
ఫ్యాషనబుల్ హీరో కాదు
ప్యాషనేట్ రివల్యూషనరీ
‘చే’ ని ఘర్షణ కన్నది.
విప్లవం పెంచింది.
ధనస్వామ్య విధ్వంసక
ప్రళయ ప్రబోధకుడు
సామ్రాజ్యవాద వినాశక తీతువు
నిరంతరం మృత్యుముఖంలోకి
తీసుకుపోయే ఆస్తమా–
యుద్ధభూమిలాంటి ఓ బాల్యం
‘జీవితమంతా ఊపిరాడని
ఇసుక తుఫాన్లు’
గేమ్స్ స్పోర్ట్స్ విన్నర్.. చే
కందకాల్లో నంబర్‌వన్
వార్ ప్లే బాయ్ హార్డ్ వర్కర్
‘అలసట ఆయాసం
గాలియంత్రాలు’
‘శ్వాసల కోశాధికారి’
ఆస్తమా పీడితులకు ‘రేడియేటర్’ చే!
విప్లవాల ఊపిరి
మొండిధైర్యం నాడీ
ప్రవాహానికి జారుకున్న ‘పిల్లి’
నెట్టుకుపోతోంది
సాయుధ మృత్యు మార్గాన....
ఉచ్ఛ్వాస – నిశ్వాసాల ‘కొసల’ మీద
ఊపిరి ఉయ్యాలలూగినవాడు
క్యాస్ట్రో నీడన ఊపిరిని
ఉర్రూతలూగించినవాడు
గుండెనిండా గాలి పోసుకుని
ఎల్తైన శిఖరాల మీంచి పల్టీ కొడతావు
నువ్వే చివరి విప్లవకారుడవు
నువ్వు నా ప్రాణానివి
అన్ని పువ్వుల్లో
ఎర్రమందారమే నాకు ప్రియం
విప్లవకారుడా,
తుపాకీ గొట్టంలాంటి ముక్కుపుటాల్లో
ఊపిరి ఆడకపోతే
ప్రపంచం చచ్చిపోతుంది!
భయోద్విగ్న, ఆహార్యం–
నీ సింహ రూపం
శత్రువు గుండెల్లో
ఫిరంగి గుళ్ళు – నీ కళ్ళు
మొన వంపు తిరిగిన కత్తులు–
నీ మీసాలు
నీ చేతులు తుపాకులు
‘రాత్రి అంతరిక్షం’ నీ టోపీలో ఇరుక్కుంది
సిగార్ పెదవుల మీద ‘అగ్నిపర్వతం’
అన్నిటినీ మించి నువు మనిషివి కాదు
పేలుడు పదార్థానివి!
కమ్యూనిస్ట్ విప్లవ సిద్ధాంత పితామహుడు
కారల్ మార్క్స్‌కు నిజమైన వారసుడివి
(నేడు చేగువేరా జయంతి)
-నీలం సర్వేశ్వరరావు
మొబైల్ : 93919 96005
Comments
Please login to add a commentAdd a comment