
సమంత అక్కినేని, శర్వానంద్ జోడీగా నటించిన చిత్రం ‘జాను’. తమిళంలో సూపర్ డూపర్ హిట్టుగా నిలిచిన ప్రేమకథ చిత్రం ‘96’కు జాను రీమేక్ అన్న విషయం తెలిసిందే. అయితే తెలుగు నేటివిటీకి తగ్గట్టు కాస్త మార్పులు చేర్పులతో ఈ సినిమాను తెరకెక్కించారు. కాగా, తమిళంలో డైరెక్ట్ చేసిన ప్రేమ్‌కుమారే ‘జాను’చిత్రానికి దర్శకత్వం వహించారు. కాగా, ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వస్తోంది. ముఖ్యంగా చిత్ర ట్రైలర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. విడుదలైన కొద్ది గంటల్లోనే ఏకంగా ఐదు మిలియన్ వ్యూస్‌కు పైగా సొంతం చేసుకుంది. అంతేకాకుండా యూట్యూబ్‌లో తెగ ట్రెండ్ అవుతోంది.
అయితే రీమేక్ చిత్రం అయినప్పటికీ జాను చిత్ర ట్రైలర్‌కు ఇంత స్పందన రావడంపై చిత్ర వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. సమంత, శర్వాల క్రేజ్‌తో పాటు, ట్రైలర్‌లో వారిద్దరి మధ్య వచ్చిన సీన్లు, సంభాషణలు ఆకట్టుకోవడమే దీనికి కారణమని భావిస్తున్నారు. 96 చిత్రంలోని విజయ్ సేతుపతి, త్రిషలకు సంబంధించిన ఛాయలు ఈ చిత్రంలో కనిపించకుండా దర్శక నిర్మాతలు జాగ్రత పడ్డట్టు ట్రైలర్‌లో స్పష్టంమవుతోంది. ట్రైలర్ గ్రాండ్ సక్సెస్‌తో చిత్రంపై అంచానలు ఓ రేంజ్‌కు వెళ్లాయి. ఇక దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రాకి గోవింద్ వసంత్ సంగీతమందిచాడు. ఫిబ్రవరి 7న విడుదల కానున్న ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు హైదరాబాద్‌లో జరగనుంది.
చదవండి:
‘దిల్’ రాజుకి ఏమైనా మెంటలా!
Comments
Please login to add a commentAdd a comment