
ఈ ఫొటో చూశారా? ‘బీఎంసీ ఎకాలజీ అండ్ ఎవాల్యూషన్ ఇమేజ్’ పోటీలో మొదటిస్థానం దక్కించుకుంది. అందులో ప్రత్యేకత ఏముందనేగా సందేహం? ఈగలోకి ప్రవేశించిన ‘జాంబీ’ ఫంగస్ ఈగను చంపేసి.. అది వృద్ధి చెందింది. ఈగ మరణించి... ఫంగస్ బతకడమే కాదు, మరింత విస్తరించటానికి ఉపయోగపడింది.
ఒక చావు.. మరో పుట్టుక. జీవ పరిణామ క్రమమే అది కదా! సైన్స్ ఫిక్షన్‌ను తలపిస్తున్న ఈ చిత్రాన్ని పరిణామ జీవశాస్త్రవేత్త రాబర్టో గ్రాసా రో, పెరూలోని తంబోపత నేషనల్ రిజర్వ్‌లో క్యాప్చర్ చేశాడు. రిలేషన్‌షిప్స్ ఇన్ నేచర్, బయోడైవర్సిటీ అండర్ థ్రెట్, లైఫ్ క్లోజప్, రీసర్జ్ ఇన్ యాక్షన్ అనే నాలుగు కేటగిరీల్లో జరిగిన పోటీల్లో... జాంబీ ఫంగస్ ఫొటో టాప్ ప్రైజ్ గెలుచుకుంది.
చదవండి: మిస్టరీ కేసు: ఆన్‌లైన్ వేలంలో కొన్న సూట్‌కేసులో ఏముందంటే...
Comments
Please login to add a commentAdd a comment