
బాహుబలి, సాహో చిత్రాల తర్వాత ప్రభాస్ క్రేజ్ ఖండాంతరాలు దాటింది. హాలీవుడ్ హీరో రేంజ్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఈ రెబల్ స్టార్‌కు ఏర్పడింది. అయితే ‘సాహో’తర్వాత ‘జిల్’ఫేం రాధాకృష్ణ సినిమాలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. రొమాంటిక్ ఎంటర్‌టైనర్ జానర్‌లో, ఇటలీ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రం తెరకెక్కుతుందని సమాచారం. 'జాన్' అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ చిత్రం షూటింగ్ జరుపుకొంటోంది. అయితే వర్కింగ్ టైటిల్‌నే సినిమా టైటిల్‌గా డిసైడ్ అయినట్లు కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ మూవీ టైటిల్‌ను మార్చాలని చూస్తోందట చిత్రబృందం.
ఇప్పటికే జనాల్లోకి వెళ్లిపోయిన ఈ టైటిల్‌తో వెళితే సినీ అభిమానుల్లో అంత హైప్ క్రియేట్ అవదని చిత్ర యూనిట్ భావించిందట. ఈ సినిమాపై అభిమానుల్లో మరిన్ని అంచనాలు పెంచడానికి మరో డిఫరెంట్ టైటిల్ కోసం చిత్ర బృందం ఇప్పటికే అన్వేషణ మొదలుపెట్టిందట. ఇందుకోసం ప్రభాస్ అభిమానుల నుంచి కూడా సలహాలు తీసుకోనుందని సమాచారం. అయితే ప్రభాస్ కొత్త సినిమా పేరు ‘జాన్’ కాదని తెలియడంతో దిల్ రాజు తన సినిమా విషయంలో నిర్భయంగా ముందడుగేశాడు. తమిళ సూపర్ డూపర్ హిట్ చిత్రం ‘96’ను దిల్ రాజు తెలుగులో రిమేక్ చేస్తున్న విషయం తెలిసిందే.
అయితే ఈ చిత్రం ప్రారంభం నుంచి తన చిత్రానికి ‘జాను’అనే టైటిల్‌ను పెట్టాలని ఆలోచించాడట. కానీ ప్రభాస్ ‘జాన్’ తో దగ్గరి పోలికలు ఉండటంతో ఈ అగ్ర నిర్మాత కాస్త తటపటాయించాడట. అందుకే నిర్మాణం పూర్తయ్యే వరకు కూడా చిత్ర టైటిల్‌ను డిసైడ్ చేయలేకపోయాడు దిల్ రాజు. తాజాగా అతడికి అందిన సమాచారం ప్రకారం రాధాకృష్ణ టీం ఆ టైటిల్‌ను వదులుకున్నట్లు తెలియడంతో వెంటనే తన చిత్రానికి ‘జాను’ అనే టైటిల్ ఫిక్స్ చేసి వెంటనే ఫస్ట్‌లుక్, టీజర్‌ను విడుదల చేసినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment