్పారు. 2015లో అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మొట్టమొదటిసారిగా క్యూబాను సందర్శించడంతో ఇరు దేశాల మధ్య సాధారణ పౌర సంబంధాలు ఏర్పడ్డాయి. అయితే డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైన నాటి నుంచి ఇరు దేశాల మధ్య సంబంధాలు అంతగా కొనసాగడం లేదు. ఫిడెల్ క్యాస్ట్రో నాయకత్వాన 1959లో క్యూబాలో విప్లవం విజయవంతం అవడం, ఆ తర్వాత క్యాస్ట్రో ప్రధాన మంత్రిగా దేశ నాయకత్వ బాధ్యతలు స్వీకరించడం తెల్సిందే. 1976 వరకు అదే పదవిలో కొనసాగిన ఆయన 1976లో రాజ్యాంగ సవరణ ద్వారా దేశాధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. నాలుగు దశాబ్దాలపాటు పదవిలో కొనసాగిన ఫిడెల్ క్యాస్ట్రో.. అనారోగ్య కారణాల వల్ల 2006లో దేశాధ్యక్ష బాధ్యతలను తన సోదరుడు రౌల్ క్యాస్ట్రోకు అప్పగించారు. అన్నతోపాటు రౌల్ క్యాస్ట్రో క్యూబా విప్లవంలో క్రియాశీలక పాత్ర పోషించారు. దాదాపు 60 ఏళ్లు ఇద్దరు క్యాస్ట్రోలే దేశాన్ని పాలించారు. రౌల్ క్యాస్ట్రో స్థానంలో క్యూబా కమ్యూనిస్టు పార్టీ స్టేట్ కౌన్సిల్ పార్టీ విధేయుడైన మిగుల్ డియాజ్ కెనాల్ బెర్ముడెజ్ (58)ను ఎన్నుకొంది. గురువారం నాడు దేశాధ్యక్షుడిగా రౌల్ క్యాస్ట్రో దిగిపోవాలనే, ఇదే రోజున దేశాధ్యక్షుడిగా మిగుల్ డియాజ్ బాధ్యతలు స్వీకరించాలని ముందుగా నిర్ణయించారు. ఇందుకు ఓ కారణం ఉంది. 1961లో అప్పటి ప్రధాన మంత్రి ఫిడెల్ క్యాస్ట్రోను దించేందుకు అమెరికా మద్దతుతో 1400 మంది తిరుగుబాటుదారులు కుట్ర చేశారు. ‘బే ఆఫ్ పిగ్ ఇన్వేషన్’గా పేర్కొన్న ఆ కుట్ర విఫలమైన వార్షికోత్సవ రోజు గురువారం. అంతేకాకుండా డియాజ్ కెనాల్ ఈ రోజునే 58వ ఏట అడుగుపెట్టారు. క్యూబాలో ఆర్థిక సంస్కరణలు ఊపందుకొని ప్రైవేటు పెట్టుబడులు పెరుగుతున్న సమయంలో రౌల్ క్యాస్ట్రో దిగిపోయారు. కొత్త తరానికి నాయకత్వం అప్పగించారు. డియాజ్ కెనాల్ చాలాకాలంగా దేశ ఉపాధ్యక్షుడిగా ఉంటూ రౌల్ క్యాస్ట్రోకు అండగా ఉన్నారు. ఆయన అమెరికా నటుడు రిచర్డ్ గేర్‌లా ఉన్నారంటారు. ఆయన ‘ది బీటిల్స్’ రాక్ బ్యాండ్‌కు వీరాభిమాని. -
ఫిడెల్ క్యాస్ట్రో పెద్ద కుమారుడి ఆత్మహత్య
హవానా: క్యూబా మాజీ అధ్యక్షుడు ఫిడెల్ క్యాస్ట్రో పెద్ద కొడుకు డియాజ్ బలార్ట్(68) శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నారు. ‘ గత కొన్ని నెలలుగా డియాజ్ తీవ్రమైన డిప్రెషన్‌కు చికిత్సపొందుతున్నారు’ అని క్యూబా అధికార పత్రిక గ్రాన్మా తెలిపింది. క్యాస్ట్రో మొదటి భార్య మిర్తా డియాజ్ బలార్ట్కు 1949 సెప్టెంబర్ 1న డియాజ్ జన్మించారు. డియాజ్ రాజకీయాల్లో లేనప్పటికీ అచ్చు తన తండ్రి కాస్ట్రో పోలికలతో ఉండటంతో అక్కడి వారికి ఈయన ఫిడెల్ జూనియర్‌గా చాలా ఫేమస్. ఫిజిక్స్‌లో శాస్త్రవేత్త అయిన డియాజ్ క్యూబాలో అణుశక్తి కార్యక్రమాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. చనిపోయే దాకా ఆయన క్యూబా ప్రభుత్వానికి శాస్త్రీయ సలహాదారుగా, అకాడమీ ఆఫ్ సైన్సెస్‌కు వైస్‌ప్రెసిడెంట్‌గా పనిచేశారు. -
విద్య, వైద్య రంగాల చుక్కాని
సందర్భం మానవ వికాసానికి విద్య ప్రధానమని తొలినాళ్లలోనే గుర్తించిన నేతలలో క్యాస్ట్రో ఒకరు. గుర్తించడమే కాదు చిత్తశుద్ధితో ఆ రంగ అభివృద్ధికి పనిచేసిన నేత. అందరికీ వైద్యం.. నాణ్యమైన వైద్యం అందించి ప్రపంచ దేశాలు అచ్చెరువొందేలా చేశారు. ప్రపంచ పటంలో అంగుళం స్థలం కూడా తీసుకోని అతి చిన్న దేశం క్యూబా అగ్రరాజ్యం అమెరికాను గడగడలాడించింది. 50 ఏళ్లపాటు అమెరికా పక్కలో బల్లెంలా నిలిచింది. సైనిక బల గంతో గెలవాలని చూస్తే రెట్టిం చిన బలంతో నిటారుగా నిలి చింది. కుట్రలు, కుతంత్రాలు, హత్యాయత్నాలతో మట్టు పెట్టాలని చూస్తే కంటికి రెప్పలా కాపాడుకుంది. ఆర్థిక వ్యవస్థను కుదేలు చేయాలని ప్రయ త్నిస్తే వటవృక్షంలా విస్తరించింది. ఇంత చిన్న దేశానికి ఇదెలా సాధ్యమైంది? సైనిక పహారాలతోనా, ఫిరంగుల మోతలతోనా? ఎలా సంభవమైంది? ఇనుప సంకెళ్ళతో ఎంతోకాలం ఏ దేశం మనలేదు. భుజబలంతో ఏ రాజ్యం దీర్ఘకాల సుఖసంతోషాలను కొని తీసుకురాలేదు. క్యూబా చిన్నదేశమైనా అమెరికాలాంటి అగ్రరాజ్యం కబళించ లేకపోవడానికి కారణం మనిషి అవసరాలను గుర్తించి వాటిని నెరవేర్చిన వికాసం. ప్రజల బాగో గులు పట్టించుకొని వాటికే పట్టంకడితే చీమంత దేశాన్నయినా గద్దలాంటి పెద్ద దేశం ఏమీ చేయలేదని క్యూబా నిరూ పించి చూపించింది. తమ యోగక్షేమాలు చూసిన నాయకుడిని పరాయిదేశం తుద ముట్టించాలని చూస్తే ప్రజలు రక్షక కవ చంగా నిలవడంతో చిన్న దేశాల ఆత్మవి శ్వాసానికి పెద్ద సంకేతంగా మిగిలిపోయింది. ఫిడెల్ క్యాస్ట్రో చతురంగ బలంలోను, చతుర్విధ కుయుక్తులతో ఐదు దశాబ్దాల పాటు నెట్టుకురాలేదు. మనిషి ప్రాథమిక అవసరాలను గుర్తించి వాటిని కల్పించేం దుకు శక్తివంచన లేకుండా కృషి చేశారు. మానవ వికాసానికి ప్రాతిపదికగా నిలిచే ప్రాధాన్యత రంగాల అభివృద్ధికి శత విధాలా పనిచేశారు. ఆరోగ్య పరిరక్షణ, విద్యారంగాలపై ధనం, సమయం వెచ్చించి లాటిన్ అమెరికా దేశాలలోనే గొప్ప విజయాలు సాధించారు. అవసరంలో ఉన్న దేశాలకు నిష్ణాతులైన వైద్యులను పంపే ప్రాణదాతగా క్యూబాను క్యాస్ట్రో నిలిపారు. మానవ వికాసానికి విద్య ప్రధానమని తొలినాళ్లలోనే గుర్తించిన నాయకులలో కాస్ట్రో ఒకరు. ప్రపంచమంతా వైద్యరంగం వ్యాపారమయమైంది. ప్రభు త్వాలు ఎంత నియంత్రించినా కట్టడి చేయలేక పోయాయి. కానీ ఫిడెల్ క్యాస్ట్రో వైద్య రంగాన్ని పరిరక్షించుకున్నారు. అందరికీ వైద్యం అందించారు. అదీ నాణ్యమైన వైద్యం అందించి ప్రపంచ దేశాలు అచ్చెరువొందేలా చేశారు. ఒక వెనుకబడిన చిన్నదేశం వైద్య విద్యారంగంలో ప్రగతి సాధించి ఇతర దేశాలకు సైతం వైద్యులను పంపే స్థాయికి చేరడం ప్రపంచదేశాల ప్రశంసలందుకుంది. విద్యకు, వైద్యానికి గల పరస్పర సంబంధాన్ని ఫిడెల్ క్యాస్ట్రో అర్థం చేసుకున్న తీరు అమోఘం. క్యూబాలో పిల్ల లకు మంచి చదువు ఇచ్చారు. చదువుకొని కళాశాల ప్రాంగ ణాలు దాటి వచ్చిన తర్వాత ఉపయోగపడాల్సిన రంగా లను గుర్తించారు. ఏయే వృత్తుల్లో నిపుణులు అవసరమో అంచనావేసి ఆ రంగాలకు తగిన కోర్సులనే చేయించారు. ముఖ్యంగా సమాజంలో వైద్యుల అవసరాన్ని గుర్తించి వైద్య విద్యకు ఎనలేని ప్రాధాన్యం ఇచ్చారు. పిల్లలను ప్రతిభా వంతులుగా తయారుచేయడానికి తరగతిలో ఉపాధ్యాయ బోధన, పటిష్ట విద్యా విధానంతోపాటు తల్లి గర్భంలో ఉండగానే శిశువుకు పోషకాహారాన్ని ధనిక, పేద తారత మ్యాలు లేకుండా అందేలా చూడటంతో క్యూబా విద్యా ప్రమాణాలు గొప్పగా పెరిగాయి. 1970 దశకంలోనే క్యూబా సంపూర్ణ అక్షరాస్యతతోపాటు అధిక శాతం పట్ట భద్రులుగల దేశంగా గుర్తింపు పొందింది. 1980వ దశకం ప్రారంభంలోనే 90 శాతం మంది విద్యావంతులకు ప్రభుత్వ రంగంలో ఉద్యోగ, ఉపాధి కల్పన చేయగలిగిన దేశంగా ప్రశంసలందుకున్నది. క్యూబాలో ఫిడెల్ క్యాస్ట్రో అనుసరించిన పంథా ఇతర చిన్న చిన్న దేశాలకు ఆదర్శ ప్రాయంగా నిలిచింది. పోలండ్, దక్షిణ కొరియా, ఫిన్లాండ్, సింగపూర్ దేశాలు విద్యా వ్యవస్థకు ప్రాధాన్యం ఇచ్చి క్యూబా తరహా విజయాల కోసం ప్రయ త్నిస్తున్నాయి. క్యూబా ప్రజల అభ్యున్నతికి, వికా సానికి ఫిడెల్ క్యాస్ట్రో చేసిన కృషి కార ణంగానే బాహ్య శక్తులు ఆయనను ఏమీ చేయలేకపోయాయి. క్యూబాను చావుదెబ్బ కొట్టాలని అమెరికా ఎన్ని విధాలుగా ప్రయ త్నాలు చేసినా క్యూబా ప్రతిసారీ రెట్టింపు శక్తితో లేచి నిలబడేది. పంచదార, పొగాకు, కాఫీ తదితర ఉత్పత్తులకు క్యూబా పెట్టింది పేరు. ఇతర దేశాలలో వీటికి మంచి గిరాకీ ఉండేది. కానీ వాటిని మరే దేశాలు కొనకుండా అమెరికా ఆంక్షలు విధిం చేది. అయితే నాటి సోవియట్ యూనియన్ కొండంత అండగా నిలిచేది. క్యూబా ఉత్పత్తులను తీసుకొని ఆ దేశా నికి పెట్రోల్ ఇచ్చేది. అమెరికా ఆర్థికంగాను, సైనికంగానూ క్యూబాను తొక్కేయాలని ప్రయత్నించినా ఫిడెల్ క్యాస్ట్రో తన దేశ ప్రజల అండదండలతోనే నిలబడగలిగారు. సోవి యట్ యూనియన్ విచ్ఛిన్నమైనప్పుడు క్యూబాకు క్లిష్ట పరి స్థితులు ఎదురయ్యాయి. క్యాస్ట్రోకు ప్రజలు మళ్ళీ అండగా నిలబడ్డారు. అప్పటి వరకు క్యూబా ఉత్పత్తులు తీసుకున్న సోవియట్ నుంచి సహాయం లేకపోవడంతో క్యూబా ఇక అంతమై పోయినట్టేనని అమెరికా భావించింది. అయితే క్యాస్ట్రో ఆదాయ వనరుల పెంపుదలకు పర్యాటక రంగాన్ని ఎంచుకొని వృద్ధి చేశారు. అందమైన కరీబియన్ దీవుల్లో భాగమెన క్యూబాలో పర్యాటక రంగం పుంజుకుంది. తుపాకీ గొట్టంతోనో, సైనిక పదఘట్టనలతోనో ఏ నేతా దీర్ఘకాలం నిలవలేడు. జన హృదయ వీధుల్లో స్థానం సంపాదించిన వారే నాలుగు కాలాలపాటు మనగలుగు తారు. మానవ వికాస రంగాలను గుర్తించి వాటి అభివృ ద్ధికి, క్యూబా పురోభివృద్ధికి పాటుపడినందువల్లనే ఫిడెల్ క్యాస్ట్రో తిరుగులేని నాయకుడయ్యాడు. చిన్న దేశాల స్వాభి మానానికి చిహ్నంగా నిలిచాడు. చుక్కా రామయ్య వ్యాసకర్త ప్రముఖ విద్యావేత్త శాసనమండలి మాజీ సభ్యులు -
క్యూబా మాజీ అధ్యక్షుడు క్యాస్ట్రో కన్నుమూత
అంతర్జాతీయం క్యూబా మాజీ అధ్యక్షుడు ఫిడెల్ క్యాస్ట్రో కన్నుమూత క్యూబా మాజీ అధ్యక్షుడు ఫిడెల్ క్యాస్ట్రో (90) అనారోగ్యంతో నవంబర్ 25న కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన తమ్ముడు, ప్రస్తుత క్యూబా అధ్యక్షుడు రౌల్ క్యాస్ట్రో తెలిపారు. ఫిడెల్ క్యాస్ట్రో 1926, ఆగస్టు 13న బిరాన్ (హొల్లూయిన్ ప్రావిన్స్)లో జన్మించారు. హవానా యూనివర్సిటీలో న్యాయశాస్త్రాన్ని అభ్యసించారు. నాటి అమెరికా అనుకూల క్యూబా నియంత ఫుల్జెనికో బటిస్టా సేనలకు వ్యతిరేకంగా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ క్యూబా చేస్తున్న ఆందోళనల్లో విద్యార్థి నాయకుడిగా పాల్గొన్నారు. ఈ పోరాటంలో అనేక నిర్బంధాలను ఎదుర్కొని పార్టీ నాయకుడిగా ఎదిగారు. ఆయన నాయకత్వంలోనే చేగువేరాతోపాటు వేలాది మంది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ క్యూబా కార్యకర్తలు విప్లవ పోరాటం సాగించి.. 1959లో క్యూబాను హస్త్తగతం చేసుకున్నారు. 1959 నుంచి 1976 వరకు క్యూబా ప్రధానమంత్రిగా ఉన్న క్యాస్ట్రో.. అనంతరం దేశాధ్యక్షుడిగా ఎన్నికై 2008 వరకు ఆ పదవిలో కొనసాగారు. జపాన్‌లో భారీ భూకంపం, సునామీ జపాన్ ఈశాన్య తీరంలో నవంబర్ 22న 6.9 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. దీనికి కొనసాగింపుగా సునామీ కూడా వచ్చింది. భూకంప ప్రభావంతో కొన్ని నిమిషాల్లోనే సముద్ర అలలు మీటరు ఎత్తున లేచి ఫుకుషిమా అణుశక్తి కేంద్రాన్ని ముంచెత్తాయి. ఫుకుషిమా నగరానికి 37 కి.మీ. దూరంలో పసిఫిక్ మహాసముద్రంలో 11.4 కి.మీ. లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. అత్యధిక వరి దిగుబడిని సాధించిన చైనా శాస్త్రవేత్త హైబ్రిడ్ వరి పితామహుడిగా పేరుగాంచిన చైనా వ్యవసాయ శాస్త్రవేత్త యువాన్ లాంగ్పింగ్ భారీ స్థాయిలో వరి పండించి సరికొత్త ప్రపంచ రికార్డులు నెలకొల్పారని చైనా అధికారులు నవంబర్ 25న ప్రకటించారు. గ్యాంగ్‌డాంగ్‌లో ఆయన పండించిన వరి 0.07 హెక్టార్‌కు 1,533.78 కిలోల వార్షిక దిగుబడి ఇచ్చిందని తెలిపారు. హెబీ, యునాన్ ప్రాంతాల్లో 0.07 హెక్టార్‌కు వరుసగా 1,082.1 కిలోలు, 1,088 కిలోల దిగుబడి వచ్చిందని.. ఎత్తై ప్రాంతాల్లో ఇవి రికార్డు స్థాయి దిగుబడులని అన్నారు. యువాన్.. 1974లో ప్రపంచంలో మొట్టమొదటి సారిగా హైబ్రిడ్ వరిని అభివృద్ధి చేశారు. పేటెంట్ హక్కుల్లో చైనా ప్రపంచ రికార్డు మేధోసంపత్తి హక్కులకు సంబంధించి చైనా 2015లోనే 11 లక్షల దరఖాస్తులు చేసింది. పేటెంట్ హక్కుల కోసం వివిధ దేశాలు చేసుకున్న దరఖాస్తుల వివరాలను ఐక్యరాజ్యసమితికి చెందిన ప్రపంచ మేధోసంపత్తి హక్కుల సంస్థ అధిపతి ఫ్రాన్సిస్ గుర్రీ నవంబర్ 24న వెల్లడించారు. ఈ జాబితాలో అమెరికా 5,78,000 దరఖాస్తులతో రెండో స్థానంలో, జపాన్ 3,25,000 దరఖాస్తులతో మూడో స్థానంలో, దక్షిణ కొరియా 2,14,000 దరఖాస్తులతో నాలుగో స్థానంలో ఉన్నాయి. జాతీయం హైదరాబాద్‌లో జాతీయ స్థాయి డీజీపీ, ఐజీల సదస్సు జాతీయ స్థాయి డీజీపీ, ఐజీల వార్షిక సదస్సు హైదరాబాద్‌లోని జాతీయ పోలీస్ అకాడమీలో నవంబర్ 26న జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడుతూ పోలీసులు మరింత చురుగ్గా తమ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ప్రక్రియ శిక్షణలో భాగంగానే జరగాలన్నారు. మనస్తత్వం, మనోవిజ్ఞాన నైపుణ్యాలు శిక్షణలో కీలకాంశాలుగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా ప్రధాని ‘ఇండియన్ పోలీస్ ఎట్ యువర్ కాల్’ అనే యాప్‌ను ఆవిష్కరించారు. తర్వాత విధి నిర్వహణలో విశేష ప్రతిభ చూపిన నిఘా విభాగం అధికారులను పోలీసు పతకాలతో సత్కరించారు. ఈ సదస్సులో కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులు, పోలీస్ అకాడమీ డెరైక్టర్ అరుణ బహుగుణ, వివిధ రాష్ట్రాల డీజీపీలు, ఐజీలు పాల్గొన్నారు. సెర్న్‌లో అనుబంధ సభ్య దేశంగా భారత్ యూరోపియన్ ఆర్గనైజేషన్ ఫర్ న్యూక్లియర్ రీసెర్చ్(సెర్న్)లో భారత్ అనుబంధ సభ్య దేశంగా చేరింది. ముంబైలో నవంబర్ 21న దీనికి సంబంధించిన ఒప్పందంపై భారత్, సెర్న్ ప్రతినిధులు సంతకాలు చేశారు. సెర్న్.. ప్రపంచంలోనే అతిపెద్ద న్యూక్లియర్ అండ్ పార్టికల్ ఫిజిక్స్ లేబొరేటరీ. 2004లో భారత్ ఇందులో పరిశీలక దేశంగా చేరింది. తాజాగా అనుబంధ సభ్య దేశంగా చేరడంతో భారత కంపెనీలు సెర్న్‌కు చెందిన ఇంజనీరింగ్ కాంట్రాక్ట్‌లను పొందే అవకాశం ఉంటుంది. దీంతోపాటు సెర్న్‌లో ఉద్యోగాలకు భారతీయులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే, ఈ సభ్యత్వం వల్ల భారత్‌కు దాదాపు రూ.78 కోట్ల వ్యయం అవుతుంది. సెర్న్ జెనీవా ప్రధాన కేంద్రంగా పనిచేస్తోంది. ఇందులో 22 సభ్య దేశాలు. నాలుగు అనుబంధ సభ్య దేశాలు ఉన్నాయి. ఫ్రీ టాక్‌టైమ్ పథకాన్ని ప్రవేశపెట్టిన గోవా దేశంలో తొలిసారిగా ‘గోవా యువ ఇనిషియేటివ్ స్కీమ్’ పేరుతో 100 నిమిషాల టాక్‌టైమ్, 1 జీబీ డేటా (2 ఎంబీపీఎస్)ను ఉచితంగా అందించే పథకాన్ని గోవా ప్రభుత్వం నవంబర్ 25న ప్రకటించింది. త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో యువత (16- 30 ఏళ్ల మధ్య)ను ఆకర్షించేందుకు గోవాలోని బీజేపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ పథకం కింద 1.25 లక్షల మంది లబ్ధి పొందనున్నారని గోవా సీఎం లక్ష్మీకాంత్ పర్సేకర్ తెలిపారు. రాష్ట్రీయం హైదరాబాద్‌లో సైబర్ భద్రత జాతీయ సదస్సు సైబర్ భద్రతపై జాతీయ సదస్సు నవంబర్ 22 నుంచి రెండు రోజులపాటు హైదరాబాద్‌లో జరిగింది. సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్సీఎస్సీ) ఏర్పాటు చేసిన ఈ సదస్సును తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు ప్రారంభించారు. నందిని ిసిధారెడ్డికి తెలుగు వర్సిటీ పురస్కారం ప్రముఖ కవి నందిని సిధారెడ్డి 2016కు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం అందించే విశిష్ట పురస్కారానికి నవంబర్ 22న ఎంపికయ్యారు. ఆర్థికం భారత్ కొత్త నోట్లపై నిషేధం విధించిన నేపాల్ భారత్ విడుదల చేసిన కొత్త రూ.500, రూ.2000 నోట్లను నిషేధిస్తున్నట్లు నేపాల్ నవంబర్ 24న ప్రకటించింది. భారత్ రద్దు చేసిన రూ.500, రూ.1000 నోట్లను మార్చుకోవడంలో ఆ దేశ ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో నేపాల్ సెంట్రల్ బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకుంది. ఫారిన్ ఎక్స్ఛేంజ్ యాక్ట్ కింద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త నోటిఫికేషన్‌ను జారీ చేయనంత వరకు భారత్‌కు చెందిన కొత్త కరెన్సీ నోట్ల మార్పిడి ఉండదని పేర్కొంది. నోటిఫికేషన్ వల్ల విదేశీ పౌరులు భారత కరెన్సీని నిర్దిష్ట మొత్తంలో కలిగి ఉండేందుకు అనుమతి ఉంటుందని ఆ దేశ అధికారులు తెలిపారు. బ్యాంక్ ఖాతాల వివరాల కోసం స్విట్జర్లాండ్‌తో ఒప్పందం 2018, సెప్టెంబర్ నుంచి స్విట్జర్లాండ్‌లోని భారతీయుల బ్యాంక్ ఖాతాల వివరాలను పొందేందుకు భారత్ ఆ దేశంతో నవంబర్ 22న ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు సంయుక్త ప్రకటన ఒప్పందంపై సీబీడీటీ ైచైర్మన్ సుశీల్‌చంద్ర, స్విస్ రాయబార కార్యాలయం డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్.. రోడిట్ న్యూఢిల్లీలో సంతకాలు చేశారు. క్రీడలు ఉత్తమ ప్రొఫెషనల్ బాక్సర్‌గా వికాస్ క్రిషన్ 2016 ఉత్తమ ప్రొఫెషనల్ బాక్సర్‌గా భారత బాక్సర్ వికాస్ క్రిషన్ను అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం(ఏఐబీఏ-ఐబా) నవంబర్ 27న ఎంపిక చేసింది. భారత్ నుంచి ఓ బాక్సర్‌కు పురస్కారం దక్కడం ఇదే ప్రథమం. హరియాణాకు చెందిన 24 ఏళ్ల వికాస్ రియో ఒలింపిక్స్‌లో 75 కిలోల విభాగంలో క్వార్టర్ ఫైనల్లో వెనుదిరిగాడు. ఉత్తమ మహిళా బాక్సర్‌గా సిమ్రన్‌జిత్ కౌర్ జాతీయ మహిళా చాంపియన్‌షిప్‌లో 64 కిలోల విభాగంలో టైటిల్ గెలుచుకొని పంజాబ్‌కు చెందిన సిమ్రన్‌జిత్ కౌర్ ఉత్తమ బాక్సర్‌గా నిలిచింది. ఆమె హరిద్వార్‌లో నవంబర్ 24న జరిగిన పోటీలో జ్యోతి (హరియాణ)పై గెలుపొందింది. ఈ పోటీల్లో ఆరు స్వర్ణ పతకాలు సాధించిన హరియాణా టీమ్ చాంపియన్‌షిప్ దక్కించుకుంది. రెండు స్వర్ణ పతకాలతో రైల్వేస్ రెండో స్థానంలో నిలిచింది. ఎఫ్ 1- 2016 ప్రపంచ చాంపియన్‌గా రోస్‌బర్గ్ మెర్సిడెస్ జట్టు డ్రైవర్ నికో రోస్‌బర్గ్ 2016 ఫార్ములావన్ డ్రైవర్స్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను గెలుచుకున్నాడు. నవంబర్ 27న జరిగిన అబుదాబి గ్రాండ్ ప్రిలో రెండో స్థానం పొందిన రోస్‌బర్గ్.. మొత్తం 385 పాయింట్లతో డ్రైవర్స్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. మెర్సిడెస్ జట్టుకే చెందిన లూయిస్ హామిల్టన్ (380 పాయింట్లు) అబుదాబి రేసులో చాంపియన్‌గా నిలిచినా రోస్‌బర్గ్ టాప్-3లో నిలవడంతో రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. హాంకాంగ్ ఓపెన్‌లో రన్నరప్‌లుగా సింధు, సమీర్ వర్మ హాంకాంగ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో సమీర్ వర్మ, పి.వి.సింధు రజత పతకాలు సాధించారు. కౌలూన్‌లో నవంబర్ 27న జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో లాంగ్ ఆంగస్ (హాంకాంగ్) చేతిలో వర్మ ఓడిపోయాడు. మహిళల సింగిల్స్ ఫైనల్లో సింధుపై తై జు ఝంగ్ (చైనీస్ తైపీ) గెలుపొందింది. సింధు, సమీర్ వర్మలకు 15,200 డాలర్ల చొప్పున ప్రైజ్‌మనీ దక్కింది. అర్జెంటీనాకు డేవిస్ కప్ టైటిల్ డేవిస్ కప్ పురుషుల ప్రపంచ టీమ్ టెన్నిస్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను అర్జెంటీనా గెలుచుకుంది. జాగ్రెట్ (క్రొయేషియా)లో నవంబర్ 28న జరిగిన ఫైనల్లో క్రొయేషియాపై విజయం సాధించింది. గతంలో అర్జెంటీనా 1981, 2006, 2008, 2011లలో ఫైనల్లో ఓడిపోయింది. 116 ఏళ్ల డేవిస్ కప్ చరిత్రలో విజేతగా నిలిచిన 15వ జట్టుగా అర్జెంటీనా గుర్తింపు పొందింది. అమెరికా అత్యధికంగా 35 సార్లు ఈ టైటిల్‌ను సాధించింది. వార్తల్లో వ్యక్తులు మంగళంపల్లి బాలమురళీకృష్ణ ఇకలేరు: కర్నాటక సంగీత వాగ్గేయకారుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ నవంబర్ 22న చెన్నైలో అస్తమించారు. ఆయన 1930, జూలై 6న తూర్పుగోదావరి జిల్లా మలికిపురం మండలం శంకరగుప్తంలో జన్మించారు. ఏడేళ్ల వయసులో తొలి కచేరీ చేసిన మంగళంపల్లి.. వీణ, వయోలిన్, మృదంగం, కంజీర వంటి వాయిద్యాల్లోనూ ప్రావీణ్యం గడించారు. గణపతి, సర్వశ్రీ, మహితి, లవంగి వంటి కొత్త రాగాలను సృష్టించి సంగీత బ్రహ్మగా వినుతికెక్కారు. ఇండియాతోపాటు మలేషియా, సింగపూర్, ఇటలీ, ఫ్రాన్స్, అమెరికా, కెనడా వంటి దేశాల్లో 25 వేలకుపైగా కచేరీలు చేశారు. సంగీతానికి ఆయన సేవలకు గుర్తింపుగా 1971లో పద్మశ్రీ, 1991లో పద్మవిభూషణ్, 1998లో సంగీత నాటక అకాడమీ అవార్డుతోపాటు అనేక జాతీయ, రాష్ట్ర స్థాయి పురస్కారాలు అందుకున్నారు. ఇస్రో మాజీ చైర్మన్ ఎంజీకే మీనన్ మృతి: ఇస్రో మాజీ చైర్మన్ ఎంజీకే మీనన్ (88) న్యూఢిల్లీలో నవంబర్ 22న కన్నుమూశారు. ఆయన ఐదు దశాబ్దాలకుపైగా శాస్త్ర, సాంకేతిక రంగాల్లో విశిష్ట సేవలందించారు. మీనన్ 1972లో ఇస్రో చైర్మన్‌గా ఎంపికయ్యారు. వీపీ సింగ్ ప్రభుత్వ హయాంలో శాస్త్ర, సాంకేతిక శాఖకు సహాయ మంత్రిగా పనిచేశారు. ఆయన సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్‌తో సత్కరించింది. మాలినీ సుబ్రమణియంకు ఇంటర్నేషనల్ ప్రెస్ ఫ్రీడం అవార్డు: భారత్‌కు చెందిన మాలినీ సుబ్రమణియం న్యూయార్క్‌లో నవంబర్ 22న ఇంటర్నేషనల్ ప్రెస్ ఫ్రీడం అవార్డును అందుకున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతంలో జరిగిన మానవ హక్కుల ఉల్లంఘనలపై కథనాలను ప్రచురించినందుకు ఆమెను ఈ అవార్డుకు ఎంపిక చేశారు. ఆమెతోపాటు ఆస్కార్ మార్టినెజ్ (ఎల్‌సాల్వెడార్), క్యాన్ దుండర్ (టర్కీ), అబూజెయిద్ (ఈజిప్టు) కూడా అవార్డులు అందుకున్నారు. పాకిస్తాన్ కొత్త ఆర్మీ చీఫ్‌గా ఖమర్ బజ్వా: పాకిస్తాన్ కొత్త ఆర్మీ చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ ఖమర్ జావేద్ బజ్వాను నియమిస్తూ పాక్ ప్రధాని నవంబర్ 26న ప్రకటన చేశారు. ఆయన గతంలో పాక్ ఆధీనంలో ఉన్న కశ్మీర్లో కీలకంగా వ్యవహరించారు. ఆర్మీ చీఫ్‌గా ఎంపికవడానికి ముందు ట్రైనింగ్ అండ్ ఎవల్యూషన్ ఇన్స్పెక్టర్ జనరల్‌గా పనిచేశారు. ప్రముఖ పాత్రికేయుడు పడ్గావ్కర్ మృతి: ప్రముఖ పాత్రికేయుడు దిలీప్ పడ్గావ్కర్ (72) నవంబర్ 25న మరణించారు. ఆయన గతంలో ది టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రికకు ఎడిటర్‌గా పనిచేశారు. 2008లో జమ్మూకశ్మీర్‌లో శాంతి చర్చల కోసం ప్రభుత్వం నియమించిన త్రిసభ్య బృందంలో సభ్యుడిగా వ్యవహరించారు. -
కాలాన్ని శాసించిన క్యాస్ట్రో
కొత్త కోణం ప్రజల ప్రయోజనాలను మాత్రమే దృష్టిలో పెట్టుకోవడం వల్ల ఎప్పటికప్పుడు తన విధానాలను సమీక్షించుకొని క్యూబా ముందుకు పోతున్నది. మొదట రష్యా తరహాలో కేంద్రీకృత ప్రణాళికలను రూపొందించుకున్నప్పటికీ; ఆ తర్వాత చైనా, వియత్నాం పద్ధతుల్లో ఆర్థిక విధానాలను రూపొందించుకున్నది. ఇటీవల మరికొన్ని నిర్ణయాలను తీసుకొని ప్రస్తుతం ఉన్న ఆర్థిక విధానాలను విద్య, వైద్యం, వ్యవసాయం, మహిళా సాధికారత లాంటి అంశాలు దెబ్బతినకుండా మార్చుకోవాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తున్నది. ప్రపంచ చరిత్రలో చిరస్థాయిగా నిలిచే స్థానాన్ని సాధించుకున్న కమ్యూనిస్టు వీరుడు క్యూబా మాజీ అధ్యక్షుడు ఫిడెల్ క్యాస్ట్రో. ఆయన జీవితం, పోరాటం, విజయాలు భవిష్యత్ తరాలను ఉత్తేజపరుస్తూనే ఉంటాయి. అమెరికా తొత్తుగా వ్యవహరిస్తున్న బటిస్టా నియంతృత్వ ప్రభుత్వాన్ని కూలదోసి, విప్లవపతాకను ఎగురవేసినప్పటి నుంచి ప్రధా నమంత్రిగా, ఆ తర్వాత అధ్యక్షుడిగా క్యాస్ట్రో సాగించిన పాలన అమె రికాను ఎదిరించడానికే పరి మితం కాలేదు. అమెరికాకు వ్యతిరేకంగా క్యాస్ట్రో సాగించిన పోరాటం, సాధించిన విప్లవ విజయం క్యూబా ప్రజల సామాజిక, ఆర్థికాభివృద్ధిపై చెరగని ముద్రవేశాయి. దాదాపు 638 సార్లు అమెరికా జరిపిన హత్యా యత్నాలను ఎదుర్కొని నిలబడ గలిగారా యన. దేశ ప్రజానీకం మొత్తం క్యాస్ట్రోకు రక్షణ కవచంగా నిలిచిందనడానికి అమెరికా విఫలయత్నాలే నిదర్శనం. నిజానికి 1990వ దశకంలో జరిగిన సోవియట్ యూనియన్ పతనం క్యూబాకు పెద్ద విఘాతమే. అయినా క్యూబా ఆ సమస్యను అధిగ మించింది. ప్రపంచాన్ని అబ్బుర పరిచే ప్రగతిని సాధించగలిగింది. అక్కడి చక్కెర అమెరికాకు చేదే క్యూబా పురాతన దేశం. 1492లో స్పెయిన్ నావికుడు క్రిస్టోఫర్ కొలం బస్ అప్పటి ఇటలీ ప్రభుత్వ సహకారంతో భారతదేశాన్ని కనుగొనాలని బయలు దేరి, దారి తప్పి అమెరికా సహా క్యూబాను కనిపెట్టాడు. అప్పటి నుంచి అక్కడికి స్పెయిన్ దేశీయుల వలస ప్రారంభమైంది. 1898 వరకు క్యూబా స్పెయిన్ వలస దేశమే. స్పానిష్ అమెరికన్ యుద్ధం తరువాత 1898లో క్యూబా అమెరికా వలసగా మారింది. కొద్ది కాలంలోనే క్యూబాను అమెరికా స్వతంత్ర దేశంగా ప్రకటించినా, ఆ స్వతంత్రం నామమాత్రమే. రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాల్లో అమెరికా క్యూబాను పూర్తిగా తన గుప్పిట్లో పెట్టుకుంది. చెరుకు తోటల పెంపకం, చక్కెర ఉత్పత్తి అమెరికా తన గుత్తాధిపత్యంలో ఉంచుకుంది. దేశ ఆర్థిక రంగానికి మూలాధారమైన చక్కెర ఉత్పత్తి అమెరికా నియంత్రణలో ఉండడం వల్ల ప్రజల బతుకుతెరువు అగ్ర దేశం దయాదాక్షిణ్యాల మీద కొనసాగింది. బటిస్టా నాయకత్వంలోని నియం తృత్వ ప్రభుత్వం కూడా అమెరికా కనుసన్నల్లో ఉండేది. చక్కెర పరిశ్రమలో, చెరుకు తోటలో పనిచేసేవారు కేవలం 30 శాతం. మిగిలిన 70 శాతం నిరు ద్యోగంలో లేదా అర్థ నిరుద్యోగంలో కొట్టుమిట్టాడుతుండేవారు. ప్రజా ప్రయోజనాల కోసం కాకుండా, అమెరికా ఆర్థిక దోపిడీ లక్ష్యంగా నిర్మితమైన క్యూబా ఆర్థిక వ్యవస్థ ఆ దేశాన్ని పేదరికంలోకి నెట్టింది. నిత్యా వసరాలైన పాలు, గుడ్లు, మాంసాహారం కూడా కరువయ్యాయి. 89 శాతం మందికి కనీసం పాలు కూడా దొరకని స్థితి. 96 శాతం మంది మాంసాహారం తిని ఎరుగరు. 98 శాతం మందికి గుడ్లు కూడా లభించేవి కావు. ప్రభుత్వంతో అన్ని వర్గాల ప్రజలు విసిగిపోయారు. వివిధ రూపాల్లో కొన్ని తిరుగుబాట్లు చేశారు. ఆ క్రమంలోనే క్యాస్ట్రో విద్యార్థి నేతగా ఉద్యమాల్లో అడుగుపెట్టారు. బటిస్టా ప్రభుత్వానికి వ్యతిరేకంగా 1953 జులై 26వ తేదీన క్యాస్ట్రో నాయకత్వంలో శాంటియాగో డీక్యూబా లోని మంకోడా సైనిక స్థావరం మీద దాడి జరిగింది. ప్రభుత్వం 24 మందిని అరెస్టు చేసి, జైలుకి పంపింది. 60 మంది విప్లవకారులను హత్య చేసింది. ప్రజా ఉద్యమాల ఫలితంగా 1955 ఏప్రిల్‌లో క్యాస్ట్రో సహా విప్లవకారులంతా విడుదలయ్యారు. విప్లవ కార్య క్రమాల మీద నిర్బంధం పెరగడంతో క్యాస్ట్రో తన కార్యస్థానాన్ని మెక్సికోకి మార్చి, అక్కడి నుంచే సాయుధ గెరిల్లా పోరాటానికి సన్నాహాలు చేశారు. క్యాస్ట్రో సోదరుడు, ప్రస్తుత క్యూబా అధ్యక్షుడు రవుల్ క్యాస్ట్రో, యువ విప్లవ కెరటం చేగువేరా కూడా ఆయనను అనుసరించారు. చిట్టచివరిగా 1959 జన వరి 1వ తేదీన క్యాస్ట్రో నాయకత్వంలోని రెడ్ఆర్మీ బటిస్టా ప్రభుత్వాన్ని కూల దోసింది. ఆ ఫిబ్రవరి 10న క్యాస్ట్రో ప్రప్రథమ ప్రధానమంత్రిగా పదవిని చేప ట్టారు. బటిస్టా దేశం వీడి పారిపోయాడు. ఆదిలో అల్లకల్లోలం క్యాస్ట్రో ప్రభుత్వం మొదటి చర్యగా అమెరికా ఆస్తులను, పరిశ్రమలను జాతీ యం చేసింది. వేల కోట్ల డాలర్ల సంపదను కోల్పోయిన అమెరికా క్యూబా విప్లవ ప్రభుత్వాన్ని అడుగడుగునా దెబ్బతీయడానికి యత్నించింది. విప్లవ ప్రభుత్వం ఏర్పడడంతో బటిస్టా మద్దతుదారులైన ధనికవర్గం అమెరికాకు పారిపోయింది. అందులో వివిధ రంగాల నిపుణులు, వైద్యులు, ఇతర మేధా వులు కూడా ఉన్నారు. దాదాపు 50 శాతం వైద్యులు క్యూబాను వీడారు. తీవ్ర స్థాయిలో వైద్యుల కొరత ఏర్పడింది. అయినా క్యాస్ట్రో ప్రభుత్వం చలించ కుండా పెద్ద మొత్తంలో వైద్యవిద్యను ప్రోత్సహించి, అవసరమైనంత మంది వైద్యులను తయారుచేసుకోగలిగింది. ఆరేళ్లలోనే అవసరమైన ఆరోగ్య వ్యవ స్థను స్థాపించుకోలిగింది. 1970 సంవత్సరానికి ఆరోగ్యరంగంలో అనన్యసా మాన్యమైన విజయాలను సాధించింది. తమ బడ్జెట్లో సింహభాగాన్ని ఆరోగ్య అవసరాలకు, డాక్టర్ల శిక్షణకు వినియోగిం చడం వల్ల ఇది సాధ్య మైంది. 1970కి వచ్చే సరికి మలేరియా, పోలియో పూర్తిగా నిర్మూలించారు. క్షయ, జీర్ణకోశ వ్యాధులతో జరిగే మరణాలను చాలా పెద్దమొత్తంలో అరి కట్టగలిగారు. 1980లో ఈ కృషిని మరింత విస్తృత పరచగలిగారు. ఈరోజు ఆరోగ్యరంగంలో క్యూబా ప్రపంచ దేశాలన్నింటిలో అగ్రభాగాన ఉండడమే కాకుండా, ప్రజలు వైద్య సౌకర్యాల లేమితో బాధపడ కుండా చేయగలిగింది. ఆరోగ్యం ప్రజల హక్కుగానే కాకుండా ప్రభుత్వ బాధ్యతగా ప్రకటించుకు న్నది. ఆదర్శవంతమైన డాక్టర్- నర్స్ పథకాన్ని అమ లుచేసింది. చేస్తున్నది. 150 కుటుంబాలకు ఒక నర్స్, ఒక డాక్టర్ వంతున నియమించి వైద్య ఆరోగ్య విషయాలలో ప్రజలందరిని చైతన్యపరిచే అరుదైన వ్యవస్థను క్యూబాలో అద్భుతంగా అమలు పరిచారు. ఆ 150 కుటుంబాల ఆరోగ్య వివరాలన్నీ డాక్టర్ - నర్స్‌ల బృందం వద్ద ఉంటాయి. ప్రతి 30 వేల నుంచి 60 వేల జనాభా ఉన్న ప్రాంతానికి ఒక పాలిక్లినిక్‌ను ఏర్పాటు చేస్తారు. క్యూబాలో ఇప్పుడు 498 పాలిక్లినిక్లున్నాయి. వైద్య విద్యనభ్యసిస్తున్న విద్యా ర్థులు మొదటి ఏడాది నుంచే పాలిక్లినిక్లలో వైద్యసేవలందిస్తూ ఆచరణలో వైద్యవిద్యను నేర్చుకుంటారు. క్యూబాను దెబ్బతీసేందుకు అత్యవసరాలైన మందులు, వైద్య పరికరాలను సైతం అమెరికా నిలిపివేసింది. కానీ అవేవీ క్యూబా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయలేకపోయాయి. విప్లవం వచ్చేనాటికి క్యూబా శిశుమరణాల రేటు 80 అయితే ఈ రోజు అది 4.63 శాతం. మన దేశంలో 41.1 శాతం. అమెరికాలో 5.74శాతం. అంటే క్యూబా కంటే అధికమే. చిన్న దేశం క్యూబా సాధించిన వైద్య విజయాన్ని అర్థం చేసు కోవడానికి ఇదొక్క ఉదాహరణ చాలు. అంతేకాక లాటిన్ అమెరికన్ మెడికల్ స్కూల్స్ స్థాపించి 72 దేశాలకు చెందిన దాదాపు 20,500 మంది వైద్యులను అందించింది. క్యూబాలో వైద్య ఆరోగ్య ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుంది. అలా ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తోంది. విజయ పరంపర విద్యారంగంలో క్యూబా సాధించిన విజయం కూడా ఘనమైనదే. నూటికి నూరు శాతం విద్యారంగం బాధ్యత ప్రభుత్వానిదే. మూడు దశాబ్దాల క్రితమే నూటికి నూరు శాతం అక్షరాస్యతను ఆ దేశం సాధించింది. ఇందుకు కారణం 1961లోనే 2 లక్షల మంది ఉపా ద్యాయులను సమీకరించి, ఒక ఉద్యమ స్ఫూర్తితో అక్షరాస్యతను అందించగలిగింది. అదే సమయంలో విద్యను ఉత్పత్తితో అను సంధానం చేస్తూ భవిష్యత్తు ఉపాధి నైపుణ్యాలను పెంచే కార్యక్రమాన్ని కూడా చేపట్టింది. మహిళల అక్షరాస్యతలో కూడా నూటికి నూరు శాతం ఫలితాలను సాధించగలిగింది క్యూబా. రాజకీయరంగంలో సైతం క్యూబా సాధించిన విజయం అనేక ప్రజాస్వామ్య దేశాలకు కనువిప్పు వంటిది. పార్లమెంటులో ఇప్పుడు దాదాపు 45 శాతంగా మహిళల ప్రాతి నిధ్యం ఉందంటే, స్త్రీల రాజకీయ భాగస్వామ్యంలో ఆ దేశం ఎంత ముందుందో అర్థం చేసుకోవచ్చు. వ్యవసాయ రంగంలో ప్రభుత్వం అనే కమైన మార్పులను చేపట్టింది. భూమిని కొందరి చేతుల్లో కేంద్రీకృతం చేసే అసమాన వ్యవస్థగా కాకుండా ప్రభుత్వం మాత్రమే యావత్ భూమిపైన హక్కును కలిగి ఉంటుంది. రైతులు సహకార సంఘాలుగా ఏర్పాటై వ్యవ సాయాన్ని నిర్వహించే అవకాశాన్ని కలిగించారు. దానితో సహకార రంగం ద్వారా ఉత్పత్తి పెరగడం మాత్రమే కాకుండా క్యూబా ప్రభుత్వం ధరలను సైతం నియంత్రించగలిగింది. ఆయన చిరస్మరణీయుడు ప్రజల ప్రయోజనాలను మాత్రమే దృష్టిలో పెట్టుకోవడం వల్ల ఎప్పటిక ప్పుడు తన విధానాలను సమీక్షించుకొని క్యూబా ముందుకు పోతున్నది. మొదట రష్యా తరహాలో కేంద్రీకృత ప్రణాళికలను రూపొందించుకున్నప్ప టికీ; ఆ తర్వాత చైనా, వియత్నాం పద్ధతుల్లో ఆర్థిక విధానాలను రూపొం దించు కున్నది. ఇటీవల మరికొన్ని నిర్ణయాలను తీసుకొని ప్రస్తుతం ఉన్న ఆర్థిక విధానాలను విద్య, వైద్యం, వ్యవసాయం, మహిళా సాధికారత లాంటి అంశాలు దెబ్బ తినకుండా సమయానుకూలంగా మార్చుకోవాలని ఆలోచి స్తున్నట్టు తెలుస్తున్నది. పారిశ్రామిక రంగంలో కొంత వెసులుబాటు కల్పించి త్వరితగతిన వృద్ధిని సాధించాలని చూస్తున్నారు. గత అరవైయేళ్లుగా సామా జికార్థిక ప్రగతికి ప్రజలే కేంద్రబిందువుగా పాలనను అందిస్తూ అనేక దేశాల్లో సోషలిస్టు విధానాలు విఫలమైనప్పటికీ, తమ గడ్డమీద మాత్రం సోషలిజం నిజమని రుజువు చేసింది క్యూబా. కమ్యూనిజం శాశ్వత సత్యమని చాటి చెప్పింది. తొమ్మిది పదుల నిండు జీవితంలో సామ్రాజ్యవాదంపై అలు పెరు గని యుద్ధం చేసి, జనక్యూబాను నిర్మించిన ఫిడెల్ క్యాస్ట్రోను ప్రపంచ సోషలిస్టుల్లో చిగురించిన కమ్యూనిస్టు విశ్వాసంగా నిరంతరం స్మరించు కుందాం. మల్లెపల్లి లక్ష్మయ్య వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు మొబైల్ : 97055 66213 -
చేగువేరాను ఇండియాకు పంపిన క్యాస్ట్రో!
‘‘జవహర్లాల్ నెహ్రూ నా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించారు’’ అని చెప్పేవారు ఫిడెల్ క్యాస్ట్రో. 1960లో జరిగిన ఐక్యరాజ్యసమితి సమావేశాల్లో పాల్గొనడానికి న్యూయార్క్ వెళ్లిన క్యాస్ట్రోను అదే సమావేశానికి హాజరైన నెహ్రూ, క్యాస్ట్రో బస చేసిన చోటుకు వెళ్లి మరీ కలిశారు. అప్పుడు క్యాస్ట్రో వయసు 34 ఏళ్లు. అనుభవం లేదు. అంతర్జాతీయ సమావేశంలో పాల్గొనటానికి ముందున్న టెన్షన్ ఉంది. అలాంటి సమయంలో నెహ్రూ చూపిన ఆత్మీయతను తాను ఎన్నటికీ మరవలేనని అనేవారు క్యాస్ట్రో. నెహ్రూ మీదే కాదు, భారత్ అన్నా కూడా క్యాస్ట్రోకు ఎంతో అభిమానం. క్యూబాలో క్యాస్ట్రో పాలన మొదలయ్యాక, ఆ ప్రభుత్వాన్ని గుర్తించిన తొలి దేశాల్లో ఇండియా ఒకటి. అందుకే భారత్‌తో సంబంధాన్ని బలోపేతం చేసుకునే దిశగా చేగువేరాను ఇండియాకు పంపారు క్యాస్ట్రో. అలా రెండు వారాల పర్యటన నిమిత్తం చే బృందం 1959లో ఇండియా వచ్చింది. అందులో చేతో పాటు మరో ఆరుగురు– ఒక ఆర్థికవేత్త, ఒక మ్యాథమెటీషియన్, విప్లవబృందంలో పనిచేసిన ఒక కెప్టెన్, రేడియో బ్రాడ్‌కాస్టర్, ఒక బాడీగార్డు– ఉన్నారు. వాళ్లు జూన్ 30న పాలం విమానాశ్రయంలో దిగారు. తెల్లారి తీన్ మూర్తి భవన్లో నెహ్రూను కలిశారు. ఇరు దేశాల్లో దౌత్య కార్యాలయాలను నెలకొల్పుకోవడం గురించీ, పరస్పర వాణిజ్యాన్ని పెంపొందించుకోవడం గురించీ చర్చించారు. సమావేశానంతరం నెహ్రూ, ఏనుగు దంతం పిడివున్న ఒక కత్తిని చేకు బహూకరించారు. క్యూబా రాజధాని హవానాలోని చే మ్యూజియంలో ఇప్పటికీ అది భద్రంగా ఉంది. 1960లో హవానాలో భారత్ తన దౌత్యకార్యాలయాన్ని ప్రారంభించింది. ఇరు దేశాలూ ఎన్నో అంశాల్లో పరస్పరం సహకరించుకున్నాయి. 1990ల్లో క్యూబాలో ఆర్థిక సంక్షోభం తలెత్తినప్పుడు భారత్ పది వేల టన్నుల గోధుమలూ, మరో పదివేల టన్నుల బియ్యమూ పంపింది. 2008లోనూ గుస్తావ్ తుఫాను క్యూబాను అల్లకల్లోలం చేసినప్పుడు భారత్ 20 లక్షల డాలర్ల ఆర్థిక సాయం అందించింది. అలాగే, భద్రతాసమితిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వాన్ని ఇవ్వాలన్న విషయంలో క్యూబా మొదటినుంచీ మద్దతునిస్తోంది. -
విప్లవ సింహం
-
విప్లవ పంథాలో కడదాకా!
రెండో మాట అలాంటి చారిత్రక పరిణామాలకు వారసునిగా ఎదిగిన క్యాస్ట్రోను, ఆయన ప్రభుత్వాన్ని మొదటగా గుర్తించినవాడు నెహ్రూ. కాగా, అలీన ఉద్యమాన్ని మనసారా ఆహ్వానించి కీర్తించినవాడు క్యాస్ట్రో. వృద్ధాప్యంలో ఎలాంటి వ్యక్తిగత కోరికలు లేకుండా, నిరాడంబర జీవితాన్ని గడుపుతూనే విప్లవోద్యమాల నిర్వహణలో తీవ్రమైన తప్పులు చేయకుండా ఎలా జాగ్రత్తపడాలో విప్లవకారులకు, ఉద్యమకారులకు సలహాలు, సూచనలు ఇస్తూ తుది శ్వాస వరకూ ఒక క్యూబా పత్రికలో వ్యాసాలు రాశారాయన. ‘సామాజిక, ఆర్థిక, దోపిడీ, నిరంకుశ పాలనావ్యవస్థల మీద ఎక్కుపెట్టే విప్లవం ఎప్పుడు జయప్రదమవుతుంది? పాతతరం నుంచి నవతరం నాయకత్వాన్ని అందిపుచ్చుకున్నప్పుడే విప్లవం విజయవంతమవుతుంది!’ – ఫిడెల్ క్యాస్ట్రో ‘దేశ స్వేచ్ఛాస్వాతంత్య్రాలను కాపాడుకోవడానికి ఉభయతారకంగా విదే శాలతో జరిగే వర్తక వ్యాపారాల మధ్య సమతౌల్యాన్ని సాధించాలి. అలా కాకుండా, ఉనికిలోనే లేకుండా పోవాలనుకునే దేశం మాత్రమే ఒకే ఒక్క విదే శానికి తన సరుకులను విక్రయిస్తుంది. తాను బతికి బట్టకట్టాలనుకునే దేశం మాత్రం ఒక దేశానికి పరిమితం కాకుండా పెక్కు దేశాలకు తన సరుకులను విక్రయిస్తుంది.’ – జోసి మార్తి (క్యూబా జాతీయవీరుడు. కవి, క్యూబన్ రివల్యూషనరీ పార్టీ స్థాపకుడు. క్యాస్ట్రో ఆరాధకుడు) అమెరికాకు కేవలం వంద, నూట యాభై మైళ్ల దూరంలో ఉంది (కరేబి యన్–లాటిన్ అమెరికా దేశం) క్యూబా దీవి. ప్రపంచ వలస సామ్రాజ్యశక్తిగా మారిన అమెరికా ఆ దీవిపైన దాడి చేసి, పెత్తనం చెలాయించాలని ఎందుకు అనుకుంది? దేశాలకు దేశాలు ఆక్రమించి, అనుభవించాలనుకునే సామ్రాజ్య శక్తికి దీవుల ఆక్రమణ లెక్కలోనిది కాదు. అయినా ఫిడెల్ క్యాస్ట్రో అనే క్యూబా విప్లవ విధాత ఆ సామ్రాజ్యశక్తి పక్కలో బల్లెంగా మారడానికి దారితీసిన చారిత్రక పరిస్థితులు ఏమిటి? క్యాస్ట్రో– ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా లకు ఆరాధ్య విప్లవకారుడు. తొలి అడుగులు బాటిస్టా అనే ఒక తైనాతీతో కలసి కుట్ర పన్ని, 1952లో క్యూబా మీద అమె రికా ఆకస్మికంగా దాడి చేసింది. ఆ దీవికి అతడినే పాలకునిగా ప్రకటించింది. అది మొదలు క్యూబా ప్రజానీకం విమోచన కోసం ఎన్నో పోరాటాలూ, త్యాగాలూ చేశారు. ఆ సమయంలోనే ప్రభవించిన విప్లవశక్తులు ఫిడెల్ క్యాస్ట్రో నాయకత్వంలో క్యూబా విమోచనకు సమాయత్తమైనాయి. ఆ పోరులో క్యాస్ట్రో వెంట నడిచినవాడు డాక్టర్ ఎర్నెస్టో గువేరా. అప్పుడే లాటిన్ అమెరికాలోని బొలీవియాలోనూ విప్లవం (1952) చెలరేగింది. యావత్తు లాటిన్ అమెరికా దేశాలను సందర్శించిన అనుభవంతో క్యాస్ట్రోతో ఆయన చేతులు కలిపారు. 1953లో క్యూబాలోనే శాంటియాగోలో ఉన్న బాటిస్టా సైనిక కేంద్రం మీద సాయుధ దాడి జరిగింది. దీనికి క్యాస్ట్రో నాయకత్వం వహించారు. అలా బాటిస్టా ఉద్వాసనకూ, క్యూబా విమోచన విప్లవానికి అంకురార్పణ జరిగాయి. ఎన్నో త్యాగాలు చేయవలసి వచ్చింది. క్యాస్ట్రో, అనుచరులు శత్రుబలగాలకు చిక్కి నిర్బంధాలకు గురయ్యారు. అదొక సుదీర్ఘ పోరాటం. ఆ పోరులో అంతిమఘట్టం 1959లో ఆవిష్కృతమైంది. ఆ సంవ త్సరమే బాటిస్టా క్యూబా విడిచి పారిపోయాడు. ప్రధానమంత్రిగా క్యాస్ట్రో ప్రమాణ స్వీకారం చేశారు. అధికారంలోకి రాగానే విమోచన సమర లక్ష్యాలకు అనుగుణంగా క్యాస్ట్రో అనేక సంస్కరణలు చేపట్టారు. పరాయి పెత్తనంతో చితికిపోయిన వ్యవసాయ రంగాన్ని పునరుద్ధరిస్తూ, కమతాలకు పరిమితిని ప్రకటించి రైతులకు క్యాస్ట్రో భూములను పంచిపెట్టారు. విప్లవోద్యమ విజయ చిహ్నంగా ఆయన ప్రవేశపెట్టిన తొలి సంస్కరణ ఇదే. 50 లక్షల మంది పిల్లలను ఉచిత ఆరోగ్య పథకం పరిధిలోకి తీసు కొచ్చారు (నేడు వర్ధమాన దేశాలకు ఆరోగ్య సేవలు ఉచితంగా అందిం చడానికి దాదాపు 30 వేలమంది డాక్టర్లను పంపి క్యూబా ఉచిత సేవలు అందిస్తోంది). విమోచనోద్యమంలో తన వెంట నడిచిన గువేరాకు ప్రజల అనుమతితో క్యూబా పౌరసత్వం ఇచ్చి గౌరవించారు. నిజానికి పోర్చుగీసు, డచ్, బ్రిటిష్ పాలకుల ఏలుబడిలో భారత ప్రజలు మూడువందల ఏళ్లు మగ్గిన విధంగానే, క్యూబా సహా అనేక లాటిన్ అమెరికా దేశాలు స్పానిష్, అమెరికా వలస పాలనాధికారం కింద నలిగిపోయినవే. చిత్రం ఏమిటంటే క్యూబాలోనే ఉన్న గ్వాంటనామా మీద అమెరికా పెత్తనం ఇంకా కొనసాగు తోంది. క్యూబాకి చెందిన ఈ దీవిని పాత అసమ సంధులను అడ్డం పెట్టుకుని అమెరికా తన రహస్య వేధింపుల కేంద్రంగా మార్చింది. అలాగే ప్రపంచ దేశాల సంపదపైన, ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలలోను తిష్ట వేయడానికి తన వంతు కుట్రలు పన్నుతూనే ఉంది. ఇందుకు క్యూబాలో అమెరికా రాయబారిగా పనిచేసిన(1960) ఎర్ల్ స్మిత్ వ్యాఖ్యలే ప్రబల సాక్ష్యం– ‘క్యాస్ట్రో అధికారానికి వచ్చే వరకు క్యూబాలో అమెరికాది ఎదురు లేని పలుకుబడి. అమెరికా రాయబారి క్యూబాలో రెండో అధినాయకుడు. ఒక్కొక్క సందర్భంలో అతనే అధ్యక్షునికన్నా శిష్టాదిగురువు’. చరిత్రను మార్చిన మార్గదర్శకుడు పరాగ్వే అత్యున్నత న్యాయస్థానం నాలుగు వందల ఏళ్ల అనుభవాలను చూసిన తరువాత దేశంలోని అన్ని న్యాయస్థానాలకు పంపిన నోటీసులో పేర్కొన్న అంశం కూడా చెప్పుకోదగినది. ‘లాటిన్ అమెరికాలో ఇండియన్లు కూడా రిపబ్లిక్లో నివశించే మానవమాత్రులే. పరాగ్వే రిపబ్లిక్‌లోని ప్రతి పది మందిలో ఎనిమిది మంది ఇండియన్లే. కాబట్టి వారిని పశువులుగా చూడడం దుర్మార్గం. స్పానియార్డులు, అమెరికన్లు ఇండియన్లను జంతువులను వేటాడి నట్టు వేటాడి వేధించారు. వారిని బేరసారాలతో అమ్ముతున్నారు’ (ఇలాంటి వివక్షకు స్వతంత్ర భారతంలోని కొన్ని పాలక వర్గాలు కూడా అతీతం కాదు). 16,17 శతాబ్దాలలో అమెరికన్ సామ్రాజ్యవాదులు 80 లక్షలమందికి పైగా ఇండియన్లను అక్షరాలా పొట్టన పెట్టుకున్నారని చరిత్రకారుల కథనం. టిన్ను, నికెల్, వెండి అపార లోహ ఖనిజ సంపద కలిగిన లాటిన్ అమెరికా ఖండ దేశాలు ఒకనాడు సంపన్న దేశాలుగా ఉన్నవే. సామ్రాజ్యవాద పెట్టుబడుల వ్యాప్తి ద్వారా లాభాల వేటలో భాగంగా పేద, నిరుపేద దేశాలుగా మారాయి. ఇప్పుడు ఆ దేశాలేæ క్యాస్ట్రో నాయకత్వ ప్రభావంతో సామ్రాజ్యవాద కుట్ర లను ఎదుర్కొంటూ స్వేచ్ఛ, స్వాతంత్య్రాలను కాపాడుకోవడానికి ప్రయత్ని స్తున్నాయి. క్యూబా విప్లవ ప్రభావం వల్లనే లాటిన్ అమెరికాలో తిరిగి పెట్టు బడిదారీ వ్యవస్థను పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తున్న అమెరికా తన ప్రాభ వాన్ని క్రమంగా కోల్పోతోంది. 50 ఏళ్ల నాడు అమెరికా ఏది శాసిస్తే దానినే నమ్మిన లాటిన్ అమెరికా మిలటరీ పాలకులు సైతం ఇప్పుడు క్యూబన్ విప్లవ ప్రభావానికి లొంగి రాక తప్పలేదు. చొరవలేని సమూహంగా ముద్రపడిన రైతాంగాన్ని సైతం సాంఘిక విప్లవం జయప్రదంగా సమీకరించగల్గుతుందని చైనా విప్లవం నిరూపించిందని ప్రసిద్ధ ఆర్థికవేత్త అశోక్ మిత్ర అంచనా. అలాంటి చారిత్రక పరిణామాలకు వారసునిగా ఎదిగిన క్యాస్ట్రోను, ఆయన ప్రభుత్వాన్ని మొదటగా గుర్తించినవాడు నెహ్రూ. కాగా, అలీన ఉద్యమాన్ని మనసారా ఆహ్వానించి కీర్తించినవాడు క్యాస్ట్రో. వృద్ధాప్యంలో ఎలాంటి వ్యక్తి గత కోరికలు లేకుండా, నిరాడంబర జీవితాన్ని గడుపుతూనే విప్లవోద్యమాల నిర్వహణలో తీవ్రమైన తప్పులు చేయకుండా ఎలా ఉండాలో విప్లవకారు లకు, ఉద్యమకారులకు సలహాలు, సూచనలు ఇస్తూ తుది శ్వాస వరకూ ఒక క్యూబా పత్రికలో వ్యాసాలు రాశారాయన. చిన్న దేశమైన క్యూబా వర్ధమాన దేశాలకు ‘ఉన్నంతలోనే కొండంత’ సాయంగా లాటిన్ అమెరికా దేశాలకు, ఆసియా, ఆఫ్రికా దేశాలకు గోధుమ, బియ్యమే కాక, భారీగా వైద్య సహాయ సహకారాలు అందించింది. అమెరికా 50 ఏళ్లపాటు విధించిన ఆర్థిక ఆంక్ష లను తట్టుకుని నిలబడింది. ఆ విప్లవ స్ఫూర్తితోనే 1970ల నాటి ప్రచ్ఛన్న యుద్ధ పరిస్థితుల మధ్యనే ఒక చిన్న కరేబియన్ (లాటిన్ అమెరికా) దేశంగా వేల మైళ్ల దూరంలో ఉన్న అంగోలా, ఇథియోపియా దేశాల యుద్ధ క్షేత్రా లలోకి తన వలంటీర్లను, సైనికుల్ని దూకించింది క్యూబా. రానున్న రోజుల్లో ఆఫ్రికా ప్రపంచ విప్లవానికి విశ్వవేదిక కాగలదని క్యాస్ట్రో విశ్వసించారు. ఇటీవలి పదిమంది అమెరికన్ అధ్యక్షులలో ఒకరిద్దరు మినహా అందరూ క్యాస్ట్రోను హత్య చేయడానికి 600 సార్లు ఏర్పాట్లు చేసి విఫలమైనవారే. ఒబామా సర్కారు ఆర్థిక సంక్షోభం నుంచి తేరుకోలేని స్థితిలో, స్థానిక యుద్ధా లలో కూరుకుపోయి బలహీనపడుతున్న అమెరికాను బయటపడవేసే ప్రయ త్నంలో క్యూబాతో దౌత్య సంబంధాలను పునరుద్ధరించింది. నిజాన్ని విశ్వసించినవాడు రావుల్ క్యాస్ట్రోకి పాలనా బాధ్యతలు బదలాయించిన తరువాత క్యాస్ట్రో ప్రసిద్ధ భారత జర్నలిస్టు సయీద్ నక్వీకి ఇచ్చిన ఇంటర్వూ్యలో ‘సోషలిజం’ గురించి చెప్పిన మాటలు ప్రశంసార్హమైనవి: ‘సోషలిజం అంటే ప్రజలం దరినీ సంపన్నులుగా మార్చడమని కొందరు భావిస్తున్నారు. అది తప్పు. ప్రజలందరినీ వివక్ష లేకుండా సరిసమాన హోదాలో బతకడానికి కనీస అవసరాలను తీర్చి, శాంతిని, సుఖసంతోషాలను సమకూర్చి పెట్టడమేగానీ కోటీశ్వరుల్ని, మహా కోటీశ్వరుల్ని సృష్టించడం సోషలిజం కానేరదు’ అన్నా రాయన. దోపిడీ, బానిస వ్యవస్థల రద్దు కోసం తమ జీవితాలను పణంగా పెడుతూ వచ్చిన మార్టిన్ లూథర్ కింగ్, మాల్కోమ్ ఎక్స్ తదితర యోధుల బాటలో నడిచి చరితార్థుడైన విప్లవ నేత క్యాస్ట్రో. ఆయన ఒక సందేశంలో ఇలా పేర్కొన్నాడు: ‘ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా ఖండాలలో చాలా వివక్షలకు ఇంకా ఆటవిడుపు లేదు. ఈ వాస్తవాల్ని చైతన్యంతో గమనించాలి. ప్రత్యామ్నాయ మార్గాలు చేతికి అందివస్తాయి. తీవ్ర సంక్షోభాల నుంచి మాత్రమే గొప్ప గొప్ప పరిష్కార మార్గాలు ఆవిష్కరించుకుంటాయని చరిత్ర రుజువు చేసింది. జీవించే హక్కుకు, న్యాయం పొందే హక్కుకు ప్రజలే వార సులు. ఈ రెండు హక్కులూ వెయ్యిన్నొక్క మార్గాల్లో తమ ఉనికిని నిరూ పించుకుంటాయి. నేను మనిషిని నమ్ముతాను, నిజాన్ని విశ్వసిస్తాను (సత్య మేవ జయతే)’ అన్నారు క్యాస్ట్రో. సీనియర్ సంపాదకులు ఏబీకే ప్రసాద్ abkprasad2006@yahoo.co.in -
బీసీల్లో చైతన్యం కల్పిస్తాం..
రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ రాములు హన్మకొండ అర్బన్: అలెగ్జాండర్, ఫిడెల్ క్యాస్ట్రో తరహాలో బీసీల్లో చైతన్యాన్ని నింపేలా బాటలు వేస్తామని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ బీఎస్ రాములు తెలిపారు. వారికి వ్యక్తిత్వ వికాసం కల్పించి జ్ఞానమార్గం చూపిస్తామని అన్నారు. కమిషన్ సభ్యులు కృష్ణమోహన్, రూరల్ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్‌తో కలసి వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టరేట్లో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం, ముఖ్యమంత్రి నిర్ధేశించిన ప్రకారం రాష్ట్రంలో బీసీల ఆర్థిక స్థితిగతులు, కుల వృత్తులపై 3 నెలల పాటు అధ్యయనం చేసి వెరుు్య పేజీలకు తగ్గకుండా నివేదిక ఇస్తామని తెలిపారు. రాష్ట్రంలో రెండు కోట్లకు పైగా జనాభా ఉన్న బీసీలను నిరాశ, నిస్పృహల నుంచి విముక్తులను చేయడమే కమిషన్ లక్ష్యమన్నారు. ప్రతీ గ్రామం, కుటుంబం, వ్యక్తికి సంబంధించి సమగ్ర అధ్యయనం చేసి వారికి ప్రభుత్వం ద్వారా అందుతున్న పథకాలు, కొత్తగా అమలు చేయాల్సిన పథకాలపై నివేదిక ఇస్తామన్నారు. ఆధునిక పరిజ్ఞానం అందు బాటులోకి రావడంతో కుల వృత్తులకు కాలం చెల్లిందన్నారు. లాభసాటిగా ఉండే ఏ వృత్తిని అరుునా ఇతర కులాలు స్వీకరిస్తాయని.. దీనికోసం వారికి తగిన శిక్షణ ఇస్తూ ప్రోత్సహిస్తామని రాములు తెలిపారు. బీసీల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం చాలా పథకాలు అమలు చేస్తోందని, ఉపకారవేతనాలు, విదేశీ చదువులకు రుణాలు, బ్యాంకుల ద్వారా రుణాలు, ఆసరా పెన్షన్లు వంటివి ఇందులో ఉన్నాయని బీఎస్.రాములు అన్నారు. అరుుతే, ఆయా పథకాలు అర్హులకు ఏ మేరకు చేరుతున్నాయన్న విషయంలో అధ్యయనం చేస్తామని తెలిపారు. తమకు వందల సంఖ్యలో వినతులు అందాయని, వాటిని పరిశీలించి అవసరం ఉన్నవాటిని నివేదికలో పొందుపరుస్తామని తెలిపారు. -
శోకసంద్రంలో క్యూబా
ఫిడెల్ క్యాస్ట్రో మరణంతో అంతటా విషాదం హవానా: కమ్యూనిస్టు నేత, దేశ మాజీ అధ్యక్షుడు ఫిడెల్ క్యాస్ట్రో మరణంతో క్యూబా శోకసంద్రంలో మునిగిపోయింది. ఆదివారం దేశమంతటా ప్రజల విషాద వదనాలతో నిశ్శబ్దం అలముకుంది. ఎక్కడా ఎలాంటి అధికారిక కార్యక్రమాలనూ నిర్వహించలేదు. 50 ఏళ్లు పాలన సాగించిన క్యాస్ట్రో చరిత్ర పుటల్లో నిలిచిపోయేలా తుది వీడ్కోలు పలికెందుకు దేశం సిద్ధమవుతోంది. సంతాప సభలు, 4 రోజుల పాటు ఆయన పార్థివదేహంతో యాత్ర జరిపి డిసెంబరు 4న శాంటియాగోలో అంత్యక్రియలు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. క్యాస్ట్రో 1953లో శాంటియాగో నుంచే విప్లవోద్యమానికి శ్రీకారం చుట్టారు. శుక్రవారం రాత్రి క్యాస్ట్రో(90) అనారోగ్యంతో తుది శ్వాస విడవడం తెలిసిందే. హవానాలోని చారిత్రక రివల్యూషన్ స్క్వేర్‌లో సంతాప సభలు సోమవారం మొదలవుతాయి. నా జీవితం కంటే ఎక్కువ... క్యాస్ట్రో మరణంతో క్యూబన్ల గుండెలు పగిలారుు. ‘ఏం చెప్పగలను? క్యాస్ట్రో నా జీవితం కంటే ఎక్కువ’ అని కన్నీటి పర్యంతమయ్యారు 82 ఏళ్ల ఆరోరా మెండెజ్. పేదల కోసం పోరాడిన యోధుడని కొనియాడారు. ప్రస్తుత క్యూబా జనాభాలో చాలామంది పుట్టక ముందే క్యాస్ట్రో పోరాటం, ధీరత్వం... స్కూలు పుస్తకాలు, పత్రికలన్నింటా నిండిపోయారుు. మార్గదర్శకుడిగా నిలిచి, సామాజిక, ఆర్థిక అసమానతలు లేకుండా దేశానికి దిశానిర్దేశం చేసిన యోధుడు లేకుండా వారు తమ జీవితాన్ని ఊహించుకోలేకపోతున్నారు. కొందరు ఆందోళన చెందుతుంటే... ఆయన నింపిన విశ్వాసంతో దేశం ముందుకు సాగుతుందని మరికొందరు ఆశిస్తున్నారు. కొందరు మాత్రం... ఫిడెల్ మరణంతో ఆయన తమ్ముడు, అధ్యక్షుడు రౌల్ క్యాస్ట్రో నాయకత్వంలో క్యూబా ఆర్థికంగా మరింత వేగంగా అభివృద్ధి పథంలో దూసుకుపోతుం దని భావిస్తున్నారు. అంత్యక్రియలకు క్యాస్ట్రో సోదరి దూరం మయామి: ఫిడెల్ క్యాస్ట్రో అంత్యక్రియలకు ఆయన సోదరి జువానిత హాజరుకాబోవడం లేదని అమెరికా మీడియా పేర్కొంది. ‘ఫిడెల్ అంత్యక్రియలకు వెళుతున్నానన్న ఊహాగా నాల్లో నిజం లేదు. తిరిగి క్యూబాకు వెళ్లే ప్రసక్తే లేదు’ అని దశాబ్దాలుగా అమెరికాలోని మియామీలో ఉంటున్న జువానిత చెప్పారని వెల్లడించింది. ఫిడెల్ కమ్యూనిస్టు ప్రభుత్వా న్ని జువానిత బహిరంగంగా వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. క్యాస్ట్రోను తొలగించేం దుకు సీఐఏకు సహకరించారని ఆమెపై ఆరోపణలున్నారుు. -
ఫిడెల్ క్యాస్ట్రో క్రు నివాళి
నల్లగొండ టౌన్ : క్యూబా మాజీ అధ్యక్షుడు, పోరాట యోధుడు ఫెడల్ క్యాస్ట్రోక్రు జిల్లా వ్యాప్తంగా ఘనంగా నివా ళులర్పించారు. ఈ సందర్భంగా పలు పార్టీల నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటిం చారు. శనివారం నల్లగొండలోని దొడ్డి కొమరయ్యభవన్లో జరిగిన ఓ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యు లు జూలకంటి రంగారెడ్డి పాల్గొని మాట్లాడారు. కార్యక్రమం లో జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, సయ్యద్‌హాషం, ఊట్కూరి నారాయణరెడ్డి, పాలడుగు నాగార్జున, పి.నర్సిరెడ్డి, సత్తయ్య, బొల్లు వసంతకుమార్, దండెంపల్లి సత్తయ్య, ప్రభావతి, రొట్టెల రమేష్, అశోక్‌రెడ్డి, కడారి కృష్ణ పాల్గొన్నారు. -
అరుణతార అస్తమయం
నేలకొరిగిన కమ్యూనిస్టు శిఖరం ఫిడెల్ క్యాస్ట్రో 90 ఏళ్ల వయసులో అనారోగ్యంతో కన్నుమూత ముప్పై ఏళ్ల వయసులోనే విప్లవాగ్ని రగిల్చిన యోధుడు అగ్రరాజ్యం అమెరికాను ధిక్కరించి.. క్యూబాలో నియంత సర్కారును కూల్చి.. 1959లో దేశ పగ్గాలు చేపట్టిన సోషలిస్టు ఐదు దశాబ్దాలపాటు అప్రతిహత పాలన అనేక దేశాల్లో విప్లవోద్యమాలకు అండగా నిలిచిన క్యాస్ట్రో క్యూబాలో 9 రోజుల సంతాప దినాలు.. 4వ తేదీన అంత్యక్రియలు ప్రపంచ దేశాధినేతల సంతాపం.. అమెరికాలో మాత్రం సంబరాలు హవానా: కమ్యూనిస్టు శిఖరం నేలకొరిగింది. విప్లవ యోధుడు అస్తమించాడు. అగ్రరాజ్యం అమెరికాను యాభై ఏళ్లపాటు వణికించిన ధీరుడు, క్యూబా ప్రజల ఆరాధ్యదైవం ఫిడెల్ క్యాస్ట్రో (90) తుదిశ్వాస విడిచారు. ఆయన తమ్ముడు, క్యూబా అధ్యక్షుడు రౌల్ క్యాస్ట్రో జాతీయ రేడియో ద్వారా ఫిడెల్ మరణవార్తను ప్రపంచానికి వెల్లడించారు. ‘క్యూబా విప్లవ కమాండర్ ఇన్ చీఫ్ ఇకలేరు’అంటూ గంభీర స్వరంతో ప్రకటించారు. క్యూబా కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి 10.30కి ఫిడేల్ కన్నుమూసినట్లు తెలిపారు. ఈ నెల 26 నుంచి తొమ్మిది రోజులను సంతాప దినాలుగా క్యూబా ప్రభుత్వం ప్రకటించింది. నాలుగురోజుల పాటు దేశమంతా క్యాస్ట్రో పార్థివదేహంతో యాత్ర జరిపి డిసెంబర్ 4న శాంటియాగోలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలిపింది. తమ అభిమాన నాయకుడి మరణవార్తతో క్యూబా శోకసంద్రంలో మునిగిపోరుుంది. చాలా చోట్ల ప్రజలు రోడ్లపైకి వచ్చి రోదించారు. ప్రధాని నరేంద్ర మోదీ సహా ప్రపంచ దేశాల నేతలు ఫిడెల్ మృతికి సంతాపం తెలిపారు. మరోవైపు అమెరికాలో ఫిడెల్ మృతితో ప్రజలు సంబరాలు జరుపుకున్నారు. విప్లవకారుల హీరో: సామాన్య పౌరులపై పెట్టుబడిదారుల ఆధిపత్యానికి ఫిడెల్ క్యాస్ట్రో బద్ధ వ్యతిరేకి. ఆయన్ను వ్యతిరేకించే వారికి మాత్రం క్రూరమైన నిరంకుశుడు. 1959కి ముందు క్యూబా నియంత ఫుల్జెనికో బటిస్టాపై ఫిడెల్ తిరుగుబాటు జెండా ఎగరేశారు. 32 ఏళ్ల వయసులోనే తన రెబల్ సైన్యంతో మిలటరీని చిత్తుచేసి విప్లవ నాయకుడిగా ఎదిగారు. ఐదు దశాబ్దాలపాటు 11 మంది అమెరికా అధ్యక్షులతో నేరుగా ఢీకొన్నారు. ఒకదశలో అణుయుద్ధం తప్పదనే పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. ఫిడెల్‌ను హత్య చేసేందుకు అమెరికా తన గూఢచార సంస్థ సీఐఏ ద్వారా ఏకంగా 638 సార్లు యత్నించి విఫలమైంది. 1961లో అమెరికా చేపట్టిన క్యూబన్ మిసైల్ క్రైసిస్ (ప్రపంచ ప్రమాదరకమైన సర్జికల్ దాడుల్లో ఒకటి)ను తిప్పికొట్టిన అసామాన్య నేత క్యాస్ట్రో. ఎప్పుడూ నోట్లో సిగార్లతో కనిపించే క్యాస్ట్రో.. అనారోగ్యం బారిన పడిన తర్వాత డాక్టర్ల సూచన మేరకు పొగతాగటం మానేశారు. 2008లో కడుపు, పెద్దపేగులకు సంబంధించిన సమస్యల కారణంగా సోదరుడు రౌల్ క్యాస్ట్రోకు దేశాధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. ప్రపంచమంతా పాశ్చాత్య ప్రజాస్వామ్యాన్ని అమలుచేస్తున్నా.. తోటి కమ్యూనిస్టు దేశాలైన చైనా, వియత్నాంలు పెట్టుబడిదారీ విధానాన్ని స్వాగతించినా.. ‘సోషలిజం లేదా మరణం’లో ఏదో ఒకటి తేల్చుకోవాలని బలంగా నమ్మి ఆచరణలో పెట్టారు క్యాస్ట్రో. సోషలిజమే ఊపిరిగా.. 1926 ఆగస్టు 13న ఫిడెల్ క్యాస్ట్రో క్యూబాలో జన్మించారు. అంతకుముందే వీరి కుటుంబం స్పెయిన్ నుంచి క్యూబాకు వలస వచ్చింది. హవానా యూనివర్సిటీలో చదివిన క్యాస్ట్రో.. 1953లో శాంటియాగోలోని మొన్కాడా మిలటరీ బ్యారక్‌లపై దాడితో తన రెబల్ ప్రస్థానాన్ని ప్రారంభించారు. అనంతరం జైలుపాలయ్యారు. క్షమాభిక్షపై బయటకు వచ్చి మెక్సికో వెళ్లారు. 1959 జనవరి 8న బటిస్టా నియంత ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి విజయం సాధించారు. సోవియట్ యూనియన్ శిబిరంలోకి క్యూబా వెళ్లడాన్ని జీర్ణించుకోలేని అమెరికా.. క్యాస్ట్రోపై కక్ష గట్టింది. క్యూబాపై అనేక ఆంక్షలు పెట్టింది. 1956లో మొదటి భార్య మిర్తా దియాజ్తో క్యాస్ట్రో విడాకులు తీసుకున్నారు. అంతకుముందే వీరికి ఓ కుమారుడున్నాడు. ఆ తర్వాత నాలుగు దశాబ్దాలు దాలియా సోటో డెల్ వాల్లేతో సహజీవనం చేశారు. వీరికి ఐదుగురు సంతానం. 1980లో వీరి వివాహం రహస్యంగా జరిగింది. పేదలకు ఆపన్న హస్తం క్యూబాలోని విప్లవ గ్రూపులను ఏకం చేసి క్యూబన్ కమ్యూనిస్టు పార్టీని ఫిడెల్ ప్రారంభించారు. తర్వాత లాటిన్ అమెరికా దేశాల్లో నియంతృత్వాలపై పోరాటానికి విప్లవాన్ని రగిలించారు. ఆఫ్రికాలో పాశ్చాత్య దేశాల ప్రభావం కారణంగా ఇబ్బందులు పడుతున్నవారికి మద్దతుగా క్యూబన్ సైన్యాలను పంపించారు. అరుుతే సోవియట్ యూనియన్ పతనం క్యూబాపై తీవ్ర ప్రభావం చూపింది. ప్రచ్ఛన్నయుద్ధం ముగియడం, లాటిన్ అమెరికా, యురోపియన్ యూనియన్ దేశాల తోడ్పాటుతో క్యూబా కోలుకుంది. 50 ఏళ్ల పాటు క్యూబాను అప్రతిహతంగా పాలించి.. ప్రపంచంలో ఎక్కువకాలం ఒక దేశాన్ని పాలించిన నేతగా నిలిచారు ఫిడెల్. అనారోగ్యం కారణంగా తమ్ముడు రౌల్‌కు 2008లో దేశ పగ్గాలు అప్పగించారు. ఆరోగ్యం విషమించటంతో చాలా కాలంగా బయటకు రాలేదు. చివరి సారిగా 2016లో బహిరంగంగా కనిపించారు. ఐక్యరాజ్యసమితి సర్వ ప్రతినిధి సభలో క్యూబన్ల జీవితాల గురించి 1960లో 269 నిమిషాలసేపు (ఇదే అత్యధిక సమయం) క్యాస్ట్రో చేసిన ప్రసంగం ఇప్పటికీ రికార్డే. విప్లవోద్యమాలకు స్ఫూర్తిప్రదాత అగ్రరాజ్యం అమెరికాకు సమీపం నుంచే ఎదు రొడ్డి నిలబడిన క్యాస్ట్రో లాటిన్ అమెరికా, మధ్య అమెరికా ఆఫ్రికా దేశాల్లోని విప్లవ, జాతీయ విముక్తి పోరాటాలకు ఎనలేని స్ఫూర్తినం దించారు. క్యాస్ట్రో తన అభిమాన యోధుడని దక్షిణా ఫ్రికా నల్లజాతి సూరీడు నెల్సన్ మండేలా కొనియాడారు. మధ్య అమెరికాలోని నికరగువా, గ్వాటమాల ప్రజాపోరాటాలకు క్యాస్ట్రో మద్దతునందించారు. ముఖ్యంగా గ్వాటమాల నేత డేనియల్ ఆర్టెగాకు కీలకమైన మద్దతు అందించారు. అలాగే మరో లాటిన్ అమెరికా దేశం వెనెజువెలాలో హ్యూగో చావెజ్ నేతృత్వంలో వచ్చిన ప్రజాతంత్ర ప్రభుత్వం నిలబడడానికి క్యాస్ట్రో నుంచి అన్ని విధాలా నైతిక మద్దతు లభించింది. ఇంత సాయం అందించినందుకు బదులుగా క్యూబాకు కారుచౌకగా చావెజ్ ముడి చమురు సరఫరా చేశారు. అలాగే ఐరోపా వలస పాలన నుంచి విముక్తి కోసం ఆఫ్రికా దేశాల్లో వచ్చిన తిరుగుబాటు ఉద్యమాలకు కూడా క్యాో్ట్ర చేతనైనంత సాయం చేశారు. తన సుదీర్ఘ పాలనా కాలంలో పది మంది అమెరికా అధ్యక్షులను క్యాస్ట్రో చూడడమే కాదు వారి విధానాలను ధైర్యంగా ఎదుర్కొన్నారు. అమెరికా ఆధిపత్యానికి, దాని కీలుబొమ్మ సర్కార్లకు వ్యతిరేకంగా జరిగిన అన్ని ప్రజాపోరాటాలకు అండగా నిలిచారు. సామ్రాజ్యవాదంపై సామ్యవాద గర్జన నువ్వు.. నియంతృత్వ రాజ్యంపై.. నిప్పులుగక్కిన పిడుగు నువ్వు.. ‘పెట్టుబడి’ పడగలపై.. పెకైగిసిన పిడికిలి నువ్వు.. అగ్రదేశం ఆదేశంపై.. అరుణోదయ అస్త్రం నువ్వు.. అన్నిటికీ మించి కాలగమనంపై ఎన్నటికీ కరగని కార్మికుల చెమట చుక్కవు నువ్వు ఎవరన్నారు కామ్రేడ్.. నువ్వు అస్తమించావని..?? వారికి తెలియదేమో...! రేపటి ఉదయాన లేలేత కిరణాలకు అరుణ వర్ణం అద్దుతూ మళ్లీ ఉదయిస్తావని...!!! -
28న హర్తాళ్‌ను విజయవంతం చేయండి
- వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి భూమన పిలుపు - దేశవ్యాప్తంగా లెఫ్ట్, ఇతర ప్రతిపక్షాల ఆందోళనకు వైఎస్సార్సీపీ పూర్తి మద్దతు - పెద్ద నోట్ల రద్దు నిర్ణయం మంచిదే.. - కానీ దీని వల్ల కుచేలురు బలవుతున్నారు - వారి ఇబ్బందుల్ని తొలగించేలా కేంద్రం చర్యలు లేవు సాక్షి, హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దుతో ప్రజలకు కలుగుతున్న కష్టనష్టాలపై కేంద్రప్రభుత్వం మీద ఒత్తిడి పెంచేందుకు ఈ నెల 28న దేశవ్యాప్తంగా వామపక్షాలతోపాటు ఇతర ప్రతిపక్షాలు నిర్వహించ తలపెట్టిన హర్తాళ్‌ను విజయవంతం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి పిలుపునిచ్చారు. ఎటువంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా పెద్ద నోట్లను రద్దు చేసి సామాన్యుల్ని వీధుల్లో నిలబెట్టిన కేంద్రప్రభుత్వ చర్యలకు నిరసనగా ప్రజలు చేస్తున్న ఆందోళనకు వైఎస్సార్సీపీ పూర్తి మద్దతు పలుకుతోందన్నారు. ఈ ఆందోళన కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ స్వచ్ఛందంగా పాల్గొనాలని కోరారు. దుకాణాలు, వాణిజ్య సంస్థలు, విద్యాసంస్థలు, రవాణా వంటివి స్తంభించేలా ప్రజలు హర్తాళ్‌లో పాల్గొనాలని భూమన విజ్ఞప్తి చేశారు. శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రజల కష్టాల్ని దృష్టిలో పెట్టుకుని చర్యలుంటాయని ఆశించినా కేంద్రం వ్యవహరించిన తీరు తీవ్ర నిరాశ కలిగించిందన్నారు. దీనికితోడు మరిన్ని చర్యలను ప్రభుత్వం ప్రకటించడంతో.. మూలిగే నక్కమీద తాటిపండులా ఇప్పటికే అంతంతమాత్రంగా ఉన్న పేదవాళ్లపై ఈ నిర్ణయం ఉరుములేని పిడుగులా పడిందన్నారు. దేశంలో ఎక్కడా నగదు లభించట్లేదని, బ్యాంకుల్లో పరిస్థితులు దారుణంగా మారాయని, ఏటీఎంలు మూతపడ్డాయని తెలిపారు. దీంతో పేద, మధ్యతరగతి ప్రజల బాధలు మరింతగా పెరిగాయన్నారు. ప్రజల కష్టాల్ని పట్టించుకోవడంలో వైఎస్సార్సీపీ ముందుంటుంది.. ప్రజల కష్టనష్టాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లే ప్రక్రియలో వైఎస్సార్సీపీ అగ్రగామిగా ముందుంటుందని భూమన అన్నారు. ‘‘రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేయటం ద్వారా నల్లధనాన్ని, నకిలీ ధనాన్ని, ఉగ్రవాద మూలాల్ని తుదముట్టించాలన్న కేంద్రప్రభుత్వ నిర్ణయానికి వైఎస్సార్సీపీ ఎప్పట్నుంచో మద్దతిస్తోంది. అరుుతే ఈ నిర్ణయంతో కుచేలురు బలవుతున్నారు. ప్రజలు ఇబ్బందులు పడకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఈనెల 9నుంచే విజ్ఞప్తి చేస్తూ వస్తున్నాం. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి రాజమండ్రిలో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడడం, పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ నెల 23న ప్రధాని మోదీకి లేఖ రాయడం తెలిసిందే. కానీ 18 రోజులు గడిచినా పరిస్థితుల్లో మార్పులు కనిపించట్లేదు. ప్రధాని నిర్ణయం సరైనదేనైనా అమలు సరిగా లేనప్పుడు ప్రయోజనం ఉండదు. ఈ నేపథ్యంలో కేంద్రంపై మరింత ఒత్తిడి పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాం. ఈ హర్తాళ్‌ను విజయవంతం చేయాల్సిందిగా పార్టీ శ్రేణులకు, ప్రజలకు వైఎస్సార్సీపీ పిలుపునిస్తోంది’’ అని భూమన తెలిపారు. ఫిడెల్ క్యాస్ట్రో మృతి పట్ల వైఎస్సార్సీపీ సంతాపం.. మహానేత, ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమాలకు జెండాగా ఉన్నటువంటి ఫిడెల్ క్యాస్ట్రో మరణం పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సంతాపం తెలియజేస్తోందని భూమన పేర్కొన్నారు. ఆయన మృతి విప్లవ ప్రపంచానికే తీరని లోటన్నారు. విప్లవ వీరులకు క్యాస్ట్రో చూపిన మార్గం ఆచరణీయమని కొనియాడారు. -
నా చివరి ఆలోచనలన్నీ ఈ విప్లవ వీరులతోనే..
‘‘క్యూబాకు సంబంధించి అన్ని బాధ్యతల నుంచి విముక్తం అవుతున్నానని మరోసారి చెబుతున్నా... ఇంకో దేశంలో... మరో ఆకాశం నీడన అంతిమఘడియలు సమీపిస్తే... నా చివరి ఆలోచనలన్నీ ఈ దేశ విప్లవ వీరులతోనే ముఖ్యంగా నీ ఆలోచనలతో ముప్పిరిగొంటాయి. నీవు నేర్పిన పాఠాలు.. అందరికీ ఆదర్శంగా నిలిచిన నీ వ్యక్తిత్వాన్ని చివరి వరకూ గుర్తుంచుకుంటా. అంతే బాధ్యతతో మెలుగుతా. నా జీవితం ఎక్కడ అంతమైనప్పటికీ క్యూబా విప్లవకారుల్లో ఒకడిగానే బాధ్యతగా వ్యవహరిస్తా.. నడుచుకుంటా కూడా. భార్య, పిల్లల కోసం ఏమీ వదిలివెళ్లడం లేదు. ఇందుకు బాధ ఏమీ లేదు సరికదా... ఆనందంగా ఉంది. రాజ్యం (క్యూబన్ ప్రభుత్వం) ఎలాగూ వాళ్ల జీవనానికి, విద్యాబుద్ధులు నేర్పించడానికి తగినంత చేస్తుంది కాబట్టి.. వాళ్లకు అది చేయమని, ఇది చేయమని కూడా నేను కోరదలచుకోలేదు.’’ - ఫిడెల్ క్యాస్ట్రోకు క్యూబా విప్లవ వీరుడు చే గువేరా రాసిన ఉత్తరంలో ఒక భాగం (క్యూబాను వదిలి లాటిన్ అమెరికా దేశాల్లో విప్లవ మార్గాన్ని వేసేందుకు బొలివియా వెళ్లిపోతున్న సందర్భంగా చే గువేరా రాసిన ఉత్తరంలో ఓ భాగం) -
అస్తమించిన ‘అరుణతార’
సందర్భం ఒక శకం ముగిసింది. క్యూబా విప్లవ నిర్మాత, సోషలిస్టు విప్లవ దిగ్గజ నేతలలో చివరి శిఖరం ఫిడెల్ క్యాస్ట్రో కన్ను మూశారు. లాటిన్ అమెరికా దేశాలకే కాదు.. వెనుకబడిన దేశాల నేత లకు, ప్రజలకు స్ఫూర్తి కలిగించిన మహా మేరువు అస్తమించింది. అమెరికా వంటి ప్రపంచాధిపత్య శక్తితో ఢీ అంటే ఢీ అని తలపడి చివరి క్షణం వరకు ధిక్కరించిన ధీశాలి ఫిడెల్. అందుకే... ఐక్యరాజ్యసమితి సమావేశాల సందర్భంగా తొలి సారి పిడెల్ క్యాస్ట్రోను కలిసిన నాటి భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ.. ‘ప్రపంచంలోనే అత్యంత ధైర్యసాహసాలను ప్రదర్శించారు గనుకే మిమ్మల్ని కలవాలనుకున్నాను’ అని ప్రశంసిం చారు. ‘అమెరికాకు క్యూబా 90 కిలోమీటర్ల దూరంలోనే ఉందన్న విషయం మర్చిపోవద్ద’ని అమెరికా అధ్యక్షుడు జాన్. ఎఫ్. కెన్నడీ హెచ్చ రికను తిప్పికొడుతూ ‘క్యూబాకు అమెరికా కూడా 90 కిలోమీటర్ల దూరంలోనే ఉందన్న వాస్తవాన్ని మర్చిపోవద్ద’ని ఫిడెల్ ప్రతి హెచ్చరిక చేసిన ప్పుడు యావత్ ప్రపంచం దిగ్భ్రాంతి చెందింది. ప్రపంచంలోనే అత్యంత ఆరోగ్యకరమైన దేశంగా క్యూబాను నిలిపిన దృఢ వ్యక్తిత్వం ఫిడె ల్ది. విద్యలో నూటికి నూరు శాతం అక్షరాస్యత గలిగిన అతి కొద్ది దేశాల్లో క్యూబా ఒకటి. కానీ ఆరోగ్యరంగంలో ఏ దేశం కూడా తన దరిదాపు ల్లోకి కూడా రానంత శిఖరస్థాయి ప్రమాణాలను నెలకొల్పిన ఘనత ఫిడెల్ సొంతం. గుంటూరు జిల్లా అంత విస్తీర్ణం లేని క్యూబా నేడు లాటిన్ అమెరికన్ దేశాలన్నింటికీ 17 వేల మంది వైద్యు లను అందించడం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. అమెరికా నిత్య దిగ్బంధంలోనూ తనను ఆదుకున్న సోవియట్ యూనియన్ కుప్పగూలి పోయి, క్యూబాకు ఆయువులాంటి ఆయిల్ సర ఫరా నిలిచిపోయినప్పుడు క్యాస్ట్రో ఒకటే పిలుపు నిచ్చారు. ‘చమురు లేకపోతే మనం బతకొద్దా.. మళ్లీ వెనక్కు వెళ్లి గుర్రాల మీద ప్రయాణం చేద్దాం. గుర్రాలతో సేద్యం చేద్దాం’ అంటూ జాతి మొత్తానికి దిశానిర్దేశం చేసిన వాడు ఫిడెల్. సోష లిజం కోసం ఇంత హింసాకాండకు పాల్పడాలా? అని క్యూబన్ నేతలను ప్రశ్నిస్తే విప్లవం గెలిచిన గత అయిదేళ్లలో 50 లక్షల మంది పిల్లలను కాపా డుకోగలిగాం. ఇందుకోసం ఎలాంటి హింసకూ మేం పాల్పడలేదు అంటూ ఫిడెల్ జవాబిచ్చారు. గతంలో నేను క్యూబా సందర్శించాను. దేశంలో ఏ ప్రాంతంలో కూడా క్యాస్ట్రో ఫొటో కానీ, విగ్రహం కాని లేదు. క్యూబన్ కమ్యూనిస్టు పార్టీ నేతలను ఈ విషయమై ప్రశ్నించాను. మను షులు తప్పులు చేస్తారు. చనిపోరుున వ్యక్తులను మాత్రమే అమరవీరులుగా మేం ఆరాధిస్తాం అని సమాధానమిచ్చారు. అలాగే క్యూబాలో 10 లేదా 12 ఏళ్ల వయసు పిల్లలను ‘మీకు సామ్రాజ్య వాది కనబడితే ఏం చేస్తారు?’ అని అడిగాను. ‘షూట్ హిమ్ డౌన్’ అని సమాధానమిచ్చారు వారు. క్యూబాకు సామ్రాజ్యవాదులు ఏం చేశారన్న ప్రశ్నకు తిరుగులేని జవాబది. మా పురోగమనంలో సోవియట్ యూని యన్ సాయం నిర్ణయాత్మకం అని పదే పదే ప్రక టించి కృతజ్ఞత తెలిపిన క్యూబా నాయకత్వం అదే సోవియట్ నాయకత్వం తప్పుధోరణుల్లోకి వెళ్లినప్పుడు తీవ్రంగా ఖండించింది. ప్రజలకు ప్రోత్సాహకాలు, బోనస్‌లు ఇచ్చి పనిచేయిం చడం సోషలిజమేనా? అని ఫిడెల్ ప్రశ్నించారు. ప్రపంచ మానవాళిపై ఇంత ప్రభావం కలి గించిన జననేత ఇటీవలి చరిత్రలో కనిపించరు. క్యూబన్లకు, లాటిన్ అమెరికన్ దేశాల ప్రజలకు, యావత్ ప్రపంచ ప్రజానీకానికి కూడా పోరాట స్ఫూర్తిని కలిగించిన విప్లవ నేత ఫిడెల్ క్యాస్ట్రో నేడు భౌతికంగా కనుమరుగయ్యారు. ఆశయాల పరంగా ఆయన పీడిత ప్రజల్లో చిరస్మరణీయుడై నిలిచి ఉంటారు. డాక్టర్ ఏపీ విఠల్ వ్యాసకర్త మార్క్సిస్టు విమర్శకులు మొబైల్ : 98480 69720 -
భారత్‌కు మంచి మిత్రుడు
- క్యాస్ట్రో మృతికి ప్రణబ్, మోదీ సంతాపం - నివాళులు అర్పించిన ప్రపంచ దేశాల నేతలు న్యూఢిల్లీ: క్యూబా మాజీ అధ్యక్షుడు ఫిడెల్ క్యాస్ట్రో మృతికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీలు సంతాపం తెలిపారు. ‘క్యూబా ప్రభుత్వానికి, ప్రజలకు ప్రగాఢ సానుభూతి. క్యాస్ట్రో భారత్‌కు మంచి మిత్రుడు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. 20వ శతాబ్దపు గొప్ప నేతల్లో క్యాస్ట్రో ఒకరు’ అని మోదీ ట్వీట్ చేశారు. ‘విప్లవ వీరుడు, భారత మిత్రుడైన ఫిడెల్ క్యాస్ట్రో మృతికి మస్ఫూర్తిగా సంతాపం తెలుపుతున్నాను’ అని ప్రణబ్ ట్వీట్ చేశారు. క్యాస్ట్రో మృతి క్యూబాకో, ప్రత్యేకించి ఓ సిద్ధాంతానికో మాత్రమే లోటు కాదని కాంగ్రెస్ చీఫ్ సోనియా అన్నారు. ఈ యుగానికి చిహ్నం క్యాస్ట్రో: పుతిన్ మాస్కో/హవానా: ఫిడెల్ క్యాస్ట్రో ఈ యుగానికి చిహ్నమని రష్యా అధ్యక్షుడు పుతిన్ కొనియాడారు. ‘క్యాస్ట్రో రష్యాకు నిజమైన, విశ్వాసపాత్రమైన మిత్రుడు. ఆధునిక చరిత్రలో ఈ యుగానికి చిహ్నంగా ఆయనే సరైన వారు’ అని క్యూబా అధ్యక్షుడు రౌల్ క్యాస్ట్రోక్రు పంపిన సంతాప సందేశంలో పేర్కొన్నారు. చరిత్రపై తనదైన ముద్ర వేసిన గొప్ప రాజకీయవేత్తగా ఆయన పేరు నిలిచిపోతుందని మాజీ సోవియట్ నేత గోర్బచేవ్ పేర్కొన్నారు. మెక్సికో, వెనిజులా, కెనడా తదితర దేశాల నేతలు కూడా క్యాస్ట్రో మృతికి నివాళి అర్పించారు. దేశ కమ్యూనిస్టు ఉద్యమాలకు స్నేహితుడు భారత కమ్యూనిస్టు పార్టీలు క్యాస్ట్రో మృతికి ఘన నివాళులు అర్పించారుు. భారత్‌కు, దేశంలో కమ్యూనిస్టు ఉద్యమానికి క్యాస్ట్రో గొప్ప స్నేహితుడని పేర్కొన్నారుు.‘మూడో ప్రపంచ దేశాలకు ఫిడెల్ విప్లవ చిహ్నంగా నిలిచాడు. యువతరాలకు స్ఫూర్తినిచ్చాడు’ అని సీపీఎం పొలిట్ బ్యూరో పేర్కొంది. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మాట్లాడుతూ క్యాస్ట్రో గొప్ప స్ఫూర్తి ప్రదాత అనీ, వెనుకబడి ఉన్న క్యూబాను నేటి స్థితికి తీసుకొచ్చిన ఘనుడని అన్నారు. ‘ఆయన మరణం క్యూబాకే కాదు. మొత్తం విప్లవ ప్రపంచానికి తీరని లోటు’ అని సీపీఐ పేర్కొంది. బాలీవుడ్ ప్రముఖులు హన్సల్ మెహతా, మధుర్ భండార్కర్ కూడా సంతాపం తెలిపారు. క్యాస్టో మృతికి చంద్రబాబు సంతాపం సాక్షి, అమరావతి: ఫిడెల్ క్యాో్ట్ర మృతిపట్ల ఏపీ సీఎం చంద్రబాబు సంతాపం ప్రకటించారు. సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాల్లో క్యాస్ట్రో ఒక యోధునిగా నిలిచారని శ్లాఘించారు. సంపూర్ణ విప్లవ మూర్తి: నారాయణ సాక్షి, హైదరాబాద్: ఫిడెల్ సంపూర్ణ విప్లవమూర్తి, విప్లవోద్యమాల సారథి అని, లెనిన్ తర్వాత ప్రపంచంలోనే అత్యంత ఉన్నతమైన విప్లవకారు డు అని సీపీఐ జాతీయ నేత కొనియాడారు. మ గ్దూం భవన్లో జరిగిన సంతాపసభలో క్యాస్ట్రో చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమం లో సీపీఐ తెలంగాణ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఫిడెల్ మరణం మానవాళికి తీరని లోటని ఆయన అన్నారు. ఫెడల్ మృతి ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమానికే తీరని లోటని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు రాఘవులు అన్నారు. సామ్రాజ్య వాదానికి వ్యతిరేకంగా పోరాడిన ఆయన ఆశయ బలం ఎంతో గొప్పదన్నారు. ధీ శాలి ఫిడెల్ క్యాస్ట్రో: వైఎస్ జగన్ సాక్షి, హైదరాబాద్: అద్భుత పోరాటస్ఫూర్తి, మొక్కవోని నిబద్ధతతో క్యూబాను నడిపించిన మహానేత ఫిడెల్ క్యాస్ట్రో అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. క్యాస్ట్రో అమరుడంటూ ఘన నివాళి అర్పించారు. ‘అగ్రరాజ్యమైన అమెరికాకు అతి సమీపంగా ఉన్నా, దానికి కించిత్ తల వంచని ధీశాలి క్యాస్ట్రో. చిన్న దేశమే అరుునప్పటికీ ఎవ్వరికీ తలవంచకుండా క్యూబా ప్రపంచంలో నిలబడిన తీరు అమోఘం.. ఆయన 50 ఏళ్ల పాలనలో క్యూబా ఎన్నో విజయాలు సాధించింది’ అని ఓ ప్రకటనలో కొనియాడారు. సొంత ప్రజలను పీడించిన నియంత క్యాస్ట్రో: ట్రంప్ న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల విజేత ట్రంప్.. ఫిడెల్ క్యాస్ట్రో మృతిపై భిన్నంగా స్పందించారు. ‘ఫిడెల్ క్యాస్ట్రో చనిపోయాడు!’ అని ట్వీట్ చేశారు. దీంతో ట్విటర్ ఖాతాదారుల నుంచి విమర్శలు వచ్చారుు. ‘క్యాస్ట్రో చనిపోతే నువ్వు చెప్పాల్సింది ఇదేనా’ అని కొందరు మండిపడ్డారు. తర్వాత ట్రంప్ ప్రకటన విడుదల చేశారు. క్యాస్ట్రోన్రు దుర్మార్గుడైన నియంత అని అందులో అభివర్ణించారు. 60 ఏళ్లు తన సొంత ప్రజలనే పీడించిన నియంత క్యాస్ట్రో అని ట్రంప్ విమర్శించారు. కాగా, ప్రజలు, ప్రపంచంపై క్యాస్ట్రో ప్రభావం ఏపాటిదో చరిత్రే తీర్పునిస్తుందని అమెరికా అధ్యక్షుడు ఒబామా అన్నారు. -
సిగార్‌లో బాంబు పెట్టి..
ఐక్యరాజ్యసమితి సమావేశాల కోసం అమెరికాకు వచ్చిన క్యాస్ట్రో పేలుడు పదార్థాలు నింపిన సిగార్‌ను తాగేలా చేయాలనేది సీఐఏ ప్లాన్. న్యూయార్క్ పోలీస్ చీఫ్‌ను ఈ మేరకు పురమారుుంచింది. అరుుతే ఇది కూడా కార్యరూపం దాల్చలేదు. అంతకుముందు మరో కుట్ర చేసింది. బోటులిన్ అనే విషపూరిత రసాయం సిగార్లోకి ఇంజెక్ట్ చేసి.. అవి క్యూబా అధ్యక్షుడికి అందేలా చూడటానికి క్యాస్ట్రో సహాయక బృందంలోనే ఒకరిని కోవర్టుగా మార్చింది. సిగార్లలోకి విషపూరిత రసాయనాన్ని ఇంజెక్ట్ అరుుతే చేయగలిగారు. అరుుతే ప్లాన్ అమల్లోకి రాకముందే కోవర్టుగా మారిన వ్యక్తిని క్యాస్ట్రో బృందం నుంచి తొలగించారు. మిల్క్‌షేక్‌లో విషం కలిపి.. ఫిడేల్ క్యాస్ట్రోపై సీఐఏ జరిపిన హత్యాయత్నాల్లో అత్యంత దగ్గరగా వచ్చి విఫలమైంది ఇదే. క్యాస్ట్రోకు మిల్క్షేక్లంటే ఇష్టం. వాటిలో విషపు గుళికలు వేసి తుదముట్టించాలన్నది కుట్ర. 1963లో హవానాలో ఆయన బస చేసిన లిబ్రే హోటల్లోకి ఈ విషపు గుళికలను చేర్చారు. ఫ్రిజ్‌లో పెట్టి ఉంచారు. మిల్క్‌షేక్‌లో కలపడానికి సిద్ధమైన వెరుుటర్ ఫ్రిజ్ నుంచి వాటిని తీయడానికి ప్రయత్నించగా... గడ్డ కట్టి ఫ్రిజ్ లోపలి భాగానికి అతుక్కుపోరుు కనిపించారుు. గట్టిగా తీయడానికి ప్రయత్నించగా పగిలిపోయారుు. అలా ఆ ప్రయత్నం విఫలమైంది. వెంట్రుకలు ఊడేలా... ఐక్యరాజ్యసమితి సమావేశం కోసం న్యూయార్క్‌కు వచ్చిన క్యాస్ట్రో బూట్లలో థాలియం సాల్ట్‌ను వేయాలనేది ప్లాన్. దాని ప్రభావానికి లోనైతే... ఒక్కసారిగా మనిషి శరీరంపైనున్న వెంట్రుకలన్నీ రాలిపోతారుు. గడ్డంతో గంభీరంగా కనిపించే క్యాస్ట్రో అసలు కేశాలు లేకుండా... నిస్సహాయుడిలా కనిపించేలా చేసి క్యూబాలో అతని ప్రతిష్టను దెబ్బతీయాలని, తిరుగుబాటు ప్రోత్సహించాలని అమెరికా కుట్ర పన్నింది. కానీ ఎప్పట్లాగే ఇదీ విఫలమైంది. బాల్‌పారుుంట్ పెన్‌తో గుచ్చి... 1963లో క్యాస్ట్రో పారిస్‌కు వెళ్లారు. అక్కడ అండర్‌కవర్ ఏజెంట్‌గా ఉన్న సీఐఏ వ్యక్తి క్యాస్ట్రో సమీపానికి వెళ్లి బాల్‌పారుుంట్ పెన్ను పోలిన సూది(నీడిల్)తో ఆయను గుచ్చాలనేది ప్లాన్. అసలు ఏదో గుచ్చుకుందనే విషయమే తెలియకుండా ఈ విషప్రయోగం జరిగిపోతుంది. ఈ కుట్ర బయటపడడంతో సీఐఏ ఏజెంట్ రొనాల్డో క్యూబెలా జైలు పాలయ్యాడు. బాస్కెట్ బాల్ ఆడుతూ... -
క్యాస్ట్రో ఈజ్ డెడ్!: ట్రంప్
క్యూబా మాజీ అధ్యక్షుడు, విప్లవ యోధుడు ఫిడెల్ క్యాస్ట్రో మరణంపై అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన డోనాల్డ్ ట్రంప్ దారుణంగా స్పందించారు. 'క్యాస్ట్రో ఈజ్ డెడ్' అంటూ ట్వీట్ చేశారు. కాగా, ఓ అధ్యక్షుడిగా క్యాస్ట్రో కఠోరంగా శ్రమించారని, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అన్నారు. క్యూబా చరిత్రలో కొత్త అధ్యాయానికి క్యాస్ట్రో తెరలేపారని కొనియాడారు. క్యూబా పైనా, ప్రపంచం పైనా క్యాస్ట్రో ప్రభావాన్ని చరిత్రే నిర్ణయిస్తుందని వ్యాఖ్యానించారు. మరో వైపు అమెరికా కఠిన నిర్భందాలను ఎదుర్కొని బలీయమైన దేశంగా క్యూబాను క్యాస్ట్రో చేశాడని గత సోవియట్ అధ్యక్షుడు గోర్భచెవ్ అన్నారు. ఆధునిక ప్రపంచ చరిత్రలో ఓ శకానికి క్యాస్ట్రో చిహ్నం అని రష్యా అధ్యక్షుడు వ్లాధిమిర్ పుతిన్ పేర్కొన్నారు. Fidel Castro is dead! — Donald J. Trump (@realDonaldTrump) November 26, 2016 -
638 సార్లు చంపాలనుకున్నారు..
హవానా: అమెరికా తనకు ఆగర్భ శత్రువైన క్యూబా మాజీ అధ్యక్షుడు, వీర విప్లవ యోధుడు ఫిడెల్ క్యాస్ట్రోను చంపేందుకు చేయని ప్రయత్నం లేదు. 600 సార్లుకుపైగా ప్రయత్నించి విఫలమైనట్లు చరిత్ర తెలియజేస్తోంది. జేమ్స్‌బాండ్ సినిమాల్లోలాగా సిగార్లలో విషం నింపడం ద్వారా, పెన్ను సిరాలోకి విషం ఎక్కించడం ద్వారా, అందమైన అమ్మాయిలతోని, మాజీ భార్యతోని విషపు గుళికలను తినిపించడం ద్వారా, సముద్ర నత్త గుళ్లల్లో శక్తివంతమైన చిన్న బాంబులను అమర్చడం ద్వారా, ప్రత్యేకమైన మాఫియా పద్ధతుల్లో క్యాస్ట్రోను చంపేందుకు అమెరికా సీఐఏ ప్రయత్నించింది. అమెరికా మాజీ అధ్యక్షుడు జేఎఫ్ కెన్నడీ అయితే క్యాస్ట్రోను హతమార్చేందుకు ‘ఆపరేషన్ మంగూస్’ పేరిట పెద్ద వ్యూహమే రచించారు. అన్నీ హత్యా ప్రయత్నాల నుంచి జేమ్స్బాండ్కన్నా చాకచక్యంగా తప్పించుకున్న క్యాస్ట్రో ఓ సందర్భంలో తనపై జరిగిన హత్యా ప్రయత్నాల గురించి ప్రస్తావిస్తూ ఇలాంటి ప్రయత్నాల నుంచి తప్పించుకున్నవారి మధ్య ఒలింపిక్స్ పోటీ పెట్టినట్లయితే కచ్చితంగా తనకు బంగారు పతకం వచ్చేదని వ్యాఖ్యానించారు. తనపై అమెరికా నీడ కూడా పడకుండా చివరి వరకు కమ్యూనిస్టు యోధుడుగా పోరాడిన కాస్ట్రో సహజసిద్ధంగా తన 90వ ఏట కన్నుమూశారు. క్యాస్ట్రోను చంపేందుకు 638 సార్లు అమెరికా సీఐఏ కుట్ర పన్నిందని ఆయన వెన్నంటే ఉండి అనేకసార్లు ఆయన్ని ఈ హత్యాప్రయత్నాల నుంచి రక్షించిన రిటైర్డ్ క్యూబా ఇంటెలిజెన్స్ అధికారి ఫాబియన్ ఎస్కలాంటే తెలిపారు. క్యాస్ట్రో మాజీ భార్య మారిటా లారెంజ్ ద్వారా విషపు గుళికలు ఇచ్చి చంపేందుకు సీఐఏ ప్రయత్నించడం అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా దుమారం రేపింది. తాను గర్భవతి అయ్యేవరకు క్యాస్ట్రోతో కలసివున్న లారెంజ్ ఓ రోజు హఠాత్తుగా జబ్బున పడ్డారు. వైద్యం కోసం అమెరికా వెళ్లారు. అక్కడ ఆమెను కలసుకున్న సీఐఏ అధికారులు, లారెంజ్‌కు ఆలస్యంగా ఆబార్షన్ చేయించి ప్రాణం మీదకు తీసుకురావాలని క్యాస్ట్రో కుట్రపన్నినట్లు ఆమెను నమ్మించారు. ప్రతిగా అమెరికా ప్రజల కోసం క్యాస్ట్రోను భోజనంలో విషపు మాత్రలు కలిపి చంపేయాలని సూచించారు. ప్రమాదకరమైన విషపు గుళికను కూడా ఇచ్చి పంపారు. కస్టమ్స్ అధికారుల కళ్లుకప్పి కూడా ఆమెను క్యూబాకు పంపించారు. అమెరికాలలో లారెంజ్ను సీఐఏ అధికారులు కలుసుకున్న విషయాన్ని తన వేగుల ద్వారా తెలసుకున్న క్యాస్ట్రో అతి జాగ్రత్తగా లారెంజ్ ప్రవర్తనను గమనిస్తూ వచ్చారు. అమె తన కోల్డ్ క్రీమ డబ్బాలో దాచిన విషపు మాత్రను క్యాస్ట్రో ఓ రోజు కనుక్కున్నారు. అప్పుడు ఆమె దగ్గరకు వెళ్లి తన పిస్టల్ తీసి అమెకిచ్చి తనను చంపాలనుకుంటే నేరుగానే చంపాలని ఆమెకిచ్చారట. కళ్లు మూసుకొని సిగరెట్ పొగ వదులుతూ నుదిటిపై గురిచూసి కాల్చమని చెప్పారట. దానికి లారెంజ్ వనికిపోతూ పిస్టల్ నుంచి తుపాకీ గుళ్లను తీసేసి, పొరపాటుపడ్డాను, క్షమించడంటూ క్యాస్ట్రో కౌగిట్లో వాలిపోయారట. ఆ తర్వాత ఆమె ఈ విషయాన్ని ప్రజల ముందు బహిర్గతం చేసింది. కారు యాక్సిడెంట్ల ద్వారా, క్యాస్ట్రో తరచుగా వెళ్లే బేస్‌బాల్ స్టేడియంలలో గ్రెనేడ్ల ద్వారా చంపేందుకు ఎన్నోసార్లు ప్రయత్నించారని ఎస్కలాంటే మీడియాకు అనేక సందర్భాల్లో వెల్లడించారు. 1990లో ఐక్యరాజ్యసమితి సమావేశంలో క్యాస్ట్రో మాట్లాడేందుకు వచ్చినప్పుడు ఆయన బూట్లపై రసాయనిక పౌడర్ సిఐఏ చల్లిందట. బూట్లు ఇప్పుకోవడం, కట్టుకోవడం వల్ల ఆ పౌడర్ రియాక్షన్ ద్వారా ఆయన గడ్డం ఊడిపోవాలన్నది కుట్రట. ఎల్ఎస్డీ నింపిన సిగరెట్లు అందించడం ద్వారా కూడా చంపాలనుకున్నట్లు ‘ఏ 638 ప్లాట్స్ అగెనెస్ట్ క్యాస్ట్రో’ అనే పుస్తకంలో ఎస్కలాంటే వివరించారు. ఆయన ఆ పుస్తకంలో కుట్రలకు డాక్యుమెంట్ ఆధారాలు కూడా చూపించారు. -
ఫిడెల్ క్యాస్ట్రో కన్నుమూత
-
చరిత్రలో నిలిచిపోయిన 'ఆత్మీయ ఆలింగనం'
-
డిసెంబర్ 4న క్యాస్ట్రో అంత్యక్రియలు
విప్లవ యోధుడు ఫెడల్ క్యాస్ట్రో అంత్యక్రియలు డిసెంబర్ 4న నిర్వహించనున్నట్లు క్యూబా ప్రభుత్వం వెల్లడించింది. అలాగే.. ఇవాళ్టి నుంచి తొమ్మిది రోజుల పాటు సంతాపదినాలుగా ప్రకటిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. క్యూబాలోని చారిత్రాత్మక నగరం శాంటియాగోలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం అధికారిక ప్రకటనను విడుదల చేసింది. సంతాప దినాలుగా నిర్వహిస్తున్న తొమ్మిది రోజుల పాటు దేశంలో అన్ని కార్యకలాపాలు, ప్రదర్శనలు నిలిపివేస్తున్నట్లు ప్రకటనలో తెలిపారు. అలాగే సంతాప సూచకంగా ప్రభుత్వ కార్యాలయాలు, సైనిక స్థావరాల్లో జాతీయ జెండా సగం ఎత్తులో ఎగురుతుందని తెలిపారు. -
విప్లవ నేతకు జనసేన సెల్యూట్
హైదరాబాద్: క్యూబా విప్లవయోధుడు, కమ్యూనిస్టు నాయకుడు ఫిడెల్ క్యాస్ట్రో మృతిపై జనసేన అధినేత, నటుడు పవన్ కళ్యాణ్ ట్విట్టర్లో స్పందించారు. మహా నేత ఫెడల్ క్యాస్ట్రో నేడు ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్లారు. ప్రజల్లో స్పూర్తిని నింపిన నాయకుడికి జనసేన సెల్యూట్ చేస్తోందని పేర్కొన్నారు. తాము అమితంగా ఆరాధించే చెగువేరాతో కలిసి పోరాడిన ఫెడల్ క్యాస్ట్రోను ఎప్పటికీ గుర్తుంచుకుంటామని తెలిపారు. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నాము. ఫిడెల్ క్యాస్ట్రో ప్రవేశ పెట్టిన అనేక కార్యక్రమాల్లో ముఖ్యంగా క్యూబన్ల ప్రజారోగ్యం కోసం ఎంతగానో కృషి చేశారని పవన్ కొనియాడారు. The Great Leader ' Fidel Castro' has departed from this world today.'JanaSena' salutes the inspiring leader. — Pawan Kalyan (@PawanKalyan) November 26, 2016 Amongst his many initiatives he has also ensured that Cuba will be lauded for its exemplary health care system. — Pawan Kalyan (@PawanKalyan) November 26, 2016 We remember him for his Great journey with 'Che Guevara' whom I adore and respect. May his Soul rest in Peace.. — Pawan Kalyan (@PawanKalyan) November 26, 2016