Social services
-
సామాజిక హితం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గత మూడేళ్లుగా అభివృద్ధి వ్యయం పెరుగుతుండగా వడ్డీల చెల్లింపుల వ్యయం తగ్గుతున్నట్లు రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) అధ్యయన నివేదిక వెల్లడించింది. రాష్ట్రాల ఆర్థిక వ్యవహారాలు, బడ్జెట్లపై నివేదిక విడుదల చేసిన ఆర్బీఐ 2021–22 నుంచి 2023–24 వరకు ప్రధాన ఆర్థిక సూచికలను ఇందులో పొందుపరిచింది. సామాజిక సేవలు, ఆర్థిక సేవల వ్యయం రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతుందని పేర్కొంది. సామాజిక, ఆర్థిక అభివృద్ధికి సంబంధించిన కార్యకలాపాలపై నేరుగా చేసే వ్యయాన్ని అభివృద్ధి వ్యయంగా నిర్వచించింది. వ్యవసాయం, ఆరోగ్యం, విద్యపై చేసే ఖర్చును అభివృద్ధి వ్యయంగా ఉదహరించింది. జీతభత్యాలు భారీగానే.. ► ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా మూడేళ్లుగా సామాజిక రంగ వ్యయం పెరుగుతోంది. సామాజిక సేవలు, గ్రామీణాభివృద్ధి, ఆహార నిల్వలు, గిడ్డంగులు ఈ కోవలోకి వస్తాయి. ఇదే సమయంలో ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమం, నీటి సరఫరా, పారిశుద్ధ్య రంగాల కోసం వెచ్చించే వ్యయం కూడా పెరుగుతోంది. ► 2021–22లో మొత్తం వ్యయంలో అభివృద్ధి వ్యయం రూ.1.19 లక్షల కోట్లు ఉండగా 2023–24 నాటికి రూ.1.92 లక్షల కోట్లకు పెరిగింది. ► వడ్డీ చెల్లింపులు పెరుగుతున్నాయనే వాదనల్లో నిజం లేదు. రెవెన్యూ రాబడిలో వడ్డీ చెల్లింపుల శాతం తగ్గుతోంది. ► ఏపీలో వేతనాలు, జీతాలు చెల్లింపులు గత ఐదేళ్లుగా పెరుగుతూనే ఉన్నాయి. ఉద్యోగులకు పీఆర్సీ అమలుతో పాటు చిరు ఉద్యోగుల వేతనాలను పెంచడంతో వేతనాలు, జీతాల వ్యయం పెరుగుతున్నట్లు సూచికలు వెల్లడిస్తున్నాయి. -
సామాజిక సేవలపై.. పెరిగిన మూలధన, రెవెన్యూ వ్యయం
సాక్షి, అమరావతి : 2020–21తో పోలిస్తే 2021–22 ఆర్థిక సంవత్సరంలో సామాజిక సేవలపై మూల ధన వ్యయంతో పాటు రెవెన్యూ వ్యయం కూడా పెరిగిందని భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక తెలిపింది. 2021–22కి సంబంధించి రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై కాగ్ ఇచ్చిన నివేదికను ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ శుక్రవారం అసెంబ్లీకి సమర్పించారు. సామాజిక సేవలపై 2021–22లో 42.45 శాతం వ్యయం చేసినట్లు పేర్కొంది. ఇందులో ప్రధానంగా విద్య, ఆరోగ్య.. కుటుంబ సంక్షేమం, ఎస్సీ, ఎస్టీ, బీసీల సంక్షేమం, సాంఘిక సంక్షేమం, పోషణ, క్రీడలు, కళలకు రూ.66,371 కోట్లు వ్యయం చేసినట్లు పేర్కొంది. సామాజిక సేవలపై సాధారణ రాష్ట్రాల సగటు వ్యయం కన్నా ఏపీలో ఎక్కువగా ఉంది.ఇక సామాజిక సేవలపై రాష్ట్రాల సగటు వ్యయం 38.31 శాతం ఉండగా ఏపీలో 42.45 శాతం ఉంది. -
Pravasi Bharatiya Divas: విదేశాల్లో ఉన్నా స్వదేశంలో సేవ
జీవితంలో అభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో విదేశాలకు వెళ్లినవారు తమను తాము నిరూపించుకునే దిశగా సాగుతారు. కలల లక్ష్యాలను చేరుకోవడానికి శ్రమించడంతో పాటు తమ చుట్టూ ఉన్నవారికి చేయూతనివ్వాలనుకుంటారు. తమ మూలాలను గుర్తుపెట్టుకొని సొంత గడ్డ అభ్యున్నతికి పాటుపడాలని తపిస్తుంటారు. వారి ఆలోచనలతో మరికొందరి అడుగులకు స్ఫూర్తిగా నిలుస్తారు. విదేశాల్లో తాము ఎంచుకున్న రంగాల్లో కృషి చేస్తూనే సేవా కార్యక్రమాల ద్వారా స్వదేశంలో ఉన్నవారికి చేయూతనందిస్తున్నారు విజయవాడ వాసి అయేషా, ఖమ్మం జిల్లా వాసి ఝాన్సీ. పిల్లలకు కష్టం విలువ తెలియాలని.. విజయవాడ నుంచి వెళ్లి అమెరికాలో స్థిరపడ్డారు ఆయేషా. ఉద్యోగం, కుటుంబం బాధ్యతలతో బిజీగా ఉన్న ఆమె సేవాకార్యక్రమాలవైపు మళ్లిన ఆలోచనావిధానం గురించి తెలిపారు. ‘మా కుటుంబంతో కాలిపోర్నియాలో స్థిరపడ్డాను. నేను చేస్తున్న సేవాకార్యక్రమాలకు ఇటీవల నాన్‌ప్రాఫిట్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ కూడా అందుకున్నాను. ఉద్యోగినిగా ఉన్న నేను మొదట ఒక తల్లిగా మా పిల్లలకు సేవా ప్రపంచాన్ని పరిచయం చేయాలనుకున్నాను. అదే సమయంలో మా చుట్టుప్రక్కల ఉండే పిల్లల పరిస్థితి గమనించాను. పిల్లల్లో మానవతా విలువలు పెంచాలని కమ్యూనిటీ సర్వీస్ చేయాలనే సదుద్దేశంతో ఏడేళ్ల క్రితం ఎంపవర్ అండ్ ఎక్సెల్ సంస్థని ప్రారంభించాను. ఇప్పుడు వందలాది మందికి పైగా వలెంటీర్లు మా ఆర్గనైజేషన్‌లో సేవలందిస్తున్నారు. మా అమ్మనాన్నలు ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్నారు. వారిని చూడటం కోసం మొదట మా పిల్లలను తీసుకొని ఇండియాకు వచ్చేదాన్ని. మారుమూల గ్రామాల్లోని పాఠశాల పరిస్థితులు ఎలా ఉంటాయో తెలుసు కాబట్టి, ఆ స్కూళ్లలో లైబ్రరీలను ఏర్పాటు చేయాలనే ఆలోచన వచ్చింది. స్వచ్ఛందంగా పనిచేసే మిత్రులు కొందరు పరిచయమయ్యారు. వారితో నిరంతరం కాంటాక్ట్‌లో ఉంటూ అమెరికాలో మేమున్న ప్రాంతంలో సేకరించిన పుస్తకాలను ఆంధ్రాలోని గ్రామాల స్కూళ్లకు అందజేసేవాళ్లం. ఈ కార్యక్రమం ప్రతియేటా నిర్వహించేవాళ్లం. నాతోపాటు ప్రతి యేటా వలెంటీర్లుగా వర్క్ చేసే పిల్లలు కనీసం పదిమందినైనా ఇండియాకు తీసుకువచ్చేదాన్ని. వారితో ఇక్కడి స్కూల్ పిల్లలకు వర్క్‌షాప్స్ కండక్ట్ చేసేదాన్ని. ఆ తర్వాత సమస్యలు తెలుస్తున్న కొద్దీ వాటి మీద దృష్టి పెడుతూ వచ్చాను. అందరం ఉపాధి కోసం విదేశాలకు వచ్చినవాళ్లమే. కాని మా మూలాలను ఎప్పటికీ మర్చిపోలేం. ఈ పరిస్థితులలోనే స్వదేశంలోని పిల్లలకు సర్వీస్ చేయాలనుకున్నాను. ట్రైబల్ ఏరియాలోని పిల్లలకు మా సేవలు అందేలా కృషి చేస్తుంటాను. స్వచ్ఛంద సంస్థల ద్వారా మా సేవకార్యక్రమాలను నిర్వహిస్తుంటాం. నిరుపేదలకు ఏదైనా సాయం కావాలని మా దృష్టికి వస్తే ఇక్కడ ఫండ్ రైజింగ్ కి వెబ్సైట్ లో ప్రకటిస్తాం. ఇప్పటి వరకు మనవాళ్లు ఎవరో ఒకరు స్పందిస్తూనే ఉన్నారు’’ అని తెలిపారు ఆయేషా. మహిళల శ్రేయస్సు కోసం.. ఖమ్మం జిల్లా వాసి హనుమాండ్ల ఝాన్సీరెడ్డి. అమెరికాలో రియల్ ఎస్టేట్ రంగంలో తనదైన ముద్ర వేశారు. మహిళలు, బాలికల సంక్షేమం కోసం అక్కడే ‘వెటా’ పేరుతో స్వచ్ఛంద సంస్థను స్థాపించి, వివిధ కార్యక్రమాల ద్వారా సేవలందిస్తున్నారు. అలాగే, పుట్టి పెరిగిన గడ్డకు మేలు చేయాలనే ఆలోచనతో స్వదేశంలోనూ సేవాకార్యక్రమాలు చేస్తున్నారు. ‘‘లక్ష్యం పెద్దదిగా ఉండాలి. ఎన్ని అడ్డంకులు ఎదురైనా దానిని సాధించే దిశగానే మన అడుగులు ఉండాలి. ఉపాధి అవకాశాలు వెతుక్కుంటూ అమెరికా వెళ్లి, అక్కడ చిన్న చిన్న ఉద్యోగాలు చేశాను. పిల్లలు పుట్టాక వారిని చూసుకునే క్రమంలో ఉద్యోగాన్ని మానేసి, రియల్ ఎస్టేట్ రంగంలోకి వచ్చాను. ఒక మహిళ ఏం చేస్తుంది ఈ రంగంలో అనుకునేవారికి నా విజయం ద్వారానే సమాధానం చెప్పాను. అమెరికాలోని మన భారతీయ మహిళల సమస్యల గురించి అర్థం చేసుకున్నాను. సొంతంగా ఎదగాలనుకునేవారు, ఉద్యోగాలు చేయాలనుకునేవారు, గృహహింస వంటి బాధలు పడేవారు .. అన్ని రకాలుగా జీవితంతో పోరాటం చేసేవారున్నారు. అలాంటివారి శ్రేయస్సు కోసం పనిచేయాలని ‘వెటా’ను స్థాపించాను. మన విజయాలను మన అనుకున్న నలుగురికి కూడా పంచాలి. మా సొంత ఊళ్లకు వచ్చినప్పుడు అక్కడి పరిస్థితులను గమనించి అభివృద్ధి కార్యక్రమాలను ఏర్పాటు చేస్తూ వచ్చాం. మా ఊరు బనిగండ్లపాడు గ్రామంలోనే కాదు, మా వారు పుట్టి పెరిగిన వరంగల్ జిల్లా తొర్రూరులోనూ అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. గ్రంథాలయాలను ఏర్పాటు చేశాం. స్కూల్ భవనాలను కట్టించి, ప్రభుత్వానికి అప్పజెప్పాం. తొర్రూరులో హాస్పిటల్ కట్టించాం. గ్రామపంచాయితీ ఆఫీసు వంటివి ఏర్పాటు చేశాం. మా చుట్టుçపక్కల మరో ఆరుగ్రామాల వరకు మా సేవలు అందిస్తుంటాం. విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నది మా ఆలోచన. అందుకే, పేద విద్యార్థులకు ప్రతియేటా ఆర్థిక సాయం చేస్తుంటాం. ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా మాకు చేతనైంత సాయం అందించాలన్నదే మా సిద్ధాంతం. ముందుగా మనకు మనంగా ఎదగాలి. అందుకోసం ఎంతటి కష్టమైనా పడాలి. అలాగే, నలుగురి మేలు కోసం పాటుపడినప్పుడే మన జీవితానికి సంతృప్తి లభిస్తుంది’’ అని వివరించారు ఝాన్సీరెడ్డి. -
అంబులెన్స్ సేవలు ప్రారంభించిన ఆదిత్య ఓం
'లాహిరి లాహిరి లాహిరిలో' సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన ఆదిత్య ఓం.. ఆ తర్వాత పలు తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో నటించి సిల్వర్ స్క్రీన్‌పై హీరోగా, విలన్‌గా తన మార్క్ చూపించారు. దర్శకుడిగా కూడా తనదైన ముద్ర వేసుకుంటున్న ఆదిత్య ఓం సేవారంగంలో తన ఔదార్యాన్ని చాటుతున్నాడు. పలు సేవా కార్యక్రమాలు ద్వారా ఆయన ఇప్పటికే ఎంతో మందికి పేదవాళ్లకు సహాయం చేశాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చేరుపల్లి లోని ఐదు గ్రామాలను దత్తత తీసుకుని దాదాపు 500 మంది కి సహాయం చేసిన ఆదిత్య ఓం తాజాగా కొత్తగూడెం జిల్లా మరియు తాండూరులోని చెరుపల్లి, కొత్తపల్లి మరియు పరిసర ప్రాంతాలకు అంబులెన్స్ సేవలను అందించడానికి తన వంతు కృషి చేశారు. అక్కడి గిరిజన గ్రామాల్లో చాలా కాలంగా పనిచేస్తున్న ఆదిత్య ఓం కోవిడ్ సమయంలో అంబులెన్స్ సేవలు లేకపోవడం మరియు ఆ ప్రాంతంలో పాము కాటు కారణంగా ప్రజలు ప్రాణాలు కోల్పోవడం చూసి చలించారు. దాంతో అక్కడ పేరుగాంచిన రోటరీ క్లబ్, దానికి సంబంధించిన స్థానిక సంస్థల ఆర్థిక సహాయంతో ఈ ప్రాంతాలకు అంబులెన్స్ సేవలు అందించగలిగారు. తన స్నేహితులు, స్వచ్ఛంద సంస్థలు అందించిన సహాయం మరియు స్థానిక ప్రజల అవగాహన కారణంగా ఇది సాధ్యం అయ్యింది ఆదిత్య ఓం అన్నారు. -
‘సామాజిక’ దృక్పథం
సాక్షి, అమరావతి: రాష్ట్రప్రభుత్వ వ్యయం ప్రధానంగా సామాజిక సేవల కోణంలో ఉన్నట్లు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక వెల్లడించింది. సామాజిక సేవల్లో భాగమైన విద్య, వైద్యం, సంక్షేమ కార్యక్రమాలపై వ్యయం గణనీయంగా పెరిగిందని తెలిపింది. 2020–21 ఆర్థిక పరిస్థితులపై కాగ్ నివేదికను ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ బుధవారం అసెంబ్లీకి సమర్పించారు. 2020 – 21లో రాష్ట్రం మొత్తం వ్యయంలో సంక్షేమ కార్యక్రమాలపై ఖర్చు 17 శాతం ఉండగా విద్య, క్రీడలు, కళలు, సంస్కృతిపై వ్యయం 14 శాతంగా ఉన్నట్లు పేర్కొంది. వివిధ ప్రధాన పద్దుల్లో రెవెన్యూ వ్యయం గణనీయంగా పెరగ డానికి వైఎస్సార్–పీఎం ఫసల్ బీమా యోజన, వైఎస్సార్ వడ్డీలేని రుణాల ప«థకాల ద్వారా రైతుల కు పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూర్చడమే కారణ మని తెలిపింది. సచివాలయాలు, వలంటీర్లు, ఉపాధి హామీ వ్యయం పెరగడం, ఆర్టీసీ ఉద్యోగు లను రాష్ట్ర ప్రభుత్వంలోకి తీసుకోవడంతో రెవెన్యూ వ్యయం పెరిగిందని కాగ్ తెలిపింది. విపత్తు నిర్వహణ వ్యయం, జాతీయ ఆరోగ్య మిషన్ కింద ఖర్చులు, రైతుసాధికార సంస్థకు గ్రాంట్లు, వైఎస్సార్ పెన్షన్ కానుక, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు పారిశ్రామిక ప్రోత్సాహకాలపై ఖర్చు పెరగడం కూడా రెవెన్యూ వ్యయం పెరగటా నికి కారణాలని పేర్కొంది. మరోపక్క తప్పనిసరి ఖర్చుల్లో భాగంగా వడ్డీ చెల్లింపులు, జీతాలు, పెన్షన్లు, రాయితీలపై వ్యయం పెరుగుతూనే ఉందని, దీంతో అభివృద్ధి వ్యయానికి వెసులుబాటు తక్కువగా ఉందని తెలిపింది. 2020–21లో జీతాలు, వేతనాల వ్యయం అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 9.88 శాతం పెరిగిందని కాగ్ పేర్కొంది. స్థానిక సంస్థలు, ఇతర సంస్థలకు ప్రభుత్వం అందించిన ఆర్థిక సాయం రెవెన్యూ వ్యయంలో 48.25 శాతంగా ఉన్నట్లు తెలిపింది. సామాజిక, ఆర్థికాభివృద్ధికే ఏపీఎస్డీసీ సామాజిక, ఆర్థికాభివృద్ధి ప్రాజెక్టులు, కార్యకలాపా లకు ప్రణాళిక, నిధులు, ఆర్థిక సాయం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎస్డీసీ) అనే ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసిందని కాగ్ పేర్కొంది. భవిష్యత్‌లో ఏపీఎస్డీసీ ద్వారా సేకరించే రుణాల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.25 వేలకోట్ల గ్యారెంటీని అందించిం దని తెలిపింది. 2020–21లో బ్యాంకుల కన్సార్టియం నుంచి రూ.17,472 కోట్లను అప్పుగా తీసు కుంది. ఇందులో 63 సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలైన (నవరత్నాలు) వైఎస్సార్ ఆసరా, అమ్మఒడి, వైఎస్సార్ చేయూత అమలు కోసం రూ.16,899 కోట్లు పంపిణీ చేసిందని పేర్కొంది. 63 కార్పొరేషన్లలో 56 వెనుకబడిన తరగతుల కార్పొరేషన్లు ఉన్నాయని కాగ్ తెలిపింది. ప్రత్యక్ష నగదుబదిలీ పథకాలైన వైఎస్సార్ చేయూత, ఆసరా కోసం 2020–21లో రూ.10,895.67 కోట్లను కేటాయించినట్లు తెలిపింది. పథకాల అమలును సులభతరం చేసేందుకు రాష్ట్ర సంఘటితనిధి నుంచి 8 కార్పొరేషన్ల వ్యక్తిగత డిపాజిట్ ఖాతాలకు బడ్జెట్‌ను బదిలీచేసినట్లు పే ర్కొంది. అయితే ఈ పథకాల బడ్జెట్ ద్వారా కాకుం డా మార్కెట్ రుణాల ద్వారా నిధులు సమకూ ర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ రెండు డీబీటీ పథకాలతో సహా ఆరుసంక్షేమ పథకాలను ఏపీఎస్డీసీకి అప్పగించినట్లు కాగ్ తెలిపింది. -
మధ్య తరగతి కుటుంబానికి చెందిన వారే..కానీ సేవల్లో శ్రీమంతులు
ఆ ముగ్గురూ మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వారు. అయితేనేం సేవలో మాత్రం శ్రీమంతులని నిరూపించుకున్నారు. తమకు ఉన్నంతలోనే సాయపడుతు న్నారు. ఒక్కొక్కరిది ఒక్కో కథ. ఒకతను కరోనా సమయంలో పేదలకు అండగా నిలిస్తే.. మరొకతను ప్రభుత్వ స్కూళ్ల పిల్లలకు ఆర్థికంగా భరోసా కల్పిస్తున్నారు. ఓ మహిళ బాలికలకు తోడుగా నిలిచారు. ఆత్మకూరుకు చెందిన పున్నేపల్లి సుబ్రహ్మణ్యం, కరవళ్ల రవీంద్రారెడ్డి, జ్యోతి జయలక్ష్మి విరివిగా సేవా కార్యక్రమాలు చేపట్టి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారు. – ఆత్మకూరు వైఎస్సార్‌ను ఆదర్శంగా తీసుకుని.. పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం నల్లపరెడ్డిపల్లి గ్రామానికి చెందిన కరవళ్ల రవీంద్రారెడ్డి సామాన్య రైతు. పొలం పనులు చేసుకుంటూ తన ఇద్దరు కుమారులను చదివించారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డిని ఆదర్శంగా తీసుకుని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రతి ఏడాది తన కొడుకు పుట్టినరోజు నాడు 200 మందికిపైగా పేదలకు దుప్పట్లు, వస్త్రాలు అందజేస్తుంటారు. ఇంకా నల్లపరెడ్డిపల్లి, బట్టేపాడు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే మెరిట్ విద్యార్థులకు, ఆత్మకూరు కళాశాలలో మంచి మార్కులు సాధించిన వారికి నగదు బహుమతులు ఇస్తున్నారు. ప్రతి సంవత్సరం పేదలకు ఆర్థికంగా సాయం చేస్తున్నారు. విద్యార్థినులకు సైకిళ్లు అందజేశారు. ఈయన సేవా కార్యక్రమాలను ప్రత్యక్షంగా చూసిన గ్రామానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, సమీప బంధువులు తమవంతుగా విరాళాలు అందిస్తున్నారు. కంప్యూటర్ శిక్షణా కేంద్రాలు పెట్టి.. దొరవారిసత్రం మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన పున్నేపల్లి సుబ్రహ్మణ్యం బాల్యంలోనే తల్లిదండ్రులను కోల్పోయాడు. అండగా ఉంటారనుకున్న అక్కలు అనారోగ్యంతో మృతిచెందారు. దీంతో దాతల సహకారంతో సంక్షేమ హాస్టళ్లలో చదువుకున్నారు. బీకాం కంప్యూటర్స్ చేశారు. ఈయన 18 ఏళ్ల క్రితం ఆత్మకూరులో స్థిరపడ్డారు. ఆత్మకూరు, ఉదయగిరి, వింజమూరు ప్రాంతాల్లో కంప్యూటర్ శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేసి యువతకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. ఆయన వల్ల అనేక మంది వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు దక్కించుకున్నారు. ఇంకా తల్లి పేరుతో రమా చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేశారు. ప్రతి ఏటా మదర్‌థెరిస్సా జయంతి రోజున గిరిజన, దళితకాలనీల్లో పేదలకు నిత్యావసర సరుకులు, వస్త్రాలు పంపిణీ చేస్తుంటారు. ఉపాధి కోసం పలువురికి ఉచితంగా కంప్యూటర్లను అందజేశారు. ఈయన సేవలను చూసి పలువురు తమవంతుగా ఆర్థిక సాయాన్ని ట్రస్ట్‌కు అందజేస్తున్నారు. కరోనా సమయంలో ఎన్నో కాలనీల్లో నిత్యావసర సరుకులు, భోజన ప్యాకెట్లను రోజుల తరబడి పంపిణీ చేశారు. దాతల సహకారంతో నెల్లూరు, ఆత్మకూరు, సూళ్లూరుపేట ప్రభుత్వాస్పత్రులకు ఆక్సిజన్ సిలిండర్లను సరఫరా చేశారు. చేసిన సేవలకు గానూ ఇప్పటికి ఆరుసార్లు మంత్రులు, కలెక్టర్ ద్వారా అవార్డులు అందుకున్నారు. బాలికలకు భరోసా జ్యోతి జయలక్ష్మి ఆత్మకూరు మండలం కరటంపాడు మజరా శ్రీనివాసపురం దళితకాలనీకి చెందిన మహిళ. ఆమె పుట్టి పెరిగింది తమిళనాడు రాష్ట్రంలోనైనా వివాహానంతరం శ్రీనివాసపురంలో స్థిరపడ్డారు. భర్త ఓ ప్రైవేట్ కంపెనీలో చిరుద్యోగి. చిన్నప్పటి నుంచి సేవా భావాలు కలిగిన జయలక్ష్మి కిశోర బాలికల సమస్యలను అర్థం చేసుకుని వారికి కావాల్సిన న్యాప్కిన్లు, సోప్‌లు అందజేశారు. ఓ స్వచ్ఛంద సేవా సంస్థలో కొంతకాలం ఉద్యోగం చేశారు. ఆ తర్వాత తన సేవలను మరింత విస్తరించారు. పౌష్టికాహారం తయా రు చేసి పేద పిల్లలకు అందిస్తున్నారు. పేద బాలికలకు యూనిఫాం కొనుగోలు చేసి అందజేశారు. కాలనీల్లో ప్రజలకు పరిశుభ్రత, దాని ప్రాధాన్యం వివరిస్తూ వారిని క్రమశిక్షణ దిశగా నడిపిస్తున్నారు. -
మతాలు కాదు... మనిషే ప్రధానం
అన్నిరకాలుగా నాశనమవుతూ ఉన్న మనిషిని బతికించుకోవాల్సిన అవసరం వచ్చింది. తన అలసత్వం, అజ్ఞానం, మూర్ఖత్వం వల్ల మనిషి తన ఉనికికే ప్రమాదకారి అవుతున్నాడు. మనిషి సజీవంగా ఉంటేనే ప్రభుత్వాలైనా, హక్కుల పోరాటాలైనా ఉనికిలో ఉంటాయి. అందుకే భూమి మీద ప్రమాదంలో ఉన్న మనిషిని ముందు బతికించు కోవాలి. అందుకు తగిన అవగాహన పెంచుకోవడానికే ఈ జూన్ 21ని మనం ‘హ్యూమనిస్ట్ డే’గా జరుపుకొంటున్నాం. అన్ని దశల్లో అన్నివేళలా మానవాభ్యుదయాన్ని కాంక్షించేదే మానవ వాదం. ఫెడ్రిక్ ఇమ్మాన్యుల్ నైథమ్మర్ తొలిసారి 1808లో ‘హ్యూమనిజం’ అనే పదాన్ని రూపొందించాడు. పద్దెనిమిది, పంతొమ్మిది శతాబ్దాలలో మానవ అవసరాల మీద శ్రద్ధ పెట్టడం, పనికిరాని విశ్వాసాల్ని పక్కకు నెట్టడం, ప్రతి దానికీ కారణాన్ని అన్వేషించడంతో ప్రారంభమై ‘మానవ వాదం’ ఒక ఆలోచనా ధోరణిగా రూపుదిద్దుకోవడం మొదల య్యింది. ఆ ఆలోచనా ధోరణి అన్ని కళల్లోకి వ్యాపించింది. మానవవాద దృక్పథంలోంచి లలిత కళలు, కవిత్వం, విద్య, వైద్యం వంటి రంగాలన్నీ బలపడుతూ వచ్చాయి. ప్రతిచోటా, ప్రతి రంగంలో ప్రశ్నకు విలువ పెరుగుతూ వచ్చింది. ఆ ప్రశ్న లకు సమాధానాలు అన్వేషించుకునే క్రమంలో హేతువాదంతో కూడిన మానవవాదం, శాస్త్రీయ అవగాహనా వ్యాప్తి చెందాయి. తొలిసారిగా 1933లో ‘హ్యూమనిస్ట్ మానిఫెస్టో’ చికాగో విశ్వవిద్యాలయంలో జరిగిన సదస్సులో విడుదల అయ్యింది. ఆ మానిఫెస్టో ప్రధానంగా... కారణం, నైతికత, సామాజిక–ఆర్థిక న్యాయం, సమన్వయం అనే సూత్రాల మీద ఆధారపడింది. వీటన్నింటితోపాటు మరొక విషయం ప్రత్యేకంగా చర్చించ బడింది. అదేమిటంటే– ఆధారం లేని విశ్వాసాలు, మూఢ నమ్మ కాలను పక్కకు నెట్టి, వైజ్ఞానిక అవగాహనను పెంపొందించా లనీ, దానిపై ఎక్కువ దృష్టి పెట్టాల్సి ఉందనీ కూడా మాని ఫెస్టోలో రాశారు. మానవవాదం గురించి అవగాహన పెరుగు తున్న దశలో ఆక్స్ఫర్డ్ ఇంగ్లిష్ నిఘంటువు ఒక వ్యతిరేకమైన అర్థాన్ని ప్రచురించింది. దాన్ని రూపొందించిన బృందంలో ఒక ఇంగ్లిష్ వాడు, హ్యూమనిస్ట్‌లంటే చులకన భావం గలవాడు ఆ అర్థాలు రాశాడు. ‘దైవ భావనను ధిక్కరించేవారు’, ‘ఉట్టి మానవతావాదులు’, ‘అరాచక వాదులు’, ‘ఆస్తులను దోపిడీ చేయువారు’ అని రాశాడు. బహుశా అతను విశాలమైన భావ జాలంతో, ప్రగతిశీల ధోరణితో ఆలోచించలేనివాడై ఉంటాడు. అందువల్ల అతను తన అక్కసును అలా వెళ్లగక్కుకున్నాడు. అది మాత్రమే కాదు, అలాంటి మరికొన్ని సంఘటనలు జరుగుతూ రావడం వల్ల సహజంగా మతతత్వ వాదులకు వెయ్యేనుగుల బలం చేకూరింది. అదే సమాజంలో వేళ్లూనుకుని పోయింది. తరతరాలుగా ప్రపంచవ్యాప్తంగా దైవభావన బలం పుంజు కుంది. దాని పర్యవసానంగానే మతాన్ని, దైవాన్ని ప్రశ్నించిన వారు దుర్మార్గులు, పాపాత్ములు, చెడ్డవారు అనే ముద్ర వేయ బడుతూ వచ్చారు. అందుకే చూడండి. పరిస్థితి ఈనాటికీ పూర్తిగా మారలేదు. మత విశ్వాసాలలో పడి కొట్టుకుపోయే వారిని మామూలు మనుషులుగా పరిగణిస్తున్నారు. స్వేచ్ఛాలో చనతో హేతుబద్ధంగా మాట్లాడేవాళ్లను ‘పిచ్చి’వాళ్ల కింద జమ కడుతున్నారు. విశాల హృదయంతో ఆలోచించలేని వారినీ, ఈ దేవుడు కాదు – ఆ దేవుడనీ, ఈ మతం కాదు ఆ మతమనీ కొట్టుకు చచ్చేవారిని – సమాజంలో అక్కడక్కడ అప్పుడప్పుడు కొందరు మహాను భావులు హెచ్చరిస్తూనే వచ్చారు. వాస్తవంలోంచి ఆలోచించం డనీ, కారణాల్ని వెతకండనీ బోధిస్తూనే వచ్చారు. అలాంటి వారిలో ఎర్నెస్ట్ రెనన్ పేరు తప్పక చెప్పాలి. ‘జ్ఞానం యొక్క భవిత: 1848 నాటి ఆలోచనలు’ – అనే గ్రంథంలో ఆయన ఇలా రాశాడు... ‘‘భవిష్యత్తులో మతమేదైనా ఉంటే, అది మా‘నవ’ వాదం – అని నేను మనస్ఫూర్తిగా నమ్ము తున్నాను. శాఖోపశాఖలుగా ఉన్న ఈ విశ్వాసాలన్నీ ఒక్కతాటిపై కొచ్చి, నైతిక విలువలతో కూడిన మా‘నవ’వాదంగా రూపు దిద్దుకుంటుంది– తప్పదు!’’ దుర్మార్గాల్ని ఆపే శక్తి సంప్రదా యాలకు లేదు– వైజ్ఞానిక అవగాహన పెరిగితేనే మానవత్వం వికసిస్తుంది! డాక్టర్ దేవరాజు మహారాజు వ్యాసకర్త ప్రముఖ రచయిత, జీవశాస్త్రవేత్త (జూన్ 21న ‘హ్యూమనిస్ట్ డే’ సందర్భంగా...) -
హైకోర్టులో ఆ ఐఏఎస్‌లకు ఊరట
సాక్షి, అమరావతి: ఐఏఎస్ అధికారులు వై. శ్రీలక్ష్మీ, బి. రాజశేఖర్, చినవీరభద్రుడు, జె. శ్యామలరావు, జి. విజయ్‌కుమార్, ఎంఎం నాయక్‌లకు రాష్ట్ర హైకోర్టు ఊరటనిచ్చింది. ఏదైనా ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ వసతి గృహంలో నెలలో ఓ ఆదివారం చొప్పున 12 ఆదివారాలు సామాజిక సేవ చేయాలంటూ సింగిల్ జడ్జి విధించిన శిక్షను హైకోర్టు ధర్మాసనం ఎనిమిది వారాలపాటు నిలిపివేసింది. తదుపరి విచారణను జూన్ 20కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ అసనుద్దీన్ అమానుల్లా, జస్టిస్ తర్లాడ రాజశేఖర్ ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. సామాజిక సేవకు ఐఏఎస్‌ల అంగీకారం ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన గ్రామ సచివాలయాలు, రైతుభరోసా కేంద్రాల నిర్మాణాలను తొలగించాలన్న ఆదేశాలను సకాలంలో అమలుచేయకపోవడాన్ని సింగిల్ జడ్జి జస్టిస్ బట్టు దేవానంద్ కోర్టు ధిక్కారంగా పరిగణించారు. ఇందుకు పంచాయతీరాజ్ కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీ, కమిషనర్ గిరిజాశంకర్, పాఠశాల విద్యాశాఖ అప్పటి ముఖ్య కార్యదర్శి బి. రాజశేఖర్, అప్పటి కమిషనర్ చిన వీరభద్రుడు, పురపాలక శాఖ అప్పటి ముఖ్య కార్యదర్శి జె. శ్యామలరావు, ఆ శాఖ ప్రస్తుత స్పెషల్ చీఫ్ సెక్రటరీ వై. శ్రీలక్ష్మీ, ఆ శాఖ అప్పటి డైరెక్టర్ జి. విజయ్‌కుమార్, ప్రస్తుత డైరెక్టర్ ఎంఎం నాయక్‌లను బాధ్యులుగా చేశారు. కోర్టు ధిక్కారం కింద వారికి నెలరోజుల జైలుశిక్ష, రూ.1000 జరిమానా విధించారు. అయితే.. వారు క్షమాపణ కోరడంతో పాటు వారి అభ్యర్థన మేరకు ఆ శిక్షను సామాజిక సేవగా మార్చారు. ఈ తీర్పును పునః సమీక్షించాలంటూ శ్రీలక్ష్మీ దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తి జస్టిస్ దేవానంద్ కొట్టేశారు. దీంతో సామాజిక సేవ చేయాలన్న తీర్పును సవాలు చేస్తూ ద్వివేదీ, గిరిజా శంకర్లు ఇటీవల ధర్మాసనం ముందు వేర్వేరుగా రెండు అప్పీళ్లు దాఖలు చేశారు. వీటిపై గత వారం విచారణ జరిపిన సీజే ధర్మాసనం, గోపాలకృష్ణ ద్వివేదీ, గిరిజా శంకర్లకు విధించిన సామాజిక సేవ శిక్ష అమలును నిలిపేస్తూ ఉత్తర్వులిచ్చిన సంగతి తెలిసిందే. ఆరుగురు ఐఏఎస్ అధికారుల అప్పీళ్లు ఈ నేపథ్యంలో.. మిగిలిన ఐఏఎస్ అధికారులు కూడా సింగిల్ జడ్జి తీర్పుపై అప్పీళ్లు దాఖలు చేశారు. వీటిపై గురువారం జస్టిస్ అమానుల్లా ధర్మాసనం విచారణ జరిపింది. ఐఏఎస్ అధికారుల తరఫున సీనియర్ న్యాయవాదులు సీవీ మోహన్‌రెడ్డి, ఎ. సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, కోర్టు ధిక్కారానికి పాల్పడిన వారికి ఎలాంటి శిక్ష విధించాలో, ఎంత కాలపరిమితితో విధించాలో కోర్టు ధిక్కార చట్టంలో స్పష్టంగా ఉందని వివరించారు. ఇదే వ్యవహారంలో సీజే ధర్మాసనం ఉత్తర్వులను కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీంతో శ్రీలక్ష్మీ తదితరులు దాఖలు చేసిన ఈ అప్పీళ్లలో కూడా సింగిల్ జడ్జి ఉత్తర్వుల అమలును నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. -
యూట్యూబ్‌తో లాభాలెన్నో.. ఇది తెలుసుకోండి
ఒకప్పుడు యూట్యూబ్ అంటే.. కేవలం వినోదం మాత్రమే!. మరి ఇప్పుడు.. వార్తలు.. వ్యాపారం.. విహారం అన్నీ అందులోనే. కానీ కొందరు కంటెంట్ క్రియేటర్లు.. ఇటు డబ్బు సంపాదనతోపాటు అటు సామాజిక సేవకూ తోడ్పడుతున్నారు. యూట్యూబ్ ఇటీవల విడుదల చేసిన ఇంపాక్ట్ రిపోర్ట్ ప్రకారం.. దక్షిణ భారతంలో సమాజంపై తమ ప్రభావాన్ని చూపిన చానెళ్లలో కొన్ని ఇవీ.. సృజనాత్మకతను ప్రోత్సహించే లక్ష్యంతో యూట్యూబ్ 2007లో మొదలుపెట్టిన పార్టనర్ షిప్ ప్రోగ్రామ్ ఇప్పుడు శాఖోపశాఖలుగా విస్తరించింది. తమలోని కళ, నైపుణ్యాలను ప్రపంచానికి చూపేందుకు క్రియేటర్లు చానళ్లు మొదలుపెట్టారు. ఈ క్రమంలో క్రియేటర్లు ఎంతో కొంత ఉపాధి పొందడం మొదలైంది. కొందరు వంటలు చేయడం ద్వారా లక్షల మందిని ఆకర్షించి డబ్బులు వెనకేస్తుంటే.. మరికొందరు ఇంగ్లిషు పాఠాలు బోధిస్తూ సంపాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో యూట్యూబ్ రెండేళ్ల క్రితం ఒక అధ్యయనం చేపట్టింది. యూట్యూబ్ క్రియేటర్ల ద్వారా ఆర్థిక వ్యవస్థలకు చేకూరుతున్న మేలు ఏమిటనేదానిపై ఆక్స్ఫర్డ్ ఎకనమిక్స్ విభాగంతో కలిసి అధ్యయనం చేసి.. ఇంపాక్ట్ రిపోర్ట్ రూపొందించింది. దాని ప్రకారం.. మన దేశంలో 6.83 లక్షల మందికి ప్రత్యక్ష/పరోక్ష ఉపాధి లభించడానికి యూట్యూబ్ క్రియేటర్లు కారణమయ్యారు. వీరిద్వారా భారత ఆర్థిక వ్యవస్థకు రూ.6,800 కోట్లు సమకూరినట్టు అంచనా వేశారు. యూట్యూబ్‌లోని 40 వేలకుపైగా చానళ్ల నిర్వాహకులు నెలకు రూ.లక్ష కంటే ఎక్కువ ఆదాయాన్ని పొందుతున్నారని ఆ నివేదిక తెలిపింది. దక్షిణాది రాష్ట్రాలకు చెందిన అలాంటి క్రియేటర్లు, చానళ్లలో కొన్ని ఇవి.. స్పోకెన్ ఇంగ్లిష్‌కు ‘కైజెన్ ఇంగ్లిష్’ తమిళనాడుకు చెందిన మలర్ సృష్టించిన చానల్ ఇది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా కాలేజీకి కూడా వెళ్లలేని మలర్.. దూరవిద్య కోర్సుల ద్వారానే డిగ్రీ పూర్తి చేశారు. తర్వాత టీచర్‌గా ఉపాధి పొందారు కూడా. ఆ సమయంలో ఇంగ్లిష్ రాకపోవడం వల్ల తాను పడ్డ కష్టాలు ఇతరులకు రావొద్దన్న సంకల్పంతో ‘కైజెన్ ఇంగ్లిష్’ పేరిట యూట్యూబ్ చానల్ మొదలుపెట్టారు. తమిళంలో మాట్లాడుతూ ఇంగ్లిష్ భాషను బోధిస్తున్నారు. ప్రస్తుతం ఈ చానెల్‌కు 9.77 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఈ చానల్ ద్వారా కోచింగ్ పొందిన తాము ఉద్యోగ ఇంటర్వ్యూలను విజయవంతంగా ఎదుర్కొన్నామని, ఇతరులతో ఇంగ్లిషులో ధీమాగా మాట్లాడటం అలవాటు చేసుకున్నామని సబ్స్క్రైబర్లు చెప్తుండటం గమనార్హం. స్ఫూర్తినిచ్చే.. తెలుగు గీక్స్ ఆయన పేరు పోతుల ఫణిదీప్.. వైద్యుడు.. కొన్నేళ్ల క్రితం ఆస్పత్రిలో పనిచేస్తుండగా వేళ్లు వణుకుతున్నట్టు గుర్తిం చారు. ‘అమయోట్రోపిక్ లాటెరల్ స్కెలరోసిస్ (ఏఎల్ఎస్)’ఉన్నట్టు తేలడంతో ఉద్యో గం వదిలేయాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే ఫణిదీప్ తన నిరాశ, నిస్పృహలను దూరం చేసుకునేందుకు యూట్యూబ్ చానల్ మొదలుపెట్టాడు. వ్యక్తిత్వవికాసానికి దోహదపడే వీడి యోలు రూపొందించారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన పుస్తకాల విషయాలను తెలుసుకోండి ఉచితంగా.. అని తెలుగులో రాసిన కవర్‌పేజీతో వచ్చే తెలుగు గీక్స్‌కు దాదాపు 14 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఫణిదీప్ నెలసరి ఆదాయం రూ.1.5లక్షలు. www.youtube.com/c/ TeluguGeeks/ featured ఎం4టెక్.. సైన్స్ పాఠాలతో.. పిల్లలకు ఆసక్తికర రీతిలో సైన్స్ పాఠాలు అందించే లక్ష్యంతో కేరళకు చెందిన జియోజోసెఫ్ మొదలుపెట్టిన చానల్ ఇది. సొంతంగా చేసుకోగల శాస్త్రీయ పరిశోధనలే ఈ చానల్ కంటెంట్. ఒక వీడియో బాగా వైరల్ కావడంతో జోసెఫ్ తన మిత్రుడు ప్రవీణ్‌తో కలిసి మరింత కంటెంట్‌ను రెగ్యులర్‌గా అందించడం మొదలుపెట్టాడు. తక్కువ కాలంలోనే చానల్ సబ్స్క్రైబర్ల సంఖ్య 74 లక్షలకు చేరుకుంది. నెలకు రూ.లక్షల్లో ఆదాయమూ తెచ్చిపెడుతోంది. ఎం4టెక్ చానల్‌లోని వీడియోల స్ఫూర్తితో ఇప్పుడు విద్యార్థులు సైన్స్ పోటీలకు సిద్ధమవుతున్నారంటే దాని ప్రభావం ఏమిటన్నది అర్థమైపోతుంది. https://www.youtube.com/c/M4Techofficial అనాథలకు అన్నం పెడుతున్న నవాబ్స్ కిచెన్ తెలంగాణకు చెందిన ఖ్వాజా మొయినుద్దీన్ స్థాపించిన యూట్యూబ్ చానల్.. కేవలం వంటల గురించి చెప్పేది మాత్రమే కాదు, ఈ క్రమంలోనే అనాథల కడుపులూ నింపుతోంది. తమ చానల్లో ప్రసారం చేయడం కోసం.. పెద్ద మొత్తాల్లో బిరియానీ, పలావ్ వంటి వంటలు వండటం, తర్వాత ఆ వంటను అనాథ పిల్లలకు పంచి పెట్టడం.. ఇదీ నవాబ్స్ కిచెన్ పనిచేసే తీరు. ఖ్వాజా మొయినుద్దీన్ తన మిత్రులతో కలిసి ఈ చానల్ మొదలుపెట్టారు. ఉద్యోగం మానేయడంతోపాటు మరెన్నో సమస్యలు వచ్చినా ఎదుర్కొని ముందుకు సాగిన ఖ్వాజాకు ఇప్పుడు తన చానల్ ద్వారా స్థిరమైన ఆదాయం లభిస్తోంది. అటు అనాథలకూ ఆహారం అందివ్వగలుగుతున్నాడు. ఇదీ చానల్ లింకు.. https://www.youtube.com/c/ NawabsKitchenFoodForAllOrphans - సాక్షి, హైదరాబాద్ -
8 మంది ఐఏఎస్ అధికారులకు వినూత్న శిక్ష
సాక్షి, అమరావతి: కోర్టు ధిక్కార కేసులో ఎనిమిది మంది ఐఏఎస్ అధికారులకు హైకోర్టు వినూత్న శిక్ష విధించింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సామాజిక సేవ చేయాలని వారిని ఆదేశించింది. నెలలో నచ్చిన ఓ ఆదివారం రోజున ఆ జిల్లాలో ఉన్న ఏదైనా ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ హాస్టల్లో సేవ చేయాలని చెప్పింది. ఇలా 12 ఆదివారాలు ఒక్కో వారం ఒక్కో హాస్టల్లో సేవ చేయడంతో పాటు ఆయా హాస్టళ్లలోని విద్యార్థులకు రుచికరమైన మధ్యాహ్న లేదా రాత్రి భోజనాన్ని అందించాలని ఆదేశించింది. ఇందుకు అయ్యే వ్యయాన్ని సొంత జేబు నుంచి భరించాలంది. ఒక్కో అధికారికి ఒక్కో జిల్లాను కేటాయించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ గురువారం తీర్పునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల వంటి వాటిని నిర్మిస్తుండటాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పలు వ్యాజ్యాలు దాఖలయ్యాయి. పాఠశాలల్లో ఇలాంటి నిర్మాణాలు తగవంటూ ఆదేశాలు ఇచ్చారు. అయితే ఈ ఆదేశాలకు విరుద్దంగా పలు చోట్ల నిర్మాణాలు కొనసాగడంతో అధికారులపై హైకోర్టు సుమోటోగా ధిక్కార చర్యలు చేపట్టింది. అందులో భాగంగా పంచాయతీరాజ్ కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీ, కమిషనర్ గిరిజాశంకర్, పాఠశాల విద్యా శాఖ అప్పటి ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్, అప్పటి కమిషనర్ చిన వీరభద్రుడు, పురపాలక శాఖ అప్పటి ముఖ్య కార్యదర్శి జె.శ్యామలరావు, ఆ శాఖ ప్రస్తుత స్పెషల్ చీఫ్ సెక్రటరీ వై.శ్రీలక్ష్మీ, ఆ శాఖ అప్పటి డైరెక్టర్ జి.విజయ్‌కుమార్, ప్రస్తుత డైరెక్టర్ ఎంఎం.నాయక్‌లను ప్రతివాదులుగా చేర్చింది. తాజాగా గురువారం ఈ ఎనిమిది మంది న్యాయమూర్తి ముందు హాజరయ్యారు. ధిక్కార చర్యల తర్వాతే స్పందించారు.. సుమోటోగా కోర్టు ధిక్కార చర్యలు మొదలైన తర్వాతే అధికారులు స్పందించి, దాదాపు 1,371 పాఠశాలల్లో నిర్మాణాలను గుర్తించి, తొలగించారని న్యాయమూర్తి అన్నారు. కోర్టు ఆదేశాలను నిజమైన స్ఫూర్తితో అమలు చేయక పోవడంతో వల్లే.. అఫిడవిట్ దాఖలు చేశాక కూడా పిటిషన్లు పడుతున్నాయని చెప్పారు. ఈ దృష్ట్యా ఈ ఎనిమిది మందికి రెండు వారాల జైలు శిక్ష, రూ.1,000 చొప్పున జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. దీంతో భవిష్యత్‌లో ఇలా జరగకుండా చూసుకుంటామని అధికారులు కోర్టును బేషరతు క్షమాపణలు కోరారు. క్షమాపణలు ఆమోదించాలంటే సామాజిక సేవ చేయాలని న్యాయమూర్తి షరతు విధించారు. దీనికి అధికారులందరూ అంగీకరించడంతో న్యాయమూర్తి తానిచ్చిన జైలు శిక్ష, జరిమానాను మాఫీ చేస్తూ.. వాటి స్థానంలో సామాజిక సేవకు ఆదేశాలిచ్చారు. ఈ అధికారులు హాస్టళ్ల సందర్శన వివరాలు, ఫొటోలను హైకోర్టుకు సమర్పించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. -
సామాజిక సేవ చేయండి
సాక్షి, అమరావతి: కోర్టు ధిక్కార కేసులో అనంతపురం జిల్లా విద్యాశాఖాధికారి (డీఈవో) కె.శామ్యూల్‌కు హైకోర్టు సామాజిక సేవను శిక్షగా విధించింది. అనంతపురం జిల్లాలోని ఏదైనా వృద్ధాశ్రమం లేదా అనాథ ఆశ్రమంలో ఉన్న వారికి వారం రోజుల పాటు భోజన ఖర్చులను భరించాలని ఆయనను ఆదేశించింది. ఆ వివరాలను తమ ముందుంచాలని స్పష్టం చేసింది. కోర్టు ఆదేశాలను అమలు చేయకుండా అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శించడమంటే కోర్టులను అవమానించడమేనంది. కోర్టు ఆదేశాలను అధికారులు అమలు చేసేలా తగిన చర్యలు చేపట్టాలని అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్‌కు స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. నోషనల్ సీనియారిటీని కల్పించే విషయంలో అనంతపురం జిల్లాకు చెందిన సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పి.వెంకటరమణ 2019లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన హైకోర్టు ఆయనకు నోషనల్ సీనియారిటీ కల్పించాలంటూ అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. అయితే అధికారులు ఈ ఆదేశాలను అమలు చేయకపోవడంతో వెంకటరమణ గతేడాది కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్.. పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్, అప్పటి కమిషనర్ చినవీరభద్రుడు, అనంతపురం డీఈవో శామ్యూల్ వ్యక్తిగత హాజరుకు ఆదేశాలిచ్చారు. ఈ ఆదేశాల మేరకు వారంతా సోమవారం కోర్టు ముందు హాజరయ్యారు. కోర్టు ఆదేశాల అమలులో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్, చినవీరభద్రుడు కారణం కాదని న్యాయమూర్తి తేల్చారు. డీఈవో శామ్యూల్ వల్లే కోర్టు ఆదేశాల అమలులో జాప్యం జరిగిందన్నారు. ఇందుకు ఆయనను బాధ్యుడిని చేస్తూ సామాజిక సేవను శిక్షగా విధించారు. -
హైవేపై కిలేడీ గ్యాంగ్.. సామాజిక సేవ పేరుతో..
సాక్షి, ఖిలా వరంగల్: ఏడుగురు సభ్యులతో కూడిన ఓ మహిళా ముఠా హైవేలపై తిష్ట వేసి వాహనదారులను లక్ష్యంగా చేసుకుని వసూళ్లకు పాల్పడుతున్నారు. జీన్స్ పాయింట్, టీషర్ట్ ధరించి ఉన్నారని వాహనం ఆపితే అంతే సంగతులు. స్వచ్ఛంద సంస్థలు, సామాజిక సేవ పేరుతో వాహనాలను నిలిపి చందాలు వసూళ్లు చేస్తున్నారు. ఇలాంటి ఘటనే మంగళవారం మధ్యాహ్నం వరంగల్– ఖమ్మం జాతీయ రహదారిపై బొల్లికుంట క్రాస్ రోడ్డు వద్ద జరగగా బుధవారం సాయంత్రం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వీరంతా రాజస్తాన్‌కు చెందిన మహిళలుగా అనుమానిస్తుండగా, మూఠాగా ఏర్పడి వచ్చి వెళ్లే వాహనదారులను చందాల పేరిట నిలువు దోపిడీ చేస్తున్నారు. వీరిని గమనించిన ఓ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి గట్టిగా నిలదీయడంతోపాటు సెల్ఫోన్లో వీడియో తీస్తుండగా ఆటోలో పరారయ్యారు. ఏడుగురు జీన్స్ పాయింట్, టీషర్ట్స్ ధరించి ఉన్నారని, సడన్‌గా వాహనం ఆపి సామాజిక సేవ పేరుతో డబ్బులు అడిగారని పలువురు తెలిపారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి మామునూరు పోలీసులు చేరుకుని వివరాలను సేకరించి గాలిస్తున్నట్లు తెలిసింది. -
పెళ్లి మూణ్ణాళ్ల ముచ్చటే అయ్యింది.. అయినా కుంగిపోలేదు
లుథియానా జిల్లా టూసా గ్రామానికి చెందిన సత్విందర్ కౌర్‌కు... అందరి అమ్మాయిల్లానే వయసు రాగానే తల్లిదండ్రులు పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చారు. టీచర్‌గా పనిచేస్తోన్న మంచి వరుడు దొరకడంతో 2009 ఫిబ్రవరి 23న పెద్దల సమక్షంలో కోటి ఆశలతో పెళ్లి చేసుకుంది సత్విందర్. ఆ ఆశలన్నీ మూణ్ణాళ్ల ముచ్చటేనని తెలియడానికి ఎక్కువ సమయం పట్టలేదు. వివాహం అయిన కొద్దిరోజులకే భర్త విదేశాలకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే 2010లో జార్జియా వెళ్లి అక్కడ నుంచి ఉక్రెయిన్‌కు మారాడు. అక్కడ ఓ ప్రైవేటు కంపెనీలో విదేశీ విద్యార్థుల కో ఆర్డినేటర్‌గా పనిచేసేవాడు. అతను మాత్రమే వెళ్లి తనను ఎందుకు తీసుకెళ్లలేదో సత్విందర్‌కు అర్థం కాలేదు. అలా ఐదేళ్లు గడిచిపోయాయి. 2015 జూలై 20 న ఇండియాకు భర్త తిరిగి వస్తున్నారని ఎంతో ఆత్రుతగా ఎదురు చూసింది సత్విందర్. సంవత్సరాల తరువాత విదేశాల నుంచి వచ్చిన భర్త కుటుంబంతో అయిష్టంగా వ్యవహరిస్తూ.. మనం వేరే ఇంటికి అద్దెకు వెళ్దాం అని చెప్పి కిరాయికి ఇల్లు తీసుకుని అక్కడకు మకాం మార్చాడు. నెల తరువాత ‘‘నేను ఇప్పుడు ఉక్రెయిన్ వెళ్తున్నాను. మూడు నెలల తరువాత నిన్ను తీసుకెళ్తాను’’ అని చెప్పి తిరిగి వెళ్లిపోయాడు. కానీ చెప్పినట్లుగా సత్విందర్ను తీసుకెళ్లలేదు. తన భర్త తనని మోసం చేసాడని తెలుసుకున్న సత్విందర్ 2016లో ఎన్ఆర్ఐ సెల్లో ఫిర్యాదు చేసింది. ఇదే సమయంలో ఆమె భర్త విడాకులు కావాలని కోర్టును ఆశ్రయించాడు. దీంతో కొన్ని వాయిదాల తరువాత పదివేల రూపాయల జీవన భృతితో కోర్టు విడాకులు ఇస్తూ తీర్పు ఇచ్చింది. విడాకులు మంజూరు అయ్యేంత వరకూ సత్విందర్.. తనలాగా భర్తచేతిలో మోసపోయి కోర్టుల చుట్టూ తిరుగుతున్న ఎంతోమంది అమ్మాయిల సాధక బాధలను దగ్గర నుంచి గమనించేది. చిన్న చిన్న అమ్మాయిల జీవితాలు రోడ్డున పడడం వారు న్యాయం కోసం సంవత్సరాలపాటు కోర్టుల చుట్టూ తిరగడం, సత్విందర్‌కు కూడా అటువంటి ప్రత్యక్ష అనుభవం ఉండడంతో తనలాంటి వారికి సాయపడాలనుకున్నారు. అబ్ నహీ సోషల్ వెల్ఫేర్ సొసైటీ.. భర్తల చేతిలో మోసపోయి ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్న అమ్మాయిలను ఆదుకోవాలని నిర్ణయించుకుని 2016లో ‘అబ్ నహీ సోషల్ వెల్ఫేర్ సొసైటీ’ పేరున స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. ఈ సంస్థ ద్వారా మోసపోయిన అమ్మాయిలు, మహిళలకు సాయం చేయడం ప్రారంభించారు. కోర్టులు, పోలీసు స్టేషన్స్ దగ్గర తనకు ఎదురైన అమ్మాయిలను, ఇంకా ఫేస్బుక్, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ద్వారా మరికొంతమంది బాధితులను కలిసి వారి సమస్యలు తెలుసుకుని ఎన్ఆర్ఐ సెల్స్, జాతీయ మహిళ కమిషన్ నిర్వహించే సెమినార్స్‌కు వారిని ఆహ్వానించి అక్కడ వాళ్లకు న్యాయం ఎలా అందుతుందో వివరించేవారు. ప్రభుత్వ పెద్దలను సంప్రదించి సమస్యల పరిష్కారానికి కృషిచేస్తున్నారు. అంతేగాక ప్రపంచవ్యాప్తంగా గురుద్వారాలను సంప్రదించి బాధిత మహిళ వివరాలు తెలుసుకుని వారికి కావాల్సిన సహాయ సహకారాలను అందిస్తున్నారు. ఇప్పటిదాకా 700 మంది మహిళలకు సాయపడ్డారు. ఎన్జీవోని సంప్రదించిన 40 మంది పురుషులకు సత్విందర్ సాయపడడం విశేషం. ‘‘నా భర్త నన్ను మోసం చేసినప్పుడు చాలా బాధపడ్డాను. కానీ కొన్నిరోజులకు నన్ను నేను తమాయించుకుని ధైర్యంగా పోరాడాలనుకున్నాను. ఈ క్రమంలోనే నాలా కోర్టుల చుట్టూ తిరుగుతున్న వారిలో ధైర్యం నింపుతూ.. సాయం చేయాలనుకున్నాను. ఎన్జీవో స్థాపించి నేను చేయగలిగిన సాయం చేస్తున్నాను. సాయం కోసం నా దగ్గరకు వచ్చేవారిలో 65 ఏళ్ల లోపు మహిళలు 22 మంది ఉన్నారు. వీళ్లంతా దశాబ్దాలుగా తమ భర్తల కోసం ఎదురు చూస్తున్నారు. పంజాబ్, హర్యాణ రాష్ట్రాల్లోనే దాదాపు 32 వేల మంది బాధిత మహిళలు ఉన్నారు. వీరిలో చాలా మందికి సరైన న్యాయం అందడం లేదు. కొన్ని సందర్భాల్లో మోసం చేసిన భర్తల పాస్‌పోర్టులు రద్దుచేయించడం, ప్రపంచ నలుమూలల్లో ఏదేశం లో ఉన్నా ఇండియాకు రప్పించి న్యాయం చేస్తున్నాం. ఇప్పటిదాక 20 జంటలను కౌన్సెలింగ్ ద్వారా కలిపాము’’ అని సత్విందర్ వివరించారు. -
వయసు చిన్నది.. సేవ గొప్పది..!
మన పని మనం చేసుకుంటూ పోతే గుర్తింపు దానంతట అదే వస్తుందన్న మాటకు ఉదాహరణగా నిలుస్తు్తన్నారు ఢిల్లీకి చెందిన దేవాన్షి రంజన్, సనా మిట్టార్లు. ఈ ఇద్దరు విద్యార్థినులూ చదువుతోపాటూ సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా చురుకుగా పాల్గొంటున్నారు. కరోనా సమయంలోనూ వెనుకంజ వేయక వీరు చేస్తోన్న కృషికి గుర్తింపుగా ప్రతిష్టాత్మక డయానా అవార్డు వరించింది. దివంగత ప్రిన్సెస్ డయానా గౌరవార్థం సామాజిక సేవ, మానవతా కారణాలకోసం కృషి చేసే 9–25 ఏళ్ల యువతీయువకులకు ఇచ్చే డయానా అవార్డు ఈ ఇద్దరమ్మాయిలనూ వెతుక్కుంటూ వచ్చి మరీ పురస్కరించింది. పిల్లలకు చదువు చెబుతున్న దేవాన్షి, సనా ఢిల్లీ యూనివర్సిటీ అనుబంధ లేడీ శ్రీ రామ్ కాలేజీలో చదువుతోన్న 21 ఏళ్ల దేవాన్షి రంజన్ లింగ సమానత్వం, మానసిక ఆరోగ్యం, బాలబాలిక విద్యపై కృషిచేస్తోంది. గత ఐదేళ్లుగా మురికివాడల్లో నివసించే నిరుపేద పిల్లలకు చదువు చెప్పడం, నిరుపేద మహిళల్లో ఆర్థిక అంశాలు, మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తోంది. మైక్‌డ్రాప్.. ‘‘కరోనా కారణంగా అంతంతమాత్రంగా ఉన్న నిరుపేద బతుకులు రోడ్డు మీద పడడంతో చాలా మంది పిల్లలు బడికెళ్లడం మానేశారు, కొంతమంది స్మార్ట్‌ఫోన్, ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకునే స్థోమత లేకపోవడం వల్ల కూడా చదువుకు దూరమయ్యారు. ఇటువంటి వారందరికి చదువు చెప్పేందుకు లడ్లీ అనే ఎన్జీవో ఫౌండేషన్‌తో కలిసి పనిచేయడం ప్రారంభించాను. స్టడీ మెటిరియల్, స్టేషనరీలు విద్యార్థులకు అందించి వారిని చదివించేందుకు ప్రోత్సహిస్తున్నాను. ఢిల్లీలోని మురికివాడల్లోని వెయ్యిమందికిపైగా పిల్లలకు చదువు చెబుతున్నాము. ఈ క్రమంలోనే మా సామాజిక సేవా కార్యక్రమాలను పదిరాష్ట్రాల్లోని యాభై జిల్లాల్లో విస్తరించాము. స్నేహితులతో కలిసి గతేడాది జూలైలో మైక్‌డ్రాప్ పేరిట ప్రాజెక్టును ప్రారంభించాను. స్త్రీవాదం, రాజకీయాలు, లింగ సమానత్వం, ఇంకా కళల ద్వారా మహిళలు ఎలా ఉపాధి పొందవచ్చు అన్న అంశాలపై వివిధ రకాల ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ప్రస్తుతం మా బృందంలో 50 మంది సభ్యులు ఉండగా మరో150 మంది కంట్రిబ్యూటర్స్ వివిధ ప్రాంతాల నుంచి పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే వర్క్‌షాపులు, వెబినార్స్‌ను నిర్వహిస్తూ నిరుపేదల్లో అవగాహన కల్పిస్తున్నాము’’ అని దేవాన్షి వివరించింది. మనదేశంలో కరోనా మహమ్మారి పంజా విసురుతున్న సమయంలో సనా మిట్టార్ 150 వలంటీర్లతో డిజిటల్ క్యాంపెయిన్‌ను సమన్వయ పరిచి ఐదు లక్షల రూపాయల విరాళాలను సేకరించింది. అంతేగాక లాక్డౌన్ కాలంలో నిరుపేద విద్యార్థులు స్మార్ట్ఫోన్లు కొనుక్కునేందుకు సాయం చేసింది. 40 మంది విద్యార్థులు సనా సాయంతో ఆన్లైన్ తరగతులకు హాజరవుతున్నారు. సోషల్ ఎంటర్పైజ్ గ్లోబల్ వలంటీర్ యాక్షన్ నెట్వర్క్(జీవీఏఎన్)ను ఏర్పాటు చేసి సాయం చేయాలని ఉన్నా చేయలేని పరిస్థితుల్లో ఉన్న యువతను జీవీఏఎన్ వేదికగా వారి సహాయ సహకారాలను సమాజానికి అందిస్తోంది సనా. పిల్లలకు చదువు చెబుతున్న దేవాన్షి, సనా -
సాయం కోసం డబ్బు తీసుకోవడం లేదు!
‘‘కోవిడ్ బాధితుల అవసరార్థం ఆక్సిజన్ సిలిండర్లు, రెమెడెసివిర్ ఇంజెక్షన్లు, ఆస్పత్రిలో బెడ్లు.. ఇలా నెల రోజుల నుంచి నా ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఎన్నో రిక్వెస్ట్‌లు వచ్చాయి. సోషల్ మీడియాలో వాలంటీర్లు, నా ఫ్రెండ్స్, నా అభిమానులు నాకు సాయంగా ఉంటున్నారు’’ అని నిఖిల్ అన్నారు. నిఖిల్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ – ‘‘ప్రస్తుత పరిస్థితుల్లో పుట్టినరోజు చేసుకోవాలనే ఆలోచన లేదు. ప్రస్తుతం షూటింగ్‌లు ఆగిపోయాయి.. ఇంట్లో ఖాళీగా కూర్చొని ఏం చేస్తాం? అందుకే సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. ప్రస్తుతానికి ఎవరి వద్దా డబ్బు సహాయంగా తీసుకోవడం లేదు. నా సొంత డబ్బులతోనే సాయం అందిస్తున్నాను. చాలా మంది డబ్బులు పంపుతామని సంప్రదించారు. అయితే ఆ డబ్బుతో మీ ప్రాంతాల్లో అవసరమైన వారికి సాయపడండి అని చెబుతున్నాను’’ అన్నారు. వైవాహిక జీవితం గురించి నిఖిల్ మాట్లాడుతూ – ‘‘గత ఏడాది మే 14న కోవిడ్ సమయంలోనే పల్లవితో నా పెళ్లి అయింది. హనీమూన్‌కి విదేశాలకు వెళ్లే పరిస్థితి అప్పుడు లేకపోవడంతో సిమ్లా, గోవాలకు వెళ్లాం. పల్లవి డాక్టర్ కావడంతో రోగులకు అవసరమైన మందులను ఫోనులో చెబుతుంటుంది. నేను చేస్తున్న సేవా కార్యక్రమాల్లో తను కూడా ఓ వాలంటీర్’’ అన్నారు. చేస్తున్న సినిమాల గురించి చెబుతూ – ‘‘ప్రస్తుతం ‘18 పేజెస్’, ‘కార్తికేయ 2’ చిత్రాలు చేస్తున్నాను. మరో మూడు సినిమాలకు సంతకం చేశాను’’ అన్నారు. -
"సోనుసూద్ అంబులెన్స్" సేవలకు శ్రీకారం..
-
మానవ సేవే మాధవ సేవ
కరోనా కారణంగా లాక్డౌన్ విధించడంతో మన తోటి మనుషులు ఎంతో మంది రోజుకు ఒక్క పూట కూడా ఆహారం దొరకక పస్తులు ఉంటున్నారు. లాక్‌డౌన్‌కి ముందు కష్టం చేసుకొని స్వశక్తితో బతికిన ఎంతో మంది వలసకూలీలు, దినసరి కూలీలు, నిరుపేదలు ఆకలితో నీళ్లు తాగి పడుకునే దుస్థితి దాపురించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదలను, వలస కూలీలను ఆదుకోవడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నాయి. దీనికి తోడు సామాన్యులు సైతం ఈ సమయంలో ముందుకొచ్చి సాయం చేస్తున్నారు. పేదలకు నిత్యవసర సరుకులు, ఆహారాన్ని అందిస్తున్నారు. అలా సాయం చేస్తున్న సామాన్యులు కొంతమంది సాక్షి.కామ్ ద్వారా వాళ్ల సేవ కార్యక్రమాన్ని తెలిపి మరెందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు. అనుశ్రీ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి అధ్వర్యంలో కరోనా కారణంగా ఉపాధి కోల్పొయిన వలస కూలీలకు, పేదలకు, దినసరి కూలీలకు గత మూడు రోజులుగా అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రోజుకు 500 మందికి అన్నదానం చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి సహాయం అందించిన వారికి అసోసియేషన్ అధ్యక్షలు అంబటి నాగరాజు, ఉపాధ్యక్షులు రమేష్‌గౌడ్ శుభాకాంక్షలు తెలిపారు. మనమంతా గ్రూప్ వారు లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న 4 ఆశ్రమాలకు కు కిరాణా సరుకులు, అద్దె ఖర్చులు అందించి సాయం చేశారు. సుధీర్ ఫౌండేషన్, హయత్ నగర్, మాతృ అభయ ఫౌండేషన్ , మేడిపల్లి, సాయి సురక్షిత వృద్ధ ఆశ్రమం, ఆలేటి ఆటం వరల్డ్ ఆశ్రమాలకు సాయం చేశారు. ఈ కార్యక్రమంలో మనమంతా గ్రూపు ఫౌండర్ రవి, జగదీష్ కుమార్ జల్లు, శేఖర్ ఉదయగిరి గారు, సుజాత గారు, రామాంజనేయులు, సునీత గారు, సుధాకర్ రెడ్డి, ఉష గారు సహాయ సహకారాలు అందించారు. ఇవే కాకుండా మానసిక వికలాంగురాలి కోసం టీవీ, నెలకు సరిపడా ఆర్గానిక్ ఫుడ్స్ అందించారు. లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పొయిన పేదలకు, నిరాశ్రయులకు కృష్ణజిల్లా గూడూరులో యతిరాజం గిడియోన్ తన వంతు సహాయాన్ని అందించారు. ప్రజలకు నిత్యావసర సరుకులు బియ్యం, కంది పప్పు, వంట నూనె అందించారు. ఈ కార్యక్రమానికి అడిషనల్ ఎస్పీ, ట్రైనీ డీఎస్పీ శ్రావణి , బండారు తాలూకా సీఐ, గూడూరు ఎస్సై ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో నాగరాజు, సోలమన్ తదితరులు పాల్గొన్నారు. లాక్డౌన్ కారణంగా పూణేలో ఇరుక్కపోయిన యల్‌టీఐలో ప్రాజెక్ట్ మేనేజర్‌గా పనిచేస్తున్న కాయల రామకృష్ణుడు తన సొంత గ్రామమైన కడపజిల్లా గంగాయపల్లిలో పేదలకు కూరగాయలు, గుడ్లు పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో తనకు సహాయం చేస్తున్న గ్రామ ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఖతర్‌లో ఉంటున్న కొణిజేటి శ్రీనివాసరావు తన స్వగ్రామమైన ఒంగోలులో ఉంటున్న వైద్యసిబ్భందికి 3560 మాస్క్‌లు అందించి దాతృత్వాన్ని చాటుకున్నారు. బోడుప్పల్కి చెందిన శ్రీనివాసరావు వారి స్వచ్ఛంద సంస్థ జెరూషా ఫౌండేషన్ ద్వారా హైవేల పక్కన ఉంటున్న నిరాశ్రయులకు, లాక్డౌన్ కారణగా జీహెచ్‌యమ్‌సీ వారు ఏర్పాటు చేసిన షల్టర్స్‌లో ఉంటున్న వారికి పులిహోర, గుడ్లు పంపిణీ చేస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. ఈ కార్యక్రమాన్ని లాక్డౌన్ చివరి వరకు కొనసాగిస్తామని శ్రీనివాసరావు తెలిపారు. చంద్రన్న పాలానికి చెందిన గెత్సమన్ ప్రార్థన సమూహము వారు కరోనా కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలకి ఆహారాన్ని అందించారు. మణికొండలో లాక్డౌన్ కారణంగా ఆహారం అందక ఇబ్బంది పడుతున్న రోజువారీ కూలీలకు, పేదలు 100 మందికి నీలేష్ దుబే అన్నదానం చేశారు. నెల్లూరు జిల్లా పియ్యలపాలేం గ్రామంలో అరబిందో ఫార్మా లిమిటెడ్ రిప్రజెంటేటివ్ పీనక గోపినాథ రెడ్డి 315 కుటుంబాలకు కూరగాయలు అందించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా సెక్రటరీ పీనక శ్రీనివాసులు రెడ్డి, రమణయ్య, సురేంద్ర రెడ్డి, సుభాష్ రెడ్డి పాల్గొన్నారు. -
లాక్డౌన్ : అన్నం, వాటర్ ప్యాకెట్లు పంపిణీ
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో దేశంలో లాక్డౌన్ అమలవుతోన్న సంగతి తెలిసిందే. దీంతో రోజువారి కూలీలు, వలస జీవులు, బడుగులు, సంచాలకులు తిండి దొరకని దీన పరిస్థితుల్లో ఉన్నారు. ఈ గడ్డుకాలంలో వారిని ఆదుకోవడానికి అనేక మంది ముందుకొచ్చి తమ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. ఈ క్రమంలో కొందరు డబ్బులు పంచుతుంటే, మరికొందరు అన్నదాన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ క్రమంలో సికింద్రాబాద్‌కు చెందిన ఫిరోజ్ ఖాన్ అనే వ్యక్తి స్వచ్చందం ముందుకు వచ్చారు. ఈ గడ్డు కాలంతో తిండి దొరక్క అలమటిస్తున్న సికింద్రాబాద్ ప్రాంతంలో నిరాశ్రయులకు, సంచాలకులకు పులిహోర, వాటర్ ప్యాకెట్లు పంపిణి చేసి మనవతను చాటుకున్నారు. (నిత్యవసర సరుకులు పంపిణీ చేసిన బిట్స్ పిలానీ) -
నా సేవలు కొనసాగిస్తా
చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌తో పాటు ఇతర సామాజిక సేవా కార్యక్రమాలకు గాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ‘చాంపియన్స్ ఆఫ్ చేంజ్ 2019’ అవార్డు అందుకున్నారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ అవార్డును అల్లు అరవింద్‌కి ప్రదానం చేశారు. ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ– ‘‘ఈ అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉంది.. ఇందుకు కేంద్ర ప్రభుత్వానికి, జ్యూరీకి ధన్యవాదాలు. 40ఏళ్ల ప్రయాణంలో సేద తీర్చుకోవడానికి అవార్డులు ఉపయోగపడతాయి. నా సినిమాలు చూస్తున్న ప్రేక్షకులకు, చిరంజీవి బ్లడ్ బ్యాంక్ రక్త దాతలకు ఈ అవార్డును అంకితం ఇస్తున్నా. భవిష్యత్తులో సమాజం కోసం నా సేవలు కొనసాగిస్తా’’ అన్నారు. -
పావనం
శ్రీ రామకృష్ణ పరమహంస సేవలో, శిష్యరికంలో ఆధ్యాత్మికంగా అత్యున్నత స్థాయికి చేరిన గృహస్థు నాగ మహాశయుడు. వైద్యుడైన ఆయన తన వద్దకు వచ్చే నిరుపేద రోగులకు ఉచితంగా మందులిచ్చి సేవచేయడమేగాక, పథ్యపానీయాలకు సరిపడ డబ్బును కూడా తానే సమకూర్చేవాడు. అవధూతలా జీవించిన నాగమహాశయులు ఒకసారి కలకత్తా నుంచి స్వగ్రామం వెళ్లారు. ఆ రోజు ఏదో పర్వదినం. ఇలాంటి పర్వదినాన కలకత్తాలో ఉండి కూడా పవిత్రమైన గంగలో స్నానం చేయకుండా వచ్చేసినందుకు తండ్రి ఆయన్ని మందలించాడు. అందుకు నాగమహాశయులు ‘‘తండ్రీ! గంగ కలకత్తాలోనే కాదు... అన్నిచోట్లా ఉంది. భగవదనుగ్రహం ఉంటే, మనం ఉన్నచోటే మనం గంగాస్నానం చేయవచ్చు’’ అని జవాబిచ్చాడు. అంతలోనే ఒక అద్భుతం జరిగింది. నాగమహాశయులు స్నానం చేయడానికి వెళుతున్నారు.. అప్పుడు పెరట్లో ఒకచోట చిమ్మిన గొట్టంలోనుంచి వస్తున్నట్లుగా నీరు పైకి ఎగజిమ్ముతూ వచ్చి ఆ ఆవరణమంతా జలమయం అయిపోయింది. భగవదనుగ్రహం జలప్రవాహంలా ప్రవహించి, తన నమ్మకాన్ని నిలబెట్టినందుకు నాగమహాశయుడు పొంగిపోయి, భావోద్రేకంతో ‘‘స్వాగతం గంగామాతా! స్వాగతం! మమ్మల్నందరినీ పావనం చెయ్యి తల్లీ’’ అని అరిచాడు. ఆయన తండ్రి, ఇరుగు పొరుగు వారందరూ ఆ పవిత్ర గంగాజలాలలో స్నానం చేసి, గంగాస్నానం చేసిన అనుభూతికి లోనయ్యారు. దైవకృప... దేవుని పట్ల ప్రగాఢ విశ్వాసం ఉంటే ఇలానే జరుగుతుంది మరి. -
గ్రూప్1 అధికారిగా రిటైర్డ్ అయ్యి..తాను చదివిన పాఠశాలకు..
కష్టపడి చదివి.. ఉద్యోగం సాధించి.. కుటుంబం, పిల్లల ఉన్నతికి బాటలు వేసి.. ఉద్యోగ విరమణ అనంతరం ప్రశాంతంగా గడపవచ్చు. అయితే చివరకు వెనక్కి తిరిగి చూసుకుంటే జీవితం ఇంతేనా అనిపించవచ్చు. అందుకే ఆయన ఉన్నత ఉద్యోగం చేసి రిటైర్డ్ అయినా ఇప్పటికీ సామాజిక సేవలోనే తరిస్తూనే ఉన్నారు. మంచి మనసుతో చేసే పనితో సమ సమాజ నిర్మాణం సాధ్యమని నిరూపిస్తున్నారు. సౌకర్యాలు లేని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి సొంత నిధులు వెచ్చిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. – నంద్యాల సాక్షి, కర్నూలు: మారుమూల గ్రామంలో పేద కుటుంబంలో జన్మించి మొదట ఎస్ఐ ఉద్యోగం సాధించి అంచలంచెలుగా ఎదుగుతూ రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారిగా, రాష్ట్ర ఇన్‌కంట్యాక్స్ జాయింట్ కమిషనర్‌గా పని చేసి ఉద్యోగ విరమణ అనంతరం జిల్లాలోని అనేక ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి తనవంతు తోడ్పాటు అందిస్తున్నారు. సంజామల మండలం నొస్సం గ్రామానికి చెందిన నాగస్వారం నరసింహులు ఒకటవ తరగతి నుంచి ఎంఏ పీహెచ్డీ వరకు ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలల్లోనే చదువుకున్నారు. తర్వాత 1983లో సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగం సాధించారు. ఎస్ఐగా ఉంటూ ఏపీటీఎస్సీ పరీక్షలు రాసి గ్రూప్–2 అధికారిగా ఎంపికయ్యారు. అనంతరం 1996లో గ్రూప్–1 ఉద్యోగం సాధించారు. 2005 నుంచి 2016 వరకు రాష్ట్ర ట్యాక్స్ జాయింట్ కమిషనర్‌గా, రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారిగా కడపలో పని చేసి ఉద్యోగ విరమణ పొందారు. గతంలో అతను చదువుకున్న ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో కనీస వసతులు లేకపోవడంపై నిత్యం తన స్నేహితులతో ఆవేదన వ్యక్తం చేసేవారు. దీంతో రిటైర్డ్ అయిన తర్వాత నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. పాఠశాల సమస్యలపై పత్రికల్లో వచ్చిన కథనాలకు స్పందిస్తూ పరిష్కారానికి చొరవ చూపుతున్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల హృదయాల్లో జల ప్రదాతగా పేరు తెచ్చుకున్నారు. పదవ తరగతిలో నాలుగుసార్లు ఫెయిల్ తల్లిదండ్రులు తడికెలు, గంపలు అల్లేవారు. వారికి తోడుగా నరసింహులు పని చేస్తూ ఇంటి వద్దనే గడిపేవాడు. ఈ క్రమంలో చదువుపై ఆసక్తి తగ్గింది. దీంతో పదవ తరగతి నాలుగుసార్లు ఫెయిల్ అయ్యారు. తర్వాత తల్లిదండ్రుల సూచన మేరకు పట్టుబట్టి పదవ తరగతి పాస్ అయ్యారు. అనంతరం ఎస్ఐ, గ్రూప్–2, గ్రూప్–1 స్థానానికి ఎదిగారు. చదువుకుంటున్న సమయంలోనే కళాశాల నుంచి జాతీయ స్థాయి సాఫ్ట్‌బాల్ ఆటగాడిగా గుర్తింపు పొందారు. వాటిలో భాగంగా 2014–2016వ సంవత్సరంలో ఇండియా బాస్కెట్‌బాల్ టీంకు మేనేజర్‌గా వ్యవహరించారు. థాయిల్యాండ్, మలేషియా, సింగపూర్, ఇండోనేషియా, జపాన్ వంటి దేశాలకు ఇండియా టీం మేనేజర్‌గా వెళ్లారు. సేవతోనే ఆత్మసంతృప్తి ప్రభుత్వ పాఠశాలకు, పేద విద్యార్థులకు సేవ చేస్తున్నందుకు ఆత్మసంతృప్తి కలుగుతుంది. మేము చదువుకున్న సమయంలో పాఠశాలల్లో సౌకర్యాలు లేక ఇబ్బందులు పడ్డాం. ఇప్పటికే దాదాపు 80పాఠశాలల్లో నీటి బోర్లు వేయించి నీటి సమస్యను తీర్చడం చాలా ఆనందంగా ఉంది. టీవీల్లో, పేపర్లలో వచ్చే ప్రభుత్వ పాఠశాల సమస్యలపై స్పందిస్తూ పరిష్కారానికి కృషి చేస్తున్నాను. – నాగస్వారం నరసింహులు, మాజీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి సేవా కార్యక్రమాలు.. ⇔ డిసెంబర్ 2017లో చాగలమర్రి జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో బోరు ఏర్పాటు చేశారు. ⇔ చిలకలడోన కస్తూరిబా గాంధీ పాఠశాల బాలికలకు రూ.40వేలు విలువ గల క్రీడా సామగ్రి అందించారు. ⇔ పాణ్యం సమీపంలోని కస్తూర్భా గాంధీ పాఠశాలకు రూ.40వేలు విలువ చేసే వంట సామగ్రిని అందజేశారు. ⇔ ఎర్రగుంట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరుగుదొడ్ల మరమ్మతులకు రూ.30వేలు చేయూతనిచ్చారు. ⇔ గోనెగండ్ల కస్తూర్భా గాంధీ పాఠశాలకు రూ.60వేలతో బోరు వేయించి పైపులైన్ సౌకర్యం కల్పించారు. ⇔ దీబగుంట్ల ప్రభుత్వ పాఠశాలకు ఉపాధ్యాయులు రికార్డులు భద్రంగా ఉంచేందుకు రూ.25వేల సేఫ్లాకర్ను అందించారు. ⇔ కర్నూలు పట్టణంలో ఇద్దరు అనాథలను పిల్లలను దత్తత తీసుకొని వారి చదువుకు అయ్యే ఖర్చులను భరిస్తున్నారు. ⇔ మాయలూరు జెడ్పీపాఠశాలలో రూ.40 వేలతో బోరు వేయించారు. ⇔ దిగువపాడు జెడ్పీ హైస్కూల్‌కు రూ.60వేలతో నీటి బోరు వేయించారు. ⇔ నంద్యాల జెడ్పీ బాలికల పాఠశాలలో రూ.55 వేలతో నీటి సౌకర్యం. వెంటనే స్పందించారు మా పాఠశాలలో నెలకొన్న నీటి సమస్యపై పత్రికలో వచ్చిన వార్తకు ఆయన వెంటనే స్పందించి మరుసటి రోజు మా పాఠశాలను సందర్శించారు. పాఠశాలల్లో రూ.50వేలతో నీటి బోరు వేయించి తాగునీటి సౌకర్యం కల్పించారు. ఇలాంటి మంచి మనసున్న వ్యక్తులు సమాజంలో చాలా తక్కువగా ఉంటారు. – సుబ్బన్న, ఉపాధ్యాయుడు, తిమ్మాపురం -
డొనేషన్.. కమీషన్
సాక్షి, సిటీబ్యూరో: కాగితాలకే పరిమితమైన సొసైటీ..రికార్డుల్లోనే పొందుపరుస్తున్న సామాజిక సేవలు..ఆదాయపు పన్ను సర్టిఫికెట్ సృష్టించి.. మూడు రాష్ట్రాలకు చెందిన వ్యాపారులతో దందా... వెరసి మూడు ఆర్థిక సంవత్సరాల్లో రూ.41.74 కోట్లు డొనేషన్‌గా తీసుకున్నాడు... ఈ మొత్తాన్ని షెల్ కంపెనీల ద్వారా మళ్ళీ ‘దాతలకే’ పంపి కమీషన్లు తీసుకున్నాడు... మొత్తమ్మీద ఆదాయపుపన్ను శాఖకు పన్ను రూపంలో రావాల్సిన రూ.22.43 కోట్లకు గండికొట్టాడు. దీనిపై ఫిర్యాదు అందుకున్న సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. గురువారం ప్రధాన సూత్రధారి సనతన రవిని అరెస్టు చేసిన అధికారులు ఈ కేసులో దాదాపు మరో 200 మంది నిందితులుగా ఉన్నట్లు తేల్చారు. పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్లకు చెందిన సుబ్బారావు 1993లో రూరల్ డెవలప్మెంట్ సొసైటీని స్థాపించారు. గ్రామీణ ప్రాంతాల్లో సేవలు చేసే ఇలాంటి సంస్థలకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) అనేక ప్రోత్సాహకాలు అందిస్తుంది. వీటి పనితీరును బట్టి కొన్ని మినహాయింపులు ఇస్తూ సర్టిఫికెట్లు జారీ చేస్తుంది. ఇవి కలిగి ఉన్న సంస్థలకు డొనేషన్లు ఇచ్చే వారికి ఆదాయపుపన్ను మినహాయింపు వస్తుంది. మహబూబ్‌నగర్ సమీపంలోని కొల్లాపూర్‌కు చెందిన రవి కొన్నాళ్ళు ఈ సంస్థలో పని చేశాడు. ఆపై అది తన సంస్థే అంటూ 2013లో హైదరాబాద్‌కు వచ్చి పంజగుట్ట ప్రాంతంలో కార్యాలయం ఏర్పాటు చేశాడు. నల్లగొండలోని గ్రామీణ ప్రాంతాల్లో ఫ్లోరైడ్ సమస్యను అధిగమించడమే తమ సంస్థ లక్ష్యమని, దీని కోసం భారీ పరిశోధనలు చేస్తున్నట్లు రికార్డులు రూపొందించాడు. దీని ఆధారంగా సీబీడీటీకి దరఖాస్తు చేసుకుని సెక్షన్ 12 (ఎ) సర్టిఫికెట్ పొందాడు. ఇది కలిగిన స్వచ్ఛంద సంస్థకు డొనేషన్ ఇచ్చే దాతలు ఆ మొత్తంలో 50 శాతానికి సమానమైన నగదుకు పన్ను మినహాయింపు పొందవచ్చు. ఇలా కొన్నాళ్ళు డొనేషన్లు తీసుకున్న అతగాడు 2017–18 ఆర్థిక సంవత్సరంలో ‘సెక్షన్ 35’ కింద సర్టిఫికెట్ కోసం సీబీడీటీకి రవి దరఖాస్తు చేసుకున్నాడు. ఈ సర్టిఫికెట్ లభించిన సంస్థలకు డొనేషన్లు ఇస్తే... దాతలు ఆ మొత్తానికి 175 శాతానికి సమానమైన నగదుపై ఆదాయపు పన్ను మినహాయింపు పొందవచ్చు. ఈ దరఖాస్తు సీబీడీటీ వద్ద పెండింగ్ ఉండగానే రవి తనకు అనుమతి లభించినట్లు నకిలీ సర్టిఫికెట్ రూపొందించాడు. దీని ఆధారంగా మహారాష్ట్ర, గుజరాత్, పశ్చిమ బెంగాల్‌ల్లోని కొందరు వ్యాపారులతో కలిసి భారీ కుట్ర పన్నాడు. వారి నుంచి ఏటా డొనేషన్లు తీసుకుంటున్న రవి వాటిని కొన్ని షెల్ కంపెనీలకు మళ్ళిస్తున్నాడు. వాటి సహకారంతో ఆ మొత్తంలో 95 శాతం ‘దాత’లకే పంపించేస్తూ... 5 శాతం కమీషన్‌గా తీసుకుంటున్నాడు. ఇలా చేయడంతో ఆయా సంస్థలకు చెందిన ‘ఆన్లైన్ ధనం’ లిక్విడ్ క్యాష్‌గా మారి చేతికి వస్తోంది. అంతే కాకండా ఆ మొత్తంలో 175 శాతానికి సమానమైన నగదుకు ఆయా వ్యాపారులు ఐటీ మినహాయింపు పొందుతున్నారు. ఈ రకంగా 2015–16 నుంచి 2018–19 వరకు ఆ మూడు రాష్ట్రాలకు చెందిన వ్యాపారుల నుంచి మొత్తం రూ.41,74,38,000 డొనేషన్లు తీసుకున్న రవి వాటిలో 95 శాతం షెల్ కంపెనీల ద్వారా తిరిగి వారికే పంపాడు. ఇలా మొత్తమ్మీద ఆదాయపు పన్ను శాఖకు రావాల్సిన రూ.22.43 కోట్లకు గండి కొట్టడానికి సహకరించాడు. పరిశోధన చేస్తున్నట్లు ప్రకటించిన రూరల్ డెవలప్మెంట్ సొసైటీ వ్యవహారాలపై ఆరా తీసిన ఐటీ అధికారులు వారికి అసలు ల్యాబొరేటరీ లేదని తేల్చారు. మరికొంత లోతుగా దర్యాప్తు చేయగా సెక్షన్ 35 సర్టిఫికెట్ నకిలీది సృష్టించారని, దీని ఆధారంగా మూడు రాష్ట్రాలకు చెందిన 200 మంది వ్యాపారులతో కలిసి భారీ స్కామ్‌కు పాల్పడి ఆదాయపు పన్నుకు గండి కొట్టినట్లు గుర్తించారు. దీంతో ఆ అధికారులు సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న ఏసీపీ ఎస్వీ హరికృష్ణ నేతృత్వంలోని బృందం దర్యాప్తు చేపట్టింది. ప్రాథమిక ఆధారాలు సేకరించిన నేపథ్యంలో గురువారం రవిని అరెస్టు చేసింది. ‘ఈ వ్యవహారంలో దాదాపు 200 మంది వ్యాపారులకు ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్నాం. దీనిపై ప్రాథమిక ఆధారాలు లభించిన తర్వాత వారి పైనా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం’ అని ఏసీపీ హరికృష్ణ ‘సాక్షి’కి తెలిపారు. -
ఆ సమయంలో నొప్పి రాకుండా ఉండాలంటే...
పీరియడ్స్ టైమ్‌లో నొప్పి రాకుండా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చిట్కాల గురించి తెలియజేయగలరు. ప్రైమరీ డిస్మెనోరియా అంటే ఏమిటి? –పీఎల్, ఒంగోలు పరీక్షలు ఏమి చేసినా, కారణాలేవీ లేకుండా, సమస్య ఏమీ లేకుండా పీరియడ్ సమయంలో పొత్తి కడుపులో నొప్పి రావడాన్ని ప్రైమరీ డిస్మెనోరియా అంటారు. పీరియడ్ సమయంలో ప్రోస్టోగ్లాండిన్స్ అనే హార్మోన్లు విడుదలవుతాయి. వీటి ప్రభావం వల్ల రక్తనాళాలు కుంచించుకుని, గర్భాశయంలోని ఎండోమెట్రియమ్ పొరకి రక్తప్రసరణ తగ్గిపోయి బ్లీడింగ్ రూపంలో ఈ పొర ఊడిపోయి బయటకు వస్తుంది. అలాగే గర్భాశయం కుంచించుకుంటూ బ్లీడింగ్‌ను బయటకు పంపుతుంది. ఈ ప్రోస్టోగ్లాండిన్స్ విడుదలయ్యే మోతాదును బట్టి కొందరిలో ఈ నొప్పి ఎక్కువగా ఉంటుంది. కొందరిలో కొద్దిగా ఉంటుంది. కొందరిలో అసలే నొప్పీ ఉండదు. కొందరిలో గర్భాశయంలో గడ్డలు, ఎండోమెట్రియాసిస్, గర్భాశయంలో ఇన్ఫెక్షన్స్ వంటి ఎన్నో కారణాల వల్ల కూడా పీరియడ్స్ సమయంలో నొప్పి ఉంటుంది. దీనిని సెకండరీ డిస్మెనోరియా అంటారు. కారణాన్ని బట్టి పీరియడ్స్ నొప్పికి చికిత్స ఇవ్వడం జరుగుతుంది. నొప్పి అసలు రాకుండా ఉండటానికి జాగ్రత్తలు ఏమీ ఉండవు. కాకపోతే నొప్పి తెలియకుండా ఉండటానికి వాకింగ్, యోగా, ధ్యానం, వ్యాయామాలు వంటివి చేస్తూ మితమైన పోషకాహారం తీసుకుంటూ ఎత్తుకు తగిన బరువు ఉండేలా చూసుకోవడం మంచిది. పీరియడ్స్ సమయంలో రోజుకు కనీసం ఎనిమిది గ్లాసుల నీళ్లు తాగడం, ఉప్పు తక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం, ఎక్కువ ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, క్యాల్షియం, విటమిన్–బి, మెగ్నీషియం సప్లిమెంట్లు తీసుకోవడం, అల్లం, పసుపు, సోంపు, కొద్దిగా చెక్క వంటివి తీసుకోవడం, పొత్తికడుపుపై మసాజ్, వేడి కాపడం పెట్టడం, వేడినీళ్ల స్నానం చేయడం వంటి చిట్కాలను పాటించడం ద్వారా కూడా నొప్పి నుంచి చాలా వరకు ఉపశమనం పొందవచ్చు. నేను బ్యాంకు ఉద్యోగిని. సోషల్ సర్వీస్ అంటే ఇష్టం. అక్కడక్కడా గర్భిణి స్త్రీలను చూసినప్పుడు.... తగిన జాగ్రత్తలు తీసుకోవడం లేదనే అనుమానం వస్తుంటుంది. ప్రెగ్నెంట్‌గా ఉండి కూడా కూలీ పనులకు వెళుతున్న, ఎండలో బట్టలు ఉతుకుతున్న గర్భిణులను చూసినప్పుడు... నేనే చొరవ తీసుకొని వారి దగ్గరకు వెళ్లి ‘ఇలా చేయకూడదమ్మా’ అని చెబుతుంటాను. ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు తీసుకోవాల్సిన పది ప్రధాన జాగ్రత్తల గురించి చెబితే... నేను వాటిని నిరక్షరాస్యులైన గర్భిణి స్త్రీలకు తెలియజేస్తాను. – ఆర్.శైలజరాణి, మంగపేట ప్రెగ్నెన్సీ సమయంలో గర్భిణులు తీసుకోవలసిన జాగ్రత్తలు: 1. గర్భ నిర్ధారణ జరిగిన వెంటనే డాక్టర్‌ను సంప్రదించి, వారి సలహాలను పాటించడం. 2. ఆహారంలో ఎక్కువగా ఆకు కూరలు, కాయగూరలు, పండ్లు, పాలు, పలచని మజ్జిగ, మంచినీళ్లు ఎక్కువగా తీసుకోవడం. 3. ఫోలిక్ యాసిడ్, ఐరన్, క్యాల్షియం మాత్రలను తొమ్మిదినెలల పాటు తీసుకోవడం. దీని వల్ల రక్తహీనత లేకుండా తల్లి, బిడ్డ ఎముకలు గట్టిగా ఉండటానికి దోహదడుతుంది. 4. అన్ని ప్రభుత్వ ఆస్పత్రులలో ఉచితంగా చెకప్‌లు, రక్తపరీక్షలు చెయ్యడం, మందులు ఇవ్వడం, గుడ్లు పాలు ఇవ్వడం జరుగుతోంది. కాబట్టి ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవడం వల్ల తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉంటారు. ఏవైనా సమస్యలు ఉన్నా, వాటికి చికిత్స తీసుకోవచ్చు. 5. బ్లడ్ గ్రూప్, హీమోగ్లోబిన్, సుగర్, సీయూఈ, హెచ్ఐవీ, హెపటైటిస్, వీడీఆర్ఎల్ వంటి రక్త పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవడం వల్ల ముందుగానే రక్తహీనత, ఇన్ఫెక్షన్లు వంటివి ఉంటే చికిత్స తీసుకోవచ్చు. 6. డాక్టర్ దగ్గరికి సక్రమంగా చెకప్‌లకు వెళ్లి బరువు, బీపీ వంటివి చూపించుకోవడం. 7. బిడ్డలో అవయవ లోపాలు, ఆరోగ్యం తెలుసుకోవడానికి కనీసం ఐదవ నెలలో ఒకసారి, తొమ్మిదవ నెలలో ఒకసారి అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించుకోవడం. 8. నెలలు నిండే కొద్దీ మధ్యాహ్నం ఒక గంట, రాత్రి ఎనిమిది గంటలు నిద్ర తప్పనిసరి. ఎడమ వైపు తిరిగి పడుకోవడం వల్ల బిడ్డకి, తల్లికి కూడా రక్తప్రసరణ సక్రమంగా జరుగుతుంది,. 9. నెలలు పెరిగే కొద్దీ బిడ్డ కదలికలు గమనించుకుంటూ, కదలికలు తెలియకపోయినా, యోని భాగం నుంచి నీరులా కారిపోవడం, బ్లీడింగ్ అవడం, కడుపులో నొప్పి, కాళ్లు బాగా వాచడం వంటి లక్షణాలు కనిపిస్తే, తొందరగా ఆస్పత్రికి వెళ్లడం. మితమైన పౌష్టికాహారం తీసుకుంటూ, ఆయాసం లేనంత వరకు పనులు చేసుకుంటూ ఉండటం వల్ల కాన్పు సులభంగా అయ్యే అవకాశాలు ఉంటాయి. 10. కాన్పు ఇంట్లో కాకుండా ఆస్పత్రిలో అయ్యేలా చూసుకోవడం మంచిది. దీనివల్ల తల్లికి, బిడ్డకి ఇన్ఫెక్షన్లు రాకుండా ఉండటమే కాకుండా, తల్లిలో అధిక రక్తస్రావం, హైబీపీ వంటి కాంప్లికేషన్లకు తగిన చికిత్స వెంటనే తీసుకోవడానికి వీలవుతుంది. దీనివల్ల తల్లీబిడ్డల మరణాల రేటును తగ్గుతుంది. తల్లీబిడ్డా క్షేమంగా, ఆరోగ్యంగా ఉంటారు. నేను ప్రెగ్నెంట్. ఈమధ్య ఒక ఆర్టికల్‌లో preeclampisa డిసీజ్ గురించి చూశాను. ఇది తల్లి, బిడ్డలకు ఎందుకు వస్తుంది? మన దేశంలో కూడా ఈ సమస్య ఉందా? ఇది రాకుండా ఎలాంటి ముందుజాగ్రత్తలు తీసుకోవాలి? – కె.మమత, విశాఖపట్టణం గర్భిణి సమయంలో కొందరిలో బీపీ పెరిగి, అది కిడ్నీల పనితీరుపై ప్రభావం చూపుతుంది. దాని వల్ల మూత్రంలో ఆల్బుమిన్ ప్రొటీన్ ఎక్కువగా పోవడం జరుగుతుంది. ఈ సమస్యనే ‘ప్రీ ఎక్లామ్సియా’ అంటారు. ఇది ఎవరికి ఎందుకు వస్తుందనేది ముందుగా కచ్చితంగా చెప్పడం కష్టం. సాధారణంగా ఎక్కువ బరువు ఉన్నవారిలో, మరీ చిన్న వయసులో గర్భం దాల్చినా, లేటు వయసులో గర్భం దాల్చినా, కుటుంబంలో ఎవరికైనా బీపీ ఉన్నా, కొన్ని హార్మోన్లలో మార్పుల వల్ల, తల్లిలో రక్తనాళాలు సన్నబడటం వల్ల తల్లిలో బీపీ పెరగడం, అలాగే బిడ్డకు రక్తప్రసరణ తగ్గడం జరుగుతుంది. ఈ సమయంలో నిర్లక్ష్యం చేస్తే బీపీ బాగా పెరిగి, కిడ్నీ, లివర్, మెదడు వంటి ఇతర అవయవాలపై ప్రభావం చూపడం వల్ల తల్లిలో పీఐహెచ్, ప్రీ ఎక్లామ్సియా, తర్వాత ఎక్లామ్సియా (గుర్రపువాతం) అంటే ఫిట్స్ వంటి ప్రాణాపాయకరమైన కాంప్లికేషన్స్ ఏర్పడతాయి. ఇందులో బిడ్డ బరువు పెరగకపోవడం, బిడ్డ కడుపులోనే చనిపోవడం వంటివి జరగవచ్చు. ఒక్కోసారి నెలలు నిండకుండానే కాన్పు చేయాల్సి రావచ్చు. భారతదేశంలో 8–10 శాతం గర్భిణులకు ప్రీఎక్లామ్సియా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొన్నిసార్లు ఇది రాకుండా జాగ్రత్త పడలేము కాని, సక్రమంగా డాక్టర్ దగ్గర బీపీ, బరువు చెకప్ చేయించుకుంటూ, బీపీ పెరుగుతుంటే దానికి సరిగా మందులు తీసుకుంటూ డాక్టర్ పర్యవేక్షణలో ఉంటే, కాంప్లికేషన్స్ పెరుగుతూ ఉంటే దానికి తగిన చికిత్స చేయడం, అలాగే కాన్పు ముందుగానే చెయ్యడం వల్ల తల్లికి ప్రాణాపాయం తప్పుతుంది. అధిక బరువు ఉన్నవాళ్లు ప్రెగ్నెన్సీ రాకముందే బరువు తగ్గడం, ప్రెగ్నెన్సీలో అధిక బరువు పెరగకుండా ఉండటం, కుటుంబంలో బీపీ చరిత్ర బాగా స్ట్రాంగ్‌గా ఉన్నా, ఇంకా కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు, ప్రెగ్నెన్సీలో మూడవ నెల నుంచి ఎకోస్పిరిన్ మాత్రలను డాక్టర్ సూచించడం జరుగుతుంది. దీనివల్ల రక్తనాళాలు సంకోచించకుండా తల్లికి, బిడ్డకు సక్రమంగా రక్తప్రసరణ జరిగి, ప్రీఎక్లామ్సియా కాంప్లికేషన్స్ మరీ ఎక్కువ కాకుండా బయటపడే అవకాశం ఉంటుంది. డా‘‘ వేనాటి శోభ బర్త్‌రైట్ బై రెయిన్‌బోహైదర్‌నగర్ హైదరాబాద్ -
ఆటోవాలా.. సేవలు భళా..
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): సేవ చేయాలనే తపన ఉంటే చాలు డబ్బు లేకున్నా ఎదుటి వారికి సహాయం చేయవచ్చని నిరూపిస్తున్నాడీ ఆటోవాలా. రోజస్తమాను ఆటో నడిపితే కేవలం ఇంటి ఖర్చులు, ఆటో నెలవారీ వాయిదా కట్టుకోవడానికే ఇబ్బందులు పడుతున్న ఈయన ఎదుటి వారికి సహాయం చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇదెలా అని అనుకుంటున్నారా? అయితే కాకినాడ వెళ్లాల్సిందే. ఆయన సేవాతర్పతను చూడాల్సిందే. కాకినాడ ఎస్ అచ్చుతాపురం మధురానగర్‌కు చెందిన చెల్లి సుబ్బారావు సుమారు ఎనిమిదేళ్ల క్రితం సెకండ్ షో సినిమా చూసి ఆటోపై ఇంటికి వెళుతున్న సయమంలో స్థానిక కరణంగారి సెంటర్లో పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళ ఆవేదన చూసి చలించిపోయాడు. భార్య బాధ పడుతుంటే భర్త అతికష్టం మీద ద్విచక్రవాహనంపై ఆసుపత్రికి తీసుకెళ్తున దృశ్యం అతడి హృదయాన్ని చలింపజేసింది. అప్పటి నుంచి గర్భిణులకు, బాలింతలకు సేవ చేయాలని నిర్ణయించుకొన్నాడు. తన కుటుంబాన్ని పోషించుకునే ఆటోలోనే అత్యవసర సమయాల్లో వారిని ఉచితంగా ఆసుపత్రులకు తీసుకెళ్తున్నాడు. మరికొందరి సహాయంతో బాలింతలకు ఐదు కిలోల పాత బియ్యం, కేజీ నూనె, ఇతర వస్తువులు ఉచితంగాఅందిస్తున్నాడు. ఒక్క ఫోన్ చేస్తే చాలు ఆటో సిద్ధం.. అర్ధరాత్రయినా ఒక్క ఫోన్ చేస్తే గర్భిణులను ఉచితంగా ఆసుపత్రులకు చేర్చుతున్నారు. సుబ్బారావుతో పాటు ఇతర ఆటోసోదరులు కూడా ఫోన్ చేస్తే క్షణాల్లో స్పందిస్తూ ఆపన్నులకు అండగా నిలుస్తున్నారు. రాత్రి తొమ్మిది గంటల నుంచి ఉదయం 5 గంటల వరకూ ఆటో సోదరులు ఉచితంగా గర్భిణులను ఆసుపత్రులకు తీసుకెళుతుంటారు. ఓ సంఘంగా ఏర్పడి.. గర్భిణులు చేస్తున్న సాయాన్ని చూసిన తోటి ఆటో సోదరులందరూ కలిసి చెల్లి సుబ్బారావు పేరిట ఉచిత సంక్షేమ సేవా సంఘాన్ని ఏర్పాటు చేశారు. 29 మంది సభ్యులుగా చేరి ప్రతినెలా కొంత మొత్తం సమకూర్చుతున్నారు. రెండు నెలలకోసారి కాకినాడ బోట్‌క్లబ్ ఆవరణలో సమావేశం నిర్వహించుకుని సంఘం అభివృద్ధికి చేపట్టాల్సి న సేవా కార్యక్రమాలపై చర్చిస్తారు. -
అభాగ్యులకు అండగా..
సేపూరి వేణుగోపాలాచారి – సాక్షి, కామారెడ్డి: ఖతార్‌లోని ‘ఇండియన్ కమ్యూనిటీ బెనెవలెంట్ ఫోరం’ (ఐసీబీఎఫ్) ఆ దేశంలో భారతీయులకు విశేష సేవలను అందిస్తోంది. అక్కడి భారత దౌత్య కార్యాలయం కింద ఒక ప్రత్యేక సంస్థగా ఐసీబీఎఫ్ పనిచేస్తోంది. దోహా తదితర ప్రాంతాల్లో పనిచేస్తున్న కార్మికుల సమస్యలపై, కోర్టు కేసులు, మృతదేహాల తరలింపులో ఈ సంస్థ సహాయ సహకారాలను అందిస్తున్నది. 2006లో ప్రారంభమైన ఐసీబీఎఫ్ పలు సేవల్లో ఆదర్శంగా నిలిచింది. ఇండియన్ ఎంబసీ ప్రాంగణంలో, దుకన్, అల్కోర్లలో హెల్ప్‌డెస్క్‌లను ఏర్పాటు చేయడం ద్వారా ఐసీబీఎఫ్ సేవలను విస్తరించింది. కొంత మంది ఏజెంట్ల, కొన్ని కంపనీల మోసాల బారిన పడినవారు తమ సమస్యలను ఇండియన్ ఎంబసీ దృష్టికి తీసుకువెళ్తే ఎంబసీ సూచన మేరకు ఐసీబీఎఫ్ సంస్థ పనిచేస్తుంది. బాధితుల వివరాలు తెలుసుకుని ఆహారం, వసతి కల్పించడం, దాతల ద్వారా గానీ ఇతర స్వచ్ఛంద సంస్థల ద్వారా గానీ వారికి సహకారం అందిస్తారు. ఐసీబీఎఫ్ సేవలు ఇలా.. ♦ ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఐసీబీఎఫ్ తగిన సేవలందిస్తోంది. ♦ నకిలీ ఏజెంట్ల మోసాలకు గురై ఇక్కడకు వచ్చిన తర్వాత కనీస సౌకర్యాలు లేని వారికి అండగా నిలుస్తుంది. మహిళా కార్మికులకు వసతులు, సౌకర్యాలను కల్పిస్తుంది. ♦ ఖతార్‌లో చనిపోయిన వ్యక్తులపై ఆధారపడి ఉన్నవారికి సహాయం అందిస్తుంది. ♦ కోర్టు కేసుల్లో ఇరుక్కున్న వారికి న్యాయపరమైన సహకారాన్ని సంస్థ సభ్యులు అందజేస్తారు. ♦ ఎవరైనా చనిపోతే వారి మృతదేహాలను స్వగ్రామాలకు తరలించడం, డాక్యుమెంటేషన్, రవాణా ఏర్పాట్లు చూ స్తారు. అందుకు అయ్యే ఖర్చులను ఐసీబీఎఫ్ భరిస్తుంది. ♦ జైల్లో ఉండే భారత ఖైదీలకు అవసరమైన న్యాయ సహాయాన్ని అందజేస్తారు. ♦ భారత కార్మికులు నివసించే చోట్లలో ఉచిత వైద్య పరీక్షల శిబిరాలను ఏర్పాటు చేయిస్తున్నారు. అవగాహన కల్పించాలి గల్ఫ్ దేశాల్లో ఉద్యోగాలు, కల్పించే సౌకర్యాల మీద సరైన అవగాహన లేక ఎంతో మంది ఏజెంట్ల చేతుల్లో మోసాలకు గురవుతున్నారు. కంపెనీలు, ఉద్యోగాలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ఇక్కడికి వచ్చి సమస్యల బారిన పడిన వారికి మా సంస్థ తరఫున ఆదుకుంటున్నాం. ఇక్కడ నిబంధనలను కఠినంగా ఉంటాయి. ఇండియన్ ఎంబసీని సంప్రదించిన తర్వాతనే కంపెనీ వీసాలపై నమ్మకం తెచ్చుకోవాలి. అప్పుడే మోసాలకు గురికాకుండా ఉంటారు.– రజనీమూర్తి, ఐసీబీఎఫ్ ప్రతినిధి, ఖతార్ ఐసీబీఎఫ్ హెల్ప్ డెస్క్ నంబర్ +974 446 70060 (సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు).మొబైల్: +974 555 12810