
హవానా : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక పిచ్చివాడని.. క్యూబా విప్లవనాయకుడు, ఆధునిక కమ్యూనిస్ట్ నేత చెగువేరా కుమార్తె.. ఎలీదా గువేరా నిప్పులు చెరిగారు. డొనాల్డ్ ట్రంప్ పిచ్చితనం వల్ల ప్రపంచం ప్రమాదంలో పడిందని అన్నారు. ట్రంప్ చర్యల వల్ల మానవత్వం మంటగలిసే ప్రమాదముందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 57 ఏళ్ల ఎలీదా గువేరా క్యూబా రాజధాని హవానాలో ది వీక్ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో ఆమె ట్రంప్ వ్యవహర శైలిని తీవ్రంగా విమర్శించారు.
‘ట్రంప్ అనుసరిస్తున్న విధానాలు, అతని వ్యవహార శైలిపై ప్రపంచమంతా స్పందించాల్సిన అవసరముంది. ఎందుకంటే ట్రంప్ తనకున్న పిచ్చితనంతో మొత్తం భూగోళాన్నే సమూలంగా నాశనం చేసే ప్రమాదముంది.’ ఆమె అన్నారు. ఇప్పటికైనా ప్రపంచదేశాలన్నీ మేల్కోవాలి, సమయం పెద్దగా లేదు.. అందరూ కలిసికట్టుగా ట్రంప్‌ను నిలువరించాలని ప్రపంచానికి ఆమె సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment