భారత్‌కు మంచి మిత్రుడు | India's best friend | Sakshi
Sakshi News home page

భారత్‌కు మంచి మిత్రుడు

Published Sun, Nov 27 2016 1:07 AM | Last Updated on Mon, Sep 4 2017 9:12 PM

భారత్‌కు మంచి మిత్రుడు

భారత్‌కు మంచి మిత్రుడు

- క్యాస్ట్రో మృతికి ప్రణబ్, మోదీ సంతాపం   
- నివాళులు అర్పించిన ప్రపంచ దేశాల నేతలు
 
 న్యూఢిల్లీ: క్యూబా మాజీ అధ్యక్షుడు ఫిడెల్ క్యాస్ట్రో మృతికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీలు సంతాపం తెలిపారు. ‘క్యూబా ప్రభుత్వానికి, ప్రజలకు ప్రగాఢ సానుభూతి. క్యాస్ట్రో భారత్‌కు మంచి మిత్రుడు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. 20వ శతాబ్దపు గొప్ప నేతల్లో క్యాస్ట్రో ఒకరు’ అని మోదీ ట్వీట్ చేశారు. ‘విప్లవ వీరుడు, భారత మిత్రుడైన ఫిడెల్ క్యాస్ట్రో మృతికి మస్ఫూర్తిగా సంతాపం తెలుపుతున్నాను’ అని ప్రణబ్ ట్వీట్ చేశారు. క్యాస్ట్రో మృతి క్యూబాకో, ప్రత్యేకించి ఓ సిద్ధాంతానికో మాత్రమే లోటు కాదని కాంగ్రెస్ చీఫ్ సోనియా అన్నారు.

 ఈ యుగానికి చిహ్నం క్యాస్ట్రో: పుతిన్
 మాస్కో/హవానా: ఫిడెల్ క్యాస్ట్రో ఈ యుగానికి చిహ్నమని రష్యా అధ్యక్షుడు పుతిన్ కొనియాడారు. ‘క్యాస్ట్రో రష్యాకు నిజమైన, విశ్వాసపాత్రమైన మిత్రుడు. ఆధునిక చరిత్రలో ఈ యుగానికి చిహ్నంగా ఆయనే సరైన వారు’ అని క్యూబా అధ్యక్షుడు రౌల్ క్యాస్ట్రోక్రు పంపిన  సంతాప సందేశంలో పేర్కొన్నారు.  చరిత్రపై తనదైన ముద్ర వేసిన గొప్ప రాజకీయవేత్తగా ఆయన పేరు నిలిచిపోతుందని మాజీ సోవియట్ నేత  గోర్బచేవ్ పేర్కొన్నారు. మెక్సికో, వెనిజులా, కెనడా తదితర దేశాల నేతలు కూడా క్యాస్ట్రో మృతికి నివాళి అర్పించారు.  

 దేశ కమ్యూనిస్టు ఉద్యమాలకు స్నేహితుడు
 భారత కమ్యూనిస్టు పార్టీలు క్యాస్ట్రో మృతికి ఘన నివాళులు అర్పించారుు. భారత్‌కు, దేశంలో కమ్యూనిస్టు ఉద్యమానికి క్యాస్ట్రో గొప్ప స్నేహితుడని పేర్కొన్నారుు.‘మూడో ప్రపంచ దేశాలకు ఫిడెల్ విప్లవ చిహ్నంగా నిలిచాడు. యువతరాలకు స్ఫూర్తినిచ్చాడు’ అని సీపీఎం పొలిట్ బ్యూరో పేర్కొంది. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మాట్లాడుతూ క్యాస్ట్రో గొప్ప స్ఫూర్తి ప్రదాత అనీ, వెనుకబడి ఉన్న క్యూబాను నేటి స్థితికి తీసుకొచ్చిన ఘనుడని అన్నారు.  ‘ఆయన మరణం క్యూబాకే కాదు. మొత్తం విప్లవ ప్రపంచానికి తీరని లోటు’ అని సీపీఐ పేర్కొంది.  బాలీవుడ్ ప్రముఖులు హన్సల్ మెహతా, మధుర్ భండార్కర్ కూడా సంతాపం తెలిపారు.

 క్యాస్టో మృతికి చంద్రబాబు సంతాపం   
 సాక్షి, అమరావతి: ఫిడెల్ క్యాో్ట్ర మృతిపట్ల ఏపీ  సీఎం  చంద్రబాబు సంతాపం ప్రకటించారు. సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాల్లో క్యాస్ట్రో ఒక యోధునిగా నిలిచారని శ్లాఘించారు.   

 సంపూర్ణ విప్లవ మూర్తి: నారాయణ   
 సాక్షి, హైదరాబాద్: ఫిడెల్ సంపూర్ణ విప్లవమూర్తి, విప్లవోద్యమాల సారథి అని, లెనిన్ తర్వాత ప్రపంచంలోనే అత్యంత ఉన్నతమైన విప్లవకారు డు అని సీపీఐ జాతీయ నేత  కొనియాడారు. మ గ్దూం భవన్‌లో జరిగిన సంతాపసభలో క్యాస్ట్రో చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమం లో సీపీఐ తెలంగాణ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఫిడెల్ మరణం మానవాళికి తీరని లోటని ఆయన అన్నారు. ఫెడల్ మృతి ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమానికే తీరని లోటని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు రాఘవులు అన్నారు. సామ్రాజ్య వాదానికి వ్యతిరేకంగా పోరాడిన ఆయన ఆశయ బలం ఎంతో గొప్పదన్నారు.
 
 ధీశాలి ఫిడెల్ క్యాస్ట్రో: వైఎస్ జగన్  
 సాక్షి, హైదరాబాద్: అద్భుత పోరాటస్ఫూర్తి, మొక్కవోని నిబద్ధతతో క్యూబాను నడిపించిన మహానేత ఫిడెల్ క్యాస్ట్రో అని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి  పేర్కొన్నారు. క్యాస్ట్రో అమరుడంటూ ఘన నివాళి అర్పించారు. ‘అగ్రరాజ్యమైన అమెరికాకు అతి సమీపంగా ఉన్నా, దానికి కించిత్ తల వంచని ధీశాలి క్యాస్ట్రో. చిన్న దేశమే అరుునప్పటికీ ఎవ్వరికీ తలవంచకుండా క్యూబా ప్రపంచంలో నిలబడిన తీరు అమోఘం.. ఆయన 50 ఏళ్ల పాలనలో  క్యూబా ఎన్నో విజయాలు సాధించింది’ అని ఓ ప్రకటనలో కొనియాడారు.
 
 సొంత ప్రజలను పీడించిన నియంత క్యాస్ట్రో: ట్రంప్  
 న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల విజేత ట్రంప్.. ఫిడెల్ క్యాస్ట్రో మృతిపై భిన్నంగా స్పందించారు. ‘ఫిడెల్ క్యాస్ట్రో చనిపోయాడు!’ అని ట్వీట్ చేశారు. దీంతో ట్విటర్ ఖాతాదారుల నుంచి విమర్శలు వచ్చారుు. ‘క్యాస్ట్రో చనిపోతే నువ్వు చెప్పాల్సింది ఇదేనా’ అని కొందరు మండిపడ్డారు. తర్వాత ట్రంప్ ప్రకటన విడుదల చేశారు. క్యాస్ట్రోన్రు దుర్మార్గుడైన నియంత అని అందులో అభివర్ణించారు. 60 ఏళ్లు తన సొంత ప్రజలనే పీడించిన నియంత క్యాస్ట్రో అని ట్రంప్ విమర్శించారు. కాగా,  ప్రజలు, ప్రపంచంపై క్యాస్ట్రో ప్రభావం ఏపాటిదో చరిత్రే తీర్పునిస్తుందని అమెరికా అధ్యక్షుడు ఒబామా అన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement