prathyusha foundation
-
సమంత ‘ప్రత్యూష’
హాయ్..ఐ యామ్ జానూ..’ అంటూ హీరోయిన్ సమంత సందడి చేసింది. శర్వానంద్, సమంత జంటగా నటించిన ‘జాను’ మూవీ విశేషాలను తెలిపేందుకు బుధవారంపార్క్ హయత్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆమెఇలా నవ్వులు చిందించారు. బంజారాహిల్స్: సమంత.. ఈ పేరు వింటే టాలీవుడ్ హీరోయిన్ అని అందరూ చెబుతారు. అయితే ఆమె నటి మాత్రమే కాదు..సేవాగుణమున్న మహిళ అని కొందరికే తెలుసు. దక్షిణాది అగ్రహీరోలందరితోనూ వరుస సినిమాలు చేసిన ఈ అగ్రతార ప్రత్యూష సపోర్ట్ అనే స్వచ్చంద సేవా సంస్థ ఏర్పాటు చేసి చిన్నారులకు వైద్యం అందజేస్తోంది. ఇటీవల ఆంధ్ర ఆసుపత్రి హార్ట్ అండ్ బ్రెయిన్ సెంటర్‌ను సందర్శించి సేవా కార్యక్రమాలకు ముందుకు వచ్చింది. గుండెజబ్బులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న చిన్నపిల్లలకు చికిత్స అందిస్తారు. అంతేకాదు ప్రాణాపాయ వ్యాధులకు కూడా వైద్యం అందిస్తున్నారు సమంత. ఇటీవల ప్రత్యూష సపోర్టు సహకారంతో వైద్యం చేయించుకున్న పిల్లలతో ఆమె సరదాగా గడిపారు. అంతమంది పిల్లల మధ్య తాను కూడా చిన్నపిల్లగా మారిపోయారు. ఆమె చేస్తున్న సేవా కార్యక్రమాలు నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఆమెకు మరింత ప్రోత్సాహాన్నిస్తూ నెటిజన్లు తెగ పొగిడేస్తున్నారు. ఎప్పుడూ పిల్లల మధ్యనే ఉంటూ పిల్లలతో కాలక్షేపం చేయడానికే సమంత ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు. పిల్లలకు సంబంధించిన ఫొటోలను తాను వారితో గడిచిన క్షణాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటున్నారు. దీంతో ఆమె పట్ల అభిమానులు మరింత అభిమానాన్ని పెంచుకుంటున్నారు. సమంత చేస్తున్న సామాజిక కార్యక్రమాలు అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా పేదపిల్లల సంక్షేమంపై ఆమె ప్రత్యేక దృష్టి సారించారు. -
‘లైఫ్ ఈజ్ ఆన్’తో సమంత..
సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ.. మంచి మనసున్న వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు సమంత. ఇటీవలె రంగస్థలం, మహానటి, అభిమన్యుడు లాంటి వరుస హిట్లతో దూసుకెళ్తోన్నారు. సమంత నటిగా ఎంత బిజీగా ఉన్నా.. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. సమంత పొనాక్ సంస్థను శుక్రవారం సందర్శించారు. ‘లైఫ్ ఈజ్ ఆన్’ అనే స్లోగన్‌తో.. వినికిడి లోపం ఉన్న పిల్లలకు సహాయం అందించేందుకు కృషి చేస్తోందీ సంస్థ. వినికిడి లోపం గుర్తించే శిబిరాలను నిర్వహిస్తున్నారు. ఈ సంస్థకు రెండు తెలుగు రాష్ట్రాల్లో 36 శాఖలున్నాయని తెలిపారు. సమంత చేతుల మీదుగా ఓ పదిమంది చిన్నారులకు వినికిడి యంత్రాలను అందించారు. పొనాక్ సంస్థకు తన సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని సమంత అన్నారు. -
దేవుడికి ధన్యవాదాలు!
తమిళసినిమా: మానవత్వం కలిగిన మనిషిని మహా నుభావుడంటారు. మా నవత్వం కోసం పెద్దగా యాగాలు, త్యాగాలు చేయనవస రం లేదు. కొంచెం ప్రేమ, కాస్త కరుణ, మ రి కాస్త దయ, ఇంకాస్త జాలి ఉంటే అదే మానవత్వం అవుతుంది. మనకు కలిగిన దానిలో కొంచెం అది అవసరమైన వాళ్లకు పంచడం దయాగుణమే అవుతుంది. ఇప్పుడిదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ప్రాణాన్ని పోయడం సాధ్యం కాదు గానీ, పోయే ప్రాణాన్ని సాయం అనే మాటతో కాపాడగలం. ఇక సమంత గురించి సినిమా అనే మూడక్షరాలు పరిచయం ఉన్న వారందరికి తెలుసంటుందన్నది అతిశయోక్తి కాదేమో. తెలుగు, తమిళం భాషల్లో మేటి నటిగా రాణిస్తున్న ఈ చెన్నై చిన్నది ఇటీవలే తెలుగింటి కోడలైంది. నటుడు నాగచైతన్యను పెళ్లాడి అక్కినేని కుటుంబంలో శాశ్వత సభ్యురాలైంది. ఇకపోతే సమంతలో చలాకీగా ఆడిపాడి అల్లరి చేసే యువతినే చాలా మంది చూసి ఉంటారు. సినిమాలోనే కాకుండా, తన పెళ్లి వేడుకలో కూడా అందంగా ఆడి పాడి సందడి చేసిన సమంతను అలా చూడడంలో పెద్దగా ఆశ్చర్యం కూడా ఉండదు. అయితే అలాంటి సమంతలో మరో కోణం కూడా ఉంది. అదే మానవత్వం. అవసరం అయిన వారికి తగిన సాయం చేసి వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేయడం. సమంత ప్రత్యూష పేరుతో ఒక స్వచ్ఛంద సేవా సంస్థను నెల కొల్పి, పేద విద్యార్థులకు విద్య, వైద్య సాయం చేస్తూ ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. అలాంటి సేవలకు ఎలాంటి ప్రచారాన్ని ఆశించని సమంత ఇటీవల ఒక బృహత్కర కార్యాన్ని నిర్వహించారు. ప్రాణాపాయంలో ఉన్న 15 మంది పసికందులకు తన ప్రత్యూష స్వచ్ఛంద సంస్థ ద్వారా శస్త్రచికిత్స చేయించి ఆ చిన్నారులకు పునర్జన్మను కలిగించారు. ఇందుకు రూ.కోటికి పైనే ఖర్చు అయ్యిందట. ఈ విషయాన్ని సమంత తన ట్విట్టర్లో పేర్కొంటూ చిన్నారులు ఆరోగ్యంగా ఉన్నారు. దేవునికి ధన్యవాదాలు అని అన్నారు. -
ఎయిడ్స్ చిన్నారులకు సమంత సాయం
టాలీవుడ్, కోలీవుడ్‌లలో వరుస సినిమాలతో బిజీగా ఉన్న సమంత సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా అదే జోరు చూపిస్తోంది. ఇప్పటికే ప్రత్యూష ఫౌండేషన్ స్థాపించి ఎంతో మంది చిన్నారులకు సాయం చేస్తున్న సమంత అంతర్జాతీయ ఎయిడ్స్ డే సందర్భంగా ఎయిడ్స్ వ్యాధితో బాదపడుతున్న చిన్నారుల కోసం ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా మరో నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 1న ఎయిడ్స్ డే సందర్భంగా పోషకాహారం అందక ఇబ్బంది పడుతున్న ఎయిడ్స్ చిన్నారులకు ప్రోటీన్ పౌడర్ బాటిల్స్‌ను అందించింది. ప్రతినెల 1వ తారీఖున వంద మంది చిన్నారులకు ఈ పౌడర్‌ను అందించనున్నట్టుగా ప్రకటించింది. ఎయిడ్స్ వ్యాధితో బాదపడుతున్న చిన్నారులకు ఆహారలోపం సమస్య కాకూడదనే సదుద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తన సోషల్ నెట్వర్క్ పేజ్‌లపై కామెంట్ చేసింది సమంత. -
స్టార్ హీరోయిన్ అవయవ దానం
టాలీవుడ్లో నంబర్ వన్ హీరోయిన్గా స్టార్ హీరోల సరసన నటించటమే కాదు. సామాజిక సేవలోను స్టార్ అనిపించుకుంటుంది చెన్నై ముద్దుగుమ్మ సమంత. ముఖ్యంగా ప్రత్యూష ఫౌండేషన్ స్థాపించిన సమంత, ఈ ఆర్గనైజేషన్ ద్వారా డబ్బులేని కారణంగా ఆపరేషన్ చేయించుకోలేకపోతున్న పేద చిన్నారులకు సాయం చేస్తోంది. తాజాగా మరో అడుగు ముందుకేసిన ఆమె అవయవ దానానికి సిధ్దమవుతోంది. హీరోయిన్గా భారీ స్టార్ ఇమేజ్ ఉన్న సమంత అవయవ దానం చేస్తున్నట్టుగా ప్రతిజ్ఞ చేయనుంది. అంతేకాదు తన అభిమానులు కూడా అవయవధానం చేయాలంటే కోరుతోంది. ఈ నెల 7న ప్రత్యూష ఫౌండేషన్‌తో పాటు, హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న కార్యక్రమంలో ఈ మేరకు ప్రకటన చేయనుందట. ఆ తరువాత కూడా అవయవ దానానికి సంబంధించి ప్రజల్లో చైతన్యం కలిగించే విధంగా కార్యక్రమాలు చేపట్టాలని భావిస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటి మహేష్ హీరోగా తెరకెక్కుతున్న 'బ్రహ్మోత్సవం' సినిమాతో పాటు, నితిన్ సరసన 'అ.. ఆ..' సినిమాలో నటిస్తోంది. వీటితో పాటు తమిళ్లోనూ బిజీగా ఉంది.