ఎక్కడ వదిలేసానో అక్కడే ఉన్నాను.. | Telugu Movie Jaanu Teaser Released | Sakshi
Sakshi News home page

ఎక్కడ వదిలేసానో అక్కడే ఉన్నాను..

Published Thu, Jan 9 2020 5:35 PM | Last Updated on Thu, Jan 9 2020 5:47 PM

Telugu Movie Jaanu Teaser Released - Sakshi

తమిళంలో వచ్చిన ‘96’కు రీమేక్‌గా రూపొందుతున్న తెలుగు చిత్రం ‘జాను’. శర్వానంద్‌, సమంత ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం టీజర్‌ను గురువారం విడుదల చేశారు. ఇప్పటికే ‘96’ చిత్రాన్ని కొందరు తెలుగు ప్రేక్షకులు చూసేశారు. అయితే కథ తెలిసినా కూడా ఈ చిత్రంలో సమంత, శర్వానంద్‌లు ఎలా నటిస్తారనే ఆసక్తి  చాలా మందిలో నెలకొంది. ఈ క్రమంలోనే విడుదలైన జాను టీజర్‌.. ప్రేక్షకుల ఆకట్టుకునేలా ఉంది. తమిళంలో త్రిష పాత్రకు ఏ మాత్రం తీసిపోకుండా.. సమంత ఇందులో నటించినట్టుగా అర్థమవుతోంది. 


అలాగే శర్వానంద్‌ కూడా ఈ సినిమాకు చక్కగా సరిపోయాడని మెజారిటీ నెటిజన్లు  అభిప్రాయపడుతున్నారు. అయితే 96లో హీరోయిన్‌ చిన్ననాటి పాత్రలో కనిపించిన గౌరీ.. జాను లో కూడా అదే పాత్రలో నటిస్తున్నారు. కాగా, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్‌ బ్యానర్‌పై దిల్‌ రాజు, శిరీష్‌లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమిళంలో ‘96’కు దర్శకత్వం, సంగీతం అందించిన ప్రేమ్‌కుమార్‌, గోవింద్‌ వసంత్‌లు.. ఈ చిత్రానికి కూడా పనిచేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement