క్యాస్ట్రో ఈజ్ డెడ్!: ట్రంప్
క్యూబా మాజీ అధ్యక్షుడు, విప్లవ యోధుడు ఫిడెల్ క్యాస్ట్రో మరణంపై అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన డోనాల్డ్ ట్రంప్ దారుణంగా స్పందించారు. 'క్యాస్ట్రో ఈజ్ డెడ్' అంటూ ట్వీట్ చేశారు. కాగా, ఓ అధ్యక్షుడిగా క్యాస్ట్రో కఠోరంగా శ్రమించారని, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అన్నారు. క్యూబా చరిత్రలో కొత్త అధ్యాయానికి క్యాస్ట్రో తెరలేపారని కొనియాడారు. క్యూబా పైనా, ప్రపంచం పైనా క్యాస్ట్రో ప్రభావాన్ని చరిత్రే నిర్ణయిస్తుందని వ్యాఖ్యానించారు.
మరో వైపు అమెరికా కఠిన నిర్భందాలను ఎదుర్కొని బలీయమైన దేశంగా క్యూబాను క్యాస్ట్రో చేశాడని గత సోవియట్ అధ్యక్షుడు గోర్భచెవ్ అన్నారు. ఆధునిక ప్రపంచ చరిత్రలో ఓ శకానికి క్యాస్ట్రో చిహ్నం అని రష్యా అధ్యక్షుడు వ్లాధిమిర్ పుతిన్ పేర్కొన్నారు.
Fidel Castro is dead!
— Donald J. Trump (@realDonaldTrump) November 26, 2016