యంగ్ హీరో శర్వానంద్‌కి సర్జరీ!? | Tollywood Hero Sharwanand Gone to America for Surgery - Sakshi
Sakshi News home page

Actor Sharwanand: అమెరికాలో శర్వాకు సర్జరీ.. ఇంతకీ ఏమైంది?

Published Fri, Aug 25 2023 4:56 PM | Last Updated on Fri, Aug 25 2023 5:34 PM

Actor Sharwanand Surgery In USA - Sakshi

యంగ్ హీరో శర్వానంద్ త్వరలో సర్జరీ చేసుకోనున్నాడట. ఈ విషయమై అమెరికా వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అభిమానులు కంగారు పడుతున్నారు. తెలుగు ప్రేక్షకులు అసలేం జరిగిందా అని అనుకుంటున్నారు. ఇంతకీ ఏంటి సంగతి?

డిఫరెంట్ మూవీస్‌తో ఎంటర్‌టైన్ చేసే హీరోల్లో శర్వానంద్ ఒకడు. 'రన్ రాజా రన్' నుంచి రూట్ మార్చి.. ఫన్ కమర్షియల్ సినిమాలతో అలరిస్తున్నాడు. ప్రస్తుతం 'బేబీ ఆన్ బోర్డ్' మూవీతో బిజీగా ఉన్న ఇతడు.. సర్జరీ కోసం అమెరికా వెళ్లాడనే విషయం చర్చనీయాంశమైంది.

(ఇదీ చదవండి: 'పుష్ప 2' ముందున్న కొత్త సవాళ్లు.. బన్నీ ఏం చేస్తాడో?)

గతంలో 'జాను' షూటింగ్ సందర్భంగా చాలా ఎత్తు నుంచి శర్వా పడిపోయాడని, చాలా గాయాలు అయ్యాయని అప్పట్లో న్యూస్ వచ్చింది. అయితే గాయాలు మానిపోయినప్పటికీ.. నొప్పి మాత్రం అలానే ఉండిపోయిందట. ఇప్పుడు దాన్ని సర్జరీతో క్లియర్ చేసుకునేందుకే యూఎస్ వెళ్లాడని అంటున్నారు. 

ఇక అమెరికా నుంచి వచ్చిన తర్వాత పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థ తీసే సినిమాలో నటిస్తాడు. అలానే చిరంజీవి కొత్త సినిమాలోనూ శర్వా.. కీలకపాత్ర చేస్తున్నాడని సమాచారం. ఇదిలా ఉండగా ఈ మధ్యే రక్షితా అనే అమ్మాయిని శర్వానంద్ పెళ్లి చేసుకున్నాడు. 

(ఇదీ చదవండి: 'జై భీమ్'కి జాతీయ అవార్డ్ అందుకే మిస్ అయిందా?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement