
సాక్షి, చిత్తూరు : తిరుమల శ్రీవారిని జాను చిత్ర యూనిట్ దర్శించుకుంది. శనివారం రాత్రి అలిపిరి మెట్ల మార్గంలో నటి సమంత పాదయాత్ర ద్వారా తిరుమలకు చేరుకున్నారు. అనంతరం తిరుమలలో బసచేశారు. చిత్ర యునిట్ సభ్యులు హీరో శర్వానంద్, సమంత, దిల్ రాజు ఆదివారం ఉదయం వీఐపీ దర్శనంలో స్వామివారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ అర్చకులు ఆశీర్వాదాలతోపాటు తీర్ధప్రసాదాలు అందజేశారు. జాను చిత్రం మంచి విజయం సాధించిందని నిర్మాత దిల్ రాజు అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment