che guevara
-
ప్రపంచ విప్లవ జ్వాల
ప్రజల కోసం సర్వస్వం త్యజించిన విప్లవ నేత చే గువేరా! ఆయన అసలు పేరు ఎర్నెస్టో గెవారా! ఆయన పెట్టుబడిదారీ వ్యవస్థతో పాటు సామ్యవాదంలోని సంప్రదాయ వాదాన్ని కూడా వ్యతిరేకించాడు. అర్జెంటీనాలోని రొసారియా అనే పట్టణంలో 1928 జూన్ 14న ఒక మధ్య తరగతి కుటుంబంలో జన్మించాడు. 1953లో బ్యూనస్ ఎయిర్స్ విశ్వవిద్యాలయం నుండి వైద్య విద్యలో పట్టా పొందాడు. ఆ తదుపరి మోటారు సైకిల్‌పై దక్షిణ అమెరికా ఖండమంతటా పర్యటిస్తున్న సమయంలో ప్రజల జీవన స్థితిగతుల గురించి తెలుసుకున్నాడు. విప్లవమొక్కటే సామాజిక అసమానతలను తొలగించగలదని భావించాడు. 1954లో గౌటెమాలలో ప్రజాబాహుళ్యపు అభ్యున్నతికి కృషి చేస్తున్న సామ్యవాద అనుకూల ప్రభుత్వంతో కలిసి పనిచేశాడు. కానీ అదే సంవత్సరం అమెరికా సాయంతో జరిగిన కుట్ర మూలంగా ఆ ప్రభుత్వం కూలి పోయింది. అక్కడి నుంచి మెక్సికో వెళ్ళిపోయాడు. ఈ ఘటనతో అతని విప్లవ దృక్పథం మరింత బలపడింది. మెక్సికోలో ఫిడెల్ క్యాస్ట్రో నాయకత్వంలో అక్కడికి ప్రవాసం వచ్చిన క్యూబా విప్లవకారులతో చేతులు కలిపాడు. 1950వ దశకం చివరలో అప్పటి క్యూబా నియంత బాటిస్టాకు వ్యతిరేకంగా కాస్ట్రో ఆధ్వర్యంలో జరిగిన గెరిల్లా పోరాటం (1956–1959)లో చే గువేరా ముఖ్య పాత్ర పోషించాడు. డాక్టర్‌గా, మిలిటరీ కమాండర్‌గా అంకిత భావంతో సేవలందించాడు. పోరాటం విజయవంతమైన తరువాత, కాస్ట్రో 1959 జనవరిలో క్యూబా ప్రభు త్వాధికారాన్ని చేపట్టాడు. ఆ ప్రభుత్వంలో చే పరిశ్రమల మంత్రిగా, క్యూబా జాతీయ బ్యాంకు అధ్యక్షునిగా పనిచేశాడు. క్యూబా ప్రతినిధిగా అనేక దేశాలు పర్యటించాడు. ఈ పర్యటనలలో భాగంగానే 1959 జూలై నెలలో భారతదేశంలో కూడా పర్యటించాడు. తన రచనలలో వర్ధమాన దేశాలలో రైతాంగ విప్లవోద్యమాలు నిర్మింపబడాలని కోరుకున్నాడు! పేద దేశాలలో విప్లవాన్ని వ్యాప్తిచేయ తలపెట్టి ఆయన 1965లో క్యూబాలో తన అత్యున్నత స్థానాన్ని, పలుకుబడిని వదలి పెట్టి కాస్ట్రో వారిస్తున్నా వినకుండా దేశం నుండి అదృశ్యమయ్యాడు. కొద్దిమంది అనుచరులతో రహస్యంగా ఆఫ్రికా దేశమైన కాంగోలో కొంతకాలం గడిపాడు. ఆ సమయంలో ఆ దేశం తూర్పు ప్రాంతంలో గెరిల్లా తిరుగుబాటుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. 1966 చివరిలో మళ్ళీ దక్షిణ అమెరికాకు వచ్చాడు! బొలీవియా దేశంలో మిలిటరీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడు తున్న విప్లవకారులకు నాయకత్వం వహించాడు! ఈ సమయంలోనే బొలీవియన్ సైన్యానికి చిక్కాడు! 1967 అక్టోబర్ 9న వల్లెగ్రాండె అనే ప్రాంతంలో ఆ సైన్యం ఆయన్ని చంపివేసింది. అలా ఓ ప్రపంచ విప్లవ జ్వాల ఆరిపోయింది!– ఎమ్డీ మునీర్, సీనియర్ జర్నలిస్ట్(నేడు చే గువేరా వర్ధంతి) -
విప్లవ జ్యోతి
ప్రపంచ ప్రజలను ప్రభావితం చేసిన విప్లవ నాయకుడు చే గువేరా. అర్జెంటీనాకు చెందిన ఈ మార్క్సిస్ట్ విప్లవకారుడు... వైద్యుడు, రచయిత, మేధావి, గెరిల్లా నాయకుడు, సైనిక సిద్ధాంతకర్త, క్యూబన్ విప్లవంలో ముఖ్యుడు. ఆయన అసలు పేరు ఎర్నేస్తో ‘చే’ గువేరా. 1928 జూన్ 14న అర్జెంటీనాలోని రోసారియోలో జన్మించారు. ఆయనకు ఆస్తమా వ్యాధి వుండేది. ఆ వ్యాధితో బాధపడుతూనే విప్లవ పోరాటాలు చేశారు. లాటిన్ అమెరికాలో పర్యటన సమయంలో అక్కడి పేదరికం చూసి చలించిపోయారు. దీనికి కారణం ఆర్థిక తారతమ్యాలు, ఏకస్వామ్య పెట్టుబడిదారీ వ్యవస్థ, నూతన వలసవాదం, సామ్రాజ్యవాదాలేనని భావించారు. సమకాలీన వ్యవస్థపై తిరుగుబాటు చేయడం ద్వారా సమస్యలను పరిష్కరించవచ్చని భావించారు. అందుకే విప్లవం బాట పట్టారు.మెక్సికోలో ఉంటున్న సమయంలో రౌల్, ఫిడెల్ కాస్ట్రోలను కలిశారు. అప్పటి నుంచి వారితో భుజం భుజం కలిపి క్యూబాను బాటిస్టా పాలన నుంచి విముక్తి చేయడానికి పోరాడారు. విప్లవకారుల్లో ముఖ్యమైన వ్యక్తిగా, సైన్యంలో రెండవ స్థానానికి చేరుకుని, నియంతృత్వ బాటిస్టాపై జరిగిన గెరిల్లా పోరాటంలో కీలకపాత్ర పోషించారు. క్యూబా తిరుగుబాటు తర్వాత ఏర్పడిన ప్రభుత్వంలో అనేక ప్రధాన బాధ్యతలను స్వీకరించారు. మంచి వ్యవసాయ సంస్కరణలను ప్రవేశపెట్టారు. జాతీయ బ్యాంకు అధ్యక్షునిగా, క్యూబా సైనికదళాల బోధనా నిర్దేశకునిగా, క్యూబన్ సామ్యవాద దౌత్యవేత్తగా ప్రపంచ వ్యాప్తంగా పర్యటనలు చేశారు.గెరిల్లా యుద్ధ తంత్రంపై ఆధార గ్రంథాన్ని రాశారు. దక్షిణ అమెరికాలో ఆయన జరిపిన యూత్ మోటార్ సైకిల్ యాత్ర జ్ఞాపకాల ఆధారంగా పుస్తకం రాశారు. గువేరా 1965లో క్యూబాను వదలి కాంగో కిన్షాసాలోనూ, బొలీవియాలోనూ యుద్ధాలకు నాయకత్వం వహించారు.బొలీవియా యుద్ధంలో పాల్గొని, 1967 అక్టోబర్ 9న అక్కడి సైనికాధికారులకు పట్టుబడి కాల్చివేతకు గురయ్యారు. అలా తాను పుట్టిన దేశం వదలి ప్రపంచ పీడితుల పక్షాన వివిధ దేశాల్లో పోరాటాలు చేస్తూ అసువులు బాసి ఆధునిక విప్లవం మీద తనదైన ముద్ర వేశారు చే!– ర్యాలి ప్రసాద్, కాకినాడ(నేడు చే గువేరా జయంతి) -
తెలుగులో చేగువేరా బయోపిక్.. రిలీజ్ డేట్ ఫిక్స్
క్యూబా పోరాటయోధుడు చేగువేరా జీవితం ఆధారంగా తెలుగులో తీస్తున్న సినిమా 'చే'. తాజాగా ఈ సినిమా నుంచి క్రేజీ అప్డేట్ వచ్చేసింది. నేచర్ ఆర్ట్స్ బ్యానర్‌పై బీఆర్ సభావత్ నాయక్ టైటిల్ రోల్లో నటిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. 'చే' మూవీ రిలీజ్ డేట్ గురించి ఇప్పుడాయన క్రేజీ న్యూస్ బయటపెట్టాడు. అలానే ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ఫస్ట్ లుక్, టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. (ఇదీ చదవండి: బిగ్‌బాస్ 7: పదో వారం ఆ కంటెస్టెంట్ ఎలిమినేట్!) క్యూబా తరువాత భారతీయ చిత్ర పరిశ్రమలో రూపొందుతున్న చేగువేరా బయోపిక్ ఇది. సూర్య, బాబు, దేవేంద్ర సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీలో లావణ్య సమీరా, పూల సిద్దేశ్వర్, కార్తీక్ నూనె, వినోద్, పసల ఉమా మహేశ్వర్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. రవిశంకర్ సంగీతం అందిస్తున్నారు. పోస్ట్ ప్రోడక్షన్ పూర్తి చేసుకున్న ఈ సినిమా సెన్సార్ త్వరలో కానుంది. డిసెంబర్ తొలివారం ఈ చిత్రాన్ని థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నట్లు హీరో కమ్ డైరెక్టర్ సభావత్ నాయక్ చెప్పుకొచ్చారు. (ఇదీ చదవండి: కంటతడి పెట్టిస్తున్న చంద్రమోహన్ చివరి మాటలు!) -
చేగువేరా పోరాటం
క్యూబా పోరాట యోధుడు చేగువేరా జీవిత చరిత్ర ఆధారంగా రూ΄పొందిన చిత్రం ‘చే’. ‘లాంగ్ లివ్’ అన్నది ఉపశీర్షిక. బీఆర్ సభావత్ నాయక్ టైటిల్ రోల్ పోషించి, దర్శకత్వం వహించారు. నవ ఉదయం సమర్పణలో నేచర్ ఆర్ట్స్‌పై సూర్య, బాబు, దేవేంద్ర నిర్మించారు. నేడు (అక్టోబర్ 9) చేగువేరా వర్ధంతి సందర్భంగా ‘చే’ టీజర్‌ని రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సందర్భంగా బీఆర్ సభావత్ నాయక్ మాట్లాడుతూ– ‘‘క్యూబా తర్వాత ప్రపంచంలో, తొలిసారి భారతీయ చిత్ర పరిశ్రమలో రూపొందుతున్న చేగువేరా బయోపిక్ ‘చే’. విప్లవ వీరుడు, యువతకి స్ఫూర్తి అయిన చేగువేరా జీవిత చరిత్రను సినిమాగా తీయడం చాలా గర్వంగా ఉంది. ఆయన చేసిన పోరాటలు, త్యాగాలు ఈ చిత్రంలో చూస్తారు. ‘చే’ పోస్టర్‌ను చేగువేరా కుమార్తె డా. అలైదా గువేరా విడుదల చేయడం అదృష్టంగా భావిస్తున్నాం. మా సినిమా ఫస్ట్ కాపీ రెడీ అయ్యింది. నవంబర్‌లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: కల్యాణ్ సమి, జగదీష్, సంగీతం: రవిశంకర్. -
చేగువేరా బయోపిక్ నేపథ్యంలో వస్తోన్న 'చే'
క్యూబా పోరాటయోధుడు చేగువేరా జీవిత చరిత్ర ఆధారంగా రూపోందుతున్న చిత్రం "చే". లాంగ్ లైవ్ అనేది ట్యాగ్ లైన్. క్యూబా తరువాత ప్రపంచంలో తొలిసారి రూపొందుతున్న చేగువేరా బయోపిక్ ఇదే. నవ ఉదయం సమర్పణలో నేచర్ ఆర్ట్స్ బ్యానర్‌పై బి.ఆర్ సభావత్ నాయక్ టైటిల్ రోల్ పోషిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. సూర్య, బాబు, దేవేంద్ర సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ పోస్టర్‌ను చేగువేరా కూతురు డా.అలైదా గువేరా చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆమె చిత్రయూనిట్‌ను అభినందించారు. (ఇది చదవండి: యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తోన్న 'హిట్ లిస్ట్'.. ఆసక్తి పెంచుతోన్న టీజర్!) ఈ సందర్భంగా హీరో , దర్శకుడు బీఆర్ సభావత్ నాయక్ మాట్లాడుతూ... ' విప్లవ వీరుడు , యువత స్పూర్తిదాయకుడు చేగువేరా జీవిత చరిత్రను సినిమా గా తీయడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. ఆయన చేసిన పోరాటాలు, త్యాగాలు ఈ చిత్రంలో చూపించాం. అప్పటి పరిస్థితులకు అద్దం పట్టే విధంగా ఈ సినిమాను రూపోందించాం." అని చెప్పారు. త్వరలో సినిమా టీజర్ ,ట్రైలర్ రిలీజ్ చేసి విడుదల తేదిని ప్రకటిస్తామని తెలిపారు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రంలో లావణ్య సమీరా, పూల సిద్దేశ్వర్, కార్తీక్ నూనె, వినోద్ , పసల ఉమా మహేశ్వర్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. రవిశంకర్ సంగీతం అందిస్తున్నారు. (ఇది చదవండి: ప్రేయసిని పెళ్లాడిన హీరో, ఫోటోలు వైరల్) -
పవన్‌పై మంత్రి అంబటి సెటైరికల్ ట్వీట్
సాక్షి, గుంటూరు: జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌పై ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు బుధవారం సెటైరిక్‌గా ఓ ట్వీట్ చేశారు. విప్లవ యోధుడు చే గువేరా పుట్టినరోజు సందర్భగా.. ఓ ప్రశ్న అంటూ పవన్‌ను ఉద్దేశించే పరోక్షంగా ట్వీట్ చేశారాయన. ఆ ట్వీట్ పరిశీలిస్తే.. చే గువేరా జన్మదిన సందర్బంగా ఒక ప్రశ్న: టీ షర్ట్ మీద చే గువేరా గుండెల్లో చంద్రబాబు ఎవరతను ? — Ambati Rambabu (@AmbatiRambabu) June 14, 2023 ఇదీ చదవండి: మళ్లీ చంద్రబాబు కోసం పవన్ పనిచేసేది! -
అణచివేతకు గురయ్యే వారిని ప్రేమించాలని చెప్పేవారు
బొల్లోజు రవి ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టులకు స్ఫూర్తి ప్రదాత అయిన నిన్నటితరం గెరిల్లా యుద్ధ యోధుడు, మార్క్సిస్టు విప్లవవీరుడు చేగువేరా నేటి యువతరానికీ ఓ ఐకాన్. తండ్రి విప్లవ బాటను నిలువెల్లా నింపుకున్న ఆయన కుమార్తె, మానవ హక్కుల కార్యకర్త డాక్టర్ అలైదా గువేరా ‘సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకిద్దాం... ప్రపంచ శాంతిని కాపాడుకుందాం’అంటూ ప్రపంచమంతా చాటి చెబుతున్నారు. క్యూబా రాజధాని హవానాలోని విలియం సోలెర్ చిల్ర్డన్స్ హాస్పిటల్లో వైద్యురాలిగా పనిచేçస్తూనే ప్రపంచ దేశాల్లో జరిగే వివిధ కార్యక్రమాలకు ఆమె హాజరవుతుంటారు. క్యూబా సంఘీభావ యాత్రలో భాగంగా భారత్‌లో పర్యటిస్తున్న అలైదా గువేరా ఆదివారం తన కుమార్తె, చేగువేరా మనవరాలు ప్రొఫెసర్ ఎస్తిఫినా గువేరాతో కలసి హైదరాబాద్ వచ్చారు. ఈ సందర్భంగా డాక్టర్ అలైదా గువేరా ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే... నాన్నతో గడిపిన కాలం గుర్తుంది... లాటిన్ అమెరికా దేశాల్లో విప్లవాన్ని రగిలించేందుకు వెళ్లిన నాన్నను బొలీవియాలో 1967లో అమెరికా అనుకూల బొలివీయా దళాలు కాల్చి చంపినప్పుడు నాకు సుమారు ఏడేళ్లు. అయినప్పటికీ ఆయనతో గడిపిన క్షణాలు నాకు ఇప్పటికీ మెరుపులా గుర్తున్నాయి. ఆయన ప్రతిరోజూ ఉదయం 5 గంటలకు నన్ను లేపేవారు. చెరకు తోటలకు తీసుకెళ్లేవారు. అక్కడ ఆయన పనిచేస్తుంటే నేను చెరకుగడలు తింటూ గడిపేదాన్ని. ఇతరులతో మాట్లాడుతూ నన్ను ఆడిస్తూ ఉండేవారు. ఆయన ఇంట్లో ఉన్నప్పుడు వీపుపై తిప్పుతూ ఆడించేవారు. నాకు, నా సోదరులకు జంతువుల కథలను ఎక్కువగా చెప్పేవారు. వారాంతాల్లో స్వచ్ఛంద పనులు చేసేవారు. ప్రపంచంలో అణిచివేతకు గురవుతున్న మానవ సమూహాలను ప్రేమించాలని చెప్పేవారు. సామాజిక సేవా కార్యక్రమాలకు తీసుకెళ్లేవారు. మాకు దూరంగా ఉన్నా ఉత్తరాలు రాసే వారు. మరో తండ్రిలా క్యాస్ట్రో... నాన్న చనిపోయాక క్యూబా కమ్యూనిస్టు పితామహుడు, అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమ నేతల్లో ఒకరైన ఫిడేల్ క్యాస్ట్రోనే అన్నీ తానై నన్ను చూసుకున్నారు. క్యాస్ట్రో మరో తండ్రిలాంటి వారు. ఆయనతో కలిసి గడిపిన కాలం ఎంతో ప్రత్యేకం. 1987లో నాకు పెళ్లయింది. పెళ్లి రాత్రి 11:30 గంటలకు జరిగింది. ఆయన రాకకోసం వేచిచూసి ఆ సమయంలో చేసుకున్నాం. నాకు కూతురు పుట్టినప్పుడు ఆయన ఆసుపత్రికి వచ్చారు. విక్టోరియా అనే పేరు పెట్టాలని సూచించారు. కానీ అప్పటికే నేను, మావారు ఒక పేరు నిర్ణయించాం. ఈ విషయం ఆయనకు చెప్పేసరికి కాస్తంత నొచ్చుకున్నారు. పాపను చూసి అమ్మలా నువ్వు ఉండొద్దు (నవ్వుతూ) అని అన్నారు. ప్రపంచానికి మా దేశ వైద్య రంగం ఆదర్శం... క్యూబా వైద్య రంగంలో ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది. కరోనా కాలంలోనూ వివిధ దేశాలకు వైద్య సాయం చేసింది. ఖతార్‌లోని ఒక ఆసుపత్రిలో పనిచేసే వారంతా క్యూబన్లే. వారికి ఆ దేశం వేతనాలు ఇస్తుంది. హైతీలోనూ ఒక ఆసుపత్రిలో క్యూబన్లు పనిచేస్తున్నా వారికి వేతనాలు ఇచ్చే పరిస్థితుల్లో ఆ దేశం లేదు. అందువల్ల ఖతార్‌లో వచ్చే ఆదాయాన్ని హైతీ ఆసుపత్రుల్లో పనిచేసే క్యూబన్ డాక్టర్లకు చెల్లిస్తున్నాం. అర్జెంటీనాలో స్మారక నేత్ర ఆసుపత్రి, బొలీవియాలో జనరల్ ఆసుపత్రి ఉన్నాయి. కరోనా కాలంలో ఫ్రాన్స్ కూడా క్యూబా వైద్య సాయం కోరింది. ఇటలీ, కెనాడాలకు వైద్య సాయం చేస్తున్నాం. మా దేశంలో చిన్నారులకు 14 రకాల టీకాలు ఇస్తుంటాం. క్యూబాలో ప్రస్తుతం శిశుమరణాల రేటు ప్రతి వెయ్యిలో ఐదుగా ఉంది. క్యూబాలో స్త్రీ, పురుషులకు సమాన హక్కులు.. క్యూబాలో 100 శాతం స్త్రీ, పురుష సమానత్వం ఉంది. సమాన పనికి సమాన వేతనం ఇస్తున్నారు. మా దేశంలో మహిళా సంఘం ఉంది. అది అన్ని రకాలుగా మహిళల కోసం పనిచేస్తుంది. చినప్పటి నుంచే బాలబాలికలకు సమాన అవకాశాలు కల్పిస్తున్నాం. పైస్థాయిలోనూ సమాన అవకాశాలు ఉన్నాయి. అందుకే మహిళలు అన్ని రకాలుగా ముందున్నారు. అక్కడి చట్టాలు మహిళల హక్కులు కాపాడతాయి. మహిళా ఉద్యోగులకు ప్రసవానికి ముందు రెండు నెలలు, ప్రసవం తర్వాత 9 నెలలు వేతనంతో కూడిన సెలవులు ఇస్తున్నారు. ఆ తర్వాత ఎవరికైనా కూడా అదనపు సెలవులు కావాలంటే మరో మూడు నెలలు 75 శాతం వేతనంతో సెలవు ఇస్తున్నారు. త్వరలో ఏడాదిపాటు వేతనంతో కూడిన సెలవులు ఇచ్చేలా కొత్త చట్టం రానుంది. అంతేకాదు ఆరు నెలలు తల్లికి, మరో ఆరు నెలలు తండ్రికి పూర్తి వేతనంతో కూడిన సెలవులు ఇవ్వాలనుకుంటున్నారు. క్యూబాలో ఇప్పుడు మగవారు కూడా వారికొక సంఘం కోరుకుంటున్నారు (నవ్వుతూ). మా దేశంలో పిల్లలను కొట్టకూడదు. క్యూబా డాక్టర్లలో 72 శాతం మంది మహిళలే. నాన్న కమ్యూనిస్టు... నాన్న చేగువేరా పూర్తి కమ్యూనిస్టు. ఇరాన్ వంటి దేశాల్లోనూ ఆయన్ను ఆరాధిస్తారు. జీవితాంతం కమ్యూనిస్టు సిద్ధాంతంతోనే ఆయన పనిచేశారు. కమ్యూనిస్టుగానే ఆయన చనిపోయారు. క్యూబా ఒకప్పుడు అమెరికా కాలనీగా ఆ దేశ కనుసన్నల్లో బతికింది. 1950లలో విప్లవోద్యమంతో అమెరికా అనుకూల ప్రభుత్వాన్ని పడగొట్టి కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక దేశం అన్ని రంగంలో పురోగమించింది. అమెరికాకు ఇది మింగుడు పడడంలేదు. ఇప్పటికీ క్యూబాను నాశనం చేసేందుకు కుట్రలు చేస్తోంది. పుస్తకం రాస్తున్నా.. నేను నాన్న గురించి ‘చేగువేరా–వైద్యం’అనే పుస్తకం రాస్తున్నా. అందుకోసం నాన్న రాసిన పుస్తకాలను లోతుగా అధ్యయనం చేస్తున్నా. బొలీవియన్ డైరీస్ పుస్తకం చదువుతుంటే గుండె బరువెక్కుతుంది. డైరీ చివరి పేజీ నన్ను కన్నీళ్లు పెట్టిస్తుంది. చివరి పేజీ ఆయన్ను చంపిన రోజు. ఒక పోరాట యోధుడి డైరీనే బొలివియన్ డైరీ. ఎన్ని కష్టాలు ఎదురైనా భవిష్యత్తు గురించి ఆందోళన చెందకూడదు. చదవండి: అసెంబ్లీ సమావేశాల తర్వాతే.. జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ విస్తరణ! -
తెలంగాణకు చేగువేరా కుమార్తె, మనవరాలు
సాక్షి, హైదరాబాద్: క్యూబా విప్లవనేత చే గువేరా వారసులు ఆదివారం హైదరాబాద్‌కు రాను న్నారు. నేషనల్ కమిటీ ఫర్ సాలిడారిటీ విత్ క్యూబా(ఎన్సీఎస్సీ), ఐప్సో(ఏఐపీ ఎస్వో)ల సంయుక్త ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో జరగ నున్న క్యూబా సంఘీభావసభకు చే కుమార్తె, క్యూబా బాలల హక్కుల కార్యకర్త, అడ్వకేట్ అలైదాగు వేరా, ఆమె కుమార్తె, చే మనవరాలు ప్రొఫెసర్ ఎస్తిఫినా గువేరా హాజరుకానున్నారు. ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో శంషాబాద్ విమానాశ్రయానికి రానున్న అలైదా, ఎస్తిఫినాకు పలు ప్రజా, విద్యార్థి సంఘాల నాయకులు ఘన స్వాగతం పలకనున్నారు. అక్కడ క్యూబన్ ప్రతినిధి బృందంతో వారివురూ సమావేశమవుతారు. ఆ తర్వాత సుందరయ్య విజ్ఞానకేంద్రం, మఖ్దూం భవన్, హరితప్లాజా, రవీంద్రభారతిని సందర్శిస్తారు. సాయంత్రం 4 గంటల నుంచి రవీంద్రభారతిలో జరగనున్న క్యూబా సంఘీభావ సభలో పాల్గొంటారు. ఈ సందర్భంగా వారు చేగువేరాతో తమ అనుభవా లను పంచుకోవడంతోపాటు చే సమరశీలత, ప్రజాస్వామిక చైతన్యానికి ప్రేరణ ఇవ్వనున్నారని నిర్వాహకులు వెల్లడించారు. వామపక్ష పార్టీల నేతలు ఎన్.బాలమల్లేశ్, డీజీ నర్సింహారావు సమన్వయకర్తలుగా వ్యవహరించే ఈ కార్యక్రమా నికి అతిథిగా మంత్రి శ్రీనివాస్‌గౌడ్, వివిధ పార్టీల ప్రముఖులు, రాజకీయ విశ్లేషకులు హాజరుకానున్నారు. రాత్రి హరితప్లాజాలోనే బసచేయనున్న అలైదా, ఎస్తిఫినా సోమవారం ఉదయం 6 గంటలకు శంషాబాద్ విమానా శ్రయం నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడకు చేరుకుని అక్కడ ఏర్పాటు చేసే కార్యక్రమాల్లో పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. -
Che Guevara: 22న చేగువేరా కుమార్తె హైదరాబాద్ రాక
సాక్షి, హైదరాబాద్: క్యూబా విముక్తి విప్లవ నాయకుడు చేగువేరా కుమార్తె ఆలైదా గువేరా ఈనెల 22న హైదరాబాద్ రానున్నారు. ఈ సందర్భంగా బీజేపీ, ఎంఐఎం మినహా అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో సభ నిర్వహిస్తున్నట్లు సీపీఐ ఒక ప్రకటనలో తెలిపింది. చదవండి: (టీడీపీ మాజీ ఎంపీ కుటుంబానికి పథకాల లబ్ధి రూ.45,702) -
ఇండియాకు చేగువేరా
నేడు చేగువేరా జయంతి కాదు. ఆయన వర్ధంతి కూడా కాదు. మరి ఈరోజు ప్రత్యేకత ఏమిటి? ఆయన 1959లో ఇదే రోజు (జూన్ 30) తొలిసారి భారతదేశం వచ్చారు! ఆ రాత్రి పొద్దు పోయాక ఢిల్లీ పాలం విమానాశ్రయంలో దిగారు. మర్నాడు నాటి ప్రధాని నెహ్రూ తన అధికార నివాసం తీన్‌మూర్తి భవన్లో చేగువేరాను సాదరంగా ఆహ్వానించారు (కింది ఫొటో). నియంతల గుండెల్లో నిద్రించిన యోధుడు చేగువేరాకు భారతదేశంలో పనేమిటి? అంతకన్నా ముందు, ఆయన ఎవరో సంక్షిప్తంగా గుర్తు చేసుకుందాం. చేగువేరా 1928 జూన్ 14న అర్జెంటీనాలోని రోజలియాలో జన్మించారు. చే బాల్యంలో ఆస్తమా బాధితుడు. దీంతో పసివాడికి ఏమౌతుందో అని భయపడుతూ అతని తల్లిదండ్రులు నిద్రలేని రాత్రులు గడిపేవారు. అయితే ఆ పసివాడే పెరిగి పెద్దయ్యాక నియంతలకు నిద్ర లేకుండా చేశాడు! వైద్య విద్యార్థిగా వున్నప్పుడే లాటిన్ అమెరికా మొత్తం పర్యటించాలని చే మనసులో కోరిక కలిగింది. ఆ కోరిక బలంగా నాటుకుపోయింది. స్నేహితుడు ఆల్బర్టో గ్రనడోతో కలసి తన పాత మోటారు సైకిలుపై లాటిన్ అమెరికా మొత్తం చుట్టి రావాలనుకున్నాడు. ఆ ప్రయాణమే ఆయన జీవితాన్ని మార్చేస్తుందని చే కూడా ఊహించలేదు. ఆ ప్రయాణం మొదలు పెట్టాక దారి మధ్యలో ఎన్నో అనుభవాలు ఎదురయ్యాయి. వలస సామ్రాజ్యవాదుల పాలనలో మగ్గిపోతూ కనీస అవసరాలైన తిండి, గూడు లేక ప్రజలు పడుతున్న ఇబ్బందులు, బానిస బతుకులు, సరైన వైద్యం అందక ప్రాణాలు కోల్పోతున్న కోట్లాది ప్రజల బాధలను ఆకలిచావులను చే కళ్లారా చూశాడు. అప్పుడే లాటిన్ అమెరికాలోని బానిసల జీవితాలలో వెలుగులు నింపాలని నిర్ణయించుకున్నాడు. డాక్టర్ పట్టా చేతికొచ్చిన చేగువేరాను చూసి తల్లితండ్రులు ఎంతో ఆనందపడ్డారు. అయితే ఆయన ఆలోచనలు వేరుగా వున్నాయని వారికి తెలియదు. దోపిడీ చేస్తున్న నియంతృత్వాన్ని అంతమొందించి.. బానిసత్వం నుంచి ప్రజలకు విముక్తి కలిగించాలని అనుకుంటున్నట్లు చే వారితో అన్నాడు. అనడమే కాదు, ఆ దిశగా అడుగులు వేశాడు. తన విప్లవానికి మొదట బొలీవియాను ఎంచుకున్నాడు. అక్కడ నుంచి అనేక దేశాల మీదుగా ప్రయాణిస్తూ క్యూబా గురించి, క్యాస్ట్రో నాయకత్వంలో అక్కడ జరుగుతున్న పోరాటాల గురించి తెలుసుకున్నాడు. క్యూబా నియంత బాటిస్టాపై చే నడిపిన గెరిల్లా యుద్ధం విప్లవబాటకు కొత్త అడుగులు నేర్పింది. ఆ తర్వాత క్యూబా పునర్నిర్మాణంలో చే పాత్ర మర్చిపోలేనిది. అందుకే క్యూబన్లు క్యాస్ట్రోని ప్రేమించినట్లే చేగువేరాను కూడా ప్రేమిస్తారు. ఇక ఆయన ఇండియా ఎందుకు వచ్చారంటే.. క్యాస్ట్రో పంపించారు. బాండుంగ్ ఒప్పందంలో ఉన్న దేశాలన్నిటినీ చేగువేరాని పర్యటించి రమ్మన్నారు. బాండుంగ్ అనేది ఇండోనేషియాలోని పట్టణం. వలస పాలన నియంతృత్వాన్ని వ్యతిరేకించే ఆఫ్రో–ఏషియన్ దేశాలన్నీ బాండుంగ్‌లో సమావేశమై.. సమైక్యంగా ఉండాలని, ఆర్థికంగా సహాయ సహకారాలు ఇచ్చిపుచ్చుకోవాలని ఒప్పందం కుదుర్చుకున్నాయి. అందులో ఇండియా కూడా ఉంది. అందుకే చేగువేరా ఇండియా వచ్చారు. ఇక్కడే కొన్ని రోజులు ఉన్నారు. కలకత్తా కూడా సందర్శించారు. 39 ఏళ్ల వయసులో 1967 అక్టోబర్ 9న ఈ విప్లవ వీరుడు, గొరిల్లా యుద్ధంలో ఆరితేరిన యోధుడు మరణించారు. బొలీవియా సైన్యం అతడిని పట్టి బంధించి, చంపేసింది. -
అమ్మకానికి చే గువేరా ఇల్లు
వాషింగ్టన్: విప్లవ వేగుచుక్క చే గువేరా గురించి ప్రపంచమంతా తెలుసు. చే ప్రసంగాలు, అతని ఆలోచనలు యువతరానికి ఇప్పటికీ ఆదర్శప్రాయమే. అర్జెంటీనాలో చే గువేరా జన్మించిన ఇంటిని ఇప్పుడు అమ్మకానికి పెట్టడం వార్తల్లో నిలిచింది. 1928లో అర్జెంటీనాలోని రోసారియోలో నియో క్లాసికల్ అనే భవనంలో చే గువేరా జన్మించాడు. ఈ భవనాన్ని ఇప్పుడు అమ్మకానికి పెట్టారు. 2002లో ఫ్రాన్సిస్కో ఫరూగియా ఈ భవనాన్నికొనుగోలు చేశాడు. 240 చదరపుమీటర్ల అడుగుల విస్తీర్ణం ఉన్న ఈ భవనాన్ని అతడు సాంస్కృతిక నిలయంగా మార్చుదామనుకున్నాడు. కానీ అది సాధ్యపడలేదు. దీంతో ఇప్పుడు దీన్ని అమ్మివేస్తున్నట్లు ప్రకటించాడు. అయితే ధర మాత్రం వెల్లడించలేదు. ఇక ఉర్కిజా, ఎంటర్ రియాస్ మధ్య ఉన్న ఈ భవనం ఏళ్ల తరబడి ఎందరో పర్యాటకులను ఆకర్షిస్తూ వస్తోంది. (ఫేక్ ఫొటో: డిటెన్షన్ సెంటర్లో తల్లి..) ఉరుగ్వే మాజీ అధ్యక్షుడు జోస్ పీపీ ముసికా దీన్ని సందర్శించిన లిస్టులో ఉన్నారు. చేతో కలిసి 1950లో దక్షిణ అమెరికా మొత్తాన్ని బైకుపై చుట్టివచ్చిన అల్బెర్టో గ్రెనడోస్ కూడా దీన్ని సందర్శించినవాడే. కాగా వృత్తిపరంగా డాక్టర్ అయిన చే గువేరా రచయిత, కవి, మేధావి, కమ్యూనిస్టు, సిద్ధాంతకర్త, మానవతావాది కూడా. దోపిడీ విధానాలను నిరసిస్తూ అతడు క్యూబా విప్లవంలో పాల్గొని ప్రాణాలకు తెగించి పోరాడాడు. అనంతరం ఫిడేల్ క్యాస్ట్రో ప్రభుత్వంలో క్యూబా మంత్రిగా పని చేశాడు. అయితే బొలీవియాలో పేదలకు అన్యాయం జరుగుతోందని పదవి వీడి మళ్లీ ఉద్యమం బాట పట్టాడు. ఈ క్రమంలో 1967 అక్టోబర్ 9న బొలివీయన్ దళాలు చేను చుట్టుముట్టి చంపేశాయి. అనంతరం ఆయన మృతదేహాన్ని ప్రపంచానికి కూడా చూపించలేదు. 1997లో అతని అవశేషాలు బయటపడగా క్యూబాకు తీసుకెళ్లి మరోసారి ఖననం చేశారు. (ఆనాటి స్ఫూర్తి ఎక్కడ.. నేడెక్కడ?) -
1969 : ఎ లవ్ స్టోరీ
మనిషి చందమామను అందుకొని ఇప్పటికి యాభ య్యేళ్లయింది. ఆ వెన్నెల రాజును తాకాలన్నది ఏనాటి కోరిక? రామాయణ కాలం నుంచయితే మనకు తెలుసు. చందమామను తెచ్చి తన చేతికి ఇస్తే తప్ప అన్నం తినేది లేదని ఒకసారి బాలశ్రీరాముడు మారాం చేశాడట. పిన్నమ్మలూ, తల్లీ, తండ్రీ ఎంత బతిమాలినా వినలేదట. చివరకు సుమంతుడు అనే మంత్రి ఒక అద్దం తెచ్చి అందులో చంద్రబింబాన్ని రాముడికి చూపించాడట. చంద్రుడు తన చేతికి అందాడని రామచంద్రుడు సంబర పడ్డాడట. ఆనాటికే మనిషి మస్తిష్కంలో చంద్రుడిని చేరుకోవాలన్న కాంక్ష నాటుకొనిపోయింది. వేలయేళ్లు గడిచిన తర్వాత 1969 జూలై 20వ తారీకున ఆ కోరిక నెరవేరింది. నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ అనే అమెరికా వ్యోమగామి ఎడ్విన్ ఆల్డ్రిన్ అనే మరో సహచరునితో కలిసి చంద్రమండలం మీద కాలుమోపాడు. మరో సహచరుడు మైకేల్ కోలిన్స్ కక్ష్యలో తిరుగుతూ అపురూప దృశ్యాలను ఫొటోలు తీశాడు. 1969 ఒక మైలురాయిలాగా మానవ చరిత్రలో మిగిలిపోయింది. 1960వ దశకానికి ఒక అద్భుతమైన ముగింపు అరవై తొమ్మిది. అలజడితో, ఆలోచనతో, ఆవేశంతో ఎగసిపడిన అరవయ్యో దశకపు పెనుకెరటంపై మెరుపు నురగ అరవై తొమ్మిది. ఆ దశాబ్ది ప్రతినిధి అరవై తొమ్మిది. యాభయ్యేళ్లు గడిచిన సందర్భంగా 69 గురించి మాట్లాడుకోవడం అంటే ఆ మొత్తం దశాబ్ది పరిణామాల సమాహారాన్ని పరామర్శిం చడమే. అనంతకాల గమనంలో దశాబ్ది సమయం ఒక రెప్పపాటు మాత్రమే. కానీ, ఈ దశాబ్ది మాత్రం ఓ రెక్క విప్పిన రివల్యూషన్! అరవయ్యో దశకానికి సంబంధించి కొంతమంది సంప్రదాయవాదులకు కొన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఈ దశాబ్ది ఉద్యమాల్లో పెడధోరణులున్నాయనీ, సాంఘిక కట్టుబాట్లను భ్రష్టుపట్టించే లక్షణాలున్నాయన్న విమర్శలు వచ్చాయి. నిజానికి, ఆ ఉద్యమాలు స్వాభావికంగానే ధిక్కార స్వరాలు. అసమానతల పునాదులపై ఏర్పడిన సాంఘిక కట్టుబాట్లపై ధిక్కారం. సంకుచిత భావనలపై ధిక్కారం. వివక్షపై ధిక్కారం! ఈ ఉద్యమాల మరో ముఖ్య లక్షణం విశ్వ మానవ సౌభ్రాతృత్వం. రెండో ప్రపంచ యుద్ధకాలంలో, ఆ తర్వాత కాలంలో పుట్టి పెరిగిన తరం ప్రధానంగా ఈ ధిక్కార స్వరాన్ని వినిపించింది. అంతర్లీనంగా ఆర్థిక కారణాలు వున్నప్పటికీ, మితిమీరిన జాతీయ దురహంకారమే రెండో ప్రపంచ యుద్ధానికి దారితీసింది. ఐదుకోట్ల మంది ప్రాణాలు బలితీసుకున్న మహా మహమ్మారి ఈ యుద్ధం. అందుకే యుద్ధాన్ని ఈ తరం అసహ్యించుకుంది. జాత్యహంకారాన్ని ఈసడించు కుంది. వియత్నాంపై అమెరికా చేస్తున్న దురాక్రమణ యుద్ధానికి వ్యతిరేకంగా లక్షలాదిమంది అమెరికా విద్యా ర్థులే వీధుల్లోకి వచ్చారు. తమ నేలపై అంగుళం ఖాళీ వద లకుండా అగ్రరాజ్యం బాంబులతో తూట్లు పొడుస్తుంటే, ఆ చిన్నారి దేశం తలవంచకుండా ప్రతిఘటిస్తున్న తీరును యావత్తు ప్రపంచం ఆశ్చర్యచకితమై చూసింది. అమెరికా చేస్తున్న యుద్ధానికి వ్యతిరేకంగా సకల దేశాల్లోని ప్రజలు – ముఖ్యంగా యువకులు నిరసన ప్రదర్శనలు చేశారు. యుద్ధ వ్యతిరేక సందేశాన్ని అమెరికా యువతరం కూడా అందుకుంది. వియత్నాం నుంచి అమెరికా సేనలు తప్పు కోవాలని కోరుతూ తీసిన ఊరేగింపుల్లో లక్షల సంఖ్యలో విద్యార్థులు, యువకులు పాల్గొన్నారు. అమెరికా సైనికుల కుటుంబాలు కూడా ఈ నిరసనల్లో పాల్గొనడం విశేషం. చేగువేరా ఒక కమ్యూనిస్టు విప్లవకారుడు, పుట్టింది అర్జెంటీనాలో. చదివింది వైద్యశాస్త్రం. ‘బాటిస్టా’ ప్రభుత్వా నికి వ్యతిరేకంగా క్యూబా విప్లవకారులు కాస్ట్రో నాయ కత్వంలో సాగిస్తున్న పోరాటంలో పాల్గొన్నాడు. విప్లవ ప్రభుత్వంలో కొంతకాలం మంత్రిగా చేశాడు. కానీ ఒక చిన్న దేశంలో సోషలిస్టు ప్రభుత్వం ఏర్పడితే, దానిని, సామ్రాజ్యవాదం బతకనివ్వదని చే భావించాడు. ఏక కాలంలో అనేక దేశాల్లో విప్లవ పోరాటాలు జరగాలని, పెద్దసంఖ్యలో సోషలిస్టు వ్యవస్థలు ఏర్పడాలనీ, అప్పుడే అవి మనగలుగుతాయని చే ఆలోచన. వెంటనే క్యూబాలో మంత్రిపదవి వదిలేశాడు. మొదట కాంగోలో కొన్ని ప్రయ త్నాలు చేశాడు. తర్వాత బొలీవియాకు చేరుకున్నాడు. అక్కడ సీఐఏ ఏజెంట్లు గువేరాను చంపించారు. చేగువేరా ఒక ధిక్కారస్వరమే కాదు, ఒక ధిక్కార సంస్కృతికి బ్రాండ్ అంబాసిడర్ కూడా. పొడవైన వేలాడే జుట్టు, నక్షత్రం మార్కు ఎర్రటోపీ, గడ్డం, మీసాలు, హవాయి చుట్ట.. దేశదేశాల్లోని యువతరం అనుకరించిన రూపం అది. ఆయన చనిపోయి యాభయ్యేళ్లు దాటినా, ఆయన బొమ్మ వున్న టీ–షర్టులకు ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా బోలెడు డిమాండ్ వుంది. ఆయనకొక దేశం లేదు. ఆయనొక విశ్వమానవ సందేశం. ఇరవయ్యో శతాబ్దపు అమెరికన్ ధ్రువతార మార్టిన్ లూథర్‌కింగ్ జూనియర్. న్లలజాతీ యుల పట్ల దుర్మార్గమైన వివక్షకు వ్యతిరేకంగా ఆయన చేసిన పౌరహక్కుల పోరాటం ప్రధాన ఘట్టాలన్నీ అర వయ్యో దశకంలోనే చోటుచేసుకున్నాయి. భారత జాతిపిత మహాత్మాగాంధీ నుంచి సహాయ నిరాకరణ, అహింసా యుత పోరాట రూపాలను కింగ్ అరువు తెచ్చుకున్నారు. ఆయన చేసిన ‘ఐ హ్యావ్ ఏ డ్రీమ్...’ అనే ప్రసిద్ధ ప్రసంగం సమతావాద వేదం లాంటిది. మార్టిన్ లూథర్ చేసిన గాంధేయ పోరాటాలకు తలవొగ్గి లిండన్ జాన్సన్ ప్రభుత్వం ఆ దశాబ్దిలోనే కొన్ని పౌరహక్కుల చట్టాలను చేయాల్సి వచ్చింది. చివరకు ఒక దురహంకారి కాల్పులకు నేలకొరిగిన మార్టిన్ లూథర్‌కింగ్ జూనియర్ రెపరెపలాడే పౌరహక్కుల పతాకం. ఆ పతాకానికి ఎల్లలు లేవు. స్త్రీవాద ఉద్యమాలు శిరమెత్తింది కూడా ఈ దశాబ్ద కాలంలోనే. ఉద్యోగాల్లో స్త్రీల పట్ల కొనసాగుతున్న వివక్షపై అమెరికా మహిళా లోకంలో తీవ్ర అసంతృప్తి పేరుకుని వున్న సమయంలో బెట్టీఫ్రీడన్ రాసిన ‘ది ఫెమినైన్ మిస్టిక్’ అనే పుస్తకం 1963లో వెలువడి ప్రకంపనలు సృష్టించింది. అంతకుముందే ఫ్రెంచి ఫెమినిస్ట్ సిమోన్ ది బోవా రాసిన ‘ది సెకండ్ సెక్స్’ను మించిన సంచలనం సృష్టించిన రచన ఇది. ఆకాలంలో చెలరేగిన మహిళా ఉద్యమాల పర్యవసా నంగా ఉద్యోగాల్లో కొనసాగుతున్న లింగవివక్ష 1964లో అంతమైంది. రాజకీయ, సామాజిక రంగాలతోపాటు సాంస్కృతిక రంగంలోకి కూడా ధిక్కార సంస్కృతి ప్రవే శించింది. సంగీతంలోనూ, జీవనశైలిలోనూ అది ప్రభావం చూపింది. ఈకాలంలో ప్రపంచాన్ని బ్రిటన్ దేశపు ‘ది బీటిల్స్’ బ్యాండ్ ఉర్రూతలూగించింది. పాప్ సంగీతానికి కళాత్మకతను అద్దిన ‘బీటిల్స్’ దేశదేశాల సంగీత రీతులను తనలో మిళితం చేసుకుంది. అందులో భారతీయ సంగీత ఛాయలు కూడా వున్నాయి. ఈ గాయకులు కొంతకాలం పాటు రుషికేశ్‌లోని ఒక ఆశ్రమంలో వుండి యోగా, ధ్యానం కూడా కూడా నేర్చుకున్నారట. అక్కడే దాదాపు ముప్ఫై పాటల వరకు స్వరపరచారని చెపుతారు. అమెరికా సామా జిక వ్యవస్థలోని అసమానతలపై వైముఖ్యం, అప్పటి సంఘ కట్టుబాట్లపై నిరసన, వియత్నాంపై అమెరికా యుద్ధం పట్ల వ్యతిరేకత, ఇలాంటివన్నీ కలిసి అప్పటి యువతవరంలో హిప్పీ స్టయిల్ పేరుతో ఒక ధిక్కార సంస్కృతి ప్రవేశించింది. అనతికాలంలోనే ఈ సంస్కృతి చాలా దేశాల్లోకి ప్రవేశించింది. భుజాల దాకా వేలాడే తైల సంస్కారం లేని జుట్టు, గడ్డం, మీసాలు, బెల్‌బాటమ్ ప్యాంట్లు, ముదురు రంగుల పెద్ద కాలర్ షర్టులు.. ఒక విచిత్ర వేషధారణ వుండేది. స్వేచ్ఛ, సమానత్వం పునాది గానే ఈ ధిక్కార జీవనశైలి పుట్టినప్పటికీ, విచ్చలవిడితనం, మాదకద్రవ్యాల అలవాటు వల్ల ప్రధాన జీవన స్రసంతి అభిశంసనకు గురై, కొంతకాలం తర్వాత అంతరించి పోయింది. అరవయ్యో దశకపు ఉద్యమ కెరటాలు అమెరికాతో పాటు దాదాపు మొత్తం ప్రపంచాన్ని తాకాయి. యూరప్‌లో నయితే ఫ్రాన్స్, ఇటలీ, బ్రిటన్, పోలండ్, యుగోస్లేవియా దేశాలను విద్యార్థి ఉద్యమాలు అట్టుడికించాయి. ఫ్రాన్స్‌లో విద్యార్థులకు ట్రేడ్ యూనియన్లు కూడా జతకలవడంతో 1968లో చార్లెస్ డీగాల్ ప్రభుత్వం దాదాపుగా పతనం అంచులకు చేరుకుంది. ఐరోపా దేశాలకు వలసలుగా వున్న ఆఫ్రికా దేశాల్లో 32 దేశాలు ఈ దశాబ్దంలో స్వతంత్ర రాజ్యాలుగా అవతరించాయి. ఈ మహత్తర పరిణామం వెనుక ఐరోపా దేశాల్లోని అంతర్గత ఉద్యమాల పాత్రను విస్మరించలేము. మావోజెడాంగ్ నాయకత్వంలోని చైనాలో సాంస్కృతిక విప్లవం నడిచిన కాలం కూడా ఇదే. అది వికటించడం ఒక విషాదం. ప్రపంచమంతటా అప్పుడు వీచిన గాలుల ప్రభావం భారత్‌పై కూడా వుంది. ఇందిరా గాంధీ ప్రభుత్వం పూర్వపు సంస్థానాధీశులకు ఇచ్చే రాజ భరణాలను రద్దుచేసి, బ్యాంకులను జాతీయం చేసింది 1969లోనే. పర్యవసానంగా బ్యాంకులు సామాన్యులకు కొంత చేరువై బర్రెలు, గొర్రెలు కొనుక్కునేందుకు రుణా లిచ్చాయి. బొలీవియాలో చేగువేరా హత్యకు గురైన సంవ త్సరమే భారతదేశంలో చారుమజుందార్ నాయకత్వంలో నక్సల్బరీ అలజడి ప్రారంభమవడం కాకతాళీయమైనా, ఆ వేడి యాభయ్యేళ్లు దాటినా ఇంకా చల్లారక పోవడం విశేషం.1960వ దశకం పరిణామాల్లో కొన్ని పెడధోరణులు వున్నప్పటికీ, ఆ దశాబ్దం ఎలుగెత్తి చాటిన స్వేచ్ఛ, సమా నత్వం, సోదరభావం అనే భావనలు సర్వకాలాలకూ, సకల మానవులకూ శిరోధార్యాలు. ఆలోచనలకు సంకెళ్లు లేని, భావాలకు సరిహద్దులు లేని, సంగీతానికి భాషాభేదం లేని, జీవనశైలికి జాతీయ దురహంకారం లేని ఒక వసుధైక కుటుంబాన్ని కలలుగన్న 1969 (60వ దశకం ముగింపు)కి స్వర్ణోత్సవ శుభాకాంక్షలు చెబుతూ... భయంతో, ఆందో ళనలతో కూడిన చిన్న ఉపసంహారం – జాతీయవాదం ముదిరితే తీవ్ర జాతీయవాదం, అది ముదిరితే జాతీయ దురహంకారం. గతంలో జరిగిన ప్రపంచ యుద్ధాలకు జాతీయ దురహంకారమే ప్రధాన కారణం. తీవ్ర జాతీ యవాదం దిశగా ప్రపంచ దేశాలు అడుగులు వేస్తున్న దృశ్యం కనబడుతున్నది. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, ఇండియా... ఇంకా అనేక దేశాలు ఈ దిశలోనే అడుగులు వేస్తున్నాయి. ఈ అడుగుల వడి పెరిగితే, ఇక మెదళ్లపై నిఘా వేసి, హృదయాలకు సంకెళ్లు వేసే పీడ రోజులు దగ్గరపడినట్లే. వ్యాసకర్త: వర్ధెల్లి మురళి ఈ-మెయిల్: muralivardelli@yahoo.co.in -
చే లాంటి యోధుడు మళ్ళీ పుట్టడు
ఫ్యాషనబుల్ హీరో కాదు ప్యాషనేట్ రివల్యూషనరీ ‘చే’ ని ఘర్షణ కన్నది. విప్లవం పెంచింది. ధనస్వామ్య విధ్వంసక ప్రళయ ప్రబోధకుడు సామ్రాజ్యవాద వినాశక తీతువు నిరంతరం మృత్యుముఖంలోకి తీసుకుపోయే ఆస్తమా– యుద్ధభూమిలాంటి ఓ బాల్యం ‘జీవితమంతా ఊపిరాడని ఇసుక తుఫాన్లు’ గేమ్స్ స్పోర్ట్స్ విన్నర్.. చే కందకాల్లో నంబర్‌వన్ వార్ ప్లే బాయ్ హార్డ్ వర్కర్ ‘అలసట ఆయాసం గాలియంత్రాలు’ ‘శ్వాసల కోశాధికారి’ ఆస్తమా పీడితులకు ‘రేడియేటర్’ చే! విప్లవాల ఊపిరి మొండిధైర్యం నాడీ ప్రవాహానికి జారుకున్న ‘పిల్లి’ నెట్టుకుపోతోంది సాయుధ మృత్యు మార్గాన.... ఉచ్ఛ్వాస – నిశ్వాసాల ‘కొసల’ మీద ఊపిరి ఉయ్యాలలూగినవాడు క్యాస్ట్రో నీడన ఊపిరిని ఉర్రూతలూగించినవాడు గుండెనిండా గాలి పోసుకుని ఎల్తైన శిఖరాల మీంచి పల్టీ కొడతావు నువ్వే చివరి విప్లవకారుడవు నువ్వు నా ప్రాణానివి అన్ని పువ్వుల్లో ఎర్రమందారమే నాకు ప్రియం విప్లవకారుడా, తుపాకీ గొట్టంలాంటి ముక్కుపుటాల్లో ఊపిరి ఆడకపోతే ప్రపంచం చచ్చిపోతుంది! భయోద్విగ్న, ఆహార్యం– నీ సింహ రూపం శత్రువు గుండెల్లో ఫిరంగి గుళ్ళు – నీ కళ్ళు మొన వంపు తిరిగిన కత్తులు– నీ మీసాలు నీ చేతులు తుపాకులు ‘రాత్రి అంతరిక్షం’ నీ టోపీలో ఇరుక్కుంది సిగార్ పెదవుల మీద ‘అగ్నిపర్వతం’ అన్నిటినీ మించి నువు మనిషివి కాదు పేలుడు పదార్థానివి! కమ్యూనిస్ట్ విప్లవ సిద్ధాంత పితామహుడు కారల్ మార్క్స్‌కు నిజమైన వారసుడివి (నేడు చేగువేరా జయంతి) -నీలం సర్వేశ్వరరావు మొబైల్ : 93919 96005 -
నియంతల గుండెల్లో నిద్రించిన యోధుడు!
ఇక్కడ కనిపిస్తున్న ఈ బొమ్మను ఎన్నో సినిమాల్లో చూశాం. చాలామంది టీషర్టులపై చూశాం. కానీ... సినిమాలు చూసినవాళ్లలో, ఈ బొమ్మతో ఉన్న టీషర్టులు వేసుకున్నవారిలో ఎంతమందికి ఇతని గురించి తెలుసు?.. చే గువేరా ఏ దేశానికి చెందిన విప్లవ యోధుడు? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం కష్టమే. ఎందుకంటే చే.. ఒక ప్రాంతానికో, ఒక దేశానికో పరిమితమైన వ్యక్తి కాదు. యావత్ ప్రపంచానికి కొత్త శక్తినిచ్చిన నేత. ప్రపంచంలో ఎవరికి, ఎప్పుడు, ఎక్కడ ఏ అన్యాయం జరిగినా స్పందించాలని యువతకు దిశానిర్దేశం చేసి, ఆచరించి చూపించిన మార్గదర్శి. ఊహించని శక్తిగా... 1928 జూన్ 14న అర్జెంటీనాలోని రోజలియాలో జన్మించిన చే గువేరా బాల్యంలో ఆస్తమా బాధితుడు. దీంతో పసివాడికి ఏమౌతుందో అని భయపడుతూ అతని తల్లిదండ్రులు నిద్రలేని రాత్రులు గడిపేవారు. అయితే ఆ పసివాడే పెరిగి పెద్దయ్యాక నియంతలకు నిద్ర లేకుండా చేస్తారని ఎవరైనా ఊహించగలరా? అవును. ఈ పసివాడే నియంతల గుండెల్లో నిద్రపోయాడు. వాళ్లకు నిద్ర లేకుండానూ చేశాడు. జీవితాన్ని మార్చిన ప్రయాణం.. వైద్యవిద్యార్థిగా వున్నప్పుడే లాటిన్ అమెరికా మొత్తం పర్యటించాలని అతని మనసులో కోరిక కలిగింది. ఆ కోరిక బలంగా నాటుకుపోయింది. స్నేహితుడు ఆల్బర్టో గ్రనడోతో కలసి తన పాత మోటారు సైకిలుపై లాటిన్ అమెరికా మొత్తం చుట్టి రావాలనుకున్నాడు. ఆ ప్రయాణమే ఆయన జీవితాన్ని మార్చేస్తుందని కనీసం చే కూడా ఊహించలేదు. ఆ ప్రయాణం మొదలు పెట్టాక దారి మధ్యలో ఎన్నో అనుభవాలు ఎదురయ్యాయి. వలస సామ్రాజ్యవాదుల పాలనలో మగ్గిపోతూ కనీస అవసరాలైన తిండి, గూడు లేక ప్రజలు పడుతున్న ఇబ్బందులు, బానిస బతుకులు సరైన వైద్యం అందక ప్రాణాలు కోల్పోతున్న కోట్లాది ప్రజల బాధలను ఆకలిచావులను కళ్లారా చూశాడు. అప్పుడే లాటిన్ అమెరికాలోని బానిసల జీవితాలలో వెలుగులు నింపాలని నిర్ణయించుకున్నాడు. సమాజానికి వైద్యం.. డాక్టర్ పట్టా చేతికొచ్చిన చే గువేరాను చూసి తల్లితండ్రులు ఎంతో ఆనందపడ్డారు. అయితే ఆయన ఆలోచనలు వేరుగా వున్నాయని వారికి తెలియదు. దోపిడీ చేస్తున్న నియంతృత్వాన్ని అంతమొందించి... బానిసత్వం నుంచి ప్రజలకు విముక్తి కల్గించాలని అనుకుంటున్నట్లు చే వారితో అన్నాడు. అనడమే కాదు, ఆ దిశగా అడుగులు వేశాడు. తన విప్లవానికి మొదట బొలీవియాను ఎంచుకున్నాడు. అక్కడ నుంచి అనేక దేశాల మీదుగా ప్రయాణిస్తూ క్యూబా గురించి క్యాస్ట్రో నాయకత్వంలో అక్కడ జరుగుతున్న పోరాటాల గురించి తెలుసుకున్నాడు. క్యూబా నియంతపై చే నడిపిన గెరిల్లా యుద్ధం విప్లవబాటకు కొత్త అడుగులు నేర్పింది. ఆ తర్వాత క్యూబా పునర్నిర్మాణంలో చే పాత్ర మర్చిపోలేనిది. అందుకే క్యూబన్లు క్యాస్ట్రోని ప్రేమించినట్లే చేగువేరాను కూడా ప్రేమిస్తారు. చే గువేరా వర్ధంతికి హాజరైన ఆయన అభిమానులు, మద్ధతుదారులు ఘనంగా వర్ధంతి.. చే గువేరా 50వ వర్ధంతిని పురస్కరించుకొని హవానాలో సోమవారం జరిగిన కార్యక్రమంలో దాదాపు 60 వేల మంది క్యూబన్లు పాల్గొన్నారు. దేశాధినేత రౌల్ క్యాస్ట్రో స్వయంగా ఈ కార్యక్రమానికి హాజరై చె గొవేరాకు నివాళులర్పించారు. -
ట్రంప్ ఒక పిచ్చోడు
హవానా : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక పిచ్చివాడని.. క్యూబా విప్లవనాయకుడు, ఆధునిక కమ్యూనిస్ట్ నేత చెగువేరా కుమార్తె.. ఎలీదా గువేరా నిప్పులు చెరిగారు. డొనాల్డ్ ట్రంప్ పిచ్చితనం వల్ల ప్రపంచం ప్రమాదంలో పడిందని అన్నారు. ట్రంప్ చర్యల వల్ల మానవత్వం మంటగలిసే ప్రమాదముందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 57 ఏళ్ల ఎలీదా గువేరా క్యూబా రాజధాని హవానాలో ది వీక్ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో ఆమె ట్రంప్ వ్యవహర శైలిని తీవ్రంగా విమర్శించారు. ‘ట్రంప్ అనుసరిస్తున్న విధానాలు, అతని వ్యవహార శైలిపై ప్రపంచమంతా స్పందించాల్సిన అవసరముంది. ఎందుకంటే ట్రంప్ తనకున్న పిచ్చితనంతో మొత్తం భూగోళాన్నే సమూలంగా నాశనం చేసే ప్రమాదముంది.’ ఆమె అన్నారు. ఇప్పటికైనా ప్రపంచదేశాలన్నీ మేల్కోవాలి, సమయం పెద్దగా లేదు.. అందరూ కలిసికట్టుగా ట్రంప్‌ను నిలువరించాలని ప్రపంచానికి ఆమె సూచించారు. -
‘సాహసాన్ని’ చంపేశారు..
ప్రాణం అంటే అతనికి లెక్కలేదు. పోరాటం అంటే వెనక్కి తిరిగే అలవాటూ లేదు. సామ్రాజ్య వాదానికి వెన్ను చూపించే తత్వం అంత కన్నా కాదు. విప్లవానికే ఓ కొత్త పాఠంగా నిలిచాడు. యుద్ధానికి భయం నేర్పాడు. అతడే ప్రపంచ విప్లవకారుడు చే గువేరా. కాని సామ్రాజ్యావాదాన్ని గడగడలాడించిన ‘చే’ ఎక్కువ రోజులు బతకలేకపోయాడు. అమెరికా ఆధిపత్యానికి సవాలుగా మారిన చే గువేరా మరణం వెనుక అనేక కుట్రలు, కుతంత్రాలు దాగి ఉన్నాయి. ప్రజానేతగా ఎదిగి ప్రభుత్వాలకు ముచ్చెటములు పట్టించిన చే గువేరా మరణం గురించి నేటి ‘బిలీవ్’ లో తెలుసుకుందాం! అది 1967 అక్టోబర్ 9.. వల్లెగ్రాండె, బొలీవియా. సామ్రాజ్య వాద వికృత రూపం విరుచుకుపడింది. పోరాటానికే పాఠాలు నేర్పిన వీరుడి చరిత్ర కాల గర్భంలో కలిసిపోయింది. ప్రపంచమంతా స్వేచ్చా వాయువులు పీల్చాలని కోరుకున్న గొంతు మూగబోయింది. ఆర్మీ జరిపిన కాల్పుల్లో విప్లవ వీరుడు చే గువేరా చనిపోయినట్లు బొలీవియా ప్రభుత్వం ప్రకటించింది. కాని నిర్జీవంగా పడి ఉన్న చే గువేరా దగ్గరకు రావడానికి కూడా ఏ ఒక్క సైనికుడు ధైర్యం చేయలేదు. ఎవరీ ‘ చే ’.. చే గువేరా 1928 జూన్ 14న అర్జెంటీనాలోని రోసారియోలోని ఓ ఉన్నత కుటుంబంలో జన్మించాడు. చిన్న నాటి నుంచే విపరీతంగా పుస్తకాలు చదివేవాడు. అందులోనూ సాహసగాధలంటే ఎంతో ఇష్టపడేవాడు. ఇంజిన్ అమర్చిన సైకిల్ మీద అర్జెంటీనా అంతా ప్రయాణం చేసి ప్రజల జీవన విధానాలను మనసుతో చూశాడు. ప్రజలు పడుతున్న బాధలను శాశ్వతంగా రూపుమాపాలని వైద్య విద్యను చదివాడు. అనారోగ్యంతో బాధపడేవారి జీవితాల్లో వెలుగునింపాలని ఆలోచించేవాడు. చివరగా డాక్టర్ డిగ్రీ చేతికి రాగానే ప్రజలకు సేవ చేస్తూ మళ్లీ దేశమంతటా యాత్ర చేశాడు. అక్కడి నుంచి లాటిన్ అమెరికా వెళ్లాడు. గెరిల్లా నాయకుడిగా..! లాటిన్ అమెరికాలోనూ ప్రజల దుర్భర జీవితాలను గమనించిన చే వారి బతుకులు మార్చడంకోసం ఏ వైద్యం చేయగలం, ఏ మెడిసిన్ ఇవ్వగలం అంటూ మదనపడుతున్న సమయంలోనే 1955 మెక్సికోలో క్యూబా ప్రవాస విప్లవకారుడు ఫీడల్ కాస్ట్రోతో పరిచయం ఏర్పడింది. క్యూబా విప్లవంలో డాక్టర్‌గా చేరాడు. అనంతరం దోపిడీకి గురవుతున్న ప్రజలకు విప్లవాత్మక మెడిసిన్ అవసరమని భావించి విప్లవకారుడిగా పరిణితి చెంది విప్లవ గెరిల్లా దళానికి నాయకుడయ్యాడు. క్యూబా స్వాతంత్య్రం కోసం అస్తమా వ్యాధిని సైతం లెక్కచేయకుండా చే నిజమైన గెరిల్లా నాయకుడయ్యాడు. సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా..! 1959లో క్యూబా స్వాతంత్య్రం రావడంతో అక్కడి ప్రభుత్వంలో చే గువేరా పరిశ్రమల మంత్రిగా, జాతీయ బ్యాంకు అధ్యక్షుడిగా, ప్రణాళిక సంఘం అధ్యక్షుడి వంటి ఎన్నో బాధ్యతలను నిర్వహించాడు. క్యూబా ఒక్క దేశాన్ని విముక్తి చేసినంత మాత్రానా సామ్రాజ్యవాదం అంతరించిపోయిందనుకోవడం సరైంది కాదని అన్ని దేశాలను దీని నుంచి విముక్తి కలిగించాలనుకున్నాడు. వెంటనే అక్కడ తనకున్న అన్ని పదువులను వదిలేసి తను అత్యంత ఇష్టపడే స్నేహితుడు కాస్ట్రో, క్యూబా ప్రజలకూ వీడ్కోలు పలికి ప్రపంచ దేశాలను తిరగడం మొదటుపెట్టాడు. అనంతరం కమ్యూనిస్టు గెరిల్లా్ల దళాన్ని స్వయంగా తయారు చేసుకుని విప్లవోద్యమాన్ని నిర్మించి నాయకత్వం వహించాడు. కాంగో ప్రజలకు బాసటగా..! ఆఫ్రికా చీకటి ఖండంగా మారడానకి కారణం..సామ్రాజ్యవాద శక్తులే కారణమని భావించిన చే కాంగో వెళ్లి పోరాటం మొదలుపెట్టాడు. కాని ఇక్కడ చే వేసే ప్రతి అడుగును అమెరికా పసిగట్టింది. ఎలాగైనా చే ను ఆపకుంటే ప్రపంచాన్నంత విప్లవబాటలోకి తీసుకెళ్తాడని భావించింది. ఈ సమయంలోనే కాంగో తిరుగుబాటుదారుల నుంచి చే కు అనుకున్నంత మద్దతు లభించలేదు. కాంగో నుంచి బయటకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. క్యూబా వెళ్లాలనుకున్నా అక్కడ క్యాస్ట్రో అప్పటికే చే పై చెడు ప్రచారం ప్రారంభించాడు. దీంతో అక్కడి నుంచి బొలీవియా చేరుకుని అమెరికా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాలని నిర్ణయించుకున్నాడు. రహస్య ఆర్మీతో..! తన విప్లవ మేధస్సుతో 50 మంది గెరిల్లాలతో 1800 మంది కలిగిన బొలీవియా నియంత సైన్యాలను గడగడలాడించాడు. అమెరికా ప్రభుత్వ సామ్రాజ్యవాద శక్తులతో ప్రజలను ఎలా హింసిస్తుందో వివరించే ప్రయత్నం చేశాడు. కాని ముందుగానే పసిగట్టిన అమెరికా బొలీవియన్ ఆర్మీలో రహస్యంగా.. చే ను చంపేందుకు ఓ వింగ్‌ను ఏర్పాటు చేసింది. చే బతికి ఉంటే తమ ప్రయోజనాలను దెబ్బ తీస్తాడని ఎలాగైనా చే ను అంతమొందించాలని ఆర్మీకీ సంకేతాలు పంపింది. 1967 అక్టోబర్ 7న తిరుగుబాటు దారులతో కలిసి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించాలని ఓ రహస్య సమావేశాన్ని చే నిర్వహించాడు. ఈ సమావేశాన్ని ముందుగానే గమనించిన ఆర్మీ అక్కడికి చేరుకుంది. చే ను టార్గెట్ చేస్తూ కాల్పులు ప్రారంభించింది. మోకాళ్లకు తగిలిన బుల్లెట్లతో చే ముందుకు నడవలేకపోయాడు. విల్లీ అనే గెరిల్లా చే ను భుజాలపై ఎత్తుకొని పరిగెత్తుతుండగా ఆర్మీ చుట్టుముట్టి వారిని ప్రాణాలతో పట్టుకుని రహస్య ప్రదేశానికి పంపింది. కాని అమెరికా ప్రభుత్వం చే ను చంపకుంటే విప్లవం పెరిగిపోతుందని బొలీవియా సహా పలు దేశాలను సంకేతాలు పంపింది. దీంతో బొలీవియన్ ప్రెసిడెంట్ రెయిన్ బారియంట్.. చే ను చంపాలని ఆర్మీనీ ఆదేశించాడు. దీంతో రహస్య ప్రదేశంలో ఉన్న చే, విల్లీల దగ్గరకు ఓ సైనికుడు కాల్పులు జరిపేందుకు వచ్చాడు. కాని చే ను చూడగానే గడగడ వణికిపోయాడు. నన్ను చంపు అంటూ చే గర్జిండంతో భయపడిన..సైనికుడు వెంటనే తన వద్ద ఉన్న రైఫిల్‌తో కాల్పులు జరిపాడు. అంతే ఒక్కసారిగా చే విప్లవం విజయం సాధిస్తుందని నినాదం చేస్తూ ప్రాణాలు విడిచాడు. అంతే ఇక ఆ విప్లవ యోధుడి జీవితం అర్థాంతరంగా ముగిసింది. –సాక్షి, స్కూల్ ఎడిషన్ -
‘చే’ను చెరిపేయడం సాధ్యమేనా?
కోచి: ఎర్నెస్టో చే గువేరా...పేరు వింటేనే ఒంటిపై రోమాలు నిక్కబొడుచుకుంటాయి. అర్జెంటీనాలో పుట్టి క్యూబా విప్లవంలో చురుగ్గా పాల్గొని బొలీవియాలో అమెరికా మూకల చేతుల్లో మరణించిన ఆయన విప్లవానికే చిహ్నంగా చరిత్రలో నిలచిపోయారు. ప్రపంచ దేశాల్లోనే కాకుండా భారత్‌లో కూడా యువతకు, ముఖ్యంగా మార్క్సిస్టు భావాజాలాన్ని విశ్వసించే యువకులకు ఆయనెంతో ఆదర్శం, స్ఫూర్తి. దేశంలో తొలి కమ్యూనిస్టు రాష్ట్రమైన కేరళలో యువతకు ‘చే’ అంటే దైవంతో సమానం. 1970 దశకంలో కేరళ కాలేజీ గోడలపైనా, ప్రభుత్వ భవనాలపైనా, బిల్ బోర్డులపైనా ఎక్కడ చూసినా చే బొమ్మలు, పెయింటింగ్స్ కనిపించేవి. ఆ నాటి స్థాయిలో కాకపోయినా అవి ఇప్పటికీ కనిపిస్తాయి. రాష్ట్రవ్యాప్తంగా ‘చే’ పేరుతో అనేక క్లబ్బులు కూడా నడుస్తున్నాయి. 40 మంది యువతతో ఏర్పడిన ‘చే గువేరా బాయ్స్’ అనే సంస్థ క్యాన్సర్ రోగులకు ఆర్థిక సహాయాన్ని అందజేస్తోంది. పేద విద్యార్థులకు ఫీజులు కడుతోంది. చే పట్ల యువతలో ఉన్న ఆరాధన భావనను సొమ్ము చేసుకునేందుకు చే బొమ్మలతో టీ షర్టులు, కీ చైన్లు, చొక్కా బ్యాడ్జీలు మార్కెట్లోకి వచ్చాయి. ఆఖరికి చెప్పులు కూడా వచ్చాయి. ‘డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా’ సభ్యులు చే పాదరక్షకుల షాపులపై దాడులు జరిపి ధ్వంసం చేశారు. వామపక్షాల ప్రాబల్యం ఎక్కువగానున్న కేరళలో పాగా వేసేందుకు భారతీయ జనతా పార్టీ ఎన్నో ఏళ్లుగా ప్రయత్నిస్తున్నప్పటికీ ఫలితం లేకుండా పోతోంది. గత ఎన్నికల్లోనే ఒక్క సీటుతో బోణి కొట్టింది. చేగువేరా లాంటి వ్యక్తుల భావాజాలంలో పడిపోవడం వల్లనే యువతను తమ పార్టీవైపు ఆకర్షించలేక పోతున్నామని బీజేపీ, దాని అనుబంధ విద్యార్థి సంఘమైన ఏబీవీపీ భావించింది. అందుకనే కేరళలో ఎక్కడా చేగువేరా బొమ్మలు కనిపించకుండా చెరిపేయాలని కేరళ బీజేపీ శాఖ ప్రధాన కార్యదర్శి ఏఎన్ రాధాకృష్ణన్ తాజాగా పిలుపునిచ్చారు. కమ్యూనిస్టు భావాజాలం ఎక్కువగా ఉన్న కేరళలో తమ భావజాలాన్ని తీసుకరావడం కోసం బీజేపీ మొదటి నుంచి ప్రయత్నిస్తూనే ఉంది. 1928లో మరణించిన ప్రముఖ సామాజిక సంస్కర్త నారాయణ గురును హిందూ సాధువుగా ముద్రవేసేందుకు గత సెప్టెంబర్‌లో ప్రయత్నించి విఫలమైంది. అంతకుముందు కేరళ పంటల పండుగ ‘ఓనం’ను విష్ణుమూర్తి అవతారమైన వామనుడి ‘పుట్టిన రోజు’గా జరిపేందుకు కూడా విఫలప్రయత్నం చేసింది. ‘హాపీ వామన జయంతి’ అంటూ గతేడాది పండుగ రోజున బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా పంపిన సందేశంపై కేరళ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన ప్రదర్శనలు జరిపారు. చేగువేరా పేరు, బొమ్మ తప్ప ఆయన గురించి ఏమీ తెలియని నేటి యువతరం ఆయన గురించి తెలుసుకునేందుకు బీజీపీ పిలుపు దోహద పడుతుందని ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అప్పుకుట్టన్ వల్లికున్ను వ్యాఖ్యానించారు. గోడలపై చే బొమ్మలను చెరిపేసినంత మాత్రాన తమ గుండెల్లో భద్రంగా దాచుకున్న ‘చే’ను ఎవరూ చెరిపేయలేరని మార్క్సిస్టు పార్టీ కార్యకర్తలు వ్యాఖ్యానిస్తున్నారు. అవసరమైతే బీజేపీ ప్రయత్నాలను గట్టిగానే అడ్డుకుంటామని హెచ్చరించారు. ఆరెస్సెస్, వామపక్ష పార్టీల మధ్య జరిగిన సంఘర్షణల్లో వందలాది మంది మరణించిన చరిత్ర కలిగిన కేరళ రాష్ట్రంలో దారులు వేరైనా రక్తధారాలకు ఆస్కారం ఇవ్వరాదన్నది ప్రజాస్వామ్య వ్యవస్థలో మౌలిక సూత్రం కావాలి. –ఓ సెక్యులరిస్ట్ కామెంట్ -
చేగువేరాను ఇండియాకు పంపిన క్యాస్ట్రో!
‘‘జవహర్లాల్ నెహ్రూ నా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించారు’’ అని చెప్పేవారు ఫిడెల్ క్యాస్ట్రో. 1960లో జరిగిన ఐక్యరాజ్యసమితి సమావేశాల్లో పాల్గొనడానికి న్యూయార్క్ వెళ్లిన క్యాస్ట్రోను అదే సమావేశానికి హాజరైన నెహ్రూ, క్యాస్ట్రో బస చేసిన చోటుకు వెళ్లి మరీ కలిశారు. అప్పుడు క్యాస్ట్రో వయసు 34 ఏళ్లు. అనుభవం లేదు. అంతర్జాతీయ సమావేశంలో పాల్గొనటానికి ముందున్న టెన్షన్ ఉంది. అలాంటి సమయంలో నెహ్రూ చూపిన ఆత్మీయతను తాను ఎన్నటికీ మరవలేనని అనేవారు క్యాస్ట్రో. నెహ్రూ మీదే కాదు, భారత్ అన్నా కూడా క్యాస్ట్రోకు ఎంతో అభిమానం. క్యూబాలో క్యాస్ట్రో పాలన మొదలయ్యాక, ఆ ప్రభుత్వాన్ని గుర్తించిన తొలి దేశాల్లో ఇండియా ఒకటి. అందుకే భారత్‌తో సంబంధాన్ని బలోపేతం చేసుకునే దిశగా చేగువేరాను ఇండియాకు పంపారు క్యాస్ట్రో. అలా రెండు వారాల పర్యటన నిమిత్తం చే బృందం 1959లో ఇండియా వచ్చింది. అందులో చేతో పాటు మరో ఆరుగురు– ఒక ఆర్థికవేత్త, ఒక మ్యాథమెటీషియన్, విప్లవబృందంలో పనిచేసిన ఒక కెప్టెన్, రేడియో బ్రాడ్‌కాస్టర్, ఒక బాడీగార్డు– ఉన్నారు. వాళ్లు జూన్ 30న పాలం విమానాశ్రయంలో దిగారు. తెల్లారి తీన్ మూర్తి భవన్లో నెహ్రూను కలిశారు. ఇరు దేశాల్లో దౌత్య కార్యాలయాలను నెలకొల్పుకోవడం గురించీ, పరస్పర వాణిజ్యాన్ని పెంపొందించుకోవడం గురించీ చర్చించారు. సమావేశానంతరం నెహ్రూ, ఏనుగు దంతం పిడివున్న ఒక కత్తిని చేకు బహూకరించారు. క్యూబా రాజధాని హవానాలోని చే మ్యూజియంలో ఇప్పటికీ అది భద్రంగా ఉంది. 1960లో హవానాలో భారత్ తన దౌత్యకార్యాలయాన్ని ప్రారంభించింది. ఇరు దేశాలూ ఎన్నో అంశాల్లో పరస్పరం సహకరించుకున్నాయి. 1990ల్లో క్యూబాలో ఆర్థిక సంక్షోభం తలెత్తినప్పుడు భారత్ పది వేల టన్నుల గోధుమలూ, మరో పదివేల టన్నుల బియ్యమూ పంపింది. 2008లోనూ గుస్తావ్ తుఫాను క్యూబాను అల్లకల్లోలం చేసినప్పుడు భారత్ 20 లక్షల డాలర్ల ఆర్థిక సాయం అందించింది. అలాగే, భద్రతాసమితిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వాన్ని ఇవ్వాలన్న విషయంలో క్యూబా మొదటినుంచీ మద్దతునిస్తోంది. -
విప్లవ సింహం
-
నా చివరి ఆలోచనలన్నీ ఈ విప్లవ వీరులతోనే..
‘‘క్యూబాకు సంబంధించి అన్ని బాధ్యతల నుంచి విముక్తం అవుతున్నానని మరోసారి చెబుతున్నా... ఇంకో దేశంలో... మరో ఆకాశం నీడన అంతిమఘడియలు సమీపిస్తే... నా చివరి ఆలోచనలన్నీ ఈ దేశ విప్లవ వీరులతోనే ముఖ్యంగా నీ ఆలోచనలతో ముప్పిరిగొంటాయి. నీవు నేర్పిన పాఠాలు.. అందరికీ ఆదర్శంగా నిలిచిన నీ వ్యక్తిత్వాన్ని చివరి వరకూ గుర్తుంచుకుంటా. అంతే బాధ్యతతో మెలుగుతా. నా జీవితం ఎక్కడ అంతమైనప్పటికీ క్యూబా విప్లవకారుల్లో ఒకడిగానే బాధ్యతగా వ్యవహరిస్తా.. నడుచుకుంటా కూడా. భార్య, పిల్లల కోసం ఏమీ వదిలివెళ్లడం లేదు. ఇందుకు బాధ ఏమీ లేదు సరికదా... ఆనందంగా ఉంది. రాజ్యం (క్యూబన్ ప్రభుత్వం) ఎలాగూ వాళ్ల జీవనానికి, విద్యాబుద్ధులు నేర్పించడానికి తగినంత చేస్తుంది కాబట్టి.. వాళ్లకు అది చేయమని, ఇది చేయమని కూడా నేను కోరదలచుకోలేదు.’’ - ఫిడెల్ క్యాస్ట్రోకు క్యూబా విప్లవ వీరుడు చే గువేరా రాసిన ఉత్తరంలో ఒక భాగం (క్యూబాను వదిలి లాటిన్ అమెరికా దేశాల్లో విప్లవ మార్గాన్ని వేసేందుకు బొలివియా వెళ్లిపోతున్న సందర్భంగా చే గువేరా రాసిన ఉత్తరంలో ఓ భాగం) -
విప్లవ నేతకు జనసేన సెల్యూట్
హైదరాబాద్: క్యూబా విప్లవయోధుడు, కమ్యూనిస్టు నాయకుడు ఫిడెల్ క్యాస్ట్రో మృతిపై జనసేన అధినేత, నటుడు పవన్ కళ్యాణ్ ట్విట్టర్లో స్పందించారు. మహా నేత ఫెడల్ క్యాస్ట్రో నేడు ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్లారు. ప్రజల్లో స్పూర్తిని నింపిన నాయకుడికి జనసేన సెల్యూట్ చేస్తోందని పేర్కొన్నారు. తాము అమితంగా ఆరాధించే చెగువేరాతో కలిసి పోరాడిన ఫెడల్ క్యాస్ట్రోను ఎప్పటికీ గుర్తుంచుకుంటామని తెలిపారు. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నాము. ఫిడెల్ క్యాస్ట్రో ప్రవేశ పెట్టిన అనేక కార్యక్రమాల్లో ముఖ్యంగా క్యూబన్ల ప్రజారోగ్యం కోసం ఎంతగానో కృషి చేశారని పవన్ కొనియాడారు. The Great Leader ' Fidel Castro' has departed from this world today.'JanaSena' salutes the inspiring leader. — Pawan Kalyan (@PawanKalyan) November 26, 2016 Amongst his many initiatives he has also ensured that Cuba will be lauded for its exemplary health care system. — Pawan Kalyan (@PawanKalyan) November 26, 2016 We remember him for his Great journey with 'Che Guevara' whom I adore and respect. May his Soul rest in Peace.. — Pawan Kalyan (@PawanKalyan) November 26, 2016 -
విప్లవ పోరాటంలో ఫెడల్ క్యాస్ట్రో - చేగువేరా..
సరైన ఆలోచన ఎంత ముఖ్యమో దానిని పక్కాగా అమలుచేయడమూ అంతే ప్రధానం. ఇక సాయుధపోరాటంలో ఎత్తుగడలకు ఎంత ప్రాధాన్యం ఉంటుందో తెలిసిందే. క్యూబా విప్లవ పోరాటంలో ఫెడల్ క్యాస్ట్రో ఆలోచన అయితే అతని అమ్ములపొదిలోని ప్రధాన ఆయుధం చేగువేరా. ఎక్కడో పుట్టి, పరాయి దేశంలో సమసమాజ స్థాపన కోసం తుపాకి పట్టిన చేగువేరాకు, అతని పరాక్రమానికి ఎల్లవేళలా ప్రోత్సాహం ఇస్తూ విప్లవాన్ని విజయవంతం చేయడంలో ఫెడెల్ క్యాస్ట్రో అనుసరించిన తీరు చరిత్రలో అరుదైన ఘట్టం. 1950 దశకం నుండి క్యూబాలో అమెరికా అనుకూల బటిస్టా ప్రభుత్వాన్ని పడగొట్టాలనే ప్రయత్నాలు ఆరంభమయ్యాయి. చెరుకు రైతులతోపాటు సాధారణ ప్రజల జీవితాలనూ పీల్చి పిప్పిచేస్తూ నాటి ప్రభుత్వంపై ప్రజల్లో గూడుకట్టుకున్న ఆవేశాన్ని విప్లవానికి అనుకూలంగా మలచడంలో ఫెడల్‌కు చేగువేరా అందించిన సహకారం అనిర్వచనీయం. 1956లో ఫిడెల్ క్యాస్ట్రో తన 80 మంది అనుచరులను ‘గ్రాన్మా’ నౌకలో తీసుకొనిపోయి బటిస్టా ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఒక విఫల ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నమే తర్వాతి రెండేళ్ళ కాలంలో విప్లవంగా మారిపోయింది. బృందాలుగా విడిపోయిన విప్లవ సైన్యాలు.. తాము ప్రయాణించే మార్గంలో తారాసపడే గ్రామాలకు వెళ్లి, రైతులు, కూలీలతో సమావేశాలు నిర్వహించేవారు. వాళ్లని పోరాటానికి ఉద్యుక్తుల్ని చేసేవారు. వైద్యుడిగా ఫెడల్ విప్లవ సైన్యంలో చేరిన చేగువేరా.. మాక్సిజం, లెనినిజంల పంథాను సహచరులకు మరింత అర్థమయ్యేలా వివరించేవాడు. అతనిలోని బోధకుడిని గుర్తించిన ఫెడల్.. రైతులు, కూలీలతో నిర్వహించే సమావేశాల్లో చేగువేరాను మాట్లాడాల్సిందిగా ప్రోత్సహించేవాడు. దోపిడి, తిరుగుబాటు, పోరాటం, విప్లవం, సమానత్వం, కమ్యూనిజం, సోషలిజం.. ఒక్కటేమిటీ అన్ని అంశాలను పామరుడికి సైతం అర్థమయ్యేలా వివరించడం, యుద్ధక్షేత్రంలో ఏమాత్రం బెరుకులేకుండా దూసుకెళ్లడం చేగువేరా సహజనైజం. చే విధానాలకు ఏనాడూ అడ్డుచెప్పని ఫెడల్.. చివరికి గువేరా క్యూబాను విడిచిపెట్టాలనుకున్నప్పుడు కూడా అదేపని చేశాడు. తనలా చేగువేరా ఒక దేశానికే పరిమితమైపోయేవాడు కాదు.. ‘ప్రపంచ పోరాట యోధుడు’ అని అందరికన్నా ముందు గుర్తించింది ఫెడల్ క్యాస్ట్రోనే. చేగువేరా 1928 జూన్ 14న అర్జెంటీనాలోని రొసారియోలో జన్మించాడు. రచయితగా, గెరిల్లా యుద్ధ వీరుడిగా ప్రసిద్ధిపొందిన చేగువేరా మోటర్ బైక్‌పై వివిధ దేశాలు తిరుగుతూ ప్రజల అవస్థలు చూసి తల్లడిల్లిపోయాడు. మెక్సికోలో రావుల్ క్యాస్ట్రో, ఫెడైల్ క్యాస్ట్రోలను కలుసుకున్నాడు. ప్రసిద్ధ ‘జూలై 26 విప్లవం’లో పాల్గొన్నాడు. ఆ తర్వాత క్యూబా చేరుకున్నాడు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గెరిల్లా యుద్ధం చేశాడు. ఫిడెల్ క్యాస్ట్రోతో కలిసి క్యూబా దేశంలో కమ్యూనిస్ట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలకపాత్ర పోషించాడు. విప్లవం విజయవంతం అయిన తర్వాత ప్రధాని హోదాలో ఫెడల్ క్యాస్ట్రో.. క్యూబాకు ఆయువుపట్టైన చక్కెర, పరిశ్రమల శాఖకు చేగువేరాను మంత్రిగా నియమించాడు. ప్రస్తుతం క్యూబా ప్రపంచ చెక్కెర గిన్నె(సుగర్ బౌల్ ఆఫ్ ది వరల్డ్)గా వెలుగొందుతున్న సంగతి తెలిసిందే. విప్లవం అనంతరం ఒక దేశంగా క్యూబా మనుగడ సాధించాలంటే ప్రపంచంలోని మిగతా దేశాలతో(ఒక్క అమెరికాతో తప్ప) సఖ్యత అత్యవసరమైంది. ఆ బాధ్యతను కూడా ఫెడల్ క్యాస్ట్రో.. చేగువేరాకే అప్పగించాడు. క్యూబా విదేశాంగ మంత్రి హోదాలో చే.. భారత్ సహా రష్యా, శ్రీలంక, జపాన్, చైనా తదితర దేశాల్లో పర్యటించి, కీలకమైన ఒప్పందాలు కుదుర్చుకుని క్యాస్ట్రో నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. అయితే అధికార నిర్వహణ కంటే విప్లవం పురుడుపోసుకుంటున్న మిగత లాటిన్ అమెరికా, ఆఫ్రికన్ దేశాలకు తన సేవలు అవసరమని భావించిన చేగువేరా క్యూబా విడిచి బొలీవియా వెళ్లాలనుకున్నాడు. నిజానికి చేగువేరా లాంటి తురుపుముక్కను వదులుకోవడానికి ఏ రాజనీతిజ్ఞుడూ సిద్దపడడు. కానీ అది విప్లవ పోరాటం. అక్కడ వ్యక్తిగత స్నేహాలకు తావులేదు. అందుకే దేశాధినేతగా కాకుండా ప్రియమైన స్నేహితుణ్ని పూర్తిగా అర్థం చేసుకున్న వ్యక్తిగా ఫెడల్ క్యాస్ట్రో.. చేగువేరాకు వీడ్కోలు పలికాడు. బొలీవియాలో ప్రభుత్వ సేనలతో పోరాడుతూ 1967 అక్టోబర్ 9న చే మరణించాడు. -
పవన్.. చేగువేరా మాటలు చెప్పలేదు
సాక్షి, విశాఖపట్నం: ప్యాకేజీ సోమ్మును పంచుకునేందుకే టీడీపీ, బీజేపీలు హోదా డిమాండ్ ను తుంగలోతొక్కాయని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. ఇప్పుడు ప్యాకేజీ సరిపోతుందంటున్న నేతలు.. విభజన సమయంలో ఐదేళ్లుకాదూ పదేళ్లు ప్రత్యేక హోదా కావాలని ఎందుకు అడిగినట్లో? అని ప్రశ్నించారు. కేంద్ర మంత్రివర్గంలో కొనసాగుతూ టీడీపీ హోదా సాధించలేదని వ్యాఖ్యానించారు. విశాఖపట్నంలో ఆదివారం విలేకరులతో మాట్లాడిన ఆయన జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదా విషయంలో పవన్ కల్యాణ్ కేవలం మాటలతో సరిపెట్టకుండా ఏదోఒకటి చేతల్లో చేసి చూపించాలని రాఘవులు సూచించారు. ‘చేగువేరా గురించి ఆయన తరచూ ప్రస్తావిస్తాడు. ప్రశంసిస్తాడు. పవన్.. చేగువేరా మాటలు చెప్పలేదు. తుపాకీతో సాయుధ పోరాటం చేశాడు. నువ్వు(పవన్) కూడా తుపాకి పట్టుకోమని మేం చెప్పం. అయితే రాజ్యాంగ పరిధిలో ప్రజల పక్షాన ఆందోళనలు చేయాలి’ అని రాఘవులు అన్నారు. హోదా రాకపోతే ఏపీలో టీడీపీ, బీజేపీలకు నూకలుండవని జోస్యం చెప్పారు. అమరావతి చుట్టూనే అభివృద్ధి రాష్ట్ర విభజన జరిగాక సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని పట్టించుకోకుండా అమరావతి చుట్టూనే అభివృద్ధిని కేంద్రీకరిస్తున్నారని రాఘవులు విమర్శించారు. గతంలో రాష్ట్ర విభజనకు అదే దారితీసిన విషయాన్ని విస్మరిస్తూ మళ్లీ అదే తప్పునే చేస్తున్నారన్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమను నిర్లక్ష్యం చేస్తే మళ్లీ అలాంటి ఉద్యమమే పునరావృతమవుతుందని హెచ్చరించారు. ఏయూ ప్లాటినం జూబ్లీ హాలులో ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక నిర్వహించిన సదస్సులో ఆయన ప్రసంగించారు. రాయలసీమ వెనకబాటుకు భౌతిక కారణం ఉందని, కానీ ప్రకృతి వనరులున్నా ఉత్తరాంధ్ర వెన కబడి ఉండటానికి పాలకుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. -
కేరళలోని ఓ ఇంట్లో కాస్ట్రో, చే, వాలెంతీనా
తిరువనంతపురం: కేరళలోని తిరువనంతపురంలో ఓ ఇంట్లో ఫిడెల్ కాస్ట్రో, చే గువేరా, వాలెంతినా తెరిస్కోవా పుట్టి పెరిగారంటే అదేమిటంటూ అందరికి ఆశ్చర్యం వేస్తుంది. పుట్టి పెరిగిందీ ప్రపంచ ప్రసిద్ధి చెందిన ప్రముఖ విప్లవకారులు కాదు. మనలాంటి మామూలు మనుషులే. వారికి ఇలాంటి పేర్లు పెట్టారంటే ఆ తండ్రి ఏ పార్టీకి చెందిన వారో ఊహించడం కష్టమేమి కాదు. చివరి వరకు కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని నమ్ముకొని బతికిన జీ. మణియన్. సోవియట్ యూనియన్ విరాజిల్లుతున్న రోజుల్లో, క్యూబా అధ్యక్షుడిగా ఫిడెల్ కాస్ట్రో అమెరికాను గడగడలాడిస్తున్న రోజుల్లో పిల్లలకు ఇలాంటి పేర్లు పెడితే ఎవరూ ఆశ్చర్యపోయి ఉండేవారు కాదు. 1990 దశకంలో పుట్టిన వారికి ఇలాంటి పేర్లు పెట్టడం విచిత్రమే కాకుండా సాహసం కూడా. చే గువెరా తిరువనంతపురంలోని కజాకొట్టం ప్రభుత్వ స్కూల్లో 11వ తరగతిలో చేరినప్పుడు ఆయన పేరు విన్న టీచరు పొట్ట చెక్కలయ్యేలా నవ్వారట. విద్యార్థుల పరిచయ కార్యక్రమంలో చే గువెరా తన పేరు చెప్పినప్పుడు ఓ లేడీ టీచర్ ఏంటీ అంటూ, తొలుత సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారట. మళ్లీ పేరు చెప్పుమని అడగ్గా చే గువేరా అని చెప్పడంతో ఆమె తన నవ్వు ఆపుకోలేకపోయారు. అన్నదమ్ములైన కాస్ట్రో, చే, చెల్లెలు వాలెంతీనా పేర్లు విన్నప్పుడు కొత్త వారు వింతగా చూసేవారట. పేర్లకు తగ్గంటే అన్నదమ్ములిద్దరూ విద్యార్థి దశ నుంచే ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. కాలేజీల్లో కూడా పలు ఉద్యమాలు చేశారు. తండ్రి తన పిల్లలను ఇతర పార్టీ నాయకులకు పరిచయం చేసినప్పుడు ‘ఎంత ధైర్యం’ అంటూ వారు విస్తుపోయేవారట. చే గువేరా ఉద్యోగం కోసం ఓ ప్రైవేటు కంపెనీకి వెళ్లినప్పుడు వింత అనుభవం ఎదురైందట. ఇంటర్వ్యూలో పేరు విన్న వెంటనే నిర్వాహకులు విస్తుపోయారట. ఉద్యోగం ఇస్తే కంపెనీలో సమ్మెలు చేస్తావా? అని కూడా ప్రశ్నించారట. ఉద్యోగుల హక్కుల పరిరక్షణ కోసం అవసరమైతే చేస్తానని కూడా చెప్పారట. అయినా ఉద్యోగం ఇచ్చారట. స్థానిక ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రి ల్యాబ్‌లో టెక్నీషయన్గా పని చేస్తున్న కాస్ట్రోను మాత్రం అందరూ గ్యాస్ట్రో అనుకొని పొరపాటు పడతారట. ఇక వాలెంతీనా తెరిస్కోవా పేరు గురించి అందరికి పెద్దగా తెలియదుగనుక ఏమనే వారు కాదటగానీ వింత పేరని ఆశ్చర్య పోయే వారట. ప్రపంచంలోనే మొట్టమొదట రోదసిలో ప్రయాణించిన వ్యోమగామిగానే చరిత్ర సృష్టించడమే కాకుండా రష్యా కమ్యూనిస్టు పార్టీలో క్రియాశీలక నాయకురాలిగా వాలంతీనా తెరిస్కోవా పనిచేసిన విషయం తెల్సిందే. -
గాంధీ అసలు పేరు చే గెవెరా..!
తొలి సినిమా వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌తో సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు మేర్లపాక గాంధీ. లాంగ్ గ్యాప్ తరువాత ప్రస్తుతం శర్వానంద్ హీరోగా ఎక్స్‌ప్రెస్ రాజా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. సంక్రాంతి బరిలో భారీ సినిమాలతో ఢీ కొనడానికి రెడీ అవుతున్న గాంధీ, తన పేరుకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ విషయాన్ని బయటపెట్టాడు. ప్రస్తుతం గాంధీగా అందరికీ పరిచయం అయిన ఈ యువ దర్శకుడుకి చిన్నతనంలో పెట్టిన పేరు వేరే ఉందట. అభ్యుదయ భావాలు ఉన్న గాంధీ తండ్రి మేర్లపాక మురళి తన అభిమాన పోరాట యోధుడు చేగువెరా పేరును తన కొడుకు పెట్టాడు. అయితే బంధువులు స్నేహితులు మాత్రం ఆ పేరు పిలవటం సారిగా రాకపోవటంతో చెగు, జగ్గు అని పిలుస్తుండటంతో, 5 ఏళ్ల వయసులో చేగువెరా పేరును గాంధీగా మార్చాడట. అలా ఓ విప్లవకారుడి పేరు, శాంతి కాముకుడిగా పేరుగా మారిపోయింది. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన ఎక్స్‌ప్రెస్ రాజా జనవరి 14న రిలీజ్ అవుతోంది. శర్వానంద్, సురభి జంటగా నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. -
మరణం లేని వీరుడు చేగువేరా
అర్జెంటీనా క్యూబా గుండెల కొండల నడుమ నుంచీ ప్రభవించిన సూర్యగోళం! కొన్ని ప్రమాద విపత్కర సన్నివేశాల్లో నీ సాహసానికి పర్వతాలు సైతం సాగిలపడాల్సిందే ఆస్తమాని -యజమాని మాట వినే పెంపుడు వేటకుక్కే గదా! పాము కుబుసం విడిచినట్టు సామ్రాజ్యవాదుల గుండెల్లో భయం రైళ్లు పరుగెట్టించావ్ క్షతగాత్రులైన వారిని ఆయుధాలుగా మలిచావ్ గెరిల్లా పోరుదారిలో పచ్చ రక్తనాళాల్లో ఎర్రరక్త ప్రవాహాలు పుట్టించావ్ ఏకాకులైన ప్రజలకి నీ ఆత్మీయతను జతచేశావ్ మేం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బ్రతుకుతాం నీకు చావంటే భయంలేదు మరణం అంచున పరిహసిస్తావ్ చావు నీ దగ్గర దగా పడి ముఖం తిప్పుకుంది నీ విషయంలో మృత్యువు వాయిదా పద్ధతిలోకొచ్చింది. మాలో మేం బ్రతుకుతాం నా వృత్తి పిల్లలకు బొమ్మలు నేర్పటం ఏదో నెలకు ఆరు రాళ్లు, పద్దెనిమిది కొమ్ములు... తరువాత నీళ్లొదిలేయటం ఇంతటితో మా తెలుగు సినిమా పూర్తవుతుంది నీ అనన్యత అలాంటిది కాదుగదా చే నువ్వు మరణంలో కూడా ఎదగగలవ్ అందరికీ మేలు చేసే వృత్తివిప్లవకారుడవు నువ్వు నీ త్యాగానికి హద్దులు లేవు, నీ కార్యాలు అల్పమైనవి కావు..యుద్ధంలో వీరుడ్ని చంపలేరు మహా అయితే కుట్రతో తప్ప! జనం అశ్రుధారలతో, జ్వలించే గుండెనెత్తురులతో నీ మరణం ప్రాణప్రతిష్ట పొందింది నువ్వు అమరుడవు నీ అమరత్వం బహు రమణీయం (నేడు చేగువేరా వర్ధంతి సందర్భంగా...) ‘‘సరిశాసి’’ (ఎన్.సర్వేశ్వర్రావ్), కంచికచర్ల, మొబైల్: 9391996005 -
క్యూబా
నైసర్గిక స్వరూపం వైశాల్యం: 1,09,884 చ.కి.మీ. జనాభా: 11,271,819 (తాజా అంచనాల ప్రకారం) రాజధాని: హవానా కరెన్సీ: పెసో ప్రభుత్వం: సింగిల్ పార్టీ స్టేట్ అధికారిక భాష: స్పానిష్, మతం: క్రైస్తవులు వాతావరణం: జనవరిలో 18 నుండి 26 డిగ్రీలు, జూలైలో 24 నుండి 32 డిగ్రీలు పంటలు: చెరకు, వరి, బంగాళదుంపలు, కసావా, మొక్కజొన్న, బత్తాయి. పరిశ్రమలు: వ్యవసాయ ఉత్పత్తులు, గనులు, ఫుడ్‌ప్రాసెసింగ్, పొగాకు ఉత్పత్తులు, ఖనిజాలు, రసాయనాలు, సిమెంటు, ఎరువులు, వస్త్రపరిశ్రమ, చేపలు స్వాతంత్య్రం: నామమాత్రంగా దక్కింది 1902 మే 20న (నిజమైన స్వాతంత్య్రం 1 జనవరి 1959) సరిహద్దులు: చుట్టూ సముద్రమే. అట్లాంటిక్ సముద్రం, గల్ఫ్ ఆఫ్ మెక్సికో, కరేబియన్ సముద్రం. 1. హవానా: కరేబియన్‌లోని ద్వీపదేశమైన క్యూబా రాజధాని హవానా ఒక పెద్ద నగరం. ఇక్కడే సముద్ర తీరం, ఓడరేవు ఉన్నాయి. క్యూబా దేశం పైనుండి చూస్తే రొయ్యలా కనబడుతుంది. నగరంలోనూ, పరిసరాల్లోనూ చూడదగిన వింతలు ఎన్నో ఉన్నాయి. నగరంలో మూడు ఓడరేవులు ఉన్నాయి. అవి మరిమెలెనా, అటారిస్, గ్వాన బాకోవా. నగరంలోని ఓల్డ్ హవానా నగరం పర్యాటకులకు స్వర్గధామం లాంటిది. దీన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటించింది. పాత నగరాన్ని హబామా వీజా అంటారు. వివిధ ఆకృతులలో ఉన్న పాత భవనాలు, క్యాథడ్రమ్లు ఎన్నో ఉన్నాయి. ఇక మధ్య హవానాను సెంట్రోహవానా అంటారు. ఇక్కడ ఉన్న పురాతన భవనాలను జాతీయ సంపదగా ప్రకటించారు. ఇక్కడ పార్క్ సెంట్రల్ జోస్ పార్ట్ విగ్రహం, కాపిటాలియో వీధి, సిగార్ ఫ్యాక్టరీ వీధి ప్రత్యేకంగా ఉన్నాయి. అలాగే నగరంలోని లెడాడో ప్రాంతం మరో ఆకర్షణ. ఇది రాజకీయ నాయకులు, పార్టీలకు గుండె లాంటిది. ఈ ప్రాంతంలోని లారాంపా అనే ప్రదేశంలోనే విప్లవ యోధుడు చేగువేరా స్మారక స్థలం ఉంది. ప్లాజాడిలా రెవెల్యూషన్ ప్రాంతం ఎంతో అద్భుతంగా ఉంటుంది. నగరంలో ఇంకా హవానా విశ్వవిద్యాలయం, ఫోక్సా భవనం ఉన్నాయి. చూడదగిన ప్రదేశాలు: క్యూబా దేశంలో టూరిజం ఒక పరిశ్రమగా వెలుగొందుతోంది. ప్రతి సంవత్సరం దాదాపు మూడు మిలియన్ల పర్యాటకులు క్యూబా దేశాన్ని సందర్శిస్తూ ఉంటారు. క్యూబా రాజధాని హవానా ఒక గొప్ప పర్యాటక నగరం. 2. వరడెరో ఆకర్షణలు: వరడెరో ప్రాంతం క్యూబా దేశంలో ఒక ప్రధాన పర్యాటక స్థలం. సముద్రతీరం, తెల్లటి ఇసుక బీచ్‌లు పర్యాటకులను ఎంతో ఆకర్షిస్తాయి. 1929లో కట్టిన విల్లా క్సనాడు భవనం ఎంతో అద్భుతంగా దర్శనమిస్తుంది. ఇది ఇప్పుడు ప్రభుత్వ అధీనంలో ఉంది. సువిశాలమైన జోసోన్ పార్కును 1940లో నిర్మించారు. ఈ పార్కులో పర్యాటకులకు కావల్సిన అన్ని వసతులు ఉన్నాయి. వరడెరో మ్యూజియంలో పురాతన కాలం నాటి అద్భుత వస్తువులు ఎన్నో ఉన్నాయి. వరడెరోకు ఉత్తరాన నీటి అడుగున పార్కు ఉంది. వాటర్ డ్రైవింగ్, సముద్రపు అడుగుభాగాలను ఈ పార్కులో విహరిస్తూ దర్శించవచ్చు. 3. కామాగ్వే ప్రావిన్స్: క్యూబా దేశంలో మూడో అతిపెద్ద నగరం కామాగ్వే. ఇక్కడ 20 కిలోమీటర్ల పొడవైన సాటాలూసియా బీచ్ ఉంది. పర్యాటకులు ఈత కొట్టడానికి ఈ బీచ్ అనుకూలంగా ఉంటుంది. స్కూబా డ్రైవింగ్‌కు ఈ బీచ్ పుట్టినిల్లు. ఇక్కడే మరో బీచ్ న్యూవిటాస్ బీచ్ కూడా ఉంది. ఇక్కడికి సమీపంలోనే కాయోసబినాల్ కోరర్ ఐలాండ్ ఉంది. ఫ్లెమింగో పక్షులు ఇక్కడ కనువిందు చేస్తాయి. కామాగ్వేకు ఉత్తరంవైపు సియారాడి క్యూబిటాస్ పర్వత శ్రేణి ఉంది. ఇవన్నీ చిన్న చిన్న పర్వత శ్రేణులు. ఈ పర్వతాలలో ఎన్నో గుహలు ఉన్నాయి. 4. సాంటియాగో డి క్యూబా: ఈ నగరం 15వ శతాబ్దంలో నిర్మితమైంది. విశాలమైన కాస్టిల్లో డి సాన్ పెడ్రో డెల్ మొర్రో కోట ఉంది. ఈ కోట ఒక చిన్న కొండ మీద నిర్మించబడింది. మొదట రక్షణ కోసం ఆ తర్వాత జైలుగా ఉపయోగపడింది ఈ కోట. దీనిని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. ఇక్కడ ప్రోవిన్సెయల్ బకార్డె మోరో మ్యూజియం ఉంది. ఇక్కడ చరిత్ర పూర్వపు వస్తువులు, శతాబ్దాల నాటి రాజుల దుస్తులు, ఉపయోగించిన వస్తువులు, ఎన్నో కళాకృతులు ఇక్కడ దర్శనమిస్తాయి. ఈ మ్యూజియమ్‌లో ఈజిప్టు మమ్మీలు, పెరూ మమ్మీలు అమెజాన్ ప్రాంతంలో లభించిన పురాతనకాలపు మానవ పుర్రెలు ఉన్నాయి. ఈ నగరంలోనే ఇంకా కాసా డిడీగో వెలాజ్ క్వెజ్ మ్యూజియం, మ్యాస్ట్రా సెనోరా బాసిలికా చర్చి, అబెల్ సాంటా మోరియా మ్యూజియం, సిమెంటేరియో డి సాంటా ఇఫిజనియా, సెస్పడెస్ పార్కు, ప్లాజాడిలా రెవెల్యూషన్, కార్నివాల్ మ్యూజియం, క్యూర్టెల్ మోన్కాడా మ్యూజియం, ప్లాజామార్టి, విస్టాఅలెగ్రా ఇలా ఎన్నో ప్రదేశాలు, కట్టడాలను ఇక్కడ దర్శించవచ్చు. పరిపాలనా విధానం: దేశాన్ని 16 ప్రావిన్స్‌లుగా, ఈ ప్రావిన్స్‌లను తిరిగి మున్సిపాలిటీలుగా విభజించారు. ఇక్కడ వాతావరణం సమశీతోష్ణంగా ఉండటం వల్ల, పర్యాటకులు ఎక్కువగా సందర్శిస్తుంటారు. దేశంలో 10 నగరాలు ఉన్నాయి. అవి - హవానా, శాంటియాగో డి క్యూబా, కామాగ్వే, హోల్గిన్, శాంటాక్లారా, గ్వాంటనామో, బయామో, విక్టోరియా డి లాస్ టు నాస్, సీన్ ఫ్యూగోస్, మాంజనిల్లో. చరిత్ర: 1492లో క్యూబా దేశాన్ని కొలంబస్ కనుగొన్నాడు. 1512లో క్యూబాను స్పెయిన్ ఆక్రమించుకుంది. 1762లో బ్రిటన్ క్యూబాను తన అధీనంలోకి తీసుకుంది. కొద్దికాలానికే క్యూబా తిరిగి స్పెయిన్ అధీనంలోకి వచ్చింది. 1902 వరకు అమెరికా క్యూబాను ఆక్రమించుకుంది. 1902 తర్వాత క్యూబా స్వతంత్రాన్ని పొందింది. 1961లో క్యూబాను కమ్యూనిస్ట్ దేశంగా ఫిడెల్ క్యాస్ట్రో ప్రకటించాడు. క్యూబాలో సగం జనాభా ఆఫ్రికా, యూరప్ దేశాల మిశ్రమమే. ఫిడెల్ క్యాస్ట్రో, చేగువేరా: 1950 దశకం నుండి క్యూబాలో ప్రభుత్వాన్ని పడగొట్టాలనే ప్రయత్నాలు ఆరంభమయ్యాయి. 1956లో ఫిడెల్ క్యాస్ట్రో తన 80 మంది అనుచరులను తీసుకొని ఒక విఫల ప్రయత్నం చేశాడు. ఈ ప్రయత్నం తర్వాతి రెండేళ్ళ కాలంలో ఒక విప్లవంగా మారిపోయింది. 1958 చివరలో వాళ్ళు శాంటాక్లారాను ఆక్రమించారు. 1959 జనవరిలో రాజధాని నగరానికి ప్రవేశించారు. ఆ తర్వాత మొత్తం దేశాన్ని ఆయన తన అధీనంలోకి తెచ్చుకొని క్యూబా దేశాధ్యక్షుడు అయ్యాడు. దాదాపు 50 ఏళ్లు పరిపాలించి, 2008లో రాజీనామా చేశాడు. చేగువేరా 1928 జూన్ 14న అర్జెంటీనాలోని రొసారియోలో జన్మించాడు. రచయితగా, గెరిల్లా యుద్ధ వీరుడిగా ప్రసిద్ధిపొందిన చేగువేరా వివిధ దేశాలు తిరుగుతూ ప్రజల అవస్థలు చూసి తల్లడిల్లిపోయాడు. మెక్సికోలో రావుల్ క్యాస్ట్రో, ఫెడైల్ క్యాస్ట్రోలను కలుసుకున్నాడు. ప్రసిద్ధ ‘జూలై 26 విప్లవం’లో పాల్గొన్నాడు. ఆ తర్వాత క్యూబా చేరుకున్నాడు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గెరిల్లా యుద్ధం చేశాడు. ఫిడెల్ క్యాస్ట్రోతో కలిసి క్యూబా దేశంలో కమ్యూనిస్ట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలకపాత్ర పోషించాడు. విప్లవవీరుడుగా గుర్తింపుపొందిన చేగువేరా 1967 అక్టోబర్ 9న మరణించాడు. ప్రజలు-సంస్కృతి: 1959 నాటి విప్లవం తర్వాత ప్రజల జీవన విధానం బాగా మారిపోయింది. మహిళలకు పురుషులతో సమానమైన అధికారం, అవకాశం దక్కాయి. చదువు, ఉద్యోగం, వ్యవసాయ పనులు, ఇల్లు - ఇలా అన్ని రంగాలలో మహిళలకు అధికారం, స్వేచ్ఛ లభించాయి. జనాభాలో 35 శాతం మంది స్పెయిన్ దేశానికి చెందినవారు. 10 శాతం మంది ఆఫ్రికన్లు, 50 శాతానికి పైగా స్పానిష్ ఆఫ్రికన్ జాతుల మిశ్రమ జనాభా ఉంది. దేశ జనాభాలో సగం మంది 30 ఏళ్ళలోపు వారే ఉన్నారు. ప్రజలు స్నేహభావంతో ఉండి, సేవ చేయడానికి ముందు ఉంటారు. పండుగలు, సంగీతం, నృత్యం పట్ల మక్కువ ఎక్కువ. ప్రజలు నగరాలు, పట్టణాలలో జీవించడానికి ఇష్టపడతారు. ఆహారం: క్యూబాలో వివిధ సంస్కృతుల ప్రజలు ఉండడం వల్ల వారి ఆహార రీతులు కూడా వేర్వేరుగా ఉంటాయి. అయితే అన్ని ప్రాంతాలలో వరి అన్నం అధికంగా తింటారు. దీనితో పాటు బంగాళదుంప వేపుడు, టమోటా, అవకాడో, లెట్యూస్, గుమ్మడి, క్యారెట్, క్యాబేజీల సలాడ్ కానీ, సూప్ కానీ చేస్తారు. భోజనంతో పాటు బీరు గానీ, వైన్ గానీ తాగుతారు. మాంసపు వంటకాలను చేసుకుంటారు. కోడిగుడ్డు అధికంగా తింటారు. వ్యవసాయం: క్యూబాలో దాదాపు 81 వేల ఎకరాల్లో వివిధ పంటలు పండిస్తున్నారు. క్యూబా దేశం చెరకు, చక్కెరలను అమెరికాకు ఎగుమతి చేస్తుంది. దేశంలో పొగాకు పంట కూడా విరివిగా పండుతుంది. ఒక్క పొగాకు ఉత్పత్తుల ద్వారానే సంవత్సరానికి 200 మిలియన్ల అమెరికా డాలర్ల ఆదాయం లభిస్తుంది. ద్రాక్ష ఉత్పత్తిలో క్యూబా ప్రపంచంలో మూడో స్థానంలో ఉంది. వరి, బంగాళదుంపలు బాగా పండుతాయి. కసావా (ఇది మన మొరంగడ్డల (చిలగడదుంపల) మాదిరిగా ఉంటుంది) 2,60,000 ఎకరాల్లో పండిస్తారు. దాదాపు మూడు లక్షల టన్నుల కసావాను పండిస్తారు. వీటితోపాటు అరటి, మామిడి, బొప్పాయి, అనాస, అవకాడో, జామ, కొబ్బరి కూడా క్యూబాలో అధికంగా పండుతాయి. పరిశ్రమలు: క్యూబాలో ఫార్మాస్యూటికల్స్, చక్కెర పరిశ్రమ ఎక్కువ. ఇక్కడ ఉత్పత్తి అవుతున్న మందులు అనేక దేశాలకు ఎగుమతి అవుతాయి. దేశ ఆర్థికవ్యవస్థలో 37 శాతం విదేశీ మారక ద్రవ్యం వీటి ద్వారా లభిస్తుంది. ఇవిగాక ఇంకా ఇక్కడ చమురు శుద్ధి కర్మాగారాలు, వస్త్ర పరిశ్రమ, బూట్లు, టూత్‌పేస్టులు, సబ్బులు, కార్డ్బోర్డ్ బాక్సుల పరిశ్రమలు కూడా ఉన్నాయి. -
చే గువేరా.. రావాలా?
నయా సీన్: ‘‘అదేంటిసార్... ఇలా చేశారు. పొద్దస్తమానం అటు చేగువేరానూ, ఇటు కొమరం భీమ్‌నూ తలచుకుని, తలచుకుని, కొమరం భీం పేరును కొందరే పేటెంటు చేసుకుని వాళ్ల టెంట్లో ఉంచుకున్నారని కుమిలి కుమిలి, మళ్లీ ఇలా వాళ్ల సిద్ధాంతాలకు పూర్తిగా వ్యతిరేకులైన బాబూ, మోడీలను సమర్థించారేంటిసార్?’’ ‘‘ఒరే బాలూ... నేను మొదట్నుంచీ ఇంతేరా! బాబూ, మోడీల రూటే. కాకపోతే వాళ్లు గడ్డం చేసుకోరూ, నేను చేసుకుంటానంతే తేడా!’’ ‘‘అదేంట్సార్... ఎక్కడైనా పవనం అంటే అది మొదట నైరుతీ నుంచి వీచాలి. ఆ తర్వాత ఈశాన్యం నుంచి వీచాలి. భారత్‌కు వర్షాలనిచ్చే మంచి పవనాలు అవే సార్. అలాంటిది మీరు వాయవ్యం నుంచి గుజరాత్ మీదుగా వీచాలంటున్నారు. మీకో విషయం తెలుసా? భారత్‌లో అలా వీచే పవనాలూ ఉన్నాయి. ఆ వాయవ్యపవనాలను ‘లూ’ అంటారు సార్. అవి వాయవ్య భారతదేశంలో వీస్తూ జనాలకంతా పరమ ఉబ్బరింత కలిగించే భరించలేనంత వేడి వేడి పవనాలు సార్. పోయి పోయి మీరూ జనాల్ని మతం పేరిట వందలాది మందిని ఊచకోత కోసిన భారత వాయవ్య గుజరాతీ పవనాన్నే ఆశ్రయించారు. ఆ పవన ధర్మం, మీ పేరిట ప్రవచించిన పవన ధర్మం ఒకేలా ఉన్నాయేంటి సార్?’’ ‘‘ఒరే బాలూ... నేనేమైనా పవనం ఎలా వీచాలంటూ ఓ పుస్తకం రాశానట్రా? గాలివాటుగా పోవడమే ‘పవన’ ధర్మం. కాబట్టి అలా చెప్పా. పవన ధర్మాలంటూ చెప్పి చిర్రాక్కు కిర్రాక్కు పుట్టించకు. ఎందుకంటే నాకు ధర్మాలు నచ్చవ్. నాకు నచ్చేదల్లా ‘ఇజం’ అంతే! ’’ ‘‘సరే... ధర్మం మాట వదిలేద్దాం. మరి ‘ఇజమ్’ అని పుస్తకం రాశారు కద సార్. అలా రాశాక ఇజమ్ పై అవగాహన ఉండాలి కదా. చేగువేరాకూ, బాబుకూ, మోడీకీ సాపత్యమేంట్సార్?’’ ‘‘చేగువేరాలాగే వాళ్లిద్దరికీ గడ్డం ఉంది చూడు. ఒకేలాంటి ఫ్యాషన్ అనుసరించడం కూడా ఒక ఇజమే కదరా బాలూ!’’ ‘‘ఇజానికి మీరిచ్చిన నిర్వచనం గమ్మత్తుగా ఉంది సార్. కానీ మీ సినిమా విలన్ సిద్ధప్పది చిత్తూరు కదా! అలాగే మీ రాజకీయాల్లోనూ చిత్తూరు బాస్‌ను చిత్తు చేస్తారనుకుంటే నెత్తినెక్కించుకున్నారు కదా సార్. అదేంటో మీరన్నీ ఎప్పుడూ పరస్పర విరుద్ధమైనవి చేస్తూ ఉంటా రు. అదేమిటంటే మీ తిక్కకో లెక్కుందంటారు’’ ‘‘రివర్సులో ఏం చేశాన్రా బాలూ?’’ ‘‘నిజాయితీపరులనే కావాలంటారు. కానీ ఏలేరు స్కాములూ, ఎయిర్‌పోర్టు, ఎమ్మార్‌లకు భూములూ ఉంటూ అవినీతికి పాల్పడ్డవారికి వత్తాసులిస్తారు. చేగువేరా, కొమురంభీమ్లంటారు. కానీ విప్లవమూర్తులుగా రగిలిపోయే వాళ్ల సిద్ధాంతాలకు పూర్తిగా విరుద్ధంగా వ్యవహరించే ఫాసిస్టులకు వెన్నుదన్నవుతారు. పార్టీ పెడతానంటారు. పోటీ పెట్టనంటారు. ఇవన్నీ చూస్తుంటే ఒకటనిపిస్తోంది సార్’’ ‘‘ఏవనిపిస్తోందిరా బాలూ?’’ ‘‘మీకు తిక్క ఉంది. కానీ మీ తిక్కకు లెక్కలేద్సార్! మీకోసం సాక్షాత్తూ ఇక చేగువేరాయే దిగిరావాల్సార్’’ ‘‘ఎందుకురా బాలూ... తన ఇజాన్ని నాకు అర్థమయ్యేలా బోధించడానికా?’’ ‘‘కాద్సార్. చేగువేరా డాక్టర్ కదా! మీ తిక్కకు వైద్యం చేయాలంటే డాక్టర్ అవసరం కదా. సాక్షాత్తూ చేగువేరాయే స్వయంగా వచ్చి వైద్యం చేస్తే పవన కళ్యాణం ఎలా ఉన్నా లోకకళ్యాణం మాత్రం ఖాయం సార్’’ ‘‘లాస్ట్ పంచ్ మనదైతే ఆ మజాయే వేరు. కానీ ఇక్కడది నీదయ్యిందేమిట్రా బాలూ!’’