హ్యాట్రిక్ హీరో ఖాళీగా ఉన్నాడు | sharwanand hasnot started his new movie yet | Sakshi
Sakshi News home page

హ్యాట్రిక్ హీరో ఖాళీగా ఉన్నాడు

Published Sat, May 28 2016 2:45 PM | Last Updated on Mon, Sep 4 2017 1:08 AM

హ్యాట్రిక్ హీరో ఖాళీగా ఉన్నాడు

హ్యాట్రిక్ హీరో ఖాళీగా ఉన్నాడు

ఇండస్ట్రీలో ఏ హీరో అయినా ఒక్క హిట్ ఇస్తే చాలు గ్యాప్ తీసుకోకుండా వెంటనే మరో సినిమా మొదలెట్టేస్తారు. అలాంటిది ఓ యంగ్ హీరో మాత్రం వరుసగా మూడు హిట్స్ ఇచ్చిన తరువాత కూడా మరో సినిమాను మొదలెట్టడానికి ఆలోచిస్తున్నాడు. రన్ రాజా రన్, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, ఎక్స్ప్రెస్ రాజా సినిమాలతో వరుస సక్సెస్లు సాధించిన యంగ్ హీరో శర్వానంద్. ఇంత మంచి ఫాంలో ఉన్న ఈ యంగ్ హీరో చాలా రోజులుగా తన నెక్ట్స్ సినిమాను స్టార్ట్ చేయకుండా ఎదురు చూస్తున్నాడు.

శర్వా చివరి చిత్రం ఎక్స్ప్రెస్ రాజా సంక్రాంతి కానుకగా జనవరిలో రిలీజ్ అయ్యింది. స్టార్ హీరోల సినిమాలు బరిలో ఉన్నా డీసెంట్ హిట్తో ఆకట్టుకున్నాడు శర్వానంద్. ఈ సినిమాతో స్టార్ లీగ్లో చేరిపోయాడని భావించినా.. తరువాత మాత్రం స్లో అయ్యాడు. ఎక్స్ ప్రెస్ రాజా రిలీజ్ అయి ఆరు నెలలు గడుస్తున్నా ఇంతవరకు తన నెక్ట్స్ సినిమాను ప్రారంభించలేదు. దిల్రాజు నిర్మాణంలో శతమానం భవతి సినిమాలో నటిస్తున్నాడంటూ టాక్ వినిపించినా అఫీషియల్ ఎనౌన్స్మెంట్ మాత్రం రాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement