Photo Contest
-
శ్రేయోవి కేరాఫ్ అడవి
అందరి చేతుల్లో ఫోన్లు ఉంటాయి. ‘కాస్త ఫొటో తీయరా’ అనంటే బుడుంగుమని వచ్చి క్లిక్ చేస్తాం. అంతమాత్రం చేత మనం ఫొటోగ్రాఫర్లం అవము. ఫొటోగ్రఫీ పెద్ద ఆర్ట్. ఫ్యాషన్ ఫొటోగ్రఫీ, ఔట్‌డోర్ ఫొటోగ్రఫీ, స్టిల్ ఫొటోగ్రఫీ... ఇలా చాలా విభాగాలున్నాయి. వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రఫీ కూడా ఒకటి. అంటే వన్యజీవితాన్ని ఫొటోలు తీయడం. దీనికి అభిరుచి, ధైర్యం, నైపుణ్యం కావాలి. అడవుల్లోకి వెళ్లి రోజుల తరబడి ఎదురు చూస్తేనే ఒక మంచి ఫొటో దొరుకుతుంది. అలాంటి ఫొటో తీసి అంతర్జాతీయ గుర్తింపు పోందింది శ్రేయోవి మెహతా.ఫరిదాబాద్‌లో నాల్గవ తరగతి చదువుతున్న ఈ 9 సంవత్సరాల చిన్నారి చిన్నప్పటి నుంచి ఫొటోలు తీయడం నేర్చుకుంది. కారణం ఆమె తండ్రి శివాంగ్ మెహతా మంచి ఫొటోగ్రాఫర్. తల్లి కహాని మెహతా పర్యాటకులను అభయారణ్యాలకు తీసుకెళుతుంటుంది. శ్రేయోవి తన తల్లిదండ్రులతో రాజస్థాన్‌లోని భరత్పూర్ నేషనల్ పార్క్‌లో ఉన్నప్పుడు ఒక తెల్లవారుజామున వాకింగ్ చేస్తుంటే హటాత్తుగా దూరంగా రెండు నెమళ్లు కనిపించాయి. పక్కనే ఒక లేడి కూన. వెంటనే శ్రేయోవి తన కెమెరా తీసి మోకాళ్ల మీద కూచుని క్లిక్ చేసింది. ఆ తెల్లవారుజామున మంచుకురుస్తున్న వేళ చీకటి వెలుతురుల్లో ఆ ఫొటో అద్భుతంగా కుదిరింది.60 వేల ఎంట్రీల్లో ఒకటిలండన్లోని ‘నేచురల్ హిస్టరీ మ్యూజియం’ ప్రతి ఏటా ‘వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్‘ అవార్డు కోసం ఎంట్రీలు పిలుస్తుంది. ఇందులో వయసును బట్టి విభాగాలుంటాయి. 10 ఏళ్ల లోపు విభాగంలో 117 దేశాల నుంచి 60 వేలమంది బాలలు తాము తీసిన వైల్డ్‌లైఫ్ ఫొటోలు పంపితే శ్రేయోవి ఈ ఫొటో పంపింది. ఇంతమందిని దాటి శ్రేయోవి ఈ ΄ోటీలో రన్నర్ అప్‌గా నిలిచింది. అంటే సెకండ్ ప్లేస్ అన్నమాట. అయినా సరే ఇది పెద్ద విజయం. ‘మా అమ్మా నాన్నా ప్రోత్సహించడం వల్ల నేను ఇలా గుర్తింపు పోందాను’ అంటోంది శ్రేయోవి. పెద్దయ్యి ఇంకా గొప్ప ఫొటోలు తీస్తానంటోంది. -
మన కంటికి కనిపించని అద్భుతాలు.. డ్రోన్ కంటితో చూడొచ్చు..
మన కంటికి కనిపించని అద్భుతాలు.. డ్రోన్ కంటితో చూడొచ్చు.. దానికి నిదర్శనమే ఈ చిత్రాలు.. ఆస్ట్రేలియాలోని న్యూసౌత్‌వేల్స్‌ను చుట్టుముట్టేస్తున్నట్లు కనిపిస్తున్న తుపాను మేఘం.. సహారా ఎడారిలో చివరెక్కడుందో తెలియనంత పొడవున్న గూడ్సు రైలు.. మంచుదుప్పట్లో మురిపిస్తున్న తాజ్‌మహల్ (వెనుక వైపు ఫొటో).. ఈ చిత్రాలు.. 2022 డ్రోన్ ఫొటో పురస్కారాల్లో అర్బన్ కేటగిరీలో జ్యూరీ ప్రశంసలను అందుకున్నాయి. 116 దేశాల నుంచి 2,600 మంది ఫొటోగ్రాఫర్లు తమ ఎంట్రీలను పంపారు. ఆస్ట్రేలియాలోని న్యూసౌత్‌వేల్స్‌ను చుట్టుముట్టేస్తున్నట్లు కనిపిస్తున్న తుపాను మేఘం సహారా ఎడారిలో చివరెక్కడుందో తెలియనంత పొడవున్న గూడ్సు రైలు మంచుదుప్పట్లో మురిపిస్తున్న తాజ్‌మహల్ -
ఒక చావు.. మరో పుట్టుక.. ఈగను చంపేసి వృద్ధి చెందిన ‘జాంబీ’ ఫంగస్
ఈ ఫొటో చూశారా? ‘బీఎంసీ ఎకాలజీ అండ్ ఎవాల్యూషన్ ఇమేజ్’ పోటీలో మొదటిస్థానం దక్కించుకుంది. అందులో ప్రత్యేకత ఏముందనేగా సందేహం? ఈగలోకి ప్రవేశించిన ‘జాంబీ’ ఫంగస్ ఈగను చంపేసి.. అది వృద్ధి చెందింది. ఈగ మరణించి... ఫంగస్ బతకడమే కాదు, మరింత విస్తరించటానికి ఉపయోగపడింది. ఒక చావు.. మరో పుట్టుక. జీవ పరిణామ క్రమమే అది కదా! సైన్స్ ఫిక్షన్‌ను తలపిస్తున్న ఈ చిత్రాన్ని పరిణామ జీవశాస్త్రవేత్త రాబర్టో గ్రాసా రో, పెరూలోని తంబోపత నేషనల్ రిజర్వ్‌లో క్యాప్చర్ చేశాడు. రిలేషన్షిప్స్ ఇన్ నేచర్, బయోడైవర్సిటీ అండర్ థ్రెట్, లైఫ్ క్లోజప్, రీసర్జ్ ఇన్ యాక్షన్ అనే నాలుగు కేటగిరీల్లో జరిగిన పోటీల్లో... జాంబీ ఫంగస్ ఫొటో టాప్ ప్రైజ్ గెలుచుకుంది. చదవండి: మిస్టరీ కేసు: ఆన్లైన్ వేలంలో కొన్న సూట్‌కేసులో ఏముందంటే... -
జనవరి 31 లోగా ఫొటోలు పంపండి : సమంత
తమిళ సూపర్ హిట్ సినిమా ‘96’ కు రిమేక్‌గా వస్తున్న ‘జాను’ చిత్ర యూనిట్ ఓ ఫోటో కాంటెస్టు పెట్టింది. #MyClickForJaanu అని ట్విటర్లో హాష్‌టాగ్‌తో నెటిజన్ల నుంచి ఫొటోలను ఆహ్వానిస్తోంది. అద్భుతమైన ఫొటోలు పంపిన వారికి హీరో, హీరోయిన్లు శర్వానంద్, సమంతతో ఫొటో దిగే అవకాశాన్ని కల్పిస్తామని తెలిపింది. ఇప్పటికే వేలాది ఫొటోలు వచ్చాయని చిత్ర యూనిట్ వెల్లడించింది. (చదవండి : ఎక్కడ వదిలేసానో అక్కడే ఉన్నాను..) ‘జాను’ కోసం చక్కని ఫొటోలు పంపుతున్నారని హీరోయిన్ సమంత ఆనందం వ్యక్తం చేశారు. మరెన్నో ఫొటోలు పంపాలని ఆమె కోరారు. ఈ ఫొటో కాంటెస్ట్‌కు జనవరి 31 చివరి రోజు అని ఆమె పేర్కొన్నారు. కాగా, ‘96కి దర్శకత్వం వహించిన సీ.ప్రేమ్‌కుమార్ జాను చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈసినిమాను నిర్మిస్తున్నారు. 96కు పనిచేసిన గోవింద్ వసంతన్ ‘జాను’కు సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా వచ్చే నెల ప్రారంభంలో విడుదల కానుంది. Introduce us to your beautiful world through your best capture! Share a photo clicked by you with the hashtag #MyClickForJaanu and win a chance to photograph our stars #Sharwanand and @Samanthaprabhu2 !! @SVC_Official @premkumar1710 @Govind_Vasantha @CinemaInMyGenes #Jaanu pic.twitter.com/be6kJXuaUH — Sri Venkateswara Creations (@SVC_official) January 16, 2020 -
'ఆ చిన్న పని మీ ఊళ్లోనే చేసుకొండి'
ఓ బుడ్డోడు రోడ్డు మీద చిన్న పని కానిచ్చాడు. మనకైతే ఇది చాలా మామూలు విషయం. చెడ్డీ పైకి లాగి 'గుడ్ బాయ్... బట్టలు ఖరాబు చేసుకోలేదు. చెప్పి రోడ్డు మీద పని చేశావు... ' అని మెచ్చుకుంటాం కూడా. కానీ హాంకాంగ్ లో ఇప్పుడీ చిన్న పనే పెద్ద వివాదానికి దారి తీస్తోంది. హాంకాంగ్ ఈ మధ్యే చైనాలో కలిసింది. అక్కడ ఇలాంటివి నిషిద్ధం. కానీ చైనాలో మాత్రం చిన్న పిల్లల వరకూ ఇది ఓకే. దాంతో హాంకాంగ్ ప్రజలు చైనా మెయిన్‌లాండ్ ప్రజలను వేళాకోళం చేస్తున్నారు. ఇదిగో... ఇక్కడ కనిపిస్తున్న ఈ ఫోటోయే ప్రస్తుతం వివాదానికి కారణం. మెయిన్ లాండ్ చైనా ప్రజలు వచ్చి హాంకాంగ్ ను ఖరాబు చేస్తున్నారంటూ ఉద్యమాలు కూడా జరుగుతున్నాయి. ఓ పాపులర్ షాపింగ్ సెంటర్ అయితే ఏకంగా రోడ్డుపై చిన్న, పెద్ద పనులు చేస్తున్న మెయిన్ లాండ్ ప్రజల ఫోటోలతో ఒక ఎగ్జిబిషన్ కూడా నిర్వహించేసింది. దీనిలో ఏకంగా 800 మంది పాల్గొన్నారు. మెయిన్ లాండర్లు మాత్రం దీనిపై భగ్గుమంటున్నారు. 'చిన్న పిల్లలకు ఏం తెలుసు. బ్లాడర్ బద్దలైపోతుంటే వాళ్లు మాత్రం ఏం చేస్తారు?' అని వారు సర్దిచెబుతున్నారు. 'దయచేసి వాష్ రూమ్ లు ఎక్కడున్నాయో స్పష్టంగా తెలిసేలా కొంచెం ఎక్కువ సైన్ బోర్డులు పెట్టండి మహాప్రభో' అంటూ మెయిన్ లాండర్లు వేడుకుంటున్నారు. అయితే 'అంత మంది చూస్తూండగా పిల్లలతో ఆ పని చేయించడం సరైన పనేనా?' అంటూ హాంకాంగ్ నివాసులు ఆక్షేపిస్తున్నారు. మొత్తం మీద చిన్నోడు చేసిన చిన్న పని పెద్దోళ్ల మధ్య పెద్ద వివాదమై, ఆఖరికి జాతీయస్థాయి కాంట్రవర్సీ గా మారి, అంతర్జాతీయ మీడియా వరకూ పాకేసింది. అదే మనదగ్గరైతేనా....? -
మీ ఫొటోతో తపాలా బిళ్ల!
సాక్షి, హైదరాబాద్: ఇక మీదట మీ ఫొటోతో ఉన్న తపాలా బిళ్లలను అతికించి ఉత్తరాలను మీ సన్నిహితులకు పంపుకోవచ్చు. ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది నిజం. ఇప్పటివరకు మహనీయులు, చారిత్రక ఘట్టాలు ఇలా ఎన్నో ఇతివృత్తాల నేపథ్యంగా అందుబాటులో ఉన్న తపాలా బిళ్లపై ఏకంగా ఎవరి ఫొటోనైనా ముద్రించుకునే సదుపాయం ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. అదే ‘మై స్టాంప్’ కార్యక్రమం. వినూత్నమైన ఈ విధానానికి తపాలాశాఖ తాజాగా శ్రీకారం చుట్టింది. ఉత్తరాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ లేఖలు రాసే పద్ధతి అంతరించపోకుండా చేసేందుకే తపాలాశాఖ ఈ వినూత్న ఆలోచన చేసింది. సెల్ఫోన్లు, ఇంటర్నెట్లాంటి సాంకేతిక పరిజ్ఞానం విస్తృతమవటంతో ఉత్తరం ‘చిరునామా’ గల్లంతవుతూ వస్తోంది. అనతికాలంలోనే పూర్తిగా కాలగర్భంలో కలిసిపోయే దుస్థితీ వచ్చింది. ఈ క్రమంలో తపాలాశాఖ ‘మై స్టాంప్’ కార్యక్రమంతో ‘ఉత్తరం’కు మళ్లీ ప్రాణం పోసేందుకు నడుంబిగించింది. ప్రైవేటు సంస్థలకూ అవకాశం: ప్రైవేటు సంస్థలు సైతం తమ సంస్థ లోగోతో స్టాంపులు రూపొందించుకునేందుకూ తపాలా అధికారులు అవకాశం కల్పించారు. ఏవేని ముఖ్యస్థలాలు, చారిత్రక ప్రాంతాలతోనూ సంస్థలు స్టాంపులు రూపొందించుకోచ్చు. అయితే ఆయా స్థలాలపై ఎలాంటి కాపీరైట్ ఉండరాదని నిబంధన విధించారు. వాటి యజమానుల నుంచి నిరభ్యంతర పత్రాలను తెచ్చినా అంగీకరిస్తామని తపాలా అధికారులు చెబుతున్నారు. అయితే ఆయా సంస్థలు కచ్చితంగా 500 షీట్ల(ఒక్కోటి 12 స్టాంపులతో)కు తక్కువ కాకుండా ఆర్డర్ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్రంలోని 20 ప్రధాన తపాలా కార్యాలయాల్లో ఈ పథకాన్ని అందుబాటులోకి తెచ్చారు. త్వరలో అన్ని ప్రధాన పోస్టాఫీసుల్లో ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. తపాలా శాఖ ఈ ప్రయత్నం ఏమేరకు సఫలమవుతుందో వేచిచూడాలి. ఇలా చేయాలి... తన చిత్రంతో తపాలాబిళ్ల కావాలనుకునేవారు సమీపంలోని తపాలా కార్యాలయానికి వెళ్లాలి. గుర్తింపు కార్డుతోపాటు ఫొటోను ఇవ్వాలి. ఫొటో లేకపోయినా ఫర్వాలేదు. సిబ్బందే కెమెరా ద్వారా ఫొటో సేకరిస్తారు. దానిని జతచేస్తూ దరఖాస్తుపత్రాన్ని నింపి ఇవ్వాలి. 4 డిజైన్లలో ఉండే స్టాంపుల్లో కోరినదానిని గుర్తిస్తే.. అదే నమూనాలో వారి ఫొటోలతో సిబ్బంది స్టాంపులు తయారు చేసిస్తారు. ఒక్కో స్టాంపు విలువ రూ.5గా ఉంటుంది. అలాంటివి 12 స్టాంపులుండే షీటును కచ్చితంగా ఆర్డర్ చేయాల్సి ఉంటుంది. దీనికి అన్ని ఖర్చులు కలిపి రూ.300గా ధరను నిర్ణయించారు. ఈ స్టాంపులను బట్వాడా కవర్‌పై అతికించి పోస్ట్ చేసుకోవచ్చు. అంటే.. ప్రభుత్వం విడుదల చేసిన స్టాంపు తరహాలోనే ఇది పనిచేస్తుందన్న మాట. స్నేహితులకు లేఖలు, గ్రీటింగ్‌కార్డులు పంపేప్పుడు ఈ స్టాంపులను అతికించుకుని.. తన ఫొటోతో ఉన్న స్టాంపును వినియోగించుకుని ఓ మధురానుభూతిని మూటగట్టుకోవచ్చు. -
సెన్స్ ఆఫ్ ప్లేస్!
ఊరో, పల్లెటూరో, నగరమో, మహా నగరమో, అరణ్యమో, నది పరీవాహకమో...ఏదైతేనేం....ప్రతి ప్రదేశానికి తనదైన ‘సారం’ ఉంటుంది. ఆ సారాన్ని వెలికితీయడం అనేది మన కళ్ల మీదే ఆధారపడి ఉంటుంది. ఆ కళ్లకు ‘లెన్స్’ తోడైతే ఆ అనుభవం, ఆనందమే వేరు! నేషనల్ జాగ్రఫిక్ మ్యాగజైన్ ‘లెన్స్’కు పని చెబుతుంది. సారాన్ని ఆవిష్కరించమని చెబుతుంది. గత ఇరవై అయిదు సంవత్సరాలుగా ‘నేషనల్ జాగ్రఫిక్ ట్రావెలర్ మ్యాగజైన్’ ఫొటో కాంటెస్ట్ నిర్వహిస్తుంది. చేయితిరిగిన ఫొటోగ్రాఫర్లతో పాటు ఔత్సాహిక ఫొటోగ్రాఫర్లు ఈ పోటీలో ఉత్సాహంగా పాల్గొంటారు. ఫొటోలలో ప్రపంచ భౌగోళిక అందం కళ్లకు కడుతుంది. 2013 ఫొటోకాంటెస్ట్లో ప్రపంచవ్యాప్తంగా 15, 500 మంది ఫొటోగ్రాఫర్లు పాల్గొన్నారు. ‘‘విజేతలను ఎంపిక చేయడం ప్రతి సంవత్సరం కష్టమైన పనే’’ అంటాడు ‘నేషనల్ జాగ్రఫిక్ ట్రావెలర్’ మాగజైన్ ఎడిటర్ ఇన్ చీఫ్ కెయిత్ బెలో. ఆయన అన్న మాట అక్షరాల నిజమే మరి. ‘ఎంపిక’ కోసం ‘ఎంపిక’ చేయాల్సిందేగానీ ఏ ఫొటో కూడా తక్కువ తినలేదు. భౌగోళిక వైవిధ్యాన్ని ప్రదర్శించడంలో దేని ప్రత్యేకత దానిదే. ‘‘ఫొటోల నాణ్యత, కొత్తదనం గతంతో పోలిస్తే బాగుంటుంది. ఒకేసారి ఇన్ని అద్భుతమైన ఫొటోలను చూడడానికి రెండు కళ్లు చాలవేమో’’ అంటాడు సంతోషంగా బెలో. పోటీని నాలుగు విభాగాలుగా విభజించారు. ఒకటి: ట్రావెల్ పోట్రాయిట్స్, రెండు: ఔట్‌డోర్ సీన్స్, మూడు: సెన్స్ ఆఫ్ ప్లేస్, నాలుగు: స్పాంటేనియస్ మూమెంట్స్. వేలాది ఫొటోల్లో నుంచి న్యాయనిర్ణేతలు ఏడు ఫొటోలను ఎంపిక చేసి చివరికి అందులో నుంచి మూడింటిని ఎంపిక చేస్తారు. మరో ఫొటోను పాఠకులు ఎంచకుంటారు. మీరు చూస్తున్న ఫొటోలు న్యాయనిర్ణేతలు, పాఠకులు మెచ్చినవి.