సినిమా: కొన్ని చాలా కష్టంగా ఉంటాయి అని చెప్పారు నటి సమంత. కోలీవుడ్ నుంచి టాలీవుడ్‌కు వెళ్లి అక్కడే జీవితంలోనూ సెటిల్ అయిన నటి ఈ బ్యూటీ. దక్షిణాదిలో అగ్రనటిగా రాణిస్తున్న సమంత సూపర్ డీలక్స్ చిత్రం తరువాత తమిళంలో నటించలేదు. అయితే త్వరలో ఒక భారీ చిత్రంలో నటించడానికి సిద్ధం అవున్నారనే ప్రచారం జరుగుతోంది. కాగా తమిళ సూపర్‌హిట్ చిత్రం 96 రీమేక్‌లో నటించారు. జాను పేరుతో తెరకెక్కిన ఈ చిత్ర విడుదల కోసం ఎదురు చూస్తున్నారు, అలాగని ఖాళీగా కూర్చోలేదు. ఫ్యామిలీమెన్ అనే వెబ్ సీరీస్‌లో నటిస్తున్నారు. వెబ్ సీరీస్‌లో నటించడం గురించి సమంత చెబుతూ డిజిటల్ ప్రపంచానికి తగ్గట్టుగా మనం మారాలని అన్నారు.
వెబ్ సిరీస్ ఇప్పుడు దేశ వ్యాప్తం అవుతోందని అన్నారు. అభిమానులు ఆదరిస్తున్నారని చెప్పారు. అందుకే తానూ వెబ్ సీరీస్‌లో నటిస్తున్నట్లు పేర్కొన్నారు. సమంత ఇంకా మాట్లాడుతూ కొన్ని పాత్రల్లో నటించడం చాలా కష్టం అనిపిస్తుందని చెప్పారు. అనుకునట్లు తెరపై రిజల్ట్ రాకపోతే విమర్శల దాడి చేస్తారని అన్నారు. అదే అన్నీ కుదిరితే అభినందిస్తారని అన్నారు. అలాగా తమిళంలో సూపర్‌డీలక్స్ సినిమాను అంగీకరించే ముందు తాను ఇలానే ఆలోచించానని చెప్పారు. అందులో పాత్ర కొంచెం ధైర్యంతో పాటు, వివాదాస్పదంగా ఉందని భయపడ్డానన్నారు. ఆ పాత్రలో తాను నటించి న్యాయం చేయగలనా అని సంకోచించానని చెప్పారు. కారణం నటన సరిగ్గా లేకపోతే అభిమానుల విమర్శల దాడికి గురి కావలసి ఉంటుందని భయపడ్డానని అన్నారు. అందుకే ఆ చిత్రంలో నటిద్దామా? వద్దా? అని సందిగ్ధంలో పడ్డానని, అయితే చివరికి నటించడానికే నిర్ణయించుకున్నట్లు చెప్పారు. అలా నటించిన ఆ పాత్రకు ఎలాంటి విమర్శలు రాలేదు కదా, ఉత్తమ నటి అవార్డు వరించిందని సమంత చెప్పారు. ఆ చిత్రంలో నటించడం తీయని అనుభవంగా ఈ సంచలన నటి పేర్కొన్నారు.
అది నా తీయని అనుభవం
Published Thu, Jan 30 2020 8:35 AM | Last Updated on Thu, Jan 30 2020 8:35 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment