‘లైఫ్‌ ఈజ్‌ ఆన్‌’తో సమంత.. | Samantha Is In Social Service Activities in Hyderabad | Sakshi
Sakshi News home page

Jul 13 2018 5:34 PM | Updated on Jul 13 2018 5:36 PM

Samantha Is In Social Service Activities in Hyderabad - Sakshi

సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ.. మంచి మనసున్న వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు సమంత. ఇటీవలె రంగస్థలం, మహానటి, అభిమన్యుడు లాంటి వరుస హిట్‌లతో దూసుకెళ్తోన్నారు. సమంత నటిగా ఎంత బిజీగా ఉన్నా.. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. 

సమంత పొనాక్‌ సంస్థను శుక్రవారం సందర్శించారు. ‘లైఫ్‌ ఈజ్‌ ఆన్‌’ అనే స్లోగన్‌తో.. వినికిడి లోపం ఉన్న పిల్లలకు సహాయం అందించేందుకు కృషి చేస్తోందీ సంస్థ. వినికిడి లోపం గుర్తించే శిబిరాలను నిర్వహిస్తున్నారు. ఈ సంస్థకు రెండు తెలుగు రాష్ట్రాల్లో 36 శాఖలున్నాయని తెలిపారు. సమంత చేతుల మీదుగా ఓ పదిమంది చిన్నారులకు వినికిడి యంత్రాలను అందించారు. పొనాక్‌ సంస్థకు తన సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని సమంత అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement