తమిళ సూపర్ హిట్ సినిమా ‘96’ కు రిమేక్‌గా వస్తున్న ‘జాను’ చిత్ర యూనిట్ ఓ ఫోటో కాంటెస్టు పెట్టింది. #MyClickForJaanu అని ట్విటర్‌లో హాష్‌టాగ్‌తో నెటిజన్ల నుంచి ఫొటోలను ఆహ్వానిస్తోంది. అద్భుతమైన ఫొటోలు పంపిన వారికి హీరో, హీరోయిన్లు శర్వానంద్, సమంతతో ఫొటో దిగే అవకాశాన్ని కల్పిస్తామని తెలిపింది. ఇప్పటికే వేలాది ఫొటోలు వచ్చాయని చిత్ర యూనిట్ వెల్లడించింది.
(చదవండి : ఎక్కడ వదిలేసానో అక్కడే ఉన్నాను..)
‘జాను’ కోసం చక్కని ఫొటోలు పంపుతున్నారని హీరోయిన్ సమంత ఆనందం వ్యక్తం చేశారు. మరెన్నో ఫొటోలు పంపాలని ఆమె కోరారు. ఈ ఫొటో కాంటెస్ట్‌కు జనవరి 31 చివరి రోజు అని ఆమె పేర్కొన్నారు. కాగా, ‘96కి దర్శకత్వం వహించిన సీ.ప్రేమ్‌కుమార్ జాను చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈసినిమాను నిర్మిస్తున్నారు. 96కు పనిచేసిన గోవింద్ వసంతన్ ‘జాను’కు సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా వచ్చే నెల ప్రారంభంలో విడుదల కానుంది.
Introduce us to your beautiful world through your best capture!
— Sri Venkateswara Creations (@SVC_official) January 16, 2020
Share a photo clicked by you with the hashtag #MyClickForJaanu and win a chance to photograph our stars #Sharwanand and @Samanthaprabhu2 !! @SVC_Official @premkumar1710 @Govind_Vasantha @CinemaInMyGenes #Jaanu pic.twitter.com/be6kJXuaUH
Comments
Please login to add a commentAdd a comment