గాంధీ అసలు పేరు చే గెవెరా..! | express raja director merlapaka gandhi original name che guevara | Sakshi
Sakshi News home page

గాంధీ అసలు పేరు చే గెవెరా..!

Published Tue, Jan 12 2016 10:22 AM | Last Updated on Sun, Sep 3 2017 3:33 PM

గాంధీ అసలు పేరు చే గెవెరా..!

గాంధీ అసలు పేరు చే గెవెరా..!

తొలి సినిమా వెంకటాద్రి ఎక్స్ప్రెస్తో సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు మేర్లపాక గాంధీ. లాంగ్ గ్యాప్ తరువాత ప్రస్తుతం శర్వానంద్ హీరోగా ఎక్స్ప్రెస్ రాజా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. సంక్రాంతి బరిలో భారీ సినిమాలతో ఢీ కొనడానికి రెడీ అవుతున్న గాంధీ, తన పేరుకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ విషయాన్ని బయటపెట్టాడు. ప్రస్తుతం గాంధీగా అందరికీ పరిచయం అయిన ఈ యువ దర్శకుడుకి చిన్నతనంలో పెట్టిన పేరు వేరే ఉందట.

అభ్యుదయ భావాలు ఉన్న గాంధీ తండ్రి మేర్లపాక మురళి తన అభిమాన పోరాట యోధుడు చేగువెరా పేరును తన కొడుకు పెట్టాడు. అయితే బంధువులు స్నేహితులు మాత్రం ఆ పేరు పిలవటం సారిగా రాకపోవటంతో చెగు, జగ్గు అని పిలుస్తుండటంతో, 5 ఏళ్ల వయసులో చేగువెరా పేరును గాంధీగా మార్చాడట. అలా ఓ విప్లవకారుడి పేరు, శాంతి కాముకుడిగా పేరుగా మారిపోయింది. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన ఎక్స్ప్రెస్ రాజా జనవరి 14న రిలీజ్ అవుతోంది. శర్వానంద్, సురభి జంటగా నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement