Jaanu Telugu Movie
-
జాను సీక్వెల్ కు సమంత ఓకేనా !
-
యంగ్ హీరో శర్వానంద్‌కి సర్జరీ!?
యంగ్ హీరో శర్వానంద్ త్వరలో సర్జరీ చేసుకోనున్నాడట. ఈ విషయమై అమెరికా వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అభిమానులు కంగారు పడుతున్నారు. తెలుగు ప్రేక్షకులు అసలేం జరిగిందా అని అనుకుంటున్నారు. ఇంతకీ ఏంటి సంగతి? డిఫరెంట్ మూవీస్‌తో ఎంటర్టైన్ చేసే హీరోల్లో శర్వానంద్ ఒకడు. 'రన్ రాజా రన్' నుంచి రూట్ మార్చి.. ఫన్ కమర్షియల్ సినిమాలతో అలరిస్తున్నాడు. ప్రస్తుతం 'బేబీ ఆన్ బోర్డ్' మూవీతో బిజీగా ఉన్న ఇతడు.. సర్జరీ కోసం అమెరికా వెళ్లాడనే విషయం చర్చనీయాంశమైంది. (ఇదీ చదవండి: 'పుష్ప 2' ముందున్న కొత్త సవాళ్లు.. బన్నీ ఏం చేస్తాడో?) గతంలో 'జాను' షూటింగ్ సందర్భంగా చాలా ఎత్తు నుంచి శర్వా పడిపోయాడని, చాలా గాయాలు అయ్యాయని అప్పట్లో న్యూస్ వచ్చింది. అయితే గాయాలు మానిపోయినప్పటికీ.. నొప్పి మాత్రం అలానే ఉండిపోయిందట. ఇప్పుడు దాన్ని సర్జరీతో క్లియర్ చేసుకునేందుకే యూఎస్ వెళ్లాడని అంటున్నారు. ఇక అమెరికా నుంచి వచ్చిన తర్వాత పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థ తీసే సినిమాలో నటిస్తాడు. అలానే చిరంజీవి కొత్త సినిమాలోనూ శర్వా.. కీలకపాత్ర చేస్తున్నాడని సమాచారం. ఇదిలా ఉండగా ఈ మధ్యే రక్షితా అనే అమ్మాయిని శర్వానంద్ పెళ్లి చేసుకున్నాడు. (ఇదీ చదవండి: 'జై భీమ్'కి జాతీయ అవార్డ్ అందుకే మిస్ అయిందా?) -
యంగ్ హీరోయిన్ టాటూ.. చూపించుకోలేని ప్లేసులో అలా!
'96' సినిమా పేరు చెప్పగానే ఓ అందమైన లవ్ స్టోరీనే గుర్తొస్తుంది. విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించిన ఈ చిత్రంలో చైల్డ్ ఆర్టిస్టులు కూడా చాలా ఫేమస్ అయ్యారు. చిన్నప్పటి త్రిషగా చేసిన నటి.. ఇప్పుడు హీరోయిన్ అయిపోయింది. తెలుగు, తమిళం, మలయాళంలో సినిమాలు చేస్తోంది. అలాంటి ఆ బ్యూటీ తన బాడీలో ఎవరికీ చూపించుకోలేని ఓ చోట టాటూ వేసుకుని హాట్ టాపిక్ అయిపోయింది. (ఇదీ చదవండి: డేట్‌కి వెళ్లిన మెగా కపుల్.. ఆ ఫొటోలు వైరల్) 96 రీమేక్ గా తెలుగులో తీసిన 'జాను'లోనూ నటించిన గౌరీ కిషన్.. ఆ తర్వాత పలు సినిమాల్లో సహాయ పాత్రలు చేసింది. ఇప్పుడు మాత్రం హీరోయిన్ గా బిజీగా అయిపోయింది. ఈ ఏడాది ప్రారంభంలో తెలుగులో 'శ్రీదేవి శోభన్ బాబు' అనే మూవీలో నటించింది గానీ అది ఫ్లాఫ్ అవడంతో ఇక్కడ ఈమెకు అవకాశాలు రాలేదు. దీంతో తమిళ, మలయాళంలో మాత్రమే చేస్తోంది. తాజాగా ఇన్ స్టాలో ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేసిన గౌరీ.. తన ఒంటిపై టాటూ వేసుకుంటున్న చిన్న వీడియోని స్టోరీలో పోస్ట్ చేసింది. అది ఎక్కడ అనేది చెప్పుకోండి అని చిన్న పజిల్ పెట్టింది. ఆ తర్వాత కాసేపటికి తన రిబ్స్‌పై పచ్చబొట్టు వేసుకున్నానని చెబుతూ ఓ పిక్ షేర్ చేసింది. ఇది చూసి నెటిజన్స్ అవాక్కయ్యారు. ప్రస్తుతం ఈ టాటూ పిక్ కాస్త వైరల్‌గా మారిపోయింది. (ఇదీ చదవండి: ఆమె వల్ల చనిపోదామనుకున్నా.. నటుడు అబ్బాస్ కామెంట్స్) -
రీమేక్ అంత వీజీ కాదు
భాష వేరు. కాని భావం ఒక్కటే. హీరో వేరు. కాని హీరోయిజం ఒక్కటే. అక్కడ హిట్ అయితే ఇక్కడ ఎందుకు కాదు. చలో... రీమేక్ చేద్దాం. కాని రీమేక్ అంత వీజీ కాదు. అది లైఫ్ ఇవ్వగలదు. ఫ్లాప్ చేయగలదు. కనెక్ట్ అయినవీ కానివీ వచ్చినవీ రాబోతున్నవీ ఈ సండే రోజున రీ విజిట్... బాలీవుడ్లో సూపర్ హిట్ అయిన ‘అంధాధున్’ తాజాగా అమేజాన్‌లో రిలీజ్ అయ్యింది. ఇది ఒక థ్రిల్లర్. అనూహ్యమైన మలుపులతో కథ సాగుతుంది. అందుకే దీనిని చాలామంది రీమేక్ చేయడానికి ఉత్సాహపడ్డారు. తెలుగులో నితిన్ హీరోగా మేర్లపాక గాంధీ రిమేక్ చేశారు. ఇక్కడే జటిలమైన సమస్య వస్తుంది. యథాతథం తీయాలా? ఏమైనా మార్పులు చేయాలా? చేస్తే నచ్చుతుందా... చేయకపోతే నచ్చుతుందా... యథాతథంగా తీస్తే కొత్తగా ఏం చేశారని అంటారు. మార్పులు చేస్తే సోల్ చెడగొట్టారని అంటారు. అందువల్ల కొందరు దర్శకులు రీమేక్‌ల జోలికి రారు. కొందరు సక్సెస్‌ఫుల్‌గా తీస్తారు. ‘అంధాధున్’ కథ హిందీలో గోవాలో నడుస్తుంది. రీమేక్‌లో ప్రారంభంలోనే గోవా అని వేస్తారు. గోవాలో తెలుగు కథ ఎందుకు జరుగుతుంది? వైజాగ్‌లో తీసి ఉంటే ఎలా ఉంటుంది? ప్రేక్షకులకు వచ్చే సందేహం. కథ కనెక్ట్ కావచ్చు. కాని ఈ రీమేక్‌లో నేటివిటి కనెక్ట్ అయ్యిందా అనేది సమస్య. ఇద్దరు దర్శకులు గతంలో రీమేక్ సినిమాల్లో ఇద్దరు దర్శకులు పేరు పొందారు. వారు కోడి రామకృష్ణ, రవిరాజా పినిశెట్టి. తమిళంలో భారతీరాజా తీసిన ఒక సినిమా బాగానే ఆడింది. దాని రైట్స్ నిర్మాత ఎస్.గోపాల్‌రెడ్డి కొన్నారు. కాని దర్శకుడు కోడి రామకృష్ణ దానిని యథాతథంగా తీస్తే ఫ్లాప్ అవుతుందని భావించి కథలో మార్పులు, యాస, స్థానికత మార్చారు. అదే ‘మంగమ్మ గారి మనవడు’. సూపర్‌హిట్ అయ్యింది. మరో హిట్ ‘ముద్దుల మావయ్య’ కూడా రీమేక్. కాని తమిళ సినిమా ‘అరువదై నాల్’ ఆధారంగా తీసిన ‘మువ్వ గోపాలుడు’ పూర్తిగా కనెక్ట్ కాలేదు. రీమేక్‌లలో కొన్ని ఎందుకు కనెక్ట్ అవుతాయో కొన్ని ఎందుకు కావో చెప్పలేము. తమిళంలో విసు తీసిన ‘అవళ్ సుమంళిదాన్’ సినిమాను రవిరాజా పినిశెట్టి ‘పుణ్యస్త్రీ’ పేరుతో మార్పుచేర్పులు చేసి సూపర్‌హిట్ చేశారు. రవిరాజా పినిశెట్టి ఇచ్చిన భారీ రీమేక్‌లలో ‘చంటి’, ‘పెదరాయుడు’ ఉన్నాయి. ఆ తర్వాతి కాలంలో భీమినేని శ్రీనివాసరావు ఈ పల్స్ పట్టుకున్న డైరెక్టర్‌గా పేరు పొందారు. గ్యారంటీ కథలు సినిమా కోట్ల రూపాయల వ్యవహారం. కథ విన్నప్పుడు అది తెర మీద ఎలా వస్తుందో ఎలా హిట్ అవుతుందో ఎవరూ ఊహించలేరు. విన్నప్పటి కథ చూసినప్పుడు తేలిపోయి భారీ ఫ్లాప్ కావచ్చు. అందుకే హీరోలు రీమేక్‌ల వైపు అప్పుడప్పుడు చూస్తుంటారు. ఎందుకంటే ఒక భాషలో హిట్ అయిన కథ మరో భాషలో హిట్ అవుతుందన్న ఒక గ్యారంటీతో. పైగా ఆ కథకు ఎంత ఖర్చు అవుతుందో, ఎన్ని రోజులు పడుతుందో కూడా తెలిసిపోతుంది. నాగార్జున ‘విక్రమ్’ (హిందీ ‘హీరో’) తో తెరంగేట్రం చేసినా వెంకటేశ్ కాలక్రమంలో రీమేక్‌ల మీదే పూర్తిగా దృష్టి పెట్టినా ఇదే కారణం. ఒక్కోసారి టాప్ హీరోలకు కూడా రీమేక్‌ల అవసరం ఏర్పడుతుంది. చిరంజీవికి ‘పసివాడి ప్రాణం’, ‘హిట్లర్’, ‘ఠాగూర్’, ‘ఖైదీ నంబర్ 150’ పెద్ద సక్సెస్ ఇచ్చాయి. ఇవి నాలుగూ రీమేకులే. ఇప్పుడు ఆయన మలయాళం హిట్ ‘లూసిఫర్’లో నటిస్తున్నారు. మోహన్‌బాబుకు మలయాళం నుంచి రీమేక్ చేసిన ‘అల్లుడు గారు’ బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ అయ్యింది. బి.గోపాల్ దర్శకుడిగా తీసిన ‘అసెంబ్లీ రౌడీ’ రీమేక్ ఆయనను కలెక్షన్ కింగ్‌ను చేసింది. కాని అదే బి.గోపాల్ వెంకటేశ్ హీరోగా చేసిన ‘చినరాయుడు’ రీమేక్ విఫలం అయ్యింది. ఆ సినిమాలోని తమిళదనం తెలుగుకు పడలేదు. తర్వాతి కాలంలో రాజశేఖర్ రీమేక్‌లకు కేరాఫ్‌గా మారాడు. అనూహ్య ఫలితాలు కచ్చితంగా హిట్ అవుతుందని రీమేక్ చేస్తే అనూహ్య ఫలితాలు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. తమిళంలో సూపర్‌డూపర్ హిట్ అయిన ‘వాల్టర్ వెట్రివల్’ను చిరంజీవి, శ్రీదేవితో ‘ఎస్పి పరశురామ్’గా రీమేక్ చేస్తే భారీ పరాజయం నమోదు చేసింది. అలాగే హిందీలో భారీ హిట్ అయిన ‘లగేరహో మున్నాభాయ్’ తెలుగు రీమేక్ ‘శంకర్‌దాదా జిందాబాద్’ కనెక్ట్ కాలేదు. వెంకటేశ్ ‘జెమిని’ నిరాశ పరిచింది. నాగార్జున ‘చంద్రలేఖ’ అంతే. ‘బాజీగర్’ రీమేక్‌గా తీసిన రాజశేఖర్ ‘వేటగాడు’ పరాజయం పొందింది. తమిళంలో భారీ హిట్ అయిన ‘ఆటోగ్రాఫ్’ను రవితేజాతో ‘నా ఆటోగ్రాఫ్’ తీస్తే ప్రేక్షకులు తిరస్కరించారు. ఈ మధ్యకాలంలో తమిళం నుంచి రీమేక్ చేసిన వరుణ్ సందేశ్ ‘కుర్రాడు’, మనోజ్ మంచు ‘రాజూ భాయ్’, బెల్లంకొండ శ్రీనివాస్ ‘స్పీడున్నోడు’, సందీప్‌కిషన్ ‘రన్’, పవన్ కల్యాణ్ ‘కాటమరాయుడు’, విష్ణు మంచు ‘డైనమైట్’, అల్లరి నరేశ్ ‘సిల్లీ ఫెలోస్’ అంతగా మెచ్చుకోలు పొందలేదు. తమిళ ‘96’ తెలుగులో ‘జాను’గా వస్తే బాగుందని పేరు వచ్చినా జనం చూడలేదు. అందుకే రీమేక్‌లో తెలియని రిస్క్ ఉంటుందని అంటారు. కొనసాగుతున్న రీమేక్స్ అయినా సరే రీమేక్స్ కొనసాగుతూనే ఉన్నాయి. మొన్నటికి మొన్న ‘నారప్ప’ వచ్చింది. తాజాగా ‘మాస్ట్రో’ వచ్చింది. ‘ఉమామహ్వేర ఉగ్రరూపస్య’, ‘కపటధారి’, ‘తిమ్మరుసు’, ‘రాక్షసుడు’, ‘గద్దలకొండ గణేశ్’, ‘వకీల్‌సాబ్’... ఇవన్నీ రీమేక్స్ పట్ల ఆసక్తిని నిలిపి ఉంచాయి. మలయాళంలో హిట్ అయిన ‘లూసిఫర్’, ‘అయ్యప్పనమ్ కోషియం’ రీమేక్ అవుతున్నాయి. మరాఠిలో నానా పటేకర్ నటించగా పెద్ద హిట్ అయిన ‘నటసామ్రాట్’ తెలుగులో ప్రకాష్‌రాజ్ హీరోగా కృష్ణవంశీ దర్శకత్వంలో తయారవుతోంది. ‘దృశ్యం 2’ రానుంది. గోడకు బంగారు చేర్పు అవసరం. ఇక్కడ గోడ కథ. గోడ గట్టిగా ఉంటే బంగారానికి దాని మీద వాలే శక్తి పెరుగుతుంది. కథను బాగా రాయడం తెలిస్తే రీమేక్‌ల అవసరం ఉండదు. తెలుగులో గట్టి సినీ కథకులు ఉన్నారు. తెలుగు సినిమాలు పరాయి భాషలో రీమేక్ అవుతున్నాయి. మన రంగంలో ఇతరులకు కథలిచ్చేలా ఎక్కువగా, కథలు తీసుకునేలా తక్కువగా ఉండాలని కోరుకుందాం. ‘ -
అసత్య ప్రచారంపై సమంత క్లారిటీ..
సినిమా: మీకు అలా అర్థమైందా? అని అడుగుతున్నారు నటి సమంత. ఈ బ్యూటీ సమంత అక్కినేని అయిన తరువాత హైదరాబాద్‌లో సెటిల్ అవడంతో పాటు తెలుగు చిత్రాల్లోనే ఎక్కువగా నటిస్తున్నారు. ప్రస్తుతం కమర్శియల్ కథా చిత్రాలకంటే మంచి కథా బలం ఉన్న చిత్రాల్లోనే నటించడానికి ఆసక్తి చూపుతున్నారు. అదేవిధంగా నటనకు అవకాశం ఉన్న పాత్రలనే ఎంపిక చేసుకుని నటిస్తున్నారు. అలా నటించిన ‘ఓ బేబీ’ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. తమిళంలో సూపర్‌డీలక్స్ చిత్రం తరువాత కోలీవుడ్‌లో చిత్రం చేయలేదు. త్వరలో ఒక క్రేజీ చిత్రం చేయనున్నట్లు ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. విజయ్ సేతుపతి, నయనతారలతో కలిసి విఘ్నేశ్ శివన్ దర్శత్వంలో నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే ఇటీవల తెలుగులో సమంత నటించిన తాజా చిత్రం ‘జాను’. ఇది తమిళంలో సంచలన విజయం సాధించిన ‘96’ చిత్రానికి రీమేక్. కాగా జాను చిత్ర ప్రచారంలో భాగంగా సమంత మాట్లాడుతూ.. మరో రెండు మూడేళ్లలో నటనకు గుడ్‌బై చెబుతానని అన్నట్టుగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ ప్రచారం మితి మీరడంతో సమంత స్పందిస్తూ.. ‘ఓహో నేను చెప్పింది మీకు అలా అర్థం అయ్యిందా?’ అని ప్రశ్నించారు. నిజానికి తాను 3 ఏళ్ల తరువాత సినిమాకు గుడ్‌బై చెబుతానని చెప్పలేదన్నారు. పదేళ్లకు పైగా నటిగా కొనసాగుతున్నానని సినిమా ప్రపంచం సవాల్‌తో కూడుకున్నదని అన్నట్టు చెప్పారు. ఇక్కడ నటీమణులు ఎక్కువ కాలం కొనసాగడం కష్టం అని చెప్పానన్నారు. అలా అవకాశాలు లేక తాను నటించలేకపోయినా, ఏదోవిధంగా సినిమాలోనే కొనసాగుతానని చెప్పానన్నారు. నటనకు కొంచెం గ్యాప్ రావచ్చునని, దీంతో సినిమాకు దూరం అవుతానని ఎవరూ భావించాల్సిన అవసరం లేదంటూ.. తన గురించి వైరల్ అవుతున్న అసత్య ప్రచారంపై సమంత క్లారిటీ ఇచ్చారు. స్నేహితులతో కలిసి పేద విద్యార్దుల కోసం ఒక పాఠశాలను కూడా సమంత కట్టిస్తున్నట్టు సమాచారం. -
క్లైమ్యాక్స్ చూసి కన్నీళ్లు పెట్టుకున్నాను
‘‘సరిలేరు నీకెవ్వరు, ‘అల.. వైకుంఠపురములో, జాను’ చిత్రాలతో ఈ ఏడాది అప్పుడే ‘దిల్’ రాజుగారు హ్యాట్రిక్ కొట్టారు. ‘జాను’ అందమైన ప్రేమకథ. క్లైమ్యాక్స్ చూసి కన్నీళ్లు పెట్టుకున్నాను. నేను చూసిన ‘గీతాంజలి’, నేను డైరెక్ట్ చేసిన ‘పదహారేళ్ల వయసు’ సినిమాల క్లైమ్యాక్స్ తర్వాత ‘జాను’ చిత్రం అంతలా కదిలించింది’’ అన్నారు దర్శకుడు కె. రాఘవేంద్రరావు. శర్వానంద్, సమంత జంటగా సి. ప్రేమ్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జాను’. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన ఈ సినిమా గత శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా చిత్రబృందం థ్యాంక్స్ మీట్‌ను నిర్వహించింది. ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘తొలి రోజు నుంచి ఇటు ఇండస్ట్రీ నుండి అటు మీడియా, సోషల్ మీడియా, ప్రేక్షకుల నుండి మా ‘జాను’కి అద్భుతమైన స్పందన వస్తోంది. ప్రేమ్, ఇతర సాంకేతిక నిపుణులకు ధన్యవాదాలు. శర్వానంద్, సమంత కళ్లతోనే నటించారు. మా బ్యానర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీస్ అని చెబుతున్నారు. జనరల్‌గా సినిమాలు తీసేటప్పుడు లెక్కలు వేసుకుంటాను.. కానీ ‘జాను’కి లెక్కలు వేసుకోలేదు. ఇలాంటి సినిమాను ప్రోత్సహిస్తేనే మరిన్ని మంచి సినిమాలు చేయగలం’’ అన్నారు. ‘‘సినిమాని చూసిన వారందరూ చాలా పాజిటివ్‌గా స్పందించారు’’ అన్నారు సమంత. శర్వానంద్ మాట్లాడుతూ– ‘‘నా కెరీర్లో గుర్తుండిపోయే సినిమా ‘జాను’. హిట్స్ కొడుతున్నా కానీ... నటుడిగా ఏదో మిస్ అయ్యాననే భావన మనసులో ఉండిపోయింది.. అది ‘జాను’తో తీరింది. ఆ ఆనందాన్ని మాటల్లో చెప్పలేకపోతున్నాను’’ అన్నారు. దర్శకులు బి.వి.ఎస్. రవి, నందినీ రెడ్డి, పాటల రచయిత శ్రీమణి, రచయిత ‘మిర్చి’ కిరణ్ మాట్లాడారు. -
‘జాను’ థ్యాంక్స్ మీట్
-
శ్రీవారిని దర్శించుకున్న జాను చిత్ర యూనిట్
సాక్షి, చిత్తూరు : తిరుమల శ్రీవారిని జాను చిత్ర యూనిట్ దర్శించుకుంది. శనివారం రాత్రి అలిపిరి మెట్ల మార్గంలో నటి సమంత పాదయాత్ర ద్వారా తిరుమలకు చేరుకున్నారు. అనంతరం తిరుమలలో బసచేశారు. చిత్ర యునిట్ సభ్యులు హీరో శర్వానంద్, సమంత, దిల్ రాజు ఆదివారం ఉదయం వీఐపీ దర్శనంలో స్వామివారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ అర్చకులు ఆశీర్వాదాలతోపాటు తీర్ధప్రసాదాలు అందజేశారు. జాను చిత్రం మంచి విజయం సాధించిందని నిర్మాత దిల్ రాజు అన్నారు. -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జాను చిత్ర యూనిట్
-
అదే మాకు పెద్ద సక్సెస్
‘‘ఒక నటుడిగా నేను బాగానే చేస్తున్నానంటున్నారు కానీ రావాల్సిన పేరు ఇంకా మనకు రాలేదా? అనే ఒక చిన్న వెలితి ఉండేది. ‘జాను’ చిత్రం యాక్టర్‌గా నన్ను మెరుగుపరిచింది. నా కెరీర్లోనే ఎప్పుడూ రానన్ని ప్రశంసలు వస్తున్నాయి. ఈ విజయం యాక్టర్‌గా నా ఆకలిని కొంచెం తీర్చింది’’ అన్నారు శర్వానంద్. సి. ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో శర్వానంద్, సమంత ముఖ్య తారలుగా తెరకెక్కిన చిత్రం ‘జాను’. తమిళంలో హిట్ సాధించిన ‘96’ చిత్రానికి ఇది రీమేక్. ‘దిల్’ రాజు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 7న విడుదలైంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమా వేశంలో శర్వానంద్ చెప్పిన విశేషాలు. ► ‘96’ చూసి క్లాసిక్ మూవీ, తెలుగు రీమేక్ అవసరమా? అనిపించింది. ‘శతమానం భవతి’(2017) సినిమా సమయంలో కూడా ‘కథ బాగుంది కాకపోతే నా పాత్ర అంతగా ఉన్నట్లు లేదు’ అనే సందేహం వచ్చినప్పుడు.. ఈ సినిమాతో ఫ్యామిలీకి దగ్గరవుతావు’ అన్న ‘దిల్’ రాజుగారి జడ్జ్మెంట్ నిజమైంది. ‘జాను వర్కౌట్ అవుతుంది’ అని అన్నారాయన. ఆ నమ్మకంతోనే నటించాలనుకున్నాను. ‘దిల్’ రాజుగారు నిర్మాత కాకపోతే గ్యారంటీగా ‘జాను’ చిత్రం చేసేవాడిని కాను. ► ఒక రోజు రాత్రి జరిగే కథ. ఓ నలభై రోజులు కాల్షీట్లు ఇస్తే సరిపోతుందిలే అనుకున్నా. కానీ రామచంద్ర క్యారెక్టర్ కళ్లతోనే ఎక్కువగా మాట్లాడాలి. ఇరవై రోజులు కెన్యాలో షూట్ చేశాం. మాల్దీవుల్లో చేశాం. ఓ సీన్లో గాయపడ్డాను. మరోవైపు కో–స్టార్‌గా సమంత. రిలీజ్ తర్వాత మా ఇద్దరి యాక్టింగ్‌కు పోలికలు పెట్టి ట్రోల్ చేస్తారేమోనన్న భయం. కానీ నా కెరీర్లోనే నేను బాగా కష్టపడ్డ సినిమా ‘జాను’. సమంత కాకుండా వేరే ఎవరైనా ‘జాను’ పాత్ర చేసినా నా నుంచి అంత నటన వచ్చి ఉండేది కాదేమోనని ఒక యాక్టర్‌గా నేను అనుకుంటున్నాను. ‘96’లో చేసిన విజయ్‌సేతుపతి, త్రిషలను మర్చిపోయి ‘జాను’లో శర్వా, సమంతలను చూస్తున్నాం అంటున్నారు. అదే మాకు పెద్ద సక్సెస్. ► వ్యక్తిగా, నటుడిగా సమంత నుంచి చాలా నేర్చుకున్నాను. ‘నేనొక సూపర్‌స్టార్.. నేను అక్కినేని ఫ్యామిలీ’ అనే గర్వం తనలో లేదు. నేనొక షాట్ పూర్తి చేసి వెళ్లి కూర్చొంటే... సమంత మాత్రం మానిటర్ దగ్గరకు వెళ్లి చెక్ చేసుకునేది. ఇప్పుడు ఆ ఫార్ములాను నా సెట్లో నేను వాడుతున్నాను. రిలీజ్ తర్వాత మేం ఫోన్లో మాట్లాడుకున్నాం. ‘సైలెంట్‌గా ఉంటావ్ కానీ బాగానే మార్కులు కొట్టేశావ్.. నువ్వు దొంగవి’ అంది సమంత. ► ప్రతి ఒక్కరి జీవితంలో ఫస్ట్ లవ్ ఉంటుంది. నాకు కూడా ఉంది కాబట్టే రామచంద్ర పాత్రలో బాగా నటించానేమో (నవ్వుతూ). ఫస్ట్ లవ్‌ను పెళ్లి చేసుకునేవారు చాలా తక్కువ. 100లో 5 పర్సెంట్ ఉంటారేమో. ► నా కెరీర్లో ‘గమ్యం, ప్రస్థానం’ వంటి మంచి హిట్స్ ఉన్నాయి. కానీ ‘జాను’ లాంటి సినిమాలు మళ్లీ మళ్లీ రావు. నా కెరీర్లో ‘జాను’ గుర్తుండిపోయే సినిమా. ► తక్కువ రోజుల్లోనే షూట్‌ను కంప్లీట్ చేద్దామనే అక్షయ్‌కుమార్ ఫార్ములాను ఫాలో అవుదామని ఫిక్స్ అయ్యాను. 3 సినిమాలు అయిపోవాలి.. 3 సెట్స్‌పై ఉండాలి. ‘శ్రీకారం’లో రైతు పాత్ర చేస్తున్నాను. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 24న విడుదల చేస్తున్నాం. -
జాను సినిమా చూస్తూ..
అమీర్‌పేట: ఎర్రగడ్డ గోకుల్ థియేటర్లో సినిమా చూస్తూ ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. ఎస్ఆర్నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సాయంత్రం ఈ సంఘట జరిగింది. శుక్రవారం జాను సినిమా విడుదల కావడంతో మ్యాట్నిషో చూసేందుకు ఓ వ్యక్తి థియేటర్‌కు వచ్చాడు. సినిమా అయిపోయాక ప్రేక్షకులు అందరు వెళ్లిపోయినా అతడు సీట్లో నుండి లేవకపోవడాన్ని గమనించిన సిబ్బంది దగ్గరకు వెళ్లి లేపేందుకు ప్రయత్నించారు.అప్పటికే మృతి చెందినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. థియేటర్‌కు వచ్చిన ఎస్ఐ మహేందర్ మృతదేహన్ని స్వాధీనం చేసుకుని గాంధీ మార్చురీకి తరలించారు.అతడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించక పోవడంతో గుర్తు తెలియని వ్యక్తి మృతిగా కేసు నమోదు చేశారు. గుండె పోటుతో మృతి చెందాడా లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ మురళీకృష్ణ తెలిపారు. -
‘జాను’ మూవీ రివ్యూ
సినిమా : జాను నటీనటులు : శర్వానంద్, సమంత, వెన్నెల కిషోర్, రఘుబాబు, తాగుబోతు రమేష్, శరణ్య దర్శకత్వం : సి.ప్రేమ్ కుమార్ నిర్మాత : దిల్ రాజు, శిరీష్ సంగీతం : గోవింద వసంత జానర్ : రొమాంటిక్ డ్రామా బ్యానర్ : శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ తమిళ తెరపై సంచలనం సృష్టించిన క్లాసిక్ సినిమా ‘96’. ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవటంతో కన్నడలో ‘99’ గా రీమేక్ అయింది. గణేష్, భావన జంటగా తెరకెక్కిన ఈ సినిమా అక్కడ కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను రీమేక్ చేయాలనుకున్నారు. అనుకున్నదే తడవుగా శర్వానంద్, సమంత హీరో హీరోయిన్లుగా మాతృకకు దర్శకత్వం వహించిన సి. ప్రేమ్‌కుమారే ఈ సినిమాను కూడా తెరెకెక్కించారు. ఈ 7వ తేదీన సినిమా థియేటర్ల తలుపు తట్టింది. మరి ‘96‘ మ్యాజిక్‌ను ‘జాను’ తెలుగు తెరపై కొనసాగించిందా? శర్వానంద్, సమంతల జంట భగ్న ప్రేమికులుగా ప్రేక్షకులను మెప్పించారా?.. లేదా?. కథ : కే.రామచంద్రన్(శర్వానంద్) ట్రావెల్ ఫొటోగ్రాఫర్. ఓ జర్నీలో చిన్నప్పుడు తను పుట్టి పెరిగిన ఊరికి వెళతాడు. అక్కడ ఒక్కొక్కటిగా చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకుంటాడు. అలా తను చదువుకున్న స్కూల్ దగ్గరకు చేరుకుంటాడు. ఆ సమయంలోనే తొలిప్రేమ జ్ఞాపకాలు అతడి కళ్లముందు మెదులుతాయి. జానకీ దేవీ(సమంత)తో ప్రేమలో పడటం.. ఆమెతో గడిపిన మధుర క్షణాలు.. విడిపోవటం! అన్నీ గుర్తుకు వస్తాయి. ఆ తర్వాత చోటుచేసుకునే కొన్ని పరిణామాలతో దాదాపు 17 సంవత్సరాల తర్వాత స్కూల్ ఫ్రెండ్స్ ఏర్పాటు చేసిన గెట్ టు గెదర్ పార్టీలో ఇద్దరూ కలుస్తారు. ఇంతకీ ఆ ఇద్దరు ఎందుకు విడిపోయారు? సుదీర్ఘకాలం తర్వాత కలుసుకున్న ఓ ప్రేమ జంట మదిలో మెదిలే భావాలేంటి? అన్నదే మిగతా కథ. విశ్లేషణ : ఓ మంచి కథకి భాషతో సంబంధం లేదని మరోసారి రుజువైంది. ‘ జాను’ సినిమాను ఓ రీమేక్‌లా కాకుండా తెలుగు నేటివిటీతో తెరకెక్కించాడు దర్శకుడు సి. ప్రేమ్ కుమార్. 96 సినిమా మ్యాజిక్ తెలుగు తెరపై కొనసాగిందని చెప్పొచ్చు. ప్రేమ కథలకు సోల్ అయిన ఎమోషన్స్ ఎక్కడా తక్కువ కాలేదు. తొలిప్రేమతో ముడిపడి ఉన్న ప్రతీ ఒక్కరి జీవితానికి ఈ సినిమా కచ్చితంగా కనెక్ట్ అవుతుంది. కొన్నిసార్లు మనల్ని మనం తెరపైన చూసుకుంటున్నట్లుగా ఉంటుంది. ఇద్దరి మధ్యా చోటుచేసుకునే కొన్ని సన్నివేశాలు మనసును హత్తుకునేలా ఉంటాయి. 96కు సంగీతం అందించిన గోవింద వసంత ఈ సినిమాకు కూడా పనిచేశారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గిలిగింతలు పెడుతుంది. మాతృకతో పోల్చినపుడు కొన్ని పాటలు కొద్దిగా దెబ్బతీశాయని చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ కొన్ని కామెడీ సీన్లతో నవ్వులు పూయిస్తే.. సెకండ్ హాఫ్ భగ్న ప్రేమికుల మధ్య బాధతో మన గుండెని బరువెక్కిస్తుంది. అశ్లీలతకు తావులేని ఓ బ్యూటిఫుల్ ప్రేమకథా చిత్రమ్ ‘జాను’ అని ఒక్కమాటలో చెప్పొచ్చు. నటీనటులు : ఎక్స్ప్రెషన్స్ క్వీన్ సమంత తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. భగ్న ప్రేమికుడిగా శర్వానంద్ నటన యాజ్ యూజువల్. ఉన్నది కొద్దిసేపే అయినా వెన్నెల కిషోర్, రఘుబాబు, తాగుబోతు రమేష్, శరణ్య నటన బాగుంది. శర్వానంద్, సమంతల చిన్నప్పటి పాత్రలుగా కనిపించిన సాయికుమార్, గౌరీ కిషన్ల నటనకూడా మనల్ని ఆకట్టుకుంటుంది. ప్లస్ పాయింట్స్ శర్వానంద్, సమంతల నటన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మైనస్ పాయింట్స్ కొన్ని పాటలు - బండారు వెంకటేశ్వర్లు, సాక్షి వెబ్‌డెస్క్ -
టైటిల్స్ కుదిరాయి
సినిమా ప్రేక్షకుడి దాకా వెళ్లాలన్నా, ప్రేక్షకుడు థియేటర్ దాకా రావాలన్నా ప్రచారం కీలకం. సినిమా ప్రచారంలో మొట్టమొదటి చాప్టర్ సినిమా టైటిల్. పేరు ఎంత బావుంటే, ఎంత క్యాచీగా ఉంటే సినిమాకి అంత ప్లస్సు. ప్రస్తుతం ఇండస్ట్రీలో కొన్ని క్రేజీ సినిమాలకు టైటిల్స్ ఫిక్స్ అయ్యాయని తెలిసింది. ఆ వివరాలు... ఆచార్య చిరంజీవి చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతోంది. సామాజిక అంశాలతో కూడుకున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్కి ‘ఆచార్య’ అనే టైటిల్ ఫిక్స్ చేశారట. నిరంజన్ రెడ్డి, రామ్‌చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టైటిల్‌ని బట్టి గమనిస్తే చిరంజీవి ఈ సినిమాలో ఫ్రొఫెసర్ పాత్రలో కనిపిస్తారని ఊహించవచ్చు. డియర్ ప్రభాస్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ ప్రేమకథా చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాకు ముందు ‘జాన్’ అనే టైటిల్ అనుకుంటున్నారని వార్తలు వచ్చాయి. తాజాగా ‘ఓ డియర్’ అనే టైటిల్ ఫిక్స్ చేయాలని చిత్రబృందం భావిస్తోందట. అలాగే ‘రాధే శ్యామ్’ అనే టైటిల్‌ను కూడా పరిశీలిస్తున్నారని టాక్. వకీల్ సాబ్ హిందీ చిత్రం ‘పింక్’ తెలుగు రీమేక్‌ను తన రీ ఎంట్రీ కోసం ఎంచుకున్నారు పవన్ కల్యాణ్. ఇందులో లాయర్ పాత్రలో నటిస్తున్నారాయన. ఈ సినిమా కోసం ‘వకీల్ సాబ్’ అనే టైటిల్ రిజిస్టర్ చేశారట. వేణుశ్రీరామ్ దర్శకత్వంలో ‘దిల్’ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా మే 15న విడుదల కానుంది. -
పేరు కోసమే కష్టపడ్డాను
‘‘నా కెరీర్ ప్రారంభం నుంచి కూడా నేను పేరుకోసమే పని చేశాను. ఒక సినిమా చేయాలా? వద్దా? అనే నా నిర్ణయాన్ని డబ్బు ప్రభావితం చేయలేదు. కొత్త సినిమాని ఒప్పుకునేముందు ఆ సినిమా వల్ల నాకు ఎంత పేరు వస్తుందని మాత్రమే ఆలోచించుకుని నా వంతు కష్టపడ్డాను. డబ్బు ఆటోమేటిక్‌గా వచ్చేసింది(నవ్వుతూ)’’ అని సమంత అన్నారు. శర్వానంద్, సమంత జంటగా సి. ప్రేమ్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జాను’. తమిళంలో హిట్ సాధించిన ‘96’ చిత్రానికి ‘జాను’ తెలుగు రీమేక్. ‘96’ చిత్రాన్ని తెరకెక్కించిన ప్రేమ్‌కుమారే ‘జాను’ సినిమాని డైరెక్ట్ చేశారు. ‘దిల్’ రాజు నిర్మించిన ఈ చిత్రం రేపు(శుక్రవారం) విడుదలవుతోంది. ఈ సందర్భంగా సమంత చెప్పిన విశేషాలు... ► ‘జాను’ ఇద్దరు వ్యక్తుల కథ. నాకైతే చాలా పెద్ద సినిమా చేశాననిపించింది. ఎక్కువ రిస్క్ అనిపించింది. నా 100 పర్సెంట్ ఎఫర్ట్ పెట్టాను. ‘96’ సినిమా బాగా నచ్చింది. ఆ చిత్రంలో విజయ్ సేతుపతి బాగా చేశారన్నారు. నాకైతే ‘96’ త్రిషగారి సినిమా అనిపించింది. ఈ సినిమా రీమేక్‌లో నటించకూడదని తొలుత అనుకున్నాను. ‘దిల్’రాజుగారు అడగడంతో కాదనలేకపోయాను. కానీ ‘జాను’ సినిమా చేయకపోతే నా కెరీర్లో ఒక మంచి సినిమా కోల్పోయేదాన్ని.. పశ్చాత్తాపం చెందాల్సి వచ్చేది. ► త్రిషగారి నటనను కాపీ చేయలేదు. సినిమాలోని పాత్రని అర్థం చేసుకుని నా శైలిలో విభిన్నంగా నటించాను. అది స్క్రీన్‌పై ఎంత వర్కవుట్ అయ్యిందన్నది ప్రేక్షకులు చెబుతారు. నేను చాలా కష్టపడ్డాను. స్క్రిప్ట్‌ను చాలాసార్లు చదివాను. నాకైతే పూర్తి నమ్మకం ఉంది. విడుదల తర్వాత ప్రేక్షకులు కూడా నమ్ముతారని ఆశిస్తున్నాను. ‘96’లాంటి సినిమాలను రీమేక్ చేయడం కష్టం. కానీ ప్రేమ్‌కుమారే తెరకెక్కించడంతో ఆ మ్యాజిక్‌ను రీ–క్రియేట్ చేశారనిపించింది. ► స్క్రిప్ట్ ప్రకారం నా నటన బట్టే శర్వాగారి నటన ఉంటుంది. అందుకే ఒకరికొకరు సహాయం చేసుకుని బెస్ట్ ఔట్పుట్ రావడం కోసం కష్టపడ్డాం.. శర్వా బాగా నటించారు. క్లైమాక్స్ మార్చడం కోసం షూటింగ్‌ను ఆపేశామనే వార్తల్లో నిజం లేదు. శర్వాగారికి ఆరోగ్యం సహకరించనప్పుడు కొంత షూట్ ఆపాం. ఆ తర్వాత మొదలైన ఒక్క షెడ్యూల్లోనే సినిమాను పూర్తి చేశాం. ► నా కెరీర్లో పది సంవత్సరాలు గడిచిపోయాయి. కాలం గడిచేకొద్దీ కొత్త హీరోయిన్లు వస్తుంటారు. ట్రెండ్ మారిపోతుంటుంది. కొందర్ని బెటర్ పెర్ఫార్మెన్స్ అంటారు.. ఇంకొందర్ని బ్యూటిఫుల్ అంటారు. కానీ వీలైనంత కాలం నా పేరు నిలిచిపోవాలని నేను కోరుకుంటున్నాను. అందుకు తగ్గట్లు కష్టపడుతున్నాను. నేను చేసే ప్రతి సినిమా నా మొదటిదిగా భావిస్తాను. నా నటన, నా ప్రవర్తన పట్ల సినిమా యూనిట్ సంతోషంగా ఉన్నారో లేదో కూడా ముఖ్యమే. ► ప్రమోషన్స్ ఎంతవరకు సినిమా కలెక్షన్స్‌ను ప్రభావితం చేస్తాయో నాకు తెలియదు. కానీ నేను ఒక చోటుకు వెళ్లి సినిమాను ప్రమోట్ చేయడం వల్ల పది టిక్కెట్లైనా అమ్ముడు పోతాయంటే వెళ్లి ప్రమోట్ చేస్తాను. ఎందుకంటే ఒక నిర్మాత నన్ను నమ్మి, ఇంత పారితోషికం ఇచ్చినప్పుడు చేయాలి. మూవీ విడుదలై, విజయం సాధిస్తే నేను ఫోన్ లిఫ్ట్ చేయను (సరదాగా). అదే రిలీజ్‌కు ముందు అయితే నాకు వీలైనంత ప్రమోషన్ చేస్తాను. రిలీజ్ టైమ్‌లో సినిమా ఫలితం గురించి కాస్త ఆందోళనకి గురవుతా. ► నా చదువు పట్ల మా అమ్మగారు మరీ స్ట్రిక్ట్‌గా ఉండేవారు కాదు. కానీ, నేను ఫుల్ మార్క్స్ రావాలని కోరుకుంటాను. 12వ తరగతిలో అకౌంట్స్‌లో 200కి 199 మార్కులు రావడంతో బాగా ఏడ్చాను. నేను ఫెయిల్ అయ్యానని మా అమ్మ అనుకున్నారు. అసలు విషయం తెలియడంతో సైలెంట్‌గా వెళ్లిపోయారు. ► నా సినిమాలను చూడమని నా స్నేహితులకు చెబుతుంటాను. నేను గ్రాడ్యుయేషన్ చేసేటప్పుదు మాది గర్ల్స్ కాలేజ్. చాలా స్ట్రిక్ట్. ఎవరూ టీవీ, ఇండస్ట్రీ అంటూ ఉండేవారు కాదు. కానీ, నేను చేసేదాన్ని. సినిమాలకే కాదు.. కుటుంబానికీ సమయం కేటాయించాలనుకుంటున్నాను. ఒక ఆర్టిస్టుగా నేను సాధించే విజయాల కన్నా కూడా నా వ్యక్తిత్వం గురించి మా కుటుంబ సభ్యులు గర్వంగా ఫీల్ అవుతారు. ► ‘రంగస్థలం’ తర్వాత సమంత ఏం చేసినా హిట్ అయిపోతుందన్నారు. ఆ సినిమాలో నా క్యారెక్టరైజేషన్, కొంచెం కథ తెలుసంతే. ఎంటైర్ స్క్రిప్ట్ తెలియదు. ఇప్పుడు నేను సినిమాలను చాలా తెలివిగా ఎంచుకుంటున్నాని అంటున్నారు. కానీ అది అలా జరుగుతోందంతే. ► ‘ది ఫ్యామిలీమేన్ సీజన్ 2’ వెబ్ సిరీస్‌లో కొత్త సమంతను చూస్తారు. చాలా కష్టపడ్డాను. నేను ఒక్కషాట్‌లో కూడా డూప్ వాడలేదు. అప్పుడు అనుకున్నాను.. సినిమాలో ఫైట్స్ కోసం హీరోలు ఇంత కష్టపడతారా అని!. ఇందులో నేను చేసిన పాత్రను ఇదివరకు చేయలేదు. -
వైజాగ్‌లో ‘జాను’ గ్రాండ్ రిలీజ్ ఈవెంట్
-
విశాఖలో ‘జాను’ టీమ్ సందడి
-
స్ట్రయిట్ సినిమా చేయడం ఈజీ
శర్వానంద్, సమంత జంటగా నటించిన చిత్రం ‘జాను’. తమిళంలో విజయవంతమైన ‘96’ చిత్రానికి రీమేక్ ఇది. తమిళ సినిమాకి దర్శకత్వం వహించిన సి. ప్రేమ్‌కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 7న విడుదల కానుంది. ఈ సందర్భంగా ‘దిల్’ రాజు విలేకరులతో మాట్లాడారు. ► నేను నిర్మాతగా చేసిన మొదటి సినిమా నుండి స్క్రిప్ట్‌తో పాటు ట్రావెల్ చేయటం అలవాటు. అందుకే రీమేక్ చిత్రాలు తీయలేదు. అది మాత్రమే కాదు స్ట్రయిట్ సినిమా చేయటం ఈజీ. మధ్యలో ‘ప్రేమమ్’, ‘బెంగుళూర్ డేస్’ సినిమాలు చూసినప్పుడు ఎగ్జయిట్ అయ్యాను. ‘బెంగుళూర్ డేస్’ సినిమాకి చాలా వర్కవుట్ చేసి హీరోలుగా నాని, శర్వానంద్‌లను అనుకున్నాను. తర్వాత మూడో హీరో విషయంలో శాటిస్ఫై అవ్వలేదు. డ్రాప్ అయ్యాను. ‘ప్రేమమ్’ సినిమా చేద్దాం అనుకున్నప్పుడు సితార ఎంటర్టైన్మెంట్ నాగవంశీ ‘అన్నా.. ఈ సినిమాని నేను రీమేక్ చేస్తాను’ అన్నాడు. ‘సరే’ అన్నాను. ► అనుకోకుండా ఈ ఏడాది మూడు రీమేక్ సినిమాలు చేస్తున్నాను. ‘96’ తమిళ చిత్రాన్ని ‘జాను’ పేరుతో చేశాను. నాని హీరోగా తెలుగులో విజయం సాధించిన ‘జెర్సీ’ చిత్రాన్ని షాహిద్ కపూర్‌తో హిందీలో రీమేక్ చేస్తున్నా. బాలీవుడ్లో నిర్మాతగా నాకిది ఫస్ట్ సినిమా. అలాగే హిందీ ‘పింక్’ను తెలుగులో పవన్ కల్యాణ్ హీరోగా చేస్తున్నాను. ఈ సినిమాను మే 15న రిలీజ్ చేయాలనుకుంటున్నాం. ► ‘జాను’ సినిమా విషయానికొస్తే ‘96’ సినిమా ట్రైలర్ చూడగానే ఆసక్తిగా అనిపించింది. అప్పటినుండి దాన్ని ఫాలో అవుతూ వచ్చాను. నాకు తమిళ్ పెద్దగా అర్థం కాకపోయినా సినిమా టచ్ చేసింది. ఈ సినిమాలో అద్భుతమైన సన్నివేశాలతో పాటు చిన్నప్పటి ఫ్రెండ్స్, రీయూనియన్ అనగానే పాత రోజు లకు వెళ్లిపోతాం. జనరల్‌గా పదో తరగతి ప్రేమలు సక్సెస్ కావు. ఈ సినిమాలోనూ అంతే. ఈ పాయింట్ లె లుగు ప్రేక్షకులకు ఖచ్చితంగా నచ్చుతుంది. ► అల్లు అర్జున్‌తో మేం చేసిన ‘ఆర్య’ సినిమాకి ఈ చిత్రదర్శకుడు ప్రేమ్‌కుమార్ అసిస్టెంట్ కెమెరామేన్‌గా చేశాడట. మాకు గుర్తు లేదు. ‘96’ చూడ్డానికి కెమెరామేన్ విజయ్ చక్రవర్తితో వెళ్లినప్పుడు తను ఆ విషయం నాకు చెప్పాడు. మీకు ఆసక్తి ఉంటే తెలుగులో కూడా మీరే డైరెక్ట్ చెయ్యండని ప్రేమ్‌తో అంటే, సరే అన్నారు. తెలుగు ఆడియన్స్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ కథలో చిన్న మార్పులు చేశాం. ► నేను ఈ సినిమా చూస్తున్నప్పుడే త్రిష ప్లేస్‌లో సమంతను ఊహించుకున్నాను. ముందు సమంత ఈ సినిమాలో నటించటానికి భయపడింది. షూటింగ్ స్టార్ట్ అయిన రెండు రోజుల తర్వాత ప్రతి రోజూ మేజిక్ జరుగుతోంది, మీరు నన్ను ఒప్పించకుంటే మంచి సినిమా మిస్ అయ్యేదాన్ని అని మెసేజ్ పెట్టింది. ► విజయ్ సేతుపతి ‘96’లో అద్భుతంగా నటించాడు. అతనిలాంటి హీరో దొరుకుతాడా అనుకున్నాను కానీ, ఈ కథను ఓన్ చేసుకొని శర్వానంద్ అద్భుతంగా బ్యాలెన్స్ చేశాడని ప్రేమ్‌కుమార్ అన్నాడు. మా బేనర్లో నెక్ట్స్ మహేశ్‌బాబు హీరోగా సినిమా ఉంటుంది. దర్శకుడు వంశీ పైడిపల్లి స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నారు. -
మనతో పాటు ఇంటికి వచ్చే చిత్రం జాను
‘‘96’ సినిమాను రీమేక్ చేయొద్దు అని’ రాజుగారికి నా అభిప్రాయం చెప్పాను. శర్వానంద్, సమంత చేస్తున్నారని తెలిసిన తర్వాత ఎప్పుడెప్పుడు చూస్తానా? అని ఎదురుచూస్తున్నా’’ అని నాని అన్నారు. శర్వానంద్, సమంత జంటగా సి.ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జాను’. తమిళ చిత్రం ‘96’కి ఇది తెలుగు రీమేక్. ‘దిల్’ రాజు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 7న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రీ–రిలీజ్ వేడుకలో ‘దిల్’ రాజు మాట్లాడుతూ – ‘‘జాను’ పాత్రలో సమంతను తప్ప ఎవర్నీ ఊహించుకోలేకపోయాను. శర్వా కూడా ‘96’ చూసి సూపర్ అన్నాడు. ఒరిజినల్ ‘96’ చేసిన ప్రేమ్‌కుమార్, టెక్నీషియన్స్ అందరూ ఈ సినిమాకు పని చేశారు. షూటింగ్ సమయంలో శర్వా ప్రయాణిస్తున్న జీపు బోల్తా పడింది. దేవుడి దయ వల్ల ఏమీ కాలేదు. ఆ తర్వాత మరో ఇబ్బంది. ఒక్కో అడ్డంకి దాటుకొని సినిమా పూర్తి చేశాం. ఈ సినిమా చూసి ప్రేక్షకులు ఎన్నో జ్ఞాపకాల్ని ఇంటికి తీసుకెళ్తారు’’ అన్నారు. ‘‘ఫ్యాన్స్‌ని నిరుత్సాపరచకూడదని ప్రతి సినిమాకు భయపడుతుంటా. ప్రతిరోజు మొదటి సినిమా షూటింగ్‌లానే భావిస్తాను. ప్రతిరోజూ షూటింగ్లో మ్యాజిక్ జరుగుతుండేది. ప్రేమ్‌కుమార్ మ్యాజిక్‌ని రిపీట్ చేశారు. ఫ్యాన్స్ అందరూ గర్వంగా ఫీలయ్యేలా చేస్తాననే అనుకుంటున్నాను’’ అన్నారు సమంత. ‘‘నిత్యామీనన్, సాయి పల్లవి, సమంత వంటి హీరోయిన్స్‌తో నటించేటప్పుడు చాలా అలర్ట్‌గా ఉండాలి. లేకపోతే సన్నివేశాలను తినేస్తారు. ప్రతీ సినిమా వంద శాతం చెక్ చేసుకుంటుంది సమంత. అందుకే సూపర్‌స్టార్ అయింది. ఆరు నుండి తొంభై ఏళ్ల వరకూ అందరికీ ‘జాను’ సినిమా కనెక్ట్ అవుతుంది. ఇంత మంచి సినిమా నాకు ఇచ్చిన టీమ్ అందరికీ థ్యాంక్స్. నానితో నా స్నేహం సారథి స్టూడియోస్‌లో ప్రారంభం అయింది. నేను, నరేశ్, నాని చాలా ట్రిప్స్‌కి వెళ్లే వాళ్లం’’ అన్నారు శర్వానంద్. ‘‘నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో శర్వా నా తొలి ఫ్రెండ్. శర్వానంద్, సమంత ఇద్దరూ బెస్ట్ పెర్ఫార్మర్స్. పోటీ పడి నటించారు. శర్వానంద్ చేసే ప్రతి సినిమాలో తనకు మంచి పేరు వస్తుంది. స్యామ్ ఎంచుకుంటున్న సినిమాలు చూసి గర్వపడుతున్నాను. రాజుగారికి ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా అవ్వాలి. కొన్ని సినిమాలు ఎంజాయ్ చేస్తాం. కొన్ని సినిమాలను ఇంటికి తీసుకెళ్తాం. ‘జాను’ మీతో పాటు ఇంటికి తీసుకువెళ్లే సినిమా’’ అన్నారు నాని. దర్శకుడు వంశీ పైడిపల్లి, నటీనటులు సాయి కిరణ్, గౌరి మాట్లాడారు. -
‘జాను’ ప్రీ రిలీజ్ వేడుక
-
‘జాను’నా మజాకా!
సమంత అక్కినేని, శర్వానంద్ జోడీగా నటించిన చిత్రం ‘జాను’. తమిళంలో సూపర్ డూపర్ హిట్టుగా నిలిచిన ప్రేమకథ చిత్రం ‘96’కు జాను రీమేక్ అన్న విషయం తెలిసిందే. అయితే తెలుగు నేటివిటీకి తగ్గట్టు కాస్త మార్పులు చేర్పులతో ఈ సినిమాను తెరకెక్కించారు. కాగా, తమిళంలో డైరెక్ట్ చేసిన ప్రేమ్‌కుమారే ‘జాను’చిత్రానికి దర్శకత్వం వహించారు. కాగా, ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వస్తోంది. ముఖ్యంగా చిత్ర ట్రైలర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. విడుదలైన కొద్ది గంటల్లోనే ఏకంగా ఐదు మిలియన్ వ్యూస్‌కు పైగా సొంతం చేసుకుంది. అంతేకాకుండా యూట్యూబ్‌లో తెగ ట్రెండ్ అవుతోంది. అయితే రీమేక్ చిత్రం అయినప్పటికీ జాను చిత్ర ట్రైలర్‌కు ఇంత స్పందన రావడంపై చిత్ర వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. సమంత, శర్వాల క్రేజ్‌తో పాటు, ట్రైలర్లో వారిద్దరి మధ్య వచ్చిన సీన్లు, సంభాషణలు ఆకట్టుకోవడమే దీనికి కారణమని భావిస్తున్నారు. 96 చిత్రంలోని విజయ్ సేతుపతి, త్రిషలకు సంబంధించిన ఛాయలు ఈ చిత్రంలో కనిపించకుండా దర్శక నిర్మాతలు జాగ్రత పడ్డట్టు ట్రైలర్లో స్పష్టంమవుతోంది. ట్రైలర్ గ్రాండ్ సక్సెస్‌తో చిత్రంపై అంచానలు ఓ రేంజ్‌కు వెళ్లాయి. ఇక దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రాకి గోవింద్ వసంత్ సంగీతమందిచాడు. ఫిబ్రవరి 7న విడుదల కానున్న ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు హైదరాబాద్‌లో జరగనుంది. చదవండి: ‘దిల్’ రాజుకి ఏమైనా మెంటలా! అది నా తీయని అనుభవం శర్వానంద్ ‘శ్రీకారం’ ముహూర్తం ఫిక్స్! -
అది నా తీయని అనుభవం
సినిమా: కొన్ని చాలా కష్టంగా ఉంటాయి అని చెప్పారు నటి సమంత. కోలీవుడ్ నుంచి టాలీవుడ్‌కు వెళ్లి అక్కడే జీవితంలోనూ సెటిల్ అయిన నటి ఈ బ్యూటీ. దక్షిణాదిలో అగ్రనటిగా రాణిస్తున్న సమంత సూపర్ డీలక్స్ చిత్రం తరువాత తమిళంలో నటించలేదు. అయితే త్వరలో ఒక భారీ చిత్రంలో నటించడానికి సిద్ధం అవున్నారనే ప్రచారం జరుగుతోంది. కాగా తమిళ సూపర్‌హిట్ చిత్రం 96 రీమేక్‌లో నటించారు. జాను పేరుతో తెరకెక్కిన ఈ చిత్ర విడుదల కోసం ఎదురు చూస్తున్నారు, అలాగని ఖాళీగా కూర్చోలేదు. ఫ్యామిలీమెన్ అనే వెబ్ సీరీస్‌లో నటిస్తున్నారు. వెబ్ సీరీస్‌లో నటించడం గురించి సమంత చెబుతూ డిజిటల్ ప్రపంచానికి తగ్గట్టుగా మనం మారాలని అన్నారు. వెబ్ సిరీస్ ఇప్పుడు దేశ వ్యాప్తం అవుతోందని అన్నారు. అభిమానులు ఆదరిస్తున్నారని చెప్పారు. అందుకే తానూ వెబ్ సీరీస్‌లో నటిస్తున్నట్లు పేర్కొన్నారు. సమంత ఇంకా మాట్లాడుతూ కొన్ని పాత్రల్లో నటించడం చాలా కష్టం అనిపిస్తుందని చెప్పారు. అనుకునట్లు తెరపై రిజల్ట్ రాకపోతే విమర్శల దాడి చేస్తారని అన్నారు. అదే అన్నీ కుదిరితే అభినందిస్తారని అన్నారు. అలాగా తమిళంలో సూపర్‌డీలక్స్ సినిమాను అంగీకరించే ముందు తాను ఇలానే ఆలోచించానని చెప్పారు. అందులో పాత్ర కొంచెం ధైర్యంతో పాటు, వివాదాస్పదంగా ఉందని భయపడ్డానన్నారు. ఆ పాత్రలో తాను నటించి న్యాయం చేయగలనా అని సంకోచించానని చెప్పారు. కారణం నటన సరిగ్గా లేకపోతే అభిమానుల విమర్శల దాడికి గురి కావలసి ఉంటుందని భయపడ్డానని అన్నారు. అందుకే ఆ చిత్రంలో నటిద్దామా? వద్దా? అని సందిగ్ధంలో పడ్డానని, అయితే చివరికి నటించడానికే నిర్ణయించుకున్నట్లు చెప్పారు. అలా నటించిన ఆ పాత్రకు ఎలాంటి విమర్శలు రాలేదు కదా, ఉత్తమ నటి అవార్డు వరించిందని సమంత చెప్పారు. ఆ చిత్రంలో నటించడం తీయని అనుభవంగా ఈ సంచలన నటి పేర్కొన్నారు. -
‘జాను’ ట్రైలర్ లాంచ్
-
సమంత ‘ప్రత్యూష’
హాయ్..ఐ యామ్ జానూ..’ అంటూ హీరోయిన్ సమంత సందడి చేసింది. శర్వానంద్, సమంత జంటగా నటించిన ‘జాను’ మూవీ విశేషాలను తెలిపేందుకు బుధవారంపార్క్ హయత్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆమెఇలా నవ్వులు చిందించారు. బంజారాహిల్స్: సమంత.. ఈ పేరు వింటే టాలీవుడ్ హీరోయిన్ అని అందరూ చెబుతారు. అయితే ఆమె నటి మాత్రమే కాదు..సేవాగుణమున్న మహిళ అని కొందరికే తెలుసు. దక్షిణాది అగ్రహీరోలందరితోనూ వరుస సినిమాలు చేసిన ఈ అగ్రతార ప్రత్యూష సపోర్ట్ అనే స్వచ్చంద సేవా సంస్థ ఏర్పాటు చేసి చిన్నారులకు వైద్యం అందజేస్తోంది. ఇటీవల ఆంధ్ర ఆసుపత్రి హార్ట్ అండ్ బ్రెయిన్ సెంటర్‌ను సందర్శించి సేవా కార్యక్రమాలకు ముందుకు వచ్చింది. గుండెజబ్బులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న చిన్నపిల్లలకు చికిత్స అందిస్తారు. అంతేకాదు ప్రాణాపాయ వ్యాధులకు కూడా వైద్యం అందిస్తున్నారు సమంత. ఇటీవల ప్రత్యూష సపోర్టు సహకారంతో వైద్యం చేయించుకున్న పిల్లలతో ఆమె సరదాగా గడిపారు. అంతమంది పిల్లల మధ్య తాను కూడా చిన్నపిల్లగా మారిపోయారు. ఆమె చేస్తున్న సేవా కార్యక్రమాలు నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఆమెకు మరింత ప్రోత్సాహాన్నిస్తూ నెటిజన్లు తెగ పొగిడేస్తున్నారు. ఎప్పుడూ పిల్లల మధ్యనే ఉంటూ పిల్లలతో కాలక్షేపం చేయడానికే సమంత ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు. పిల్లలకు సంబంధించిన ఫొటోలను తాను వారితో గడిచిన క్షణాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటున్నారు. దీంతో ఆమె పట్ల అభిమానులు మరింత అభిమానాన్ని పెంచుకుంటున్నారు. సమంత చేస్తున్న సామాజిక కార్యక్రమాలు అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా పేదపిల్లల సంక్షేమంపై ఆమె ప్రత్యేక దృష్టి సారించారు. -
‘దిల్’ రాజుకి ఏమైనా మెంటలా!
‘‘తమిళచిత్రం ‘96’ని తెలుగులో రీమేక్ చేస్తున్నాం అని వార్తలు రాగానే వీళ్లకేమైనా పిచ్చా? ‘దిల్’ రాజుకేమైనా మెంటలా? అని కామెంట్స్ వినిపించాయి. నేను ఏ ఫీలింగ్‌తో అయితే ఉన్నానో రేపు సినిమా చూసిన ప్రేక్షకులకు కూడా అదే ఫీలింగ్ కలుగుతుంది’’ అని ‘దిల్’ రాజు అన్నారు. శర్వానంద్, సమంత జంటగా సి. ప్రేమ్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జాను’. తమిళ చిత్రం ‘96’కి ఇది రీమేక్. ఫిబ్రవరి 7న ఈ చిత్రం విడుదల కానుంది. ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ‘దిల్’ రాజు మాట్లాడుతూ – ‘‘నా 17 ఏళ్ల కెరీర్లో ఇది తొలి రీమేక్. తమిళంలో రిలీజ్ కాకముందే చూశాను. తమిళం అర్థం కాకపోయినా ఆ పాత్రలతో కనెక్ట్ అయి ప్రయాణించాను. అప్పుడే రీమేక్ చేయాలని నిశ్చయించుకున్నాను. నాపై నమ్మకం ఉంచి సినిమా చేయమని సమంతకు చెప్పాను. సినిమా చూసి చేస్తానని శర్వా (శర్వానంద్) చెప్పాడు. ‘జాను’ చూశాక అమ్మాయిలు శర్వాతో, అబ్బాయిలు సామ్‌తో లవ్‌లో పడతారు. అలాంటి లవర్ మనకు లేరని ఈర్ష్య పడతారు’’ అన్నారు. ‘‘రీమేక్ చేయాలా వద్దా? అని మాట్లాడుకుంటున్నప్పుడు రాజు అన్న ‘నన్ను నమ్ము’ అన్నారు. ఆయన జడ్జిమెంట్ మీద నాకు నమ్మకం ఉంది. ‘శతమానం భవతి’ అప్పుడు కూడా ఇదే అన్నారు. నాకు మంచి హిట్ ఇచ్చారు. ఈసారి కూడా అదే చేస్తారనుకుంటున్నాను. సమంతగారు లేకపోతే నేను అంతగా యాక్ట్ చేయలేకపోయేవాడినేమో. లవ్ ఫెయిల్యూర్ అనేది జరుగుతూనే ఉంటుంది. అయితే ఫస్ట్ లవ్ అందరికీ గుర్తుంటుంది. ఈ పదేళ్లలో ఇలాంటి లవ్‌స్టోరీ రాలేదనుకుంటున్నా’’ అన్నారు శర్వానంద్. ‘‘రీమేక్ మూవీ కోసం రాజుగారు కలుస్తాను అంటే భయపడ్డాను. ఒకవేళ ఆయన్ను కలిస్తే సినిమాకి ఓకే చెప్పేస్తాను. ఆయన బ్యానర్‌తో ఉన్న అనుబంధం కారణంగా ఈ సినిమా ఒప్పుకున్నాను. ప్రతిరోజూ సెట్లో మ్యాజిక్ జరగాలంటే కష్టం. కానీ శర్వానంద్ వల్ల ఆ కష్టాన్ని దాటేశాం. నా పర్ఫార్మెన్స్కి వచ్చే క్రెడిట్ మా ఇద్దరికీ దక్కుతుంది’’ అన్నారు సమంత. -
‘నువ్ వర్జినేనా.. ఛీ ఛీ ఏం మాట్లాడుతున్నావ్’
శర్వానంద్, సమంత జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘జాను’. సి. ప్రేమ్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దిల్‌రాజు నిర్మిస్తున్నారు. తమిళనాట సంచలన విజయం సాధించిన 96 సినిమాకు ఇది రీమేక్. తమిళంలో త్రిష, విజయ్ సేతుపతి జంటగా నటించారు. అక్కడ ఈ చిత్రం క్లాసిక్‌గా నిలిచింది. ఇదే సినిమాను జాను పేరుతో రీమేక్ చేస్తున్నాడు ప్రేమ్ కుమార్. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్ అభిమానులను తెగ ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల చేసింది చిత్ర బృందం. ‘ఎగిసిపడే కెరటాల్లో.. ఎదురుచూసే సముద్ర తీరాన్ని నేను.. పిల్లగాలి కోసం ఎదురుచూసే నల్లమబ్బులా.. ఓరచూపు కోసం నీ దోరనవ్వు కోసం రాత్రంతా చుక్కలు లెక్కపెడుతుంది నా హృదయం.. నా వైపు ఓ చూపు అప్పు ఈయలేవా..?’ అంటూ చాలా పొయెటిక్‌గా ఈ చిత్ర ట్రైలర్ కట్ చేసాడు దర్శకుడు ప్రేమ్ కుమార్. ‘నువ్ వర్జినేనా అని సమంత అడగడం.. ఛీ ఛీ ఏం మాట్లాడుతున్నావ్ జాను’ శర్వానంద్ తెగ సిగ్గుపడిపోవడం యూత్‌కి కనెక్ట్ అయ్యే విధంగా ఉంది. ‘ఒక్కోసారి జీవితంలో ఏమీ జరగకపోయినా.. ఏమో జరిగిపోతుందని మనసుకి మాత్రం ముందే తెలిసిపోతుంది’ అంటూ సమంత చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటుంది. ‘ 10 నెలల మోసి కన్న మీ అమ్మకు నువ్వు సొంతం అయితే.. ఇనాళ్లుగా మనసులో మోస్తున్న నాకు కూడా నువ్వు సొంతమే’ అంటూ శర్వానంద్ చెప్పే డైలాగ్ మనసును తాకే విధంగా ఉంది. ఎలాంటి కుదుపులు లేకుండా హృదయాలను హత్తుకునే విధంగా, చాలా అందంగా ట్రైలర్ సాగింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని వచ్చే నెల 7న ఈ సినిమాను విడుదల చేసేందుకు చిత్ర బృదం ప్రయత్నిస్తోంది. గోవింద్ వసంత్ సంగీతమందిస్తున్నాడు.