వాషింగ్టన్ : ప్రపంచమంతా కరోనా వైరస్ ధాటికి భయాందోళనకు గురవుతుంటే అగ్రరాజ్యం అమెరికాలో మాత్రం రాజకీయ వేడి సెగలు పుట్టిస్తోంది. ప్రపంచ దేశాలపై ఆధిపత్యం చలాయించే అమెరికా తదుపరి అధ్యక్షుడు ఎవర్న అంశం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఇరు పార్టీల అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలోనే అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అమెరికాకు తదుపరి ప్రెసిడెండ్ డెమోక్రాటిక్ అభ్యర్థి జో బిడెన్ అంటూ జోస్యం చెప్పారు. బిడెన్ విధానాలకు తాము సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారం సోషల్ మీడియా వేదికగా ఒబామా చేసిన ట్వీట్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. (అంతకంటే పీడకల మరొకటి ఉండదు: ట్రంప్)
మరోవైపు రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాలనపై ఒబామా ఇదివరకే విమర్శల దాడి ప్రారంభించిన విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో ట్రంప్‌ను తిరిగి ఎన్నుకుంటే అమెరికన్ ప్రజాస్వామ్యం మనుగడ సాగించలేదని ఇదివరకు ఘాటు వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. ఈ ఏడాది నవంబర్ లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల కోసం డెమోక్రాట్ పార్టీ తరపున జో బిడెన్ నామినేట్ అయిన విషయం తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో భాగంగా డెమొక్రాట్ పార్టీ నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ఒబామా పాల్గొంటూ ట్రంప్‌కు వ్యతిరేకంగా బిడెన్‌కు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్-ఒబామా మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది.
Comments
Please login to add a commentAdd a comment