
అజయ్ (ఫైల్)
అమీర్‌పేట: ఎర్రగడ్డ గోకుల్ థియేటర్‌లో సినిమా చూస్తూ ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. ఎస్‌ఆర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సాయంత్రం ఈ సంఘట జరిగింది. శుక్రవారం జాను సినిమా విడుదల కావడంతో మ్యాట్నిషో చూసేందుకు ఓ వ్యక్తి థియేటర్‌కు వచ్చాడు. సినిమా అయిపోయాక ప్రేక్షకులు అందరు వెళ్లిపోయినా అతడు సీట్లో నుండి లేవకపోవడాన్ని గమనించిన సిబ్బంది దగ్గరకు వెళ్లి లేపేందుకు ప్రయత్నించారు.అప్పటికే మృతి చెందినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. థియేటర్‌కు వచ్చిన ఎస్‌ఐ మహేందర్ మృతదేహన్ని స్వాధీనం చేసుకుని గాంధీ మార్చురీకి తరలించారు.అతడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించక పోవడంతో గుర్తు తెలియని వ్యక్తి మృతిగా కేసు నమోదు చేశారు. గుండె పోటుతో మృతి చెందాడా లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్‌పెక్టర్ మురళీకృష్ణ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment