'96' సినిమా పేరు చెప్పగానే ఓ అందమైన లవ్ స్టోరీనే గుర్తొస్తుంది. విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించిన ఈ చిత్రంలో చైల్డ్ ఆర్టిస్టులు కూడా చాలా ఫేమస్ అయ్యారు. చిన్నప్పటి త్రిషగా చేసిన నటి.. ఇప్పుడు హీరోయిన్ అయిపోయింది. తెలుగు, తమిళం, మలయాళంలో సినిమాలు చేస్తోంది. అలాంటి ఆ బ‍్యూటీ తన బాడీలో ఎవరికీ చూపించుకోలేని ఓ చోట టాటూ వేసుకుని హాట్ టాపిక్ అయిపోయింది.
(ఇదీ చదవండి: డేట్‌కి వెళ‍్లిన మెగా కపుల్.. ఆ ఫొటోలు వైరల్)
96 రీమేక్ గా తెలుగులో తీసిన 'జాను'లోనూ నటించిన గౌరీ కిషన్.. ఆ తర్వాత పలు సినిమాల్లో సహాయ పాత్రలు చేసింది. ఇప్పుడు మాత్రం హీరోయిన్ గా బిజీగా అయిపోయింది. ఈ ఏడాది ప్రారంభంలో తెలుగులో 'శ్రీదేవి శోభన్ బాబు' అనే మూవీలో నటించింది గానీ అది ఫ్లాఫ్ అవడంతో ఇక్కడ ఈమెకు అవకాశాలు రాలేదు. దీంతో తమిళ, మలయాళంలో మాత్రమే చేస్తోంది.
తాజాగా ఇన్ స్టాలో ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేసిన గౌరీ.. తన ఒంటిపై టాటూ వేసుకుంటున్న చిన్న వీడియోని స్టోరీలో పోస్ట్ చేసింది. అది ఎక్కడ అనేది చెప‍్పుకోండి అని చిన్న పజిల్ పెట్టింది. ఆ తర్వాత కాసేపటికి తన రిబ్స్‌పై పచ్చబొట్టు వేసుకున్నానని చెబుతూ ఓ పిక్ షేర్ చేసింది. ఇది చూసి నెటిజన్స్ అవాక్కయ్యారు. ప్రస్తుతం ఈ టాటూ పిక్ కాస్త వైరల్‌గా మారిపోయింది.
(ఇదీ చదవండి: ఆమె వల్ల చనిపోదామనుకున్నా.. నటుడు అబ్బాస్ కామెంట్స్)
Comments
Please login to add a commentAdd a comment