నా చివరి ఆలోచనలన్నీ ఈ విప్లవ వీరులతోనే..
‘‘క్యూబాకు సంబంధించి అన్ని బాధ్యతల నుంచి విముక్తం అవుతున్నానని మరోసారి చెబుతున్నా... ఇంకో దేశంలో... మరో ఆకాశం నీడన అంతిమఘడియలు సమీపిస్తే... నా చివరి ఆలోచనలన్నీ ఈ దేశ విప్లవ వీరులతోనే ముఖ్యంగా నీ ఆలోచనలతో ముప్పిరిగొంటాయి. నీవు నేర్పిన పాఠాలు.. అందరికీ ఆదర్శంగా నిలిచిన నీ వ్యక్తిత్వాన్ని చివరి వరకూ గుర్తుంచుకుంటా.
అంతే బాధ్యతతో మెలుగుతా. నా జీవితం ఎక్కడ అంతమైనప్పటికీ క్యూబా విప్లవకారుల్లో ఒకడిగానే బాధ్యతగా వ్యవహరిస్తా.. నడుచుకుంటా కూడా. భార్య, పిల్లల కోసం ఏమీ వదిలివెళ్లడం లేదు. ఇందుకు బాధ ఏమీ లేదు సరికదా... ఆనందంగా ఉంది. రాజ్యం (క్యూబన్ ప్రభుత్వం) ఎలాగూ వాళ్ల జీవనానికి, విద్యాబుద్ధులు నేర్పించడానికి తగినంత చేస్తుంది కాబట్టి.. వాళ్లకు అది చేయమని, ఇది చేయమని కూడా నేను కోరదలచుకోలేదు.’’
- ఫిడెల్ క్యాస్ట్రోకు క్యూబా విప్లవ వీరుడు చే గువేరా రాసిన ఉత్తరంలో ఒక భాగం
(క్యూబాను వదిలి లాటిన్ అమెరికా దేశాల్లో విప్లవ మార్గాన్ని వేసేందుకు బొలివియా వెళ్లిపోతున్న సందర్భంగా చే గువేరా రాసిన ఉత్తరంలో ఓ భాగం)