సమంత ‘ప్రత్యూష’ | Samantha Social Service With Prathyusha Foundation For Children | Sakshi
Sakshi News home page

నవ్వుల జాను

Jan 30 2020 7:44 AM | Updated on Jan 30 2020 7:44 AM

Samantha Social Service With Prathyusha Foundation For Children - Sakshi

హాయ్‌..ఐ యామ్‌ జానూ..’ అంటూ హీరోయిన్‌ సమంత సందడి చేసింది. శర్వానంద్, సమంత జంటగా నటించిన ‘జాను’ మూవీ విశేషాలను తెలిపేందుకు బుధవారంపార్క్‌ హయత్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆమెఇలా నవ్వులు చిందించారు. 

బంజారాహిల్స్‌: సమంత.. ఈ పేరు వింటే టాలీవుడ్‌ హీరోయిన్‌ అని అందరూ చెబుతారు. అయితే ఆమె నటి మాత్రమే కాదు..సేవాగుణమున్న మహిళ అని కొందరికే తెలుసు. దక్షిణాది అగ్రహీరోలందరితోనూ వరుస సినిమాలు చేసిన ఈ అగ్రతార ప్రత్యూష సపోర్ట్‌  అనే స్వచ్చంద సేవా సంస్థ ఏర్పాటు చేసి చిన్నారులకు వైద్యం అందజేస్తోంది. ఇటీవల ఆంధ్ర ఆసుపత్రి హార్ట్‌ అండ్‌ బ్రెయిన్‌ సెంటర్‌ను సందర్శించి సేవా కార్యక్రమాలకు ముందుకు వచ్చింది. గుండెజబ్బులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న చిన్నపిల్లలకు చికిత్స అందిస్తారు. అంతేకాదు ప్రాణాపాయ వ్యాధులకు కూడా వైద్యం అందిస్తున్నారు సమంత. ఇటీవల ప్రత్యూష సపోర్టు సహకారంతో వైద్యం చేయించుకున్న పిల్లలతో ఆమె సరదాగా గడిపారు.

అంతమంది పిల్లల మధ్య తాను కూడా చిన్నపిల్లగా మారిపోయారు. ఆమె చేస్తున్న సేవా కార్యక్రమాలు నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఆమెకు మరింత ప్రోత్సాహాన్నిస్తూ నెటిజన్లు తెగ పొగిడేస్తున్నారు. ఎప్పుడూ పిల్లల మధ్యనే ఉంటూ పిల్లలతో కాలక్షేపం చేయడానికే సమంత ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు. పిల్లలకు సంబంధించిన ఫొటోలను తాను వారితో గడిచిన క్షణాలను ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో అభిమానులతో పంచుకుంటున్నారు. దీంతో ఆమె పట్ల అభిమానులు మరింత అభిమానాన్ని పెంచుకుంటున్నారు.   సమంత చేస్తున్న సామాజిక కార్యక్రమాలు అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా పేదపిల్లల సంక్షేమంపై ఆమె ప్రత్యేక దృష్టి సారించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement